LATEST NEWS
ప్రేమించాడు. గర్భం కూడా చేశాడు. పెళ్లిచేసుకొమ్మంటే  గర్భంతో ఉన్న 17 ఏళ్ల బాలికను దారుణంగా హత్య చేశాడు. ఝార్ఖండ్‌లోని పాలేము జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఎస్పీ సంజీవ్ కుమార్ కథనం ప్రకారం.. ప్రియుడి కారణంగా బాలిక గర్భం దాల్చింది. దీంతో పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తీసుకొచ్చింది. ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని యువకుడు అబార్షన్ చేయించాలని నిర్ణయించాడు. అబార్షన్ కోసం ఓ నర్స్ రూ. 10 వేలు అడిగితే సర్దుబాటు చేయలేకపోయాడు. దీంతో ఆమెను చంపడమే సమస్యకు పరిష్కారమని భావించాడు. గత నెల 21న బాలికను గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లి కత్తితో మెడపై పొడిచి చంపేశాడు. అనంతరం స్నేహితుడితో కలిసి ఆమె మృతదేహాన్ని సోనే నది ఒడ్డుకు తీసుకెళ్లి పాతిపెట్టాడు. ఈ కేసులో నిన్న నిందితులిద్దరినీ అరెస్ట్ చేసినట్టు చెప్పారు.  
ఆంధ్రప్రదేశ్ లో మరో అరాచకం జరిగింది. మహిళా దినోత్సవం రోజునే మహిళలకు ఘోర అవమానం జరిగింది.  కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించునేందుకు వెళుతున్నఅమరావతి మహిళా రైతుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. ప్రకాశం బ్యారేజీ దగ్గర మహిళా రైతులను అడ్డుకున్న పోలీసులు.. వారికి బలవంతంగా వ్యాన్లలో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా కొందరు పోలీసులు.. మహిళల పట్ల దురుసుగా వ్యవహరించారు. మహిళలను రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. కొందరినైతై మంగళగిరి పీఎస్‌లో మూడు గంటలు ఉంచి తర్వాత వెంకటపాలెంవద్ద వదిలిపెట్టారు. సుమారు వంద మంది పోలీసులు తమపై దారుణంగా వ్యవహరించారని మహిళా రైతులు వాపోయారు. మేమేం పాపం చేశాం.. మమ్మల్ని ఎందుకిలా చేస్తున్నారు.. మహిళలను కింద పడేసి పోలీసులు తొక్కుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. శాంతియుతంగా పాదయాత్ర ద్వారా అమ్మవారిని దర్శించుకునేందుకు వెళుతుంటే పోలీసులు తమపై దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తన పొట్టపై పొడిచారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఇంత దారుణం ఏ ప్రభుత్వంలో చూడలేదన్నారు. మహిళా దినోత్సవం రోజున మహిళలకు అవమానం జరిగిందన్నారు. ప్రభుత్వం ఎన్న నిర్బంధాలు విధించినా తమ ఉద్యమం అపేదిలేదని, ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అని ప్రభుత్వం ప్రకటించే వరకు ఆందోళన చేస్తామని మహిళలు స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతి ఒక్క మహిళకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ నాయకురాలు ప్రకాశం బ్యారేజ్ వద్దకు వచ్చి మహిళలకు మద్దతు తెలిపారు. జగన్‌కు పరిపాలన చేయడం చేతకావడంలేదని, ఇంత వరకు రాజధాని నిర్మాణం చేయలేదని మహిళలు విమర్శించారు. మహిళలను హింసపెడుతున్న దిక్కుమాలిన ప్రభుత్వమని దుయ్యబట్టారు. పోలీసులు, ఉద్యోగులను అడ్డంపెట్టుకుని డబ్బులు కుమ్మరించి అధికారంలోకి రావడానికి చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చేసిన తప్పేంటని ప్రశ్నించారు. రాజధాని కోసం తమ భూములను ఇవ్వడం తప్పా అని మహిళలు నిలదీశారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు మహిళలకు లేదా? అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. ఇదేనా మహిళా దినోత్సవం రోజు మహిళలకు జగన్ ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. ‘‘మీ పత్రికా ప్రకటనలో మహిళలకు ఉన్న స్వేచ్ఛ రాష్ట్రంలో కనపడటం లేదు. జగన్ రెడ్డి గారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు మహిళలకు లేదా? కనీసం గుడికి వెళ్లే హక్కు కూడా లేదా? అమరావతిలో మహిళల్ని అడ్డుకొని పోలీసులు దురుసుగా ప్రవర్తించడాన్ని, రైతుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇదేనా మహిళా దినోత్సవం రోజు మహిళలకు జగన్ రెడ్డి ఇచ్చే గౌరవం’’ అని నారా లోకేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఎపి రాజధాని అమరావతి తరలింపుకు వ్యతిరేకంగా రైతులు, మహిళలు 400 రోజులకు పైగా ఎండనక, వాననక ఉద్యమం చేస్తున్న సంగతి తెల్సిందే. ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా రాజధాని ప్రాంత మహిళా రైతులు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించునేందుకు వెళుతుఅండగా ప్రకాశం బ్యారేజ్ వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, మహిళా రైతులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహిళా దినోత్సవం అని కూడా చూడకుండా సీఎం జగన్, డీజీపీ తమ పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆ మహిళలు మండిపడ్డారు. ఇదే సందర్భంలో ఎవరైనా తమపై చేయి వేస్తే ప్రకాశం బ్యారేజీలో దూకుతామని పోలీసులను హెచ్చరించారు. తాము అమ్మవారి దర్శనానికి వెళుతుంటే ఈ విధంగా అక్రమంగా అడ్డుకుంటున్నారని.. వారు విమర్శించారు. అంటేకూండా ఇప్పటికే భూములు ఎలాగూ కోల్పోయామని, ఇక బతకడం అనవసరమని, ప్రకాశం బ్యారేజ్‌లో దూకి చనిపోతామని ఏవరు ఆవిడెదన ౫వ్య౫క్తం చేసారు. రాజధాని కోసం తాము నిరసన తెలుపుతుంటే ప్రజలు చూసి వెళ్లిపోతున్నారే కానీ ఎమాత్రం స్పందించడంలేదని.. ఇది సిగ్గుచేటని ఆ మహిళలు ఆవేదన వ్యక్తం చేసారు        
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్రం రావడం ఇష్టం లేదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఆయన ముఖ్యమంత్రి కావాలనుకున్నారా? అంటే అవుననే చెబుతున్నారు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి గుండె విజయ రామారావు. తెలంగాణ మలి దశ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు, కేసీఆర్ తీరుపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు తెలంగాణ రావాలని లేకుండేనని చెప్పారు.  ఉద్యమ ఒత్తిడితో సమైక్య ఆంధ్రలో ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్ అనుకున్నారని విజయరామారావు తెలిపారు. శాసనసభను నడవనీయకుండా అడ్డుకుని.. ఉద్యమం ఎగిసినట్టు చూపించి సమైక్య రాష్ట్రానికి సీఎం కావాలని కేసీఆర్ అనుకున్నారంటూ కామెంట్ చేశారు.  వరంగల్ లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారంలో పాల్గొన్న విజయరామారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ అజెండాలు అన్ని ఉత్తీత్తవేనని.. ఓట్లు దండుకోవడం కోసమేనని తెలిపారు. తెలంగాణ ద్రోహులు మంత్రి వర్గంలో ఉన్నారని, ఉద్యమకారులను గెంటి వేశారని విజయరామారావు అన్నారు. ఉద్యమంలో లేని కేటీఆర్.. ఉద్యమకారుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉద్యమకారుడు మహేందర్ రెడ్డి ని చివరి నిమిషం వరకు నమ్మించి.. ఆ టికెట్ పై పోటీ చేసి కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యారని విజయరామారావు ఆరోపించారు.  ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు 2001 నుంచి ఉద్యమంలో ఉన్నవిషయం తెలియదా అని విజయరామారావు ప్రశ్నించారు. కేసీఆర్  ద్రోహం చేస్తేనే బాపురావు బిజెపి లో చేరారని చెప్పారు. పార్లమెంట్ లో మద్దతు లేకపోతే బిల్లు వచ్చేదా అని నిలదీశారు. అమెరికాలో కవితకు యాక్సిడెంట్ అయినా.. ఆమెను ఇక్కడికి తీసుకురావడానికి  కేసీఆర్ అంగీకరించలేదన్నారు. కేసీఆర్ అభీష్టానికి వ్యతిరేకంగా కవితను తానే హైదరాబాద్ తీసుకువచ్చానని తెలిపారు. అప్పుడు కవిత ను రావద్దన్న కేసీఆర్.. తర్వాత జాగృతి పేరుతో ఉద్యమంలోకి ఎందుకు తీసుకువచ్చారో చెప్పాలన్నారు. పివి ప్రతిష్టను వాదుకునేందుకే వాణిదేవీని ఎమ్మెల్సీ గా కేసీఆర్ నిలబెట్టారని విజయరామారావు విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆరెస్ గల్లంతు అవుతుందన్నారు.  
రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతుల్లో మరొకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన ఆత్మహత్యతోనైనా కేంద్రం ఈ చట్టాలను రద్దు చేయాలని అతడు రాసిన లేఖలో రాసి పెట్టి చెట్టుకు ఊరి వేసుకుని రైతుల ఉద్యమానికి తన ప్రాణాలు త్యాగం చేశాడు.  ఒకటి కాదు రెండు రోజులు వంద రోజులు దాటింది. అయినా మొక్కక్కవోని దిశక్షతో  దేశ రాజధాని వడిలో ఆందోళనలు చేస్తున్న రైతులు. రైతుల చట్టాలకు ప్రభుత్వాలు తూట్లుపెడుతుందని వారి హక్కుల కోసం దేశ రైతులు ఒక్కటై ఆందోళనలు చేస్తుంటే.. ఆ ఆందోళన దేశ రైతుల కాదు అన్నట్లు క్రియేట్ చేసి కేంద్ర ప్రభుత్వం సంబరాల్లో మునిగింది. ఇప్పటికే కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ ఆందోళన చేస్తున్న రైతుల్లో ఇప్పటికే పలువురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గతేడాది డిసెంబరులో పంజాబ్‌కు చెందిన న్యాయవాది , సిక్కు మత గురువు సంత్ రామ్‌సింగ్ ఉద్యమం కోసం ఊపిరి తీసుకున్నారు.   హర్యానాలోని హిసార్‌కు చెందిన రజ్బీర్ (49) రైతు ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నాడు. తమ ఉద్యమానికి ప్రభుత్వం స్పందించకపోవడంతో మనస్తాపం చెందిన రజ్బీర్ ఓ లేఖ రాసి టిక్రీ సరిహద్దులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాగు చట్టాలను రద్దు చేసి తన చివరి కోరిక తీర్చాలని అందులో ఆయన వేడుకున్నాడు. అతను రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ALSO ON TELUGUONE N E W S
మాస్ మ‌హారాజా ర‌వితేజకి ద్విపాత్రాభిన‌యం కొత్తేమీ కాదు. `ఓ ప‌నైపోతుంది బాబూ!`, `విక్ర‌మార్కుడు`, `ద‌రువు`, `కిక్ 2`, `డిస్కో రాజా` చిత్రాల్లో డ‌బుల్ ధ‌మాకా ఇచ్చారు. ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న `ఖిలాడి` కూడా ఇదే త‌ర‌హా సినిమానే. `రాక్ష‌సుడు` ఫేమ్ ర‌మేశ్ వ‌ర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లో రెండు విభిన్న పాత్ర‌ల్లో ర‌వితేజ ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. ఆస‌క్తిక‌రమైన విష‌య‌మేమిటంటే.. ఇందులో ర‌వితేజ తండ్రీకొడుకుల పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నార‌ట‌. అదే గ‌నుక నిజ‌మైతే.. `కిక్ 2`, `డిస్కో రాజా` త‌రువాత మాస్ మ‌హారాజా ముచ్చ‌ట‌గా మూడోసారి తండ్రీకొడుకులుగా నటించే సినిమా ఇదే అవుతుంది. మ‌రి.. `కిక్ 2`, `డిస్కో రాజా` ఆశించిన విజ‌యం సాధించ‌ని నేప‌థ్యంలో.. `ఖిలాడి` అయినా స‌క్సెస్ అవుతుందేమో చూడాలి. `ఖిలాడి`లో ర‌వితేజ‌కి జంట‌గా మీనాక్షి చౌద‌రి, డింపుల్ హ‌యతి నాయిక‌లుగా న‌టిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందిస్తున్న ఈ సినిమాని కోనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మిస్తున్నారు. మే 28న `ఖిలాడి` థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది.
లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేష‌న్ `ఉప్పెన‌`తో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది కృతి శెట్టి.  బేబ‌మ్మ పాత్ర‌లో మెస్మ‌రైజ్ చేసిన ఈ క‌న్న‌డ కోమ‌లి.. ప్ర‌స్తుతం `శ్యామ్ సింగ రాయ్`, `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, #RAPO 19 వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ లో న‌టిస్తూ బిజీగా ఉంది. వీటిలో #RAPO 19 తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందుతున్న బైలింగ్వల్ మూవీ కావ‌డం విశేషం. ఇదిలా ఉంటే.. కృతి తాజాగా మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట‌. ఆ వివ‌రాల్లోకి వెళితే.. చియాన్ విక్ర‌మ్ త‌న‌యుడు ధ్రువ్ క‌థానాయ‌కుడిగా మురుగ‌దాస్ శిష్యుడు ర‌వికాంత్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ త‌మిళ సినిమా రూపొంద‌నుంది. ఇందులో క‌థానాయిక‌గా కృతి శెట్టిని న‌టింప‌జేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని టాక్.  త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డ‌య్యే అవ‌కాశ‌ముంది. మ‌రి.. తెలుగునాట మొద‌టి సినిమాతోనే సంచ‌ల‌నం సృష్టించిన కృతి శెట్టి.. త‌మిళ‌నాట కూడా అదే బాట ప‌డుతుందేమో చూడాలి. కాగా, ధ్రువ్ ఇప్ప‌టికే `అర్జున్ రెడ్డి` త‌మిళ వెర్ష‌న్ `ఆదిత్య వ‌ర్మ‌`లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. అలాగే విక్ర‌మ్ తోనూ ఓ సినిమా చేయ‌బోతున్నాడు.
యువ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్ రైతు అవ‌తార‌మెత్తిన చిత్రం `శ్రీ‌కారం`.  నూత‌న ద‌ర్శ‌కుడు బి. కిశోర్ రూపొందించిన ఈ సోష‌ల్ డ్రామాలో శ‌ర్వాకి జోడీగా `గ్యాంగ్ లీడ‌ర్` ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహ‌న్ న‌టించింది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్ల‌స్ నిర్మించిన ఈ చిత్రం.. మ‌హాశివ‌రాత్రి కానుక‌గా మార్చి 11న థియేట‌ర్స్ లోకి రానుంది. ఇదిలా ఉంటే.. `శ్రీ‌కారం` చిత్ర నిడివికి సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అదేమిటంటే.. క్లీన్ `యు` స‌ర్టిఫికేట్ పొందిన ఈ సినిమా డ్యూరేష‌న్ కేవ‌లం 132 నిమిషాలేన‌ట‌. 2 గంట‌ల 12 నిమిషాల క్రిస్ప్ ర‌‌న్ టైమ్.. అనేది క‌చ్చితంగా క‌లిసొచ్చే అంశ‌మ‌నే చెప్పాలి.   కాగా, `మ‌హానుభావుడు` త‌రువాత స‌రైన విజ‌యం లేని శ‌ర్వానంద్ కి `శ్రీ‌కారం` స‌క్సెస్ కీల‌క‌మ‌నే చెప్పాలి. మ‌రి..  `శ్రీ‌కారం`తో శ‌ర్వానంద్ మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్ లోకి వ‌స్తాడేమో చూడాలి. ఇదిలావుంటే.. శ‌ర్వానంద్ చేతిలో ప్ర‌స్తుతం మ‌రో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. `మ‌హాస‌ముద్రం`, `ఆడాళ్ళు మీకు జోహార్లు`తో పాటు డ్రీమ్ వారియ‌ర్ పిక్చర్స్ నిర్మిస్తున్న బైలింగ్వ‌ల్ మూవీ త‌న‌ ఖాతాలో ఉన్నాయి. 
నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న పిరియ‌డ్ డ్రామా `శ్యామ్ సింగ రాయ్`. పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో బెంగాలీ యువ‌కుడిగా, తెలుగు కుర్రాడిగా రెండు డిఫ‌రెంట్ టైమ్ లెన్స్ కి చెందిన పాత్ర‌ల్లో సంద‌డి చేయ‌బోతున్నార‌ట నాని.  `టాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్ డైరెక్ట్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నానికి జోడీగా సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ న‌టిస్తున్నారు. మిక్కీ జే మేయ‌ర్ బాణీలు అందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే..  నాని బ‌ర్త్ డే సంద‌ర్భంగా రిలీజ్ చేసిన `శ్యామ్ సింగ రాయ్` ఫ‌స్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వ‌చ్చిన నేప‌థ్యంలో..  త్వ‌ర‌లోనే టీజ‌ర్ ని విడుద‌ల చేయ‌డానికి యూనిట్ స‌న్నాహాలు చేస్తోంద‌ట‌. వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం.. ఉగాది పర్వ‌దినాన `శ్యామ్ సింగ రాయ్` టీజ‌ర్ రిలీజ్ కానుంద‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశ‌ముంది. కాగా, నాని తాజా చిత్రం `ట‌క్ జ‌గ‌దీష్` ఏప్రిల్ 23న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. `నిన్ను కోరి` వంటి స‌క్సెస్ ఫుల్ మూవీ త‌రువాత శివ నిర్వాణ డైరెక్ష‌న్ లో నాని న‌టించిన సినిమా కావ‌డంతో `ట‌క్ జ‌గ‌దీష్`పై మంచి అంచ‌నాలే ఉన్నాయి. 
`దృశ్యం`కి సీక్వెల్ గా విక్ట‌రీ వెంక‌టేశ్ `దృశ్యం 2` చేస్తున్న సంగ‌తి తెలిసిందే. `దృశ్యం 2` మ‌ల‌యాళ వెర్ష‌న్ ని తెర‌కెక్కించిన జీతూ జోసెఫ్ నే ఈ రీమేక్ సీక్వెల్ ని రూపొందిస్తున్నాడు. ఇటీవ‌లే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది.  `దృశ్యం`లో న‌టించిన మీనా, న‌దియా, న‌రేశ్, ఎస్తేర్ అనిల్.. `దృశ్యం 2`లోనూ ద‌ర్శ‌నమివ్వ‌నున్నారు. కాగా, `దృశ్యం 2`లో పాత పాత్ర‌ల‌తో పాటు కొన్ని కొత్త పాత్ర‌లు కూడా తోడ‌య్యాయి. అవే.. స‌రిత‌, సాబు. క‌థానాయ‌కుడి పొరుగుంటిలో కొత్త‌గా చేరే ఈ  భార్యా‌భ‌ర్త‌లు పాత్ర‌లు.. సినిమాలో చాలా కీల‌కం. అలాంటి ఆ క్యారెక్ట‌ర్స్ లో ప్ర‌ముఖ న‌టులు స‌మంత‌, ద‌గ్గుబాటి రానా న‌టిస్తార‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. ఇప్ప‌టికే ఈ మేర‌కు వీరితో చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయ‌ని టాక్. త్వ‌ర‌లోనే రానా, సామ్ ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది. మ‌రి.. రానా, సామ్ చేరిక `దృశ్యం 2`కి ఏ మేర‌కు ప్ల‌స్ అవుతుందో చూడాలి. ఇదిలా ఉంటే.. జూన్ లేదా జూలైలో `దృశ్యం 2` థియేట‌ర్స్ లో సంద‌డి చేసే అవ‌కాశ‌ముంది.  
  తెలుగు సినీ ప్రేక్ష‌కులు ఎలాంటివారో, వాళ్ల విధేయ‌త ఎలాంటిదో రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌బ్లిగ్గా చెప్పుకొచ్చాడు. తెలుగు ఆడియెన్స్‌ను, ఫ్యాన్స్‌ను ఓడించేవాళ్లు ఎక్క‌డా లేర‌ని కుండ‌బ‌ద్ద‌లుకొట్టాడు. న‌వీన్ పోలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ టైటిల్ పాత్ర‌ధారులుగా నాగ్ అశ్విన్ నిర్మించిన 'జాతిర‌త్నాలు' ప్రి రిలీజ్ ఈవెంట్‌లో చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్న విజ‌య్.. చాలాసేపు ప్రేక్ష‌కుల గురించే మాట్లాడాడు. "నేను బాంబే వెళ్లినా అక్క‌డి డైరెక్ట‌ర్లు, యాక్ట‌ర్లు నాతోని అరే.. మీ తెలుగు సినిమా ఆడియెన్స్ టూ మ‌చ్ అబ్బా.. మ‌స్తు చూస్త‌రు సినిమాల‌ని! ఎంత ప్రేమిస్త‌రు యాక్ట‌ర్ల‌ని! అంటారు. నేను తిరిగి వాళ్ల‌మీద ఎక్కేస్తా. వాళ్ల లాయ‌ల్టీ మీకు తెల్వ‌దు." అని అత‌ను చెప్పాడు. స్టేజ్ మీదున్న వాళ్ల‌ను చూపిస్తూ, "25 ఇయ‌ర్స్ ఇక్క‌డున్నోళ్ల పేర్లు కూడా మీకు తెల్వ‌దు. హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లోనే మ‌మ్మ‌ల్ని గుర్తుప‌ట్టెటోళ్లు ఉండేవాళ్లు కాదు. ఇప్పుడు ఈ ఫంక్ష‌న్‌కు 25 వేల మంది వ‌చ్చిన్రు." అని అన్నాడు.  తిరిగి బాంబే వాళ్ల‌తో తానేం చెప్పేవాడో తెలియ‌జేస్తూ, "మావాళ్లు కొట్లాడి సినిమాకి ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షోకి వ‌స్త‌రు. మేం ఈవెంట్ అని అనౌన్స్ జేస్తే వేల‌మంది వ‌స్త‌రు. మా గురించి ఎవ‌రైనా తిక్క‌తిక్క‌గా మాట్లాడితే కొట్లాడ‌త‌రు.' అని చెప్తాను" అన్నాడు.  ప్రేక్ష‌కుల‌ను ఉద్దేశించి, "నేను ప్యాండ‌మిక్‌లో మిడిల్ క్లాస్ ఫండ్ అని చేద్దామ‌నుకుంటే మీరే వ‌చ్చి చేసిన్రు, ఒక్క రూపాయి ఎక్స్‌పెక్ట్ చేయ‌కుండా. వీళ్లంతా ఎట్లా ప‌రిచ‌య‌మైన‌రు మాకు.. సినిమా ద్వారానే. ఎక్క‌డ చూసినం! థియేట‌ర్లు ఓపెన్ కాగానే ఇన్ని రిలీజ్‌లు ఎక్క‌డ చూసినం! ఇన్ని హిట్లు ఎక్క‌డ చూసినం! ఇన్ని పెద్ద సినిమా అనౌన్స్‌మెంట్లు ఎక్క‌డ చూసినం! ఇన్ని ప్యాన్ ఇండియా ఫిల్మ్ అనౌన్స్‌మెంట్లు ఎక్క‌డ చూసినం! ఇంత క్రౌడ్ ఎక్క‌డ చూసినం! మ‌న‌మేగా!! మ‌న‌ని బీట్ చేసే ప్రేక్ష‌కులు, మ‌న‌ని బీట్ చేసే ఫ్యాన్స్ ఎక్క‌డా లేరు. కాల‌ర్ ఎగ‌రేసుకొని గ‌ర్వంగా తిర‌గొచ్చు. మ‌న‌లాంటి ఆడియెన్స్ ఎక్క‌డా లేరు. మీ అంద‌రికీ థాంక్స్‌." అంటూ ఎమోష‌న‌ల్‌గా చెప్పుకొచ్చాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.
  రాజేంద్ర‌ప్ర‌సాద్ (ఆర్పీ) అంటే డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడికి ప్ర‌త్యేక‌మైన అభిమానం. ఆయ‌న‌ను డాడీ అని ఆత్మీయంగా పిలుచుకుంటాడు అనిల్‌. 'సుప్రీమ్' సినిమా నుంచి అనిల్ డైరెక్ట్ చేసిన ప్ర‌తి సినిమాలో రాజేంద్ర‌ప్ర‌సాద్ ఉంటున్నారు. హాస్యాన్ని కురిపిస్తున్నారు. లేటెస్ట్‌గా ఆయ‌న స్క్రీన్‌ప్లే అందించి, స‌మ‌ర్పించిన 'గాలి సంప‌త్' మూవీలో రాజేంద్ర‌ప్ర‌సాద్ టైటిల్ రోల్ పోషించారు.  'గాలి సంప‌త్' ప్రి రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన అనిల్ రావిపూడి ఆయ‌న‌ను ప్ర‌శంస‌ల్లో ముంచేశాడు. "మా జ‌ర్నీ 'సుప్రీమ్‌'తో స్టార్ట‌యింది. ప్ర‌తి సినిమాలో గోల గోల చేస్తూనే ఉన్నాం. ఒక్కో సినిమాకు ఒక్కో స్టైల్‌. ఒక్కొక్క మేన‌రిజ‌మ్‌తో ఒక్కో హ‌డావిడి. ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో ఆయ‌న‌ను కొట్టేవారే లేరు. ఈ సినిమాలో ఆయ‌న‌తో ఇంకోలాగా వ‌ర్క్ చేసే అవ‌కాశం దొరికింది. కొన్ని కీల‌క స‌న్నివేశాల కోసం ఆయ‌న‌తో నేను ఉండాల్సి వ‌చ్చింది. గొయ్యి ఎపిసోడ్‌లో ప‌దిహేను రోజులు ఆయ‌న ప‌డ్డ క‌ష్టం రేపు మీరు స్క్రీన్ మీద చూస్తారు. డాడీ.. యు ఆర్ ద లెజెండ్." అన‌గానే ఆర్పీ వ‌చ్చి అనిల్‌ను హ‌త్తుకున్నారు. అంతేనా.. చెంప‌మీద ముద్దుకూడా పెట్టేసుకున్నారు. ఈ స‌న్నివేశం అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది. అనిల్ రావిపూడి కొన‌సాగిస్తూ, "అనేక సినిమాల‌తో మ‌న‌ల్ని ఎంట‌ర్‌టైన్ చేసిన గొప్ప న‌టుడు ఒక గొప్ప సినిమాలో యాక్ట్ చేశారు. ఇది సెల‌బ్రేష‌న్ ఫ‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్ గారు. ఆయ‌న కోసం ఈ సినిమా విడుద‌లైన రోజు మార్నింగ్ షోను నా ఫ్యామిలీతో క‌లిసి చూడ‌బోతున్నాను. ఆయ‌న‌కు ఈ సినిమా ద్వారా సెల‌బ్రేష‌న్ ఇవ్వాల‌ని ప్రేక్ష‌కుల‌ను కూడా కోరుకుంటున్నాను." అని చెప్పుకొచ్చాడు.
  చెన్నైలో జ‌రిగిన త‌మిళ‌నాడు స్టేట్ షూటింగ్ ఛాంపియ‌న్‌షిప్‌లో స్టార్ హీరో అజిత్ 6 మెడ‌ల్స్ గెలుచుకున్నాడు. ఆ ఈవెంట్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. చెన్నైలో ఇటీవ‌ల జ‌రిగిన 46వ త‌మిళ‌నాడు స్టేట్ ఛాంపియ‌న్‌షిప్‌లో చెన్నై రైఫిల్ క్ల‌బ్‌కు ప్రాతినిధ్యం వ‌హించిన స్టార్ హీరో అజిత్ ఏకంగా 6 మెడ్స‌ల్ సాధించాడు. వాటిలో నాలుగు స్వ‌ర్ణ ప‌త‌కాలు ఉండ‌టం విశేషం. కొంత‌కాలంగా రైఫిల్ షూటింగ్‌ను హాబీగా మ‌ల‌చుకున్న అజిత్‌, చెన్నై రైఫిల్ క్ల‌బ్‌లో ప్రాక్టీస్ చేస్తూ ప‌లుమార్లు కెమెరా కంటికి చిక్కాడు. నిజానికి ఆయ‌న రాష్ట్ర‌, జాతీయ స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీల్లో పాల్గొంటూ వ‌స్తున్నాడు. ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు స్టేట్ షూటింగ్ ఛాంపియ‌న్‌షిప్‌లో అజిత్ మెడ‌ల్స్ అందుకుంటున్న ఫొటోలు, వీడియోలు ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్ అవుతున్నాయి. ఎయిర్ పిస్ట‌ల్ 10 మీట‌ర్స్ (ఐఎస్ఎస్ఎఫ్‌) టీమ్‌ ‌, సెంట‌ర్ ఫైర్ పిస్ట‌ల్ .32 (ఎన్ఆర్‌) 25 మీట‌ర్స్ టీమ్‌, స్టాండ‌ర్డ్ పిస్ట‌ల్ .22 (ఐఎస్ఎస్ఎఫ్‌) 25 మీట‌ర్స్ టీమ్‌, ఫ్రీ పిస్ట‌ల్ .22 (ఎన్ఆర్‌) 50 మీట‌ర్స్ టీమ్ విభాగాల్లో అజిత్ అగ్ర‌స్థానం పొందాడు. అలాగే సెంట‌ర్ ఫైర్ పిస్ట‌ల్ .32 (ఐఎస్ఎస్ఎఫ్‌) 25 మీట‌ర్స్ టీమ్‌, స్టాండ‌ర్డ్ పిస్ట‌ల్ .22 (ఎన్ఆర్‌) 25 మీట‌ర్స్ టీమ్ ఈవెంట్ల‌లో ద్వితీయ స్థానం పొందాడు. అజిత్ సాధించిన విజ‌యాల‌కు సంబ‌రాలు చేసుకున్న ఫ్యాన్స్ అభినంద‌ల సందేశాల‌తో సోష‌ల్ మీడియాను ముంచెత్తారు. #Ajith #CongratsThalaAjith లాంటి హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండింగ్‌లోకి వ‌చ్చాయి.
  సమంతా అక్కినేని, తాప్సీ పన్ను లాంటి తార‌లు తమ కెరీర్‌లో చాలా దూరం ప్ర‌యాణించారు. ఎన్నో హెచ్చు తగ్గులు ఎదుర్కొని ఇండ‌స్ట్రీలో త‌మ‌కంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. "తార‌లు స్నేహితులు కాలేరు" అనే నానుడిని బ్రేక్ చేసిన యాక్ట్రెసెస్‌లో ఈ ఇద్ద‌రు కూడా ఉన్నారు. ఒకరి ఫోటోలను ఒక‌రు లైక్ చేయ‌డం, కామెంట్ చేయ‌డంతో పాటు, ఒక‌రినొక‌రు ప్ర‌శంసించుకుంటూ పోస్టులు పెడుతుంటారు. ఇటీవ‌ల తాప్సీ ఇంటిపై ఇన్‌క‌మ్ టాక్స్ అధికారులు దాడిచేయ‌గా, ఆమెకు మ‌నోధైర్యం క‌లిగించ‌డానికి స‌మంత అప్రిసియేష‌న్ పోస్ట్‌ను షేర్ చేసింది. ప్ర‌తిస్పంద‌న‌గా స‌మంత‌కు థాంక్స్ చెప్పింది తాప్సీ. తాప్సీ ఫొటోనొక‌దాన్ని షేర్ చేసిన స‌మంత‌, "this is just a @taapsee appreciation post..that's all," అని రాసి, ఒక హార్ట్ ఎమోటికాన్‌ను జోడించింది. వెంట‌నే రెస్పాండ్ అయిన తాప్పీ, "Uff..thank you Sam...big hug to you," అని రాసి, ఏడుస్తున్న ఓ హార్ట్ ఎమోటికాన్‌ను పెట్టింది. ఐటీ డిపార్ట్‌మెంట్ దాడి త‌ర్వాత‌, తాప్పీ త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా స్పందిస్తూ, "3 రోజుల పాటు 3 విష‌యాల కోసం తీవ్రంగా శోధించారు.. 1. నాకు పారిస్‌లో ఉన్న‌దంటున్న బంగ‌ళా తాలూకు తాళాలు. ఎందుకంటే వేస‌వి సెల‌వులు ద‌గ్గ‌ర్లో ఉన్నాయి క‌దా. 2. ఇంత‌కు ముందు నేను తిర‌స్క‌రించిన రూ. 5 కోట్ల విలువ క‌ల ఆరోపిత రిసీప్ట్ గురించి, 3. మ‌న గౌర‌వ‌నీయ ఆర్థిక మంత్రి ప్ర‌కారం 2013లో జ‌రిగిన‌ దాడి నాటి నా జ్ఞాప‌కం.. పిఎస్- ఇక‌పై అంత శాస్తి కాదు.” అని రాసుకొచ్చింది. డైరెక్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్‌కు చెందిన ముంబై, పూణేల‌లోని ఇళ్లు, ఆఫీసుల‌పైన కూడా ఐటీ దాడులు జ‌రిగాయి. తాప్పీ, క‌శ్య‌ప్ ఇదివ‌ర‌కు 'మ‌న్‌మ‌ర్జియాన్' సినిమాకి క‌లిసి ప‌నిచేశారు. ప్ర‌స్తుతం 'దోబారా' అనే సైన్స్ ఫిక్ష‌న్ సినిమా చేస్తున్నారు.
  'ఖైదీ', 'మాస్ట‌ర్' చిత్రాల‌తో తమిళ‌, తెలుగు భాష‌ల్లో సంచ‌ల‌నం సృష్టించిన ద‌ర్శ‌కుడు లోకేశ్ క‌న‌క‌రాజ్. ప్ర‌స్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్.. లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ కాంబినేష‌న్ లో 'విక్ర‌మ్' చేస్తున్నాడు. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఈ వేస‌విలో థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది. ఇదిలా ఉంటే..  ఈ చిత్రంలో మ‌ల్టిటాలెంటెడ్ రాఘ‌వ లారెన్స్ కూడా న‌టిస్తున్నాడ‌ని స‌మాచారం. అంతేకాదు.. 'విక్ర‌మ్'‌లో ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ అత‌నే చేస్తున్నాడ‌ని.. త‌న‌కది నెవ‌ర్ సీన్ బిఫోర్ రోల్ అని వినికిడి. క‌మ‌ల్ పాత్ర‌కు దీటుగా లారెన్స్ రోల్ ఉంటుంద‌ని.. త‌న కెరీర్ లో గుర్తుండిపోయే వేషం ఇద‌ని కోలీవుడ్ టాక్. త్వ‌ర‌లోనే 'విక్ర‌మ్'లో రాఘ‌వ లారెన్స్ ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది. కాగా, రాజ్ క‌మ‌ల్ ఫిల్మ్స్ ఇంట‌ర్నేష‌నల్ పతాకంపై క‌మల్ హాస‌న్, ఆర్. మ‌హేంద్ర‌న్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుధ్ సంగీత‌మందిస్తున్నాడు. క‌మ‌ల్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా రిలీజైన టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేసింది.
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్ష తరహ పాలనా వ్యవస్థ వైపుగా పాప్వులు కదుపు తున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రానున్న రెండు మూడు నెలల్లో జరగనునన్న  నాలుగు రాష్ట్రాల,పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభలకు జరిగే ఎన్నికల్లో  బీజేపీ కి ఆశించిన ఫలితాలు  వస్తే ... ఇక ఆ తర్వాత అధ్యక్ష తరహ పాలనా వ్యవస్థ వైపుగా పావులు మరింత వేగంగా కడులుతాయని అంటున్నారు.నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. ఈ ఎన్నికలలో విజయం సాధించడం కోసం, అన్నిరాజకీయ పార్టీలు ఎప్పటినుంచో  సన్నాహాలు చేసుకుంటున్నాయి.అయితే,కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, అందరికంటే మిన్నగా, ఎట్టి పరిస్థితులలోనూ ఒక్క కేరళ తప్పించి మిగిలిన మూడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సొంత ప్రభుత్వం కాదంటే  తమ చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వాలు ఏర్పడాలని, అందుకోసం ఎందాకా అయినా వెళ్లేందుకు సిద్దం అన్న సంకేతాలను ఇస్తోంది.  పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్నతృణమూల్ కాంగ్రెస్’ను పూర్తిగా తుడచి పెట్టేస్తోంది, తెర వెంక ఏమి చేస్తోందో ఏమో గానీ, తెరమీద చూస్తే, తృణమూల్ ఎంపీలు, ఎమ్మెల్ల్యేలు, మంత్రులు చివరకు తృణమూల్ అధినాయకురాలు, ముఖ్యమంత్రి మమత బెనెర్జీ సొంత మనుషులు, ఇంటి మనుషులు, కుటుంబ సభ్యులు బారులుతీరి మరీ కమలదళంలో చేరిపోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా, మరో పది మందివరకు కేంద్ర మంత్రులు, విధ రాష్టాల ముఖ్యమంత్రులు ఇలా ఒకరి వెంట ఒకరు, పస్చిమ బెంగాల్ పై దండయాత్ర చేస్తున్నారు. మమతా బెనర్జీ అంతటి గడుసు పిండాన్ని ఒక్కరి బిక్కిరి చేస్తున్నారు. అంతిమ ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది ఎలా ఉన్నా, ప్రస్తుతానికి అయితే పశ్చిమబెంగాల్ కమల దళం ఖాతాలో చేరినట్లే  అన్న అభిప్రాయమే వ్యక్తమౌతోంది.  అలాగే ఇటీవల పుదుచ్చేరిలో ఏమి జరిగిందో చూశాం, మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో, అధికార కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యేలు వరస పెట్టి రాజీనామా చేయడం,ఆవెంటనే ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రభుత్వం కుప్ప కూలిపోవడం, అదే సమయంలో అంతే వేగంగా లెఫ్ట్’నెంట్ గవర్నర్’ కిరణ బేడీ ఉద్వాసన, ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్’కు అదనపు బాధ్యతలు అప్పగించడం, ఆమె సిఫార్సు మేరకు, రాష్ట్రపతి పాలన విధించడం అన్నీ  చక చకా జరిగి పోయాయి. గతంలో కర్ణాటక, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీ రాజీనామాల రూటులో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చి అధికారాన్ని ఎగరేసుకు పోయినా, రాజస్థాన్’లో అలాంటి విఫల ప్రయత్నం చేసిందన్నా కొంతవరకు అర్థం చేసుకోవచ్చునుకానీ, నిండా నాలుగు పుంజీల సభ్యులు లేని పుదుచ్చేరిలో అది కూడా మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో ఇంతటి తెలివి తక్కువ పరువు తక్కవ పని బీజేపీ ఎందుకు చేసింది,అనేది అనేక మందిలో ఉన్న సందేహం. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా బీజేపీ నాయకత్వం తెలివి తక్కువగా, పరువు తక్కువ పనులు చేయడం లేదు. పార్టీ లోగుట్లు, అంతర్గత వ్యవహారాలు తెలిసిన అంతరంగికుల సమాచారం ప్రకారం, సంఘ్ పరివార్ సిద్దాంతానికి కార్యరూపం ఇచ్చే వ్యూహంలో భాగంగానే బీజేపీ నాయకత్వం అడుగులు చేస్తోంది. అంతిమ లక్ష్యం, అంతిమ గమ్యం చేరుకోవడంలో ఐడియాలజీ విషయంలో కొంచెం కాంప్రమైజ్’ అయినా ఫర్వాలేదని, ఇటీవల పార్టీ అంతర్గత సమావేశాల్లో సర్దుబాటు ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని కూడా లోపలి సమాచారం.  అయితే ఇక్కడ బీజేపీ ముందున్న అంతిమ లక్ష్యం ఏమిటి,అంటే, ఆర్టికల్ 370 రద్దు నుంచి, పాక్ ఆక్రమిత కాశ్మీర్’ తిరిగి భారత దేశంలో కలుపుకోవడం వరకు, ట్రిపుల్ తలాక్ నుంచి ఉమ్మడి పౌర స్మృతి వరకు ... రామ మందిరం నిర్మాణం మొదలు, అధ్యక్ష తరహ పాలన వరకు పార్టీ మూల సిద్ధాంతానికి సంబందించిన అన్ని అంశాలకు సంబందించిన లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. గడచిన ఆరేడు సంవత్సరాలలో ఇందులో కొన్ని సాఫల్య మయ్యాయి.  ఇక ఇప్పుడు, కమల నాధులు,జమిల ఎన్నికల మీదుగా అధ్యక్ష తరహ పాలన లక్ష్యంగా పావులు కదుపుతోందని విశ్వసనీయ సమాచారం. నిజానికి అధ్యక్ష తరహ పాలనకు, ఆదాయ తరహ పాలనా వ్యవస్థకు,బీజేపీ, సంఘ్ పరివార్ సిద్దాంత కర్తలు మొదలు సామాన్య కార్యకర్తలు మొదలు అందరూ అనుకూలమే. అందుకే ఎప్పటి నుంచో పార్టీ వేదికల మీద, బయట కూడా ఇలాంటి చర్చ జరుగుతూనే  ఉంది.  నిజానికి ఒక్క బీజేపీలోనే కాదు,ఇతర పార్టీలలోనూ చాలా కాలంగా అధ్యక్ష తరహ పాలనపై  చర్చ జరుగుతోంది. రాజకీయ పార్టీలలో ఇప్పడు చర్చ జరగడంకాదు,రాజ్యాంగ సభలోనూ ఆ దిశగా చర్చ జరిగింది. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్, కూడా “అధ్యక్ష తరహా పాలనలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుంది. కాకపోతే జవాబుదారీతనమే కొరవడుతుంది” అంటూ ఎప్పుడోనే తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.అలాగే రాజ్యాంగసభ చర్చల్లో పాల్గొన్న వల్లభాయ్‌ పటేల్‌ కూడా దేశాధ్యక్షుడు, గవర్నర్‌ పోస్టులకు ప్రత్యక్ష ఎన్నికలు జరగాలని సూచించారు. ఇక బీజేపీ విషయం అయితే చెప్పనే అక్కర లేదు. బీజేపీ, ఆ పార్టీ సిద్ధాంతకర్తలు మొదటి నుంచీ అధ్యక్ష వ్యవస్థకే మొగ్గు చూపుతున్నారు. బీజేపీ సిద్ధాంత కర్త దీనదయాళ్‌.. అధ్యక్ష వ్యవస్థను సమర్థించారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి 1998లో చేసిన ప్రసంగంలో.. అధ్యక్ష వ్యవస్థ గురించి ఆలోచించాలని చెప్పారు. రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ సీనియర్‌ నేత లాల్‌ కృష్ణ ఆడ్వాణీ కూడా దేశంలో అధ్యక్ష తరహ పాలనకు మద్దతుగా ఉపన్యాసాలు చేశారు.వ్యాసాలు రాశారు.    అలాగే  కాంగ్రెస్ పార్టీ ఏక చత్రాధిపత్యానికి గండిపడిన తర్వాత సుమారు మూడు దశాబ్దాల పాటు సాగిన సంకీర్ణ యుగంలో,అస్థిర ప్రభుత్వాలు సక్రమంగా పాలన సాగించలేని పరిస్థితులు ఏర్పడిన సమయంలోనూ, అధ్యక్ష తరహ పాలన గురించి చర్చ జరిగింది. ఆ నేపధ్యంలో 2014 లో మోడీ నాయకత్వంలో తొలిసారిగా బీజేపీ సారధ్యంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. ఆ ఎన్నికలలో మోడీ అధ్యక్ష తరహ ఎన్నికల పచారామ్ సాగించారు. ఆ 2019 ఎన్నికల ప్రచారంతో పాటుగా పరిపాలన కూడా అదే తరహాలో పీఎంఓ, ప్రధాన మంత్రి కార్యాలయం సెంట్రిక్’గా పరిపాలన సాగుతోందని ,ఇది కూడా అందుకు మరో సంకేతమని అంటున్నారు.  ఇక ప్రస్తుతానికి వస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సంఘ పరివార్, ప్రస్తుత పార్లమెంటరీ ప్రజాసామ్య వ్యవస్థ స్థానంలో  అధ్యక్ష తరహ వ్యవస్థను తెచ్చేందుకు ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉందని భావిస్తున్నారు. పరిపాలన వ్యవస్థలో మార్పులు తీసుకు రావాలంటే అందుకు రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది. రాజ్యంగ సవరణకు రాజ్యాంగంలోని 368 అధికరణం ప్రకారం, ప్రభుత్వం లేదా సభ్యులు ప్రవేశ పెట్టె తీర్మానానికి పార్లమెంట్ ఉభయ సభలు మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించడంతో పాటుగా మొత్తం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభలలో సగం శాసన సభలు ఆమోదించ వలసి ఉంటుంది. అందుకే, బీజేపీ సాధ్యమైన మేరకు రాష్రాలను గెలుచుకుని, తద్వారా రాజ్యాంగ సవరణ, అందుకు కొనసాగింపుగా అధ్యక్ష తరహ పాలనకు శ్రీకారం చుట్టాలని చూస్తోంది.  ఇప్పటికే బీజేపీ 12  రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరో ఆరు రాష్ట్రాలలో మిత్ర పక్షాలతో కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వలున్నాయి... ఇక ..పార్లమెంట్ ఉభయ సభలో సొంత బలం కొంత తగ్గినా, మేనేజ్ చేయగల సమర్ధులున్నారు .. సో .. ఇదే అందుకు మంచి సమయమని కమలనాధులు భావిస్తున్నారు. రాజ్యాంగ సవరణ అనుకున్నది అనుకున్నట్లు సాగితే, 2022 చివరిలో అధ్యక్ష పదవికీ, ఎంచుకున్న అధ్యక్ష తరహ పాలనకు అనుగుణంగా పార్లమెంట్ ,శాసన సభలకు  జమిలి ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత నరేంద్ర మోడీ అధ్యక్షుడిగా, అమిత్ షా ప్రధానిగా ... కొత్త పాలన వస్తుంది. అయితే, ఇదులో చాలా అయితే గియితే లున్నాయి. రాజ్యాంగ సవరణ సహా, ఇంకా చాలా చిక్కుముళ్ళు ఉన్నాయని అవన్నీ విడతేస్తేనే గానీ, మోడీ ఆలోచనలు కార్యరూపం దాల్చవని న్యాయ కోవిదులు అంటున్నారు. నిజానికి గతంలోనే సుప్రీం కోర్టు రాజ్యంగ ధర్మాసనం రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మార్చే వీలు లేదని పేర్కొందని, కాబట్టి  మోడీ అలోచన కార్యరూపం  దాల్చడం అంతసులభం కాదన్నమాట కూడా వినవస్తోంది.
అమరావతిని అడ్రస్ లేకుండా చేసేందుకు సీఎం జగన్ రెడ్డి చేయని ప్రయత్నం లేదు. . ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి జై కొట్టిన మడమ తిప్పని నేత.. పవర్ లోకి వచ్చాకా  రాజధాని విషయంలో కంప్లీట్ యూ టర్న్ తీసుకున్నారు. రాజధానిని మూడు ముక్కలు చేశారు. ఆంధ్రుల కలల సౌధాన్ని కుప్పకూలుస్తూ.. అమరావతిని కేవలం శాసన రాజధానికే పరిమితం చేశారు. అక్కడి ఆకాశ హర్మాలు, విశాల రోడ్లను ఎక్కడికక్కడే వదిలేశారు. రాజధాని కోసం రైతులు ఉవ్వెత్తున ఉద్యమం చేస్తున్నా.. ఏమాత్రం కనికరం చూపించలేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అలాంటిది సడెన్ గా జగన్ మనసు మారినట్టుంది. ఏపీ కేబినెట్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 50 శాతం నిర్మాణం పూర్తయి.. పెండింగ్‌లో ఉన్న భవనాలను పూర్తి చేయాలని సర్కారు నిర్ణయించింది. అందుకు  3వేల కోట్ల బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేందకు ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటికీ ప్రారంభం కానీ, కొద్దిగా ప్రారంభమైన భవనాల నిర్మాణాలపై ఇంజనీరింగ్ నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకోవాలని కేబినెట్‌ అభిప్రాయ పడింది.  జగన్ తీసుకున్న తాజా నిర్ణయం ఏపీలో సంచలనంగా మారింది. చంద్రబాబుకు క్రెడిట్ వస్తుందని అమరావతి లాంటి అద్భుత రాజధానిని కాలరాసే ప్రయత్నం చేసిన జగన్ రెడ్డిలో సడెన్ గా ఇంతటి ఛేంజ్ చూసి అంతా అవాక్కవుతున్నారు. అసంపూర్తి భవనాల నిర్మాణం పూర్తైతే.. అమరావతికి కొత్త అందం వస్తుంది. డిమాండ్ పెరుగుతుంది. ఇక విశాఖతో పనేముంది? అమరావతిలో భవనాలను పూర్తి చేస్తున్నారంటే.. ఇక విశాఖలో రాజధాని అంశాన్ని పక్కకు పెట్టేసినట్టేనా? లేక తాత్కాలికంగా ఆపుతారా? ఆలస్యం చేస్తారా? అనే చర్చ జరుగుతోంది. అందుకే జగన్ నిర్ణయంపై అమరావతి రైతులు సైతం ఈ నిర్ణయాన్ని నమ్మలేకపోతున్నారు.  అయితే హైకోర్టులో రాజధాని నిర్మాణం వ్యవహారాలపై విచారణ షెడ్యూల్ వచ్చింది. త్వరలోనే కోర్టుకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. అమరావతి భవనాల నిర్మాణంపై సర్కారు తీరుపై గతంలో హైకోర్టు పలుమార్లు అక్షింతలు వేసింది. కోర్టు ఎంత చెప్పినా సర్కారులో కదలిక రాలేదు. భవనాలు పూర్తి చేయడంపై ఉలుకూ పలుకూ లేదు. ఈ సారి విచారణ సందర్భంగా హైకోర్టుకు అమరావతి భవనాలపై ప్రభుత్వ నిర్ణయమేంటో చెప్పక తప్పని పరిస్థితి. అందుకే, కేబినెట్ లో అంపూర్తి భవనాలు పూర్తయ్యేలా పాజిటివ్ నిర్ణయం తీసుకొని.. ఆ విషయాన్ని కోర్టు ద్రుష్టికి తీసుకెళ్లనుంది సర్కారు. అమరావతి రోడ్ల విషయంలోనూ ఇప్పటికే రివ్యూ కూడా నిర్వహించారు సీఎం జగన్.  ప్రభుత్వ పాజిటివ్ దృక్పదంతో.. భవన నిర్మాణాలు పూర్తైతే.. ఇక అమరావతికి డిమాండ్ అమాంతం పెరగడం ఖాయం. అదే జరిగితే.. ఇక విశాఖపట్నంతో పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. ఆకర్షణీయమైన రోడ్లు, భవనాలతో అమరావతి అసలైన రాజధానిగా నిలిచే అవకాశాలున్నాయి. అటు, కేంద్రం సైతం మూడు రాజధానుల విషయంలో జగన్ కు ఇప్పటికే హితబోధ చేసినట్టు సమాచారం. ఇటు హైకోర్టు సైతం కేపిటల్స్ ను తిరష్కరించే అవకాశాలే ఎక్కువ అనేది న్యాయ నిపుణుల మాట. ఇలా ఎలా చూసినా.. భవిష్యత్ లో అమరావతికి మళ్లీ మంచి రోజులు వస్తాయనే ఆశ అక్కడి ప్రజల్లో.  సీఎం జగన్ తాజా నిర్ణయంతో వారి ఆశలు మరింత చిగురిస్తున్నాయి. తమ కలల రాజధాని కోసం మరింతగా పరితపిస్తున్నారు అమరావతి ప్రజలు. 
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల క్రతువు ముగిసింది. ఈ నెల 9వ తేదీన మొదలైన పోలింగ్, ఆదివారం జరిగిన నాల్గవ విడత పోలింగ్ తో ముగిసింది. ఇంచుమించుగా సంవత్సరంపాటు సాగిన పంచయతీ వివాదం చివరాఖరుకు ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అన్నట్లుగా మొత్తం 10,890 సర్పంచ్ స్థానాలకు జరిగిన ఎన్నికల పోలింగ్ చాలా వరకు ప్రశాంతంగా జరిగాయి.   ఈ ఎన్నికలలో ఎవరు గెలిచారు,ఎవరు ఓడిపోయారు అనే విషయాన్నిపక్కన పెడితే  కొవిడ్ భయాన్ని, ఇతరత్రా ఎదురైన సమస్యలను పక్కన పెట్టి, గ్రామీణ ఓటర్లు, ప్రజాస్వామ్య స్పూర్తిని పుష్కలంగా కురిపించారు. నాలుగు దశల్లో పోలింగ్ జరిగితే, ప్రతి దశలోనూ ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్’లో పాల్గొన్నారు. మొత్తంగా చూస్తే 80.14 శాతం ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒక్క విజయనగరం జిల్లా మినహా మరే జిల్లాలోనూ పోలింగ్ 70 శాతానికి తగ్గలేదు.ఇది ఒక విధంగా, పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓటు వేసేందుకు బద్దకించే, చదువుకున్నాళ్ళకు, మంచి  గుణ పాఠం.  పంచాయతీ ఎన్నికల్లో పార్టీలు, జెండాల ప్రమేయం ఉండదు.. ఉండ కూడదు. అయినా అన్నిరాజకీయ పార్టీలు పంచాయతీ పోరును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా ఎన్నికలు ఆపించేందుకు శత విధాల ప్రయత్నించి విఫలమైన అధికార పార్టీ గెలిచినాళ్ళు అందరూ మావాళ్ళు అంటూ .. గెలుపు గ్రాఫ్ ను పైపైకి పట్టుకు పోయింది. అలాగని మెజారిటీ పంచాయతీలను అధికార పార్టీమద్దతుదారులు గెలవలేదని కాదు. అధికార పార్టీ మద్దతుదారులే అధిక పంచయతీలలో జెండా ఎగరేశారు. అందులో సందేహంలేదు. అలాగే ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ కూడా కుప్పంలో ఓటమి లాంటి కొన్ని గట్టి ఎదురుదెబ్బలు తిన్నా, ప్రధాన పతిపక్ష హోదాను నిలుపుకుంది.  తెలంగాణలో ఇటీవల జరిగిన దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీని పక్కకు నెట్టి అధికార తెరాసకు ప్రధాన ప్రత్యర్ధిగా నిలిచిన బీజేపీ, ఏపీలోనూ  తెలుగు దేశం పార్టీని ప్రధాన ప్రత్యర్ధి స్థానం నుంచి పక్కకు నెట్టాలనే ప్రయత్నం చేసింది కానీ, ఫలితం దక్కలేదు. చంద్రబాబు నాయకత్వం, తెలుగు దేశం పార్టీకి ఉన్న సంస్థాగత బలం ముందు బీజేపీ వ్యూహాలు ఫలించలేదు, ఒకవిధంగా బెజేపీ మిత్రపక్షం, జనసేన కొంతలో కొంత మెరుగైన ఫలితాలు సాధించింది.  అయితే ఈ ఎన్నికలు, ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో పార్టీల బలాబలాకు నిదర్శనమా అంటే కాదు. పంచాయతీ ఎన్నికలు పక్కా లోకల్ ఎన్నికలు, పైగా పార్టీల పాత్రా, ప్రమేయం ఏ మాత్రం ఉండని ఎన్నికలు. సో .. ఈ ఎన్నికల ఫలితాలు రాజకీయ పార్టీల బలాబలాలకు ప్రామాణికం కాదు. వచ్చే నెల 10 తేదీన జరిగే నగర పంచాయతీ, పురపాలక సంఘాల ఎన్నికలు, పార్టీ గుర్తులపై జరుగుతాయి. సో ..వచ్చే నెల 14 వరకు ఆగితే, పురపాలక సంఘాల ఎన్నికలఫలితాలు వస్తాయి. పార్టీల బలాబలాలు, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం స్పష్ట మవుతుంది.  అయితే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబదించినంతవరకు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఎవరైనా అభినందించక తప్పదు. కోర్టు చిక్కులు, ప్రభుత్వ సహాయ నిరాకరణ, నిధుల కొరత, సమయం తక్కువ కావడం ఇలా అనేక అవరోధాలు ఎదురైనా, ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్,  స్థితప్రజ్ఞత చూపారు. అందుకు ఆయన్ని, రాజకీయ పార్టీలు ఎంతగా రచ్చచేసినా,పవిత్ర హక్కును అంతే పవిత్రంగా  పవిత్రంగా వినియోగించుకున్న ఓటర్లను అభినందించక తప్పదు.     అయినా  ఈ ఎన్నికలలో గత 2013పంచాయతీ ఎన్నికల్లో కంటే ఏకాగ్రీవలు ఎక్కువయ్యాయి. గత ఎన్నికల్లో మొత్తం 13 జిల్లాలలో కలిపి, 1,835 గ్రామ సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయితే, ఈ ఎన్నికల్లో 2,197 గ్రామపంచాయతీలు ఏకాగ్రీవ మయ్యాయి.  సజావుగా, సక్రమంగా ఏకాగ్రీవాలు జరిగితే అది అభినందనీయమే, అయినా, ప్రలోభాలకు గురిచేసి సాగించిన బలవంతపు ఏకాగ్రీవాలే ఎక్కువకావడం ... అభ్యతరకరమే.  
రోడ్లన్నీ రద్దీ. గుంపులు గుంపులుగా జనం. ఉద్యోగాలు, వ్యాపారాలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు, గుళ్లు, పండగలూ ఇలా జనజీవనం మళ్లీ మామూలు స్థితికి వచ్చేసింది. కరోనా లేదు. గిరోనా లేదు. ఇండియన్ల ముందు చైనీస్ వైరస్ తోకముడిచిందంటూ గొప్పలు. మాస్కులు పెట్టుకోవడం తగ్గించేశారు. శానిటైజర్లు రాసుకోవడం మానేశారు. మనకేం కాదులే అనే ధీమా. అందుకు తగ్గట్టే కొంతకాలం పాటు కొవిడ్ పాజిటివ్ కేసులు బాగా తగ్గిపోయాయి. ప్రజల్లో కరోనా భయం ఇప్పుడు అస్సలు లేదు. ఇదే అంతా చేస్తున్న తప్పు. కరోనా ఎక్కడికీ పోలేదు. మనతోనే ఉంది. మనమధ్యే మాటు వేసి ఉంది. వేటాడే పులి రెండు అడుగులు వెనకకు వేసినట్టు.. కాస్త సైలెంట్ అయింది అంతే. ఇప్పుడు అదును చూసి సెకండ్ వేవ్ తో మళ్లీ విరుచుకుపడేందుకు సిద్దమవుతోంది.  ఆ మేరకు రాష్ట్రాలను అలర్ట్ చేసింది కేంద్రం. మార్చి మొదటి వారం నుంచి కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య  హడలెత్తిస్తోంది. మహారాష్ట్రలో నైతే మళ్లీ లాక్ డౌన్ పెట్టారు. ముంబైలో మాస్కులు లేకపోతే ఫైన్లు వేస్తున్నారు. కేరళ, కర్ణాటక, తమిళనాడులో కొవిడ్ కేసులు భయపెడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ అనూహ్యంగా కరోనా ముంచెత్తుతోంది. కరీంనగర్‌ జిల్లాలో అంత్యక్రియలకు హాజరైన 33 మంది కొవిడ్‌ బారినపడటం షాక్ కు గురి చేసింది. పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ లో 10 మందికి కరోనా సోకడం కలకలంగా మారింది. ఇలా వేగంగా మహమ్మారి వ్యాపిస్తుండటం పొంచి ఉన్న సెకండ్ వేవ్ కు ముందస్తు సిగ్నల్ అంటున్నారు. దేశవ్యాప్తంగా మరోమారు కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 14 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. 27 రోజుల తరువాత మరోమారు అత్యధిక కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య పెరగడం చూస్తుంటే.. దేశంలో సెకండ్‌ వేవ్‌ మొదలైందా..? ఇది కొత్త స్ట్రెయినా? ముందుముందు మరింత ప్రమాదం తప్పదా? అనే భయాందోళనలు అందరిలోనూ. అందుకే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని తెలుగు రాష్ట్రాలను ప్రత్యేకంగా హెచ్చరించింది. మొదటి విడతలో మహారాష్ట్ర తర్వాత ఎక్కువ కేసులు ఏపీలోనే నమోదయ్యాయి. తెలంగాణలో సడెన్ గా కేసులు నమోదవడం కంగారు పెట్టిస్తోంది. తెలంగాణ, ఏపీలో మళ్లీ కొవిడ్‌ నిబంధనలను గట్టిగా అమలు చేయాలని కేంద్రం సూచించింది. ప్రభుత్వ రికార్డుల్లో నమోదవుతున్న కేసుల కంటే క్షేత్రస్థాయిలో పాజిటివ్ కేసులు మరింత అధికం. నవంబరు చివరి వారం నుంచి కేసులు తగ్గుముఖం పట్టినా.. ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. గత వారం ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. చలి పెరిగి వైరస్ కు వాతావరణం అనుకూలంగా మారింది. అందుకే.. కేసులు భారీగా నమోదవుతున్నాయని అంటున్నారు. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఆ లెక్కన మార్చి నెలలో సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటికే లక్షలాది మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వ్యాక్సినేషన్‌ చేశారు. వారికి అందించిన టీకా మొదటి విడత వైరస్ ను సమర్థవంతంగా కట్టడి చేస్తుంది. అయితే.. సెకండ్‌ వేవ్‌లో కొత్త స్ట్రెయిన్‌ వస్తే ఇప్పుడు వేయించుకున్న వ్యాక్సిన్‌ పనిచేస్తుందా..? లేదా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరోగ్య వేత్తలకే కొత్త స్ట్రెయిన్ మీద సరైన అవగాహన లేని ప్రస్తుత తరుణంలో ఇక సామాన్య ప్రజలు ఛాన్స్ తీసుకోవడం అత్యంత ప్రమాదకరమే. అందుకే, ఎవరి జాగ్రత్తల్లో వాళ్లు ఉంటే మంచిది. కరోనా లేదని బిందాస్ గా ఉండకుండా.. కొవిడ్ ఎలాగైనా రావొచ్చనే అనుమానంతో అప్రమత్తంగా ఉంటే బెటర్. మాస్కులు, శానిటైజర్లు, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. జాగ్రత్తే.. కొవిడ్ నుంచి రక్ష.   
నడిరోడ్డుపై కత్తులతో స్వైర విహారం. పట్టపగలు దారుణ హత్యలు. తల్వార్లు, వేట కొడవళ్లతో మనుషులను నరకడమేంటి? ఈ తెలంగాణకు ఏమైంది? ఏమిటీ అరాచకాలు?  పోలీసు వ్యవస్థ ఏం చేస్తోంది? ఖాకీలంటే భయం పోయిందా? కొందరు ఎందుకింతలా బరితెగిస్తున్నారు?. వరుసగా జరుగుతున్న ఘటనలు తెలంగాణను షేక్ చేస్తున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు  అదుపు తప్పుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ గొప్పగా ప్రచారం చేసుకుంటున్న తెలంగాణ కాప్స్ కు.. పట్టపగలే జరుగుతున్నమర్డర్లు  మచ్చగా మారుతున్నాయి. అంతేకాదు ఫ్రెండ్లీ పోలీసింగ్  విఫల ప్రయోగమా? తెలంగాణ మరో బీహార్ లా మారుతోందా? అనే చర్చ జరుగుతోంది. ఫిబ్రవరి 17న జరిగిన హైకోర్టు న్యాయవాది దంపతుల హత్య కేసు సంచలనం. అంతకు మించి దారుణం. పట్టబగలు, నడిరోడ్డుపై, ప్రజలంతా చూస్తుండగా నరికి నరికి చంపేశారు దుండగులు. హత్య చేసిన తీరు మాత్రం అత్యంత హేయనీయం. విచక్షణారహితంగా కత్తి పోట్లతో విరుచుకుపడ్డారు. ఆ మనుషులు మృగాళ్లలా  ప్రవర్తించారు. మహిళను సైతం అత్యంత పైశాచికంగా చంపేశారు. ఆ మారణకాండను అక్కడున్న జనమంతా నోరెళ్లి బెట్టి చూశారే కానీ, ఒక్కరు కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. నడిరోడ్డు మీదే మర్డర్ జరగడంతో.. అటుగా వెళుతున్న వాహనాలన్నీ నిలిచిపోయాయి. రెండు ఆర్టీసీ బస్సులు ఆగి పోయాయి. వాటి నిండా జనం ఉన్నారు. అయినా.. ఎవరూ ముందుకు రాలేదు. అటుగా వెళ్తున్న వాహనదారులు ఆగి.. ఆ మర్డర్ సీన్ ను తమ మొబైల్ లో వీడియో తీశారే కానీ, కనీసం అరవడమో, ఆపడమో, అడ్డుకోవడమో చేయలేదు. నడిరోడ్డుపై కత్తులతో మర్డర్ జరగడం తెలంగాణలో ఇదే తొలిసారేమీ కాదు. గతంలోనూ అనేక ఘటనలు. 2018 సెప్టెంబర్ 26న హైదరాబాద్ అత్తాపూర్ లోనూ అచ్చం ఇలాంటి దారుణమే జరిగింది. కిషన్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్ లు కలిసి రమేశ్ అనే వ్యక్తిని అత్యంత కిరాతకంగా గొడ్డలితో నరికి చంపేశారు. మెట్రో పిల్లర్ కు సమీపంలోనే, పట్టబగలే, వందలాది మంది జనం చూస్తుండగానే జరిగిన ఈ మర్డర్ అప్పట్లో సంచలనం స్పష్టించింది. ఆ సమయంలోనూ జనమంతా ఆ మర్డర్ ను కళ్లప్పగించి చూశారే కానీ ఎవరూ అడ్డుకోలేదు. కసిగా గొడ్డలితో నరికి చంపి.. ఆ తర్వాత తీరిగ్గా నిందితులు ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. బీహార్ తరహా హత్య అంటూ అప్పట్లోనే ఆ ఘటనపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు లాయర్ దంపతుల మర్డర్ తో మరోసారి తెలంగాణలో బీహార్ తరహా హత్యలంటూ చర్చ జరుగుతోంది. 2018 సెప్టెంబర్‌ 14న మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్యను కూడా ఈ కోవలోనే చూస్తున్నారు. కూతురుని ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కక్ష్యతో ప్రణయ్ ను కిరాతకంగా మర్డర్ చేయించాడు అమృతరావు.  సుపారీ గ్యాంగ్ వేట కొడవలితో ప్రణయ్ ను ఆసుపత్రి ప్రాంగణంలో నరికి చంపేసింది. ఆ కేసు తెలంగాణను షేక్ చేసింది. 2021 జనవరి 28న జనగామ జిల్లా కేంద్రంలో  దారుణం చోటుచేసుకుంది.  జనగామ మాజీ కౌన్సిలర్ పులిస్వామిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఉదయం వాకింగ్ చేస్తుండగా.. అక్కడే మాటువేసిన ఇద్దరు వ్యక్తులు పులిస్వామిని కిరాతకంగా దాడిచేసి హత్య చేశారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ నాలుగు ఘటనలే కాదు.. కెమెరాలకు చిక్కని కేసులు ఇంకా అనేకం. ఏ ఘటనకు అదే అత్యంత దారుణం. లా అండ్ ఆర్డర్ లో తెలంగాణ భేష్ అంటూ సీఎం కేసీఆర్ పదే పదే స్టేట్ మెంట్లు ఇస్తుంటారు. అలాంటిది ఆయన పార్టీ మండల స్థాయి నేత ఇలా నడిరోడ్డుపై కత్తులతో నరికి చంపడం చిన్న విషయమేమీ కాదు. అందులోనూ.. ఏకంగా హైకోర్టు లాయర్లను హత్య చేయడం వారి బరితెగింపునకు నిదర్శనం. ఇది ఒక విధంగా న్యాయ వ్యవస్థపైనే పరోక్ష దాడి అని అంటున్నారు. అందుకే, హైకోర్టు సైతం ఘటనపై సీరియస్ గా స్పందించి ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది. న్యాయవాది దంపతుల కేసులో పోలీసుల ఉదాసీన వైఖరిపైనా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. బీహారులోనే ఇలా జరుగుతుందని.. తమకు వ్యతిరేకంగా కేసులు వేసిన వారిని బెదిరించడం, చంపడం అక్కడ కామనేనని.. ఇప్పుడు తెలంగాణలోనూ బీహార్ లాంటి ఘటనలు రిపీట్ అవుతున్నాయని అంటున్నారు. బంగారు తెలంగాణ తెస్తామని.. ఆటవిక తెలంగాణ చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. శాంతిభద్రతల నిర్వహణలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అంటున్నారు. భూముల ఆక్రమణలు, నడిరోడ్డుపై మర్డర్లతో తెలంగాణ బీహార్ నే మించేసి దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తోందని ఎద్దేవా చేస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విఫల ప్రయోగమని.. పాలకుల చేతగాని తనం వల్లే ఇలాంటి దారుణ హత్యలు జరుగుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వరుస ఘటనలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. తెలంగాణ మరో బీహార్ లా మారిపోతోంది.
మరో పక్షం రోజుల్లో ... ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రి వర్గాన్ని విస్తరించే ఆలోచనలో ఉన్నారా? అందుకోసం వచ్చే నెల మొదటి వారంలో ముహూర్తం ఖరారు అయిందా అంటే ఢిల్లీ రాజకీయ వర్గాలు అవుననే అంటున్నాయి. “మార్చి మొదటివారంలో మంత్రి వర్గ విస్తరణ ఖాయంగా ఉంటుంది, ఇదులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర లేదు” అని పేరు చెప్పేందుకు ఇష్టపడని  పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. నిజానికి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణ లేదా పునఃవ్యవస్తీకరణ ఉంటుందని వార్తలు వచ్చినా, ఓ వంక ఢిల్లీ సరిహద్దుల్లో సాగుతున్న రైతు ఆందోళన, రిపబ్లిక్ డే రోజున చోటు చేసుకున్న సంఘటనలు,  మరో వంక కొవిడ్ కారణంగా అస్తవ్యస్తంగా మారిన వ్యవస్థలు ఇంకా పూర్తిగా సర్డుకోక పోవడం వంటి అనేక కారణాల చేత మంత్రి వర్గవిస్తరణ అప్పట్లో వాయిదా పడిందని అంటున్నారు. ఈ నెల 15తో బడ్జెట్ తొలి విడత సమావేశాలు ముగిసాయి. విశ్రాంతి అనంతరం మలివిడత సమావేశాలు మార్చి 8 తేదీన ప్రారభమవుతాయి. ఈనేపధ్యంలో మార్చి మొదటి వారంలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే, ఈసారి జరిగే మంత్రి వర్గ విస్తరణలో ఉభయ తెలుగు రాష్టాల నుంచి కనీసం ఒక్కొక్కరికి అయినా మంత్రి వర్గంలో స్థానం లభించడం ఖాయమని తెలుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ నుంచి సిఎం రమేష్, టీజీ వెంకటేష్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుంటే, తెలంగాణలో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్,నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్  పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే, విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రస్తుతం హోం శాఖ సహాయమంత్రిగా ఉన్న,సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి శాఖ మార్చే అవకశం ఉందని తెలుస్తోంది. ఇక వివరాల్లోకి వెళితే, ఉభయ తెలుగు రాష్ట్రాలలో పార్టీని బలోపేతం చేసుకుని, వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యాన్మాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న కమల దళం, అటు ఏపీలో ఇటు తెలంగాణలో కూడా బీసీ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగాగానే మున్నూరు కాపు వర్గానికి చెందిన బండి సంజయ్’ కి, తెలంగాణ పార్టీ పగ్గాలు అప్పగించింది. అలాగే ఎపీలోనూ కాపు వర్గానికి చెందిన సోము వీర్రజును పార్టీ అధ్యక్షునిగా నియమించడంతో పాటుగా, కాపు సామాజిక వర్గానికే చెందిన పవన్ కళ్యాణ్ (జన సేన)తో పార్టీ పొత్తు పెట్టుకుంది. ఈ నేపధ్యంలో జరుగనున్న మంత్రి వర్గ విస్తరణలోనూ అదే ఫార్ములాను అనుసరించే పక్షంలో ఏపీలో సీఎం రమేష్’కు మంత్రి వర్గంలో స్థానం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.టీజీ వెంకటేష్ పేరుకూడా పరిశీలనలో ఉన్నప్పటికీ, సీఎం రమేష్’ వైపుకే క్యాస్ట్ కాటా మొగ్గుచూపుతోందని, సో .. ఇతర పరిణామాలు ఏవీ ప్రతిబంధకం కానీ పక్షంలో ‘సీఎం బనేగా మినిస్టర్’ అనుకోవచ్చని అంటున్నారు. ఇక తెలంగాణ విషయానికివస్తే, ధర్మపురి అరవింద్’ పేరుతొ పాటుగా బండి సంజయ్ పేరు వినిపిస్తున్నపప్పటికీ, అయన ఇప్పటికీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఎక్సెప్షనల్ కేసులలో తప్పించి ఒకే వ్యక్తి రెండు పదవులు అనేది పార్టీ  విధానాలకు విరుద్ధం. కాబట్టి,ధర్మపురినే అదృష్టం వరిస్తుందని పార్టీ వర్గాల సమాచారం. కిషన్ రెడ్డి శాఖ మార్పు ? ఉభయ తెలుగు రాష్ట్రాలకు కలిపి ఏకైక మంత్రిగా ఉన్న హోం శాఖ సహాయ మంత్రి క్రిషన్ రెడ్డి, పని తీరు పట్ల హోం మంత్రి అమిత్ షా అంత సంతృప్తి కరంగా లేరని అంటున్నారు. అత్యంత కీలక శాఖలో సహాయ మంత్రిగా ఉన్న ఆయన ఎక్కువ సమయం హైదరాబాద్’లో గడపడం కూడా ఆయనకు నచ్చడం లేదని, కాబట్టి కిషన్ రెడ్డి శాఖ మార్పు ఖాయమని అంటున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడుకు కిషన్ రెడ్డిని ఇన్చార్జిగా నియమించడం కారణంగా చూపింఛి ఆయన శాఖను మార్చే అవకాశం ఉందని అంటున్నారు.  
ఒక్కడు కదిలాడు. ఒక్కో అడుగు ముందుకేశాడు. ఉప్పెనలా ఉప్పొంగాడు. రైతు కోసం రావిరాలలో రణభేరి మోగించాడు. రేవంత్ రెడ్డి సత్తా ఏంటో మరోసారి ఎలుగెత్తి చాటాడు. త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రను ప్రకటించాడు. సునామీలా తిరిగి ఉప్పెన సృష్టిస్తానని.. ఆ ఉప్పెనలో కేసీఆర్‌ను కప్పేస్తానని, టీఆర్‌ఎస్ ను గద్దె దించుతానని.. సమరశంఖం పూరించాడు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ భుజం మీదుగా మోదీపై గురి.. రావిరాల సభతో రేవంత్ రెడ్డి భవిష్యత్ రాజకీయంపై ఓ అంచనాకు రావొచ్చు. కేసీఆర్ భుజాల మీదుగా కేంద్రంపై వ్యవసాయ చట్టాలపై ఫిరంగి పేల్చిన తీరుకు విమర్శకుల నుంచే ప్రశంసలు వస్తున్నాయి. కేంద్ర చట్టాలను సవరించుకునే అవకాశం రాష్ట్రాలకు ఉంటుందని గుర్తుచేస్తూ.. కేంద్ర బంతిని రాష్ట్ర కోర్టులోకి నెట్టారు. కేసీఆర్ మోదీ జట్టు వీడి.. సాగు చట్టాలపై అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలంటూ గులాబీ బాస్ ను బోనులో నిలబెట్టే ప్రయత్నం చేశారు.  రావిరాల వేదికగా కేంద్ర, రాష్ట్రాలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి పంపిన మెసేజ్ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లిపోయింది. ఢిల్లీ డైరెక్షన్ లోనే.. చెప్పేశారు. రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. పాదయాత్రతో తన రాజకీయ బాటను మరింత సుస్థిరం చేసుకోనున్నట్టు రావిరాల సభలో రాష్ట్ర వ్యాప్త పాదయాత్రను ప్రకటించి రేవంత్ రెడ్డి సంచలనం సృష్టించారు. కాంగ్రెస్‌ అధినాయకత్వం ఆదేశం మేరకే రూట్‌ మ్యాప్‌ ఉంటుందని స్పష్టం చేసి తన గాడ్ ఫాదర్ ఢిల్లీనే అంటూ సంకేతాలు పంపించేశారు. 10 జన్ పథ్ అనుమతితోనే కాంగ్రెస్ లో తన రాజకీయ ప్రస్థానం కొనసాగుతుందని.. లోకల్ సీనియర్లకు చెప్పకనే చెప్పేశారు. నాతో వచ్చేదెవరు.. నాతో నడిచేదెవరు.. తేలిపోయింది. రావిరాల సభతో రేవంత్ రెడ్డితో కలిసి నడిచేదెవరో తేలిపోయింది. కాంగ్రెస్ లో  ఎవరు ఏ గ్రూపో పాలు, నీళ్లలా తేలిపోయింది. నో డౌట్. సీతక్కే ఆ లిస్ట్ లో అందరికన్నా ముందున్నారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్‌, కుసుమ్‌కుమార్‌, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌, మాజీ మంత్రులు చిన్నారెడ్డి, కొండా సురేఖ, మాజీ ఎంపీలు సురేష్‌ షెట్కార్‌, సిరిసిల్ల రాజయ్య, మల్లు రవి, కూన శ్రీశైలం గౌడ్‌, టి.రామ్మెహన్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, దాసోజు శ్రావణ్‌, అనిల్‌కుమార్‌ యాదవ్‌, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు నర్సింహారెడ్డితో పాటు పలువురు డీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి సభకు హాజరు కావడంతో వీరంతా ఆయన బ్యాచ్ అంటూ ప్రచారం మొదలైపోయింది. ఇక.. సభకు రాని వారిలో హేమాహేమీలే ఉన్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జానారెడ్డి, వి.హన్మంతరావు, దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్యయ్య, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు మీటింగ్ కు అటెండ్ అవలేదు. అయితే.. రణభేరి సభ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన ప్రొగ్రామ్ కాదని వారంతా బయటకు చెబుతున్నా.. ఆ సో కాల్డ్ సీనియర్లంతా రేవంత్ రెడ్డి ఎదుగుదలను చూసి ఓర్వలేని వారేనంటున్నారు ఆయన అభిమానులు. ఆసక్తిరేపిన సురీడు.. రేవంత్ రెడ్డి నిర్వహించిన రణభేరి సభలో జరిగిన రెండు ఆసక్తికర అంశాలపై జోరుగా చర్చ జరుగుతోంది. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు నిత్యం ఆయన వెన్నంటే ఉండేవాడు వ్యక్తిగత అనుచరుడు సురీడు. వైఎస్ మరణం తర్వాత బహిరంగంగా సురీడు కనిపించింది లేదు. అలాంటిది రేవంత్ రెడ్డి సభలో అనూహ్యంగా ప్రత్యక్షమయ్యాడు ఆ సురీడు. ఇప్పటి వరకూ ఏ జగన్ సభలోనూ, ఏ షర్మిల మీటింగ్ లోనూ జాడ లేని సూరీడు సడెన్ గా రేవంత్ రెడ్డి రణభేరిలో ఎందుకు ఎంట్రీ ఇచ్చాడనే దానిపై పొలిటికల్ ఇంట్రెస్ట్ పెరిగింది. నాడు వైఎస్.. నేడు రేవంత్ -కొండా సురేఖ కామెంట్స్ రణభేరి సభలో కీలక నేత కొండా సురేఖ చేసిన కామెంట్స్ భవిష్యత్ పరిణామాలపై ఓ అంచనాకు వచ్చేలా చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి పాదయాత్రను.. గతంలో వైఎస్సార్ చేసిన యాత్రతో పోల్చారు కొండా సురేఖ. తనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తొస్తున్నారంటూ ఆమె చేసిన కామెంట్స్ సైతం వ్యూహాత్మకమే అంటున్నారు. ఆనాడు కాంగ్రెస్ కు వైఎస్ ఎలానో.. ఈనాడు హస్తం పార్టీలో రేవంత్ రెడ్డి స్థాయి కూడా అలాంటిదేనంటూ పరోక్షంగా ప్రస్తావించారని చెబుతున్నారు. అప్పట్లో వైఎస్సార్ కు బలమైన మద్దతుదారుగా ఉన్న కొండా దంపతులు.. ఫ్యూచర్ లో రేవంత్ రెడ్డికి సైతం స్ట్రాంగ్ సపోర్టర్స్ గా నిలిచే ఛాన్స్ ఉందని విశ్లేషిస్తున్నారు. రావిరాల సభతో  కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి స్ట్రామినా ఏంటో.. అది ఉప్పెనలా ఉప్పొంగి, తెలంగాణలో సృష్టించే పొలిటికల్ సునామీ ఎంతో స్పష్టమైంది. రేవంత్ రెడ్డి బలం, బలగం, భవిష్యత్ పై క్లారిటీ వచ్చేసింది. ఈ సభ జస్ట్ టీజర్ మాత్రమే. ట్రైలర్ మరింత అదిరిపోతుందని..  పిక్చర్ అబీ బాకీ హై అంటున్నారు ఫ్యాన్స్.    
భారతీయ జనతా పార్టీ కి లోక్ సభలో 303 మంది సభ్యులున్నారు, మిత్ర పక్షాలను కలుపుకుంటే ఆ సంఖ్య 350 దాటుతుంది. రాజ్య సభలో సెంచరీకి చేరువలో ఉంది.అన్ని రాష్టాలలో కలిపి దేశం మొత్తంలో కమలం గుర్తుమీద గెలిచిన  ఎమ్మెల్ల్యేలు1374 మంది ఉన్నారు. దేశం మొత్తంలో ఉన్న రాష్ట్రాలు 29 అయితే అందులో 12 రాష్ట్రాలలో బీజేపీ సొంత ప్రభుత్వాలున్నాయి. మరో ఆరు రాష్ట్రాలలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాలలో భాగస్వామ్య పక్షంగా ఉంది. దేశంలోనే కాదు మొత్తం ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ బీజేపీ ... అంతే కాదు, పార్టీ సభ్యత్వం లేకుండా ఐడియాలజికల్ కమిట్మెంట్’తో పనిచేసే అదృశ్య కార్యకర్తలు దేశ విదేశాల్లో లక్షల్లో ఉన్నారు.  అయితే, ఇంత బలం, బలగం ఉన్న బీజేపీ, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో మాత్రం ఆటలో అరటి పండుగానే మిగిలిపోతోంది. గత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు రాలేదు. కనీసం కాసింత గౌరవప్రదమైన ఓట్లయినావచ్చాయా,అంటే అదీలేదు.నిండా ఒక శాతం ఓట్లు రాలేదు.  చివరకు ‘నోటా’ కు వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదు.  అలాగని, రాష్ట్రంలో పార్టీకి పునాదులు లేవా ... అంటే రాష్ట్ర విభజనకు ముందు, ఒంటరిగా పోటీచేసిన సందర్భాలలో కూడా బీజేపీకి ఓట్లే కాదు సీట్లు కూడా వచ్చాయి. 1999 లోక్ సభ ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్’లో బీజేపీ ఏడు సీట్లు గెలిస్తే అందులో మూడు (రాజమండ్రి, నరసాపురం, తిరుపతి) స్థానాలు ఆంధ్రాలోనే ఉన్నాయి. అప్పట్లో ఆంధ్ర ప్రాంతంలో బీజేపీకి 18 శాతానికి పైగానే ఓట్లు వచ్చాయి. అలాంటి పార్టీ 2019 ఎన్నికల్లో ఎందుకు అలా తుడిచి పెట్టుకు పోయింది. ఎందుకు తిరిగి  పుంజుకోలేక పోతోంది ? అందుకు రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల పునాదులు పటిష్టంగా ఉండడం ఒక ప్రధాన కారణం అయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కమల దళం ఎదగకుండా చేస్తున్నాయని, పార్టీ నాయకులే వాపోతున్నారు.రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేక హోదాను ఇవ్వలేదు. చివరకు అందుకు ప్రత్యాన్మాయంగా ఇస్తామని వాగ్దానం చేసిన ప్రత్యేక ప్యాకేజికి కేంద్రం పంగనామాలు పెట్టింది. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా శంఖుస్థాపన చేసిన రాజధాని నిర్మాణానికి గానీ,లోటు బడ్జెట్ భర్తీకి  వెనక బడిన ప్రాంతాల అభివృద్ధికి ఇలా ఇస్తామన్న నిధులేవీ తొలి ఐదేళ్ళలో ఇవ్వలేదు. ఆకారణంగానే తెలుగు దేశం పార్టీ, కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చింది. బీజేపీతో పొత్తును తెగతెంపులు చేసుకుంది. దీంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో,రాష్ట్ర ప్రజల్లో కూడా బీజేపీ పట్ల విశ్వాసం పూర్తిగా సన్నగిల్లింది. ఫలితంగా 2019 ఎన్నికల్లో బీజీపీ ‘నోటా’ తో పోటీపడి ఓడిపోయింది. ఒకప్పుడు ఒంటరిగా ఒంటరిగా పోటీ చేసి 18 శాతం వరకు ఓట్లు, మూడు లోక్ సభ స్థానాలు గెలుచుకున్న బీజేపీ 0.8 శాతం ఓట్లకు పడిపోయింది.  అందుకే, రాష్ట్రంలో రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు ఉండడం, కార్యకర్తలు, స్థానిక నాయకుల అభీష్టానికి వ్యతిరేకంగా  సుదీర్ఘ కాలం పాటు తెలుగు దేశం పార్టీతో పొత్తు కొనసాగించడం,సమర్ధ నాయకత్వం లేక పోవడం ఇలా ఇంకా అనేక ఇతర  కారణాలున్నా  కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, పార్టీ ఎదుగుదలకు ప్రతిబంధకంగా నిలుస్తున్నాయని పార్టీ నాయకులు కూడా అంగీకరిస్తున్నారు.   ప్రస్తుత విషయాన్నే తీసుకుంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, అన్యమత ప్రచారం, మత మార్పిడులు, క్రైస్తవీకరణ ఆగడాలు పెరిగిపోవడంతో రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా వంటి పాత గాయాలను మరిచి పోయి బీజేపీ వైపు కొంత మొగ్గు చూపారు. అయితే, ఇంతలోనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదన తెర మీదకు రావడంతో కథ మళ్ళీ కథ మొదటికి వచ్చింది. అందుకే రాష్ట్ర బీజేపీ నాయకులు,విశాఖ ఉక్క ప్రైవేటీకరణ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని కేంద్ర నాయకత్వం వద్ద మొర పెట్టుకున్నారు. పార్టీ రాష్ట్ర్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నాయకత్వంలో ఢిల్లీ వెళ్ళిన ప్రతినిధి బృదం కేంద్ర ఉక్కు మంత్రి  ధర్మేంద్ర  ప్రధాన్ ‘ను కలిసి వినప్తి పత్రం సంర్పించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.  అయితే అప్పటికే జరగవలసిన నష్టం జరిగి పోయింది. ప్రధాన ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశాన్ని, ఇందుకు సంబంధించి ప్రజల సెంటిమెంట్’ను కార్మికులు ఆందోళనను చాల చాకచక్యంగా తమకు అనుకూలంగా మలచుకుంది. ముందుగా స్థానిక ఎమ్మెల్ల్యే, మాజీ మంత్రి   మాజీ మంత్రి, ఎమ్మెల్ల్యే గంటా శ్రీనివాస రావు ఎమ్మెల్ల్యే పదవికి రాజీనామా  చేశారు. మరో వంక టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్ల్యే పల్లా శ్రీనివాస ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.  ఆయన దీక్షను పోలీసులు భగ్నం చేసినా, పార్టీ జాతీయ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగారు. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తే చేస్తే...ప్రతిపక్షంగా తాము కూడా ఒక్క నిమిషంలో రాజీనామా చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఉక్కు పరిరక్షణ కోసం ముందుండి ఉద్యమాన్ని నడిపించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందనడంతో పాటుగా ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచేసేందుకు కుడా సిద్దమని ప్రకటించడం ద్వారా చంద్రబాబు నాయుడు, బంతిని వైసీపీ కోర్టులోకి డ్రైవ్ చేశారు. అంతే కాకుండా స్టీల్‌ప్లాంట్‌ లేకపోతే విశాఖపట్నం ఉనికే లేదని, అటువంటి కర్మాగారాన్ని అమ్మేస్తుంటే...ముఖ్యమంత్రి తాడేపల్లిలో కూర్చొని పబ్జీ ఆడుకుంటున్నారా?...అంటూ ముఖ్యమంత్రి జగన్‌పై మరో సెంటిమెంటల్ బాణాన్ని సందించారు.అలాగే, స్టీల్ ప్లాంట్ బేరం వెనక జగన్ రెడ్డి, విజయసాయి రెడ్డి స్టీల్ ప్లాంట్ ను అమ్మేయడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యమాన్ని రాష్ట్ర్ర వయ్పితం చేసే లక్ష్యంతో ఈనెల 18న స్టీల్‌ప్లాంట్‌ ఆవిర్భావ దినోత్సవం రోజున రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చామన్నారు.  ఈ నేపధ్యంలోనే అధికార వైసీపీలోనూ కదలిక వచ్చింది. పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈ నెల 20 న స్టీల్ ప్లాంట్ పరిరక్షన యాత్ర చేస్తానని ప్రకటించారు. అలాగే ముఖ్యంత్రి కార్మిక నాయకులతో సమావేసమవుతారని, ఇదే విషయాన్ని చర్చించేందుకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రధాని అప్పాయింట్మెంట్ కోరరాని కూడా విజయసాయి చెప్పారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు కూడా ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని అంటున్నారు. .సో .. విశాఖ ఉక్కు ఉద్యమం వేడెక్కుతోంది. ఈ దశలో కేంద్రం సానుకూలంగా స్పదించి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా .. బీజేపీకివచ్చే ప్రయోజనం శూన్యంగానీ కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలే ఆంధ్ర ప్రదేశ్’లో పార్టీ ఎదుగుదలకు ప్రతిబంధకం అవుతున్నాయని.. రాష్ట్ర బీజేపీ నాయకులు అంతరంగిక సంభాషణల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.     
1979- శశిబాల ఒక అందమైన 20 ఏళ్ల యువతి. దిల్లీలోని ప్రఖ్యత లక్ష్మీబాయ్‌ కాలేజి నుంచి డిగ్రీని కూడా సాధించింది. శశిబాలకు పది నెలల క్రితమే పెళ్లయింది. ఇప్పుడు తను ఆర్నెళ్ల గర్భవతి కూడా! బయట నుంచి చూసేవారికి ఇదంతా ఓ అందమైన జీవితం తాలూకు వర్ణనగా తోచవచ్చు. కానీ శశిబాల వ్యక్తిగత జీవితం ఆ చిత్రానికి తలకిందులుగా కనిపిస్తుంది. పెళ్లయిన దగ్గర్నుంచి శశిబాల అత్తమామలు కట్నం కింద ఏదోఒక వస్తువుని తీసుకురమ్మంటూ గొడవచేస్తూనే ఉన్నారు. శశిబాల తన తల్లి సత్యరాణి దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించిన ప్రతిసారీ, తల్లీకూతుళ్లు వారి కోరికను ఎలా తీర్చాలా అని మదన పడుతూనే ఉన్నారు. సత్యరాణి వితంతువు, పైగా శశిబాలతో పాటు ఆమె మీద మరికొందరి బిడ్డల భారం కూడా ఉంది. ఇలాంటి సమయంలో ఓ రోజు సత్యరాణికి, శశిబాల అత్తగారింటి నుంచి వెంటనే రమ్మంటూ కబురు వచ్చింది.     పరుగుపరుగున వెళ్లిన ఆమెకు తన బంగారు కూతురు నల్లటి ముద్దగా ఓ మూల కనిపించింది. ‘నీ కూతురు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. ఆ చెత్తని ఇక్కడి నుంచి పట్టుకుపో!’ అన్నారు శశిబాల అత్తగారు. కూతురి శవాన్ని కప్పేందుకు వాళ్లు ఒక దుప్పటిని అందించేందుకు కూడా సిద్ధపడలేదు. 1980వ దశకంలో ఇలాంటి సంఘటనలు చాలానే వినిపించేవి. కిరసనాయిలు పోసుకునో, చీరకు నిప్పంటుకునో నిస్సహాయంగా ఎందరో ఆడవాళ్లు చనిపోయేవారు. అవన్నీ ప్రమాదాలో ఆత్మహత్యలో కాదనీ, వరకట్నపు హత్యలనీ తెలిసినా ఎవరూ నోరు మెదపలేని పరిస్థితి. కానీ సత్యరాణి అలా నిశ్శబ్దంగా ఊరుకోదల్చుకోలేదు.   స్కూటరు కొనిపెట్టలేదన్న కారణంగా తన అల్లుడు ఆమెను చంపేశాడంటూ కేసుని నమోదు చేసింది. అయితే అప్పట్లో చట్టాలు ఇంత కఠినంగా ఉండేవి కాదు. పెళ్లి సమయంలో అందుకున్నవే కట్నకానుకల కిందకి వస్తాయన్న నిర్వచనం ఉండేది. పైగా చావుకి సంబంధించిన ఆరోపణలను నిరూపించే బాధ్యత మృతుల తరఫు న్యాయవాదులకే ఉండేది. సత్యరాణి ఒక పక్క తన కూతురి చావుకి సంబంధించిన కేసులను పోరాడుతూనే, మరో పక్క వరకట్నపు చావులను ఎదుర్కొంటున్న ఎందరో అభాగ్యుల కోసం గొంతు విప్పడం మొదలుపెట్టింది. తమ కూతురు వరకట్నం కారణంగా చావుని ఎదుర్కొందిని భావించిన ప్రతి ఒక్కరి పోరాటానికీ ఆసరాగా నిలిచేది.       సత్యరాణి తనలాంటి దుస్థితిలో ఉన్న మరికొందరితో కలిసి శక్తిశాలిని పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. వరకట్నపు వేధింపులను ఎదుర్కొనేవారికి ఈ సంస్థ నిలువనీడను కల్పించేది. సత్యరాణికి చదువు లేదు. వయసు పైబడుతోంది. పైగా చెట్టంత కూతురిని పోగొట్టుకుంది. అయినా వరకట్నానికి వ్యతిరేకంగా తన పోరులో రవ్వంత కూడా వెనక్కి తగ్గలేదు. రానురానూ సత్యరాణి ఉద్యమం ఫలితాలనివ్వసాగింది. వరకట్న వ్యతిరేక చట్టానికి ప్రభుత్వం మరింత పెట్టాల్సి వచ్చింది. వరకట్నం అంటే కేవలం డబ్బే కాదు, వస్తువుని కోరడం కూడా వరకట్న పరిధిలోనే వస్తాయంటూ చట్టాన్ని మార్చింది కేంద్రం. పెళ్లైన ఏడేళ్ల లోపు స్త్రీ ఆత్మహత్య చేసుకున్నా కూడా, అందుకు కారణం అత్తవారింటి ఆరళ్లు కూడా కావచ్చునంటూ మరో సవరణ కూడా చేసింది.   ఒక పక్క సమాజంలో మార్పు రావడం, మరో పక్క చట్టాలకు పదునెక్కించడంతో... వరకట్న హత్యలు కొంతమేరకన్నా తగ్గాయి. ముఖ్యంగా ‘వంటగదిలో ప్రమాదాలు, ఆత్మహత్యలు’ చాలామేరకు తగ్గాయి. నేరాల తగ్గుదలను చాలామంది గమనించారు కానీ, అందుకు కారణమైన సత్యరాణి వంటి తల్లుల పోరాటాన్ని పెద్దగా గమనించింది లేదు. వరకట్న చావులను తగ్గించడంలోనే సత్యరాణి విజయం సాధించడమే కాదు, మారిన చట్టాలకు అనుగుణంగా తన అల్లుడికి శిక్షపడేలా కూడా విజయం సాధించింది. 2014లో సత్యరాణి తన 85వ ఏట ప్రశాంతంగా కన్నుమూసింది. కానీ ఆమె జీవితం ఏనాడూ వృధాగా పోలేదు. ఒక తల్లిగా తాను పొందిన గర్భశోకాం, మరో తల్లికి కలుగకుండా ఉండేందుకే అనుక్షణం పోరాడింది. ఎందరో కూతుళ్లకి న్యాయాన్ని సాధించింది. మరెందరో వధువులు వరకట్నపు కోరల్లో చిక్కుకోకుండా తన జీవితాన్ని అడ్డు వేసింది.   - నిర్జర.
ఈ రోజుల్లో చాలామందిది ఒకటే బాధ! ఖర్చుపెట్టుకోవడానికి కావల్సినంత డబ్బు ఉంది. కానీ గడపడానికి సమయమే ఉండటం లేదు. ఈ మాటలు వింటున్న కొందరు పరిశోధకులకి ఓ అనుమానం వచ్చింది. మనిషి దేనివల్ల సంతోషంగా ఉంటాడు? డబ్బు వల్లా! కాలం వల్లా! ఈ విషయాన్ని తేల్చుకునేందుకు వారు ఒక ఆరు పరిశోధనలు చేశారు. ఇందులో భాగంగా 4,600 మంది అభ్యర్థుల ఆలోచనా తీరుని గమనించారు.   లక్షలకొద్దీ జీతంతో ఎక్కువసేపు ఉద్యోగం చేయడం కంటే, కాస్త తక్కువ జీతంతో తక్కువ పనిగంటలు చేస్తేనే సుఖంగా ఉన్నట్లు ఈ పరిశోధనలో వెల్లడయ్యింది. కుర్రవాళ్లు కాస్త అటూఇటూగా మొగ్గుచూపారు కానీ, వయసు మీరుతూ జీవితం తెలిసొస్తున్న కొద్దీ.... డబ్బుకంటే సమయమే ముఖ్యం అనేవారి సంఖ్యే ఎక్కువగా ఉందట. అంతేకాదు! ఇంటిపని, పెరడు పని చేసేందుకు పనివాళ్లని పెట్టుకున్నప్పుడు కూడా ఇదే తరహా సంతోషం కనిపించింది. ఆ సంతోషం తన పని వేరొకరు చేయడం వల్ల కాదు, జీవితాన్ని ఆస్వాదించే సమయం దక్కినందువల్లే అని తేల్చారు!   పైన చెప్పుకొన్న పరిశోధన జరిగి ఏడాది గడిచిపోయింది. ఇప్పుడు శాస్త్రవేత్తలకి మరో సందేహం వచ్చింది. మన డబ్బుతో వస్తువులు కొనుక్కుంటే ఎంతో కొంత తృప్తి ఉంటుంది. అదే సమయాన్ని కొనుక్కుంటే! అదేనండీ... ఆ డబ్బుతో మన పనిభారం తగ్గించుకుంటే మరింత తృప్తి ఉంటుందా! అన్న ఆలోచన వచ్చింది. వెంటనే కొంతమందికి తలా 40 డాలర్లు ఇచ్చి చూశారు. ఈ డబ్బుని మీకు తోచిన రీతిలో ఏదన్నా కొనుక్కోమని చెప్పారు. సహజంగానే చాలామంది తమకి ఇష్టమైన వస్తువులని కొనేసుకున్నారు. అతికొద్ది మంది మాత్రమే... తమకి కాలం కలిసొచ్చేలా వేరొకరి సేవల కోసం ఈ డబ్బుని వినియోగించుకున్నారు. వస్తువులని కొన్నవారితో పోలిస్తే సమయాన్ని కొనుక్కున్నవారే ఎక్కువ తృప్తి పడినట్లు తేలింది.   ఈ పరిశోధనలతో రెండు విషయాలు స్పష్టం అయిపోతున్నాయి. ఒకటి- జీవితంలో డబ్బు ఎంత అవసరమో, సమయం అంతే అవసరం. ఈ రెండింటి మధ్యా సమన్వయం లేకపోతే మనసుకి లోటు తోచడం ఖాయం. రెండు- ప్రతి పైసా కూడపెట్టాలన్న తపనకి పోకుండా, అవసరం అయినప్పుడు సేవల కోసం కూడా కాస్త డబ్బుని ఉపయోగించుకోవడం మంచిది. అలా కలిసొచ్చే కాలం మనం వదులుకునే డబ్బుకంటే విలువైనది! - నిర్జర.  
మౌలికంగా స్త్రీ, పురుషుల ఆలోచనా విధానంలోనే తేడా వుంటుంది. అందుకే ఒకరు చేసేది మరొకరికి నచ్చదు అంటున్నారు టొరంటో యూనివర్సిటీ పరిశోధకులు. భార్యాభర్తల బంధంలో ‘అర్థం చేసుకోవడం’ అనేది చాలా ముఖ్యమైన విషయం. అయితే ఎవరు ఎవర్ని అర్థం చేసుకోవాలన్నదే సమస్య. నన్ను అర్థం చేసుకుని నాకు నచ్చినట్టు నడిస్తే బావుంటుందని ఎవరికి వారు కోరుకుంటారుట భార్యాభర్తలిద్దరూ. అదిగో అక్కడే మొదలవుతుందిట సమస్యంతా. భార్యాభర్తల గొడవల్లో ఎక్కువగా వినిపించే కారణం ‘అర్థం చేసుకోలేకపోవడం’. అయితే ఒకే విషయానికి స్త్రీ, పురుషులు స్పందించే తీరు వేరే వేరేగా వుంటుంది. అది సర్వ సాధారణం. ఈ ఒక్క విషయాన్ని గ్రహించగలిగితే ఎన్నో కుటుంబాలలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వుండవు అంటున్నారు పరిశోధకులు. వీరు స్త్రీ, పురుషుల మనస్తత్వాలు, వివిధ సందర్భాలలో వారు స్పందించే విధానంపై ఓ అధ్యయనం చేపట్టారు. ఏ విషయం వారిని ఎక్కువగా బాధిస్తుంది అన్న విషయంలో కూడా ఇద్దరి మధ్య ఎంతో తేడా వుందని గుర్తించారు. స్త్రీలు ఎక్కువగా సన్నిహిత సంబంధాలు, బంధుత్వాల విషయంలో చాలా సున్నితంగా వుంటారుట. ఆ సన్నిహితుల విషయంలో, సంబంధాల విషయంలో ఏవైనా వైఫల్యాలు ఎదురైతే డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు అంటున్నారు పరిశోధకులు. అదే మగవారిని ఆ విషయాలు అంతగా కదిలించవట. తమ ఉద్యోగం, సంపాదన, తన మాటకి విలువ, గౌరవం, సమాజంలో, కుటుంబంలో గుర్తింపు వంటివి మగవారికి ముఖ్యమైన అంశాలుగా నిలుస్తాయట. వీటిల్లో వచ్చే హెచ్చుతగ్గులు వారిని డిప్రెషన్‌కి గురి చేస్తాయట. డిప్రెషన్‌కి గురైన స్త్రీలు నిస్సహాయంగా, నిరాశగా, ఒంటరిగా గడపటానికి ఇష్టపడుతుంటే, మగవారు మాత్రం కోపం, పంతం వంటి లక్షణాలు కనబరుస్తారని గుర్తించారు టొరంటో యూనివర్సిటీ పరిశోధకులు. అలాగే పగ, కసి, శత్రుత్వం వంటి లక్షణాలు మగపిల్లల్లో టీనేజ్ నుంచే ఎక్కువగా కనిపిస్తున్నాయని కూడా వీరి పరిశోధనలో తేలింది. దీనిని దృష్టిలో పెట్టుకుని మగపిల్లల తల్లిదండ్రులు వారి ప్రవర్తన, మానసిక స్థితి వంటివాటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ వుండాలని కూడా హెచ్చరిస్తున్నారు వీరు. నిరాశ, నిస్పృహ వంటివి మనిషిని కృంగదీసినప్పుడే మరో వ్యక్తి తోడు, ఆసరా అవసరం అవుతాయి. ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో భార్య భర్త నుంచి ఓదార్పుని, తోడ్పాటుని కోరుకుంటే భర్త తన భార్య సహనంగా అర్థం చేసుకోవడాన్ని కాంక్షిస్తాడుట. స్త్రీలు నేనున్నానంటూ భరోసాని కోరుకుంటారు. కానీ, మగవారు తమ భార్యలు వారి సమస్యలలో తల దూర్చకుండా, సలహాలు ఇవ్వకుండా ఉండాలని ఆశిస్తారుట. దాదాపు కొన్ని వందల జంటలపై దీర్ఘకాలం సాగిన ఆ పరిశోధనలో బయటపడిన కొన్ని ఆసక్తికర అంశాలివి. -రమ
వాయు కాలుష్యం వల్లే దక్షిణ ఆశియలో గర్భం కోల్పోతున్నారని పరిసోదనలు వేల్లదిస్తునాయి. దక్షిణ ఆశియలో 3 ౦ % మహిళలు గర్భం కోల్పోతున్నారని అందుకు కారణం కేవలం కలుషిత వాతావరణమే అని నిపుణులు తేల్చారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారత్ దేశాలలో  వాయు కాలుష్యం నాణ్యత గణనీయంగా పడి పోయిందని డబ్ల్యు హెచ్ ఓ  పేర్కొంది. వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు మొగిస్తోందని ఈ విషయంలో సత్వరం నిర్ణయం తీసుకో వలసిన అవసరం ఉందని నిపుణులు తమ పరిశీలనలో పేర్కొన్నారు.  దక్షిణా ఆశియాలో  గర్భిణీలు ప్రపంచం లోనే అత్యంత ప్రమాద కరమైన  దరిద్రమైన వాయుకాలుష్యం వాతావరణం లో మగ్గి పోతున్నారని ఇది దుర  దృష్ట కరమని డబ్ల్యు హెచ్ ఓ అభిప్రాయ పడింది.   డబ్ల్యు హెచ్ ఓ చెప్పిన ప్రమాణాల కన్నా అత్యధిక వాయు కాలుష్యం ఉన్నదన్న విషయాన్ని గమనించి నట్లు నిపుణులు ఈ ప్రభావం వల్లే 3 ౦ % మహిళలు గర్భం కోల్పోవడం  బాధాకరమని నిపుణులు ఆవేదన వ్యక్తం చేసారు. ల్యన్సర్ ఫ్లా నెట్ హెల్త్  లో ఈ అంశాన్ని ప్రచురించారు. 2 ౦ ౦ ౦ - 2 ౦ 1 6 లో ఈ పరిశీలన చేసినట్లుతెలుస్తోంది.ఎపిడమాలజీ  విధానం ద్వారా పి ఎం లెవెల్స్  పరిశీలించారు. వాయు కాలుష్యం తీవ్రత  2 .5 మైక్రాన్లు గా ఉందని కనుగొన్నారు.  వాయుకాలుష్యం వల్ల గర్భ విచ్చిన్నం కావడం, గర్భం దాల్చక పోవడానికి  2 ౦వారాలు పడు తోంది. ఇరవై రోజుల వ్యవధిలోనే జరగాల్సిన నష్టం జరిగి పోడానికి కారణం   పుతిన వెంటనే చని పోవడం జరగడం పట్ల నిపుణులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు.  పుట్టిన పిల్లలు వారంలోనే చని పోవడాన్ని తీవ్ర పరిణామంగా పేర్కొన్నారు.  బంగ్లాదేశ్, భారత్, పాకిస్తాన్,లలో సంవత్సరానికి 2 9 . 7% గర్భం దాలుస్తున్నారని   ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కన్నా 2 . 5 % మైక్రాన్ లెవెల్స్ పెరిగి పోయిందని. దీని వల్ల 3 5 % గర్భ నిరోధం  జరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు.  ఈ పరిశోధన డెమోగ్రాఫిక్  హెల్త్ సర్వ్ ప్రకారం  పరిశీలించి నట్లు నిపుణులు పేర్కొన్నారు. taoxueపోస్ట్ డాక్టర్ రీసెర్చర్ గా పని చేసారు. ఇన్స్టిట్యుట్ ఆఫ్ రిప్రోడక్టివ్ చైల్డ్ హెల్త్  హెల్త్ కీల్యాబో రెట్రీ రేప్రోదక్టివ్ హెల్త్ పికింగ్ యునివర్సిటీ  టోన్ హెల్త్ ప్రతి నిధి తో మాట్లద్దరు'  వాతా వరణ కాలుష్యం నియంత్రణ కు నూతన విధానం రూపకల్పన చెయడ పెద్ద సవాల్ అని టావో   పేర్కొన్నారు. గర్భం కోల్పోడానికి లెక్క పెట్ట లేనన్ని కారణాలు  కొన్ని  వాస్తవాలు  వెలుగు చూసాయని అన్నారు.   కుటుంబ నియంత్రణ  పద్దతులు అవసరం లేకుండానే నియంత్రణ తీవ్ర ఆందోళనకు  గురి చేస్తోందని కొంత మందిలో సాధారణం  గానే జన్మ నివ్వ  డం గమనించామని   తెలిపారు. వాయు కాలుష్యం 2. 5 % మైక్రాన్లు అంతకు మించి  ఎక్కువగా పెరిగితే  గర్భ విచ్చిత్తి, అబార్షన్ లు వంటి అంశాలు చోటు చేసుకుంటున్నాయి.  వాతావరణం లో కాలుష్యం కీలక అంశం గా పేర్కొన్నారు. గర్భిని స్త్రీలు ఎదుర్కొంటున్న  గర్భ విచ్చిత్తి మరణాలు నియంత్రణ కావాలంటే  వాతావరణ వృద్ధి విధానాన్ని అమలు చేయాలని దీని వల్ల ఒత్తిడికి గురికావడం గర్భం తోనే మరణించడం వంటి సమస్యల నుండి బయట పడాలంటే దీని కోసం అయ్యే ఖ   ర్చు పెర్గి పోవడం స్త్రీలకు ఇచ్చే మెటర్నటీ హెల్త్  సెలవులు ఇవ్వడం అత్యవసరమని నిపుణులు సూచించారు.   ఒచ్చే ఆదాయం అంతంత మాత్రం కావడం వల్ల పెరు గు తున్న కాలుష్య ప్రమాదం పొంచి ఉందని వీటి పై సత్వర చర్యలు చెప్పడడం అవసరమని భారత్ కు చెందిన లలిత్ ధన్ దోనా పరిసోదనలు  పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఇండియాకు ప్రభుత్వ ప్రైవేటు భాగ స్వామ్యంలో నడుస్తున్న సంస్థ కాలుష్యం ప్రజా ఆరోగ్యం పై తీవ్రప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యాక్తం చేసారు. కాలుష్యం  పెరిగితే  ఇతర అనారోగ్య సమస్యలు పెరిగి  మరణాలు సంభావించ వచ్చని నిపుణులు ఆభి ప్రయ పడ్డారు. సో మనుషులు కలుషిత మైనా సమాజానికి ముప్పు, వాతావరణం కలుషిత మైన ప్రజలకు ముప్పు. సచిన్ టి ఫిక్ గా ఆలోచించకండి కాస్త ప్రజా ఆరోగ్యం పట్ల ఆలోచించండి. 
ఎండలో ఎక్కువసేపు ఉంటున్నారా.. చర్మం పై ఎర్రని దద్దుర్లు, మంట పుడుతుందా.. అయితే కాస్త జాగ్రత అంటున్నారు నిపుణులు.  ముఖ్యంగా చర్మ క్యాన్సర్ తో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండేలాని సూచిస్తున్నారు. అంతే కాదు చర్మ సమస్యలతో బాధ పడుతున్న వారు విటమిన్ బి3 ఎక్కువగా తీసుకోవడంతో చర్మ క్యాన్సర్ ను అదుపులో ఉంచుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. అదెలాగో చూద్దాం...   సూర్యకాంతి ఆరోగ్యానికి మంచిదే. అలాగని ఎక్కువ సేపు ఎండలో ఉండటం మాత్రం అంత సురక్షితం కాదు. ఎందుకంటే.. సూర్యుడి నుంచి వెలువడే అతి భయానక అల్ట్రా వయోలెట్ (UV) కిరణాల వల్ల చర్మంలోని కణాలు దెబ్బతింటాయి. ఇది కొందరిలో చర్మ క్యాన్సర్‌కు కూడా దారితీస్తుంది. అయితే, తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు ఓ గుడ్ న్యూస్ చెప్పారు.   ఇటలీకి చెందిన పరిశోధకులు నాన్-మెలనోమా స్కిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగుల నుంచి సేకరించిన కొన్ని కణాలు (కెరాటినోసైట్స్) ఐసోలేట్ చేశారు. ఈ కణాలకు మూడు రకాల సాంద్రతలతో ట్రీట్మెంట్ చేశారు. నికోటినామైడ్ (NAM), విటమిన్-B3లను అందించి 18 నుంచి 48 గంటలు యూవీబీ కిరణాల ముందు ఉంచారు. ఫలితాల్లో.. యూవీ వికిరణీకరణానికి ముందు 25 మైక్రోన్ల NAMతో ప్రీట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల యూవీ ప్రేరిత ఆక్సీకరణ వల్ల కలిగే ఒత్తిడి, డీఏయే డ్యామేజ్ నుంచి చర్మ కణాలకు రక్షణ లభించింది. ఈ సందర్భంగా రీసెర్చ్ స్టూడెంట్ లారా క్యామిల్లో మాట్లాడుతూ.. విటమిన్ బీ3 వినియోగం పెంచినకొద్ది చర్మం యూవీ కిరణాల వల్ల కలిగే సమస్యలు తగ్గు ముఖం పట్టాయి. అయితే, విటమిన్‌-బీ3 రక్షణ ప్రభావం తక్కువ. కాబట్టి.. సూర్యరశ్మి సోకడానికి 24 లేదా 48 గంటల ముందు తీసుకోకూడదు అని తెలిపారు. ఈ పరిశోధన భవిష్యత్తులో యూవీ క్యాన్సర్‌కు గురయ్యే బాధితులకు ఊరటనిస్తోంది.
మీరు దీర్ఘ కాలంగా గుండెల్లోమంటతో బాధ పడుతున్నారా...  అయితే అది ఎసొఫెగల్ లారెక్ష్స్ కాన్సర్ కావచ్చు అంటున్నారు నిపుణులు.  దీర్ఘ కాలంలో గుండెల్లో మంటగా ఉంటె అది క్యాన్సర్‌కు దారి తీయవచ్చు. యు ఎస్ ప్రభుత్వం నిర్వ హించిన పరిశీలనలో ఈ విషయం బయట పడింది. 50 సంవత్సరాలు పై బడినవారిలో నిర్వహించిన సర్వేలో ఎసోఫెగల్ రిఫ్లెక్స్ సమస్య ఉంటె వారిలో రెండు ఇంతలు క్యాసర్ వచ్చే అవకాశం  ఉందని దీనీని ఎసోఫేగస్, లేదా లారీ ఎన్ ఎక్ష్ వాయిస్ బాక్స్ పోయేందుకు దోహద పడుతుంది. ఎప్పుడైతే పొట్టలో ఉండే యాసిడ్‌లు  మాయమై ఎసోఫెగస్ కు చేరుతాయో మాస్క్యులర్ ట్యూబ్ ద్వారా గొంతుకు కనక్ట్ కావడం వల్ల గుండెల్లో మంటరావడం సహజం.  అది సాధారణం కంటే ఎక్కువగా ఉంటె వారిలో 20% అమెరికన్ ప్రజలలో ఉన్నట్లు గుర్తించారు.  నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ హెల్త్  దీనిని ఎడినా కాసినోమా లేదా ల్యారీన్ జీల్ కాన్సర్ గా నిర్ధారించారు. ఇది వాయిస్ బాక్స్ లో వస్తుంది. అయితే దీని వల్ల  పెద్దగా ప్రమాదం లేకపోయి నప్పటికీ ఇది క్యాన్సర్ గా మారదని జి ఆర్ డి పై పరిశోదన కేవలం ప్రజలను అప్రమత్తం చేసేందుకే అని అన్నారు.  క్రి స్టాన్ అబ్ నెట్ యు ఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ చెందిన ఈ బృందానికి నేతృత్వం వహించారు. సెల్ కార్సినోమా సహజంగా ఉండేదే అని ఎసోఫెగల్ క్యాన్సర్ కు దానికి గల సంబంధం తెలుసుకోవాలని అన్నారు.