LATEST NEWS
కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పును వ్యతిరేకిస్తూ విపక్ష పార్టీల ఎంపీలు నిరసనకు దిగారు. ఈ పథకం పేరుమార్పునకు వ్యతిరేకంగా  కాంగ్రెస్ సహా విపక్ష నేతలు పార్లమెంట్ ఆవరణలో ధర్నాకు దిగారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పు అన్నది గ్రామీణ పేదల జీవనాధారంపై జరుగుతున్న దాడిగా ఎంపీలు అభివర్ణించారు.   కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గత కొన్నేళ్లుగా   ఉపాధి హామీ  పథకానికి నిధులను నిలిపివేస్తూ, పనులను నిరాకరిస్తూ, గ్రామీణ ప్రజలు ఆకలితో అలమటించేలా చేస్తోందని ఆరోపించారు.  ఉపాధి హామీ పథకాన్ని ఇప్పటికే  ఆచరణలో బలహీనపరిచిన ప్రభుత్వం, ఇప్పుడు దాని ఉనికినే  దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చాలన్న మోడీ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముట్టడి జరుగుతోంది. అఖిల భారత కాగ్రెస్ కమిటీ పిలుపు మేరకు గురువారం (డిసెంబర్ 18)  దేశ వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల మట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.  తెలంగాణలో కూడా  రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముట్టడికి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలోనే  అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ ఆఫీసుల వద్ద డీసీసీల నేతృత్వంలో కాంగ్రెస్ ధర్నాలకు దిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో గాంధీ భవన్, బీజేపీ కార్యాలయాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా భద్రత ఏర్పాట్లు చేశారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పుతో పాటు, నేషనల్ హెరాల్డ్ కేసులో కేంద్రం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను వేధిస్తోందని కాంగ్రెస్  నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.    బీజేపీ కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునివ్వడంపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమ కార్యాలయాలు ముట్టడిస్తామంటే ఊరుకునేది లేదని, ప్రతిఘటిస్తాం, తాటా తీస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేశారు. 
జగన్.. సొంత చెల్లికి కనీసం బర్త్ డే విషెస్ కూడా చెప్పని వ్యక్తిగా మరోసారి వార్తలలో నిలిచారు. ఔను జగన్ చెల్లెలు షర్మిల బుధవారం (డిసెంబర్ 17) తన జన్మదినం జరుపుకున్నారు.  జగనన్న వదిలిన బాణాన్ని అంటూ తన అన్న కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి, 2019 ఎన్నికలలో జగన్ విజయానికి తన వంతు దోహదం చేసిన చెల్లిని అధికారం చేపట్టిన తరువాత జగన్ దూరం పెట్టారు. ఆస్తుల పంచా యితీతో పాటుగా రాజకీయంగా తనకు పోటీ అవుతుందన్న భయంతోనే జగన్ షర్మిలను దూరం పెట్టారన్న ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది.   దీంతో షర్మిల తన మకాం హైదరాబాద్ కు మార్చి కొంత కాలం వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రిగా తెలంగాణ రాజకీయాలలో కీలక భూమిక పోషించారు. అయితే..  గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ గూటికి చేరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతే కాకుండా గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. 2019 ఎన్నికలలో జగన్ విజయంలో షర్మిల కీలక పాత్ర పోషిస్తే.. 2024 ఎన్నికలలో జగన్ ఓటమిలో కూడా ఆమె తన వంతు పాత్ర పోషించారని పరిశీలకులు విశ్లేషణలు కూడా చేశారు.  ఈ పోలిటికల్ డిఫరెన్సెస్ కు తోడు.. జగన్ షర్మిల మధ్య ఆస్తి వివాదాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సరస్వతి పవర్ వాటాల బదలీ వ్యవహారంలో వీరి మధ్య ట్రైబ్యునల్ లో కేసు కూడా నడుస్తోంది.  అది పక్కన పెడితే.. కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల తనవంతు పాత్ర పోషిస్తున్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, వైసీపీలపై ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయంలో ఆమె తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కాంగ్రెస్ గొంతును బలంగా వినిపిస్తున్నారు. అందులో తప్పుపట్టాడినికి ఏమీ లేదు.   కాగా షర్మిల జన్మదినం సందర్భంగా కూటమి నేతలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. వారికి షర్మిల ధన్యవాదాలు తెలుపుతూ బదులిచ్చారు కూడా.  అయితే సొంత అన్న జగన్ షర్మిలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయకపోవడం సరికాదని వైసీపీ వర్గాలలోనే చర్చ జరుగుతోంది. తెల్లారి లేస్తే గాంధీ డైనాస్టీ అంటూ.. సోనియా, రాహుల్, ప్రియాంకలపై విమర్శలతో విరుచుకుపడే ప్రధాని నరేంద్ర మోడీ వారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేస్తుంటారు. అంతెందుకు నిత్యం చంద్రబాబుపై ఏక వచన ప్రయోగంతో విమర్శలు గుప్పించే జగన్ కు కూడా చంద్రబాబు జగన్ పుట్టిన రోజు సందర్భంగా బర్త్ డే విషెస్ చెప్పారు. తద్వారా వారంతా విభేదించడం, భిన్నాభిప్రాయం కలిగి ఉన్నంత మాత్రాన వ్యక్తిగత వైరం ఉండనవసరం లేదని చాటారు. కానీ జగన్ మాత్రం రాజకీయంగానైనా, కుటుంబ పరంగానైనా సరే తనతో విభేదించిన వారిని శత్రువులుగా చూస్తారనడానికి సొంత చెల్లికి బర్త్ డే విషెస్ తెలపకపోవడాన్ని ఉదాహరణగా చూపు తున్నారు పరిశీలకులు. 
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో జరిగిన సంగతి తెలిసిందే. మూడు దశల్లోనూ కూడా కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. మూడో దశలో 4,158 స్థానాల్లో ఎన్నికలు జరగగా, 2,286 పంచాయతీల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు.  మూడు దశల్లో కలిపి 12,726 పంచాయతీలకు ఎన్నికలు జరగగా, కొన్ని మినహా అన్ని స్థానాల్లో ఫలితాలు వచ్చాయి. వీటిలో 7,093 పంచాయతీల్లో  కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. 3,488   స్థానాలలో విజ యం సాధించి బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచి ఉనికి చాటుకుంది.  బీజేపీ 699  స్థానాలలో గెలిచి నామమాత్రపు ప్రభావాన్ని చూపింది.   అదలా ఉంటే మూడో దశలో బుధవారం (డిసెంబర్ 17) మొత్తం 4,159 స్థానాలకుఎన్నికలు జరిగితే ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ మద్దతుదారలు 2,286 స్థానాలు గెలుచుకున్నారు. బీఆర్ఎస్ 1,142, బీజేపీ 242, ఇతరుఅు 479 సానాల్లో విజయం సాధించారు. ఇతరుల్లో సీసీఐ మద్దతుదారులు 24 , సీపీఎం 7 స్థానాలలో విజయం సాధించారు. మూడో విడత ఎన్నికల్లో సిద్దపేట మినహా మిగిలి30 జిల్లల్లోనూ  కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగింది.  కాగా,  పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల తర్వాత అత్యధిక స్థానాలు దక్కించుకున్నది స్వతంత్రులే. స్వతంత్రులే సుమారుగా 10శాతం సీట్లను గెలుచుకున్నారు. అయితే అలా గెలిచిన వారిలో   80 శాతం మంది కాంగ్రె‌స్ రెబల్సే కావడం గమనార్హం. పంచాయతీ ఎన్నికలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులూ ఈ ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి పనిచేయడం సత్ఫలితాలను ఇచ్చింది. మూడో విడత పంచాయతీ పోలింగ్ లోనూ ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.  మూడో విడతలో 85.77 శాతం పోలింగ్‌ నమోదైంది. రెండో విడతతో పోలిస్తే ఇది   0.9 శాతం తక్కువ. కాగా మూడు విడతలూ కలిసి మొత్తం 85.30 శాతం ఓటింగ్ నమోదైంది. చివరి మూడో విడతలో యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 92. 56 శాతం ఓటింగ్ జరగగా,  నిజామాబాద్ జిల్లాలో అత్యల్పంగా 76.45 శాతం పోలింగ్‌  జరిగింది. ఇలా ఉండగా నూతనంగా ఎన్నికైక సర్పంచ్ లు  ఈ నెల 22న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ముందుగా ప్రకటించిన మేరకు డిసెంబర్ 20న ముహూర్తం మంచిగా లేదంటూ ఎన్నికైన సర్పంచ్ లు తెలపడంతో ప్రభుత్వం ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని ఈ నెల 22కు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.20న ముహూర్తం సరిగా లేదని కొత్తగా ఎన్నికైన సర్పంచులు,వార్డు సభ్యులు కోరడంతో ప్రభుత్వం తేదీని మార్చినట్లు తెలిపింది.
  తెలంగాణ మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు ప్రభంజనం సృష్టిస్తోంది. మూడోవంతు సర్పంచ్ స్థానాలను హస్తం పార్టీ కైవసం చేసుకుంది. బీఆర్‌ఎస్ పార్టీ, బీజేపీ కలిపినా 30 శాతం కూడా దాటలేదు. మొత్తం 4,158 స్థానాల్లో ఎక్కువ చోట్ల గెలిచి ఆధిక్యాన్ని చాటారు. భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్‌ భూపాల్‌పల్లి, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌, మంచిర్యాల, నాగర్‌ కర్నూల్‌, నల్గొండ, నిజామాబాద్‌, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్‌, కామారెడ్డి, ఖమ్మం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్‌ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు.  రాత్రి 8 గంటల వరకు కాంగ్రెస్‌ పార్టీ ఏకగ్రీవాలతో కలిపి 1850, బీఆర్ఎస్ 960, బీజేపీ 180, ఇతరులు 390 సర్పంచ్‌ స్థానాల్లో గెలు పొందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం, గుండ్లరేవు గ్రామంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గుండ్లరేవు గ్రామంలో మూడో దశలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. భూక్యా చంద్రబాబు, బానోత్ జగన్నాథం అలియాస్ జగన్ ఇద్దరు వ్యక్తులు పోటీ చేశారు. ఏపీ రాజకీయ నాయకుల పేర్లతో వీరి పేర్లు ఉండటంతో గ్రామంలో ప్రచారం కూడా ఆసక్తికరంగా జరిగింది. వారి ప్రచారం కూడా 'చంద్రబాబు', 'జగన్' పేర్లతోనే ఎక్కువగా సాగింది. ఈరోజు జరిగిన పోలింగ్‌లో బానోత్ జగన్‌పై భూక్యా చంద్రబాబు విజయం సాధించారు. దీంతో 'జగన్‌పై చంద్రబాబు విజయం' అంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది  
ALSO ON TELUGUONE N E W S
          -సిజ్జు విడాకులు ఎందుకు ఇచ్చాడు! -సిజ్జు భార్య ఎవరు  -విడాకులకి కారణం ఏంటి!      దేవిశ్రీప్రసాద్ మొట్టమొదటి మూవీ 'దేవి' సినిమాని, అందులోని సాంగ్స్ ని మర్చిపోవడం ఇప్పట్లో ఎవరి తరం కాదు.  లెజండ్రీ డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో 1999 లో వచ్చిన  ఈ మూవీ ద్వారా హీరోగా పరిచయమై మంచి పేరు సంపాదించాడు సిజ్జు. మలయాళ చిత్ర సీమకి చెందిన సిజ్జు ఆ తర్వాత పలు చిత్రాల్లో చేసి మంచి పేరు సంపాదించాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ప్రాధాన్యత గల క్యారెక్టర్స్ ని పోషిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. నువ్వు నాకు నచ్చావు, సింహరాశి. మనసంతా నువ్వే. శివరామరాజు, శతమానం భవతి,బ్లఫ్ మాస్టర్, రాబిన్ హుడ్  వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే సిజ్జు రీసెంట్ గా  పోస్ట్ చేసిన  నోట్ ఒకటి అభిమానులని షాక్ కి గురి చేస్తుంది.       సదరు నోట్ లో 'నా భార్య ప్రీతీ ప్రేమ్ నేను పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. దంపతులుగా విడిపోయినా స్నేహితులుగా కొనసాగుతాం. అధికారకంగా విడాకులు కూడా  మంజూరు అయ్యాయి.ఈ విషయాన్ని అర్ధం చేసుకొని మా ఇద్దరిపై పుకార్లు సృష్టిస్తు మా ఇద్దరి వ్యక్తిగత గోప్యానికి ఎలాంటి భంగం కలిగించవద్దు. ఈ విషయంలో ప్రతి ఒక్కర్ని అభ్యర్దిస్తున్నాను. ఇకపై మేము విడివిడిగా జీవితాన్ని కొనసాగిస్తామని ఇనిస్టాగ్రమ్ లో నోట్  ని  రిలీజ్ చేసాడు.     Also read:   ఛావా క్లైమాక్స్ సీన్ పై విక్కీ కౌశల్ కీలక వ్యాఖ్యలు.. ఇప్పుడే ఎందుకని      సిజ్జు, ప్రీతీ ప్రేమ్ ది లవ్ మ్యారేజ్. మతాలు వేరు కావడంతో ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరి పెళ్లి చేసుకున్నారు. 2008 లో ఈ ఇద్దరి వివాహం జరగగా ఒక కూతురు కూడా ఉంది. అలాంటిది ఇప్పుడు పదిహేడేళ్ల వైవాహిక జీవితానికి పుల్ స్టాప్ పెడుతూ విడిపోవడం మలయాళ చిత్ర పరిశ్రమలో చర్చినీయాంశమయ్యింది. సిజ్జు పూర్తి పేరు సిజు అబ్దుల్  రషీద్.  ఎయిర్ హోస్ట్ గా పని చేసిన ప్రీతీ ఒక క్రిస్టియన్.     
  హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్(James Cameron) సృష్టించిన అద్భుతం 'అవతార్'కి తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ నుంచి మూడో భాగంగా 'అవతార్: ఫైర్ అండ్ యాష్' వస్తోంది. రేపు(డిసెంబర్ 19) ప్రేక్షకుల ముందుకు రానున్న అవతార్-3.. ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. (Avatar: Fire and Ash)   2009 డిసెంబర్ లో విడుదలైన అవతార్ మూవీ, తెలుగు రాష్ట్రాల్లో రూ.23 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఆ సమయంలో ఒక డబ్బింగ్ సినిమా ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం గొప్ప విషయం. ఇక 'అవతార్-2' మూవీ 2022 డిసెంబర్ లో విడుదల కాగా.. తెలుగునాట ఏకంగా రూ.101 కోట్ల గ్రాస్ రాబట్టింది. (Avatar 3)   Also Read: కన్నె పిట్టరో కన్ను కొట్టరో.. డెకాయిట్ టీజర్ అదిరింది!   ప్రస్తుతం తెలుగు స్టేట్స్ లో 'అఖండ-2' విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. పైగా, 'అవతార్-2' స్థాయిలో 'అవతార్-3'పై ఎందుకనో హైప్ రాలేదు. దీంతో మళ్ళీ తెలుగునాట ఆ రేంజ్ లో ప్రభావం చూపుతుందా లేదా? అనే చర్చ జరుగుతోంది. 'అవతార్-3' రూ.50 కోట్ల దాకా రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవేళ జేమ్స్ కామెరూన్ బిగ్ స్క్రీన్ పై మళ్ళీ మ్యాజిక్ చేస్తే.. ఆ నెంబర్ పెరిగే ఛాన్స్ ఉంది అంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.    
Adivi Sesh, renowned for his streak of innovative thrillers, is set to push boundaries again with his most ambitious project, Dacoit. The makers recently unveiled the teaser, offering a glimpse into a world that is as emotionally raw as it is action-packed. The narrative centers on a fractured love story, featuring Mrunal Thakur in a powerhouse performance that transitions seamlessly between innocence and profound anguish. The film's gravity is further bolstered by an elite ensemble cast, including acclaimed filmmaker Anurag Kashyap, alongside veterans Prakash Raj and Atul Kulkarni, promising intense on-screen confrontations. Adivi Sesh shines in a rugged avatar, mastering a sharp Rayalaseema dialect that adds a layer of authenticity to his commanding screen presence. Under the brilliant direction of Shaneil Deo, the teaser emerges as a technical marvel. Cinematographer Danush Bhaskar captures visceral, dusty landscapes, while Gyaani’s pulse-pounding score—highlighted by a high-energy remix of the iconic "Kanne Pittaro"—elevates the tension. Produced by Supriya Yarlagadda and presented by Annapurna Studios, the film boasts top-tier production values. Dacoit is slated for a grand worldwide theatrical release on March 19, 2026, perfectly timed for the Ugadi festivities. It promises to be a brutal, emotional, and unforgettable cinematic experience for the Telugu New Year. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
  విభిన్న సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు అడివి శేష్. ఆయన నటించిన సినిమా అంటే.. అందులో కంటెంట్ బాగుంటుందనే అభిప్రాయం ప్రేక్షకులలో ఉంటుంది. అలాంటి శేష్ నుంచి.. 2022లో వచ్చిన 'మేజర్', 'హిట్-2' తర్వాత హీరోగా సినిమా రాలేదు. శేష్ ప్రేక్షకులను పలకరించి మూడేళ్లు అయిపోయింది. ఆ లోటుని భర్తీ చేసేలా.. 2026లో 'డెకాయిట్', 'గూఢచారి-2' సినిమాలతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు.   అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న మూవీ 'డెకాయిట్'. శనియేల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, ఉగాది కానుకగా 2026 మార్చి 19న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.   నిమిషంన్నర నిడివితో రూపొందిన 'డెకాయిట్' టీజర్ ఆకట్టుకుంటోంది. 'ఒక ప్రేమ కథ' అనే ట్యాగ్ లైన్ తో వస్తున్నప్పటికీ.. ఇందులో రొమాన్స్ కంటే కూడా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉండనున్నాయని టీజర్ చూస్తే అర్థమవుతోంది. జైలు నుంచి వచ్చిన క్రిమినల్ పాత్రలో శేష్ కనిపిస్తున్నాడు. మృణాల్ తో కలిసి శేష్ ఒక రాబరీ చేయడానికి సిద్ధపడటం? అందులో వాళ్ళు సక్సెస్ అయ్యారా లేదా? అనే కోణంలో టీజర్ ను కట్ చేశారు.    టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా 'కన్నె పిట్టరో కన్ను కొట్టరో' సాంగ్ రావడం హైలైట్ గా నిలిచింది. ఆ సాంగ్ టీజర్ కి కొత్త లుక్ తీసుకొచ్చింది. అలాగే, టీజర్ లో అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్ వంటి ప్రముఖ నటులు కనిపించారు. ముఖ్యంగా అనురాగ్ కశ్యప్ మైక్ లో "ఓ..ఓ.." అని హమ్ చేస్తుండగా టీజర్ ఎండ్ అవ్వడం మెప్పించింది.    Also Read: రాజా సాబ్ సాంగ్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ రియాక్షన్!   'డెకాయిట్'లో అడివి శేష్, మృణాల్ ప్రేమించుకొని విడిపోతారు. ఈ మాజీ ప్రేమికులు ఒక క్రైమ్ వల్ల మళ్ళీ కలవాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఎదురైన పరిస్థితులు.. ట్విస్ట్ లు, ఛేజ్ లు, థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ తో ఈ సినిమా నడవనుందని తెలుస్తోంది.    
    -ఏం చెప్పాడు! -క్లైమాక్స్ అప్పుడు ఏం జరిగింది -షూట్ ఎలా చేసారు       మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, హిందువుల ఆరాధ్య దైవం 'ఛత్రపతి శివాజీ(chhatrapati shivaji)మహారాజ్' కొడుకు 'ఛత్రపతి శంభాజీ మహారాజ్'(chhatrapathi  sambhaji Maharaj)జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ఛావా'(chhaava). ఈ ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరి 5 న భారత దేశ వ్యాప్తంగా విడుదలై బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో పాటు తెలుగులోను డబ్ అయ్యి మంచి ఫలితాన్నే చవి చూసింది. ఇక ఈ  మూవీ క్లైమాక్స్ లో శంభాజీ మహారాజ్ ని ఔరంగజేబు చిత్ర హింసలకి గురి చేసే సన్నివేశం ఎంతో మందిని కంటతడిపెట్టించింది. ఇనుప సువ్వలతో ఒళ్ళంతా రక్తం కారేలా చిత్ర హింసలకి గురి చేస్తున్నా, కళ్ళని పొడుస్తున్నా శంభాజీ మహారాజ్ తాను అనుకున్న లక్ష్య సాధన కోసం నిలబడతాడు. గూస్ బంప్స్ తెప్పించే స్థాయిలో పిక్చరైజేషన్ జరుపుకోవడంతో పాటు ఒరిజినల్ గానే సదరు సన్నివేశం జరుగుతుందన్నట్టుగా కూడా అనిపించింది.      రీసెంట్ గా చాలా రోజుల తర్వాత  సదరు సన్నివేశం గురించి శంభాజీ మహారాజ్ క్యారెక్టర్ లో విజృంభించి నటించిన 'విక్కీ కౌశల్'(Vicky Kaushal)మాట్లాడుతు 'క్లైమాక్స్ సీక్వెన్స్ ని  తెరకెక్కించడం అనుకున్నంత సులంభం కాదు. సన్నివేశం ప్రారంభించిన మూడవ రోజు చిత్రీకరణ టైంలోనే  నేను గాయపడ్డాను. దాంతో నెలన్నర రోజులు షూటింగ్ ని ఆపేశాం. సెట్ ని తీసేసి మళ్ళీ రెండు నెలల తర్వాత సెట్ ని ఏర్పాటు చేసారు. అందుకు మరో పన్నెండు రోజుల సమయం పట్టింది..శంభాజీ మహారాజ్ గురించి ప్రపంచానికి చెప్పాలని నాతో సహా ప్రతి ఒక్కరం వంద శాతం కష్టపడ్డారని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ మాటలు అభిమానులతో పాటు ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నాయి.     Aslo read:  శివాజీ పశ్చాత్తాపడుతున్నాడా! పూర్తి క్లారిటీ వచ్చేసింది    చావా కలెక్షన్స్ విషయానికి వస్తే సుమారు 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కి 800 కోట్లు దాకా రాబట్టింది. రష్మిక(Rashmika Mandanna),అక్షయ్ ఖన్నా(Akshay Khanna)కూడా తమ తమ క్యారెక్టర్స్ లో అత్యద్భుతంగా నటించి విజయంలో బాగస్వామ్యులయ్యారు.ఇక విక్కీ కౌశల్ ప్రస్తుతం 'లవ్ అండ్ వార్' అనే మూవీలో చేస్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ సదరు చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.  
        -అసలు ఏం చెప్పాడు? -ఇప్పుడు ఏమంటున్నాడు -అసలు మ్యాటర్ ఏంటి!       తెలుగు చిత్ర పరిశ్రమకి, శివాజీ(Sivaji)కి మధ్య ఉన్న అనుబంధం యొక్క వయసు రెండున్నర దశాబ్దాల పైనే.  1997 లో వచ్చిన చిరంజీవి హిట్ మూవీ 'మాస్టర్' తో ఎంట్రీ ఇచ్చి క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో చేస్తూ తన కంటూ ఒక 'ఎరా' ని సృష్టించుకున్నాడు. కొంత కాలం తర్వాత కోర్టు మూవీతో మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై తన హవా చాటడం స్టార్ట్ చేసిన శివాజీ ఈ నెల 25 న క్రిస్మస్ కానుకగా 'దండోరా' మూవీతో థియేటర్స్ లో అడుగుపెట్టనున్నాడు. ప్రచార చిత్రాలు బాగుండటంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి.     కొన్ని రోజుల క్రితం శివాజీ మాట్లాడుతు టికెట్ ధరలని పెంచడం వల్లే తొంబై తొమ్మిది శాతం మంది ప్రేక్షకులు థియేటర్లకి దూరమవుతున్నారనే వ్యాఖ్యలు చేసిన విషయం  తెలిసిందే. దీంతో సదరు వ్యాఖ్యలు సినీ సర్కిల్స్  లో వైరల్ గా మారాయి. తాను చేసిన ఆ వ్యాఖ్యలపై  'దండోర' (Dandora)ప్రచార కార్యక్రమాల్లో మరోసారి శివాజీ మాట్లాడుతు ప్రస్తుతం   ఉన్న సందర్భాన్ని అందరికి గుర్తు చేయాలనే మాట్లాడతాను తప్ప ఉద్దేశపూర్వకంగా ఎప్పుడు మాట్లాడను. ఏ విషయంలోనైనా నిజం మాట్లాడటం నా అలవాటు, నేను చేసిన కామెంట్స్ ని  తప్పుగా అర్థం చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.      Also read:   ధురంధర్ సినిమా డైరెక్టర్ భార్య తెలుగు హీరోయిన్.. బాక్స్ ఆఫీస్ షేక్      ఇదే విధంగా  ఐబొమ్మ రవి గురించి మాట్లాడాను. అతడికి ఉన్న తెలివితేటలని మంచి పనులకి  ఉపయోగించుకుంటే బాగుంటుందని చెప్పాను. కానీ అతను చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు కాబట్టి తప్పు చేసినట్లే అని కూడా చెప్పా. ఆ కామెంట్స్ విషయంలో నేను పశ్చాత్తాపడడం లేదు అని మరోసారి తన వ్యాఖ్యలపై పూర్తి క్లారిటీ ఇచ్చాడు.           
  రాజా సాబ్ సాంగ్స్ పై ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు నిరాశపరిచిన ఫస్ట్ సింగిల్! సెకండ్ సింగిల్ అంచనాలు అందుకుందా?   'ది రాజా సాబ్'(The Raja Saab) ఆల్బమ్ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ కి ఎన్నో అంచనాలు ఉన్నాయి. వింటేజ్ ప్రభాస్ ని చూడబోతున్నారని ముందు నుంచి మూవీ టీమ్ చెబుతుండటంతో.. డార్లింగ్, మిర్చి రోజులను గుర్తుచేసేలా అదిరిపోయే సాంగ్స్ ఉంటాయని అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు. కానీ, ఆ అంచనాలను అందుకోవడంలో ఫస్ట్ సింగిల్ ఫెయిల్ అయింది.   తమన్ సంగీతం అందిస్తున్న 'రాజా సాబ్' నుంచి ఫస్ట్ సింగిల్ గా 'రెబల్ సాబ్'(Rebel Saab) సాంగ్ నవంబర్ లో విడుదలైంది. రిలీజ్ కి ముందు ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఫ్యాన్స్.. తీరా రిలీజ్ అయ్యాక బాగా డిజప్పాయింట్ అయ్యారు. ప్రభాస్ రేంజ్ కి తగ్గట్టుగా సాంగ్ లేదని మెజారిటీ ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు.   ఇటీవల కాలంలో పలువురు స్టార్ హీరోల సినిమాల నుంచి ఫస్ట్ సింగిల్స్ విడుదలయ్యాయి. దాదాపు ఆ పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచి, సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఆ లిస్టులో 'రాజా సాబ్' ఫస్ట్ సింగిల్ చేరకపోవడం.. అభిమానులను నిరాశపరిచింది.   Also Read: 'డేవిడ్ రెడ్డి' గ్లింప్స్.. ఇది కదా పాన్ ఇండియా ప్రాజెక్ట్ అంటే..!   ఇప్పుడు 'రాజా సాబ్' నుంచి సెకండ్ సింగిల్ గా 'సహనా సహనా'(Sahana Sahana) అనే పాట వచ్చింది. ప్రోమోతోనే ఈ మెలోడీ సాంగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఫుల్ సాంగ్ కి కూడా ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ రియాక్షన్ వస్తోంది. 'అల వైకుంఠపురములో' సినిమాలోని 'సామజవరగమన' స్థాయిలో కాకపోయినా.. సహనా సాంగ్ బాగానే ఉందని, ఇది స్లో పాయిజన్ లా ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.   మొత్తానికి 'రాజా సాబ్' ఫస్ట్ సింగిల్ తో అభిమానులను నిరాశపరిచిన తమన్.. సెకండ్ సింగిల్ తో మంచి స్పందననే రాబడుతున్నాడు. మరి రాబోయే పాటలు ఎలా ఉంటాయో చూడాలి.    
      -ఎవరు ఆ హీరోయిన్  -ప్రేమించి పెళ్లి చేసుకున్నారు -రికార్డు కలెక్షన్స్      ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 'ధురంధర్'(Dhurandhar)తన ప్రభంజనాన్ని యధావిధిగా కొనసాగిస్తోంది. డిసెంబర్ 5 న సెల్యులాయిడ్ పై అడుగుపెట్టగా ఇప్పటి వరకు నాలుగువందల కోట్లకి పైగా సాధించి ఐదువందల కోట్ల మార్కుకి చేరువలో ఉంది.  ప్రేక్షకులతో పోటాపోటీగా సినీ, రాజకీయ, క్రికెట్ సెలబ్రటీస్ కూడా ధురంధర్ ని వీక్షిస్తుండటంతో ఈ ఏడాది హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించే మూవీగా నిలిచే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. రీసెంట్ గా ఈ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు 'ఆదిత్య దర్'(Aditya Dhar)కి సంబంధించిన పర్సనల్ న్యూస్ ఒకటి అభిమానులని విశేషంగా ఆకర్షిస్తుంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ న్యూస్ ఏంటో చూద్దాం.     ఆదిత్య దర్ భార్య ప్రముఖ హీరోయిన్ 'యామి గౌతమి'(Yami Gautam). సినిమాల్లోకి రాక ముందు అనేక వాణిజ్య ప్రకటనల్లో కనిపించగా 'ఫెయిర్ అండ్ లవ్లీ' యాడ్ మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 2011 లో రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన 'నువ్విలా' చిత్రంతో తెలుగు పరిశ్రమకి పరిచయమవ్వగా, ఆ తర్వాత అల్లు శిరీష్ డెబ్యూ మూవీ 'గౌరవం', తరుణ్ తో యుద్ధం, నితిన్ తో కొరియర్ బాయ్ కళ్యాణ్ వంటి చిత్రాల్లో కనిపించి తన నటనతో తెలుగు ప్రేక్షకులని  మెప్పించింది. పలు హిందీ, తమిళ, కన్నడ చిత్రాల్లో కూడా చేసి తన సత్తా చాటగా, 2024 లో తనే ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆర్టికల్ 370 చిత్రంతో సోలో విజయాన్ని అందుకుంది. ఇక 2019 లో ఆదిత్య దర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఉరి' అనే చిత్రంలో చేసిన సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడంతో  2021లో పెళ్లి చేసుకున్నారు. ఆదిత్య దర్ మొదటి మూవీ కూడా అదే. జాతీయ అవార్డుని కూడా తెచ్చిపెట్టింది.     Also read:  థియేటర్‌కి వెళ్లి మరి అగ్ర హీరో మూవీ చూసిన టీమిండియా క్రికెటర్లు.. ఫ్యాన్స్ హంగామా       ఈ ఏడాది ఫిబ్రవరి లో ఆదిత్య దర్ నిర్మాతగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చిన ధూమ్ ధామ్ తో పాటు ఇమ్రాన్ హష్మీ తో హక్ అనే సినిమాలో చెయ్యగా నవంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆదిత్య దర్ కెరీర్ విషయానికి వస్తే ఉరి తర్వాత ఆర్టికల్ 370, ధూమ్ ధామ్, బారాముల్లా వంటి చిత్రాలకి రైటర్ గా పనిచేశారు. ఆరు సంవత్సరాల తర్వాత 'ధురంధర్' తో వచ్చి ఇండియా సినిమా తన వైపు చూసేలా చేసుకున్నాడు.        
Prabhas is undeniably the biggest star of indian Cinema but his fans seem to be bringing a bad name to his "Good Boy" image. At the second single, Sahana Sahana from highly anticipated horror-comedy, The Raja Saab, launch event, people witnessed unprecedented scenes. The event at Lulu Mall turned into a site of immense ruckus as hundreds of "Rebel Star" fans overwhelmed the venue to catch a glimpse of their favorite stars. The star-studded event was attended by lead actresses Nidhhi Agerwal and Riddhi Kumar, along with music composer S. Thaman, director Maruthi Dasari, producer TG Vishwa Prasad, and creative producer SKN. Addressing the massive gathering, Director Maruthi expressed immense confidence in the film’s Sankranti release, boldly declaring, "This Pongal is Rebel Pongal!"   However, the excitement quickly spiraled as the crowd breached safety barriers, causing significant congestion and minor damage to mall property. They faught with the leading ladies security teams as they surged towards them while they were leaving the Mall, post event.  While the "Rebel" mania is undeniable, industry experts and mall management have issued a plea for restraint. While celebrating their idol, fans must behave responsibly and ensure that public spaces and mall property are not damaged during such high-profile events. With the film set for a grand January 9 release, the team hopes future celebrations remain safe for all. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.   
Ram Charan has been busy completing his portions for his upcoming biggie, Peddi. Meanwhile, the rumors have been aplenty that he is playing a cameo in Manchu Manoj's David Reddy. The actor released glimpse today and interacted with press after the launch.  When media asked him about the cameo, Manchu Manoj said, "There is a chance for cameo in the script and the film. We have not decided yet on who will appear in it. But we have plans to bring in a big star only. Still, the discussions are going on about how to go forward about them. Nothing has been finalised."    Manchu Manoj categorically denied asking Charan or Jr. NTR to appear in cameos in his film. Currently, the movie shoot is progressing at a rapid pace. Ujwal Kulkarni and Ravi Basrur, who worked for KGF franchise and Salaar are working for this one.  The movie is set in British Regime India and it talks about a rebel who decided to end the horror of British rule during Jallianwala Bagh massacre. Hanuma Reddy Yakkanti is directing the film with Motukuri Bharath and Nallagangula Venkat Reddy are producing it.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  పెళ్లయ్యాక భార్యభర్తల మద్య గొడవలు అనేవి చాలా సహజం.  చాలా మంది భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఇంటి గొడవలు అని చెబుతారు. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలే అయినా,  ఇంటికి, కుటుంబానికి సంబంధించినవి అయినా టోటల్ గా ప్రతి భార్యభర్త జంట మధ్య కొన్ని గొడవలు కామన్ గా జరుగుతాయని రిలేషన్షిప్ నిపుణులు చెబుతున్నారు.పెళ్లయ్యాక ప్రతి జంట మధ్య జరిగే కామన్ గొడవలు ఏంటో తెలుసుకుంటే.. ఇవి అందరి మధ్యన జరుగుతాయి కాబట్టి వీటిని సీరియస్ గా తీసుకుని బంధాన్ని విచ్చిన్నం చేసుకోకూడదు అని ప్రతి జంట అర్థం చేసుకోగలుగుతుంది.  ఇంతకీ అందరు భార్యాభర్తల మధ్య కామన్ గా జరిగే గొడవలు ఏంటో తెలుసుకుంటే.. తల్లిదండ్రుల శైలి.. భార్యాభర్తల ఇద్దరి తల్లిదండ్రులు ఒకరి కుటుంబ విధానాన్ని మరొకరు విమర్శించుకోవడం చాలా కుటుంబాలలో కనిపిస్తుంది. ఒకరేమో చాలా నిర్లక్ష్యంగా పెంచారు అనే నిందలు వేస్తుంటారు, మరొకరు ఏమో ఏమీ చేత కాకుండా పెంచారని అంటారు, కొన్నిసార్లు చాలా స్ట్రిక్ట్ గా పెంచి పిరికివాళ్లుగా మార్చారని అంటారు.  ఇలా రెండు కుటుంబాలలో విబిన్న విధాలుగా పెంపకం ఉంటుంది.  పెళ్లైన తర్వాత వారికి చిన్నతనం నుండి అలవాటైన విధానం ఇప్పుడు కూడా కొనసాగాలని కోరుకుంటారు.   అంతేకాదు.. తమ చిన్నతనం ఎలా గడిచిందో అదే విధంగా తమ పిల్లలను కూడా పెంచాలని చూస్తారు. ఇది ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబంలో సాగే గొడవ.  దీన్ని వీలైనంత చాకచక్యంగా పరిష్కరించుకోవాలి. డబ్బు.. డబ్బు చాలా ముఖ్యమైన అంశం.  కొన్ని కుటుంబాలు డబ్బుల విషయంలో చాలా ఆంక్షలు విధిస్తూ పెంచుతారు. మరికొన్ని కుటుంబాలు డబ్బు అనేది పిల్లల కోసమే కదా అనే ఆలోచనతో పిల్లలకు డబ్బు అలవాటు చేస్తారు, డబ్బు వల్ల వచ్చే సమస్యలు కొన్నిసార్లు చాలా తీవ్రమైన గొడవలకు కారణం అవుతాయి. భార్యాభర్తల అభిరుచులు డబ్బు విషయంలో ఒకటిగా ఉంటే పర్లేదు. కానీ ఒకరు పొదుపరి,  మరొకరు బాగా ఖర్చు పెట్టేవారు అయితే చాలా గొడవలు వస్తుంటాయి.  ముఖ్యంగా ఎప్పడైనా డబ్బు కారణంగా ఇంట్లో  ఆర్థిక సమస్యలు వస్తే జరిగే గొడవలు చాలా పెద్దగా ఉంటాయి. సాన్నిహిత్యం.. భార్యాభర్తల మధ్య మంచి అనుబంధం ఉండాలంటే వారి మధ్య సాన్నిహిత్యం కూడా చాలా బాగుండాలి. ఒకరు తమ ప్రేమను ఎక్స్పెస్ చేయగలిగితే మరొకరు అలా ప్రేమను ఎక్ప్రెస్ చేయకుండా తమలోనే దాచుకుంటారు.  దీని వల్ల ఒకరి మీద ఒకరికి విబిన్న అభిప్రాయాలు ఏర్పడతాయి.  ప్రేమించడం తెలియదు, ప్రేమ లేదు,  ప్రేమ లేకుండా పెళ్లి చేసుకున్నారు వంటి అపార్థాలు వస్తాయి.  ఎప్పుడు ప్రేమ గురించి తప్ప బాధ్యతగా ఉంటున్నానని ఆలోచించట్లేదు అని మరొకరు అనుకుంటారు. ఇలా చాలా విధాలుగా అపార్థాలు వస్తుంటాయి. భవిష్యత్తు.. పెళ్లైన ప్రతి జంటకు భవిష్యత్తు గురించి కొన్ని కలలు ఉంటాయి. పిల్లల కోసం ఒకరు కష్టపడతారు, మరొకరు కెరీర్ ను కూడా వదిలేసుకుంటారు.  జీవితంలో లక్ష్యాల కోసం ఒకరు ఆరాటపడతారు,  నేను ఎన్ని త్యాగాలు చేసినా నన్ను అర్థం చేసుకోవట్లేదు అని ఒకరు అనుకుంటారు.  ఇలా చాలా విధాలుగా ఇద్దరూ తమలో తాము సంఘర్షణ పడుతుంటారు.  వీటి వల్ల కూడా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. పైన పేర్కొన్న  ప్రతి గొడవ పెళ్లైన ప్రతి జంట మధ్య తప్పనిసరిగా జరుగుతుంది.  కేవలం తమ మద్య మాత్రమే గొడవ జరుగుతుందనే ఆలోచన చేస్తూ గొడవ జరిగినప్పుడు దానికి గల కారణాన్ని సమస్యగా చూసి దాన్ని పరిష్కరించుకోవాలి. అంతే కానీ భాగస్వామినే సమస్యగా చూస్తే ఆ బందం పెళుసుగా మారుతుంది.  అంతేకాదు.. భార్యాభర్తల మద్య గొడవలు జరిగినప్పుడు,  సమస్య వచ్చినప్పుడు రాజీ పడటం ప్రధానం.  ఎవరో ఒకరు రాజీ పడితే తప్ప బందం నిలవదు.  రాజీ పడటం అంటే తాము ఓడిపోవడం,  చిన్నతనం కావడం కాదు.. బంధాన్ని నిలబెట్టుకోవడం.                           *రూపశ్రీ. 
నేటి కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సహా అన్ని రంగాలలో రాణిస్తున్నారు.  అన్ని పనులు చేయగలుగుతున్నారు. కొన్ని సందర్బాలలో అబ్బాయిల కంటే ధైర్యాన్ని చూపగలుగుతున్నారు. అయినా సరే అమ్మాయిల విషయంలో సమాజం నుండి ఇంటి వరకు ప్రతి చోట ఒక చిన్నతనం కనిపిస్తుంది.  కొన్ని ప్రశ్నలు అమ్మాయిలను చాలా అసౌకర్యానికి గురి చేస్తుంటాయి. అమ్మాయిలను ఎప్పుడు అడగకూడని ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. వీటిని అడగకుండా ఉండటం వల్ల అమ్మాయిల గౌరవాన్ని కాపాడటమే కాకుండా వారి మానసిక స్థితిని కూడా కాపాడిన వాళ్లమవుతాము.  ఇంతకీ అమ్మాయిలను ఎప్పుడూ అడగకూడదని ప్రశ్నలేంటి? ఆ ప్రశ్నలను ఎందుకు అడగకూడదు? తెలుసుకుంటే.. శరీరం గురించి.. అమ్మాయిలు లావుగా  ఉండటం లేదా చాలా సన్నగా ఉండటం చాలామందిలో ఉంటుంది.  ఇది పైకి కనిపించే విషయమే.  ఎప్పుడైనా సరే అమ్మాయిలను కామెడీ కోసం లేదా సీరియస్ గా అయినా శరీర ఆకృతి గురించి,  బరువు గురించి అస్సలు అడగకూడదు.  ఇంత లావుగా ఉన్నావేంటి.. లేదా ఇంత సన్నగా ఉన్నావేంటి? వంటి ప్రశ్నలు ఎప్పుడూ వేయకూడదు. ఇది బాడీ  షేమింగ్ చేయడం కిందకు వస్తుంది.  ఇలా చేయడం వల్ల అమ్మాయిల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. శరీరం లావుగా లేదా సన్నగా ఉండటానికి చాలామంది అన్ని జాగ్రత్తలు తీసుకున్నా హార్మోన్స్ ప్రాబ్లమ్ వల్ల అలా ఉంటారు. దీనికి కామెంట్ చేస్తూ ప్రశ్నించడం తప్పు. పిల్లలు.. పెళ్లైన ప్రతి స్త్రీ కి ఎదురయ్యే ప్రశ్న పిల్లల గురించి.  కొత్తగా పెళ్లైన దగ్గర నుండి  పిల్లలు కలగడం ఆలస్యమయ్యే వారి వరకు ఎప్పుడూ పిల్లలను ఎప్పుడు కంటావ్ అని అడుగుతారు.  పిల్లలను కనాలనే నిర్ణయం కేవలం అమ్మాయిలది మాత్రమే కాదు.. వారి కుంటుంబానిది, మరీ ముఖ్యంగా భర్త కూడా దీనికి కీలకం.  అందుకే పిల్లల గురించి మహిళలను పదే పదే ప్రశ్నలు వేయకూడదు. ఇది వారిని మానసిక  ఒత్తిడికి గురి చేస్తుంది. వివాహం.. వయసు పెరుగుతున్నా వివాహం ఆలస్యం అవుతున్న అమ్మాయిలు కూడా ఉంటారు. లేదంటే భర్త చనిపోయిన తరువాత వివాహం చేసుకోకుండా అలాగే ఉండిపోయిన మహిళలు కూడా ఉంటారు. ఇలాంటి వారితో ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని ప్రశ్నలు వేయకూడదు. వివాహం  అనేది  మహిళల వ్యక్తిగతం. అలాగే అది కుటుంబ సమస్య కూడా.  దీని గురించి ప్రశ్నించడం వల్ల వారి ఆత్మగౌరవం దెబ్బతింటుంది. వృత్తి.. మగవారికి వారి జీవితకాలం వృత్తి పరమైన కెరీర్ ఉంటుంది. కానీ చాలామందికి  మహిళలు తమ కెరీర్ మధ్యలో వదిలేస్తారు అనే ఆలోచన ఉంటుంది.  పెళ్లి అయిన తరువాత  పిల్లలు పుడితే ఇక మహిళలు తమ కెరీర్ ను కొనసాగించలేరేమో అనే అభిప్రాయంతో ఉంటారు. కానీ ఇది చాలా తప్పు. మహిళల కెరీర్ వారి ఇష్టం.  వారు తమ కుటుంబాన్ని చూసుకుంటూ వారి కెరీర్ కొనసాగించుకుంటే వచ్చే నష్టం ఏమీ లేదు.  అనవసరంగా వారి కెరీర్ ఇంకెన్నాళ్లు ఉంటుంది అని ప్రశ్నించకూడదు. సమయం.. చాలామంది మహిళలు బయటకు ఎక్కడికి వెళ్లినా ఎప్పుడైనా ఆలస్యం అయితే అందరూ అడిగే ప్రశ్న ఇంత ఆలస్యం ఎందుకైంది అని. అదే తొందరగా వారు ఎక్కడికైనా హాజరైతే ఇంత త్వరగా ఇంటి నుండి వచ్చావేంటని.  ఇవి మహిళలను అసౌకర్యానికి గురిచేస్తాయి.  మహిళలు కుటుంబాన్ని,  తమ పనులను చేసుకోవడంలో ప్రాధాన్యతలు, టైం మేనేజ్మెంట్ దగ్గర చాలా ఇబ్బందులు పడుతుంటారు. వారి ఆలస్యం గురించి కానీ,  వారి తొందర గురించి కానీ అలా  అడగకూడదు. ఇది విమర్శ చేసినట్టు అనిపిస్తుంది. సోషల్ మీడియా.. సోషల్ మీడియా ఇప్పట్లోచాలా సహజం. అయితే సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్న మహిళలు  అనేకం.  చాలామంది అలాంటి మహిళల పట్ల ఎందుకు సోషల్ మీడియాలో  అంత యాక్టీవ్ ఉంటావు అని ప్రశ్నిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో గడపడం మహిళల వ్యక్తిగతం,  అది వారి అభిరుచి, ఆసక్తి ఆధారంగా ఉంటుంది.  దాని గురించి అందరూ ప్రశ్నించాల్సిన అవసరం లేదు. డ్రస్సింగ్.. ప్రతి మహిళ తమ సౌకర్యం గురించి ఆలోచిస్తుంది.  కొందరు ప్యాషన్ ట్రెండ్ ను ఫాలో అవుతుంటారు.  ఏది ఏమైనా మహిళల డ్రెస్సింగ్ గురించి వారు ధరించే దుస్తుల గురించి ప్రశ్నించడం,  కామెంట్ చేయడం అస్సలు మంచిది కాదు. పైన పేర్కొన్న 7 విషయాలు మహిళల వ్యక్తిగతం,  కుటుంబానికి సంబంధించినవి.   వాటిని ప్రశ్నించడం వల్ల మహిళల వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకున్నట్టే. అంతేకాదు.. పై ప్రశ్నలు అడగడం వల్ల మహిళలు చాలా అసౌకర్యానికి ఫీలవుతారు. అలాగే వారి ఆత్మ విశ్వాసం కూడా దెబ్బతింటుందని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు అంటున్నారు.                                     *రూపశ్రీ.
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు. కానీ చాలామంది చేసే మిస్టేక్.. సైడ్ ఇన్కమ్ కోసం ప్రయత్నించకపోవడం. ఉద్యోగం చేస్తూనే ఎక్స్టాగా ఇన్కమ్ సంపాదించడం వల్ల ఆర్థికంగా ఎంతో వృద్ధి చెందవచ్చు.  దీనికోసం మంచి మార్గాలు,  ఎక్ట్సా ఇన్కమ్ సంపాదించాలనుకునే వారు చేయకూడని తప్పులు తెలుసుకుంటే.. ఫ్రీలాన్సింగ్..  రైటింగ్, డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, డిజిటల్ మార్కెటింగ్ లేదా కోడింగ్ వంటి స్కిల్స్  ఉంటే  ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు చేయవచ్చు. ఇది  మంచి ఆదాయాన్ని ఇస్తుంది. ఫ్రీలాన్సర్,  ఫైవర్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో క్లయింట్ లు ఉంటారు. వారానికి 10–12 గంటలు కేటాయించడం ద్వారా, ₹10,000 నుండి ₹25,000 వరకు సంపాదించవచ్చు. బ్లాగింగ్, కంటెంట్ క్రియేషన్.. రాయడం పట్ల మంచి అభిరుచి ఉంటే  బ్లాగింగ్, యూట్యూబ్ లేదా ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్‌ను క్రియేట్ చేయవచ్చు. సబ్స్క్రైబర్స్,  వ్యూస్ బాగా వచ్చిన తరువాత  యాడ్స్ , స్పాన్సర్‌షిప్‌లు కూడా వస్తాయి. వీటి ద్వారా అదనపు ఆదాయం కూడా ఉంటుంది. అయితే దీనికి మంచి కంటెంట్, క్లిక్ అయ్యేవరకు సమయం అవసరం అవుతాయి. ఆదాయం వెంటనే ఉండదు. కాస్త ఓపిక అవసరం. ఆన్లైన్ ట్యూటరింగ్.. కోర్సెస్.. ఏదైనా ఒక  సబ్జెక్టులో బాగా గ్రిప్ ఉంటే అలాంటి వారు  ఆన్‌లైన్ క్లాసెస్ చెప్పవచ్చు.  లేదా డిజిటల్ కోర్సులను క్రియేట్ చేసి  కూడా టీచింగ్ చేయవచ్చు. YouTube, Unacademy వంటి ప్లాట్‌ఫామ్‌లలో చేరవచ్చు.  లేదా Google Meetలో స్వయంగా  క్లాసెస్ చెప్పవచ్చు. ఇది   విద్యార్థులకు,  టీచింగ్ చేసేవారికి కూడా  చాలా బాగుంటుంది. ఈ-బుక్స్.. రాయడం పట్ల మంచి అబిరుచి ఉంటే ఈ-బుక్స్  రాసి కిండిల్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో అమ్మడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఇంటి నుండి వ్యాపారాన్ని ప్రారంభించడానికి రీసెల్లింగ్ లేదా ఈ-కామర్స్ కూడా ఒక గొప్ప మార్గం. ఈ కామర్స్-రీసెల్లింగ్.. అమెజాన్,  ఫ్లిప్‌కార్ట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఉత్పత్తులను అమ్మడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు.  ఇంటి నుండి చిన్నగా ప్రారంభించవచ్చు. దుస్తులు, హస్తకళలు లేదా గృహోపకరణాలను అమ్మవచ్చు. ఇది క్రమంగా లాభదాయకమైన వ్యాపారంగా మారవచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్.. సైడ్ ఇన్‌కమ్ అంటే కేవలం పని చేయడం ద్వారా సంపాదించేది మాత్రమే కాదు, డబ్బు సంపాదించడం గురించి. మ్యూచువల్ ఫండ్ SIPలు, స్టాక్ మార్కెట్, బాండ్లు లేదా డిజిటల్ గోల్డ్‌లో  వంటి వాటిలో క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టడం వల్ల క్రమంగా అదనపు నిధులు వస్తాయి. సరైన సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల దీర్ఘకాలికంగా మంచి ఆదాయం సృష్టించవచ్చు. ఈ తప్పులు చేయకండి.. సైడ్ ఇన్‌కమ్‌ను మొదలుపెట్టే ముందు  త్వరగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో  తరచుగా తప్పులు చేస్తాము. ఆ తప్పులేంటంటే.. తొందరపాటు చాలామందికి ఉంటుంది.  సైడ్ ఇన్కమ్ కావాలనే తొందరలో తప్పటడుగు వేయకూడదు. సైడ్ ఇన్కమ్ మీద ఆశతో ఎలాంటి పరిశోధనలు చేయకుండా లేదా డబ్బులు పెట్టుబడి పెట్టడం లేదా డబ్బు సరిగా చెల్లించని చోట వర్క్ చేయడానికి ఒప్పుకోవడం వంటివి చేయకూడదు. సైడ్ ఇన్కమ్ మోజులో పడిచాలామంది  ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఎక్కువ లాభం వస్తుందని ఇచ్చే ప్రకటనలు చూసి మోసపోయి డబ్బులు పెట్టకూడదు. కేవలం అదనంగా చేసే పని ద్వారా సైడ్ ఇన్కమ్ ఉండేలా చూసుకోవాలి. అంతేకానీ డబ్బు కోసం ఎక్కువ ఒత్తిడి తీసుకుని పని చేయకూడదు. సైడ్ ఇన్కమ్ అయిన, ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం అయినా కుటుంబం కోసమే.. కానీ పని కోసం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. గొప్పలు చెప్పుకోవడానికి  సైడ్ ఇన్కమ్ సంపాదించడం మంచిది కాదు. భవిష్యత్ కోసం పొదువు చేయడానికి  సైడ్ ఇన్కమ్ సంపాదించాలి.                               *రూపశ్రీ.
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు.  మానసికంగా బలంగా మారడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అయితే ఆఫీసు ఒత్తిడులు,  జీవిత సమస్యలు, లక్ష్యాలు చేరుకోవడంలో పడే సంఘర్షణ.. ఇలా ఒకటేమిటి.. చాలా విషయాలు మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి.  కానీ కొన్ని సాధారణ అలవాట్లు మానసిక ఆరోగ్యానికి శ్రీరామ రక్షలా పనిచేస్తాయి.  ఇంతకీ ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే.. కృతజ్ఞత.. కృతజ్ఞత భావం మనిషిని చాలా స్వచ్చంగా ఉంచుతుంది.  ప్రతి వ్యక్తి మొదటగా గడిచే ప్రతి రోజు పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి.  రోజు తన జీవితంలో జరిగిన మంచి విషయాలను గుర్తు చేసుకోవాలి.  ఇలా చేస్తే చాలా పాజిటివ్ మైండ్ సెట్ అలవాటు అవుతుంది. ఇది మానసికంగా బలంగా ఉండటానికి సహాయపడుతుంది. వ్యాయామం.. శరీరంలో ఒత్తిడి హార్మోన్ తగ్గడానికి వ్యాయామం మంచి మార్గం.  ప్రతి రోజూ 20 నుండి 30 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి.  ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. శ్వాస వ్యాయామం.. శారీరక వ్యాయామమే కాకుండా మానసికంగా దృఢంగా ఉండటానికి శ్వాస వ్యాయామాలు కూడా చాలా బాగా సహాయపడతాయి. రోజూ కొన్ని నిమిషాలు శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది.  ఒత్తిడి కూడా తగ్గుతుంది. శ్రద్ద.. ఏ పని మీద అయినా దృష్టి పెట్టడాన్నే మైండ్ ఫుల్ నెస్ అని అంటున్నారు.  ఇంటి పని చేసినా,  వ్యాయామం చేసినా, ఆహారం తీసుకున్నా, ఆఫీసు పని చేసినా.. ఇలా ప్రతి పని చేసినప్పుడు ఆ పని మీద పూర్తిగా మనసు లగ్నం చేయాలి. ఇందుకోసం ధ్యానం చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది. ఇలా చేయడం వల్ల మెయింటైన్ స్కిల్స్ మెరుగవుతాయి. ప్రకృతి.. మనిషిలో ఒత్తిడిని తగ్గించే సూపర్ మెడిసిన్ ఏదైనా ఉందంటే అది ప్రకృతి.  తాజా గాలిలో,  సూర్యరశ్మిలో సమయం గడపడం,  మొక్కలు,  చెట్లు,  పక్షులు,  జంతువుల సమక్షంలో సమయాన్ని గడపడం వల్ల ఒత్తిడి తగ్గి మానసికంగా దృఢంగా మారతారు. మనసు విప్పడం.. ఎలాంటి విషయాలు అయినా కొందరితోనే మనసు విప్పి మాట్లాడగలుగుతారు.  వారిలో స్నేహితులు,  బంధువులు,  ఆత్మీయులు ఇట్లా చాలా ఉంటారు. అయితే ఎవరి దగ్గర ఏదైనా చెప్పుకోగల చనువు ఉంటుందో వారితో ఓపెన్ గా మాట్లాడాలి. దీనివల్ల చాలా విషయాలలో మంచి సలహాలు దొరకడమే కాకుండా క్లిష్ట పరిస్థితులలో మంచి సపోర్ట్ కూడా దొరుకుతుంది. బంధాలు.. స్నేహం అయినా, ప్రేమ అయినా,  వైవాహిక బంధం అయినా, కొలీగ్స్ తో పరిచయం అయినా.. వారితో ఉండే రిలేషన్ పదే పదే తెగిపోతూ ఉంటే అది మానసిక సమస్యలకు దారి తీస్తుంది.  అందుకే బంధాలను కాపాడుకోవాలి.  ఎక్కువకాలం బంధాలు నిలిచి ఉండేలా చూసుకోవాలి. ఎమోషనల్ గా బంధాలతో కనెక్ట్ అయి ఉండాలి. నచ్చిన పని.. మానసికంగా బాగుండాలంటే అన్నింటి కంటే ముఖ్యమైనది నచ్చిన పని చేయడం. చాలా వరకు ఇతరుల సలహాలు,  ఇతరుల కమాండింగ్ మీద చాలా మంది పని చేస్తూ ఉంటారు. కానీ నచ్చిన పని చేయడంలో చాలా తృప్తి ఉంటుంది. ఇది మానసికంగా బలంగా ఉంచుతుంది. ఆత్మ విమర్శ.. ప్రతి రోజూ పడుకునే ముందు ఉదయం నుండి జరిగిన ప్రతి విషయాన్ని గుర్తు చేసుకోవాలి.  ముఖ్యంగా మంచి విషయాలను గుర్తు చేసుకోవడం వల్ల చాలా పాజిటివ్ మైండ్ అలవాటు అవుతుంది. పాజిటివ్ మైండ్ ఉంటే అది మానసిక ఆరోగ్యాన్ని కూడా బలంగా ఉంచుతుంది.                                  *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం.   కేవలం తీపి పదార్థాలు,  స్వీట్లు, పంచదార వంటివి తినడమే డయాబెటిస్ కు కారణం అనుకుంటే పొరపడినట్టే.. రోజువారీ ఆహారపు అలవాట్ల మీద డయాబెటిస్ ముడిపడి ఉంటుందని వైద్యులు అంటున్నారు. రోజు వారి తీసుకునే కొన్ని ఆహారాలు.. ఇవి ఏం చేస్తాయి లే అనుకునే పదార్థాలు టైప్-2 డయాబెటిస్ కు కారణం అవుతాయని అంటున్నారు వైద్యులు.  ఈ ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల డయాబెటిస్ ఈజీగా వస్తుందట. డయాబెటిస్ కు కారణమయ్యే ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. డీప్ ఫ్రైడ్ స్నాక్స్.. సమోసాలు, పకోడాలు,  చిప్స్  ఇవన్నీ చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు చాలా ఇష్టమైన స్నాక్స్.  కానీ ఈ ఆహారాలలో అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ కొవ్వు క్రమంగా శరీరంలో పేరుకుపోతుంది.  బరువు పెరగడానికి దారి తీస్తుంది. బరువు పెరగడం  ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది, ఇది టైప్ 2 డయాబెటిస్‌కు ప్రధాన కారణం. ఫాస్ట్ ఫుడ్‌లో ఉపయోగించే నూనెను  పదే పదే వేడి చేయడం వల్ల ట్రాన్స్ ఫ్యాట్ ఏర్పడుతుంది. ఇది రక్తంలో చక్కెరను మరింత పెంచుతుంది. మార్కెట్ ఫుడ్స్.. మార్కెట్లో అమ్మే గ్రానోలాతో పాటు  అనేక బ్రేకఫాస్ట్  తృణధాన్యాలు ఆరోగ్యకరమైనవని అనుకుంటారు.   కానీ వాటిలో షుగర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది.  గ్రానోలా బార్‌లు, ఓట్ బార్‌లు,  రెడీ టూ ఈట్ ఫుడ్స్ లో చాలా ఎక్కువ మొత్తంలో చక్కెరలు ఉంటాయి. వీటి వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు చాలా వేగంగా పెరుగుతాయి. ప్రాసెస్డ్ మీట్.. సాసేజ్, బేకన్,  సలామీ వంటి ప్రాసెస్ చేసిన మాంసాలలో సోడియం,  నైట్రేట్లు అధికంగా ఉంటాయి.  ఇవి గుండెకు హాని చేయడమే కాకుండా   డయాబెటిస్‌కు నేరుగా కారణం అవుతాయి. ప్రాసెస్ చేసిన మాంసాలు వాపును పెంచుతాయి,  జీవక్రియను నెమ్మదిస్తాయి. రక్తంలో చక్కెరను నియంత్రించడం కష్టతరం చేస్తాయి. డ్రింక్స్.. శీతల పానీయాలు,  ప్యాక్ చేసిన సోడాలలో చక్కెర చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక సోడా డ్రింక్ లో  ఉండే చక్కెర పరిమాణం కొన్ని  రోజులు తీసుకునే నేచురల్  చక్కెర కంటే ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ పానీయాలు వెంటనే రక్తంలో గ్లూకోజ్‌ను పెంచుతాయి.  క్లోమంపై  ఒత్తిడిని ఎక్కువగా  కలిగిస్తాయి. ఇలాంటి డ్రింక్స్ తీసుకున్న ప్రతి  సారి  శరీరం అదనపు ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఇది కాలక్రమేణా ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. రిపైండ్ ఫ్లోర్,  బ్రెడ్.. తెల్ల బ్రెడ్, బన్స్, కుకీలు,  నాన్ వంటి ఆహారాలు మైదాతో తయారు చేస్తారు. ఈ ఆహారాలలో గ్లూకోజ్ చాలా త్వరగా విచ్చిన్నమవుతుంది. ఈ రిఫైండ్ ఫ్లోర్ లో  ఫైబర్ ఉండదు.  దీని వల్ల రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది. అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలను తరచుగా తీసుకోవడం వల్ల శరీరం రక్తంలో చక్కెర సమతుల్యతను కాపాడుకోవడానికి కష్టపడి పనిచేయవలసి వస్తుంది. ఈ అలవాటు క్రమంగా మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది. వైట్ రైస్.. తెల్ల బియ్యం భారతీయ ఆహారంలో ముఖ్యమైన భాగం. కానీ ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువే.  ఇది తిన్న తర్వాత గ్లూకోజ్‌గా మారుతుంది. ఇది నేరుగా రక్తంలో చక్కెరను పెంచుతుంది. రోజూ పెద్ద మొత్తంలో తెల్ల బియ్యం తినడం వల్ల బరువు పెరగడం,  రక్తంలో చక్కెర నియంత్రణ బలహీనపడటం జరిగి, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా చాలా పాలిష్ పట్టిన బియ్యంతో వండే అన్నం ఎక్కువ తినడం మానేయాలి.                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...