భోజనం తర్వాత స్వీట్ సొంపు తింటే ఏమవుతుంది.!

posted on: Aug 21, 2026 6:25PM

రెస్టారెంట్లలో భోజనం తర్వాత స్వీట్ సొంపు ఇస్తుంటారు.  చాలామందికి ఈ సొంపు అంటే చాలా ఇష్టంగా ఉంటుంది.  కొందరు ఇంట్లో కూడా భోజనం తర్వాత స్వీట్ సొంపు తినడం లేదా సొంపు కండ చెక్కర కలిపి తినడం చేస్తుంటారు.  చాలా మంది స్వీట్ సొంపును కేవలం మౌత్ ప్రెషనర్ అనుకుంటారు.  అందుకే భోజనం తర్వాత నోరు తాజాగా అనిపించడం కోసం దీన్ని ఇస్తారని అనుకుంటారు.  కానీ భారతీయ వంటకాల్లో భోజనం తర్వాత సోంపును తినడం ఎప్పటినుండో ఉందట.  ఇది కేవలం మౌత్ ప్రెషనర్ గా కాకుండా..  చాలా రకాల  సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందట.  దీని గురించి వివరంగా తెలుసుకుంటే..

సొంపు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

జీర్ణక్రియకు..

భోజనం తర్వాత కొద్దిగా సోంపు నమలడం భారతీయ సంప్రదాయంలో ఒక భాగం. జీర్ణ సంబంధిత అసౌకర్యాలు తగ్గించడంలో సోంపు సహాయపడుతుందని చెబుతారు. అయితే దీని ప్రభావం అందరికీ ఒకే విధంగా ఉండదు.

నోటిని తాజాగా ఉంచడానికి..

సోంపు లో ఉండే సహజ సువాసన , రుచి భోజనం తర్వాత వచ్చే దుర్వాసనను తాత్కాలికంగా తగ్గించడంలో సహాయపడతాయి. అందుకే దీనిని  రెస్టారెంట్లలో తరచుగా మౌత్ ఫ్రెషనర్‌గా అందిస్తారు.

 ఫైబర్ మూలం..

సోంపు గింజలలో పీచుపదార్థం ఉంటుంది.  కొంచెం సొంపు తిన్నా సరే.. అందులో  లభించే పీచుపదార్థం చాలా ఎక్కువగా ఉండకపోయినప్పటికీ ప్రభావవంతగా పనిచేస్తుంది.  ఆహారం తినగానే సొంపు తింటాం కాబట్టి ఆహారం బాగా జీర్ణం కావడంలో సహాయపడుతుంది.

యాంటీఆక్సిడెంట్లు..

సోంపులో యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానకి చాలా సహాయపడతాయి.

కండ చక్కెర తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..

చాలా రెస్టారెంట్లలో స్వీట్ సొంపు ఇస్తుంటారు. అయితే  కొన్ని చోట్ల మాత్రం ప్లెయిన్ సొంపును కండచెక్కర తో కలిపి ఇస్తుంటారు.  ఈ కండ చక్కెరను మిశ్రీ అని కూడా అంటారు.  ఇందులో ప్రధాన పదార్థం చక్కెర. అందువల్ల ఇది తియ్యగా ఉంటుంది.  కొంతమంది భోజనం తర్వాత సోంపు గింజలతో మిశ్రీని కలిపి తినడానికి ఇష్టపడతారు.  ఇధి రుచిని మెరుగుపరుస్తుంది.

అయితే.. మిశ్రీని ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు.. మిశ్రీ లో తీపిదనం ఆరోగ్యానికి మంచిది కాదు. దీన్ని మితంగా తీసుకుంటే బాగనే ఉంటుంది. కానీ అధికంగా తీసుకోకూడదు. డయాబెటిస్ పేషంట్లు దీని విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

                                                                                                                                                *రూపశ్రీ.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...