Home

»

Latest News

నయనతార మూవీకి రికార్డు డీల్.. రూ.100 కోట్ల ప్రాజెక్ట్‌కి మైండ్ బ్లాకింగ్ ఓటీటీ రేట్!

Aug 21, 2026 4:27PM

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ ఫాంటసీ డివైన్ కామెడీ డ్రామా ‘మూకుత్తి అమ్మన్ 2’ (తెలుగులో ‘అమ్మోరు తల్లి 2’). బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమవుతున్న ఈ ప్రాజెక్ట్‌పై కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈ చిత్రం అప్పుడే డిజిటల్ మార్కెట్‌లో తన సత్తా చాటుతోంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు మైండ్ బ్లాకింగ్ ధరకు అమ్ముడయ్యాయి. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'జియో హాట్‌స్టార్' (JioHotstar) ఈ చిత్రానికి సంబంధించిన అన్ని భాషల ఓటీటీ హక్కులను భారీ మొత్తానికి దక్కించుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలమైన ప్రచారం సాగుతోంది. అమౌంట్ ఎంత అనేది అధికారికంగా వెల్లడించకపోయినా, ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి ఇది రికార్డు స్థాయి బిజినెస్ అని టాక్.

2020లో వచ్చిన 'మూకుత్తి అమ్మన్' (అమ్మోరు తల్లి) బాక్సాఫీస్ వద్ద, ఓటీటీలో ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని సుందర్.సి దర్శకత్వంలో డాక్టర్ ఐసరి కె. గణేష్ తమ వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సీక్వెల్‌ను దాదాపు రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండటం విశేషం.

ఈ చిత్రంలో నయనతార మరోసారి అమ్మవారిగా పవర్‌ఫుల్ అండ్ డివైన్ రోల్‌లో మెరవనుండగా, విలక్షణ నటి రెజీనా కాసాండ్రా నెగెటివ్ షేడ్స్ ఉన్న ముఖ్య పాత్రలో నటించనుంది. వీరితో పాటు దునియా విజయ్, యోగిబాబు, ఊర్వశి, అభినయ తదితర సీనియర్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండటంతో ప్రాజెక్ట్ గ్లామర్ అండ్ కామెడీ డోస్ మరింత పెరిగింది.

ప్రస్తుతం గ్రాండ్ సెట్లలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ సౌత్ లాంగ్వేజెస్ సహా హిందీలో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. థియేట్రికల్ రిలీజ్‌కు ముందే భారీ ఓటీటీ డీల్ క్లోజ్ కావడం సినీ ప్రియుల్లో, నయనతార ఫ్యాన్స్‌లో ఈ సినిమాపై ఉన్న విపరీతమైన క్రేజ్‌ను స్పష్టం చేస్తోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com