Home

»

Latest News

'షావుకారు జానకి' కన్నుమూత: ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్.!

Aug 21, 2026 3:28PM

దశాబ్దాల పాటు తెలుగు, తమిళ సినీ రంగాన్ని ఏలిన లెజెండరీ నటి 'షావుకారు జానకి' (94) చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమె మరణవార్త పట్ల జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన షావుకారు జానకి గారి సినీ ప్రయాణం, పాత్రలు ఎప్పటికీ నిలిచిపోతాయి" అని భావోద్వేగంగా నివాళులర్పించారు. 

1950లో వచ్చిన 'షావుకారు' సినిమాతో ఆమె ప్రస్థానం మొదలైంది. ఆ మొదటి సినిమానే ఆమె ఇంటి పేరుగా మారిపోయేలా తన నటనతో మాయ చేశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి లెజెండరీ నటుల కాంబినేషన్‌లో ఆమె చేసిన ఎన్నో సినిమాలు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి నిధిలా నిలిచిపోయాయి. గ్లామర్ పాత్రలైనా, ఎమోషనల్ పాత్రలైనా సరే.. సీన్‌లో జానకి కనిపిస్తే చాలు, ఆ పాత్రకి ఒక ప్రత్యేకమైన గౌరవం, జీవం వచ్చేది.

గతకొద్ది రోజులుగా వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె, చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్త విన్న వెంటనే జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా భావోద్వేగమైన సందేశాన్ని పోస్ట్ చేశారు. "తెలుగు మరియు భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన షావుకారు జానకి గారి మరణవార్త ఎంతో బాధ కలిగించింది. జానకి గారి సినీ ప్రయాణం, ఆమె పోషించిన పాత్రలు ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి" అని ట్వీట్ చేస్తూ నివాళులర్పించారు.

 

 

 

Sowcar Janaki, JR NTR, Shavukaru Janaki, NTR

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com