ఎక్కువ సేపు కూర్చుని ఉంటున్నారా..అయితే మీకు ఈ సమస్యలు తప్పవు..!

posted on: Aug 21, 2026 5:37PM

 నేటికాలంలో డెస్క్ ఉద్యోగాలు, గంటల తరబడి స్క్రీన్ చూడటం, ఎక్కువ దూరం ప్రయాణాలు.. ఇవి మాత్రమే కాకుండా తీరిక సమయంలో సోఫాలో కూర్చునే అలవాటు వంటివి  రోజువారీ శారీరక శ్రమను చాలా తగ్గించాయి. అయితే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కలిగే ప్రభావం కేవలం శరీరానికే పరిమితమా, లేక అది మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందా? అనే  విషయం చాలా మందికి తెలియదు.  ఎక్కువ సేపు కూర్చుని ఉండటం వల్ల కొన్ని సమస్యల ప్రభావం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  రోజులో ఎక్కువ సేపు కూర్చొనే వ్యక్తులు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి.  రోజులో ఎక్కువ సేపు కూర్చుంటే వచ్చే
ఆరోగ్య సమస్యలు ఏమిటో తెలుసుకుంటే..

ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల మెదడు పై ప్రభావం..

ఎక్కువ సేపు కదలకుండా కూర్చొనే జీవనశైలి శరీర జీవక్రియ , హృదయ సంబంధ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందట. అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం , రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వంటి సమస్యలు..  ఎక్కువ కాలం ఇలా కూర్చునే ఉండే అలవాటు పాటిస్తే.. మెదడు ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని అంటున్నారు.

30-45 నిమిషాల వ్యాయామం సరిపోతుందా?

సాధారణంగా ఎక్కువ సేపు కూర్చొని వర్క్ చేసే వారు.. పని లేకపోయినా కూర్చుని ఉండే వ్యక్తులు సాయంత్రం అవ్వగానే  జిమ్‌లో లేదా ఇంట్లో..  30-45 నిమిషాలు వ్యాయామం చేస్తే సరిపోతుందని అనుకుంటారు. ఇలా వ్యాయామం చేయడం మంచిదే అయినప్పటికీ..  రోజంతా కూర్చుని ఉండటానికి ఇది సరిపోతుందని అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదని వైద్యులు చెబుతున్నారు.

 రోజంతా చిన్న విరామాలు తీసుకుంటూ చిన్న చిన్న పనులు చేస్తూ శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవాలి.  ఇదే చాలా మంచి అలవాటు అని వైద్యులు చెబుతున్నారు. ఫోన్‌లో మాట్లాడుతూ నడవడం, , మెట్లు ఎక్కడం,  భోజనం తర్వాత కొన్ని నిమిషాలు నడవడం వంటివి శరీరం ఎక్కువ సేపు కూర్చుని ఉండకుండా మధ్యలో చురుగ్గా మారడానికి సహాయం చేస్తాయి.

ఎక్కువ సేపు కూర్చుంటే మెదడు పై ప్రభావం..

చాలా సేపు డెస్క్ వద్ద పనిచేయడం వలన ఏకాగ్రత లోపించడం లేదా మానసిక అలసట కలగవచ్చు. చాలా మంది దీనిని "బ్రెయిన్ ఫాగ్" అని అంటారు. అయితే, ఇది కేవలం కూర్చోవడం వల్ల మాత్రమే కాదు. ఎక్కువ సేపు స్క్రీన్‌ను చూడటం, తక్కువ నీరు త్రాగడం, భోజనం మానేయడం, మానసిక ఒత్తిడి , నిద్రలేమి కూడా ఏకాగ్రతను ప్రభావితం చేస్తాయి. కొన్ని నిమిషాల పాటు లేచి అటూ ఇటూ నడవడం, నీళ్లు త్రాగడం , స్క్రీన్‌కు విరామం ఇవ్వడం వంటి అలవాట్లు ఈ సమస్య నుండి బయట పడటంలో సహాయపడతాయి.

ఎంత సేపు కూర్చోవాలి, ఎప్పుడు లేవాలి?

 కూర్చున్న మొత్తం గంటలను లెక్కించే బదులు,  చివరిసారిగా కుర్చీలోంచి ఎప్పుడు లేచారో గుర్తుంచుకోవడం సులభం. చాలా గంటలు గడిచి ఉంటే, లేచి కొన్ని నిమిషాలు నడవడం లేదా శరీరాన్ని సాగదీయడం చేయాలి. మెదడు ఆరోగ్యానికి తగినంత నిద్ర, సమతుల్య ఆహారం, క్రమం తప్పని శారీరక శ్రమ, , రక్తపోటు, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్‌లను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

                                                                                                                                                   *రూపశ్రీ
 

google-ad-img
    Related Sigment News
    • Loading...