మోకాళ్ల సమస్యలు వేధిస్తున్నాయా..ఇలా చేస్తే మోకాళ్ల ఆరోగ్యం సేఫ్..!

posted on: Aug 21, 2026 4:29PM

మోకాలి నొప్పి అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. ఇది గాయం వల్ల లేదా ఆర్థరైటిస్, గౌట్ , ఇన్ఫెక్షన్ వంటి కొన్ని సమస్యల వల్ల కూడా  సంభవించవచ్చు. సాధారణ సమస్యలు అయితే  కొన్ని ట్రీట్మెంట్ తో  నయమవుతాయి. కానీ ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలు చాలా కాలం పాటు నొప్పికి కారణమవుతాయి. మోకాళ్ల నొప్పి మొత్తం ఆరోగ్యానికి హానికరంగా పరిగణించబడుతుంది. చాలా ఏళ్ల పాటు మోకాళ్ల నొప్పులు ఉంటే, అది జీవన నాణ్యతపై కూడా ప్రభావం చూపుతుంది. అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారు  కీళ్లపై అధిక ఒత్తిడిని కలిగించాల్సి వస్తుంది, దీనివల్ల నడవడం లేదా మెట్లు ఎక్కడం వంటి సాధారణ పనులు కూడా కష్టమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం కూడా మోకాళ్ల నొప్పికి దోహదపడుతుంది. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..

శరీరం పై మోకాళ్ల నొప్పి ప్రభావం..

 మోకాలి నొప్పులన్నీ తీవ్రమైనవి కావు, కానీ గాయం, ఆస్టియో ఆర్థరైటిస్, కీళ్లపై ఒత్తిడి వంటి కొన్ని సమస్యలకు చికిత్స చేయకుండా వదిలేస్తే అవి తీవ్రమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.  అయితే మోకాలి నొప్పి శరీరంలోని ఇతర భాగాలలో సమస్యలను కలిగించగలదా? అని గమనిస్తే..
 
ఎక్కువ కాలం మోకాలి నొప్పి ఉంటే తుంటి, తొడ లేదా కాలి కింది భాగంలోని కండరాల సమస్యలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలా మందికి నడవడం, లేచి నిలబడటం కూడా కష్టంగా మారుతుంది.

మోకాలి సమస్యలను నివారించడానికి వ్యాయామం..

క్రమం తప్పకుండా చేసే  వ్యాయామ అలవాట్లు మోకాలి సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
 
క్వాడ్రిసెప్స్ , హామ్‌స్ట్రింగ్ కండరాలపై దృష్టి సారించే బలవర్ధక వ్యాయామాలు నొప్పిని తగ్గించడంలో సహాయపడే అవకాశం ఉంటుంది.

చురుకుగా ఉండటం బరువును అదుపులో ఉంచుకోవడానికి , కండరాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది, దీనివల్ల మోకాళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.

కీళ్లవాతం వంటి సమస్యలను నివారించడంలో వ్యాయామం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

బరువు..

 శరీర బరువు ఎక్కువగా ఉంటే..  మోకాళ్ల నొప్పిని పెంచుతుంది. ఇది కీళ్లవాతానికి కూడా ఒక కారణం అవుతుంది. అధిక బరువు కీళ్లపై ఒత్తిడిని పెంచుతుంది, ఇది అక్కడి కండరాలను ప్రభావితం చేస్తుంది. క్రమం తప్పని వ్యాయామం బరువును అదుపులో ఉంచుకోవడానికి , కీళ్లవాతం ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

సరైన ఫుట్ వేర్..

చాలా మంది ఫుట్ వేర్ విషయంలో తగినంత జాగ్రత్త తీసుకోరు.  నాణ్యత లేని బూట్లు , హై-హీల్ చెప్పులు కూడా కీళ్ల , మోకాళ్ల సమస్యలకు కారణమవుతాయి. అందువల్ల, మంచి, సౌకర్యవంతమైన బూట్లు ధరించాలి. ముఖ్యంగా కీళ్లవాతం ఉన్నవారు దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సరైన బూట్లు ధరిస్తే.. ఎన్నో మడమ , మోకాళ్ల సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.

                                                                                                                                                  *రూపశ్రీ.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...