Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తమిళనాడు సీఎం విజయ్ బాటలో కల్వకుంట్ల కవిత.. ఏం చేశారంటే?
posted on: Aug 21, 2026 11:49AM

తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) అధినేతత్రి కల్వకుంట్ల కవిత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ను అనుసరిస్తున్నారు. ఎన్నికల బరిలో దిగిన తొలి ప్రయత్నంలోనే ఘన విజయం సాధించి సీఎం పీఠాన్ని అధిరోహించిన టీవీకే అధినేత విజయ్ అడుగు జాడల్లో నడుస్తూ కవిత కూడా తెలంగాణ రక్షణ సేనను గెలుపు బాటలో నడిపించి తెలంగాణ సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నారు.
ఇందుకోసం ఆమె తాజాగా తమిళనాడు సీఎం విజయ్ కి సన్నిహితుడు, ఆయన వ్యక్తిగత జ్యోతిష్యుడు అయిన రికీ రాధన్ పండిట్ వెట్రివేట్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ వచ్చిన ఆయన కవితతో భేటీ అయ్యారు. తమిళనాడు రాజకీయాల్లో రిక్కీ రాధన్ పండిట్ పాత్ర కీలకమైనదిగా భావిస్తారు. ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ ప్రతికూలంగా వ్యాఖ్యానించినప్పటికీ, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ విజయం సాధించి ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారని రికీ రాధన్ జోస్యం చెప్పారు.
ఆయన చెప్పినట్లే విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో రిక్కీ రాధన్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. విజయ్ తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాధన్‌ను ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా కూడా నియమించారు.
అయితే ప్రతిపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ఆ నియామకాన్ని ఉపసంహరించుకున్నారనుకోండి అది వేరే విషయం. అయితే విజయ్ రాజకీయ నిర్ణయాల్లో రాధన్ పండిట్ సలహాలు ఇప్పటికీ కీలక పాత్ర పోషిస్తున్నాయని అంటారు. ఇటువంటి రాధన్ పండిట్ చెన్నై నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి కవితతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కవిత తన కుమారుడితో కలిసి రిక్కీ రాధన్ పండిట్‌ను శాలువాతో సత్కరిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తెలంగాణ రక్షణ సేన భవిష్యత్తు, రాబోయే రోజుల్లో కవిత రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతోందనే అంశాలపైనే కవిత రాధన్ పండిట్ సలహాలు కోరినట్లు తెలుస్తోంది. తమిళనాడులో విజయ్‌కి తిరుగులేని రాజకీయ విజయం లభిస్తుందని ముందుగానే జోస్యం చెప్పిన రాధన్ పండిట్ ను కవిత ఆశ్రయించారని అంటున్నారు. తమిళనాడు సీఎం విజయ్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై కవిత ఇటీవల బహిరంగంగానే ప్రశంసలు కురిపించడం, తెలంగాణలో అమ్మ పాలన అందిస్తామని ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాధన్ పండిట్ తో కవిత భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
Kalvakuntla Kavitha follows Tamilnadu CM Vijay, Ricky Radhan Pandit, CM Vijay Astrologer, Kavitha Ricky Radhan Meeting, Telangana Rakshana Samithi, Telangana Politics





