LATEST NEWS
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. కొడుకు జోగి రాజీవ్ తన తండ్రిపై తిరగబడినట్లుగా ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జోగి రాజీవ్ వివాహం, ఆ తదనంతర పరిణామాలపై దాఖలైన కేసు ఆధారంగా ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న అంశాలకు ఈ వీడియోలు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ విషయంపై  సీనియర్ జర్నలిస్ట్  డీవీ శ్రీనివాస్ తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు.    మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన కుమారుడు రాజీవ్, వారి కుటుంబ సభ్యులపై  జోగి రాజీవ్ భార్య  మేఘన పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వరకట్న వేధింపులు, గృహహింస, మతమార్పిడి ఒత్తిళ్లు అంటూ మేఘన  ఫిర్యాదు మేరకు 11 మంది పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తాజా వీడియో.. ఆమె ఫిర్యాదుకు బలం చేకూర్చడమే కాకుండా.. కేసు తీవ్రతను తేటతెల్లం చేశాయి. ఆమె ఫిర్యాదు, తాజాగా విడుదల చేసి తాజా వీడియో ఆధారాలు సమస్య తీవ్రతను స్పష్టం చేస్తున్నాయని డీవీ శ్రీనివాస్ అన్నారు. లీక్ అయిన వీడియోలో రాజీవ్ తన తండ్రి జోగి రమేష్ ఎదుటే గట్టిగా నిలదీస్తూ కేకలు వేయడం స్పష్టంగా కనిపిస్తోందన్న ఆయన ఆ వీడియోలో.. తనకు మేఘనను వివాహం చేసుకోవడం తనకు ఇష్టం లేదనీ, తనకు నువ్వే బలవంతంగా చేశామనీ తండ్రి జోగి రమేష్ పై ఆగ్రహం వ్యక్తం చేయడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు.    అదంతా పక్కన పెడితే.. మేఘన తన ఫిర్యాదులో  పేర్కొన్న అంశాలు చాలా తీవ్రమైనవని పేర్కొన్న డీవీ శ్రీనివాస్.. 50 లక్షల రూపాయల పెళ్లి ఖర్చుల అంశంతో పాటు అదనపు కట్నం కోసం ఒత్తిడి,  గోవా పర్యటనలోనూ, ఇబ్రహీంపట్నంలోని నివాసంలోనూ తనపై హత్యాయత్నం జరిగిందని మేఘన ఫిర్యాదు చేస్తే.. కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటి వరకూ ఎందుకు చర్యలు ఎందుకు తీసుకోలేదని డీవీ శ్రీనివాస్ అన్నారు.  సామాన్యుల విషయంలో ఇలాంటి తీవ్ర ఆరోపణలు వస్తే వెంటనే చర్యలు తీసుకునే పోలీసులు, మాజీ మంత్రి ఫ్యామిలీ విషయంలో ఎందుకు విచారణ వేగవంతం చేయలేదని నిలదీశారు.   గతంలో ప్రతిపక్ష నేతల నివాసాలపై దాడి చేయడం, అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేయడం ద్వారా నిత్యం వివాదాలలో నిలిచిన   జోగి రమేష్‌కు ఈ వ్యవహారం రాజకీయంగా  ఎదురుదెబ్బ అనడంలో సందేహం లేదు. అధికారంలో ఉన్న సమయంలో కన్నూమిన్నూ కానకుండా వ్యవహరించిన జోగు రమేష్ కు కర్మ రిటర్న్ అయ్యిందన్న చర్చ జరుగుతోందన్న డీవీ శ్రీనివాస్.. ఇది జోగి రమేష్ కు రాజకీయ సమాధిగానే చూడాలన్నారు.     డీవీ శ్రీనివాస్  ఇంటర్వ్యూ పూర్తి పాఠం తెలుగువన్ న్యూస్ చానల్ లో వీక్షించండి Jogi Ramesh, Jogi Rajiv, Meghana, Familydispute, SonRevolt #Jogi Ramesh Family Issue, TeluguOne, DVSrinivas
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఖాళీగా ఉన్న గవర్నర్ నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ విషయంలో సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. నిబంధనల ప్రకారం భర్తీ చేయాల్సిన ఈ పదవుల కోసం ఆయన ఇప్పటికే ఇద్దరి పేర్లు ప్రతిపాదించారు.  సామాజిక న్యాయం, ప్రాంతీయ సమతుల్యతతో పాటు పార్టీ పట్ల అంకిత భావాన్నీ, పార్టీ కోసం పని చేసిన తీరునూ కూడా పరిగణనలోనికి తీసుకుని మరీ ఈ పేర్లు ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం.     శాసనమండలి ప్రాతినిధ్యంలో భాగంగా సీనియర్ నాయకుడు, తెలుగుదేశం  పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య,  రాయలసీమ ప్రాంతానికి చెందిన బీసీ సామాజిక వర్గ మహిళా నాయకురాలు, అనంతపురం లోక్‌సభ నియోజకవర్గ అంగన్‌వాడీ అసోసియేషన్ అధ్యక్షురాలు దళవాయి రమాదేవి పేర్లను చంద్రబాబు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.  దశాబ్దాలుగా పార్టీకి విధేయుడిగా ఉంటూ, క్లిష్టమైన రాజకీయ పరిస్థితుల్లో సైతం విధానపరమైన అంశాలపై గళం విప్పిన వర్ల రామయ్య సేవలకు తగిన గుర్తింపునిచ్చేందుకు వర్ల రామయ్య, అలాగే  ప్రజా సమస్యలపై పోరాడుతూ స్థానిక స్థాయిలో బలమైన ముద్ర వేసిన మహిళకు అవకాశం కల్పించచాలన్న ఉద్దేశంతో దళవాయి రమాదేవిని చంద్రబాబు ఎంపిక చేశారని అంటున్నారు.  వీరి అభ్యర్థిత్వంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు.    AP Governor Quota MLC, Varla Ramaiah, Dalavai Ramadevi, TDP MLC Candidates, AP Legislative Council, CBN, APpolitics, TeluguOne
  ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్‌ రెడ్డికి జాయింట్‌ కో-ఆర్డినేటర్‌ బాధ్యత..! ఆంధ్రప్రదేశ్ బీజేపీ యువ నేత, పార్టీ వక్త ఎస్. విష్ణువర్ధన్ రెడ్డికి జాతీయ స్థాయిలో కీలక బాధ్యత దక్కింది. బీజేపీ నూతన జాతీయ కార్యవర్గంలో ఆయనను ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా నియమించారు. రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్న ఆయనకు జాతీయ స్థాయిలో సంస్థాగత బాధ్యత అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వివిధ రాష్ట్రాల్లో పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న సెల్స్, విభాగాల మధ్య సమన్వయం చేయడం విష్ణువర్ధన్ రెడ్డి ప్రధాన బాధ్యతగా ఉండనుంది. ఆయా విభాగాల కార్యకలాపాలను పార్టీ జాతీయ నాయకత్వంతో అనుసంధానం చేయడంతో పాటు, పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో ఆయన కీలకంగా వ్యవహరించనున్నారు.  దీంతో ఇప్పటివరకు ఏపీ రాజకీయాలకే పరిమితమైన ఆయన రాజకీయ బాధ్యతలు జాతీయ స్థాయికి విస్తరించనున్నాయి. విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పటికే బీజేపీ వక్తగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో గుర్తింపు పొందారు. పార్టీ విధానాలను మీడియా వేదికలపై బలంగా వినిపించడం, రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు సమాధానం ఇవ్వడం, సమకాలీన అంశాలపై బీజేపీ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన వాగ్దాటి, రాజకీయ అంశాలపై అవగాహనకు తోడు సంస్థాగత అనుభవం కూడా ఉండటంతో తాజాగా జాతీయ స్థాయిలో సమన్వయ బాధ్యత అప్పగించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీ నూతన జాతీయ కార్యవర్గంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేతలకు ప్రాధాన్యత లభించింది. దగ్గుబాటి పురందేశ్వరికి జాతీయ ఉపాధ్యక్షురాలిగా, రాంమాధవ్‌కు జాతీయ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు దక్కగా, విష్ణువర్ధన్ రెడ్డికి కీలకమైన సమన్వయ బాధ్యత లభించింది. ఒకే జాతీయ కార్యవర్గంలో ఏపీకి చెందిన నేతలకు కీలక బాధ్యతలు దక్కడంతో రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. సీనియర్ నేతలతో పాటు యువ నాయకత్వానికి జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించడంలో భాగంగానే విష్ణువర్ధన్ రెడ్డి నియామకాన్ని రాజకీయ వర్గాలు చూస్తున్నాయి.  యువతతో అనుసంధానం, పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడం వంటి అంశాల్లో ఆయనకు ఉన్న అనుభవాన్ని ఇక దేశవ్యాప్తంగా పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో వినియోగించుకునే అవకాశం లభించింది. ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నాయకులు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ విభాగాలతో సమన్వయం చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో పార్టీ వక్తగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విష్ణువర్ధన్ రెడ్డికి జాతీయ స్థాయిలో సంస్థాగత బాధ్యత లభించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో కీలక మైలురాయిగా నిలిచింది. S. Vishnuvardhan Reddy, BJP, D Purandeswari, Ram Madhav, Smriti Irani, Andhra Pradesh BJP, Telangana BJP, Pm modi, Nitin Nabin, Smriti Irani, Vasundhara Raje
పంద్రాగస్టున ఎర్రకోట బురుజులపై నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఉపయోగించిన దిమాగీ నక్సల్ అన్న పదంపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా  రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఆ ప్రసంగంలో  పీఎం మోదీ ప్రయోగించిన  దిమాగీ నక్సల్  అంటే ఆలోచించే లేదా మేధో నక్సలైట్లు  అని అర్ధం.   ఈ పద ప్రయోగంపై విపక్షాలు, రాజకీయ విశ్లేషకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే మేధావులు, ప్రతిపక్ష నేతలు, విశ్లేషకులపై ముద్ర వేయడానికే ఈ పదాన్ని సృష్టించారంటున్నారు ప్రముఖ విశ్లేషకుడు భరద్వాజ.  తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన విధానాలను విమర్శించే వారికి నక్సల్ బ్రాండ్ వేసే ప్రయత్నంలో భాగమే మోడీ నోటి వెంట దిమాగీ నక్సల్ అన్న పదం రావడానికి కారణమన్నారు. గతంలో అర్బన్ నక్సలైట్లు అని మేధావులపై బ్రాండ్ వేసిన సంగతిని ఆయనీ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో ఉన్న అర్బన్ నక్సల్,   రూరల్ నక్సల్ అనే పదాల సరసన ఇప్పుడు  దిమాగీ నక్సల్'అనే కొత్త బ్రాండ్‌ను చేర్చారన్నారు భరద్వాజ. అంతేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో  నక్సలైట్లను భౌతికంగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించి మార్చి 31 2026 డెడ్ లైన్ విధించిన సంగతిని గుర్తు చేశారు. ఇప్పుడు  ప్రభుత్వంపై ఎవరైనా విమర్శలు చేసినా,  ప్రజాసమస్యలపై ప్రశ్నించినా వారిని దిమాగీ నక్సల్  అకౌంట్‌లో వేసి, భయాందోళనలు సృష్టించేందుకు యత్నిస్తున్నారన్నారు. గతంలో నక్సల్ ముక్తి భారత్ అన్నట్లుగానే.. దిమాగి నక్సల్ విముక్తి భారత్ అని పరోక్షంగా హెచ్చరించడమే దీని ఉద్దేశమని భరధ్వాజ విశ్లేషషించారు. అంటే.. ఇండియాను  మెదడు లేదా ఆలోచన రహిత భారత్ వైపు నడిపించాలని మోడీ అనుకుంటున్నారా అన్న సందేహం వస్తుందన్నారు.  కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలను, విమర్శకులను టార్గెట్ చేస్తూ వరుసగా బ్రాండింగ్ రాజకీయాలకు పాల్పడుతోందన్నారు భరద్వాజ.  స్వాతంత్ర్య దినోత్సవం రోజున అహింసా మార్గాన్ని స్మరించుకుంటూనే, మరోవైపు ఎర్రకోట ప్రాంగణం నుంచే  దిమాగీ నక్సల్స్ అంటూ హెచ్చరించడం ద్వారా ప్రధాని జనాలకు ఏం సందేశమిచ్చారో స్పష్టమేనన్న భరద్వాజ ప్రస్తుతం ఎమర్జెన్సీ నాటి నిర్బంధాన్ని మించి దారుణ పరిస్థితులున్నాయన్నారు.   భరద్వాజ ఇంటర్వ్యూ పూర్తి పాఠం తెలుగువన్ న్యూస్ చానెల్ లో వీక్షించడండి.  PM Modi Dimagi Naxal Comments,  Red Fort,  Independence Day Speech,  controversial speech, Opposition reaction, TeluguOne   
ఏపీ అసెంబ్లీ వేదికగా  మంత్రి నారా లోకేష్  మెగా డీఎస్సీపై వైసీపీ విమర్శలను సమర్ధంగా తిప్పికొట్టారు.  మెగా డిఎస్సీ నిర్వహణ, ఫలితాలపై వైసిపి చేస్తున్న అసత్య ప్రచారాలను ఆయన అసెంబ్లీలో, మండలిలో ఆధారాలతో సహా  ఖండించారు. ప్రభుత్వం పారదర్శకంగా రికార్డు స్థాయిలో 148 రోజుల్లోనే 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసిందని విద్యాశాఖ మంత్రి విస్పంష్టంగా తేల్చి చెప్పారు. లోకేష్ సభ సాక్షిగా ఇచ్చిన వివరణతో వైసీపీకి బుల్లెట్ దిగిందా అన్నట్లుగా రిప్లై ఇచ్చారు. లోకేష్ వైసీపీకి ఎక్కడ ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో అక్కడ, అలా ఇచ్చేశారని విశ్లేషించారు సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ అనలిస్టు డీవీ శ్రీనివాస్.  తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన డీవీ శ్రీనివాస్.. లోకేష్ సమావేశంతో జగన్ చెబుతున్నట్లు ప్రభుత్వం పారిపోలేదనీ జగనే పారిపోతున్నారని తేటతెల్లమైందని అన్నారు. సరిపోదా జగన్ సరిపోదా లోకేష్ రిప్లై అని ప్రశ్నించారు. లోకేష్ బుల్లెట్ లాంటి రిప్లై ఇచ్చారన్న ఆయన.. ఇప్పటికి మూడు సార్లు చర్చకు రావాలని చేసిన లోకేష్... ఇప్పుడు నాలుగో సారి సవాల్ చేశారన్న డీవీ శ్రీనివాస్.. సభకు రాకుండా వైసీపీ పారిపోయిందనడానికి ఆ పార్టీ సభ్యులు సభకు రాకపోవడమే నిదర్శనమన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ ఐదు డీఎస్సీలు నిర్వహించాల్సిన ఆయన ప్రభుత్వం ఒక్క డీఎస్సీ ఎందుకు నిర్వహించలేకపోయిందో చెప్పాలన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకూ ఇప్పుడు వైసీపీ లోకేష్ రాజీనామా చేయాలన్న డిమాండ్ కూ పొంతన లేదన్నారు.   డీవీ శ్రీనివాస్ ఇంటర్వ్యూ పూర్తి పాఠం తెలుగువన్ న్యూస్ చానెల్ లో వీక్షించండి.  Nara Lokesh AP Assembly Speech, Mega DSC Results Andhra Pradesh, Nara Lokesh Counter To YCP, AP Teacher Recruitment News, Mega DSC Latest News Telugu
ALSO ON TELUGUONE N E W S
Agadha is a film that is so different from the regular breed of movies that come and go, especially within the horror genre. In fact, to simply call it horror would almost be a disservice. It is an atmospheric thriller steeped in mysticism and the supernatural, elevated by some towering performances from its cast. Shravan Reddy plays a character that is remarkably layered. He begins at a place that feels seemingly normal and familiar, but as the film progresses, the character slowly reveals shades that allow Shravan to showcase both his range and his understanding of the role. There is something increasingly unsettling about his performance — not because he overtly plays for menace, but because he never quite lets you comfortably read where the character stands. He moves effortlessly between the positive and negative shades, inhabiting that difficult grey zone with aplomb. Even in his quieter moments, there is an undercurrent that keeps you watching him, wondering what lies beneath. By the time the film ends, Shravan has taken the character somewhere far removed from where we first encountered him. It is a controlled, assured performance — and one that stays with you long after the end credits roll. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  ఈ మధ్య కాలంలో అంటే దగ్గర దగ్గరగా ఒక దశాబ్దం అనుకోండి, ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే పాజిటివ్ వైబ్రేషన్ తెచ్చుకున్న మూవీ ఏదైనా ఉంది అంటే 'ఇరుముడి' అని చెప్పవచ్చు.  పైన చెప్పుకునే ఆ మాట పాతది అయిపోయిందంటే సదరు వర్డ్ ఎంతగా అభిమానుల్లో, ప్రేక్షకులో నానుతూ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ నెల 21 న రిలీజ్ కి సిద్దమవుతుండటంతో వాళ్ళందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తూ ఉన్నారు. కొంత మంది అయ్యప్ప స్వామి భక్తులైతే ఇరుముడికి చెప్పులు లేకుండా వెళ్తామనే కామెంట్స్ కూడా చేస్తున్నారు. కానీ ఇప్పుడు వాళ్లంతా ఇరుముడి విషయంలో టెన్షన్ గా ఉన్నారు.  ఇటీవల హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక్కసారిగా సోషల్ మీడియాను షేక్ చేసింది. సాధారణంగా ఏ సినిమా ప్రమోషన్స్ అయినా పాజిటివ్ వైబ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్‌తో సాగిపోతుంటాయి, కానీ ఈ వేడుక మాత్రం సరికొత్త రచ్చకు దారితీసింది. రవితేజ, అజయ్ ఘోష్ చేసిన బూతు   సంభాషణలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కాగానే నెటిజన్లు, ముఖ్యంగా రవితేజ అభిమానులు, అయ్యప్ప స్వామి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'ఇరుముడి' అనే పేరుకి అయ్యప్ప స్వామి భక్తుల దృష్టిలో ఎంతో పవిత్రమైన అర్థం ఉంది. సినిమాలో హీరో అయ్యప్ప స్వామి మాల ధరించి, ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్న తండ్రి పాత్రలో కనిపిస్తున్నారు. ఇటువంటి పవిత్రమైన సినిమా వేడుకలో, పబ్లిక్ స్టేజ్ మీద వేలాది మంది ప్రేక్షకులు మరియు కుటుంబాలు చూస్తుండగా అలాంటి అసభ్య పదాలను వాడడం సమంజసం కాదని ఫైర్ అవుతున్నారు.  ఈ రకమైన అనుచిత సంభాషణలు భవిష్యత్తు ఈవెంట్లలో పునరావృతం కాకూడదని, సినిమా వేదికలపై నటీనటులు క్రమశిక్షణతో మాట్లాడాలనే విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. Also Read: చిరంజీవిని కామెడీ హీరో అనుకుంటున్నారా.. ఆర్డరా, రిక్వెస్టా!  సినిమాకి మంచి బజ్ వస్తున్న సమయంలో ఈ వివాదం రావడం కొంతమందికి మైలేజ్ ఇచ్చినా, సాంప్రదాయ ప్రేక్షకుల మనోభావాలను దెబ్బతీసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో యూనిట్ దీనిపై ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఏది ఏమైనా టంగ్ అదుపులోలేకపోతే ఎంత పెద్ద హీరోకైనా, సినిమాకైనా ఇబ్బందని సినీ చరిత్ర చెప్తుంది. Irumudi, Raviteja, Priya Bhavani Shankar
‘ఆయ్’, ‘సేవ్ ది టైగర్స్’, ‘వికటకవి’, ‘గుర్తుకొస్తున్నాయి’ వంటి అద్భుతమైన ప్రాజెక్ట్‌లతో సంగీత దర్శకుడిగా అజయ్ అరసాడ తెలుగు ప్రేక్షకుల్లో ఓ ముద్ర వేశారు. వరస ఆఫర్లతో మ్యూజిక్ డైరెక్టర్‌గా దూసుకుపోతోన్న అజయ్ అరసాడ తన సినీ జర్నీని షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఎన్నో విషయాల్ని పంచుకున్నారు. ఆయన చెప్పిన సంగతులివే.. మీ నేపథ్యం గురించి చెప్పండి? మా ఫ్యామిలీ, నా రక్తంలోనే ఆర్ట్, మ్యూజిక్ ఉంది. మాది వైజాగ్. టీసీఎస్‌లో ఉద్యోగం కూడా చేశాను. ఏడేళ్లు జాబ్ చేశాను. అలా జాబ్ చేస్తుండగానే రెండు సినిమాలకు పని చేశాను. నాకు దేవీ శ్రీ ప్రసాద్ స్పూర్తి. మా అమ్మ, భార్య సపోర్ట్ వల్లే నేను ఈ ఇండస్ట్రీలోకి రాగలిగాను. వైజాగ్‌లోనే శ్రీ చరణ్ నాకు మంచి ఫ్రెండ్. ‘గూఢచారి’కి నన్ను కీబోర్డ్ ప్రోగ్రామర్‌గా తీసుకున్నాడు. చిన్న చిత్రాల్ని చేస్తుండటంలో మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటి? చిన్న చిత్రాలకు పని చేయడం వల్ల నాకు ఎక్కడా ఇబ్బంది కలగలేదు. మంచి ప్రొడక్షన్స్ కావడం వల్ల ఎప్పుడూ కూడా పేమెంట్స్ విషయంలో తేడా రాలేదు. ఈ క్రమంలో నాకు ఎలాంటి ఛాలెంజెస్ ఎదురు కాలేదు. మీకంటూ ఓ ప్రత్యేకత ఏర్పడాలని ప్రయత్నిస్తున్నారా? అన్ని రకాల జానర్‌లు, కథల్ని చేయాలని అనుకుంటున్నాను. నా వద్దకు వచ్చిన కథకు న్యాయం చేయాలని చూస్తాను. నా వద్దకు మాస్ కథ వస్తే.. మాస్ మ్యూజిక్ వస్తుంది. బడ్జెట్‌ను పట్టి మ్యూజిక్ మారుతుందా? ఒక్కో సింగర్ ఒక్కోలా ఛార్జ్ చేస్తారు. నా పాటకు ఎవరు సెట్ అవుతారు అని అనుకుంటే వారితోనే ప్రొసీడ్ అవుతాను. ఎందుకంటే ఫైనల్‌గా అది నా పాట. జీవితాంతం నిలిచే పోయే పాటగా ఉండాలని చూస్తాను. కెరీర్‌ స్టార్టింగ్‌లో అనురాగ్ కులకర్ణితో పాడిస్తా అని అంటే ఓ నిర్మాత వద్దని అన్నాడు. ఇప్పుడు ఆ నిర్మాతే అనురాగ్‌తో పాడించుకునే స్థాయిలో లేడు (నవ్వుతూ). థియేటర్‌ కోసం పని చేసినప్పుడు, ఓటీటీ కోసం పని చేసినప్పుడు ఉండే తేడా, మీకు కలిగే ఫీలింగ్ ఏంటి? మేం థియేటర్‌కి సరిపోయేలా మ్యూజిక్, స్కోర్ ఇస్తాం. దాన్ని చివరకు ఓటీటీలోకి తీసుకు వస్తారు. అప్పటి వరకు మేం పడిన కష్టం వృథా అవుతుంది. ‘వికటకవి’ని ఒకవేళ థియేటర్‌లో చూస్తే సౌండింగ్ పరంగా వేరే లెవెల్లో ఉంటుంది. ఓటీటీకి వచ్చే సరికి నేను చేసినది యాభై శాతానికి పడిపోతుంది. మ్యూజిక్ మీద ఏఐ ప్రభావం ఎంత వరకు ఉంటుంది? మ్యూజిక్ మీద ఏఐ ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు. ఏఐలో ఎంత ప్రాంప్టింగ్ ఇచ్చినా కూడా ఒకేలా ఉంటాయి. కొంత మంది నిర్మాతలు ఏఐ నుంచి ట్రాక్స్ పంపి.. ఇలా కావాలని అంటారు. అలాంటప్పుడు మేం ఎందుకు మీరే కొట్టుకోండి అన్నట్టుగా అనిపిస్తుంది (నవ్వుతూ). ఏఐని వాడి ఏ టెక్నీషియన్ అయినా పని చేయొచ్చు. కానీ ఏఐని వాడి ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వొచ్చని మాత్రం అనుకోకూడదు (నవ్వుతూ). రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ఏం మాట్లాడారు? నేను జనసేన కార్యక్రమాలకు మ్యూజిక్ ఇస్తాను. మొన్న మోదీ గారిని ఆయన కలిసినప్పుడు ఓ స్కోర్ చేశాను. నా వర్క్ చూసి ఆయన పిలిపించారు. ఆయన నాతో పర్సనల్‌గా మాట్లాడారు. పొలిటికల్‌గా అయినా సరే, పీకే క్రియేటివ్స్ బ్యానర్ కోసమైనా సరే పని చేద్దామని ఆయన అన్నారు. జన సేన కోసం ఎప్పటి నుంచి పని చేశారు? ఆ అవకాశం ఎలా వచ్చింది? వెంకట్ చిక్కాల అనే నా మిత్రుడు అక్కడ ఎడిటర్‌గా పని చేస్తున్నాడు. అలా నా ఫ్రెండ్ వల్ల ఆ అవకాశం వచ్చింది. బన్నీ వాస్ గారు కూడా నాతో చాలా వర్క్ చేయించారు. అక్కడి నుంచే నాకు ‘ఆయ్’ అవకాశం వచ్చింది. మీరు బయట ఎక్కడా ఎందుకు కనిపించరు? నాకు బయటకు వచ్చి నా పనితనం గురించి నేనే చెప్పుకోవడం నాకు నచ్చదు. నేను ఇంట్రోవర్ట్. ఎక్కువగా మాట్లాడను. ఈవెంట్లలో కనిపించను. సెల్ఫ్ ప్రమోషన్స్ చేసుకోవడం అన్నది నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ అని చెప్పిన వెంటనే మీ రియాక్షన్ ఏంటి? నాతో ఆయన పర్సనల్‌గా ఎందుకు మాట్లాడతారు అని అనుకున్నా. కానీ మళ్లీ ఫోన్ చేసి మీటింగ్ గురించి చెప్పారు. ఓ ఐదారు నిమిషాలు మాట్లాడి, ఫోటో దిగేసి వస్తానని అనుకున్నా. కానీ నేను వెళ్లే సరికి ఆయన ఒక్కరే ఉన్నారు. దాదాపు అరగంట మాట్లాడారు. ఎన్నో విషయాలు చర్చించుకున్నాం. కలిసి చేయాల్సిన ప్రాజెక్ట్‌ల గురించి ఆయన చెప్పారు. మీ దగ్గర ఉన్న ఓ వస్తువు గురించి ఆయన అడిగారని తెలిసింది? నా దగ్గర కాఫీ మగ్ షేప్‌లో ఉండే ఓ బోస్ స్పీకర్ ఉంటుంది. ఇదేంటి ఆయన అడిగారు. దాన్ని పట్టుకుని సరదాగా చూసుకుంటూ నవ్వారు. ఇదేంటి కాఫీ కప్పులా ఉందని కామెడీ చేశారు. కాఫీ పట్టుకొచ్చావా? అని జోక్స్ వేశారు. ఈయనేంటి? నాతో జోక్స్ వేస్తున్నారు అని అనుకుని లోలోపల సంబరపడిపోయాను. ఇప్పుడున్న దర్శకులతో పని చేయడం ఎలా అనిపిస్తుంది? ఒకప్పుడు దర్శకులు సిట్యువేషన్ గానీ, కాన్సెప్ట్ గానీ చెప్పి ట్యూన్ కావాలని అనేవారు. కానీ ఇప్పుడు వస్తున్న చాలా మందికి అది తెలియడం లేదు. సీన్స్ గురించి చెప్తారు. కానీ సీన్‌లో ఏం చెప్పాలని అనుకుంటారు.. దాని కాన్సెప్ట్ ఏంటి? ఎలాంటి పాట కావాలని చెప్పలేకపోతోన్నారు.. సినిమా కాన్సెప్ట్‌ని కూడా మాకు సరిగ్గా వివరించలేక పోతోన్నారు. కాన్సెప్ట్ చెప్తే గానీ ఓ లిరిసిస్ట్ సాహిత్యాన్ని రాయలేడు, నేను ట్యూన్ ఇవ్వలేను. మ్యూజిక్ విషయంలో క్రెడిట్స్ మిస్ అవ్వడం, వేరే వాళ్లకి క్రెడిట్స్ వెళ్లడంపై మీ అభిప్రాయం ఏంటి? ‘ఆయ్’ విషయంలో నాకు అలాంటి ఓ పరిస్థితి వచ్చింది. రామ్ మిర్యాల గారు కూడా రెండు పాటలు ఇచ్చారు. మిగతాది అంతా నేను చేశాను. కానీ పేరు మాత్రం ఆయనదే కనిపించేది. మీడియాలో అలా తప్పుగా వెళ్లింది. అందుకే ప్రతీ ఈవెంట్‌లో బన్నీ వాస్ గారు నా పేరుని చెబుతూ ఉండేవారు. మీడియాలో కొన్ని చోట్ల అలా వచ్చిన దాన్ని బన్నీ వాస్ గారు కరెక్ట్ చేయడానికి ప్రయత్నించారు. రీసెంట్‌గా ‘సేవ్ ది టైగర్స్’ టైంలో నా పేరు కాకుండా ఎవరి పేరో కనిపించింది. నేను మాత్రం నా టీంలో ప్రతీ ఒక్కరికీ క్రెడిట్ ఇస్తాను. పదేళ్ల జర్నీపై మీరు సంతృప్తిగా ఉన్నారా? పేరుకి పదేళ్లు అయినా మధ్యలో చాలా టైంని కరోనా తినేసింది. నా ఈ జర్నీలో నా మీద నాకు నమ్మకం ఏర్పడింది. ఎలాంటి సినిమాకి అయినా మ్యూజిక్ ఇవ్వగలను. పెద్ద కమర్షియల్ మూవీకి కూడా అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చగలను. ఈ పదేళ్లలో నేను ఈ కాన్ఫిడెన్స్‌ను సంపాదించుకున్నాను. సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను.       Music Director, Ajay Arasada, Interview, Pawan Kalyan  
    మెగాస్టార్ చిరంజీవి.. మాస్ కి బొడ్డు  కోసి పేరుపెడితే అది చిరంజీవి అవుతుందనే నానుడి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో చాలా బలంగా నాటుకుపోయింది.  నాటుకుపోవడమే కాదు చిరు నుంచి వచ్చిన మాస్ డాన్స్, మాస్ డైలాగ్స్, మాస్ మేనరిజమ్స్, మాస్ ఫైట్స్ ని నేటికీ చాలా మంది అనుకరిస్తూ ఎంతో సంతోషపడుతుంటారు. థియేటర్స్ లో అయితే ఈలలు ఆగేవి కావు. అందుకే చిరంజీవి సినిమాకి ఒక వారం తర్వాత వెళ్ళాలి. అప్పుడే ప్రతి డైలాగ్ వినపడుతుందని అనేవారు. అంతలా చిరు తన మాస్ మానియాతో ఉర్రుతలూగించేవాడు.    అయితే ఈమధ్య కాలంలో వస్తున్న చిరు  సినిమాలని గమనిస్తే.. యంగ్, కమర్షియల్ దర్శకులు చిరంజీవి అసలు సిసలు మాస్ చరిష్మాని  పూర్తిగా పక్కనబెట్టి, కేవలం కామెడీ, ఫన్ సీన్ల చుట్టూనే కథలని అల్లుతున్నారనే తీవ్రమైన విమర్శ అభిమానుల్లోనూ, సినీ  విశ్లేషకుల్లోనూ వ్యక్తమవుతోంది. చిరంజీవి అంటే కేవలం టైమింగ్ ఉన్న కామిక్ యాక్టర్ మాత్రమేనా? ఆయనలోని వింటేజ్ మాస్ ఎలివేషన్లను వెలికితీసే బలమైన కథలు రాయడంలో నేటి తరం దర్శకులు విఫలమవుతున్నారా అనేది ఇప్పుడు ఇండస్ట్రీ వ్యాప్తంగా జరుగుతున్న ప్రధాన చర్చ.  గతంలో చిరంజీవి చేసిన దాదాపుగా అన్ని చిత్రాల్లో హ్యూమర్ పండినప్పటికీ, ఆ సినిమాలకు బలమైన కథ, ఆకట్టుకునే భావోద్వేగాలు పునాదిగా ఉండేవి. కానీ, రీసెంట్ ఇయర్స్ లో వచ్చిన కొన్ని మల్టీస్టారర్లు, సోలో ప్రాజెక్ట్‌లని పరిశీలిస్తే, కేవలం కొన్ని రోటీన్ కామెడీ సన్నివేశాలు, నలుగురు కమెడియన్లతో పస లేని సీన్లు రాసి, చిరంజీవితో హడావుడి చేయించడానికే ప్రాధాన్యత ఇస్తున్నారనిపిస్తోంది. ఆయనకున్న స్వతహాసిద్ధమైన 'మాస్ ఆరా'ను పూర్తిస్థాయిలో ఎలివేట్ చేసే డార్క్, ఇంటెన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ లోపించాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 1990ల నుండి 2000ల ఆరంభం వరకు 'ఘరానా మొగుడు', 'గ్యాంగ్ లీడర్', 'ఇంద్ర' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో చిరంజీవి మాస్ ఇమేజ్ బాక్సాఫీస్ వద్ద 30 నుండి 40 కోట్ల రూపాయల రికార్డు వసూళ్లను ఆ కాలంలోనే సాధించింది.  అంటే ఆయన పవర్‌ఫుల్ పాత్రలకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ ఎంతటిదో ఈ గణాంకాలే నిరూపిస్తాయి.  రీఎంట్రీ తర్వాత కూడా 'వాల్తేరు వీరయ్య' వంటి సినిమాలు 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టి, చిరంజీవి బాక్సాఫీస్ పొటెన్షియల్ తగ్గలేదని స్పష్టం చేశాయి. కానీ, కథనంలో నాణ్యత లేకపోవడం, కేవలం లైట్-హార్టెడ్ కామెడీ డ్రామాలకే పరిమితం చేయడం వల్ల కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోతున్నాయి. నేటి తరం దర్శకులు ట్రెండీ హ్యూమర్ మరియు డిజిటల్ మీమ్ కల్చర్‌పై దృష్టి పెడుతూ, చిరులోని గంభీరమైన నటనను, హై-వోల్టేజ్ ఎమోషనల్ సీన్లను వదిలేస్తున్నారనే కామెంట్లు వస్తున్నాయి. అభిమానులు మాత్రం ‘జగదేకవీరుడు’లోని మేజిక్, ‘ఇంద్ర’లోని ఫ్యాక్షన్ మాస్ ఎలివేషన్లు, ‘ఠాగూర్’లోని సామాజిక శౌర్యం వంటి బలమైన పాత్రల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి రాబోయే ప్రాజెక్టుల్లోనైనా టాలెంట్ ఉన్న దర్శకులు చిరంజీవి ఒరిజినల్ మాస్ పొటెన్షియల్ ని వాడుకుని వింటేజ్ చిరుని థియేటర్లలో చూపిస్తారో లేదో వేచి చూడాలి. చిరంజీవి కెరీర్ స్టార్టింగ్ నుంచి చేసిన  గత సినిమాల వైభవాన్ని పరిగణలోకి తీసుకోవాలని కూడా ఫ్యాన్స్ కోరుతున్నారు. Chiranjeevi, Mass Image  
నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ చిత్రం #NBK112 ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. బడ్జెట్ సమస్యలు, హీరో-డైరెక్టర్ మధ్య సింక్ కుదరలేదంటూ వస్తున్న రూమర్లపై తాజాగా మూవీ టీమ్ అధికారికంగా స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్ అనగానే.. అనౌన్స్ మెంట్ తోనే అంచనాలు ఓ రేంజ్ లో నెలకొన్నాయి. బాలయ్య మాస్ పవర్, కొరటాల మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన సోషల్ మెసేజ్ కలిస్తే థియేటర్లు షేక్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ భావించారు.  కానీ గడిచిన రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒక న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. అమరావతిలో ఎంతో అట్టహాసంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ #NBK112 ప్రాజెక్ట్ బడ్జెట్ ఇష్యూస్ వల్ల, అలాగే బాలయ్య - కొరటాల మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల పూర్తిగా ఆగిపోయిందంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఈ వార్తలు విన్న నందమూరి అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ప్రాజెక్ట్ అటకెక్కిందా అనే చర్చలే జరుగుతున్నాయి.  అయితే, ఈ వైరల్ రూమర్లపై 'Team NBKKoratalaSiva' అఫీషియల్‌గా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చేసింది. అసలు ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, ప్రాజెక్ట్ ఆగిపోలేదని స్పష్టం చేసింది. అభిమానులు ఎలాంటి నిరాధారమైన అసత్య ప్రచారాలను, రూమర్లను నమ్మవద్దని కోరింది. ప్రస్తుతం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'NBK111' ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు. ఈ 'NBK111' షూటింగ్ పూర్తి కాగానే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా 'NBK112' వెంటనే సెట్స్ పైకి వెళ్తుందని మేకర్స్ స్పష్టం చేశారు. దాంతో బాలయ్య - కొరటాల ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ వస్తున్న వార్తలకు చెక్ పడింది.        Nandamuri Balakrishna, Koratala Siva, NBK112 Movie  
Celebrated for its refreshing take on first love and emotionally resonant storytelling, Chennai Love Story is set to make its digital premiere on Sony LIV on 21st August. A ₹60 Cr+ grosser that won audiences over in theatres with its heartfelt narrative, soulful music, and charming performances, the romantic drama now arrives on streaming for viewers across the country in Telugu, Tamil, Malayalam, Kannada and Hindi Directed by Ravi Namburii, with the screenplay handled by Ravi Namburii and Sai Rajesh Neelam, the film is written by Sai Rajesh and produced by SKN and Sai Rajesh Neelam under the banners of Amrutha Productions and Mass Movie Makers. Kiran Abbavaram and Sri Gouri Priya play the lead roles. Set against the vibrant backdrop of Chennai, the coming-of-age romance follows two young hearts as they navigate the excitement, innocence, and heartbreak of first love, discovering that growing up is as much about finding yourself as it is about finding each other. Sharing her excitement about the OTT premiere, actor Kiran Abbavaram said, “Chennai Love Story is a very special film for me because it captures the innocence, excitement and emotions that come with first love. The love and support audiences gave the film made this entire journey incredibly memorable for all of us. I’m excited that the story can now reach viewers across different languages and regions with its digital premiere on Sony LIV. I hope audiences connect with the characters, revisit their own memories of love and growing up, and enjoy the film as much as we enjoyed making it. Talking about the film Sri Gouri Priya said, “One of the most beautiful things about Chennai Love Story is that it reminds us of a phase of life we never really forget, our first love. The response we received in theatres was overwhelming, and I’m deeply thankful for it. I’m thrilled that the film is now coming to Sony LIV, where it can find a new audience and perhaps become a part of someone’s own memories and conversations. I hope viewers laugh, smile, and feel every emotion that made this journey so special for us.”    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.    https://www.instagram.com/p/DcBjx-5xsTE
న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఒదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'ది ప్యారడైజ్'. దసరా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని దాటిపోయాయి. ఇప్పటికే విడుదలైన 'ఆయా షేర్' సాంగ్ మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ తెచ్చుకుని, ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. ప్రతీ చోటా ఈ సాంగ్ మారుమోగిపోతోంది. రాబోయే వారంలో 'ది ప్యారడైజ్' చిత్రం నుంచి మరొక స్పెషల్ తెలంగాణ ఫోక్ సాంగ్ అప్‌డేట్ రాబోతోంది. ఈ పాట ఊర మాస్ బీట్స్‌తో, తెలంగాణ నేటివిటీని ప్రతిబింబించేలా, వింటేనే పూనకాలు వచ్చే విధంగా రూపుదిద్దుకుందట. ఈ పాట ఏకంగా 200 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టే పొటెన్షియల్ ఉందని అంటున్నారు. తెలంగాణ ఫోక్ డ్రమ్స్, పక్కా లోకల్ లిరిక్స్, నాని ఎనర్జెటిక్ మాస్ డాన్స్ మూవ్స్ ఈ పాటలో ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయట. 'దసరా' సినిమాలో 'చమ్కీల అంగీలేసి' పాట ఎలాగైతే అన్ని చోట్లా మారుమోగిపోయిందో.. ఇప్పుడు రాబోతున్న ఈ కొత్త ఫోక్ సాంగ్ కూడా అదే రేంజ్‌లో సంచలనం సృష్టిస్తుందని చెబుతున్నారట. ఈ సాంగ్ అనౌన్స్‌మెంట్ వచ్చే వారంలోనే ఒక మైండ్ బ్లోయింగ్ పోస్టర్‌తో రాబోతోందని టాక్.     Nani, The Paradise, Aaya Sher Song, Telangana Folk Song  
Sunil and Akhil Uddemari play the lead roles in the upcoming psychological thriller “Fight Maha,” featuring Dr. Srivani Gopichand, Vaishnavi, Siddharth, and Srikanth Ayyangar in key roles. “If dreams come true, whose truth is it?” is the intriguing tagline of the film. Directed by Anand Chandra, the film is being presented as a fresh and innovative psychological thriller. It is produced by AVS Raju, R. Kumar Raju, and Anand Chandra under the banner of New I Movies LLP.  The teaser, which was released last month by renowned filmmaker Ram Gopal Varma, received an excellent response and has crossed more than a million views.Today the makers have now unveiled the 2-minute-20-second theatrical trailer, further raising curiosity around the film. “Fight Maha” is scheduled to release worldwide in theatres on August 21. Producer AVS Raju said- “We all liked the story immensely when director Anand Chandra narrated it to us. The story itself inspired us to produce this film. The way the director narrated the story was equally reflected in the way he brought it to the screen. We shot the film across Visakhapatnam, Kerala, and Hyderabad. Although only Sunil and Akhil Uddemari are seen on the film’s poster, nearly 40 actors have played important roles in the movie. We released the teaser last month through Ram Gopal Varma, and it received an excellent response, crossing more than a million views. We are now bringing Fight Maha to theatres worldwide on August 21st.” Director Anand Chandra said-“The concept of sleepwalking that we have explored in Fight Maha is very unique. Although films with similar concepts have been made in the past, we believe that the concept presented in this film will be fresh and new for Telugu audiences. Fight Maha is an innovative psychological thriller revolving around dreams, mental illness, destiny, guilt, and hidden truths. ‘Maha’ is the name of the male lead character in our film. He is constantly fighting against the struggles in his life, which is why we titled the film Fight Maha. The film also conveys a positive message: no matter how much disappointment or frustration we face in life, we should never give up on anything. We must continue to fight and move forward.” Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
    విశ్వనాధ్ అండ్ సన్స్ లో అభిమానులు  సెల్యులాయిడ్ పై  'సూర్య' ని విశ్వనాధ్ గా చూసుకొని మురుసిపోతున్నారు. ఇది కదా సూర్య అంటే అంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తూ శ్రావణ మాస శోభకి మరింత కాంతులు వెదజల్లుతున్నారు. ఫ్యామిలీస్ కూడా థియేటర్స్ బాట పట్టడానికి శ్రావణ మాస శోభనే ఒక కారణం కావచ్చు.  నిజానికి  సంజయ్ విశ్వనాధ్ గా సూర్య నటన అంత ఆషామాషి తో కూడుకున్న వ్యవహారం కాదు.  క్యారక్టర్ కి తగ్గట్టుగా పిన్ టూ పిన్ బాడీ లాంగ్వేజ్ తో మెప్పించాలంటే ఎంతో శ్రమ తప్పని సరి. ఇక ఈ సినిమా నైజాం ఏరియాలో కలెక్షన్స్ తుపాన్ సృష్టిస్తుంది. ఆదివారం ఒక్క రోజే 5.2 కోట్ల గ్రాస్ ని రాబట్టి తన అర్హత ఉన్న రేంజ్ ని చాటి చెప్పింది. దీంతో మొదటి మూడు రోజులకి  కలిపి నైజాంలో మొత్తం గ్రాస్ కలెక్షన్లు 14 కోట్ల మార్కుని  తాకాయి. దేశవ్యాప్తంగా చూసుకుంటే, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రానికి నైజాం అత్యుత్తమ వసూళ్లు నమోదు చేసిన ప్రాంతంగా కూడా నిలవడం గమనార్హం. తొలి మూడు రోజుల్లోనే భారీ వసూళ్లు రావడంతో, ఈ సినిమా నేటితో (సోమవారం) జీఎస్టీ మినహాయించి బ్రేక్ ఈవెన్ స్థాయిని చేరుకోనుంది. వీకెండ్ తర్వాత పనిదినాల్లో కూడా ఇదే జోరు కొనసాగితే, నైజాం డిస్ట్రిబ్యూటర్లకి మంచి లాభాలు దక్కే వీలుంది. Also read: DC: డిసి తంబికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడానికి అసలు కారణాలు ఇవేనా! వెంకీ అట్లూరి దర్శకత్వం, మాటలకి, మాగి గా  మమితా బైజు నాచురల్  పెర్ ఫార్మెన్స్,    సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణ విలువలు,  జి.వి. ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, నిమిష్ రవి ఫొటోగ్రఫీ పోటాపోటీగా విశ్వనాధ్ అండ్ సన్స్ కి కుదిరాయి. వరల్డ్ వైడ్ గా మూడు రోజులకి  సుమారు 120 కోట్ల వరకు గ్రాస్ ని రాబట్టింది. Vishwanath And Sons, Suriya, Mamitha Bhaiju
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ డ్రాగన్. ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక సెన్సేషనల్ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం వేయించిన ప్రత్యేకమైన భారీ సెట్ వర్క్, దాని డీటైలింగ్ చూసి యూనిట్ సభ్యులంతా ఫిదా అయ్యారట. డ్రాగన్ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రశాంత్ నీల్ అంటేనే మనకు గుర్తొచ్చేది భారీ సెట్లు, హై-వోల్టేజ్ యాక్షన్, అలాగే నెక్స్ట్ లెవెల్ ఎమోషన్స్. అయితే ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేయించిన ఒక ప్రత్యేకమైన భారీ సెట్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సినిమాలోని కీలకమైన సీన్స్, యాక్షన్ సీక్వెన్స్ లను చిత్రీకరించడానికి ప్రశాంత్ నీల్ అండ్ ఆర్ట్ డైరెక్షన్ టీమ్ మైండ్ బ్లోయింగ్ ప్రాపర్టీస్, యూరోపియన్ స్టైల్ డిజైన్స్‌తో ఒక వింటేజ్ అట్మాస్ఫియర్‌ను క్రియేట్ చేశారు. షూటింగ్ సమయంలో సెట్‌లోకి అడుగుపెట్టిన నటీనటులు, టెక్నీషియన్లు ఆ ప్రొడక్షన్ డీటైలింగ్, ఆర్ట్ వర్క్ చూసి ఫిదా అయిపోయారట. ప్రశాంత్ నీల్ విజన్‌ను నిజం చేయడానికి ఆర్ట్ డిపార్ట్‌మెంట్ ప్రతి చిన్న విషయాన్ని ఎంతో పర్ఫెక్ట్‌గా రీ-క్రియేట్ చేసింది. సాధారణంగా కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాలలో డార్క్ మోనోక్రోమటిక్ షేడ్స్‌ను ఎక్కువగా వాడిన ప్రశాంత్ నీల్, ఈసారి డ్రాగన్ కోసం పూర్తి డిఫరెంట్ అప్రోచ్ తీసుకుంటున్నారు. ఈ భారీ సెట్‌లోనే ఎన్టీఆర్ పై తీసే యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్లలో రచ్చ లేపుతాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఎన్టీఆర్ రా అండ్ రగ్గడ్ లుక్, దానికి తోడు ఈ విజువల్ గ్రాండియర్ వెండితెరపై ఒక విజువల్ వండర్ కాబోతోంది. కాగా, ఇటీవల ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో సర్జరీ చేయించుకున్నారు. ఆయన పూర్తిగా కోలుకోవడానికి రెండు నుంచి మూడు నెలల సమయం పట్టనుంది. ఈలోపు ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ లేని సీన్స్ ని తెరకెక్కించడంతో పాటు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పారలల్ గా చేస్తున్నట్లు సమాచారం.       Dragon Movie, Jr NTR, Prashanth Neel, NTR Neel  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఒక దేశం స్వేచ్ఛా కాంక్షతో.. పోరాటం చేసి సాధించుకున్న విజయమే స్వాతంత్ర్యం.. భారతదేశం 80 ఏళ్ళ కిందట బ్రిటీష్ వారి బానిసత్వం నుండి విముక్తి కోసం పోరాటం చేసింది,  స్వేచ్ఛను సంపాదించుకుంది.  ఈ సందర్బంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం  జరుపుకుంటారు. 1947లో బ్రిటిష్ వలస పాలన నుండి దేశానికి లభించిన విముక్తికి గుర్తుగా దేశమంతా జరుపుకునే పండుగే  స్వాతంత్ర్య దినోత్సవం. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ధైర్యంగా పోరాడిన లెక్కలేనంత మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు, అవిశ్రాంత కృషికి ఈ రోజు ఒక నివాళి. స్వాతంత్ర పోరాటం ముగిసిన తర్వాత భారతదేశ చరిత్రలో ఒక శకం ముగిసి,  కొత్త శకం ప్రారంభమైందని చెప్పవచ్చు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి చేసిన కృషి,  జరిగిన సంఘటనలు, త్యాగాల గురించి వివరంగా తెలుసుకుంటే.. పోరాటం.. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం దాదాపు రెండు శతాబ్దాల పాటు సాగిన ఒక సుదీర్ఘమైన, కఠిన ప్రయాణం. ఇది 1857 తిరుగుబాటుతో ప్రారంభమైంది.  దీనిని మొదటి స్వాతంత్ర్య యుద్ధం అని కూడా పిలుస్తారు, ఇందులో భారతీయ సైనికులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ సంఘటన జాతీయ చైతన్యాన్ని రగిలించింది, ఇది చివరికి 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావానికి దారితీసింది. 20వ శతాబ్దం ప్రారంభంలో గాంధీజి వంటి ప్రముఖ నాయకులు ఉద్భవించారు. ఆయన సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి ఉద్యమాల ద్వారా అహింసాయుత ప్రతిఘటనను సమర్థించారు. ఈ ఉద్యమాలు బ్రిటిష్ పాలన నుండి సంపూర్ణ స్వాతంత్ర్యం కోరడానికి లక్షలాది మంది భారతీయులను ఉత్తేజపరిచాయి. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీని భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటారు .   ట్రైస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం.. 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి, స్వతంత్ర భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తన చారిత్రాత్మక "ట్రైస్ట్ విత్ డెస్టినీ" (విధితో వాగ్వాదం) ప్రసంగాన్ని అందించారు. సుబాష్ చంద్రబోస్.. ఆజాద్ హింద్ సేన.. సుభాష్ చంద్ర బోస్, భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారు. అహింసా ఉద్యమం వల్ల నెమ్మదిగా ఉన్న పోరాటానికి  నిరాశ చెందిన బోస్, స్వాతంత్ర్యం సాధించడానికి మరింత దూకుడు మార్గాలను అన్వేషించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన జపాన్ సహాయంతో ఆజాద్ హింద్ ఫౌజ్ ని స్థాపించారు. దీన్ని ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటారు. భారతీయ సైనికులు , ప్రవాసులతో కూడిన ఆజాద్ హింద్ సేన, భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాలలో బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడింది. భారతదేశానికి విముక్తి కల్పించడంలో సైన్యం విజయం సాధించనప్పటికీ, బోస్ చేసిన ప్రయత్నాలు చాలా మందికి స్ఫూర్తినిచ్చాయి . భారత స్వాతంత్ర్య ఉద్యమం ప్రపంచాన్ని ఆకర్షించింది. స్వాతంత్ర్యం కోసం బోస్ చేసిన కృషి  వర్ణించలేనిది. గోవా, హైదరాబాద్ విమోచనం.. 1947 స్వాతంత్ర్య దినోత్సవం తర్వాత కూడా కొన్ని ప్రాంతాలు విదేశీ లేదా రాచరిక పాలనలో ఉన్నాయి. పోర్చుగీసు వలస ప్రాంతమైన గోవా, “ఆపరేషన్ విజయ్” అనే సైనిక తిరుగుబాటు తర్వాత 1961లో విముక్తి పొందింది. భారత సాయుధ దళాలు గోవాను భారత యూనియన్‌లో విజయవంతంగా విలీనం చేసి, 451 సంవత్సరాల పోర్చుగీసు పాలనకు ముగింపు పలికాయి. హైదరాబాద్ నిజాం మొదట్లో స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నారు, కానీ చివరికి 1948లో “ఆపరేషన్ పోలో” అనే సైనిక తిరుగుబాటు ద్వారా భారతదేశంలో విలీనం చేయబడింది. ఇది కొత్తగా ఏర్పడిన భారత గణతంత్ర రాజ్యంలో ఆ సంస్థానం యొక్క ఏకీకరణను నిర్ధారించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్.. భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్, విచ్ఛిన్నమైన సంస్థానాలను భారత యూనియన్‌గా ఏకీకృతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. భారతదేశపు మొదటి ఉప ప్రధానమంత్రిగా మరియు హోం మంత్రిగా, ఈ సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యేలా చూడటానికి పటేల్ దౌత్యపరమైన , కొన్నిసార్లు బలప్రయోగ చర్యలను కూడా ఉపయోగించారు. భారతదేశ రాజకీయ ఏకీకరణలో ఆయన చేసిన కృషి, ఆయనకు అపారమైన గౌరవాన్ని , భారత చరిత్రలో ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించిపెట్టింది. బలమైన, ఐక్య భారతదేశానికి పునాది వేయడంలో పటేల్ దార్శనికత, నాయకత్వం కీలక పాత్ర పోషించాయి. దేశానికి ఆయన చేసిన సేవలకు నిదర్శనంగా నిలుస్తూ, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' విగ్రహం ఆయన వారసత్వాన్ని శాశ్వతంగా నిలిపింది.                                  *రూపశ్రీ.  
ఒక దేశం స్వేచ్ఛా కాంక్షతో.. పోరాటం చేసి సాధించుకున్న విజయమే స్వాతంత్ర్యం.. భారతదేశం 80 ఏళ్ళ కిందట బ్రిటీష్ వారి బానిసత్వం నుండి విముక్తి కోసం పోరాటం చేసింది,  స్వేచ్ఛను సంపాదించుకుంది.  ఈ సందర్బంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం  జరుపుకుంటారు. 1947లో బ్రిటిష్ వలస పాలన నుండి దేశానికి లభించిన విముక్తికి గుర్తుగా దేశమంతా జరుపుకునే పండుగే  స్వాతంత్ర్య దినోత్సవం. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ధైర్యంగా పోరాడిన లెక్కలేనంత మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు, అవిశ్రాంత కృషికి ఈ రోజు ఒక నివాళి. స్వాతంత్ర పోరాటం ముగిసిన తర్వాత భారతదేశ చరిత్రలో ఒక శకం ముగిసి,  కొత్త శకం ప్రారంభమైందని చెప్పవచ్చు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి చేసిన కృషి,  జరిగిన సంఘటనలు, త్యాగాల గురించి వివరంగా తెలుసుకుంటే.. పోరాటం.. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం దాదాపు రెండు శతాబ్దాల పాటు సాగిన ఒక సుదీర్ఘమైన, కఠిన ప్రయాణం. ఇది 1857 తిరుగుబాటుతో ప్రారంభమైంది.  దీనిని మొదటి స్వాతంత్ర్య యుద్ధం అని కూడా పిలుస్తారు, ఇందులో భారతీయ సైనికులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ సంఘటన జాతీయ చైతన్యాన్ని రగిలించింది, ఇది చివరికి 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావానికి దారితీసింది. 20వ శతాబ్దం ప్రారంభంలో గాంధీజి వంటి ప్రముఖ నాయకులు ఉద్భవించారు. ఆయన సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి ఉద్యమాల ద్వారా అహింసాయుత ప్రతిఘటనను సమర్థించారు. ఈ ఉద్యమాలు బ్రిటిష్ పాలన నుండి సంపూర్ణ స్వాతంత్ర్యం కోరడానికి లక్షలాది మంది భారతీయులను ఉత్తేజపరిచాయి. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీని భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటారు .   ట్రైస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం.. 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి, స్వతంత్ర భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తన చారిత్రాత్మక "ట్రైస్ట్ విత్ డెస్టినీ" (విధితో వాగ్వాదం) ప్రసంగాన్ని అందించారు. సుబాష్ చంద్రబోస్.. ఆజాద్ హింద్ సేన.. సుభాష్ చంద్ర బోస్, భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారు. అహింసా ఉద్యమం వల్ల నెమ్మదిగా ఉన్న పోరాటానికి  నిరాశ చెందిన బోస్, స్వాతంత్ర్యం సాధించడానికి మరింత దూకుడు మార్గాలను అన్వేషించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన జపాన్ సహాయంతో ఆజాద్ హింద్ ఫౌజ్ ని స్థాపించారు. దీన్ని ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటారు. భారతీయ సైనికులు , ప్రవాసులతో కూడిన ఆజాద్ హింద్ సేన, భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాలలో బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడింది. భారతదేశానికి విముక్తి కల్పించడంలో సైన్యం విజయం సాధించనప్పటికీ, బోస్ చేసిన ప్రయత్నాలు చాలా మందికి స్ఫూర్తినిచ్చాయి . భారత స్వాతంత్ర్య ఉద్యమం ప్రపంచాన్ని ఆకర్షించింది. స్వాతంత్ర్యం కోసం బోస్ చేసిన కృషి  వర్ణించలేనిది. గోవా, హైదరాబాద్ విమోచనం.. 1947 స్వాతంత్ర్య దినోత్సవం తర్వాత కూడా కొన్ని ప్రాంతాలు విదేశీ లేదా రాచరిక పాలనలో ఉన్నాయి. పోర్చుగీసు వలస ప్రాంతమైన గోవా, “ఆపరేషన్ విజయ్” అనే సైనిక తిరుగుబాటు తర్వాత 1961లో విముక్తి పొందింది. భారత సాయుధ దళాలు గోవాను భారత యూనియన్‌లో విజయవంతంగా విలీనం చేసి, 451 సంవత్సరాల పోర్చుగీసు పాలనకు ముగింపు పలికాయి. హైదరాబాద్ నిజాం మొదట్లో స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నారు, కానీ చివరికి 1948లో “ఆపరేషన్ పోలో” అనే సైనిక తిరుగుబాటు ద్వారా భారతదేశంలో విలీనం చేయబడింది. ఇది కొత్తగా ఏర్పడిన భారత గణతంత్ర రాజ్యంలో ఆ సంస్థానం యొక్క ఏకీకరణను నిర్ధారించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్.. భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్, విచ్ఛిన్నమైన సంస్థానాలను భారత యూనియన్‌గా ఏకీకృతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. భారతదేశపు మొదటి ఉప ప్రధానమంత్రిగా మరియు హోం మంత్రిగా, ఈ సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యేలా చూడటానికి పటేల్ దౌత్యపరమైన , కొన్నిసార్లు బలప్రయోగ చర్యలను కూడా ఉపయోగించారు. భారతదేశ రాజకీయ ఏకీకరణలో ఆయన చేసిన కృషి, ఆయనకు అపారమైన గౌరవాన్ని , భారత చరిత్రలో ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించిపెట్టింది. బలమైన, ఐక్య భారతదేశానికి పునాది వేయడంలో పటేల్ దార్శనికత, నాయకత్వం కీలక పాత్ర పోషించాయి. దేశానికి ఆయన చేసిన సేవలకు నిదర్శనంగా నిలుస్తూ, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' విగ్రహం ఆయన వారసత్వాన్ని శాశ్వతంగా నిలిపింది.                                                                                                                                                   *రూపశ్రీ.
మనుషుల నుండి ప్రాణం ఉన్న ప్రతి జీవి ఆహారం తీసుకోవడం పరిపాటి.  తీసుకునే ఆహారం నుండి లభించే శక్తితోనే శరీరం నిలబడుతుంది. ఇక అన్ని ప్రాణులలోకి మనిషి చాలా విభిన్నమైన వాడు. మనుషుల్లో ఒక్కొక్కరికి ఒక్కో విధమైన అలవాట్లు ఉంటాయి.  అంతేకాదు.. ఆహారం తినే విధానంలో కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది.  కొందరు నిదానంగా తింటారు.  మరికొందరు చాలా వేగంగా తింటారు.  అయితే.. వేగంగా తినే వ్యక్తుల వ్యక్తిత్వం గురించి వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చాలా ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నారు. వేగంగా ఆహారం తినే వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. వేగంగా తినడం... మన చుట్టూ చాలామంది ఉంటారు.  కుటుంబ సభ్యులు అయినా,  స్నేహితులు అయినా.. తెలిసిన వారు అయినా.. కలిసి భోజనం చేసేటప్పుడు లేదా ఏదైనా ఆహారం తినేటప్పుడు.. అందరూ కలిసి మొదలు పెడితే.. పక్క వాళ్లు ఇంకా సగం కూడా తినకుండానే మధ్యలోనే తమ ఆహారం పూర్తీ చేసే వారు కొందరు ఉంటారు.  వారు చాలా బిజీ లైఫ్ స్టైల్ కు అలవాటు వడటం వల్ల అలా వేగంగా తినడం అలవాటు అయి ఉంటుందని అందరూ అనుకుంటారు. ఇది నిజమే అయినా ఇలా వేగంగా తినే వారి స్వభావం విభిన్నంగా ఉంటుందని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చెబుతున్నారు. వేగంగా తినే వారిలో ఉండే వ్యక్తిత్వ లక్షణాలు.. వేగంగా తినే వ్యక్తులు ఎక్కువగా ఫినిష్ లైన్ ను చేరుకోవడంపై దృష్టి పెడతారు. అదే మనస్తత్వం జీవితంలోని ఇతర రంగాలలో కనిపిస్తుందట. వారు చేయవలసిన పనుల లిస్ట్ నుండి పనులను మార్క్  చేయడం, సమర్థవంతంగా పనిచేయడం , ఒక పనిలో ఆలస్యం  కాకుండా ఆ తరువాత  సవాలును స్వీకరించడం వంటివి వీరిలో ఉంటాయట.   స్ట్రాంగ్ ప్రాక్టీస్  ఉన్నవారు తరచుగా భోజనంతో సహా రోజువారీ దినచర్యలో వేగాన్ని , సామర్థ్యాన్ని ఇష్టపడతారని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు. తినడాన్ని ఆస్వాదించడం, అనుభూతి చెందడం  కంటే తినడాన్ని కూడా ఒక  పనిగా భావిస్తారని అంటున్నారు.  తినే వేగాన్ని బట్టి వ్యక్తిత్వం లక్షణాలను,  తినే వేగానికి,  వ్యక్తిత్వానికి మధ్య గల సంబంధాలను వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు కనుక్కున్నారు. వేగంగా తినేవారు తరచుగా వేచి ఉండటానికి ఇష్టపడరు. ఇది క్యూలలో నిలబడినా, నెమ్మదిగా మీటింగ్స్  లో ఉన్నా లేదా ఆహారం వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వచ్చినా.. ఇలా అన్ని సందర్బాలలో వారు అన్ని వేగంగానే జరగాలని కోరుకుంటారట.  అన్ని విషయాలలోనూ సహజంగా వేగాన్ని వీరు ఇష్టపడతారట. ఈ ధోరణి భోజన చేయడం వరకు తీసుకువెళుతుందట.  చాలామందిలో తినే స్వభావం మానసిక , పర్యావరణ కారకాల ద్వారా ఏర్పడతాయని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చెబుతున్నారు.   వేగంగా తినే వ్యక్తులలో ఇతర పనులను కూడా వేగంగా పూర్తీ చేసే సామర్థ్యం ఉంటుందట. వర్తమానంతో పూర్తీగా నిమగ్నమవడానికి బదులుగా  తరువాత ఏమి జరుగుతుందో  అనే విషయం పై దృష్టి పెట్టేలా చేస్తుందట.  ఈ కారణంగా వీరికి భవిష్యత్తు గురించి స్పష్టమైన అంచనాలు, ప్రణాళికలు కూడా ఉంటాయట. అలాగని వేగంగా తినడాన్ని సమర్థించడం లేదు. ఎందుకంటే.. వేగంగా తినడం అనేది ఆహారం సరిగా నమలకపోవడం, తినే ఆహారం మీద దృష్టి పెట్టలేకపోవడం,  ఆహారం అతిగా తినడం.. ఇలా చాలా సమస్యలకు కారణం అవుతుంది.                                                                                                                                                   *రూపశ్రీ.  
గుడ్లు పోషకాహారం యొక్క పవర్హౌస్.  ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన విటమిన్లు గుడ్డులో పుష్కలంగా ఉంటాయి. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ రోజుకు ఒక గుడ్డు తినడం చాలామంచిదని చెబుతూ ఉంటారు.  అయితే  రోజూ రెండు ఉడికించిన గుడ్లు తినడం  మంచిదేనా? ఫిట్‌నెస్ ట్రైనింగ్ లో ఉన్నవారు,  పోషకాహార లోపంతో ఉన్నవారు ప్రతిరోజూ గుడ్డు తినాలని చెబుతుంటారు.  రోజుకు రెండు ఉడికించిన గుడ్లు తీసుకుంటే ఏం జరుగుతుంది? ఇది శరీరం పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? వివరంగా తెలుసుకుంటే.. ఎముకలను బలోపేతం చేస్తుంది.. గుడ్లలో విటమిన్ డి , కాల్షియం పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎముక సాంద్రతను మెరుగుపరచడంలో , బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.రోజు రెండు ఉడికించిన గుడ్లు తింటూ ఉంటే ఎముకల బలానికి కావలసినంత కాల్షియం,  విటమిన్-డి పొందవచ్చు. మెదడు ఆరోగ్యానికి.. గుడ్లలో కోలిన్ ఉంటుంది, ఇది మెదడు పనితీరు,  జ్ఞాపకశక్తికి చాలా అవసరం. క్రమం తప్పకుండా రోజు రెండు ఉడికించిన గుడ్లు తింటూ ఉంటే.. అది మెదడు  చురుగ్గా ఉండటానికి,  మెదడు  ఆరోగ్యానికి తోడ్పడుతుంది ,  అలాగే నరాల పనితీరును  కూడా మెరుగ్గా ఉంచుతుంది. కంటి ఆరోగ్యానికి.. గుడ్లలో ల్యూటిన్ , జీక్సాంథిన్ ఉంటాయి. ఇవి వయస్సు సంబంధిత మాక్యులర్ డిజెనరేషన్ నుండి కళ్ళను రక్షించే యాంటీఆక్సిడెంట్లు.  మొత్తం కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యానికి.. గుడ్లలో కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ, సమతుల్య ఆహారంతో పాటు మితంగా గుడ్లు తినడం వల్ల మంచి HDL కొలెస్ట్రాల్ పెరిగి, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ప్రోటీన్ కు మంచిది.. రెండు ఉడికించిన గుడ్లు సుమారు 12 గ్రాముల నాణ్యమైన ప్రోటీన్‌ను అందిస్తాయి. ఇవి కండరాల నిర్మాణం, మరమ్మత్తు , కడుపు నిండిన ఫీలింగ్ ఇవవ్డంలో సహాయపడతాయి. ఫిట్‌నెస్ ప్రియులకు , లీన్ కండరాలను కాపాడుకోవాలనుకునే వారికి ఇది చాలా మంచిది. బరువు నిర్వహణకు.. గుడ్లలో అధిక ప్రోటీన్ , తక్కువ కేలరీలు ఉంటాయి.  దీని కారణంగా ఉడికించిన గుడ్లు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి , శరీరానికి కావలసిన పోషకాలు కూడా మెరుగ్గా అందిస్తాయి. ఇవి అతిగా తినడాన్ని,  వెంటనే ఆకలి కావడాన్ని అరికట్టడానికి , బరువు నిర్వహణకు సహాయపడతాయి.                                                                                                                                                   *రూపశ్రీ.
కాళ్లు, చేతులు తిమ్మిరిగా అనిపించడం, జలదరింపు రావడం చాలామందికి అప్పుడప్పుడు ఎదురయ్యే సమస్య. ఎక్కువసేపు ఒకే పొజిషన్‌లో కూర్చోవడం లేదా నరాలపై ఒత్తిడి పడటం వల్ల తాత్కాలికంగా తిమ్మిర్లు రావచ్చు. అయితే పదేపదే తిమ్మిర్లు రావడం, ఎక్కువసేపు తగ్గకపోవడం లేదా శరీరంలో ఒక వైపు మాత్రమే అకస్మాత్తుగా తిమ్మిరి రావడం మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. చేతులు, కాళ్లలో తిమ్మిర్లు రావడానికి నరాలకు సంబంధించిన సమస్యలు ఒక కారణం కావచ్చు. నరాలు దెబ్బతిన్నప్పుడు తిమ్మిరితో పాటు మంట, జలదరింపు, సూదులు గుచ్చినట్టుగా అనిపించడం, నొప్పి లేదా చేతులు, కాళ్లలో బలహీనత వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. అయితే శరీరంలో ఒక వైపు అకస్మాత్తుగా చేయి లేదా కాలు తిమ్మిరిగా మారడం, బలహీనంగా అనిపించడం వంటి లక్షణాలను మాత్రం ప్రత్యేకంగా గమనించాలి. ముఖ్యంగా వీటితో పాటు ముఖం ఒక వైపు వంగడం, మాట స్పష్టంగా రాకపోవడం, నడవడంలో ఇబ్బంది, అకస్మాత్తుగా తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే అవి బ్రెయిన్ స్ట్రోక్‌కు సంబంధించిన హెచ్చరిక సంకేతాలు కావచ్చు. ఇలాంటి సమయంలో ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే సాధారణంగా వచ్చే తిమ్మిరికి, నరాల దెబ్బతినడం లేదా స్ట్రోక్‌కు సంబంధించిన తిమ్మిరికి తేడా ఏమిటి? ఏ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు? శరీరంలో ఒక వైపు మాత్రమే తిమ్మిరి ఎందుకు వస్తుంది? ఈ విషయాలపై Dr. Anirudh Deshmukh ఈ వీడియోలో సులభంగా వివరిస్తున్నారు. సాధారణ తిమ్మిరి ఎప్పుడు ఆందోళన చెందాల్సిన సమస్యగా మారుతుంది? నరాల సమస్యకు సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి? స్ట్రోక్‌ను సూచించే సంకేతాలు ఏమిటి? వంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. అకస్మాత్తుగా ఒక వైపు తిమ్మిరి, బలహీనత లేదా స్ట్రోక్‌ను సూచించే ఇతర లక్షణాలు కనిపిస్తే స్వయంగా చికిత్స చేసుకోకుండా వెంటనే వైద్య సహాయం పొందండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  
స్ట్రెస్, ఆందోళన, బీపీ వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రోజువారీ జీవితంలో ఒత్తిడి పెరగడంతో మనసుతో పాటు శరీరంపై కూడా ప్రభావం పడుతుంది. ఇలాంటి సమయంలో శ్వాసపై దృష్టి పెట్టే ప్రాణాయామాలు కొంతమందికి రిలాక్సేషన్‌కు సహాయపడవచ్చు. అనులోమ విలోమ ప్రాణాయామం శ్వాసను నియంత్రిస్తూ చేసే ఒక సాధారణ యోగాభ్యాసం. దీన్ని సరైన పద్ధతిలో, సరైన సమయంలో చేయడం ముఖ్యమని యోగా నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రతి ఒక్కరూ ఒకే విధంగా ప్రాణాయామం చేయడం సరికాదు. వయసు, ఆరోగ్య పరిస్థితి, ప్రస్తుతం ఉన్న సమస్యలను బట్టి విధానం మారవచ్చు. ఈ వీడియోలో సీనియర్ యోగా థెరపిస్ట్, ఆయుర్వేద డైటీషియన్ శ్రావంతి రఘు అనులోమ విలోమ ప్రాణాయామాన్ని ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎవరు చేయవచ్చు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను సులభంగా వివరిస్తున్నారు. అనులోమ విలోమ ప్రాణాయామం ఎలా చేయాలి? వీడియోలో అనులోమ విలోమాన్ని స్టెప్ బై స్టెప్‌గా ఎలా చేయాలో చూపించారు. శ్వాసను నెమ్మదిగా, నియంత్రణతో తీసుకోవడం, వదలడం వంటి అంశాలను సరైన పద్ధతిలో పాటించడం గురించి వివరించారు. ప్రాణాయామం చేసేటప్పుడు శరీరాన్ని రిలాక్స్‌గా ఉంచడం, తొందరపడకుండా శ్వాసపై దృష్టి పెట్టడం ముఖ్యమైన అంశాలు. మొదటిసారి ప్రయత్నించేవారు నిపుణుల సూచనతో ప్రారంభించడం మంచిది. BP ఉన్నవారు చేయవచ్చా? అధిక రక్తపోటు ఉన్నవారు కూడా కొన్ని శ్వాసాభ్యాసాలను తగిన జాగ్రత్తలతో చేయవచ్చు. అయితే అధిక బీపీ ఉన్న ప్రతి వ్యక్తికి ఒకే విధమైన ప్రాణాయామ పద్ధతి సరిపోదు. ముఖ్యంగా శ్వాసను బిగపట్టడం వంటి పద్ధతులను స్వయంగా ప్రయత్నించకుండా, నిపుణుల సూచనలు పాటించడం మంచిది. డయాబెటిస్ ఉన్నవారు చేయవచ్చా? డయాబెటిస్ ఉన్నవారు కూడా అనులోమ విలోమ ప్రాణాయామం గురించి నిపుణుల సలహా తీసుకుని సాధన చేయవచ్చు. అయితే ప్రాణాయామం ఏదైనా వ్యాధికి మందులకు ప్రత్యామ్నాయం కాదు. వైద్యులు సూచించిన మందులు, ఆహారం, వ్యాయామాన్ని కొనసాగిస్తూ మాత్రమే యోగాభ్యాసాన్ని జీవనశైలిలో భాగంగా చేసుకోవాలి. సైనసైటిస్ ఉన్నవారు? సైనసైటిస్ లేదా ముక్కు సంబంధిత సమస్యలు ఉన్నవారు ప్రాణాయామం చేసే ముందు తమ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలి. ముక్కు పూర్తిగా బ్లాక్‌గా ఉన్నప్పుడు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నప్పుడు బలవంతంగా శ్వాసాభ్యాసం చేయకూడదు. అవసరమైతే యోగా థెరపిస్ట్ లేదా వైద్య నిపుణుల సలహా తీసుకోవాలి. రోజూ 10 నిమిషాలు చేస్తే స్ట్రెస్, BP శాశ్వతంగా పోతాయా? ప్రాణాయామం వల్ల రిలాక్సేషన్, శ్వాస నియంత్రణ, మానసిక ప్రశాంతతకు సహాయం లభించవచ్చు. అయితే రోజూ 10 నిమిషాలు అనులోమ విలోమం చేస్తే స్ట్రెస్ లేదా బీపీ శాశ్వతంగా పూర్తిగా నయమవుతాయని చెప్పడం సరైనది కాదు. ముఖ్యంగా అధిక రక్తపోటు ఒక వైద్య పరిస్థితి. దాని కోసం వైద్యుల సూచనలు, మందులు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం అవసరం. ఈ వీడియోలో అనులోమ విలోమ ప్రాణాయామాన్ని ఎవరు చేయవచ్చు? ఎవరు జాగ్రత్తగా ఉండాలి? సరైన పద్ధతి ఏమిటి? వంటి ముఖ్యమైన విషయాలను సీనియర్ యోగా థెరపిస్ట్ శ్రావంతి రఘు వివరిస్తున్నారు. గమనిక: ఈ సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. మీకు బీపీ, డయాబెటిస్, సైనసైటిస్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే ప్రాణాయామం ప్రారంభించే ముందు మీ వైద్యుడు లేదా అర్హత కలిగిన యోగా థెరపిస్ట్‌ను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)