LATEST NEWS
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తాను ఎనిమిది యుద్ధాలను ఆపానని, శాంతి స్థాపనకు విశేష కృషి చేశానని చెబుతూ ఈ ప్రతిష్టాత్మక పురస్కారంపై ఆశలు పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. తనకు నోబెల్ శాంతి బహుమతి దక్కాలని బహిరంగంగా ఆకాంక్షించిన ట్రంప్‌ ఆశలను నోబెల్ కమిటీ నెరవేర్చలేదు. ఈ పరిణామం అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. ఇటీవల ట్రంప్ తనకు నోబెల్ శాంతి బహుమతి రావాలనే ఆకాంక్షను పలుమార్లు వ్యక్తం చేశారు. అనేక వివాదాలను పరిష్కరించడంతోపాటు, యుద్ధాలను ఆపేందుకు కృషి చేశానని ఆయన చెప్పుకొచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచ శాంతి కోసం పనిచేశానని పేర్కొంటూ, ఈసారైనా తనకు ఈ పురస్కారం దక్కాలని ఆశించారు. అంతేకాదు, తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వకపోతే నార్వేజియన్ నోబెల్ కమిటీ చారిత్రక తప్పిదం చేసినట్లేనని ట్రంప్ వ్యాఖ్యానించారు. తనను విస్మరించడం కమిటీకి అవమానకరమవుతుందనే అర్థం వచ్చేలా ఓవల్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.అయితే, ట్రంప్ ఆశలకు భిన్నంగా నోబెల్ శాంతి బహుమతి ప్రకటన వెలువడింది. ఆయనకు ఈ పురస్కారం దక్కకపోవడంతో మరోసారి నిరాశ ఎదురైంది. నోబెల్ కమిటీ నిర్ణయం అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది. అంతర్జాతీయ న్యాయ సూత్రాల పరిరక్షణకు, మానవ హక్కుల పరిపుష్టికి జీవితాన్ని అంకితం చేసిన భారతీయ సంతతికి చెందిన ప్రముఖ దక్షిణాఫ్రికా న్యాయమూర్తి నవనీతం 'నవి' పిళ్ళై ప్రతిష్టాత్మకమైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు. నార్వేలోని ఓస్లో నగరంలో నార్వేజియన్ నోబెల్ కమిటీ ఈ ప్రకటనను వెలువరించింది. ఈ ఏడాది ఈ పురస్కారం కోసం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 287 మంది అభ్యర్థులు నామినేట్ కాగా, వారిలో నవి పిళ్ళై నిలిచారు. ఈ అత్యున్నత పురస్కారంతో పాటు ఆమెకు 1.2 మిలియన్ డాలర్లు (సుమారు 12 మిలియన్ల స్వీడిష్ క్రోనార్లు) నగదు బహుమతి, బంగారు పతకం ప్రదానం చేయనున్నారు. డిసెంబర్ 10న ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా ఓస్లోలో అధికారికంగా ఈ వేడుక జరగనుంది. అణచివేతకు గురవుతున్న వర్గాల హక్కుల కోసం, అంతర్జాతీయ నేరాలను విచారించడంలో ఆమె చేసిన కృషిని కమిటీ ప్రత్యేకంగా ప్రశంసించింది.    దక్షిణాఫ్రికాలోని డర్బన్ నగరంలో వర్ణవివక్ష కాలంలో భారతీయ తమిళ కుటుంబంలో జన్మించిన నవి పిళ్ళై, తన బాల్యం నుంచే తీవ్ర వివక్షను ఎదుర్కొన్నారు. ఆ అనుభవాలతోనే న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టి అణగారిన వర్గాల గళంగా మారారు. రువాండా మారణహోమ ట్రిబ్యునల్ అధ్యక్షురాలిగా ఆమె చేసిన సేవలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చాయి. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) న్యాయమూర్తిగా, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్‌గా ఆమె సేవలందించారు. యుద్ధ నేరాలు, మానవాళికి వ్యతిరేకంగా జరిగే అక్రమాలకు పాల్పడేవారిని చట్టం ముందు నిలపడంలో ఆమె ఎంతో కీలక పాత్ర పోషించారు. గాజాలో ఇజ్రాయెల్ దాడుల అంశంపై ఐరాస కమిషన్‌కు నాయకత్వం వహించిన ఆమె, అంతర్జాతీయ చట్టాల అమలులో ఎక్కడా రాజీపడకుండా ధైర్యంగా నిలబడ్డారు.    అయితే, ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన ప్రపంచ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. తాను ఎనిమిది యుద్ధాలను ఆపానని, ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి తానే అర్హుడినని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్రంగా లాబీయింగ్ చేసినప్పటికీ, ఆయనకు మరోసారి నిరాశే ఎదురైంది. గతంలోనూ అనేకసార్లు నోబెల్ ఆశించి భంగపడ్డ ట్రంప్‌నకు, ఈసారి కూడా నోబెల్ కమిటీ మొండిచెయ్యి చూపడం అంతర్జాతీయ మీడియాలో ప్రధానాంశంగా మారింది. ట్రంప్ లాబీయింగ్ ఒత్తిళ్లను సైతం పక్కన పెట్టి, నిజమైన శాంతికూటూరియైన నవి పిళ్ళైని ఈ పురస్కారానికి ఎంపిక చేయడం ద్వారా నోబెల్ కమిటీ అంతర్జాతీయ చట్టాల ప్రాధాన్యతను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. మానవ హక్కులు, అంతర్జాతీయ న్యాయం కోసం పోరాడే యోధులకు ఈ అవార్డు వన్నె తెచ్చిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.       [ Donald Trump, Navi Pillay, Nobel Peace Prize 2026,  Navanethem Pillay, Nobel winner 2026, human rights lawyer,  Indian origin, human rights, international law, Oslo Norway, International Justice, Human Rights Advocate, South African Judge, United Nations High Commissioner ]
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్‌ డెత్‌ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది. ఈ కేసులో అప్పటి కృష్ణలంక సీఐ నాగరాజుతో పాటు మరో ఆరుగురిని నిందితులుగా పేర్కొంది. మొత్తం 86 పేజీల ఛార్జిషీట్‌లో 263 పత్రాలను ఆధారాలుగా సమర్పించగా.. 120 మంది సాక్షుల వివరాలను పొందుపరిచింది. పోలీసుల కస్టడీలో సాయి కృష్ణపై చిత్రహింసలకు పాల్పడటం వల్లే ఆయన మృతి చెందినట్లు సిట్‌ అభియోగాలు నమోదు చేసినట్లు సమాచారం. కస్టడీలో చిత్రహింసలు.. ఆరోగ్యం క్షీణత.! ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ (ఎన్‌బీడబ్ల్యూ)పై సాయి కృష్ణను విజయవాడకు తీసుకొచ్చినప్పటి నుంచి జరిగిన పరిణామాలను సిట్‌ ఛార్జిషీట్‌లో వివరించింది. మే 6 నుంచి మే 9 వరకు ఆయన కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ కస్టడీలో ఉన్నట్లు పేర్కొంది. ఆ సమయంలో సాయి కృష్ణపై తీవ్రంగా దాడి చేసినట్లు, మర్మాంగం నుంచి రక్తస్రావమయ్యే స్థాయిలో చిత్రహింసలకు గురిచేసినట్లు ఆరోపించింది. ఈ ఘటనలతో ఆయన ఆరోగ్యం క్షీణించిందని, అనంతరం పాత భవనానికి తరలించినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. సీసీటీవీ హార్డ్‌డిస్కుల మార్పు.. ఆధారాల ధ్వంసం.! సాయి కృష్ణ మృతి కేసులో కీలక సాక్ష్యాధారాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నాలు జరిగినట్లు సిట్‌ ఆరోపించింది. పోలీస్‌ స్టేషన్‌లోని సీసీటీవీ హార్డ్‌డిస్కులను తొలగించి, వాటి స్థానంలో వేరే హార్డ్‌డిస్కులను అమర్చినట్లు ఛార్జిషీట్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఏ1, ఏ2, ఏ7 నిందితుల పాత్రను ప్రస్తావించినట్లు సమాచారం. అలాగే విచారణ గదిలోని భౌతిక ఆధారాలను చెరిపివేసేందుకు గదులను శుభ్రం చేయడంతో పాటు పెయింటింగ్‌ వేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికారిక రికార్డుల్లో కస్టడీ వివరాలు మాయం.! సాయి కృష్ణ పోలీసుల అదుపులో ఉన్న విషయాన్ని అధికారిక రికార్డుల్లో నమోదు చేయకుండా దాచిపెట్టినట్లు సిట్‌ ఆరోపించింది. లాకప్‌ డైరీ, జనరల్‌ డైరీ, సెంట్రీ బుక్‌లలో ఆయనకు సంబంధించిన వివరాలు నమోదు చేయలేదని ఛార్జిషీట్‌లో పేర్కొన్నట్లు సమాచారం. అరెస్టు, కస్టడీకి సంబంధించిన వాస్తవాలను దాచిపెట్టి హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు ఏ1పై కూడా అభియోగాలు ఉన్నట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి మృతదేహం తరలింపు.. దహనం.! సాయి కృష్ణ మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి అర్ధరాత్రి సమయంలో స్వర్గపురి దహనవాటికకు తరలించి దహనం చేసినట్లు సిట్‌ ఆరోపించింది. మే 12–13 తేదీల మధ్య రాత్రి ఈ ఘటన జరిగినట్లు ఛార్జిషీట్‌లో పేర్కొన్నట్లు సమాచారం. మృతదేహం తరలింపు నుంచి దహనం వరకు చోటుచేసుకున్న పరిణామాలతో పాటు, సాక్ష్యాధారాలను తొలగించేందుకు జరిగినట్లు ఆరోపిస్తున్న ప్రయత్నాలను కూడా దర్యాప్తు బృందం ప్రస్తావించింది. ఫోన్‌ డేటా, డీఎన్‌ఏ ఆధారాలపై దర్యాప్తు.! సాయి కృష్ణ బతికే ఉన్నట్లు లేదా మరో ప్రాంతంలో ఉన్నట్లు చూపించేందుకు ఆయన ఫోన్‌ను ఉపయోగించి తప్పుడు సమాచారాన్ని సృష్టించినట్లు కూడా ఛార్జిషీట్‌లో ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో రక్తపు మరకలు, డీఎన్‌ఏ, ఎముకల అవశేషాలు సహా పలు ఆధారాలపై ఫోరెన్సిక్‌ పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. కొన్ని నివేదికలు ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. సీసీటీవీ లాగ్‌లు, ఫోన్‌ డేటా, ఇతర సాంకేతిక ఆధారాలకు సంబంధించి మరిన్ని వివరాలను సేకరించాల్సి ఉండటంతో దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం. తదుపరి విచారణపై ఉత్కంఠ.! సాయి కృష్ణ కస్టోడియల్‌ డెత్‌ కేసులో 86 పేజీల ఛార్జిషీట్‌ను సమర్పించిన సిట్‌.. సీఐ నాగరాజుతో పాటు మరో ఆరుగురిని నిందితులుగా పేర్కొంది. కస్టడీలో జరిగినట్లు ఆరోపిస్తున్న హింస, మృతదేహం దహనం, సాక్ష్యాధారాల ధ్వంసం, అధికారిక రికార్డుల్లో వివరాలు నమోదు చేయకపోవడం వంటి అంశాలు కేసులో కీలకంగా మారాయి. ఫోరెన్సిక్‌ నివేదికలు, సాంకేతిక ఆధారాలపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో తదుపరి న్యాయప్రక్రియలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.     [ Sai Krishna, Custodial Death, Vijayawada Police, SIT Chargesheet, Krishnalanka Police Station, CI Nagaraju, CM Chandrababu,Nara lokesh, Home minister anitha, Telugu One, Telugu News ]
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు. ఈ మేరకు నార్వేజియన్‌ నోబెల్ కమిటీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. గ్లోబల్ స్థాయిలో శాంతిని ప్రోత్సహించడంలోనూ, అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవాన్ని పెంపొందించడంలోనూ ఆమె దశాబ్దాలుగా చేసిన నిర్విరామ కృషికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. అంతర్జాతీయ చట్టాల కఠినమైన అమలు, మానవ హక్కుల పరిరక్షణ అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న ప్రస్తుత తరుణంలో నవి పిళ్లై సాధించిన ఈ అరుదైన ఘనత ప్రపంచవ్యాప్తంగా విశేష చర్చనీయాంశమైంది. 2026 సంవత్సరానికి సంబంధించి ప్రకటించిన నోబెల్ పురస్కారాలలో శాంతి బహుమతి ఐదోది కావడం విశేషం. దీనికి ముందు వైద్య, భౌతిక, రసాయన శాస్త్రాలతో పాటు సాహిత్య రంగాలకు సంబంధించిన విజేతల పేర్లను కమిటీ వెల్లడించింది. అంతకుముందు 2025 సంవత్సరంలో వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడో ఈ నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో నవి పిళ్లై చేరడం ద్వారా భారతదేశం మరియు తెలుగు ప్రజలకు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యాయవాద నిపుణులకు గర్వకారణంగా నిలిచారు. ఈ నోబెల్ శాంతి బహుమతి కింద విజేతకు 12 మిలియన్‌ స్వీడిష్‌ క్రోనర్లు, అంటే భారతీయ కరెన్సీలో సుమారు భారీ మొత్తంలో లేదా దాదాపు 1.2 మిలియన్‌ అమెరికన్ డాలర్ల నగదు బహుమతిని అందజేస్తారు. నార్వే రాజధాని ఓస్లో నగరంలో డిసెంబర్ 10వ తేదీన అత్యంత వైభవంగా జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ఆమెకు ప్రదానం చేయనున్నారు. ప్రఖ్యాత స్వీడిష్ పారిశ్రామికవేత్త, శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం ఆయన వీలునామా ప్రకారం ప్రతి ఏటా ఈ అవార్డులను ప్రపంచ శాంతికి, మానవతా దృక్పథానికి పాటుపడే ప్రముఖులకు అందజేస్తూ వస్తున్నారు.         [ Navi Pillay, Nobel Peace Prize 2026, Indian origin, human rights, international law, Oslo Norway, International Justice, Human Rights Advocate, South African Judge, United Nations High Commissioner]
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు. ట్యాంక్‌బండ్‌తో పాటు నగరంలోని ప్రధాన రహదారులు, చెరువులు, పార్కులు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో అర్ధరాత్రి కేక్ కటింగ్‌లు నిర్వహించవద్దని సూచించారు. సరదా కోసం చేసే చిన్నపాటి నిర్లక్ష్యం కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.మూడు రోజుల క్రితం అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో ట్యాంక్‌బండ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆరేళ్ల చిన్నారి పుట్టినరోజు వేడుకల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో చిన్నారితో పాటు ఆమె కుటుంబ సభ్యుడు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారని, ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రాణనష్టం జరగడం బాధాకరమని సజ్జనార్ తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించినట్లు కమిషనర్ వెల్లడించారు. ట్యాంక్‌బండ్‌పై ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత ప్రభుత్వ శాఖలతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అర్ధరాత్రి వేళ రహదారులపై రాకపోకలు తక్కువగా ఉండటంతో కొందరు వాహనదారులు అధిక వేగంతో ప్రయాణించే అవకాశం ఉంటుందని సజ్జనర్ హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నపిల్లలను వెంటబెట్టుకుని రోడ్లపైకి రావడం ప్రమాదకరమని స్పష్టం చేశారు. పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య ఇంట్లో లేదా సురక్షితమైన ప్రదేశాల్లో జరుపుకోవాలని సూచించారు. ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే వేడుకలు, కేక్ కటింగ్‌ల నిర్వహణపై ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ఆంక్షలు విధించిందని గుర్తుచేశారు. పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తూ అక్కడ వేడుకలు నిర్వహించేందుకు వచ్చే వారిని వెనక్కి పంపిస్తున్నప్పటికీ, కొందరు మళ్లీ అర్ధరాత్రి అక్కడికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. కొన్ని క్షణాల ఆనందం కోసం విలువైన ప్రాణాలను పణంగా పెట్టవద్దని సజ్జనర్ నగరవాసులకు సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. ట్యాంక్‌బండ్‌తో పాటు చెరువుల పరిసరాలు, ప్రధాన రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో అర్ధరాత్రి వేడుకలకు దూరంగా ఉండాలని, పోలీసుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. పుట్టినరోజు వేడుకలు ఆనందాన్ని పంచాలే తప్ప.. కుటుంబాల్లో విషాదాన్ని మిగల్చకూడదు అని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.     [ Hyderabad CP VC Sajjanar, Tank Bund Birthday Celebrations, Midnight Birthday Parties, Tank Bund Road Accident, Hyderabad Traffic Police, Birthday Cake Cutting Ban, GHMC Restrictions, Hyderabad Road Safety, Tank Bund Accident, Child Safety, Midnight Celebrations Ban, Hyderabad Police Advisory, Road Accident Prevention, Public Safety, Hyderabad News, Telangana News]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పార్టీ మార్పులు, కొత్త సమీకరణాలతో వేడెక్కుతున్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వైపీపీని జీరో చేయడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వేస్తున్న ఆడుగులు ఆసక్తికరంగా మారాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, శాసనమండలిలో ఆ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణకు పెట్టని కోట లాంటి విజయనగరం జిల్లాలో ఆయన పట్టు సడలే విధంగా తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోంది.  వైసీపీ  కీలక నాయకుడు, బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు అలియాస్‌ చిన్న శ్రీను ఇటీవల వైసీపీని వీడి తెలుగుదేశం గూటికి చేరిన సంగతి తెలిసిందే. అయితే అదేదో మామూలు చేరికగా కాకుండా.. ఏకంగా విజయనగరం జిల్లా సారథ్య బాధ్యతలను ఆయనకు అప్పగించి వైసీపీని దెబ్బతీయాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.  అయితే విజయనగరం జడ్పీ చైర్మన్ గా, వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన, జిల్లాలో మంచి రాజకీయ పలుకుబడి ఉన్న చిన్న శ్రీనును తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం వెనుక ఉన్న వ్యూహం ఆషామాషీది కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో చిన్న శ్రీను గత నెలలో తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. ఆయన తో పాటు పలువురు ఆయన అనుచరులు కూడా తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు. ఆ సందర్భంగా చిన్న శ్రీను ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్న ఉద్దేశంతోనే తెలుగుదేశం గూటికి వచ్చినట్లు విస్పష్టంగా చెప్పారు. తన చేరికకు ఎటువంటి షరతులు, పదవుల ప్రలోభాలూ లేవని కుండబద్దలు కొట్టారు.   తెలుగుదేశం గూటికి చేరిన తరువాత చిన్న శ్రీను వరుసగా ఆ పార్టీ అగ్రనేతలతో వరుస భేటీలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.   చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నారా లోకేశ్‌ను ఆయన కలిసి జిల్లా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ నేపథ్యంలోనే చిన్న శ్రీనుకు తెలుగుదేశం జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టే అవకాశాలున్నాయన్న చర్చ తెరపైకి వచ్చింది. ఇందుకు  చిన్న శ్రీనుకు జిల్లాపై ఉన్న పట్టు, పలుకుపడే ప్రధాన కారణమనడంలో సందేహం లేదు.  చిన్న శ్రీనుకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న ప్రచారానికి ప్రధాన కారణం జిల్లాలో ఆయనకు ఉన్న రాజకీయ పరిచయాలే అనడంలో సందేహం లేదు. అదే గనుక జరిగితే విజయనగరంలో బొత్స హవాకు పూర్తిగా గండి పడినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   [TDP Vijayanagaram President Chinna Srinu, Chandrababu Naidu, Chinna Srinu, Majji Srinivasa Rao, Vizianagaram TDP, TDP District President, Nara Lokesh, YCP to TDP,Telugu One]
ALSO ON TELUGUONE N E W S
Sharwanand and Anupama Parameswaran starrer Bhogi has unveiled its first single, Egili Varanga, offering a glimpse into the film’s rustic world set in 1960s Telangana. Written and directed by Sampath Nandi and produced by KK Radhamohan, the film is gearing up for a worldwide release on November 12. Following a teaser that showcased Sharwanand in a raw and rugged avatar, the song takes audiences into the lives, traditions and struggles of rural Telangana. From Anupama Parameswaran cleaning her surroundings ahead of the festival to Sharwanand and his fellow villagers offering their harvest to the Patel, the visuals capture the customs and social realities of the period with striking detail. Sampath Nandi’s attention to the setting, backed by the production design and artwork, lends the song an authentic feel. Bheems Ceciroleo’s composition and Oscar-winning lyricist Chandrabose’s words complement the visuals, while singers Nalgonda Gaddar Narasanna, Relare Gopal, Narsireddy and Kandukuri Shankar Babu bring a distinct folk texture to the track. Sharwanand stands out in his de-glamourised role, carrying a strong screen presence that fits the film’s rural setting. Anupama also appears convincingly immersed in the period. With its earthy music and carefully recreated Telangana milieu, Egili Varanga adds to the anticipation surrounding Bhogi and offers a deeper glimpse into the world Sampath Nandi is building.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.  
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్‌కు గుర్తొచ్చే సినిమాలు ఎన్నో. ప్రేమకథలు, కామెడీ, కుటుంబ అనుబంధాలు.. ఇలా తనదైన శైలిలో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే ‘దసరా’తో మాస్ ఇమేజ్‌పై దృష్టి పెట్టిన నాని.. ఆ తర్వాత ‘హిట్ 3’, ‘ది ప్యారడైజ్’ వంటి సినిమాలతో మరింత రా అండ్ రస్టిక్ యాక్షన్ బాట పట్టారు. కానీ ఇప్పుడు నాని మళ్లీ తన పాత స్టైల్‌లోకి వస్తున్నారా? ఆయన కొత్త సినిమాల లైనప్ చూస్తే ఇదే అనిపిస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌లో నానికి తిరుగులేని క్రేజ్ ఉంది. కానీ, నాని మాత్రం ఆ ఇమేజ్ కి దూరంగా జరుగుతూ.. వయలెంట్ సినిమాలతో మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు.  అయితే వరుసగా హింసాత్మక కథల్లో కనిపించడం వల్ల ఆయన నుంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ ఆశించే ప్రేక్షకులకు కొంత అసంతృప్తి ఏర్పడిందనే చర్చ సాగింది. ముఖ్యంగా ‘ది ప్యారడైజ్’పై వచ్చిన విమర్శల నేపథ్యంలో నాని తదుపరి సినిమాలు ఎలా ఉండబోతున్నాయన్న ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం నాని, దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో ‘బ్లడీ రోమియో’ రూపొందుతోంది. ఈ సినిమా కూడా యాక్షన్‌తోనే సాగనుంది. అయితే గత చిత్రాల్లో కనిపించినంత రా అండ్ రస్టిక్ వైలెన్స్ కాకుండా, యాక్షన్‌లో కొత్త తరహా వినోదం ఉంటుందని నాని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ‘బ్లడీ రోమియో’ తర్వాత తాను చేయబోయే సినిమా ప్రేమకథ అని, పిల్లలు సహా అన్ని వయసుల ప్రేక్షకులు చూడగలిగేలా ఉంటుందని నాని స్వయంగా వెల్లడించారు.  నాని తదుపరి ప్రాజెక్టుల విషయంలో మరో ఆసక్తికరమైన అంశం ప్రేమ్ కుమార్ పేరు. ‘96’, ‘సత్యం సుందరం’ వంటి భావోద్వేగభరితమైన సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ దర్శకుడితో నాని ఓ సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కాంబినేషన్ నిజమైతే.. నాని నుంచి మరో ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ‘నిన్ను కోరి’, ‘టక్ జగదీష్’ సినిమాల తర్వాత నాని – శివ నిర్వాణ కాంబినేషన్‌లో మరో సినిమా ఉంటుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. శివ నిర్వాణ సినిమాల్లో కుటుంబ సంబంధాలు, ప్రేమ, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉంటుంది. అందుకే ఈ కాంబినేషన్‌పై కూడా ఆసక్తి నెలకొంది.  మొత్తానికి ‘బ్లడీ రోమియో’ తర్వాత ప్రేమకథ, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమాల వైపు అడుగులు వేస్తే.. నాని తన పాత బలాన్ని మళ్లీ గుర్తు చేసినట్టే. మరి ఈ నేచురల్ స్టార్ మళ్లీ ఫ్యామిలీ ఆడియన్స్‌ను పూర్తిస్థాయిలో ఆకట్టుకుంటారా? రాబోయే సినిమాలే దీనికి సమాధానం చెప్పాలి. ఇది కూడా చదవండి: కామ్రేడ్ కళ్యాణ్‌పై మెగా అభిమానుల గుర్రు.. ఆచార్యపై సెటైర్ అవసరమా.?       [Nani Back To Family Zone, Nani Upcoming Movies, Nani Family Movies, The Paradise Movie, Nani Paradise Movie, Natural Star Nani, Bloody Romeo, Prem Kumar, Shiva Nirvana, Telugu Film News]  
Cast: Shobhinav Satya, Purnima Tiwari, Chandan K Anand, Anil Rastogi, and Bhagwan Das Patel Crew: Screenplay: Vishal Chaturvedi Music Composer: Sadu Sushil Tiwari Cinematography: Vishal Bawa Editor: Shanku Rajadhyaksha Director: Vishal Chaturvedi Producers: Ragini Sona, Namrita Singh, Vishal Chaturvedi, and Anupriya After a massive 400-crore success in Bollywood, Hanuman Ansh has now released in Telugu. Let us look into how this devotional drama unfolds on the screen.   Plot: Losing his mother at age three, Lakshman Kumar (Shobhinav Satya) finds peace in meditation and chanting "Sitaram." Believing the entire world is his family and that Lord Shiva resides in everyone, he travels extensively before settling in the village of Neem Karoli in Uttarakhand. When his father reminds him of his childhood wife (Purnima Tiwari), he returns to visit her. The story reveals how he transforms into the revered Neem Karoli Baba, exploring his miracles, philosophies, and the spiritual path he taught humanity. Analysis: The film successfully keeps viewers in a deep spiritual mood through a clever, non-linear screenplay. It opens strongly with a doctor fighting the British, seamlessly leading into Baba's engaging flashback. The scenes sharing his early life truths and the moment where a disciple sees Lord Shiva in him are brilliantly executed. The second half shines with an excellent train episode involving a British officer and a very well-handled climax. However, the film slightly struggles to explain why Baba chose to settle down in Neem Karoli, despite his strong philosophy of non-attachment. Shobhinav Satya brings Baba to life with an authentic performance, while the direction and background score beautifully elevate the entire experience. Positives: Engaging story and clever screenplay Shobhinav Satya's exceptional performance Direction and background score The train episode and interval twist Negatives: Baba's reason for staying in Neem Karoli is weakly established   Bottomline: A perfect devotional film that feels like attending a beautiful and peaceful Ram Bhajan. Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
Nithiin’s upcoming film Alias Rukmini, presented by Nani under Unanimous Productions, is set to arrive in theatres on December 4. However, the film will face competition at the box office, with Naga Chaitanya’s Vrushakarma and Dulquer Salmaan’s Sri Sri also scheduled to release on the same date. Written and directed by Murali Kanth Devasoth, Alias Rukmini features Nithiin as Krishna, an ordinary man whose life takes an unexpected turn when love enters it. The announcement glimpse introduced him as a writer and a loving husband, offering a glimpse into a heartwarming story built around relationships and emotions. His understated look and charming screen presence have added to the curiosity surrounding the film. Deepthi Ganta is producing the film, which features music by Vijai Bulganin. The shoot is nearing completion, with just one schedule remaining, while post-production work is progressing simultaneously. With three films targeting the same release date, December 4 is shaping up to be an interesting box-office clash. While Alias Rukmini banks on its emotional appeal and Nithiin’s performance, Vrushakarma brings Naga Chaitanya into the competition, while Dulquer Salmaan’s Sri Sri adds another contender to the mix. The films will compete for audience attention, with their content and word of mouth likely to play a crucial role in determining their theatrical prospects.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  -సినిమా పేరు: మయూఖ -న‌టీన‌టులు: పాయల్ చెంగప్ప, అమన్ మసూద్, దేవ్ డి, మురళీధర్ గౌడ్, లావణ్య రాణి, చరిశ్మ -దబ్బార, జాను వర్మ, నానాజీ కర్రి, రఘు వాసిరెడ్డి తదితరులు  -సినిమాటోగ్ర‌ఫీ: ఫర్హాన్ వడక్కం -ఎడిటింగ్: శరత్. జె -మ్యూజిక్: శిబి మాత్యూ అలెక్స్ -నిర్మాత‌: శశిధర్ నల్ల -బ్యానర్స్:ఫ్రష్విత ఎంటర్ టైన్ మెంట్స్, సినిమా బండి ప్రొడక్షన్స్      -రచన,దర్శకత్వం: శ్రీ తేజ్ ఎస్ కే -రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 9 ,2026  ప్రచార చిత్రాలతో క్రేజ్ ఏర్పరచుకున్న చిత్రం 'మయూఖ'. క్రైమ్, సస్పెన్స్  థ్రిల్లర్ గా తెరకెక్కింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ మయూఖ(పాయల్ చెంగప్ప).పెళ్లి కానీ అందమైన యువతి. బ్యాంక్ లో పని చేస్తుంటుంది. ఇన్సూరెన్స్ పాలసీలు చేయించడం తన డ్యూటీ. తన ఊహల్లో పదేళ్ల వయసులో జరిగిన  భయంకర సంఘటన గుర్తుకొస్తుండటంతో భయం బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది. నైట్ అయితే బెడ్ పై  తన పక్కనే రాత్రిపూట ఒక అపరిచిత వ్యక్తి నిద్రపోతుంటాడు. మయూఖని ఏం చేయకుండా ఉదయాన్నే వెళ్లిపోతుంటాడు. ఇంకో పక్క ఆడవాళ్ళని చంపి ఆడవాళ్ళ చేతుల ద్వారా సెంట్ ని తయారు చేసే సైకో తన లక్ష్యంలో బిజీగా ఉంటాడు. మయూఖకి సైకో కి మధ్య జరిగిన కథే మయూఖ. ఎనాలసిస్  కథ పాయింట్ బాగుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ సూపర్. స్టార్టింగ్ సీన్ తో  మూవీ ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ కలిగింది. ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే మయూఖ విషయంలో ఏం జరగబోతుందనే క్యూరియాసిటీ ఇస్తూ ఇచ్చిన సీన్స్ బాగున్నాయి. వాచ్ మెన్ క్యారక్టర్ ని మరింతగా ఉపయోగించుకోవాల్సింది. సైకో వ్యక్తి తన లక్ష్యం కోసం చేసే సన్నివేశాలని భయం కలిగించేలా చేసే సీన్స్ ని ఎందుకు ఎక్కువగా సృష్టించలేకపోయారో అర్ధం కాదు. ఎందుకంటే కథ మెయిన్ పాయింట్ అదే.  ఎంత సేపు ఇన్విస్టిగేషన్, మయూఖ భయపడటం సీన్స్ పైనే వెళ్లారు. ఇంటర్వెల్ ట్విస్ట్ నార్మల్. సెకండ్ హాఫ్ లో కథనంలో వేగం పెరిగింది. సైకోకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ , సీన్స్ అతని గోల్ చూస్తే ఒళ్ళు గగుర్ పాటుకి గురవుతుంది. ఆ క్యారక్టర్ గోల్ పై  కొన్ని లాజిక్ లు ఉన్నా  సినీ ఫక్కీలో కొట్టుకుపోతుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగున్నాయి.   నటీనటులు, సాంకేతిక నిపుణుల పని తీరు  మయూఖగా చేసిన పాయల్ చెంగప్ప తన పెర్ఫార్మ్ తో  మెస్మరైజ్ చేసింది. కాకపోతే ఎక్కువగా లాంగ్ షాట్స్ పడటం వల్ల ఫేస్ లోని ఎక్స్ ప్రెషన్స్  అంతగా కనిపించలేదు. పోలీస్ ఇన్స్పెక్టర్ గా చేసిన దేవ్ శశాంక్ తన పెర్ఫార్మ్ తో ఆకట్టుకున్నాడు.సైకో గా చేసిన ఆర్టిస్ట్ తో పాటు మిగతా అందరు తమ క్యారెక్టర్స్ పరిధి మేరకు మెప్పించారు. శ్రీ తేజ్ దర్శకుడిగా భారీగా సక్సెస్ అయినా రచయితగా మాత్రం అంతగా మెప్పించలేకపోయాడు.   నిర్మాణ విలువలు, ఫొటోగ్రఫీ ప్రధాన హైలెట్.. మయూఖ లాంటి సబ్జెక్ట్స్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆయువుపట్టులా ఉండాలి. అలాంటిది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో పెద్దగా మెరుపులు లేవు. బలాలు 1 .కథ   2 . దర్శకత్వం  బలహీనతలు  1 .కథనం ఎస్టాబ్లిష్ చేసే విధానంలో కొన్ని లోపాలు  చివరిగా చెప్పుకోవాలంటే క్రైమ్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్ళు ఒకసారి చూసేయచ్చు      రేటింగ్ 2 .5 /5                                                                                                                                                                                                                                                అరుణాచలం   
మెగా అభిమానులకు ‘ఆచార్య’ సినిమా మిగిల్చిన నిరాశ అంతా ఇంతా కాదు. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుంటే.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఆ సినిమా ఫలితం నుంచి బయటపడటానికి అభిమానులకు చాలా కాలమే పట్టింది. ఇప్పుడు మెగా కుటుంబానికి చెందిన నటీనటులు వరుస విజయాలతో ముందుకు సాగుతున్న సమయంలో.. శ్రీ విష్ణు నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’లో ఆచార్య ప్రస్తావన చర్చకు దారితీస్తోంది. శ్రీ విష్ణు నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’లో కామెడీ కోసం పలు పాపులర్ సినిమాల రిఫరెన్స్‌లను ఉపయోగించారు. అందులో భాగంగా.. ‘‘నీది ఏ దళం అంటే.. నాది ఆచార్య దళం’’ అంటూ శ్రీ విష్ణు చెప్పే డైలాగ్‌తో పాటు.. ఆ దళం ఎక్కడ ఉంటుందని అడిగితే "ధర్మస్థలికి, పాదఘట్టానికి మధ్యలో ఉంటుంది" అని చెబుతాడు. సినిమాల్లో ఇతర చిత్రాలపై సరదాగా సెటైర్లు వేయడం కొత్తేమీ కాదు. సందర్భానికి తగ్గట్టుగా రాస్తే ఇలాంటి డైలాగ్స్‌ ప్రేక్షకులను నవ్విస్తాయి. అయితే ‘ఆచార్య’ విషయంలో మెగా అభిమానుల భావోద్వేగాలు కాస్త భిన్నం. తండ్రీకొడుకులు కలిసి నటించిన సినిమా కావడంతో అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఫలితం నిరాశపరచడంతో ఆ సినిమా ఇప్పటికీ ట్రోల్స్‌కు టార్గెట్‌ అవుతూనే ఉంది. ఇలాంటి నేపథ్యంలో మరో సినిమాలో ‘ఆచార్య’ పేరును కామెడీ కోసం ఉపయోగించడంపై కొందరు మెగా అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్ తమ సినిమాలతో అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్న సమయంలో.. పాత గాయాన్ని మళ్లీ గుర్తు చేయడం ఎందుకనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కూడా చదవండి: కామ్రేడ్ కళ్యాణ్‌ మూవీ రివ్యూ       [Comrade Kalyan Acharya Dialogue, Comrade Kalyan Movie, Acharya Movie, Sree Vishnu, Chiranjeevi, Ram Charan, Mega Fans, Telugu Film News]  
తెలుగు డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 11న నిర్వహించ తలపెట్టిన ఎన్నికలను తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నిలిపివేసింది. ఎన్నికలకు ముందే వివాదాన్ని విచారించకుండా, ఎన్నికల అనంతరం విచారణకు తేదీ నిర్ణయించడంపై ట్రయల్ కోర్టు తీరును తప్పుబట్టింది. పిటిషనర్‌కు మధ్యంతర రక్షణ కల్పిస్తూ సెప్టెంబర్ 28న జారీ చేసిన డాకెట్ ఆర్డర్‌ను సస్పెండ్ చేసింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సెప్టెంబర్ 23న తమ అసోసియేషన్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం సెప్టెంబర్ 24న ఫెడరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి, 2026–2028 కాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు అక్టోబర్ 11న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే, ప్రస్తుత కార్యవర్గం పదవీకాలం డిసెంబర్ 6, 2027 వరకు ఉందని, ఈ నేపథ్యంలో ఫెడరేషన్ జారీ చేసిన ఎన్నికల నోటిఫికేషన్ చెల్లదని పేర్కొంటూ సుమలత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అసోసియేషన్ కార్యవర్గాన్ని కొనసాగించడంతో పాటు, ఎన్నికలను నిలిపివేయాలని కోరుతూ సివిల్ దావా దాఖలు చేశారు. పిటిషనర్ సెప్టెంబర్ 28న దావాతో పాటు ఎన్నికలను నిలిపివేయాలని కోరుతూ మధ్యంతర దరఖాస్తు దాఖలు చేశారు. అయితే, ట్రయల్ కోర్టు అత్యవసర నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను నవంబర్ 3, 2026కి నిర్ణయించింది. ఎన్నికలు అక్టోబర్ 11న జరగాల్సి ఉన్నప్పటికీ, వాటిని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పిటిషనర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అక్టోబర్ 8న విచారణ చేపట్టిన ధర్మాసనం, ట్రయల్ కోర్టు ఉత్తర్వుల్లో మధ్యంతర ఉపశమనం నిరాకరించడానికి గల కారణాలు స్పష్టంగా లేవని పేర్కొంది. ఎన్నికల నోటిఫికేషన్ సెప్టెంబర్ 24నే జారీ అయిందని, అక్టోబర్ 11న ఎన్నికలు జరగనున్నాయని తెలిసినప్పటికీ, విచారణను నవంబర్ 3కి వాయిదా వేయడం సమంజసం కాదని అభిప్రాయపడింది. ఫెడరేషన్ తరఫున ప్రతివాది కోర్టుకు హాజరై తన వాదనలు వినిపించే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అక్టోబర్ 11న ఎన్నికలు నిర్వహించకుండా ఆంక్షలు విధించింది. ప్రతివాదికి వ్యక్తిగత నోటీసుతో సహా నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. దసరా సెలవుల అనంతరం కోర్టు పునఃప్రారంభమయ్యే అక్టోబర్ 30న ఈ కేసును విచారణకు జాబితా చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణలో ఫెడరేషన్ తన వాదనలు వినిపించాల్సి ఉంటుంది. హైకోర్టు తాజా ఉత్తర్వులతో డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.       [Dancers Association Elections, Telangana High Court, Telugu Dancers Association, Sumalatha vs Raghu Master, Dancers Association Sumalatha, Dancers Association Controversy, Telugu Film News]  
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ రాశీ ఖన్నా.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించిన ఆమె, తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ హీరోల గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. గతంలో తారక్‌తో కలిసి ‘జై లవకుశ’ సినిమాలో నటించిన రాశీ.. ఆయన ఎనర్జీ లెవల్స్ గురించి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్‌ను చూస్తే తనకు ఆశ్చర్యం కలుగుతుందని రాశీ ఖన్నా చెప్పారు. ఆయనలో ఉండే ఉత్సాహం, చురుకుదనం చాలా ప్రత్యేకమని కొనియాడారు. తారక్‌ను చూస్తుంటే అసలు అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందా? అని అనిపించేదని తెలిపారు. సరదాగా ఆయనను ఒక ప్రశ్న కూడా అడిగినట్లు వెల్లడించారు. ‘‘మీరు రెడ్ బుల్ వంటి ఎనర్జీ డ్రింక్స్ ఏమైనా తాగుతారా?’’ అని అడిగానని రాశీ ఖన్నా గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్‌లో ఉండే ఉత్సాహాన్ని ఎనర్జీ డ్రింక్‌తో పోల్చడం ఆమె చేసిన సరదా వ్యాఖ్యల్లో ప్రత్యేకంగా నిలిచింది. అంతేకాదు, ఎన్టీఆర్ నటనతో పాటు ఆయన డైలాగ్ డెలివరీ కూడా తనను ఎంతగానో ఆకట్టుకుంటుందని రాశీ చెప్పారు. పది పేజీల సుదీర్ఘమైన డైలాగులను సైతం ఆయన ఎంతో సులభంగా చెప్పగలరని ప్రశంసించారు. తెలుగుపై ఆయనకు ఉన్న పట్టు, స్పష్టంగా మాట్లాడే విధానం ప్రత్యేకమని పేర్కొన్నారు. ‘జై లవకుశ’ షూటింగ్ సమయంలో ఆయనతో కలిసి పనిచేయడం మంచి అనుభవమని ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది. తెరపై మాత్రమే కాకుండా సెట్స్‌లోనూ ఎన్టీఆర్ చూపించే ఉత్సాహం తోటి నటీనటులను ఆకట్టుకుంటుందనే విషయం మరోసారి చర్చకు వచ్చింది. ఇక రాశీ ఖన్నా ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాలతో పాటు ఇతర భాషల్లోనూ అవకాశాలు అందుకుంటున్నారు. పవన్ కల్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, సిద్ధు జొన్నలగడ్డతో ‘తెలుసు కదా’ వంటి ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మరోవైపు, ఇతర భాషల్లోనూ తన నటనతో గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తోటి హీరోల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ ఎనర్జీ గురించి రాశీ చెప్పిన ఈ సరదా సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.       [Raashii Khanna, Jr NTR Energy Levels, Raashii Khanna About Jr NTR, Jai Lava Kusa Movie, Jr NTR Red Bull Comment, Raashii Khanna Latest News, Jr NTR Viral News]
  -సినిమా పేరు: హనుమాన్ అంశ్ -న‌టీన‌టులు: శోభినవ్ సత్య, పూర్ణిమ తివారి, చందన్ కె ఆనంద్, అనిల్ రస్తోగి, భగవాన్ దాస్ పటేల్   తదితరులు  -సినిమాటోగ్ర‌ఫీ: విశాల్ బవ  -ఎడిటింగ్: శంకు రజాధ్యక్ష  -మ్యూజిక్: సాదు సుశీల్ తివారి -నిర్మాత‌లు: రాగిణి సోన, నమ్రిత సింగ్ , విశాల్ చతుర్వేది,అనుప్రియ  -బ్యానర్స్: శంభు మీడియా నెట్ వర్క్ ,హోలీ కౌ హోమ్ ప్రొడక్షన్స్  -రిలీజ్: హోంబులే ఫిల్మ్స్  -రచన,దర్శకత్వం:  విశాల్ చతుర్వేది -రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 9 ,2026  ఆగస్టు 7 న బాలీవుడ్ లో విడుదలై 400 కోట్ల క్లబ్ లో చేరిన చిత్రం హనుమాన్ అంశ్. ఈ రోజు తెలుగు సెల్యులాయిడ్ పై తెలుగులో అడుగుపెట్టింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ లక్ష్మణ్ కుమార్( శోభినవ్ సత్య) మూడేళ్ళ వయసులోనే తల్లిని కోల్పోతాడు. దీంతో నేను  కూడా తల్లి దగ్గరికి వెళ్లిపోతానని మారం చేసే నైజం. ఆ తర్వాత తల్లి నేర్పించిన అంతర్ముఖ మనసుతో కూడిన 'ధ్యానం' తో పాటు 'సీతారామ్' అనే మహత్తరమైన పదాన్ని జీవశ్వాశ గా చేసుకొని దేశమే తన కుటుంబం అని పలు ప్రాంతాలలో పర్యటిస్తాడు. ప్రతి మనిషిలోనూ శివుడు కొలువుతీరి ఉంటాడనేది కూడా లక్ష్మణ్ కుమార్ నమ్మకం. రాముడ్ని చేరుకోవడమే తన లక్ష్యంతో పాటు ఆంజనేయ స్వామిని నిత్యం కొలుస్తుంటాడు. ఈ క్రమంలో  చివరకి ఉత్తరాఖండ్ లోని 'నీమ్ కరోలి' అనే గ్రామం తన స్థావరం అవుతుంది. ఆ తర్వాత తన తండ్రి వచ్చి చిన్నపుడే పెళ్లి చేసుకున్న  భార్య( పూర్ణిమ తివారి)  సంగతి ఏంటని అడుగుతాడు. దీంతో లక్ష్మణ్ కుమార్ భార్య దగ్గరకి వస్తాడు. భార్య దగ్గరకి వచ్చిన లక్ష్మణ్ కుమార్ తిరిగి వెళ్లాడా? వెళ్తే 'నీమ్ కరోలి' బాబాగా ప్రాచుర్యం పొందటానికి బాబా అవలంబించిన పద్దతలు ఏంటి? బాబా ఎందుకు ఎప్పడు క్లీన్ షేవ్ తో ఉంటాడు? చూపించిన మహిమలు ఏంటి? మానవాళికి బాబా చెప్పిన మార్గం ఏంటి? అనేదే 'హనుమాన్ అంశ' ఎనాలసిస్  మూవీ చూస్తున్నంత సేపు ఆధ్యాత్మిక భావనలో ఉండిపోతాం. మేకర్స్ చాలా తెలివిగా ఆ ఆధ్యాత్మికతని రెగ్యులర్ ఫార్మట్ లో కాకుండా చాలా తెలివైన స్క్రీన్ ప్లే తో చెప్పడం హనుమాన్ అంశ  స్పెషల్. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే మూవీ ప్రారంభమే రివర్స్ స్క్రీన్ ప్లే తో  ఇండియాకి స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాడుతున్న ఒక డాక్టర్ పై ఓపెన్ చేసి క్యూరియాసిటీ కలిగించారు. ఆ తర్వాత తన ఆకలి తీర్చడం కోసం నీమ్ కరోలి బాబా రావడం సీన్ సూపర్. ఇక ఆ డాక్టర్ పైనే  బాబా  ఫ్లాష్ బ్యాక్ సీన్స్ చెప్పించడం, ఈ క్రమంలోనే బాబా పన్నెండేళ్ల వయసు సీన్స్ తో పాటు తను చెప్పిన మాటలు, జీవిత సత్యాలతో వచ్చిన సీన్స్ అన్ని బాగున్నాయి. కాకపోతే  నీమ్ కరోలి అనే ఊరిలోనే బాబా ఎందుకు ఉన్నాడనే విషయాన్నీ బాగా ఎస్టాబ్లిష్ చేసుండాల్సింది. ఎందుకంటే ప్రవహించే నీరు లాగా ఒకే చోట ఉండకూడదు, ఏ ప్రాంతం పైన ప్రేమని పెంచుకోకుడదు అనేది బాబా సిద్ధాంతం. బాబా, తన శిష్యుల మధ్య వచ్చిన సీన్స్ లో ఎన్నో జీవిత సత్యాలు తెలిసాయి. శిష్యుడుకి శివుడిలా కనిపించే సీన్ అయితే గూస్ బంప్స్ . ఇంటర్వెల్  ట్విస్ట్ బాగుంది. సెకండ్ హాఫ్ చూసుకుంటే బాబాలో ఉన్న అంతర్ముఖ కార్యుడు మరింతగా ప్రజ్వల్లాడు. బ్రిటిష్ అధికారితో వచ్చిన ట్రైన్ ఎపిసోడ్ ఎక్స్ లెంట్. గూస్ బంప్స్ కూడా వస్తాయి. వైఫ్ తో వచ్చిన సీన్స్ తో పాటు మళ్ళీ నీమ్ కరోలి తిరిగి రావడం, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కూడా బాగున్నాయి. నటీనటులు, సాంకేతిక నిపుణుల పని తీరు  నీమ్ కరోలి బాబానే సెల్యులాయిడ్ పైకి వచ్చాడా అనే విధంగా శోభినవ్ సత్య పెర్ఫార్మ్ మొదటి నుంచి చివరి వరకు సాగింది. ప్రతి సన్నివేశంలోను జీవాన్ని సృష్టించడంలో నూటికి నూరు పాళ్ళు సక్సెస్ అయ్యాడు. చిన్న వయసప్పుడు  చేసిన బాల నటుడి క్యారక్టర్ కూడా మెరుపులు మెరిపించాడు. బాబా శిష్యులుగా చేసిన వాళ్లతో పాటు రామ్ నందన్ భోస్లే ( చందన్ కె ఆనంద్) పూర్ణిమ తివారి, నిఖిల్ దూబే, భగవాన్ దాస్ పటేల్ ఇలా అందరు తమ క్యారెక్టర్స్ లో మెస్మరైజ్ చేసారు. విశాల్ చతుర్వేది దర్శకత్వ ప్రతిభ , విశాల్ బవ ఫొటోగ్రఫీ, సాదు సుశీల్ తివారి మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన హైలెట్.   బలాలు 1 . కథ , కథనం 2 . శోభినవ్ సత్య పెర్ ఫార్మెన్స్  3 . డైరెక్షన్  చివరిగా చెప్పాలంటే పక్కా డివోషనల్ మూవీ.. చక్కటి రామ భజనకి వెళ్ళి వచ్చినట్టుగా ఉంటుంది.                                                                                                                                       అరుణాచలం   
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ‘ఆర్ఆర్ఆర్’తో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో గతంలో తనతో సినిమా చేసిన ఓ బాలీవుడ్ దర్శకుడికి చరణ్ నో చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ దర్శకుడు మరెవరో కాదు.. ‘జంజీర్’ సినిమాతో చరణ్‌ను బాలీవుడ్‌కు పరిచయం చేసిన అపూర్వ లఖియా. తాజాగా ఆయన మరో కథతో రామ్ చరణ్‌ను సంప్రదించగా, ఈ మెగా హీరో సున్నితంగా తిరస్కరించినట్లు ప్రచారం జరుగుతోంది. అమితాబ్ బచ్చన్ నటించిన క్లాసిక్ మూవీ ‘జంజీర్’ను 2013లో రీమేక్ చేశారు. అపూర్వ లఖియా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్‌కు జోడీగా ప్రియాంక చోప్రా నటించగా, సంజయ్ దత్, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. తెలుగులో ‘తుఫాన్’ పేరుతోనూ విడుదలైన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. బాలీవుడ్‌లో తొలి ప్రయత్నమే నిరాశను మిగల్చడంతో రామ్ చరణ్‌కు ఈ సినిమా ఒక చేదు అనుభవంగా మిగిలిపోయింది. అయితే, ఆ తర్వాత చరణ్ తన కెరీర్‌ను పూర్తిగా కొత్త దిశలో ముందుకు తీసుకెళ్లారు. ‘రంగస్థలం’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలతో నటుడిగా తన స్థాయిని పెంచుకున్నారు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. మరోవైపు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టారు. ఇలాంటి సమయంలో గతంలో తనకు పరాజయాన్ని అందించిన దర్శకుడితో మరోసారి సినిమా చేయడానికి ఆసక్తి చూపడం లేదనే ప్రచారం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే అపూర్వ లఖియా ప్రతిపాదనను చరణ్ తిరస్కరించడానికి ఇదే కారణమని అధికారికంగా వెల్లడి కాలేదు. మరోవైపు, ‘జంజీర్’ పరాజయం తర్వాత రామ్ చరణ్ హిందీలో మరో స్ట్రెయిట్ సినిమా చేయలేదు. సరైన కథ దొరికితే హిందీ సినిమాల్లో నటించేందుకు సిద్ధమేనని గతంలో ఆయన చెప్పినప్పటికీ, ఇప్పటివరకు అలాంటి ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం తెలుగు సినిమాలతో పాటు పాన్ ఇండియా మార్కెట్‌పై దృష్టి పెట్టిన చరణ్.. తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మరి భవిష్యత్తులో ఆయన బాలీవుడ్‌లోకి మళ్లీ అడుగుపెడతారా? అపూర్వ లఖియాతో మరోసారి పనిచేసే అవకాశం ఉంటుందా? అనేది వేచి చూడాలి.     [Ram Charan, Ram Charan Rejects Apoorva Lakhia, Apoorva Lakhia New Movie, Zanjeer Movie Failure, Thoofan Movie Ram Charan, Ram Charan Upcoming Movies, Ram Charan Bollywood News]
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
తెలుగువారి ఇళ్లల్లో ఆదివారం ఉదయమైనా, విశేషమైన పండుగల వేళ అయినా అందరూ ఎంతో సంబరంగా చేసుకునే ప్రత్యేక ఉపహారాల్లో పూరీ ఒకటి. పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు ఇంట అందరూ ఎంతో ఇష్టంగా లొట్టలేసుకుంటూ తినే ఈ పూరీలలో ఒకే ఒక్క సమస్య ప్రతీ ఇంటా ఇల్లాళ్లను తరచూ వేధిస్తూ ఉంటుంది. అదేంటంటే పూరీలు కడాయిలోని నూనెను విపరీతంగా పీల్చేయడం. అలా నూనె జిడ్డుగా మారిన పూరీలు తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాకపోగా, రుచిని మరియు తినే ఉత్సాహాన్ని పూర్తిగా పాడుచేస్తాయి. అయితే ఈ నిత్యం ఎదురయ్యే సమస్యకు సులువైన, అద్భుతమైన పరిష్కారంతో ప్రముఖ కంటెంట్ క్రియేటర్ అనితా మోహన్ కొన్ని ప్రతిరోజూ పాటించదగిన కిచెన్ హ్యాక్స్ పంచుకున్నారు. చాలామంది పూరీ పిండిని నలిపేటప్పుడు చపాతీ పిండిలా బాగా మెత్తగా కలుపుతుంటారు, కానీ అది చాలా పెద్ద పొరపాటు. అనితా మోహన్ చెప్పిన వివరణ ప్రకారం, పూరీ పిండిని ఎప్పుడూ తగినన్ని నీళ్లు మాత్రమే పోస్తూ చాలా గట్టిగా, బిగుతుగా కలుపుకోవాలి. పిండి ఎంత గట్టిగా ఉంటే, పూరీలు వేయించేటప్పుడు నూనెను అంత తక్కువగా పీల్చుకుని, పూరి గుల్లగా బంతిలా పొంగుతుంది. దీనితో పాటు పిండి కలిపే సమయంలో కేవలం ఒకట్రెండు స్పూన్ల ఉప్మా రవ్వ (సుజీ)ని కలిపితే చాలు. ఇది పూరీలు వేడెక్కిన తర్వాత కూడా త్వరగా మెత్తబడిపోకుండా, ఎక్కువసేపు కరకరలాడుతూ ఉండేలా చేస్తుంది. మరొక ముఖ్యమైన వినూత్న చిట్కా ఏమిటంటే, పిండి కలిపిన వెంటనే పూరీలు ఒత్తేసి వేయించడం కంటే, ఆ పిండిపై మూతపెట్టి కనీసం 30 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇలా చల్లబడిన పిండితో పూరీలు ఒత్తి వేడి నూనెలో వేసినప్పుడు, ఉష్ణోగ్రత వైవిధ్యం వల్ల పిండి నూనెను అస్సలు పీల్చుకోదు. ముఖ్యంగా పండుగ రోజుల్లో లేదా ఇంట్లో గెస్టులు వచ్చినప్పుడు ముందుగానే పిండి సిద్ధం చేసుకునేవారికి ఈ ఫ్రిజ్ టెక్నిక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక పూరీలు వేయించడానికి కడాయి పొయ్యిపై పెట్టి నూనె బాగా కాగుతున్న సమయంలో, ఆ నూనెలో చిటికెడు ఉప్పు వేయాలి. ఇలా వేసిన ఉప్పు నూనెపై ఒక రక్షక పొరలా పనిచేసి పూరీలు ఎక్కువ నూనెను పీల్చకుండా అడ్డుకుంటుంది. అయితే వేసే ఉప్పు పరిమాణం చాలా చిటికెడు మాత్రమే ఉండాలి, లేకపోతే వేడి నూనె పైకి తుల్లే ప్రమాదం ఉందని గుర్తుంచుకోవాలి. చివరగా, పూరీలు రుద్దేటప్పుడు చాలామంది పొడి పిండిని చల్లుతుంటారు. ఆ పొడి పిండి వేడి నూనెలో రాలిపోయి మాడిపోవడం వల్ల నూనె రంగు మారి నూనె పాడవుతుంది. అందుకే పూరీ పీట, లంబకోణ కర్రకు కాస్త నూనె రాసి మాత్రమే పూరీలను సమానంగా ఒత్తుకోవాలి. నూనె పొగలు రాకుండా బాగా వేడెక్కిన తర్వాతే మీడియం-హై ఫ్లేమ్‌పై పూరీలను వేయించాలి. చల్లటి లేదా తక్కువ వేడి ఉన్న నూనెలో వేస్తే పూరీ స్పాంజిలా నూనె మొత్తాన్ని తాగేస్తుంది. ఈ చిన్న చిన్న ట్రిక్స్ పాటిస్తే తక్కువ నూనెతో, ఎంతో హెల్దీగా, బంతిలా పొంగే కరకరలాడే రుచికరమైన పూరీలను మీ ఇంట్లోనే అత్యంత సులభంగా తయారు చేసుకోవచ్చు!       [Poori Making Tips, Crispy Poori, Oil Free Cooking Tips, Anita Mohan, Poori Recipe, Kitchen Hacks, Suji Poori, Perfect Puffy Poori, Cooking Tips Telugu, Indian Breakfast Recipes]  
సూది గుచ్చుకుంటే విపరీతమైన భయం వేస్తుందా? ఇంజెక్షన్ తీసుకోవడం లేదా క్యాన్యులా అమర్చుకోవడం వంటి చిన్న వైద్య ప్రక్రియల సమయంలో కలిగే నొప్పులు మిమ్మల్ని కలవరపెడుతున్నాయా? అయితే మీకో అద్భుతమైన శుభవార్త! మీ ఫేవరెట్ మ్యూజిక్ వినడం ద్వారా ఇటువంటి శారీరక నొప్పులను గణనీయంగా తగ్గించుకోవచ్చని ఇటీవల జరిగిన ఒక క్లినికల్ పరిశోధనలో సైంటిస్టులు నిరూపించారు. నొప్పు నివారణకు మందులు వాడకుండానే సంగీతం ఒక నాచురల్ నివారిణిగా పనిచేస్తుందని ఈ వైద్య పరిశోధన స్పష్టం చేస్తోంది. పరిశోధకులు నిర్వహించిన ప్రత్యేక ప్రయోగాల్లో, తమకు ఇష్టమైన పాటలు లేదా సంగీతాన్ని విన్న వ్యక్తులలో నొప్పిని తట్టుకునే శక్తి (Pain Tolerance) గణనీయంగా పెరిగినట్లు తేలింది. సాధారణంగా సంగీతం వినడానికి ముందు సగటున 33.8 సెకన్ల పాటు మాత్రమే నొప్పిని ఓర్చుకోగలిగిన వారు, తమకు నచ్చిన ట్యూన్స్ వింటున్న సమయంలో ఏకంగా 56.2 సెకన్ల పాటు నొప్పిని తట్టుకోగలిగారు. అంటే సంగీతం వినడం వల్ల వారి నొప్పి सहनశక్తి సుమారు 66 శాతం మేర పెరిగిందని గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. మ్యూజిక్ పూర్తయిన తర్వాత కూడా ఈ ప్రభావం కొంతసేపు ఉండి, నొప్పి ఓర్పు సమయం 45.4 సెకన్లుగా నమోదైంది. ఈ అధ్యయనంలో పాల్గొన్న మొత్తం 20 మంది ప్రయోగ అభ్యర్థులలో ఏకంగా 85 శాతం మంది (17 మంది) తమకు ఇష్టమైన సంగీతం వింటున్నప్పుడు తక్కువ నొప్పిని అనుభవించామని, ఎక్కువ సేపు ఓర్పు ప్రదర్శించగలిగామని ధృవీకరించారు. అంతేకాకుండా శస్త్రచికిత్సలు లేదా చిన్నపాటి వైద్య ప్రక్రియల సమయంలో రోగులకు నచ్చిన పాటలను ప్లే చేయడం వల్ల వారిలో ఆందోళన స్థాయిలు (Anxiety Scores) భారీగా తగ్గాయి. అంతేకాక కోలుకునే వేగం (Quality of Recovery) సూచికలలో 123 శాతానికి పైగా ఆశించిన స్థాయి కంటే మెరుగైన ఫలితాలు నమోదైనట్లు సైంటిస్టులు గుర్తించారు. మనస్సును మైమరిపించే పాటలు వింటున్నప్పుడు మెదడులో విడుదలయ్యే ఎండోర్ఫిన్లు మరియు డోపమైన్ వంటి కెమికల్స్ నొప్పి సంకేతాల తీవ్రతను తగ్గిస్తాయి. ముఖ్యంగా, రోగికి సంబంధం లేని సాధారణ సంగీతం కంటే, వారి వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఎంచుకున్న ఫేవరెట్ పాటలే 85 శాతానికి పైగా ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని నిపుణులు తేల్చారు. ఆసుపత్రుల్లో ఇంజెక్షన్లు, చిన్న సర్జరీలు, లేదా మోకాలి ఆపరేషన్ల తర్వాత ఇచ్చే నొప్పి నివారణ మందుల (Analgesics) వాడకాన్ని తగ్గించడంలో కూడా ఇది ఎంతో సహాయపడుతుందని వైద్య రంగం సంతోషం వ్యక్తం చేస్తోంది. [Music Therapy, Pain Relief, Pain Tolerance, Clinical Research, Favorite Music, Endorphins, Dopamine, Anxiety Reduction, Postoperative Recovery, Pain Management]  
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే.. భారత వైమానిక దళం ఎలా మొదలైందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..! ఈనాడు భారతదేశ గగనతలాన్ని కాపాడుతున్న భారతీయ వాయుసేన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దళాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఆకాశంలో శబ్దవేగాన్ని మించి దూసుకెళ్లే రఫేల్, సుఖోయ్, తేజస్ వంటి అత్యాధునిక యుద్ధ విమానాలు భారత సైనిక సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. అయితే ఈ ప్రస్థానం ఎలా ప్రారంభమైందో తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగక మానదు. కేవలం నాలుగు పాత రకం రెండు చక్రాల విమానాలు, ఐదుగురు యువ పైలట్లతో చాలా చిన్నదిగా ప్రారంభమైన వాయుసేన, ఈ రోజు ప్రపంచం మెచ్చే స్థాయికి ఎదిగింది. ప్రతి సంవత్సరం అక్టోబర్ 8న జరుపుకునే ఎయిర్ ఫోర్స్ డే సందర్భాన్ని పురస్కరించుకుని భారతీయ వాయుసేన ఆవిర్భావం, దాని తొలి అడుగుల వెనుక ఉన్న ఆసక్తికరమైన చరిత్రను తెలుసుకుంటే.. ఎప్పుడు ప్రారంభమైంది? భారతీయ వాయుసేన అధికారికంగా 1932 అక్టోబర్ 8న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యాక్ట్ ప్రకారం బ్రిటిష్ ఇండియాలో రాయల్ ఎయిర్ ఫోర్స్‌కు అనుబంధ దళంగా రూపుదిద్దుకుంది. ఆ సమయంలో బ్రిటన్‌లోని క్రాన్‌వెల్ రాయల్ ఎయిర్ ఫోర్స్ కాలేజీలో శిక్షణ పొందిన ఐదుగురు భారతీయ యువకులు పైలట్లుగా బాధ్యతలు స్వీకరించారు. హరీష్ చంద్ర సిర్కార్, సుబ్రతో ముఖర్జీ, భూపేంద్ర సింగ్, ఐజాద్ బక్ష్ అవాన్ , అమర్జీత్ సింగ్ ఈ చారిత్రక ఘట్టంలో భాగమయ్యారు. మరో యువకుడు జె.ఎన్. టాండన్ ఎత్తు తక్కువగా ఉండటం వల్ల విమానం నడపడానికి అవకాశం లభించక, సైనిక సరుకుల రవాణా విభాగానికి మారాల్సి వచ్చింది. రెండు చక్రాల విమానాలతో ప్రారంభం.. వాయుసేన ఏర్పడిన మరుసటి సంవత్సరం అంటే 1933 ఏప్రిల్ 1న కరాచీలోని డ్రిగ్ రోడ్ ప్రాంతంలో మొదటి స్క్వాడ్రన్ రూపుదిద్దుకుంది. ఈ స్క్వాడ్రన్‌కు 'ఎ' ఫ్లైట్ అని పేరు పెట్టారు. దీనికి నాయకత్వం వహించడానికి మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న అనుభవజ్ఞుడైన డెసిల్ బౌచర్ ముందుకు వచ్చారు. ఈ విభాగం దగ్గర ఉన్నవి కేవలం నాలుగు వెస్ట్‌ల్యాండ్ వాపిటి రకానికి చెందిన రెండు చక్రాల విమానాలు మాత్రమే. ఇవి వేగంగా దాడి చేసే యుద్ధ విమానాలు కావు, కేవలం నిఘా , సైన్యానికి సహకారం అందించడానికి మాత్రమే ఉపయోగపడేవి. అయినప్పటికీ భారతీయ పైలట్లు తమ విమానయాన ప్రయాణాన్ని వీటితోనే ఎంతో  ఆత్మవిశ్వాసంతో ప్రారంభించారు. స్వాతంత్ర్య కాంక్షే ఊపిరి పోసింది.. ఆ రోజుల్లో డ్రిగ్ రోడ్‌లోని సైనిక నివాస ప్రాంగణాన్ని అక్కడి సిబ్బంది గాంధీ హిల్ అని పిలుచుకునేవారు. అప్పటికే దేశంలో స్వాతంత్ర్య కాంక్ష ఎంత బలంగా ఉందో ఈ చిన్న అంశం ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత 1937లో వాయుసేన తన మొదటి ప్రత్యక్ష సైనిక చర్యలను వజీరిస్థాన్ ప్రాంతంలో నిర్వహించింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఈ దళం వేగంగా విస్తరించింది. బర్మా సరిహద్దుల్లో, ఇంఫాల్ ప్రాంతంలో శత్రువులపై సాధించిన విజయాలు భారత వాయుసేన ప్రతిష్టను ప్రపంచానికి చాటిచెప్పాయి. ఈ సేవలను గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం 1945లో దీనికి 'రాయల్' అనే గౌరవ పదాన్ని చేర్చి రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని పేరు మార్చింది. ఆ తర్వాత 1950లో  గణతంత్ర రాజ్యంగా మారినప్పుడు 'రాయల్' అనే పదాన్ని తొలగించి మళ్లీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గా స్థిరపరిచారు. వాయుసేన పితామహుడు సుబ్రతో ముఖర్జీ.. ఆరంభంలో ఉన్న ఐదుగురు పైలట్లలో ఒకరైన సుబ్రతో ముఖర్జీ భారత వాయుసేన చరిత్రలో మైలురాయిగా నిలిచారు. ఈయన 1954 ఏప్రిల్ 1న భారతీయ వాయుసేనకు తొలి భారతీయ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. అందుకే ఈయన్ను భారతీయ వాయుసేన పితామహుడిగా గౌరవిస్తారు. ఇక తొలిసారిగా నాలుగు చిన్న విమానాలతో మొదలైన మొదటి స్క్వాడ్రన్ ఇప్పటికీ క్రియాశీలంగా పనిచేస్తుండటం విశేషం. ప్రస్తుతం 'ది టైగర్స్' అని పిలిచే ఈ స్క్వాడ్రన్ గ్వాలియర్ కేంద్రంగా మిరాజ్ 2000 యుద్ధ విమానాలను నడుపుతోంది. వాయుసేనకు ఆదర్శ వాక్యం ఇదే.. భగవద్గీతలోని 11వ అధ్యాయం నుండి తీసుకున్న 'నభః స్పృశం దీప్తం' అంటే 'గగనాన్ని దేదీప్యమానంగా స్పృశించు' అనే  సూక్తిని వాయుసేన తన ఆదర్శవాక్యంగా స్వీకరించింది. తొంబై ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న భారత వాయుసేన, కరాచీలోని చిన్న విమానాశ్రయం నుంచి ప్రయాణం మొదలుపెట్టి నేడు ఆధునిక సాంకేతికతతో ఆకాశమే హద్దుగా దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది.                                                                                                                                                 *రూపశ్రీ.
మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..! నేటి వేగవంతమైన ప్రపంచంలో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం ఎంతగానో ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రతి ఏటా అక్టోబరు 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటారు. మానసిక ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచడం , ఈ విషయాలపై బహిరంగంగా మాట్లాడటాన్ని ప్రోత్సహించడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం. ప్రస్తుత కాలంలో ఉద్యోగ ఒత్తిడి, సరిపడా నిద్ర లేకపోవడం, సోషల్ మీడియా అధికంగా వాడటం , వ్యక్తిగత సమస్యలు మన మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తున్నాయి. మనసు ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండటానికి రోజువారీ జీవితంలో అలవర్చుకోవాల్సిన కొన్ని సులభమైన అలవాట్లు ఫాలో అవ్వాలి.  అవేంటో తెలుసుకుంటే.. నిద్ర.. తగినంత నిద్రపోవడం ప్రశాంతమైన మనస్సుకు పునాది లాంటిది. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ఒకే సమయానికి మేల్కొనడం అలవాటు చేసుకోవాలి. రాత్రి వేళల్లో ఎక్కువ సమయం మొబైల్ వాడటం తగ్గించడం వల్ల నాణ్యమైన నిద్ర పడుతుంది. ఇది రోజంతా మంచి మూడ్, ఏకాగ్రత , ఉత్సాహాన్ని ఇస్తుంది. వ్యాయామం.. క్రమం తప్పకుండా చిన్నపాటి వ్యాయామం చేయడం వల్ల మానసిక అలసట దూరమవుతుంది. రోజూ అర గంట పాటు నడవడం, యోగా చేయడం లేదా తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల శరీరంతో పాటు మనస్సు కూడా ఉత్తేజితమవుతుంది. డిజిటల్ బ్రేక్.. సామాజిక మాధ్యమాలకు కాసేపు దూరంగా ఉండటం మనస్సుకు మంచిది. ఎప్పుడూ ఫోన్ చూడటం, ఇతరుల జీవితాలతో మనల్ని పోల్చుకోవడం వల్ల తెలియకుండానే ఒత్తిడి పెరుగుతుంది. అందుకే రోజులో కొంత సమయం డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉంటూ డిజిటల్ బ్రేక్ తీసుకోవడం అవసరం. ఒత్తిడి.. మనసులోని బాధను లేదా ఒత్తిడిని లోపలే దాచుకోకుండా నమ్మకమైన వ్యక్తులతో పంచుకోవాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా ఆత్మీయులతో సమస్యల గురించి మాట్లాడటం వల్ల మనసు తేలికపడుతుంది. ధ్యానం.. రోజూ కొన్ని నిమిషాలు ధ్యానం , ప్రశాంతంగా శ్వాస తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని నెమ్మదిగా శ్వాస తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి మనసు అదుపులోకి వస్తుంది. ఆహారం.. మనం తినే ఆహారం కూడా మన మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రొటీన్లు ఉన్న సమతుల ఆహారం తీసుకోవాలి. ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం తగ్గించి, తగినన్ని నీళ్లు తాగుతుండాలి. విరామం.. పని లేదా చదువు మధ్యలో చిన్న చిన్న విరామాలు తీసుకోవడం చాలా ముఖ్యము. గంటల తరబడి ఒకేచోట కూర్చుని పనిచేయడం వల్ల మానసిక అలసట పెరుగుతుంది. మధ్యమధ్యలో కాసేపు నడవడం లేదా కళ్లకు విశ్రాంతి ఇవ్వడం వల్ల తిరిగి ఉత్సాహంగా పనిచేయవచ్చు. పర్సనల్ టైమ్.. వ్యక్తిగత సమయాన్ని కేటాయించుకోవడం మర్చిపోకూడదు. మనసుకు నచ్చిన సంగీతం వినడం, పుస్తకాలు చదవడం, మొక్కల పెంపకం లేదా ఇతర వ్యాపకాలపై దృష్టి పెట్టడం వల్ల రోజువారీ ఒత్తిళ్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ చిన్న మార్పులను జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని సులభంగా కాపాడుకోవచ్చు.                                                                                                                                                   *రూపశ్రీ.
చేతులు, కాళ్లలో తిమ్మిర్లు రావడం, అరికాళ్లు మంటగా అనిపించడం, నడిచేటప్పుడు పాదాల్లో మంట లేదా సూదులు గుచ్చినట్లుగా ఉండటం వంటి సమస్యలను చాలామంది సాధారణంగా తీసుకుంటారు. ముఖ్యంగా షుగర్ ఉన్నవారిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అవి మధుమేహం వల్లే వచ్చాయని భావిస్తుంటారు. అయితే ప్రతి సందర్భంలోనూ కారణం షుగర్ మాత్రమే కాకపోవచ్చు. మన శరీరంలో నరాల పనితీరు సక్రమంగా ఉండటానికి కొన్ని ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు అవసరం. వీటిలో Vitamin B12, Vitamin B1, Folate, Calcium వంటి పోషకాలు ముఖ్యమైనవి. వీటిలో ఏదైనా లోపించినప్పుడు నరాలపై ప్రభావం పడి చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, మొద్దుబారడం, మంట, బలహీనత లేదా నడకలో అసౌకర్యం వంటి సమస్యలు కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో Vitamin D లోపం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఇలాంటి లక్షణాలతో సంబంధం కలిగి ఉండవచ్చు. అదే సమయంలో మధుమేహం ఎక్కువకాలం నియంత్రణలో లేకపోతే నరాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీనిని Diabetic Neuropathy అంటారు. ముఖ్యంగా పాదాల్లో మంట, నొప్పి, తిమ్మిర్లు, స్పర్శ తగ్గడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అందుకే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కేవలం షుగర్‌నే కారణంగా భావించకుండా, అసలు కారణాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. అయితే శరీరంలో పోషక లోపం ఉందని లక్షణాలను బట్టి మాత్రమే నిర్ణయించలేం. అవసరమైన సందర్భాల్లో వైద్యులు సూచించే రక్త పరీక్షలు, షుగర్ పరీక్షలు, Vitamin B12 వంటి పోషకాల స్థాయిలను పరిశీలించడం ద్వారా సమస్యకు కారణం ఏమిటో తెలుసుకోవచ్చు. ఈ నేపథ్యంలో చేతులు, కాళ్లలో తిమ్మిర్లు ఎందుకు వస్తాయి? అరికాళ్లలో మంటకు షుగర్‌తో పాటు ఇంకా ఏ కారణాలు ఉండవచ్చు? Vitamin B12, B1, Folate, Calcium వంటి పోషకాల లోపాన్ని ఎలా గుర్తించాలి?  వంటి ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో Dr. Swathi సులభమైన తెలుగులో వివరిస్తున్నారు. తరచుగా చేతులు, కాళ్లలో తిమ్మిర్లు రావడం, పాదాల్లో మంట లేదా నొప్పి ఉండటం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వాటి వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోవడం అవసరం. ఈ లక్షణాలు ఎక్కువకాలం కొనసాగితే లేదా తీవ్రంగా ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి. గమనిక: ఈ కథనం మరియు వీడియోలోని సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మీకు ఉన్న లక్షణాలకు కారణాన్ని స్వయంగా నిర్ధారించుకోకుండా, అవసరమైన పరీక్షలు మరియు చికిత్స కోసం అర్హత కలిగిన వైద్య నిపుణులను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
డయాబెటిస్ ఉన్నవారిలో తరచుగా కనిపించే కొన్ని సమస్యలు రోజువారీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా కూర్చొని లేవగానే తల తిరగడం, నిలబడినప్పుడు తూలినట్లు అనిపించడం, శరీరంలో బలహీనత, కండరాల బలం తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. తల తిరగడానికి షుగర్ కారణమా? లేక చెవి, మెదడు, మెడకు సంబంధించిన సమస్యల వల్ల Vertigo వస్తుందా? అనే సందేహాలు చాలామందికి ఉంటాయి. ఈ వీడియోలో డాక్టర్ ప్రవీణ్ కుమార్ డయాబెటిస్ మరియు Vertigo గురించి సులభమైన తెలుగులో ముఖ్యమైన విషయాలను వివరిస్తున్నారు. షుగర్ పూర్తిగా Zero అవుతుందా? డయాబెటిస్‌ను పూర్తిగా నయం చేయగలమా? Type 1 Diabetes, Type 2 Diabetes మధ్య తేడా ఏమిటి? శరీరంలో Insulin Resistance ఎలా ఏర్పడుతుంది? డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు అవసరం? వంటి సాధారణ సందేహాలకు ఈ వీడియోలో వివరణ లభిస్తుంది. డయాబెటిస్‌లో షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా పర్యవేక్షణ, శారీరక చురుకుదనం వంటి అంశాల ప్రాధాన్యతను కూడా తెలుసుకోవచ్చు. దీర్ఘకాలంగా షుగర్ నియంత్రణలో లేకపోతే శరీరంపై ఎలాంటి ప్రభావాలు ఉండవచ్చు? కండరాల బలం ఎందుకు తగ్గుతుంది? బలహీనత, లైంగిక సమస్యలు వంటి ఇబ్బందులకు డయాబెటిస్‌తో సంబంధం ఉందా? అనే విషయాలను కూడా డాక్టర్ వివరిస్తారు. ఇక తల తిరగడం లేదా Vertigo విషయానికి వస్తే ప్రతి తల తిరుగుడూ ఒకే కారణంతో ఉండదు. Vertigoలో వివిధ రకాలు ఉంటాయి. ముఖ్యంగా తల లేదా శరీరాన్ని ఒక పొజిషన్ నుంచి మరో పొజిషన్‌కు మార్చినప్పుడు అకస్మాత్తుగా తల తిరిగినట్లు అనిపించే BPPV (Benign Paroxysmal Positional Vertigo) గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. అలాగే చెవికి సంబంధించిన సమస్యలు, Aural Vertigo, మెడకు సంబంధించిన Cervical Spondylosis, శరీర స్థితి (Posture) వంటి కారణాల వల్ల కూడా తల తిరగడం లేదా బ్యాలెన్స్ సమస్యలు రావచ్చని వివరిస్తున్నారు. తల తిరుగుతున్నప్పుడు అసలు కారణాన్ని గుర్తించడం ఎందుకు ముఖ్యమో, ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలో కూడా ఈ వీడియో ద్వారా అర్థం చేసుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? షుగర్‌ను క్రమం తప్పకుండా ఎలా మానిటర్ చేయాలి? శరీరంలో బలహీనత, కండరాల నష్టం రాకుండా ఎలాంటి జీవనశైలి పాటించాలి? Vertigo ఉన్నప్పుడు చెవుల ఆరోగ్యం, శరీర భంగిమ, రోజువారీ అలవాట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి ఉపయోగకరమైన అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. అదేవిధంగా Homeopathy Approach గురించి కూడా ఈ వీడియోలో ప్రస్తావించారు. అయితే డయాబెటిస్ లేదా Vertigo వంటి సమస్యలకు స్వయంగా మందులు తీసుకోవడం లేదా ఇప్పటికే వాడుతున్న వైద్య చికిత్సను ఆపడం కాకుండా, అర్హత కలిగిన వైద్యుడి సలహాతోనే చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. షుగర్ కంట్రోల్, డయాబెటిస్‌లో వచ్చే సమస్యలు, తల తిరగడానికి కారణాలు, Vertigo రకాలు, BPPV, చెవి సమస్యలు, Cervical Spondylosis, ఆహారం మరియు రోజువారీ ఆరోగ్య జాగ్రత్తల గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. గమనిక: ఈ వీడియోలో అందించిన సమాచారం అవగాహన కోసం మాత్రమే. డయాబెటిస్, Vertigo లేదా ఇతర ఆరోగ్య సమస్యలకు వ్యక్తిగత చికిత్సను వైద్యుల సలహా లేకుండా మార్చకండి లేదా మందులను నిలిపివేయకండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)