LATEST NEWS
తమిళనాడు సీఎం  విజయ్  తనదైన ప్రత్యేక శైలిలో ప్రజాదరణ చూరగొంటూ సంచలన నిర్ణయాలతో  పాలనలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. మాటల సీఎంగా కాకుండా చేతల సీఎంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు.   హామీలను నెరవేర్చడంలోనూ, ఆ దిశగా పాలనా యంత్రాంగాన్ని పరుగులు పెట్టించడంలోనూ విజయ్ వేగం  తమిళనాటే కాకుండా దేశ వ్యాప్తంగా  హాట్ టాపిక్‌గా మారింది.   ఇటీవలే  తన మంత్రివర్గం పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించిన విజయ్.. పాలనలో పారదర్శకత, బాధ్యత లేని ప్రవర్తనను ఎంతమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా..  పనితీరులో నాట్ ఆప్ టు ద మార్క్ అని తేలిన నలుగురు మంత్రులకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలికేందుకు నిర్ణయించారు.  ఉన్నత విద్యాశాఖ మంత్రి పి. విశ్వనాథన్, రవాణా శాఖ మంత్రి ఎ. విజయ్ తమిళన్ పార్తిబన్‌లపై వచ్చిన వరుస ఫిర్యాదులు, హెచ్చరించినా తీరు మారకపోవడంతో వారిపైనా, అలాగే..  విమర్శలు, వివాదాల కారణంగా సామాజిక సంక్షేమ శాఖ మంత్రి కె. జగదీశ్వరి, అదే కారణాలతో   హెచ్‌ఆర్‌ఎమ్ మంత్రి డి. శరత్‌కుమార్ లపై వేటు వేయాలని విజయ్ భావిస్తున్నట్లు టీవీకే వర్గాలు చెబుతున్నాయి.   కేవలం పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం  వెట్రి తమిళగం విజన్  పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద  50 వేల  కోట్ల  రాష్ట్ర పెట్టుబడి నిధి  ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా,  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు. సాంకేతిక రంగానికి కేటాలిస్ట్‌గా నిలిచేలా  అరివంగం  పేరుతో అత్యాధునిక  ఏఐ సిటీ  నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజాలను తమిళనాడుకు ఆకర్షించడంతో పాటు భారీ స్థాయిలో ఉద్యోగాల సృష్టే లక్ష్యంగా ఈఏఐ సిటీని నగరాన్ని తీర్చిదిద్దనున్నారు. ప్రజా సంక్షేమం, బ్యూరోక్రసీ నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తేవడానికి విజయ్ సర్కార్  నో అప్లికేషన్    విధానాన్ని తీసుకువస్తోంది. సాధారణంగా ఏ ప్రభుత్వ పథకానికైనా ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ కొత్త విధానంలో ఆధార్ అనుసంధానిత ఆటో ఐడెంటిఫికేషన్ ద్వారా అర్హులైన లబ్ధిదారులను   గుర్తించి, వారు ఎలాంటి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండానే నేరుగా పథకాల ప్రయోజనాలను అందిస్తారు. దీనికి తోడు ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు  పీపుల్స్ ఛాయిస్ బడ్జెట్ భావనను అమలులోకి తేవాలని నిర్ణయించారు. దీని ప్రకారం జిల్లా నిధులలో ఏకంగా 10 శాతం నిధుల వినియోగాన్ని స్థానిక ప్రజల నిర్ణయానికే వదిలేస్తారు. తమ ప్రాంతానికి ఏ రకమైన అభివృద్ధి పనులు అవసరమో ప్రజలే నేరుగా నిర్ణయించుకునే హక్కును కల్పించడం ద్వారా సీఎం విజయ్ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు.      CM Vijay, Tamil Nadu Politics, AI City Arivangam, Vetri Thamizhagam Vision, Vijay Cabinet ministers, oust,  TN State Investment Fund                                                                                      
ఆంధ్రప్రదేశ్‌లోని పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాయని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. పొగాకు రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు పలువురు ఎంపీలతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో రైతుల ప్రయోజనాలే పరమావధిగా కీలక నిర్ణయాలు తీసుకున్నామని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో ఈ సీజన్‌లో 140 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తికి అనుమతి ఉండగా, రైతులు వివిధ కారణాల వల్ల దాదాపు 240 మిలియన్ కిలోల వరకు పండించారని కేంద్రమంత్రి వివరించారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, అధిక ఉత్పత్తి కారణంగా ధరలు క్షీణించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకోవడానికి సమగ్ర ప్రణాళిక రూపకల్పన చేసినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తరఫున బోర్డు పరిధిలోని ప్రతి పొగాకు రైతుకు (45 వేల బాండ్లకు) రెండేళ్ల కాలపరిమితితో  50 వేల రూపాయల వడ్డీ లేని రుణం అందిస్తున్నామన్న పెమ్మసాని..  దీని ద్వారా సుమారు  250 కోట్ల నిధులు రైతులకు అందుబాటులోకి రానున్నాయన్నారు. అదేవిధంగా, లో గ్రేడ్, ఆఫ్ స్టైల్ పొగాకుకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం కిలోకు  10 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుందని.. దీనికోసం రాష్ట్ర బడ్జెట్ నుండి 100 కోట్ల రూపాయలు  కేటాయించినట్లు తెలిపారు. మరోవైపు పొగాకు కొనుగోలుదారులతో చర్చలు జరిపి కనీస మద్దతు ధరలు ఖరారు చేశామని పెమ్మసాని వివరించారు.   బ్రైట్ గ్రేడ్‌కు 230 రూపాయలు, మీడియంకు  190, లో-గ్రేడ్‌కు  110, ఆఫ్ స్టైల్‌కు  130 రూపాయలకు తగ్గకుండా కొనుగోలు చేసేందుకు ఎగుమతిదారులు అంగీకరించారని పెమ్మసాని చెప్పారు. ఈ వేలం ప్రక్రియను రోజుకు 2 మిలియన్ కిలోల చొప్పున రాబోయే రెండు నెలల్లో వేగంగా పూర్తి చేయాలని  స్పష్టంగా ఆదేశించామన్నారు.   జగన్  ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో కేవలం ఒకే ఒక్కసారి   105 కోట్ల రూపాయలతో మార్కెట్ జోక్యం చేసుకుంటే, తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే బ్లాక్ బర్లీ రైతులకు  146 కోట్లు ఇచ్చిందని గుర్తు చేసిన పెమ్మసాని.. ఇప్పుడు  మళ్లీ  100 కోట్ల రూపాయల సాయం అందిస్తూ రైతు పక్షాన నిలిచామని చెప్పారు.   ఇక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని  విమర్శించారు.   2015లోనే నాటి  తెలుగుదేశం ప్రభుత్వం  చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు. అయితే గతంలో జగన్ కోర్టు కేసులు వేయించి, 500 ఎకరాల సేకరణను అడ్డుకుని ప్రాజెక్టును జాప్యం చేశారని  ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక జీఎంఆర్ టెండర్లను రీటెండర్ చేసినా నిబంధనలేవీ మారలేదని, కేవలం కాలయాపన చేసి ప్రాంతాభివృద్ధికి విఘాతం కలిగించారని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చాక కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించి భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని వేగవంతం చేశారని పెమ్మసాని చంద్రశేఖర్ వివరించారు.   ఇప్పటికే విశాఖ నుంచి ఎయిర్‌పోర్టుకు కనెక్టివిటీ కల్పించే ఐదు రహదారుల పనులు పూర్తయ్యాయని, మిగిలిన రెండు రహదారులను కూడా త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. Pemmasani Chandrasekhar, Tobacco Farmers AP, Bhogapuram Airport, AP Cabinet ReviewAP TDP Coalition News
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, శాసనమండలిలో వైపీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణకు ఫ్యాన్ గాలి ఉక్కపోతగా మారిందా? వైసీపీని వీడి జనసేన గూటికి చేరనున్నారా? అన్న ప్రశ్నకు రాజకీయవర్గాల జరుగుతున్న చర్చ, వైసీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను బట్టి ఔనన్న సమాధానమే వస్తోంది.  2024  ఎన్నికలలో రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ  రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఆ ఎన్నికలలో ఘోర పరాజయంతో గద్దె దిగిన తరువాత వైసీపీ గ్రాఫ్ వేగంగా దిగజారిపోతోంది. తాజా సర్వేలు కూడా అదే విషయాన్ని తేల్చి చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసేందుకు వైసీపీ అధినేత దూకుడు పెంచినా ఫలితం ఉండటంలేదు. గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో  అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే బొత్స సత్యనారాయణ జనసేన గూటికి చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారన్న వార్తలు జోరందుకున్నాయి.  రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు అవుతోంది.   మిగిలిన పదవీ కాలంలో మరింత సమర్థవంతంగా పాలన అందిస్తూ  పట్టు  నిలబెట్టుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. అదే సమయంలో  వైసీపీ అధినేత కూడా పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు దూకుడు పెంచినా ఆశించినట్లుగా పుంజుకోలేకపోతున్నది.  దీనికి తోడు రాజధాని, భోగాపురం వంటి కీలక విషయాలలో జగన్ ఏకపక్ష వైఖరితో  వైసీపీ నేతలలో అసంతృప్తి పేరుకుంటోంది. దీంతో తమ రాజకీయ భవిష్యత్ విషయంలో ఆ పార్టీ నేతలు ఆలోచన చేస్తున్నట్లు రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.   ఈ నేపథ్యంలోనే   బొత్స సత్యనారాయణ వైసీపీని వీడి జనసేన గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  ఉత్తరాంధ్రలో దశాబ్దాలుగా  తనకంటే ప్రత్యేక పట్టు ఉన్న  బొత్స కుటుంబం  వైసీపీకి దూరం అవ్వడమంటూ జరిగితే.. వైసీపీకి అది కోలుకోలేని దెబ్బ అవుతుందని పరిశీలకులు అంటున్నారు.   ఉత్తరాంధ్ర  రాజకీయాల్లో   బొత్స కుటుంబం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా  రాజకీయ పోరాటాలు సాగించింది. ఈ నేపథ్యంలో బొత్సకు తెలుగుదేశంలోకి  ఎంట్రీ లేకపోవడంతో బొత్స జనసేన వైపు దృష్టి సారించారంటున్నారు. ఇందుకు పవన్ కల్యాణ్ కూడా సుముఖంగా ఉన్నారనీ, చంద్రబాబు సైతం నో అబ్జెక్షన్ అన్నారని రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది.    ఉమ్మడి రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే ప్రక్రియలో అప్పడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ కీలకంగా వ్యవహరించారు.    చిరంజీవితో బొత్సకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.  అలాగే పవన్ కల్యాణ్ తోనూ సత్సంబంధాలున్నాయి. ఆ పరిచయంతోనే బొత్స పవన్ కల్యాణ్ తో చర్చించి జనసేన ఎంట్రీకి మార్గం సుగమం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.  AP Politics, AP News, YCP, Uttarandhra, Telegu News 
ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సాకారమైన తరుణంలో..  విశాఖపట్నానికి   భోగాపురం విమానాశ్రయం చాలా దూరంలో ఉందంటూ వైసీపీ చేస్తున్న విమర్శలను  విశాఖ జనమే ఇసుమంతైనా పట్టించుకోవడం లేదు. అసలు భోగాపురం విషయంలో వైసీపీ అధినేత జగన్.. ఒకే సమయంలో క్రెడిట్ చోరీకీ, విమానాశ్రయం సాకారం కావడం పట్ల విమర్శలకు పాల్పడటం అపహాస్యం పాలౌతోంది. అసలు భోగాపురం ప్రాధాన్యత, పౌర సేవలు ఇక్కడికి మార్చడం వెనుక ఉన్న వ్యూహాలు, క్షేత్రస్థాయి సానుకూలతల విషయానికి వస్తే..  విశాఖ నుంచి  45 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణాన్ని వైసీపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతికూల అంశంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం చేస్తోంది.  ఈ సందర్భంగా వైసీపీ విమర్శలను పరిశీలకులు తోసిపుచ్చుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ లో శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చినప్పుడు కూడా సరిగ్గా ఇటువంటి సందేహాలూ, విమర్శలూ  వ్యక్తమయ్యాయి. అప్పట్లో నగర నడిబొడ్డున ఉన్న బేగంపేట విమానాశ్రయాన్ని మూసివేసి..  నగరం బయట ఉన్న శంషాబాద్‌కు విమాన సేవలను తరలిస్తున్న సమయంలో ప్రజల నుంచి దూరం, ప్రయాణ సమయం, చివరి మైలు కనెక్టివిటీపై   వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే.. ఇప్పుడు  శంషాబాద్ విమానాశ్రయం దేశంలోనే అత్యుత్తమ,  అలాగే  ప్రపంచ స్థాయి ఎయిర్‌పోర్ట్‌లలో ఒకటిగా నిలవడమే కాకుండా, శరవేగంగా విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్ అవసరాలను ఎంతో సమర్థవంతంగా తీరుస్తోంది. ఇప్పుడు ఎవరి నోటీ దూరం మాట వినిపించడం లేదు. అదే తరహాలో భోగాపురం కూడా రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర రూపురేకలను మార్చివేస్తుందని పరిశీలకులు చెప్పడం కాదు.. ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు.  భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆధునిక విమానాశ్రయాలను నగరాలకు దూరంగా నిర్మించడం ప్రపంచవ్యాప్తంగా ఉన్నదే.   ముంబై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో కూడా ఎయిర్‌పోర్ట్‌లు నగర నడిబొడ్డున లేవు. నగరాల పరిధిలో భూముల ధరలు అత్యంత భారీగా ఉండటం..  విస్తరణకు కావలసిన  భూమి లభించకపోవడం  ఒక కారణమైతే..  నగరం నడిబొడ్డున విమానాశ్రయం ఉంటే..  ఎయిర్ పోర్టుకు  వచ్చే వాహనాల వల్ల   ట్రాఫిక్ సమస్యలు తలెత్తి జనం ఇబ్బందులకు ఎదుర్కోవలసి ఉంటుంది. బేగంపేటలో పౌర విమాన సేవలు కొనసాగిన సమయంలో తరచూ ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమయ్యేదన్న సంగతి విదితమే. వేగంగా విస్తరిస్తున్న విశాఖ వంటి పారిశ్రామిక నగరంలో, నగర పరిధిలోనే అంతర్జాతీయ స్థాయి రన్‌వేలు, టెర్మినళ్లు, కార్గో కాంప్లెక్స్‌లను విస్తరించడం దాదాపు సాధ్యం కాదు. ఈ విషయాన్ని నిపుణులే చెప్పారు.  భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రభుత్వప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి)లో జీఎమ్‌ఆర్    భారీ పెట్టుబడులతో నిర్మించింది. దీని నిర్వహణ కూడా జీఎంఆర్ సంస్థే చేపట్టింది.  ఇంతటి భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే సమీపంలో మరో పోటీ విమానాశ్రయం ఉంటే ఇబ్బంది. అందుకే హైదరాబాద్‌లో శంషాబాద్ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన వెంటనే బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ను పౌర విమాన సర్వీసులకు మూసివేశారు. ఇప్పుుడు కూడా అలాగే..  విశాఖలోని పాత విమానాశ్రయం నుంచి  పౌర సేవలకు క్రమంగా  స్వస్తి చెప్పి.. ఆ విమానాశ్రయాన్ని  ఇండియన్ నేవీ ఆపరేషన్లకు అప్పగిస్తారు. ఇకపై షెడ్యూల్డ్ వాణిజ్య విమానాలన్నీ భోగాపురం నుంచే రాకపోకలు సాగిస్తాయి. విశాఖపట్నంవాసులు ఈ దూర భారాన్నీ, భయాన్ని పెద్దగా పట్టించుకోకపోవడానికి మరో కారణమేంటంటే..  విమాన ప్రయాణం అనేది ఆర్టీసీ బస్సు స్టాండ్ లేదా రైల్వే స్టేషన్ మాదిరిగా ప్రతిరోజూ సాధారణ ప్రజలు ఉపయోగించేది కాదు. విశాఖపట్నం మొత్తం జనాభాలో 70 శాతానికి పైగా ప్రజలు నిత్యం విమానాశ్రయాన్ని సందర్శించరు. కేవలం కొద్ది శాతంగా ఉండే వ్యాపారులు, పర్యాటకులు, ఐటీ నిపుణులు, అత్యవసర ప్రయాణికులు మాత్రమే తరచూ విమానాలను ఆశ్రయిస్తారు. పైగా.. ప్రస్తుతం ఉన్న విశాఖ విమానాశ్రయం  నేవీ ఆధీనంలో ఉండటంతో పాటు, చుట్టూ కొండలు, విస్తరించిన జనావాసాలు ఉండటంతో రాత్రివేళల్లో ల్యాండింగ్‌లు, పెద్ద బోయింగ్ విమానాల రాకపోకలకు   పరిమితులు ఉన్నాయి. అంతర్జాతీయంగా నేరుగా కనెక్టివిటీ సాధించాలంటే భోగాపురం వంటి ఆధునిక గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఒక్కటే శరణ్యం. అలాగే..  విశాఖపట్నం  భౌగోళికంగా ఉత్తరం వైపున భోగాపురం, ఆనందపురం, భీమిలి దిశగా వేగంగా విస్తరిస్తోంది. రాబోయే పది,  పదిహేనేళ్లలో విశాఖ మహానగరం భోగాపురం వరకు విస్తరించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ జోన్లు, ఐటీ పార్కులు, ఏరోసిటీ, విద్యా,  వైద్య సంస్థలు, లాజిస్టిక్ పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమవుతుండటంతో ఆ ప్రాంతమంతా కొత్త ఆర్థిక హబ్‌గా మారబోతోంది. భోగాపురం ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి రావడం వల్ల కేవలం విశాఖపట్నానికే కాకుండా సమీపంలో ఉన్న విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలకు కూడా విమాన ప్రయాణం  సులభతరం అవుతోంది. ఇది ఉత్తరాంధ్ర ప్రాంతీయ అసమానతలను తొలగించి, రవాణా, పర్యాటక, పారిశ్రామిక రంగాలలో గుణాత్మక మార్పులు తీసుకురానుంది. విశాఖ  నుంచి భోగాపురం వెళ్లే ప్రయాణికులకు దూరభారం లేదా సమయభారం అనిపించకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ  ఎన్ హెచ్ఏఐ పలు  రహదారి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నాయి. ప్రస్తుత జాతీయ రహదారి 16 విస్తరణ, విస్తృతమైన సర్వీస్ రోడ్ల నిర్మాణంతో పాటు, విశాఖ పోర్ట్ నుంచి నేరుగా భోగాపురం వరకు 6 వరుసల బీచ్ కారిడార్ కోస్టల్ హైవే నిర్మాణంలో ఉంది. సవరవిల్లి వద్ద నిర్మిస్తున్న ప్రత్యేక ట్రంపెట్ ఇంటర్‌చేంజ్, అనకాపల్లి, ఆనందపురం బైపాస్ రహదారులు సిటీ ట్రాఫిక్ చిక్కులు లేకుండా నేరుగా ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ చేరుకునేందుకే దోహదపడతాయి. ఈ రహదారులన్నీ పూర్తయితే విశాఖ నగర కేంద్రం నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కేవలం 35 నుంచి 40 నిమిషాల్లో సునాయాసంగా చేరుకోవచ్చు.  ప్రయాణికుల సౌకర్యార్థం భవిష్యత్తులో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు పొడిగించే సమగ్ర ప్రణాళికలను కూడా ప్రభుత్వం రూపొందిస్తోంది. దీనికి తోడు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ ఏసీ బస్సులు, విద్యుత్ ఆధారిత ఫీడర్ బస్సు సేవలు నిరంతరం అందుబాటులో ఉంటే నగరవాసులకు కనెక్టివిటీ పరంగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు.   Bhogapuram International Airport, Visakhapatnam Airport Connectivity,  (Bhogapuram Expressway Beach Corridor, Vizag Metro Rail Project,  North Andhra Infrastructure Development 
తమిళ రాజకీయాల్లో  కావేరి జలాల చిచ్చు రేగింది.   దశాబ్దాలుగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన కావేరి జలాల పంపకం సమస్య..  మేకెదాటు ప్రాజెక్ట్ నిర్మాణం వివాదం తాజాగా పీక్స్ కు చేరుకున్నాయి.  కావేరి నదీ జలాల హక్కుల పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.  తాజాగా ఈ వివాదం పెచ్చరిల్లడానికి  ప్రతిపక్షాల అఖిలపక్షం డిమాండ్ ను ముఖ్యమంత్రి విజయ్ తిరస్కరించడమే కారణమని పరిశీలకులు చెబుతున్నారు.   ప్రతిపక్ష డీఎంకే, ఇతర పార్టీలు కావేరీ జల వివాదంపై  అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయగా, సీఎం విజయ్..   ఇప్పటికే శాసనసభలో కావేరి నీటి హక్కులపై ఏకగ్రీవ తీర్మానం చేశామని, అందుకే మళ్లీ ప్రత్యేకంగా అఖిలపక్ష భేటీ అవసరం లేదని అకుండబద్దలు కొట్టారు.   దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్  ముఖ్యమంత్రి విజయ్ కావేరి వివాదంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు.  కావేరి జలాలు తమిళనాడుకు అత్యంత కీలకమనీ, ఇతర రాష్ట్రాల వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏకాభిప్రాయ సాధన అవసరమని అన్నారు.   ప్రతిపక్షాల విజ్ఞప్తులను పక్కనబెట్టి సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్లడం వల్ల తమిళనాడు రైతులకు న్యాయం జరగదన్నారు. సీఎం తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు.  అదలా ఉండగా,  కర్ణాటక ప్రభుత్వం కావేరి పరివాహక ప్రాంతంలో మేకెదాటు డ్యామ్‌ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో, ఈ సమస్యను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా కర్ణాటక పర్యటనకు సిద్ధమయ్యారన్న వార్తలు విపక్షాలలో మరింత ఆందోళనకు కారణమయ్యాయి.  చర్చల ద్వారా  సమస్య తీరదనీ, న్యాయపోరాటం ద్వారానే తమిళనాడు హక్కులను కాపాడుకోవాలని విపక్షలు అంటున్నాయి. కర్ణాటక ప్రభుత్వం అక్కడ ప్రత్యేక అఖిలపక్ష భేటీ నిర్వహించి తమ రాష్ట్రంలో ఐక్యతను ప్రదర్శిస్తుంటే..  తమిళనాడులో మాత్రం అధికార, ప్రతిపక్షాల మధ్య విభేదాలు పెచ్చరిల్లుతున్నాయి.   రాష్ట్రాల మధ్య నదుల అనుసంధానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి చర్చించేందుకు అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లానని డీఎంకే డిమాండ్ చేస్తున్నది.   ఒకవైపు ఆందోళన బాట పట్టిన డీఎంకే, మరోవైపు క్షేత్రస్థాయిలో నీటి కొరతతో అల్లాడుతున్న రైతులు, ఇంకోవైపు న్యాయపోరాటం చేయాలనే డిమాండ్లు... ఈ పరిణామాలు  సీఎం విజయ్ కు సవాల్ గా మారాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత విజయ్ కు ఎదురైన అతి పెద్ద సవాల్ ఇదేనని రాజకీయపరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   CM Vijay, Cauvery Water Dispute, Tamil Nadu Politics, TVK vs DMK, Mekedatu Dam Row
ALSO ON TELUGUONE N E W S
Mythri Movie Makers, one of India's leading production houses known for backing both blockbuster entertainers and content-driven films, has announced an exciting new project titled Donga Naa Koduku (DNK). The robbery crime comedy stars Little Hearts fame Mouli Tanuj Prasanth in the lead and marks the directorial debut of writer-director Sreenu Kambala. The film was unveiled with a creatively designed first-look poster that immediately grabs attention. The standout visual features Mouli bursting through a giant Jack playing card with an infectious smile, perfectly capturing the quirky and carefree tone of the film. The vibrant design hints at a fun-filled heist adventure packed with humor and unexpected twists. The poster is filled with intriguing details, including scattered gold jewellery, a black backpack, and flying paper fragments, all pointing towards the film's robbery backdrop. The stylish typography and logo further reinforce the playful nature of the project, leaving audiences curious about the story behind the unusual title. Produced by Mythri Movie Makers with Anil Yerneni serving as co-producer, Donga Naa Koduku promises to blend comedy and crime in an entertaining package. The film also features a seasoned supporting cast, including Ali and Raghubabu, alongside a young technical team working to bring the fresh concept to life. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  స్టార్ హీరో మెటీరియల్ పుష్కలంగా ఉన్నా కూడా అక్కినేని నాగేశ్వరరావు(ANR)పెద్ద మనవడు, నాగార్జున(Nagarjuna)మేనల్లుడు సుమంత్(Sumanth)ఎందుకనో బడా హీరో కోటాలో చేరలేకపోయాడు, ప్రస్తుతం 'న్యూట్రన్ థర్డ్ లా' తో థియేటర్స్ లో ఉన్నాడు. సుమంత్ 2004 లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 'తొలిప్రేమ' మూవీలో జత కట్టిన కీర్తి రెడ్డి( ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కొద్దీ కాలానికే విడిపోయారు.   రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో ఆ విషయంపై సుమంత్ మాట్లాడుతు మా ఇద్దరి  జీవితం ఒక సినిమా కథలా సాగింది. విడిపోయినా మా  మధ్య ఉన్న అనుబంధం పవిత్రమైంది.  పెళ్లయిన రెండేళ్లకే అంటే 2006 లోనే  పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుని వేర్వేరుగా ఉండాలని నిర్ణయించుకున్నాం. మా మధ్య ఎటువంటి పెద్ద గొడవలు కానీ, మనస్పర్థలు కానీ లేవు.  పెళ్లి చేసుకున్న సమయంలో మా ఇద్దరికీ జీవితంపై, బంధాలపై సరైన మెచ్యూరిటీ, అవగాహన లేకపోవడమే విడిపోవడానికి ప్రధాన కారణం.వయసులో చిన్నవారవడం వల్ల వచ్చిన ఆ అపరిపక్వత వల్లే ఒకే ఇంట్లో కలిసి ఉండలేకపోయాం.  అందుకే గౌరవప్రదంగా విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. సాధారణంగా విడాకుల తర్వాత చాలామంది దంపతులు శత్రువులుగా మారడం లేదా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం చూస్తుంటాం. కానీ తమ విషయంలో పరిస్థితి అలా రాలేదు. విడాకులు అనేవి గతాన్ని మోస్తూ బాధపడటానికి కాదు. ఒకరినొకరు క్షమించుకుని జీవితంలో ముందుకు సాగడమే.కీర్తి రెడ్డి కుటుంబ సభ్యులు ఇప్పటికీ తమ సొంత ఇంటి మనిషిగానే ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారు. అప్పుడప్పుడు ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకుంటాం. Also read: నాగార్జున 100 వ చిత్రానికి ఆ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్.. కన్ఫర్మ్ చేసిన చిత్ర బృందం తాత చనిపోయినప్పుడు  కీర్తి రెడ్డి స్వయంగా వచ్చి మా  కుటుంబాన్ని పరామర్శించింది  . ప్రస్తుతం కీర్తి రెడ్డి మరొకరిని వివాహం చేసుకుని, ఇద్దరు పిల్లలతో ఒక మంచి కుటుంబంలో ఎంతో సంతోషంగా స్థిరపడటం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.  నాకైతే ఇప్పటి వరకు రెండో పెళ్లి ఆలోచన రాలేదని చెప్పుకొచ్చాడు.  #Sumanth, Keerthi Reddy, Pawan Kalyan, Tollywood
‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ లాంటి ప్రతిష్టాత్మక బయోపిక్ చిత్రంతో మెప్పించిన ప్రముఖ నటుడు ఆర్‌. మాధవన్, ఇప్పుడు మరో బయోపిక్‌తో అలరించేందుకు సిద్ధమయ్యారు. భారతీయ ఎడిసన్‌గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఆవిష్కర్త, పారిశ్రామికవేత్త జి.డి. నాయుడు (గోపాల్‌స్వామి దొరైస్వామి నాయుడు) జీవిత ఆధారంగా రూపుదిద్దుకున్న ‘G.D.N’ సినిమాకి సంబంధించిన తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలైంది. కోయంబత్తూరులో స్థిరపడిన తెలుగు కుటుంబంలో 1893లో జన్మించిన జి. డి. నాయుడు.. భారతదేశపు మొదటి మోటారు వాహనాన్ని తయారు చేయడంతో పాటు, ఎన్నో పరికరాలు ఆవిష్కరించారు. బ్రిటిష్ వారు ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేసినా.. జి. డి. నాయుడు వెన్ను చూపలేదు. అలాంటి గొప్ప వ్యక్తి బయోపిక్ గా ‘G.D.N’ రూపొందింది. జి. డి. నాయుడు శాస్త్రసాంకేతిక రంగాల్లో సాధించిన ఆవిష్కరణలు ఒకవైపు, మరోవైపు నాజీ జర్మనీతో ఆయనకు ఉన్న వ్యాపార సంబంధాలు, అలాగే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వ నియంత్రణలకు వ్యతిరేకంగా సాగించిన పోరాటం ఈ సినిమాలో ప్రధానాంశాలుగా నిలువనున్నాయని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. బ్రిటిష్ అధికారులు జి.డి. నాయుడుపై పన్ను ఎగవేత ఆరోపణలు మోపడం, ఆయన ఆస్తులలో ఏకంగా 80 శాతం జప్తు చేయడానికి అధికారిక ఉత్తర్వులు జారీ చేయడం లాంటి ఉత్కంఠభరిత సన్నివేశాలు ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. "బ్రిటిష్ వారి అన్యాయమైన పన్నులకు వ్యతిరేకంగా ప్రశ్నించినప్పటి నుంచే నాయుడును టార్గెట్ చేశారు" అనే సంభాషణలు కథలోని సంఘర్షణ స్థాయిని తెలియజేస్తున్నాయి.  అంతేకాకుండా, బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా సాగిన ఈ పోరాటంలో స్వదేశీ రాజకీయ ప్రత్యర్థుల కుట్రలను కూడా నాయుడు ఎలా ఎదుర్కొన్నారనేది ఇందులో ఎంతో ఉద్వేగభరితంగా చిత్రీకరించారు. సొంత ఆవిష్కరణలను తగులబెట్టే సన్నివేశాలు, సత్యం కోసం పోరాడే నాయుడి వ్యక్తిత్వం కట్టిపడేస్తున్నాయి. నటుడిగా ఆర్‌. మాధవన్ మరోసారి జీడీ నాయుడు పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అద్భుత నటనను కనబరిచారు. ఆయనతో పాటు సత్యరాజ్, జయరామ్, ప్రియమణి, దుషారా విజయన్ లాంటి ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. గోవింద్ వసంత అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌లోని ప్రతీ సన్నివేశాన్ని ఎలివేట్ చేసింది. క్రిష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వం వహించిన ‘G.D.N’ సినిమా ఈ ఆగస్టు 7న థియేటర్లలో విడుదల కానుంది.     GDN Telugu Trailer, R Madhavan, GDN Movie, GD Naidu  
  కింగ్ నాగార్జున(Nagarjuna),దేవిశ్రీప్రసాద్(Devisriprasad).. ఈ ఇద్దరి కాంబోకి ఉన్న పవర్ అభిమానులకి, సంగీత ప్రియులకి బాగా తెలుసు.  స్టిల్ ఈ టైం కూడా ఏ రీల్ చూసినా ఆ ఇద్దరి కాంబోలో వచ్చిన మన్మధుడు, మాస్, కింగ్ సినిమాలోని సాంగ్స్  వినపడుతుంటాయి. నాగ్ ప్రస్తుతం తన 100 వ చిత్రాన్ని ఎంతో ప్రెస్టేజియస్ట్ గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.   ఈ ల్యాండ్‌మార్క్ మూవీకి సంగీత దర్శకుడిగా రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్  కన్ఫామ్ అయ్యారు. నిన్న దేవిశ్రీప్రసాద్ 47వ జన్మదినాన్ని పురస్కరించుకుని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రత్యేక బర్త్‌డే పోస్టర్‌  విడుదల చేస్తూ టీమ్‌లోకి ఘనంగా స్వాగతం పలికింది. ఈ క్రేజీ ప్రకటన రాగానే సోషల్ మీడియాలో #King100 ట్రెండింగ్‌లోకి వచ్చి రికార్డు వ్యూస్ సాధించింది. నాగార్జున మాస్ స్వాగ్, స్క్రీన్ ప్రెజెన్స్, క్లాస్ అప్పీల్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ పవర్ ఫుల్ ఎనర్జిటిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో దేవి శ్రీ ప్రసాద్ సిద్ధహస్తుడని నాగార్జున గట్టిగా నమ్ముతున్నాడు. అందుకే తన 100వ చిత్రానికి హిట్ సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ మరోసారి డీఎస్‌పీకే బాధ్యతలు అప్పగించారు. Also read: అన్నయ్య ఈ సారైనా హిట్ అందుకుంటాడా.. ఆ మూవీపై భారీ అంచనాలు ఈ మైలురాయి చిత్రంలో మరో సంచలనాత్మకమైన విశేషం కూడా దాగి ఉంది. దాదాపు 30 సంవత్సరాల విరామం తర్వాత వర్సటైల్ నటి టబు నాగార్జునతో కలిసి ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించబోతున్నారు. నాగ్, టబు కాంబోలో వచ్చిన 'నిన్నే పెళ్లాడతా', 'ఆవిడా మా ఆవిడే' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎన్ని సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకవైపు టబు రీ-ఎంట్రీ, మరోవైపు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కలసి రావడం చూస్తుంటే 'కింగ్ 100' ప్రాజెక్ట్ ఎంత గ్రాండ్‌గా డిజైన్ అవుతుందో అర్థమవుతోంది. రా కార్తీక్ దర్శకుడు, నాగార్జునే స్వయంగా నిర్మిస్తున్నాడు. Nagarjuna, DeviSriprasad, Tollywood    
హాలీవుడ్ సూపర్ హీరో సినిమాలకు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని క్రేజ్ ఉందని మరోసారి నిరూపితమైంది. మార్వెల్ సూపర్ హీరో మూవీ 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' థియేటర్లలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇండియన్ సినీ చరిత్రలో ఒక హాలీవుడ్ డబ్బింగ్ సినిమా ఈ స్థాయి ప్రభంజనం సృష్టించడం అరుదైన విషయంగా మారింది. విడుదలైన మొదటి వీకెండ్ లోనే బాక్సాఫీస్ లెక్కలన్నింటినీ ఈ సినిమా తిరగరాసింది. కేవలం మొదటి వారంలోనే ఈ చిత్రం భారతదేశ వ్యాప్తంగా ఏకంగా రూ.309 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక హాలీవుడ్ ఫ్రాంచైజ్ సాధించిన బిగ్గెస్ట్ ఓపెనింగ్ వీకెండ్స్ లో ఒకటిగా ఇది సరికొత్త మైలురాయిని చేరుకుంది.  ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీని సృష్టిస్తూ రికార్డులను కొల్లగొడుతోంది. ఇప్పటిదాకా 927 మిలియన్ డాలర్ల (రూ.8,800 కోట్లకు పైగా) వసూళ్లను రాబట్టింది.  వీకెండ్ ముగిసినప్పటికీ, వర్కింగ్ డేస్‌లో కూడా ఈ సినిమా బుకింగ్స్ ఊహించని రేంజ్‌లో హోల్డ్ అవ్వడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వేటను కొనసాగిస్తున్న ఈ సూపర్ హీరో సినిమా లాంగ్ రన్‌లో ఇంకా ఎన్ని వందల కోట్ల రికార్డులను క్రియేట్ చేయబోతోందో వేచి చూడాల్సిందే.     Spider Man Brand New Day, First Weekend, Collection, India  
    మాస్ మహారాజ రవితేజ(Ravi Teja).. ఎవరి అండదండలు లేకుండా స్వయంకృషితో పైకొచ్చిన ఆరడగుల కట్ అవుట్.  ఎనర్జిటిక్ పెర్ ఫార్మెన్స్ కి బ్రాండ్ అంబాసిడర్.  డైలాగ్స్, యాటిట్యూడ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సరైన హిట్ అనేది కొంత కాలంగా దోబూచులాడుతూ ఉంది.  అయితే ఈసారి 'ఇరుముడి'(Irumudi)తో హిట్ పక్కా అనే మాటలు ఫ్యాన్స్ తో పాటు ట్రేడ్ సర్కిల్స్  నుంచి వినిపిస్తున్నాయి. ఈ నెల 21 న రిలీజ్ అవుతున్న ఇరుముడి నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రచార చిత్రాలు రవితేజ పవర్‌ఫుల్ లుక్ మంచి హైప్‌ క్రియేట్ చేశాయి. అయితే, ప్రతి సినిమా విజయానికి ముఖ్యంగా మాస్ సినిమాలకు పాటలు ఎంతటి కీలకమైన పాత్ర పోషిస్తాయో మనందరికీ తెలిసిందే. 'ఇరుముడి' విషయంలోనూ సరిగ్గా అదే జరుగుతోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని సాంగ్స్ సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్‌ను రెట్టింపు చేశాయి. చార్ట్‌బస్టర్‌గా నిలిచిన ఈ పాటలకు శ్రోతల నుంచి, ముఖ్యంగా సంగీత ప్రియుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుంది. యూట్యూబ్‌లో విడుదలైన కేవలం 24 గంటల్లోనే 10 మిలియన్లకు పైగా రియల్ టైమ్ వ్యూస్ సాధించి, ట్రెండింగ్ నంబర్ 1 స్థానంలో నిలవడం ఈ పాటల సత్తా  నిరూపిస్తోంది. ముఖ్యంగా మాస్ అండ్ ఫోక్ బీట్‌తో సాగే మొదటి సాంగ్ మిలియన్ల కొద్దీ రీల్స్, షార్ట్స్ రూపంలో ఇన్స్టాగ్రామ్‌లో వైరల్ అయింది. దాదాపు 500k కి పైగా యూజర్లు ఈ ఆడియో ట్రాక్‌ను ఉపయోగిస్తూ రీల్స్ చేయడం విశేషం. ఇక ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్, ఒక ఎమోషనల్ అండ్ మెలోడీ డివోషనల్ టచ్‌తో వచ్చి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. జివి ప్రకాష్ కుమార్  అందించిన ఈ అద్భుతమైన సంగీతం, రవితేజ మార్క్ ఎనర్జిటిక్ మాస్ సీన్స్‌కి చక్కగా కుదిరాయనేది టాక్   పాటల్లోని లిరిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ ప్రొడక్షన్ విలువలని  బాగా పెంచేశాయి. సినిమా సక్సెస్‌లో 60% వరకు మ్యూజిక్ కాంట్రిబ్యూషన్ ఉంటుందని బాక్సాఫీస్ విశ్లేషకులు చెబుతుంటారు. గతంలో రవితేజ కెరీర్‌లో అతిపెద్ద హిట్లుగా నిలిచిన సినిమాలను ఒకసారి పరిశీలిస్తే, వాటన్నింటికీ మ్యూజిక్ ప్రధాన బలంగా నిలిచింది. ఉదాహరణకు ఆయన కెరీర్‌లో 100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన 'ధమాకా' కానీ, 'క్రాక్' కానీ పాటల పరంగా విశేష ఆదరణ పొందినవే. ఇప్పుడు 'ఇరుముడి' చిత్రానికి కూడా అదే తరహా మ్యూజికల్ బజ్ లభించడం విశేషం. ఈ పాటలు సృష్టించిన పాజిటివ్ వైబ్స్ సినిమా బిజినెస్‌పై కూడా భారీగా ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే థియేట్రికల్ హక్కులు తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 45 కోట్లకు పైగా అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. నాన్ థియేట్రికల్ హక్కుల రూపంలో డిజిటల్, శాటిలైట్, ఆడియో కలిపి మరో 35 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. Also read: నేను ముస్లీమ్ ని కాదని చెప్పడానికి మీరెవరు? #రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలు  కేవలం సాంగ్స్ మాత్రమే కాకుండా, విజువల్‌గా కూడా ఈ పాటల ప్రొడక్షన్ వాల్యూస్ 100% బెస్ట్‌గా ఉన్నాయి. రవితేజ సిగ్నేచర్ డ్యాన్స్ స్టెప్స్, విజువల్స్ చూస్తుంటే థియేటర్లలో రెస్పాన్స్ నెక్స్ట్ లెవల్‌లో ఉండబోతోందని స్పష్టమవుతోంది. ఆడియన్స్ థియేటర్లకు రావడానికి పాటలు అతిపెద్ద కాటలిస్ట్‌గా పనిచేస్తాయి. ఇప్పటికే ప్రీ-రిలీజ్ హైప్ 80% పైగా పూర్తి కావడానికి ఈ మ్యూజిక్ ప్రమోషన్సే కారణమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. పాటలతోనే ఇంతటి పాజిటివిటీ సాధించిన 'ఇరుముడి', కథ మరియు కథనం కూడా అదే స్థాయిలో ఉంటే రవితేజ ఖాతాలో మరో 100 కోట్ల క్లబ్ హిట్ చేరడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు గట్టిగా అంచనా వేస్తున్నారు. లేటెస్ట్ గా ఈ రోజు రిలీజైన 'యాలాలో యాలాలో' సాంగ్ కూడా రికార్డు సృష్టించే పనిలో బిజీగా ఉంది.  Irumudi, Raviteja, Priya Bhavani Shankar, Siva Nirvana      
శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మాణంలో ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన చిత్రం ‘అగధ’. ఈ మూవీలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భాను చందర్, షిజు, వనిత విజయ్‌కుమార్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాని ఆగస్ట్ 14న భారీ ఎత్తున విడుదల చేబోతోన్నారు. ఈ క్రమంలో సోమవారం నాడు ట్రైలర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.  ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ.. "ఆగస్ట్ 14న ‘అగధ’ రిలీజ్ కాబోతోంది. మంచి కంటెంట్‌తో వచ్చే ప్రతీ చిత్రాన్ని ఆడియెన్స్ ఆదరిస్తారు. ‘అగధ’ సినిమాని అంత సులభంగా తెరకెక్కించలేరు. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ వంటివి ఎక్కువగా ఉన్న ఈ మూవీని ఏడాదిలోనే పూర్తి చేశాం. రాకేష్ ఈ మూవీకి అద్భుతమైన స్కోర్ ఇచ్చారు. పూర్తిగా భక్తిరస చిత్రాన్ని తీసినా కష్టమే అవుతుంది. యూత్, జెన్ జీ ఆడియెన్స్‌ని ఆకట్టుకునే అన్ని రకాల అంశాల్ని ఇందులో పొందుపర్చాం. నాకు రిటైర్ అవ్వడం అనేది ఇష్టం ఉండదు. నా శ్వాస ఉన్నంత వరకు సినిమాలు తీస్తూనే ఉంటాను. కథకి ఎవరు నప్పుతారు అన్నది మాత్రమే చూసి.. ఆర్టిస్టుల్ని సెలెక్ట్ చేసుకుంటాను. ‘అగధ’ కోసం అద్భుతమైన ఆర్టిస్టుల్ని తీసుకున్నాను. ఇంతకు ముందు నేను చేయని కథల్ని ఇప్పుడు ట్రై చేయాలని అనుకుంటున్నాను. అందరూ మా సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఎక్కువ స్క్రీన్‌లలో మూవీని రిలీజ్ చేయబోతోన్నాం. మాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయని నమ్ముతున్నాను. అన్ని భాషల్లో డబ్బింగ్ రెడీ చేసి పెట్టాం. కానీ ముందు తెలుగు మీద ఫోకస్ పెట్టమని అంతా సలహా ఇచ్చారు. అందుకే అన్ని చోట్లకు వెళ్లి హడావిడిగా ప్రమోషన్స్ చేయడం లేదు. ముందు మా మూవీ గురించి ఇక్కడి ఆడియెన్స్ మాట్లాడాలి. కొన్ని స్క్రీన్‌లలోనే వేద్దామని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ అన్నారు. అతనికి పూర్తి చిత్రాన్ని చూపించాను. దాంతో ఓవర్సీస్‌లో ఆయనే భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చారు. ‘ఒక్కడు’ సినిమాకి మహేష్ బాబు కరెక్ట్, ‘వర్షం’కి ప్రభాస్ కరెక్ట్, 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'కి సిద్ధార్థ్ కరెక్ట్, ‘మనసంతా నువ్వే’కి ఉదయ్ కిరణ్ కరెక్ట్, ‘అగధ’ మూవీకి ఇందులో నటించిన వారంతా కరెక్ట్. శ్రవణ్, కామాక్షి, జోవికా, ఉల్కా అందరూ అద్భుతంగా నటించారు. ‘అగధ’లో అద్భుతమైన కథతో పాటు స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది." అన్నారు. కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ.. "డిఫరెంట్ కారెక్టర్స్‌ను పోషించాలని ప్రతీ నటికి ఉంటుంది. ‘పొలిమేర’ తర్వాత మళ్లీ ఆ స్థాయి పాత్ర నాకు లభించలేదు. కానీ రాజు గారు ఈ ‘అగధ’ కథ, అందులో నా పాత్రను చెప్పిన తర్వాత ఆశ్చర్యపోయాను. నటిగా మళ్లీ నన్ను నేను ఫ్రూవ్ చేసుకోవడానికి చక్కటి అవకాశం లభించింది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన రాజు గారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. నేను ప్రతీ సినిమాకి కష్టపడి ప్రమోషన్స్ చేస్తుంటాను. ‘అగధ’కి కూడా అదే స్థాయిలో ప్రమోషన్ చేస్తున్నాను. నేను చేసే ప్రతీ సినిమాకి, అందులోని పాత్రకు వ్యత్యాసం ఉండేలా చూసుకుంటాను. నటిగా నాకు డిఫరెంట్ పాత్రలు వస్తుండటం నా అదృష్టం అనే చెప్పాలి. ‘అగధ’ వల్ల నాలో ఎంతో మార్పు వచ్చింది. ఇంతకు ముందు కంటే కామ్ అయ్యాను. స్పిరిట్యువల్‌గా మారిపోయాను. ఆగస్ట్ 14న ‘అగధ’ అంటే ఏంటో అందరికీ తెలుస్తుంది" అన్నారు. శ్రవణ్ రెడ్డి మాట్లాడుతూ.. "అగధ జర్నీ నాకెంతో ప్రత్యేకం. నేను ఎప్పుడూ సింపుల్ సినిమాల్ని చేయలేదు. రాజు గారి మీద నాకు నమ్మకం ఉంది. ఆయన్నుంచి మేం ఎంతో నేర్చుకున్నాం. ‘డర్టీ హరి’ తర్వాత ‘అగధ’లో నాకు మంచి పాత్రను ఇచ్చారు. ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాను" అన్నారు. కాశీ విశాలాక్షి మాట్లాడుతూ.. "అగధ చిత్రీకరణ సమయంలో నేను కూడా సెట్‌కి వెళ్లాను. ప్రతీ ఒక్కరూ అద్భుతంగా నటించారు.  ఇప్పటి వరకు రాజు గారు అంటే ‘దేవీ’, ‘వర్షం’ అని అంటున్నారు కదా.. ‘అగధ’ తర్వాత.. ‘అగధ’ రాజు అని అంటారు. ఆయన కథ చెప్పిన దాని కంటే అద్భుతంగా తెరకెక్కించారు. మళ్లీ ఆయనతోనే సినిమాని చేయబోతోన్నాం" అన్నారు.  ఉల్కా గుప్తా మాట్లాడుతూ.. "రాజు గారు చెప్పిన ‘అగధ’ కథ నాకు ఎంతో నచ్చింది. పదేళ్ల తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుండటం ఆనందంగా ఉంది. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన రాజు గారికి థాంక్స్. నా కెరీర్‌లో ‘అగధ’ ఓ మైల్ స్టోన్‌గా నిలుస్తుంది" అన్నారు. జోవికా విజయ్ కుమార్ మాట్లాడుతూ .. "మాకు రాజు గారు ఫ్యామిలీ మెంబర్‌లా ఉంటారు. ప్రతీ సీన్‌ను ఎంతో గొప్పగా వివరిస్తారు. ఆయనకు గొప్ప విజన్ ఉంటుంది. ఆర్టిస్టులకు అర్థమయ్యేలా సీన్‌ను చెబుతారు. ఆయనతో నా మొదటి సినిమాని చేస్తుండటం ఆనందంగా ఉంది. ఇలాంటి ఓ డిఫరెంట్ పాత్ర నా కెరీర్ ఆరంభంలోనే రావడం, పైగా అమ్మతో కలిసి నటించడం నా అదృష్టం" అన్నారు.     Agadha Trailer, MS Raju, Kamakshi Bhaskarla  
  రాఖీ సావంత్(Rakhi Sawant)..నటిగా, సింగర్ గా కంటే ఫైర్ బ్రాండ్ హోదాలో సంచలన సంఘటనలకి, స్పీచ్ కి బ్రాండ్ అంబాసిడర్. ఇప్పుడు మరోసారి సామాజిక మాధ్యమాల్లో సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. మత విశ్వాసాల పేరుతో తనని  నిరంతరం విమర్శిస్తున్న ట్రోలర్లపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు. తాను ఇస్లాం మతాన్ని స్వీకరించిన తర్వాత కూడా కొందరు తన విశ్వాసాన్ని శంకిస్తూ, తనని  ముస్లింగా అంగీకరించబోమని విమర్శలు చేయడంపై రాఖీ తీవ్రంగా స్పందించారు. తన ఆధ్యాత్మిక ప్రయాణం, దైవ విశ్వాసం కేవలం తన మానసిక ప్రశాంతత కోసం మాత్రమేనని, ఇతరులకు నిరూపించుకోవాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు.  రాఖీ సావంత్ మూలాలు పరిశీలిస్తే ఆమె ఒక సంప్రదాయ మరాఠీ హిందూ కుటుంబంలో జన్మించారు.  2022వ సంవత్సరంలో  వ్యాపారవేత్త ఆదిల్ ఖాన్ దురానీని వివాహం చేసుకున్న సందర్భంలో ఇస్లాం మతాన్ని స్వీకరించారు. మతం మారిన అనంతరం ఆమె తన పేరును ఫాతిమాగా మార్చుకుంది. ఆ తర్వాత కాలంలో ఇద్దరు విడిపోయారు. అయినా సరే  ఇస్లాం పట్ల భక్తి మాత్రం తగ్గలేదని చెప్పుకుంటూ వస్తుంది.    Also read: Deepika padukone: దీపికా పదుకునే ఎమోషనల్ పోస్ట్.. ఫ్యాన్స్ కన్నీరు ఇటీవల బీబీసీ న్యూస్ హిందీకి ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో రాఖీ సావంత్ తన ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన ఆసక్తికర వివరాలను పంచుకున్నారు. ఇస్లాం మతం స్వీకరించినప్పటి నుండి ఇప్పటివరకు తాను ఏకంగా 8 సార్లు పవిత్ర మక్కా, మదీనా నగరాలను సందర్శించి ఉమ్రాను విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఒకసారి కాకుండా ఏకంగా 8 సార్లు ఉమ్రా చేయడం  దైవభక్తికి నిదర్శనం. నేను ముస్లింనో కాదో నిర్ణయించడానికి మీరెవరు? నన్ను ఈ లోకంలోకి తీసుకువచ్చిన తల్లిదండ్రులు మీరు కారు, నా జీవిత ఖర్చులను భరించేది మీరు కారు" అంటూ ఘాటైన వ్యాఖ్యలతో విమర్శకుల నోళ్లు మూయించారు.    
అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఒక హీరో సినిమాకి క్లాప్ కొట్టిన కుర్రాడు.. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత అదే హీరో నటిస్తున్న సినిమాకి నిర్మాతగా మారితే? ఇది కదా అసలైన సక్సెస్ స్టోరీ అంటే. ఈ ఇన్‌స్పైరింగ్ జర్నీ ఎవరిదో కాదు.. న్యాచురల్ స్టార్ నానిది.  సినీ ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్లు లేకుండా అడుగుపెట్టి, తన స్వయంకృషితో స్టార్ గా ఎదిగిన నాని ప్రయాణం ఒక పెద్ద ఇన్‌స్పిరేషన్ . ఈ రోజు నాని స్టార్ హీరోగా మాత్రమే కాదు.. విజనరీ ప్రొడ్యూసర్‌గా కూడా దూసుకుపోతున్నారు.  2005లో యూత్ స్టార్ నితిన్ హీరోగా, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'అల్లరి బుల్లోడు' అనే సినిమా వచ్చింది. ఆ సమయానికి నాని ఇంకా హీరోగా ఎంట్రీ ఇవ్వలేదు. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌పై ఉన్న ఆసక్తితో 'అల్లరి బుల్లోడు' చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. కట్ చేస్తే.. కాలం చకచకా తిరిగేసింది. 2008లో 'అష్టా చమ్మా'తో హీరోగా మారి, తనదైన న్యాచురల్ యాక్టింగ్ తో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ రోజు స్టార్ హీరోగా ఎదిగారు నాని. కేవలం నటుడిగానే కాకుండా వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై మంచి అభిరుచి ఉన్న చిత్రాలను నిర్మిస్తూ ప్రొడ్యూసర్‌గానూ తన మార్క్ చూపిస్తున్నారు. ఇప్పుడు నానికి చెందిన యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నితిన్ హీరోగా 'అలియాస్ రుక్మిణీ' అనే సినిమా రూపొందుతోంది. అప్పుడు ఏ హీరో సినిమాకి అయితే అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారో, ఇప్పుడు అదే హీరో సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు నాని.  దీంతో "ఇది కదా రియల్ సక్సెస్ అంటే.." అంటూ నెటిజెన్లు సోషల్ మీడియాలో నాని సినీ జర్నీని కొనియాడుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.     Natural Star Nani, Assistant Director, Producer, Alias Rukmini, Nithiin  
సినిమా థియేటర్‌కు వెళ్లి ప్రశాంతంగా, సరదాగా సినిమాను ఆస్వాదించాలనుకునే ప్రేక్షకులకు కొన్నిసార్లు ఊహించని, విచిత్రమైన అనుభవాలు ఎదురవుతుంటాయి. తాజాగా విడుదలైన ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ (Spider-Man: Brand New Day) చిత్రం చూసేందుకు ఒక ప్రేమికుల జంట థియేటర్‌కు వచ్చింది. సినిమా చూస్తూ ఎంజాయ్ చేయాల్సిన ఆ సమయంలో ఒక విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఆ యువకుడికి ఈ సినిమా కథ, ప్రధాన మలుపులు, సస్పెన్స్ సన్నివేశాలు ముందే తెలిసి ఉండటంతో, పక్కనే కూర్చున్న తన ప్రియురాలికి ప్రతి సీన్ వివరంగా బిగ్గరగా వివరించడం ప్రారంభించాడు. "ఇప్పుడు ఈ సీన్ వస్తుంది", "తర్వాత ఈ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది", "ఆ క్లైమాక్స్ ట్విస్ట్ ఇదే" అంటూ ఆ యువకుడు ఉత్సాహంగా పెద్ద శబ్దంతో ముందే చెప్తూ తన పాండిత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. అయితే, మొదటిసారిగా ఆ సినిమాను ఎంతో ఆసక్తిగా, సస్పెన్స్‌తో చూస్తున్న తోటి ప్రేక్షకులకు ఈ ప్రవర్తన తీవ్ర అసహనానికి, చికాకుకు గురిచేసింది. మొదట్లో తోటి ప్రేక్షకులు అతడిని భరిస్తూ ఊరుకున్నప్పటికీ, ఆ యువకుడి ప్రవర్తన హద్దులు దాటడంతో సహనం కోల్పోయారు. పక్కనే కూర్చుని సినిమా చూస్తున్న నలుగురు మిత్రుల గుంపు అతడిని సున్నితంగా వారించింది. "నాయనా! సినిమా సస్పెన్స్‌ను పాడు చేయకు, రాబోయే సీన్లను ముందే గట్టిగా చెప్పి మా వీక్షణ అనుభవాన్ని భంగపరచకు" అని హితవు పలికారు. కానీ, తన ప్రియురాలి ముందు ప్రతాపం చూపించాలనుకున్న ఆ యువకుడు ఆ నలుగురి మాటలను అస్సలు ఖాతరు చేయలేదు. తోటి ఆడియ‌న్స్‌ విజ్ఞప్తిని తుంగలో తొక్కి, మరింత బిగ్గరగా స్పాయిలర్స్ ఇవ్వడం కొనసాగించాడు. దీంతో ఇరు వర్గాల మధ్య మాట మాట పెరిగి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సినిమా సస్పెన్స్‌ను పాడుచేస్తూ, ఎంత చెప్పినా వినకుండా గర్వంగా ప్రవర్తించడంతో ఆ నలుగురు యువకులకు తీవ్ర ఆగ్రహం వచ్చింది. ఇక లాభం లేదనుకుని, వారంతా ఒక్కసారిగా ఆ వ్యక్తిపై పడి పిడిగుద్దుల వర్షం కురిపించారు. తాపులు తన్నులతో థియేటర్ లోపల పెద్ద ఎత్తున గందరగోళం, కలకలం రేగింది. ప్రియురాలి ముందు గొప్పలకు పోయిన ఆ ప్రేమికుడు చివరికి దెబ్బలు తిని, థియేటర్ మూలన భయంతో కూర్చోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ అకస్మాత్తు పరిణామానికి థియేటర్‌లోని ఇతర ప్రేక్షకులు కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రియురాలి ముందు హీరోలా కనబడదామనుకున్న ఆ యువకుడు, చివరికి అందరి ముందు అవమానపడి జోకర్‌గా మారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఎవరో మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ విచిత్రమైన ఘటనా వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా, పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో దీనిపై రకరకాల కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. కిక్కిరిసిన థియేటర్లలో ఇతరులకు ఇబ్బంది కలగకుండా నడుచుకోవాలనే కనీస 'సివిక్ సెన్స్' (Civic Sense) చాలామందిలో కొరవడిందని కొందరు తీవ్రంగా వ్యాఖ్యానించారు. మరికొందరు నెటిజన్లు మాత్రం తమదైన శైలిలో వ్యంగ్యంగా స్పందిస్తూ, "స్పాయిలర్ ఇవ్వబోయి బ్రాయిలర్ కోడిలా మారిపోయాడు" అని సరదా కామెంట్లు చేశారు. సినిమా సస్పెన్స్, థ్రిల్‌ను పాడు చేసే స్పాయిలర్ రాయుళ్లకు ఇది సరైన రీతిలో జరిగిన తగిన శాస్తి అని మరికొందరు మద్దతు తెలిపారు.   spiderman brand new day, theatre fight viral video, spiderman spoilers fight
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు. కానీ చాలామంది చేసే మిస్టేక్.. సైడ్ ఇన్కమ్ కోసం ప్రయత్నించకపోవడం. ఉద్యోగం చేస్తూనే ఎక్స్టాగా ఇన్కమ్ సంపాదించడం వల్ల ఆర్థికంగా ఎంతో వృద్ధి చెందవచ్చు.  దీనికోసం మంచి మార్గాలు,  ఎక్ట్సా ఇన్కమ్ సంపాదించాలనుకునే వారు చేయకూడని తప్పులు తెలుసుకుంటే.. ఫ్రీలాన్సింగ్..  రైటింగ్, డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, డిజిటల్ మార్కెటింగ్ లేదా కోడింగ్ వంటి స్కిల్స్  ఉంటే  ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు చేయవచ్చు. ఇది  మంచి ఆదాయాన్ని ఇస్తుంది. ఫ్రీలాన్సర్,  ఫైవర్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో క్లయింట్ లు ఉంటారు. వారానికి 10–12 గంటలు కేటాయించడం ద్వారా, ₹10,000 నుండి ₹25,000 వరకు సంపాదించవచ్చు. బ్లాగింగ్, కంటెంట్ క్రియేషన్.. రాయడం పట్ల మంచి అభిరుచి ఉంటే  బ్లాగింగ్, యూట్యూబ్ లేదా ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్‌ను క్రియేట్ చేయవచ్చు. సబ్స్క్రైబర్స్,  వ్యూస్ బాగా వచ్చిన తరువాత  యాడ్స్ , స్పాన్సర్‌షిప్‌లు కూడా వస్తాయి. వీటి ద్వారా అదనపు ఆదాయం కూడా ఉంటుంది. అయితే దీనికి మంచి కంటెంట్, క్లిక్ అయ్యేవరకు సమయం అవసరం అవుతాయి. ఆదాయం వెంటనే ఉండదు. కాస్త ఓపిక అవసరం. ఆన్లైన్ ట్యూటరింగ్.. కోర్సెస్.. ఏదైనా ఒక  సబ్జెక్టులో బాగా గ్రిప్ ఉంటే అలాంటి వారు  ఆన్‌లైన్ క్లాసెస్ చెప్పవచ్చు.  లేదా డిజిటల్ కోర్సులను క్రియేట్ చేసి  కూడా టీచింగ్ చేయవచ్చు. YouTube, Unacademy వంటి ప్లాట్‌ఫామ్‌లలో చేరవచ్చు.  లేదా Google Meetలో స్వయంగా  క్లాసెస్ చెప్పవచ్చు. ఇది   విద్యార్థులకు,  టీచింగ్ చేసేవారికి కూడా  చాలా బాగుంటుంది. ఈ-బుక్స్.. రాయడం పట్ల మంచి అబిరుచి ఉంటే ఈ-బుక్స్  రాసి కిండిల్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో అమ్మడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఇంటి నుండి వ్యాపారాన్ని ప్రారంభించడానికి రీసెల్లింగ్ లేదా ఈ-కామర్స్ కూడా ఒక గొప్ప మార్గం. ఈ కామర్స్-రీసెల్లింగ్.. అమెజాన్,  ఫ్లిప్‌కార్ట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఉత్పత్తులను అమ్మడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు.  ఇంటి నుండి చిన్నగా ప్రారంభించవచ్చు. దుస్తులు, హస్తకళలు లేదా గృహోపకరణాలను అమ్మవచ్చు. ఇది క్రమంగా లాభదాయకమైన వ్యాపారంగా మారవచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్.. సైడ్ ఇన్‌కమ్ అంటే కేవలం పని చేయడం ద్వారా సంపాదించేది మాత్రమే కాదు, డబ్బు సంపాదించడం గురించి. మ్యూచువల్ ఫండ్ SIPలు, స్టాక్ మార్కెట్, బాండ్లు లేదా డిజిటల్ గోల్డ్‌లో  వంటి వాటిలో క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టడం వల్ల క్రమంగా అదనపు నిధులు వస్తాయి. సరైన సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల దీర్ఘకాలికంగా మంచి ఆదాయం సృష్టించవచ్చు. ఈ తప్పులు చేయకండి.. సైడ్ ఇన్‌కమ్‌ను మొదలుపెట్టే ముందు  త్వరగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో  తరచుగా తప్పులు చేస్తాము. ఆ తప్పులేంటంటే.. తొందరపాటు చాలామందికి ఉంటుంది.  సైడ్ ఇన్కమ్ కావాలనే తొందరలో తప్పటడుగు వేయకూడదు. సైడ్ ఇన్కమ్ మీద ఆశతో ఎలాంటి పరిశోధనలు చేయకుండా లేదా డబ్బులు పెట్టుబడి పెట్టడం లేదా డబ్బు సరిగా చెల్లించని చోట వర్క్ చేయడానికి ఒప్పుకోవడం వంటివి చేయకూడదు. సైడ్ ఇన్కమ్ మోజులో పడిచాలామంది  ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఎక్కువ లాభం వస్తుందని ఇచ్చే ప్రకటనలు చూసి మోసపోయి డబ్బులు పెట్టకూడదు. కేవలం అదనంగా చేసే పని ద్వారా సైడ్ ఇన్కమ్ ఉండేలా చూసుకోవాలి. అంతేకానీ డబ్బు కోసం ఎక్కువ ఒత్తిడి తీసుకుని పని చేయకూడదు. సైడ్ ఇన్కమ్ అయిన, ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం అయినా కుటుంబం కోసమే.. కానీ పని కోసం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. గొప్పలు చెప్పుకోవడానికి  సైడ్ ఇన్కమ్ సంపాదించడం మంచిది కాదు. భవిష్యత్ కోసం పొదువు చేయడానికి  సైడ్ ఇన్కమ్ సంపాదించాలి.                               *రూపశ్రీ.
ఆచార్య చాణక్యుడు   గొప్ప రాజనీతిజ్ఞుడు,  వ్యక్తిత్వ విశ్లేషణా నిపుణులు,  ఆర్థిక శాస్త్ర నిపుణులు.  ఆయన వేల సంవత్సరాల కిందటే మనిషి జీవితంలో ఎన్నో విషయాలను ఎంతో స్పష్టంగా, వివరంగా చెప్పాడు.  చాణక్య నీతిలో ఆయన చెప్పిన విషయాలు నేటికీ ప్రజలు ఆచరించదగిన  విధంగా ఉన్నాయి.  మనిషి జీవితంలో ఆప్తులకు,  సన్నిహితులకు, స్నేహితులకు.. ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాడు.  వీటి కారణంగా జీవితంలో ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది.  ముఖ్యంగా ఎవరితోనూ షేర్ చేసుకోకూడని విషయాలు కొన్ని ఉంటాయి.  ఆ విషయాలను గోప్యంగా ఉంచడం వల్ల లైఫ్ బిందాస్ గా ఉంటుందట. నలుగురిలో గౌరవంగా, మర్యాదగా,  బిందాస్ గా ఉండాలంటే.. చాణక్యుడు చెప్పిన నాలుగు విషయాలు తప్పక పాటించాలి. అవేంటో తెలుసుకుంటే..  ఆర్థిక నష్టాలు.. వ్యాపారంలో లేదా ఉద్యోగంలో  పెద్ద ఆర్థిక నష్టం వాటిల్లితే  ఆ విషయాన్ని ఇతరులతో పంచుకోకూడదని ఆచార్య చాణక్యుడు తన సిద్ధాంతంలో చెబుతాడు.  ఆర్థిక పరిస్థితి బలహీనపడినప్పుడు చుట్టూ ఉన్నవారు మెల్లిగా దూరం జరుగుతారు,  పైగా గౌరవించడం కూడా మానేస్తారు. అందుకే ఆర్థికంగా నష్టపోతే ఎవరికీ చెప్పకూడదు. ఇంటి గొడవలు.. ఇంట్లో గొడవ జరిగినా లేదా కుటుంబ సభ్యులతో  అభిప్రాయ భేదం వచ్చినా, ఆ విషయాన్ని ఎవరితోనూ పంచుకోకూడదు. కుటుంబ తగాదాలను గోప్యంగా ఉంచుకోవాలి. కుటుంబ తగాదాలను ఇతరులతో పంచుకోవడం వల్ల, దాన్నే అదనుగా తీసుకుని సంబంధాలను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించేవారు చాలా మంది ఉంటారు. ఇది  జీవితంలో తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. అవమానం.. సమాజంలో మిమ్మల్ని ఎవరైనా అవమానించినా లేదా మాటలతో ఎవరైనా మిమ్మల్ని దూషించినా, ఆ విషయాన్ని  ఎదుటి వ్యక్తితో ఎప్పటికీ పంచుకోకూడదు. ఒకవేళ  ఆ అవమానం గురించి ఎవరికైనా చెబితే, ఆ వ్యక్తి మిమ్మల్ని గౌరవించడం మానేసే అవకాశం ఉంది. పైగా వాళ్లు అన్నప్పుడు లేని నొప్పి నేను అనగానే ఎందుకొచ్చింది వంటి మాటలు కూడా అంటారు. అందుకే  జీవితంలో ఎదురైన అవమానాల గురించి ఎప్పుడూ ఎవరికీ చెప్పకూడదు.  ప్రణాళికలు..   ఆచార్య చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం  పనిలో విజయం సాధించాలనుకుంటే చేయబోయే పనుల ప్రణాళికలు ఎవరికీ చెప్పకూడదు.  ఎవరైనా ఒక పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు,  తరచుగా తమ ప్రణాళికను ఇతరులతో షేర్ చేసుకుంటారు. కానీ కొందరు ఇలా గోల్స్ పెట్టుకున్న వారిని ఎగతాళి చేస్తారు, మరికొందరు మాటల ద్వారా  ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి దానిని సాధించకుండా అడ్డుకుంటారు.                                 *రూపశ్రీ
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటూ ఉంటారు. కానీ ఆర్థిక అవసరం ఏర్పడినప్పుడు మానవ సంబందాలే ఆదుకుంటాయి.  ఆర్థిక ఇబ్బందులు ఏర్పడినప్పుడు చాలా వరకు స్నేహితులు,  బంధువులు, సన్నిహితులు,  ఆఫీసు కొలీగ్స్.. ఇలా చాలామందిని అప్పు అడుగుతూ ఉంటాం.  అలాగే వారు కూడా మనల్ని అడుగుతూ ఉంటారు. కానీ నేటికాలంలో డబ్బు తీసుకున్నంత సులువుగా దాన్ని తిరిగి ఇవ్వరు.  పైగా డబ్బు తీసుకుని.. ఇస్తాంలే ఎక్కడికి పోతాం.. అని దబాయించే వారు కూడా ఉంటారు. ఈ కారణంగానే కష్టపడి సంపాదించుకున్న డబ్బులను ఎవరికైనా అప్పు ఇవ్వాలంటే చాలా భయం వేస్తుంది.  కానీ ఎవరైనా అప్పు అడిగినప్పుడు.. లేదు అని చెప్పడం చిన్న పదమే అయినా.. అది తగిన కారణంగా కనిపించదు.  లేదని చెప్పినా కొందరు పదే పదే అప్పు కావాలని, ఎవరితో అయినా అప్పు ఇప్పించమని కూడా అడుగుతుంటారు.  అప్పు ఇవ్వడం అనే సమస్య నుండి తప్పించుకోవడం,  ఎదుటి వ్యక్తితో ఉన్న సంబంధం ఏదీ పాడు చేసుకోకుండా ఉండటం కత్తిమీద సాము లాంటిది.  ఎవరైనా అప్పు అడిగితే.. వారు బాధపడకుండా లేదని చెప్పడానికి కొన్ని మార్గాలు  ఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే.. వెంటనే సమాధానం ఇవ్వకూడదు.. ఎవరైనా అకస్మాత్తుగా డబ్బు అడిగినప్పుడు, ఆలోచించకుండా వెంటనే "అవును" లేదా "కాదు" అని చెప్పకుండా, కొంత సమయం తీసుకోవాలి. ఆ తరువాత ఎదుటివారితో మర్యాదగా "నాకు కొంచెం సమయం ఇవ్వండి. నేను ఈ నెలకు నా బడ్జెట్ , బ్యాంకు బ్యాలెన్స్ చూసుకోవాలి" అని చెప్పవచ్చు. ఇలా చెప్తే.. మీరే ఆర్థికంగా డబ్బుకు వెతుక్కుంటున్నారని అప్పు అడిగిన వారు అర్థం చేసుకుంటారు. ఇలా సమయం అడగడం వల్ల  ఆలోచించడానికి అవకాశం ఇస్తుంది, ఒకవేళ  తర్వాత లేదని చెప్పాల్సి  వచ్చినా..  ఎదుటి వారు అపార్థం చేసుకోరు. ఎందుకంటే అడిగిన వెంటనే లేదని చెప్తే.. అప్పు అడిగిన వారు అపార్థం చేసుకుంటారు. అప్పు సూత్రం.. ఎవరైనా అప్పు అడిగినప్పుడు వారికి లేదని చెప్పడం కంటే.. అప్పు సూత్రం పాటించడం మంచిది.  అప్పు సూత్రం ప్రకారం.. ఎవరికీ అప్పు ఇవ్వడం అనేది పెట్టుకోకూడదు.  ఎలాంటి పరిస్థితులలో అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం చేయకూడదు.  అప్పు అనే కారణం వల్ల సంబంధాలు నాశనం అవుతాయి.  అప్పు తీసుకున్నవారు కొన్నిసార్లు తిరిగి ఇవ్వలేకపోతే.. అప్పు ఇచ్చిన వారు చాలా బాధపడాల్సి వస్తుంది.  డబ్బు అనేది అంత సులువుగా లభించేది కాదు.  కాబట్టి అప్పు అనే కారణంతో సంబంధాలు పాడు చేసుకోను,  ఎవరికీ అప్పు ఇవ్వకూడదని నేను నిర్ణయం తీసుకున్నాను అని చెప్పాలి.  ఇలా చెప్తే ఎదుటి వారు సంబంధాలకు విలువ ఇచ్చేవారు అయితే.. అర్థం చేసుకుంటారు. బాధ్యతలు, ఖర్చులు వివరించడం.. ప్రతి ఒక్కరికీ బాధ్యతలు ఉంటాయి. ఎవరైనా అప్పు అడిగితే, పరిస్థితిని వివరించవచ్చు. పిల్లల ఫీజులు కావచ్చు, ఆరోగ్య సమస్యల ఖర్చులు కావచ్చు,  బ్యాంకు లోన్లు కావచ్చు, అప్పులు కావచ్చు.. వాటిని వివరించి అప్పు ఇవ్వలేనని చెప్పవచ్చు. ఇలా సమస్యల గురించి చెబితే.. వివేకవంతుడైన మనిషి ఎవరైనా అర్థం చేసుకుంటారు. ప్రత్యామ్నాయ సహాయం.. చాలామంది డబ్బు అప్పుగా అడిగినప్పుడు.. అప్పు అడిగినవారు నిజంగా అవసరంలో ఉండి, మీరు అప్పు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే.. డబ్బు కాకుండా ఏదైనా పనుల రూపంలో డబ్బు వచ్చే మార్గంలో సహాయం చేయవచ్చు. ఆ పనుల ద్వారా వారికి డబ్బు సహాయం అందితే అప్పు అడిగిన వారు కూడా చాలా తృప్తి పడతారు. ఆరోగ్య సమస్యల కోసం డబ్బు అవసరమైన వారికి స్వచ్చంద సంస్థల నుండి డబ్బు ఇప్పించడం,  ఎవరైనా సహాయం చేసే వారి గురించి చెప్పడం లాంటివి చేయవచ్చు.  దీని వల్ల వారికి అవసరం తీరుతుంది. లేదని చెప్పడం.. కొన్నిసార్లు దాటవేసి మాట్లాడటం కంటే, నిజం సూటిగా చెప్పడమే మేలు. అయితే చెప్పే విధానం చాలా గౌరవంగా,  మర్యాదగా ఉండాలి. చెప్పడానికి నాకు బాధగానే ఉంది కానీ  నేను అప్పు ఇచ్చేంత ఆర్థిక స్థితిలో లేను అని సున్నితంగా ఎదుటివారిని నొప్పించకుండా చెప్పవచ్చు.. ఈ విషయం గుర్తుంచుకోవాలి.. చాలామంది అప్పు అడగగానే చాలా చులకనగా,  చిరాకుగా, కోపంగా రియాక్ట్ అవుతూ ఉంటారు.  కానీ ఇలా చేయడం తప్పు.. అప్పు అడిగిన వారు అవసరంలో అడుగుతారు.. వారికి మర్యాదగా,  గౌరవంగా సమాధానం చెప్పాలి.                                       *రూపశ్రీ.  
పంచదార.. నేటికాలంలో చాలా విరివిగా వాడుతున్నారు. కాఫీ, టీ,  స్వీట్లు,  ఇంట్లో చేసే తీపి పదార్థాలు, డిజర్ట్ లు.. ఇలా చాలా తీపి పదార్థాల తయారీలో పంచదారది అగ్రస్థానం.  కాఫీ, టీ ల విషయాని వస్తే.. రోజులో కప్పుల కొద్ది తాగేవారు కూడా ఉంటారు. అయితే.. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని నేటికాలంలో వైద్యులు కూడా పెద్ద ఎత్తునే చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా చక్కెరను ఎడాపెడా వాడిన వారిలో చాలా మంది ప్రస్తుతం డయాబెటిస్ పేషెంట్లుగా మారారన్నది ఒప్పుకోవాల్సిన నిజం. అయితే.. కేవలం ఒక వారం రోజుల పాటూ చక్కెర వాడకాన్ని ఆపి చూడమని వైద్యులు, ఆహార నిపుణులు చెబుతున్నారు.  వారం రోజులు చక్కెర వాడటం మానేస్తే శరీరంలో జరిగే మార్పుల గురించి కూడా వారు చెబుతున్నారు.  అసలు వారం రోజుల పాటూ పంచదార వాడటం మానేస్తే  ఏం జరుగుతుంది? పూర్తీగా తెలుసుకుంటే.. వారం రోజులు చక్కెర వాడటం మానేస్తే జరిగే మార్పులు.. చక్కెర అలవాటు ఉన్నవారు ఉన్నపళంగా చక్కెర వాడటాన్ని ఆపేస్తే.. మొదటి ఒకటి రెండు రోజులు తీపి తినాలని అనిపిస్తుంది. కానీ క్రమంగా శరీరం చక్కెర లేకుండా ఉండటానికి అలవాటు పడుతుంది. చక్కెర వాడటం మానేస్తే.. మునుపటి కంటే ఎక్కువగా శరీరంలో ఎనర్జీ ఉండటాన్ని గమనించవచ్చు.  దీన్ని అనుభూతి కూడా చెందవచ్చు. చర్మంలో కూడా గణనీయమైన మార్పులు కనిపిస్తాయి. చర్మంలో మెరుపు వస్తుంది.  ముఖ్యంగా చర్మం మీద మొటిమలు,  దద్దుర్లు.. వంటివి క్రమంగా తగ్గడం గమనించవచ్చు. చక్కెర వాడటం ఆపేస్తే జీవక్రియ మెరుగవుతుంది.  గతంలో అంటే.. చక్కెర వాడుతున్నప్పుడు కంటే.. చక్కెర వాడటం మానేసిన తర్వాత జీవక్రియ వేగంగా మారుతుంది. చక్కెర వాడటం మానేస్తే.. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యంగా మారతాయి. అధిక బరువు ఉన్నవారు చక్కెర వాడటం మానేస్తే.., క్రమంగా బరువు తగ్గడం మొదలవుతుంది.  వారం రోజులలో స్పష్టంగా మార్పు కనిపించకపోయినా.. చక్కెర వాడటం మానేస్తే.. క్రమంగా బరువు తగ్గడం సులువు అవుతుంది.                                       *రూపశ్రీ.
పిల్లలకు పేరు పెట్టడం అనేది ప్రతి తల్లిదండ్రులకు ఎంతో ప్రత్యేకమైన మరియు పవిత్రమైన సందర్భం. అయితే పేరు అనేది కేవలం పిలవడానికి మాత్రమే కాకుండా, వ్యక్తి జీవితంపై, వ్యక్తిత్వంపై, ఆలోచనా విధానంపై కూడా ప్రభావం చూపుతుందని భారతీయ సనాతన సంప్రదాయం చెబుతోంది. ఈ భక్తివన్ ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డా. అనంత లక్ష్మి గారు, పిల్లలకు పేరు ఎలా ఎంపిక చేయాలి, నామకరణంలో పాటించాల్సిన శాస్త్ర నియమాలు, జన్మ నక్షత్రం ఆధారంగా పేరు ఎందుకు పెట్టాలి, పేరుకు ఉన్న ఆధ్యాత్మిక మరియు సాంప్రదాయ ప్రాముఖ్యత వంటి అనేక ఆసక్తికరమైన విషయాలను సులభంగా వివరిస్తారు. అలాగే పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు పేరు ఎంపికలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి అనే విషయాలపై కూడా విలువైన సూచనలు అందిస్తున్నారు. పిల్లలకు పేరు పెట్టాలని ఆలోచిస్తున్న ప్రతి తల్లిదండ్రులు, అలాగే హిందూ ధర్మం, నామకరణ సంప్రదాయాల గురించి తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన ఆధ్యాత్మిక కార్యక్రమం ఇది. ఈ వీడియోను పూర్తిగా వీక్షించి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కూడా పంచుకోండి. ఆధ్యాత్మిక విశేషాలు, పూజా విధానాలు, దేవాలయాల మహిమ, పండుగల ప్రాముఖ్యత కోసం మా Bhakthi One యూట్యూబ్ ఛానల్‌ను సందర్శించండి. సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
మోకాళ్ల నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? తరచూ పెయిన్‌కిల్లర్ మాత్రలు వాడుతున్నారా? అయితే ఈ వీడియోను తప్పకుండా చూడండి. ఈ వీడియోలో ప్రముఖ వైద్యులు డా. చిట్బొట్ల మధుసూదన్ శర్మ మోకాళ్ల నొప్పిని తగ్గించేందుకు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే ఒక సహజమైన చిట్కాను వివరించారు. కేవలం మూడు సాధారణ వంటింటి పదార్థాలు అయిన వెల్లుల్లి, పసుపు, నూనెతో తయారయ్యే ఈ మిశ్రమాన్ని ఎలా ఉపయోగించాలి, ఎప్పుడు రాయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను స్పష్టంగా వివరించారు. ఈ చిట్కా మోకాళ్ల నొప్పి, కీళ్ల నొప్పులు, వాపు వంటి సమస్యలకు ఉపశమనం కలిగించడంలో సహాయపడవచ్చని ఆయన తెలిపారు. అయితే ఫలితాలు వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని బట్టి మారవచ్చు. తీవ్రమైన లేదా దీర్ఘకాలిక నొప్పి ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యాంశాలు: • మోకాళ్ల నొప్పికి సహజమైన ఇంటి చిట్కా • వెల్లుల్లి, పసుపు, నూనెతో మిశ్రమం తయారీ విధానం • రాత్రి ఎలా ఉపయోగించాలి? • ఈ చిట్కా వల్ల కలిగే ప్రయోజనాలు • ఎవరెవరు ఉపయోగించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మోకాళ్ల ఆరోగ్యం, కీళ్ల సంరక్షణ, సహజ వైద్య చిట్కాలు మరియు ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం TeluguOne Health ను ఫాలో అవుతూ ఉండండి.