తెలుగు రాష్ట్రాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విప్లవానికి నాంది పలికి, హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ మ్యాప్‌లో నిలబెట్టిన నాయకుడిగా, దార్శనికుడిగా చంద్రబాబుకు తిరుగులేనిగుర్తింపు ఉంది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నవ్యాంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులు సైతం ఆయనను టెక్నాలజీ పట్ల మక్కువ గల నేతగా అభివర్ణిస్తుంటారు. ఆయన దార్శనికతను అభినందిస్తారు. 2014లో నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ఆయన పేరు తప్ప మరేమీ మిగలని ఆంధ్రప్రదేశ్ ను గాడిలో పెట్టేందుకు నిరంతరం శ్రమించారు. 2019 ఎన్నికలలో ఓటమి తరువాత పలు సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొన్నారు. 2024 ఎన్నికలలో విజయం తరువాత.. చంద్రబాబు పని తీరులో సమూల మార్పు వచ్చింది. పరిశీలకులు ఆయన ప్రస్తుత పాలనను చంద్రబాబు  2.0 అంటున్నారు. ఏకకాలంలో టెక్నాలజీకి,  వ్యవసాయానికీ, ఇరిగేషన్ కు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నారు.  వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు. ఈ విధానం ద్వారా అన్నదాతలు తమ పంటల సాగుకు సంబంధించి శాస్త్రీయంగా  ముందస్తు ప్రణాళిక చేసుకునే అవకాశం లభిస్తుంది.   ఈ ప్రణాళికలో  ముఖ్యంగా కరువు పీడిత ప్రాంతమైన రాయలసీమకు చంద్రబాబు  ప్రాధాన్యత ఇచ్చారు. హంద్రీ నీవా సుజల స్రవంతి,  వెలిగొండ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి, అదనంగా 52 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. దీనివల్ల దాదాపు 14 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. అదేవిధంగా, కృష్ణా-గోదావరి బేసిన్ పరిధిలో కాల్వల ఆధునీకరణ, నదుల అనుసంధాన పనులను కూడా వేగవంతం  చేశారు. రైతులు  లాభాలు గడించేందుకు వీలుగా రాయితీపై మైక్రో ఇరిగేషన్ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు. వర్షపాతం నమోదు, జలాశయాల నీటి మట్టాలు, నీటి వినియోగంపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా   ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చవచ్చని చంద్రబాబు ధీమాగా చెబుతున్నారు.  గతంలో  వైసీపీ  చంద్రబాబుపై వేసిన వ్యవసాయ వ్యతిరేకి  అనే  ముద్రను  చంద్రబాబు తన నిర్ణయాల ద్వారా పూర్తిగా చెరిపేశారు. టెక్నాలజీతో పాటు వ్యవసాయాన్ని సమాంతరంగా అభివృద్ధి చేస్తూ ఆయన తన కార్పొరేట్ ఇమేజ్‌ ను అలాగే కాపాడుకుంటూ.. అచ్చమైన  రైతు నేతగా ట్రాన్స్ ఫారమ్ అయ్యారు. జాతీయ స్థాయి మీడియా సంస్థలు సైతం చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న ఈ  నిర్ణయాలను ప్రముఖంగా ప్రశంసిస్తున్నాయి.  [Chandrababu Naidu, Digital CM, Transform, Farmer Friend,  Andhra Pradesh agriculture, irrigation projects, Rayalaseema irrigation, AP news, Telugu One]
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ రూపంలో సవాల్ ఎదురౌతోంది. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టడంలో, నిలదీయడంలో విఫలమౌతున్నారన్న చర్చ గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో విస్తృతంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో  సీజేపీ  చీఫ్ అభిజిత్ దిప్కే దూకుడు రాజకీయాలతో జాతీయ స్థాయిలో  మోడీ సర్కార్ ను నిలదీస్తున్నారు. కేంద్రం మెడలు వంచి ధర్మేంద్ర ప్రదాన్ చేత రాజీనామా చేయించగలిగారు. దీంతో  రాహుల్ గాంధీ చేయాల్సిన ప్రధాన పోరాటాలను సీజేపీ చీఫ్ తన చేతుల్లోకి తీసుకుంటూ, మంచి ఫలితాలు సాధించగలుగుతున్నారన్న అభిప్రాయం జనబాహుల్యంలో గట్టిగా వ్యక్తమౌతోంది. రాజీవ్ గాంధీ విఫలమైన చోట అభిజిత్ దిప్కే విజయాలు సాధిస్తున్నారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది,   ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్  వివాదంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా  క్రెడిట్ మొత్తం సీజేపీ చీఫ్ అభిజిత్ దిప్కే ఖాతాలో పడటాన్ని పరిశీలకులు ఉదాహరణగా చూపుతున్నారు. విద్యాశాఖ మంత్రికి వ్యతిరేకంగా ఆందోళనలకు నాయకత్వం వహించి ఆయన రాజీనామా చేయక తప్పని అనివార్యతను కల్పించడంలో  సీజేపీ ఉద్యమం సక్సెస్ అయ్యింది. అలాగే తాజాగా ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుంటూ సీజేపీ ఉద్యమానికి ఉపక్రమించింది. ఆయన రాజీనామాకు డెడ్ లైన్ విధించింది. వాస్తవంగా ఈ స్థాయి దూకుడు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలో కనిపించాలి. అయితే ఆ దూకుడు సీజేపీ చీఫ్ కనబరుస్తున్నారు.  ఈవీఎంలు,  అవినీతి, ఎన్నికల నిర్వహణలో లోపాలపై వచ్చే నెల 2 నుంచి దేశ వ్యాప్తం ఆందోళనకు సీజేపీ పీలుపునిచ్చిన సంగతి విదితమే.   ఈ ఆందోళన ప్రకటిస్తూ.. సీజేపీ చీఫ్.. ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు. ప్రస్తుత జాతీయ రాజకీయ శూన్యతను భర్తీ చేసేలా సీజేపీ ముందుకు సాగుతోందన్న అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో బలంగా వ్యక్తమౌతోంది. ఇక్కడే ప్రతిపక్ష నేతగా రాహుల్ వైఫల్యాలు మరింత ప్రస్ఫుటంగా తెరపైకి వస్తున్నాయి.  [Rahul Gandhi, CJP Chief, Abhijeet Dipke, Election Commissioner, Opposition Leader, Indian Politics, Challange, Cacroch Janata Party]
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వం, ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. శుక్రవారం పవన్ కళ్యాణ్ సమక్షంలో జరిగిన కార్యక్రమంలో తుని నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకుడు యనమల కృష్ణుడు, హిందూపురం సీనియర్ వైసీపీ నాయకుడు నవీన్ నిశ్చల్ జనసేన కండువా కప్పుకున్నారు. వీరితో పాటు వైసీపీ నాయకుడు, ఏలూరు డీసీసీబీ మాజీ ఛైర్మన్ పీవీఎల్ఎన్ నరసింహరాజు, కందుకూరు, సర్వేపల్లి, కనిగిరి నియోజకవర్గాల వైసీపీ పరిశీలకుడు మన్నెమాల సుకుమార్ రెడ్డి, కాంగ్రెస్ నాయకురాలు అయితాబత్తుల సుభాషిణి కూడా జనసేనలో చేరారు.అలాగే తుని వైసీపీ నాయకుడు పొలినాటి శేషగిరిరావు, తణుకు వైసీపీ నాయకుడు దిరిశాల కృష్ణ శ్రీనివాస్, శ్రీకాళహస్తికి చెందిన వైసీపీ నాయకుడు సత్రవాడ ప్రవీణ్, మిద్దెల హరి, ముమ్మడివరం మాజీ ఏఎంసీ ఛైర్మన్ కుడిపూడి శివన్నారాయణ, నరసరావుపేటకు చెందిన ఏలూరి ప్రసాద్ జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వారికి జనసేన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, అందరినీ కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఒకే వేదికపై పలువురు నాయకులు జనసేనలో చేరడం ఆయా నియోజకవర్గాల్లో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. తాజా చేరికలు స్థానికంగా పార్టీ రాజకీయ సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది.       [ Pawan Kalyan, Jana Sena Party, YSRCP, YSRCP Leaders, Jana Sena Joinings, Political Joinings, Andhra Pradesh Politics, Pawan Kalyan Leadership, Yanamala Krishnudu, Naveen Nischal, PVLN Narasimha Raju, Sukumar Reddy ]
ALSO ON TELUGUONE N E W S
తెలంగాణ ప్రాంత నేపథ్యంలో తెరకెక్కిన నాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల ల 'ది ప్యారడైజ్  థియేటర్స్ లో రన్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రియదర్శి  పోషించిన కేసీఆర్ ని పోలిన క్యారక్టర్ అయితే కెసిఆర్ అభిమానులకి, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకి మంచి కిక్ ని తెప్పిస్తుంది. రీసెంట్ గా కెసిఆర్ కుమార్తె కవిత మాట్లాడుతు తెలంగాణ బిడ్డే డైరెక్టర్ అయినా, ప్యారడైజ్ మూవీ బాగోలేదు. దీంతో సినిమా కూడా సరిగ్గా ఆడటం లేదు.  తెలంగాణ తెచ్చిన కెసిఆర్ క్యారక్టర్ ని అయితే అవమానించారు. పాటలకి డాన్స్ చేస్తుంది  బీఆర్ఎస్ పెయిడ్ టీం. డబ్బులు ఇచ్చి మరి డాన్స్ చేయిస్తున్నారు. నేను ప్యారడైజ్ మూవీ చూడనని కవిత చెప్పుకొచ్చింది. ఇది కూడా చదవండి: లబోదిబోమంటున్న మహిళా యూట్యూబర్: పక్కాగా ప్లాన్ చేసి దాన్నే దోచుకెళ్లారు!   [Kavitha About The Paradise movie,  TRS Kavitha Serious On Nani, The paradise, kayadu Lohar, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
దేనోడు దానికే ఉంటాడనే సామెత పురాణాల నుంచే ప్రాచుర్యంలో ఉంది. ప్రాచుర్యంలో ఉండటమేంటి అది నిజం అనే సంఘటనలని మనం రోజు చూస్తూనే ఉన్నాం. తాజాగా మరోసంఘటన జరిగింది. తమిళనాడులోని నాగర్‌కోయిల్ సమీపంలోని తమ్మట్టుకోణం వీఐపీ గార్డెన్‌లో నివసించే ప్రముఖ  దంపతులు వినోద్ కుమార్, మధుమిత యూట్యూబర్స్ గా రాణిస్తున్నారు. యూట్యూబ్ తో పాటు  ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో మిలియన్ల కొద్దీ వ్యూస్, లైక్స్ కోసం నిరంతరం వీడియోలు చేసే ఈ దంపతులు, ఇటీవల తమ ఇంట్లోని పూజా గదిలో ఉన్న అపారమైన సంపదని  ప్రపంచానికి చూపిస్తూ ఒక షార్ట్ వీడియో చేశారు. ఆ వీడియోలో తులాల కొద్దీ బంగారు ఆభరణాలు, దొంతులుగా పేర్చిన నగదును స్పష్టంగా ప్రదర్శించారు. ఆ ఆర్భాటమే ఇప్పుడు వారిని రోడ్డున పడేలా చేసింది. ఆ  వీడియో వైరల్ అయిన కొద్ది రోజులకే దొంగలు పక్కా ప్లాన్‌తో వారి ఇంటిపై విరుచుకుపడ్డారు. దొంగలు ఆ ఇంట ఉన్న సెక్యూరిటీని అత్యంత చాకచక్యంగా ఛేదించారు. పటిష్టమైన గేటెడ్ కమ్యూనిటీ, సీసీటీవీ కెమెరాల నిఘా ఉన్నప్పటికీ దొంగలు రాత్రికి రాత్రే ఇంటి వెనుక తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. వారు ఏమీ వెతకాల్సిన అవసరం లేకుండానే, వీడియోలో చూసిన పూజ గదిలోని సేఫ్‌పై దాడి చేసి నిమిషాల్లో పని పూర్తి చేసుకున్నారు. ఈ దొంగతనంలో ఏకంగా 118 సవర్ల (సవర్ అంటే 8 గ్రాములు) బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలు, భారీగా ఉన్న నగదును దోచుకెళ్లారు. అంతర్జాతీయ, స్థానిక మార్కెట్ విలువల ప్రకారం చోరీకి గురైన మొత్తం సంపద విలువ 1 కోటి వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇది కూడా చదవండి:  డాన్సర్స్ అసోసియేషన్‌లో మంటలు: ఆ రోజునే ఎన్నికలు ఎందుకు!   బాధితులు వెంటనే రాజాక్కమంగళం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన దర్యాప్తు బృందాలు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌లతో నిందితుల కోసం గాలిస్తున్నారు. అందుకే అంటారు అవసరానికి మించి 'షో' చేస్తే 'అటెన్షన్' గురించి ఆలోచించకుండా 'సరెండర్' అవుతాం.  ఇది చరిత్ర చెప్పిన 'సత్యం'.       [Youtuber Gold Stolen TamilNadu,  Tamil Nadu YouTuber Burglary, Madhumitha, 118 Sovereigns Gold Stolen, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ‘డొరొతి’ ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారింది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు ఒకవైపు ప్రశంసలు వస్తుంటే.. మరోవైపు కొన్ని సన్నివేశాలు, సినిమాలోని సున్నితమైన అంశాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంతేకాదు.. కొందరు నెటిజన్లు ఏకంగా సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ పోస్టులు పెడుతున్నారు. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ‘డొరొతి’ సెప్టెంబర్ 25న థియేటర్లలోకి వచ్చింది. 1990ల ప్రారంభంలో గ్రామీణ తమిళనాడు నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. కుల విభజనలు, హింస, పురుషత్వంపై సమాజం విధించే అంచనాలు, స్నేహం, ప్రేమ వంటి అంశాల చుట్టూ కథ తిరుగుతుంది. కీర్తి సురేష్‌తో పాటు రిషికాంత్, సనంత్ కీలక పాత్రల్లో నటించారు. అయితే సినిమా విడుదలైన తర్వాత అసలు చర్చ మొదలైంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే కొన్ని అంశాలు, LGBTQ నేపథ్యానికి సంబంధించిన ట్రీట్‌మెంట్‌పై కొందరు ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అయితే ఇలాంటి సినిమాలను ప్రోత్సహించకూడదంటూ బాయ్‌కాట్‌కు పిలుపునిస్తున్నారు. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్, చివరి భాగంలోని కొన్ని డైలాగులు సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చకు వస్తున్నాయి. సున్నితమైన అంశాన్ని దర్శకుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన విధానం విషయంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వ్యతిరేకత అందరి ప్రేక్షకుల అభిప్రాయం కాదని కూడా చెప్పాలి. సినిమా కథనం, నటీనటుల పెర్ఫార్మెన్స్, రియలిస్టిక్ ట్రీట్‌మెంట్‌ను మెచ్చుకుంటున్నవాళ్లు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ప్రదర్శన లభించింది. అక్కడ సినిమాకు మంచి స్పందన వచ్చినట్లు రిపోర్టులు వచ్చాయి. కానీ థియేట్రికల్ రిలీజ్ తర్వాత మాత్రం సోషల్ మీడియాలో మరో రకమైన చర్చ మొదలైంది. ఇలా ఒకవైపు ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రశంసలు.. మరోవైపు థియేటర్లలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా వివాదం.. ఇంకోవైపు బాయ్‌కాట్ పిలుపులు.. ఇలా ‘డొరొతి’ చుట్టూ భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఇది కూడా చదవండి: KTR షాకింగ్ ట్వీట్.. ‘పారడైజ్’ కోసం రంగంలోకి మాజీ మంత్రి.!       [Keerthy Suresh Dorothy Controversy, Dorothy Movie Controversy, Keerthy Suresh Dorothy Movie, Keerthy Suresh Latest Movie, Keerthy Suresh, Dorothy Movie, Karthik Subbaraj, Dorothy Boycott, LGBTQ Controversy, Telugu Film News]  
  హీరోల చేత స్టెప్స్ వేయించి, అభిమానుల చేత విజిల్స్ వేయించే డాన్స్ మాస్టర్స్ గత కొన్నేళ్లుగా పలు విభేదాలతో రాంగ్ స్టెప్స్ వేస్తున్నారనే మాటలు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు తగ్గుతున్నట్టుగా అనిపిస్తున్నా తగ్గేదెలే  అంటూ   వింటర్ లో కూడా హీట్ ని రాజేస్తున్నాయి. ఇండస్ట్రీకి ఎంతో ముఖ్యమైన ఈ యూనియన్‌లో నిశ్శబ్దం కాసేపేనని, వివాదాలు ముగిసిపోలేదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.  అసోసియేషన్‌లో చోటుచేసుకున్న గందరగోళానికి చెక్ పెట్టాలంటే ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించడమే ఏకైక మార్గమని మెజారిటీ సభ్యులు తేల్చి చెప్పారు. అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్‌లో అత్యధిక శాతం డాన్సర్లు రాబోయే అక్టోబర్ 11వ తేదీన నూతన ఎన్నికలు నిర్వహించడానికి పూర్తి మద్దతు తెలిపారని రాజన్న మాస్టర్ మరియు సత్య మాస్టర్ అధికారికంగా ప్రకటించారు. డాన్సర్లందరికీ న్యాయం జరగాలన్నా, వివాదాలకు శాశ్వత ముగింపు పలకాలన్నా ఈ ఎన్నికలు అత్యవసరం అని వారు స్పష్టం చేశారు. ఇటీవల ఫెడరేషన్‌తో జరిగిన సమావేశంలో మినిట్స్ బుక్ దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నం జరిగిందనే వార్తలు అసోసియేషన్‌లో కొత్త కలకలం సృష్టించాయి. ఈ సందర్భంగా సత్య మాస్టర్ స్పందిస్తూ, "ఫెడరేషన్ మాకు కన్న తల్లి లాంటిది" అని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితిని బట్టి కొందరు భిన్నంగా వ్యవహరించడం వల్లే యూనియన్‌లో రోజురోజుకూ సమస్యలు పెరుగుతున్నాయని ఆరోపించారు. అసోసియేషన్ కష్టాల్లో ఉన్నప్పుడు సీనియర్లుగా తాము చూస్తూ ఊరుకోలేమని, కచ్చితంగా బాధ్యతగా స్పందిస్తామని తేల్చి చెప్పారు. ఇది కూడా చదవండి: బాహుబలి రికార్డు బద్దలు: బాక్స్ ఆఫీస్ పై సరికొత్త చరిత్ర  మరోవైపు, రాజన్న మాస్టర్ తీవ్ర స్థాయిలో స్పందిస్తూ సుమలతా దేవి తమపై ఎలాంటి ఆధారాలు లేని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్‌పై కూడా సుమలత చేసిన ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని ఖండించారు. బైలాస్ ఉల్లంఘనలు, అంతర్గత కుమ్ములాటలు పక్కన పెట్టి సాధారణ డాన్సర్ల సంక్షేమం కోసమే అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. గతంలో దాదాపు 600 మందికి పైగా ఉన్న అసోసియేషన్ సభ్యుల్లో ఉప ఎన్నికల సమయంలో కేవలం 114 మంది మాత్రమే పాల్గొనడం, మూడొంతుల మంది ప్రముఖ డాన్స్ మాస్టర్లు దూరంగా ఉండటం తీవ్ర అసంతృప్తికి దారితీసింది. అందుకే ఈసారి అక్టోబర్ 11న పారదర్శకంగా జరగబోయే ఈ ఎన్నికలు అసోసియేషన్ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. ఈ పోరుతో వివాదాలు సర్దుమణుగుతాయో లేక మరింత ముదురుతాయో వేచి చూడాలి!        [Dancers Association Elections Date, Tollywood Dancers Association, Satya Master, Rajanna Master, Sumalatha Devi, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]  
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వచ్చిన మూవీ 'ది ప్యారడైజ్'. సెప్టెంబర్ 24న విడుదలైన ఈ మూవీ.. నెగటివ్ టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ, భారీ వసూళ్లతో సత్తా చాటుతోంది. కేవలం రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టింది.  అయితే 'ది ప్యారడైజ్' మూవీలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను పోలి ఉన్న ఎమ్మెల్యే శంకర్ పాత్ర వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రియదర్శి పోషించిన ఈ పాత్ర గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్ ‘పారడైజ్’ సినిమా చూడటానికి రెడీ అవ్వడం ఆసక్తికరంగా మారింది.  ‘పారడైజ్’ సినిమా చూడబోతున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. “చాలా ఏళ్ల తర్వాత, ఈ రోజు రాత్రి నా ఫేవరెట్ యాక్టర్లలో ఒకరైన నాని, యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘ది పారడైజ్’ సినిమా చూడటానికి థియేటర్‌కు వెళ్తున్నాను” అని కేటీఆర్ రాసుకొచ్చారు. కేటీఆర్ చేసిన ఈ వైరల్ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. 'పారడైజ్'లో కేసీఆర్ ను పోలిన పాత్ర ఉండటం, ఆ సినిమా చూడటానికి కేటీఆర్ వెళ్తుండటంతో.. సినిమా చూసిన తర్వాత ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో నెలకొంది.  ఇది కూడా చదవండి: ఇంగ్లీష్‌ లిరిక్స్‏తో 'జైలర్ 2' పాట.. ఆ రెండు లైన్స్ మాత్రమే తెలుగు.! https://x.com/KTRBRS/status/2103742991575953753       [KTR Tweet On Paradise Movie, The Paradise Movie, Nani Paradise, KTR Paradise, Paradise Movie KCR, KTR Twitter, Telugu Film News, Telugu News]  
  బాహుబలి సిరీస్: పేరుకి తగ్గట్టే అనేక రికార్డులని తన ఖాతాలో వేసుకుంది. రీ రిలీజ్ లో కూడా సేమ్ సిస్టమ్ ని మెయిన్ టైన్ చేస్తు 'బాహుబలి ది ఎపిక్' గా వచ్చి  తొలి రోజు 5 కోట్లు రాబట్టింది. ఇప్పటివరకు మన దేశంలో రీ రిలీజ్ అయిన సినిమాల్లో తొలిరోజు కలెక్షన్స్ కి సంబంధించి 'ది ఎపిక్' దే హయ్యెస్ట్.  కానీ ఆ రికార్డుకి చాలా సరదాగా ఎసరు పెట్టింది హాలీవుడ్ మూవీ 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' మార్వెల్ కామిక్స్ సూపర్ హీరోల కథ ఆధారంగా రూపొందిన ఈ  సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం, 'ఎండ్‌గేమ్ ఎన్‌కోర్' పేరుతో నిన్న వరల్డ్ వైడ్ గా రీ రిలీజ్ అయ్యింది. విడుదలైన  మొదటి రోజే దేశవ్యాప్తంగా  ఏకంగా 7.25 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు సాధించి సంచలనం సృష్టించింది. గ్రాస్ పరంగా చూస్తే  8.68 కోట్ల రూపాయలు. కేవలం 3,635 స్క్రీన్స్‌లలో మాత్రమే పరిమితంగా విడుదలైనప్పటికీ ఈ స్థాయిలో భారీ వసూళ్లు రావడం మార్వెల్ చిత్రాలకు ఉన్న విపరీతమైన క్రేజ్‌ను మరోసారి స్పష్టం చేస్తోంది.  ఇది కూడా చదవండి: హీరోగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య: నిర్మాత ఎవరో తెలిస్తే షాక్    భాషల వారీగా కలెక్షన్లు పరిశీలిస్తే, ఇంగ్లీష్ వెర్షన్ రూ. 5.25 కోట్లతో అగ్రస్థానంలో నిలవగా, హిందీ వెర్షన్ 1.25 కోట్లు, తెలుగు రాష్ట్రాల నుంచి 45 లక్షలు, తమిళనాడు నుంచి 30 లక్షల వసూళ్లు నమోదు కావడం విశేషం. దీంతో ఎల్లకాలం ఎవరి ఆటలు సాగవనే సంకేతాన్ని బాక్స్ ఆఫీస్ కి చెప్పినట్లయింది.   [Avengers Endgame Encore Beat To Baahubali Collections, Avengers Endgame Encore Collections, Encore Avengers Endgame, Baahubali, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
Nani’s The Paradise has received an unexpected boost of attention from BRS leader KTR, who has announced that he will be watching the film in a theatre. The announcement comes as the Srikanth Odela directorial continues its strong run at the box office, with the film having grossed Rs.114 crores+ worldwide in its first two days. Taking to social media, KTR revealed that he is heading to a theatre after many years to watch a film, specifically mentioning his interest in Nani and director Srikanth Odela. He wrote, "After many many years, going to a theatre tonight to watch one of my favourite actors @NameisNani and the talented young director @odela_srikanth in “The Paradise”" KTR’s post has added another interesting dimension to the film’s post-release buzz, particularly because The Paradise has a Telangana-rooted setting and narrative. A sequence in the film inspired by the real-life public image of KCR has also emerged as one of the talking points among audiences, making KTR’s decision to watch the film in theatres all the more interesting. Looks like KTR and BRS might take The Paradise to coveted breakeven mark in Telangana with KCR's cameo being used as a highlight moment. Let's wait and watch how it goes. Anirudh Ravichander has scored music for the film.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
కోలీవుడ్ హిస్టరీలోనే మోస్ట్ మోస్ట్ అవైటెడ్ మాస్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతోంది. రజనీకాంత్ - నెల్సన్ దిలీప్‌కుమార్ - అనిరుధ్ రవిచందర్. గతంలో 'జైలర్' మూవీతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ క్రేజీ టీమ్, ఇప్పుడు 'జైలర్ 2'తో మరో సరికొత్త రికార్డులను తిరగరాయడానికి సిద్ధమవుతోంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సీక్వెల్ అక్టోబర్ 15న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన మొదటి పాట ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు దానికి డబుల్ డోస్ ఇస్తూ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ 'వన్ సన్, వన్ మూన్' (One Sun, One Moon) అనే సెకండ్ సింగిల్‌ను విడుదల చేశారు. రిలీజ్ అయిన కొద్దిసేపటికే ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్ నంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లింది. సాధారణంగా సౌత్ ఇండియన్ మాస్ సినిమాల్లో పాటలు అంటే పక్కా లోకల్ లిరిక్స్ ఉంటాయి. కానీ అనిరుధ్ ఈసారి కంప్లీట్ ఇంటర్నేషనల్ టచ్ ఇచ్చారు. ఈ 'వన్ సన్, వన్ మూన్' పాటలో కేవలం రెండు లైన్స్ తప్ప.. పాట మొత్తం ఇంగ్లీష్ పదాలతోనే నింపేశారు. ఇంగ్లీష్ లిరిక్స్ రాసిన హేసిన్ బర్గ్, రజనీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు, ఆయన స్వాగ్‌కు పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యేలా గూస్‌బంప్స్ ఎలివేషన్ వర్డ్స్‌ను అందించారు. పాట మధ్యలో భాస్కరభట్ల రవికుమార్ రాసిన ఆ రెండు తెలుగు లైన్స్ – "గుండెల్ని పరిపాలించే ప్రేమికుడే.. మా దిక్కు మొక్కై పోడా కావాలంటే" – అభిమానుల గుండెల్లోకి నేరుగా దూసుకెళ్తున్నాయి. ఒకవైపు ఇంటర్నేషనల్ పాప్ స్టైల్ బీట్, మరోవైపు సూపర్‌స్టార్‌పై అభిమానులకు ఉన్న అపరిమితమైన ప్రేమను వర్ణించే ఈ లైన్స్ వింటుంటే ఎవరైనా సరే అనిరుధ్ మ్యాజిక్‌కు ఫిదా కావాల్సిందే. అనిరుధ్, ఇన్నో గెంగా, ఎంఎస్ కర్సన తమ వాయిస్‌తో ఈ పాటకు సరికొత్త ఎనర్జీని ఇచ్చారు. రమ్యకృష్ణ, మిర్నా మీనన్, విద్యా బాలన్, ఎస్.జే. సూర్య, మిథున్ చక్రవర్తి వంటి భారీ తారగణంతో వస్తున్న 'జైలర్ 2' అక్టోబర్ 15న థియేటర్లలో ఏ స్థాయి విధ్వంసం సృష్టించబోతోందో ఈ పాట చూస్తుంటేనే అర్థమవుతోంది. ఇది కూడా చదవండి: ఈ సంక్రాంతి మనదే.. ‘కాకా’పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన చిరంజీవి       [Jailer 2 Second Single, One Sun One Moon Song Lyrics, Jailer 2 Songs Telugu, Jailer 2 Song Lyrics, One Sun One Moon Song, Jailer 2 Movie, Rajinikanth, Anirudh Ravichander, Nelson Dilipkumar, Telugu Film News, Telugu News]  
సినిమాలో నటించడమంటే ఎవరకి చేదు చెప్పండి. సినిమా అనేది ఏమి ఇస్తుందో, ఎంత ఇస్తుందో నటులకి, మేకర్స్ కి బాగా తెలుసు. ఇప్పుడు ఆ కోవలో చేరడానికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి  సిద్ధరామయ్య సిద్దమయ్యారు.   కొత్తగా రాబోతున్న ఓ కన్నడ చిత్రంలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పాత్రలోనే కనిపించబోతున్నారు. ఆర్.ఏ. ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై నూతన దర్శకుడు రాజేష్ గౌడ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు తాత్కాలికంగా 'ముఖ్యమంత్రి' అనే శక్తివంతమైన టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. చిత్రం కథాంశం వినగానే సిద్ధరామయ్యకు బాగా నచ్చడంతో, ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడానికి ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. సాధారణంగా సినిమాలు పూర్తి కావడానికి నెలల సమయం పడుతుంది, కానీ ఈ చిత్రబృందం ఒక ప్రపంచ రికార్డును లక్ష్యంగా పెట్టుకుంది. స్క్రిప్ట్ రాయడం నుంచి షూటింగ్, ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, చివరకు థియేట్రికల్ స్క్రీనింగ్ వరకు కేవలం 48 గంటల్లోనే పూర్తి చేయాలని మేకర్స్ ప్రణాళిక రచిస్తున్నారు. నవంబర్ నాటికి ఈ భారీ 48 గంటల షూటింగ్ అద్భుతాన్ని పూర్తి చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.     ఇది కూడా చదవండి: ది ప్యారడైజ్' లోని ధూమావతి అమ్మవారు ఎవరో తెలుసా: ఓరి నాయనో ఇదా హిస్టరీ! పైగా ఈ వయసులో యాక్టింగ్ కి సిద్దమయ్యారంటే హీరోనే. ఏది ఏమైనా 'మేము నటులమే'.. నీ కంటే చాలా పెద్ద నటులమే' అని సిద్దరామయ్య చాటి చెప్పనున్నారు.    [Siddaramaiah To Act In Kannada Movie, Siddaramaiah Movie, Former Karnataka CM, Siddaramaiah Movie, Kannada Cinema, Mukhyamantri Film, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
  తెలుగు సినిమా స్క్రీన్ పై ఎంతో మంది దేవతలు కనపడి ప్రేక్షకులకి తమ కరుణ కటాక్షాలు అందించారు. ఆ కోవలోనే ఇటీవల విడుదలైన 'ది ప్యారడైజ్' లో  ధూమావతి అమ్మవారు కనిపించారు. కానీ ఈ అమ్మవారి గురించి మెజారిటీ ప్రేక్షకులకి తెలియదు. మరి ఈ ధూమావతి అమ్మవారు ఎవరు? పూజా నేపథ్యం. అసలు , భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో ఆమెకు ఉన్న ప్రాధాన్యత ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి హిందూ ఆధ్యాత్మిక తంత్ర శాస్త్రంలో దశమహావిద్యలు (10 Mahavidyas) చాలా శక్తివంతమైనవిగా పరిగణించబడతాయి. పార్వతీ దేవికి ఉన్న 10 ఉగ్ర రూపాలలో 7వ మహావిద్యయే ఈ ధూమావతి అమ్మవారు. దేవి ఉగ్రరూపం, ధూమం అంటే పొగ అని అర్థం. కోపంతో పొగలు కక్కుతున్న రూపంలో దర్శనమిచ్చే ఈ దేవిని "విధవా దేవి" అని కూడా పిలుస్తారు. దేవి చేతిలో చేట (ముర్రం), విరిగిన రథం, వాహనంగా కాకి (Crow) ఉంటాయి. సాధారణంగా దేవతలను అత్యంత అలంకారాలతో పూజిస్తే, ధూమావతి అమ్మవారిని మాత్రం తెల్లటి వస్త్రాలతో, ముడతలు పడిన శరీరంతో, వృద్ధురాలి రూపంలో ఆరాధిస్తారు. ఇది కూడా చదవండి:  దేవతలతో పెట్టుకోకండి: దమ్ము ధైర్యం ఉండాలి: 'ది ప్యారడైజ్ 'పై వేణు స్వామి సంచలన కామెంట్స్     పురాణాల ప్రకారం ఒకసారి పార్వతీ దేవికి తీవ్రమైన ఆకలి వేసినప్పుడు, పరమశివుడిని ఆహారం అడుగుతుంది. శివుడు కొద్దిసేపు వేచి ఉండమని చెప్పినప్పటికీ, ఆకలి తట్టుకోలేక పార్వతీ దేవి ఏకంగా శివుడినే మింగేస్తుంది. అయితే పరమశివుడి కంఠంలో ఉన్న హాలాహలం వల్ల దేవి శరీరం నుండి పొగలు రావడం ప్రారంభిస్తాయి. ఆ తరువాత శివుడు దేవి ఉదరం నుండి బయటకు వచ్చి, నీవు నన్ను మింగడం వల్ల వైధవ్యాన్ని పొందావు అని, అందుకే నిన్ను ధూమావతిగా పిలుస్తారని చెప్తాడు.  భారతదేశంలో ధూమాదేవి దేవాలయాలు చాలా అరుదుగా ఉంటాయి, కేవలం 1% కంటే తక్కువ క్షేత్రాల్లోనే ఈ దేవి విగ్రహాలు కనిపిస్తాయి. మధ్యప్రదేశ్ లోని దతియా (Datia) పీఠం మరియు వారణాసిలోని ధూమావతి ఆలయం అత్యంత ప్రసిద్ధి చెందినవి. ఇప్పుడు ఈ విషయాలు వైరల్ గా మారడంతో సినీ ప్రేమికులు స్పందిస్తూ జడల్( నాని) శరీరంలోకి   సెకండ్ హాఫ్ లో ధూమావతి అమ్మవారు ప్రవేశించి ఆమె బాడీ లాంగ్వేజ్ తో జడల్ తన జాతికి విముక్తి ప్రసాదించినా బాగుండేదేమో అని అంటున్నారు. ప్రెజెంట్ అయితే ప్యారడైజ్ పరాజయాన్నే తన అస్త్రంగా భావిస్తు ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంది.   [The Paradise Dhumavati Ammavaru Details, The Paradise Movie Review,  Tantric Goddess Dhumavati, Sivudu, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుషులనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న ప్రధానమైన సౌందర్య మరియు ఆరోగ్య సమస్య జుట్టు రాలడం. ప్రతిరోజూ నిద్రలేచింది మొదలు దువ్వెన పట్టుకుంటే గుప్పెడు జుట్టు చేతికి రావడం, లేదా స్నానం చేస్తున్నప్పుడు కుళాయి దగ్గర కుప్పలుగా జుట్టు రాలిపోవడం చాలామందిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సాధారణంగా ఒక మనిషికి రోజుకు 50 నుండి 100 వెండ్రుకలు రాలడం అనేది సహజమైన ప్రక్రియే అయినప్పటికీ, అంతకంటే ఎక్కువ మోతాదులో విపరీతంగా రాలిపోతుంటే మాత్రం దానిని తీవ్రమైన హెచ్చరికగా భావించాలి. మారుతున్న జీవనశైలి, విపరీతమైన మానసిక ఒత్తిడి, పోషకాహార లోపం, హార్మోన్ల అసమతుల్యత మరియు రసాయనాలతో కూడిన షాంపూల వాడకం వల్ల వెంట్రుకల కుదుళ్లు బలహీనపడి ఊడిపోతుంటాయి. ఈ జుట్టు రాలే సమస్యకు ఖరీదైన హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ మరియు కెమికల్ ట్రీట్‌మెంట్లు తాత్కాలిక పరిష్కారాన్ని మాత్రమే ఇస్తాయి, కానీ ఆయుర్వేదం చెప్పిన సహజసిద్ధమైన పద్ధతులు జుట్టును కుదుళ్ల నుండి దృఢంగా మార్చి రాలడాన్ని అరికడతాయి. జుట్టు రాలడాన్ని అరికట్టడంలో మరియు కొత్త వెంట్రుకల ఎదుగుదలను ప్రోత్సహించడంలో ఆయుర్వేదంలో  భృంగరాజ్  లేదా గుంటగలగర ఆకు ప్రథమ స్థానంలో నిలుస్తుంది. భృంగరాజ్ ఆకుల రసాన్ని లేదా తైలాన్ని తలకు క్రమం తప్పకుండా పట్టించడం వల్ల తలమాడుకి (Scalp) రక్తప్రసరణ పెరుగుతుంది. దీనివల్ల కేశాల కుదుళ్లకు అవసరమైన పోషకాలు లభించి జుట్టు ఊడటం తక్షణమే తగ్గుతుంది. అలాగే మన ఇళ్లల్లో సులభంగా దొరికే మందార పూలు మరియు మందార ఆకులు జుట్టు సంరక్షణకు గొప్ప ఔషధంగా పనిచేస్తాయి. మందార రేకులు మరియు ఆకులను మెత్తగా నూరి పేస్ట్‌లా చేసి తలకు మాస్క్‌లా వేసుకుంటే, అందులోని అమైనో యాసిడ్లు, విటమిన్ సీ కుదుళ్లను బలోపేతం చేసి వెంట్రుకలు ఒత్తుగా, నల్లగా పెరిగేలా చేస్తాయి. ఆయుర్వేదంలో అమృతంగా భావించే ఆమ్లా లేదా ఉసిరికాయ జుట్టు ఆరోగ్యాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉసిరిలో విటమిన్ సీ మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఎండిన ఉసిరి ముక్కలను కొబ్బరినూనెలో మరిగించి తయారుచేసిన నూనెతో వారానికి రెండుసార్లు తలకు మసాజ్ చేయడం వల్ల తలమాడుపై ఉన్న పొడిబారిన తత్వం మరియు చుండ్రు శాశ్వతంగా నివారించబడతాయి. అలాగే కుంకుడుకాయలు, సీకాకాయ్ మిశ్రమంతో తలస్నానం చేయడం వల్ల వెంట్రుకల సహజమైన తత్వానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా కెమికల్స్ లేని స్వచ్ఛమైన క్లీన్సింగ్ లభిస్తుంది. కేవలం బాహ్య సంరక్షణ మాత్రమే కాకుండా, ఆహారంలో సైతం తగిన మార్పులు చేసుకోవాలని ఆయుర్వేద నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రతిరోజూ ఆహారంలో ప్రోటీన్లు, ఐరన్ మరియు జింక్ ఎక్కువగా ఉండే కరివేపాకు, బాదం, నువ్వులు, మొలకెత్తిన విత్తనాలు మరియు ఆకుకూరలు తీసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లు అంతర్గతంగా బలపడతాయి. మానసిక ఒత్తిడి కూడా జుట్టు రాలడానికి 40 శాతానికి పైగా కారణమవుతుంది కాబట్టి, రోజూ యోగా, ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గి జుట్టు పెరుగుదల మెరుగవుతుంది. ఈ ఆయుర్వేద నియమాలను మీ రోజువారీ జీవితంలో భాగం చేసుకుంటే అతి తక్కువ సమయంలోనే విపరీతమైన జుట్టు రాలడానికి చెక్ పెట్టి ఒత్తైన, నల్లని, దృఢమైన కేశాలను మీ సొంతం చేసుకోవచ్చు.     [ Hair Fall, Hair Growth, Bhringraj, Hibiscus, Amla, Ayurvedic Hair Care, Scalp Health, Dandruff, Hair Nutrition, Stress Management ]  
తీరిక లేని ఆధునిక జీవనశైలిలో మనలో చాలామంది సమయాభావం వల్ల లేదా అలవాటు ప్రకారం భోజనం చేసిన వెంటనే స్నానానికి వెళ్తుంటారు. ముఖ్యంగా ఉదయం ఆఫీసులకు, కళాశాలలకు త్వరత్వరగా వెళ్లే క్రమంలో లేదా రాత్రి వేళల్లో ఆలస్యంగా ఇంటికి వచ్చి భోజనం ముగించిన వెంటనే శరీరం చల్లబడటానికి స్నానం చేయడం చాలా ఇళ్లల్లో సాధారణ దృశ్యంగా మారింది. అయితే, ఈ చిన్న అలవాటు మన జీర్ణవ్యవస్థపై మరియు మొత్తం ఆరోగ్యంపై ఎంతటి ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం వల్ల శరీరంలో అంతర్గతంగా జరిగే జీవక్రియల సమతుల్యత తీవ్రంగా దెబ్బతింటుందని ఆయుర్వేద శాస్త్రంతో పాటు ఆధునిక వైద్య నిపుణులు కూడా గట్టిగా హెచ్చరిస్తున్నారు. మనం ఆహారాన్ని స్వీకరించిన వెంటనే మన శరీరం దానిని జీర్ణం చేయడానికి ఒక ప్రత్యేకమైన ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఆయుర్వేదంలో దీనిని  జఠరాగ్ని  లేదా జీర్ణశక్తి అని పిలుస్తారు. మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవ్వడానికి కడుపులోని పాచక రసాలు మరియు ఎంజైమ్‌లు సమర్థవంతంగా పనిచేయాలి. దీని కోసం మన గుండె పొట్ట, ప్రేగుల భాగాలకు రక్తప్రసరణను గణనీయంగా పెంచుతుంది. సాధారణంగా భోజనం చేసిన తర్వాత శరీరంలోని రక్తంలో దాదాపు 70 శాతం వరకు జీర్ణవ్యవస్థ వైపు మళ్లించబడుతుంది. దీనివల్ల కడుపు భాగంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది, ఈ ఉష్ణోగ్రతే ఆహారాన్ని వేగంగా కరిగించడానికి సహాయపడుతుంది. అయితే, భోజనం ముగించిన వెంటనే మనం స్నానం చేసినప్పుడు శరీరంలో ఒక రకమైన థర్మల్ షాక్ లేదా ఉష్ణోగ్రత వైరుధ్యం ఏర్పడుతుంది. మన శరీరంపై నీరు పడగానే, చర్మం యొక్క ఉష్ణోగ్రత హఠాత్తుగా తగ్గిపోతుంది. ఈ పరిస్థితిలో శరీరం తన బాహ్య చర్మ ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడం కోసం లేదా చలిని తట్టుకోవడం కోసం కడుపు భాగంలో ఉన్న రక్తాన్ని చేతులు, కాళ్లు మరియు చర్మం ఉపరితలానికి వేగంగా తరలిస్తుంది. ఫలితంగా జీర్ణవ్యవస్థకు అందాల్సిన రక్తప్రసరణ హఠాత్తుగా తగ్గిపోతుంది. దీనివల్ల కడుపులో ఉన్న జఠరాగ్ని చల్లబడి, ఆహారం జీర్ణమయ్యే వేగం 50 శాతం కంటే ఎక్కువ మందగిస్తుంది. ఇలా జీర్ణక్రియ నెమ్మదించడం వల్ల కడుపులో ఆహారం సరిగ్గా అరగక ఉండిపోతుంది. దీనివల్ల తీవ్రమైన కడుపు ఉబ్బరం, గ్యాస్, యాసిడ్ రిఫ్లక్స్ (కడుపులో మంట), మరియు అజీర్తి వంటి సమస్యలు తక్షణమే తలెత్తుతాయి. అంతేకాకుండా, జీర్ణం కాని ఆహారం ప్రేగులలో ఎక్కువ సమయం నిల్వ ఉండటం వల్ల అది పులిసిపోయి శరీరంలో విషపదార్థాలు (ట్రాక్సిన్లు) విడుదలవడానికి కారణమవుతుంది. క్రమంగా ఇది దీర్ఘకాలికంగా మలబద్ధకం, కడుపులో అల్సర్లు మరియు జీర్ణకోశ వ్యాధులకు దారితీస్తుంది. వేడి నీటితో స్నానం చేసినా లేదా చల్లటి నీటితో స్నానం చేసినా ఈ ప్రమాదం వర్తిస్తుంది. చల్లటి నీటి స్నానం రక్తనాళాలను సంకోచింపజేస్తే, వేడి నీటి స్నానం రక్తనాళాలను విస్తరింపజేసి రక్తాన్ని చర్మానికి ఎక్కువ మళ్లిస్తుంది. వైద్య నిపుణుల సలహా ప్రకారం, భోజనం చేసిన తర్వాత కనీసం 30 నుండి 45 నిమిషాల వరకు స్నానం చేయకుండా ఆగడం చాలా ముఖ్యం. ఈ సమయం జీర్ణక్రియ ప్రాథమిక దశ పూర్తికావడానికి మరియు రక్తం కడుపు భాగంలో సక్రమంగా పనిచేయడానికి సరిపోతుంది. ఒకవేళ మీరు తప్పనిసరిగా స్నానం చేయాలనుకుంటే, స్నానం చేసిన తర్వాతే భోజనం చేయడం అత్యంత శ్రేయస్కరం. స్నానం చేసినప్పుడు శరీరం ఉత్తేజితమై, జీర్ణక్రియకు సిద్ధంగా ఉంటుంది. కాబట్టి మీ జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండాలంటే మరియు గుండెపై అనవసర ఒత్తిడి పడకుండా ఉండాలంటే భోజనం తర్వాత వెంటనే స్నానం చేసే అలవాటును ఇప్పుడే మానుకోండి.     [ Bath After Eating, Digestion, Digestive Health, Ayurveda, Jatharagni, Blood Circulation, Acid Reflux, Indigestion, Bloating, Healthy Habits ]
నేటి ఆధునిక ప్రపంచంలో ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా నాన్  వెజ్ ప్రియులు ప్రతిరోజూ తమ ఆహారంలో మాంసాహారాన్ని భాగం చేసుకుంటున్నారు. అయితే,  మాంసాహారం తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా.  అనే ప్రశ్న చాలా కాలంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై అంతర్జాతీయ నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరియు క్యాన్సర్ పరిశోధనా సంస్థలు జరిపిన సమగ్ర అధ్యయనాలలో అనేక దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. రోజూ తీసుకునే మాంసాహార రకం, దానిని వండే పద్ధతి మరియు తీసుకునే మోతాదు ఆధారంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు మారుతాయని ఈ పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC) నివేదికల ప్రకారం, ప్రాసెస్ చేసిన మాంసం (Processed Meat) అంటే హామ్‌స్, సాసేజ్‌లు, బెకన్, హాట్ డాగ్స్ వంటి వాటిని  గ్రూప్ 1 కార్సినోజెన్  (Group 1 Carcinogen) గా వర్గీకరించారు. అంటే ధూమపానం లేదా పొగాకు వాడకం లాగే ప్రాసెస్డ్ మీట్ కూడా మానవులలో క్యాన్సర్‌కు స్పష్టమైన కారణమవుతుందని ఆధారాలు ఉన్నాయి. ప్రతిరోజూ కేవలం 50 గ్రాముల ప్రాసెస్ చేసిన మాంసాహారాన్ని తినడం వల్ల కొలొరెక్టల్ క్యాన్సర్ (ప్రేగు క్యాన్సర్) వచ్చే ప్రమాదం ఏకంగా 18 శాతం పెరుగుతుందని శాస్త్రీయంగా నిరూపించబడింది. ఈ ప్రాసెస్డ్ మాంసంలో రుచి, రంగు మరియు నిల్వ కాలం పెంచడానికి వాడే సోడియం నైట్రేట్, నైట్రైట్స్ వంటి రసాయనాలు జీర్ణక్రియలో అత్యంత ప్రమాదకరమైన నైట్రోసో సమ్మేళనాలుగా మారి ప్రేగుల కణజాలాన్ని దెబ్బతీస్తాయి. మరోవైపు, రెడ్ మీట్ అంటే మేక, గొర్రె, పంది, ఎద్దు వంటి జంతువుల మాంసాన్ని IARC  గ్రూప్ 2A కార్సినోజెన్  (Group 2A Carcinogen) వర్గంలో చేర్చింది. అంటే ఇది మానవులలో క్యాన్సర్ కలిగించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రతిరోజూ 100 గ్రాముల రెడ్ మీట్ తీసుకోవడం వల్ల ప్రేగు క్యాన్సర్ ప్రమాదం 17 శాతం వరకు పెరుగుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. రెడ్ మీట్‌లో సహజంగా ఉండే  హీమ్ ఐరన్  (Heme Iron) కణాలలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను పెంచి, డిఎన్‌ఏను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది క్రమంగా ప్రేగులు, ప్రోస్టేట్ మరియు ప్యాంక్రియాటిక్ (క్లోమం) క్యాన్సర్లకు దారితీస్తుంది. మాంసం రకమే కాకుండా, దానిని మనం వండే పద్ధతి కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని నిర్ధారిస్తుంది. మాంసాహారాన్ని డైరెక్ట్ మంటపై బొగ్గులపై కాల్చడం (Barbecue/Grilling), అధిక ఉష్ణోగ్రత వద్ద సుదీర్ఘకాలం వేయించడం (Deep Frying) లేదా మాడిపోయేలా వండడం వల్ల అందులో హెటెరోసైక్లిక్ అమైన్లు (HCAs), పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు (PAHs) అనే అత్యంత విషపూరితమైన రసాయనాలు ఉత్పన్నమవుతాయి. ఈ రసాయనాలు మానవ శరీరంలోని డిఎన్‌ఏ నిర్మాణంలో ఉత్పరివర్తనలు (Mutations) తీసొచ్చి క్యాన్సర్ కణాల ఉత్పత్తికి బీజం వేస్తాయి. అయితే మాంసాహారం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని, సరైన జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాన్ని చాలావరకు తగ్గించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. వారానికి 350 నుండి 500 గ్రాముల కంటే ఎక్కువ రెడ్ మీట్ తినకూడదని, ప్రాసెస్డ్ మీట్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. రెడ్ మీట్‌కు ప్రత్యామ్నాయంగా చికెన్, చేపలు, కోడిగుడ్లు వంటి వైట్ మీట్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదం ఉండకపోగా, శరీరానికి మేలు జరుగుతుంది. అలాగే మాంసంతో పాటు ప్రతిరోజూ పీచు పదార్థం (Fiber) ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు మరియు విటమిన్ సీ ఉండే పండ్లు తీసుకోవడం వల్ల ప్రేగుల్లో క్యాన్సర్ కారక రసాయనాల ప్రభావం తగ్గుతుంది. ఆరోగ్యకరమైన వంట పద్ధతులు పాటించడం, మసాలాలు తగ్గించడం ద్వారా ఆరోగ్యంగా ఉంటూ మాంసాహారాన్ని ఆస్వాదించవచ్చు.     [ Processed Meat, Red Meat, Cancer Risk, Colorectal Cancer, IARC, WHO, Group 1 Carcinogen, Heme Iron, HCAs, PAHs ]  
ఆధునిక కాలంలో ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండానే మనస్సులో ఆందోళన, భయం, ఒక రకమైన అశాంతి కలగడం చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.  బయటకు  పరిస్థితులన్నీ బాగున్నప్పటికీ, లోపల ఏదో తెలియని బెంగ మనశ్శాంతిని దూరం చేస్తుంది. దీనికి ఏదో పెద్ద సమస్యే కారణం కావాల్సిన అవసరం లేదు. మనకు తెలియకుండానే మనం పాటించే కొన్ని చిన్న చిన్న జీవనశైలి అలవాట్లే మన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ, ఆందోళనను పెంచుతాయని నిపుణులు చెప్తున్నారు. అవేంటో వివరంగా తెలుసుకుంటే.. శారీరక శ్రమ లేకపోవడం.. శారీరక శ్రమ లేకపోవడం  మనసుపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. రోజంతా ఒకే చోట కూర్చుని ఉండటం వల్ల శరీరంలో రక్తప్రసరణ మందగించడమే కాకుండా, మనస్సుకు ఉపశమనం కలిగించే హార్మోన్ల విడుదల తగ్గుతుంది. క్రమం తప్పకుండా చిన్నపాటి వ్యాయామం లేదా నడక చేయడం వల్ల మెదడులో ఎండోర్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి మూడ్‌ను మెరుగుపరుస్తాయి. శారీరక చురుకుదనం తగ్గినప్పుడు మనస్సులో నెగిటివ్ ఆలోచనలు పెరిగి ఆందోళనకు దారితీస్తాయి. సోషల్ మీడియా.. నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వినియోగం శృతిమించడం మానసిక అశాంతికి మరో ముఖ్యమైన కారణం. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు నిరంతరం ఫోన్ స్క్రీన్‌ను చూడటం, ఇతరుల జీవితాలతో మన జీవితాన్ని పోల్చుకోవడం వంటివి తెలియకుండానే ఒత్తిడిని పెంచుతాయి. డిజిటల్ స్క్రీన్ల నుంచి వచ్చే కాంతి నిద్ర లేమికి కారణమవుతుంది. సరిపడా నిద్ర లేకపోవడం వల్ల మెదడు అలసిపోయి, చిరాకు , భయాలు పెరిగే అవకాశం ఉంది. చెడు అలవాట్లు.. మద్యపానం లేదా ఇతర వ్యసనాలు తాత్కాలికంగా ఉపశమనాన్ని ఇచ్చినట్లు అనిపించినప్పటికీ, ఎక్కువ  కాలంలో అవి మానసిక ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తాయి. ఇవి నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపి, ఆందోళన తీవ్రతను మరింత పెంచుతాయి. శరీరం ఈ పదార్థాలపై ఆధారపడటం మొదలైనప్పుడు  అశాంతి మరింత తీవ్రమవుతుంది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు.. మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి రోజూ కొంత సమయం వ్యాయామానికి కేటాయించడం, సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించి నచ్చిన పనులపై దృష్టి పెట్టడం, క్రమశిక్షణతో కూడిన ఆహారపు అలవాట్లు , మంచి నిద్రను అలవర్చుకోవడం ఎంతో అవసరం. జీవనశైలిలో చేసుకునే ఈ చిన్న మార్పులు మానసిక ఒత్తిడిని తగ్గించి జీవితంలో ప్రశాంతతను నింపుతాయి.                                                                                                                                                  *రూపశ్రీ.
మధుమేహం ఉన్నవారు రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడానికి ఆహారం, జీవనశైలి, ఒత్తిడి నియంత్రణతో పాటు వివిధ సంప్రదాయ పద్ధతుల గురించి కూడా తెలుసుకోవాలని అనుకుంటారు. అలాంటి వారికి ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన విషయాలను Dr. Ch. Madhusudhana Sharma ఈ వీడియోలో వివరిస్తున్నారు. మధుమేహం విషయంలో శరీరంలోని జీవక్రియలు, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి వంటి అంశాల పాత్ర ఏమిటి? సంప్రదాయ వైద్యంలో ఉపయోగించే కొన్ని సహజ పదార్థాలను ఎలా పరిగణిస్తారు? అనే విషయాలను డాక్టర్ వివరిస్తున్నారు. ఈ వీడియోలో ప్రత్యేకంగా 5 రకాల పొడులు/చూర్ణాల గురించి ప్రస్తావించారు: త్రిఫల చూర్ణం, పసుపు, మెంతులు, పొడపత్రి (మధునాశిని), కాకరకాయ పొడి.  ఈ పదార్థాలను సంప్రదాయ వైద్య విధానంలో ఎలా ఉపయోగిస్తారు? వాటి ప్రత్యేకత ఏమిటి? మధుమేహం ఉన్నవారు వీటి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి? వంటి అంశాలను వీడియోలో వివరంగా తెలుసుకోవచ్చు. అలాగే, మధుమేహాన్ని కేవలం మందులతో మాత్రమే కాకుండా ఆహారం, జీవనశైలి, శారీరక చురుకుదనం, మానసిక ఒత్తిడి నియంత్రణ వంటి అంశాలతో కలిపి ఎలా నిర్వహించుకోవాలనే విషయాలపై కూడా వీడియోలో అవగాహన కల్పిస్తున్నారు. డయాబెటిస్ మందులు ఇప్పటికే వాడుతున్నవారు తమంతట తాముగా మందుల మోతాదును తగ్గించడం లేదా ఆపడం చేయకూడదు. ఈ వీడియోలో చెప్పే పొడులు లేదా ఇతర సహజ పదార్థాలను ఉపయోగించే ముందు మీ వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది. త్రిఫల, పసుపు, మెంతులు, మధునాశిని, కాకరకాయ పొడుల గురించి డాక్టర్ ఏం చెబుతున్నారు? మధుమేహం నియంత్రణలో ఆహారం, జీవనశైలి, ఒత్తిడి నిర్వహణ ఎందుకు ముఖ్యమైనవి? తెలుసుకోవడానికి పూర్తి వీడియోను చూడండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. డయాబెటిస్ మందులను వైద్యుల సలహా లేకుండా ఆపడం లేదా మోతాదు మార్చడం చేయకండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  
రోజువారీ జీవితంలో గంటల తరబడి ఒకే చోట కూర్చొని పనిచేయడం లేదా కంప్యూటర్, మొబైల్ ఫోన్లు ఎక్కువగా వాడటం వల్ల మెడ పట్టుకుపోవడం, మెడ నొప్పి రావడం సాధారణంగా మారిపోయింది. ఈ నొప్పి తీవ్రమైతే కొందరిలో సర్వైకల్ పెయిన్ రూపంలో ఇబ్బంది పెడుతుంది. ఇలాంటి సమయంలో మెడ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది సొంత వైద్యాలు లేదా చిట్కాలు పాటిస్తుంటారు. అందులో   చాలామంది పాటించే ఉపాయం దిండు లేకుండా నిద్రపోవడం. దిండును పక్కన పెడితే మెడ నొప్పి పూర్తిగా తగ్గిపోతుందనే నమ్మకం చాలామందిలో ఉంది. అయితే ఇది నిజమేనా లేదా కేవలం ఒక అపోహ మాత్రమేనా అనే విషయాలను వివరంగా తెలుసుకుంటే.. దిండు లేకుండా నిద్రపోవడం వల్ల మెడ నొప్పి తగ్గిపోతుందా? మెడ నొప్పి తగ్గాలంటే వెంటనే దిండు వాడటం ఆపేయాలని చాలామంది భావిస్తారు. కానీ వైద్య నిపుణుల ప్రకారం ఇందులో ఎలాంటి నిజం లేదు. మన వెన్నుపాము నిర్మాణం పూర్తిగా సూటిగా, నేరుగా ఉండదు. మెడ భాగంలో వెన్నుపాము స్వల్పంగా వంపు తిరిగి ఉంటుంది. నిద్రపోతున్న సమయంలో ఈ వంపుకు సరైన సపోర్ట్ లభించడం చాలా అవసరం. దిండు లేకుండా పడుకున్నప్పుడు ఏం జరుగుతుంది? వెల్లకిలా పడుకున్నప్పుడు  దిండు వాడకపోతే తల వెనుకకు వాలిపోతుంది. దీనివల్ల మెడ భాగంలోనూ, పరుపుకు మధ్య ఖాళీ ఏర్పడుతుంది. ఈ ఖాళీ వల్ల మెడ కండరాలు, లిగమెంట్లపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. మెడ  సహజమైన వంపు చదునుగా మారే ప్రమాదం ఉంది. ఫలితంగా ఉదయం లేచేసరికి మెడ నొప్పి తగ్గకపోగా మరింత ఎక్కువవుతుంది.  ఒక పక్కకు తిరిగి పడుకునే అలవాటు ఉన్నవారికి భుజానికి, మెడకు మధ్య చాలా ఖాళీ ఉంటుంది. దిండు లేకపోతే తల పరుపు వైపు క్రిందికి వంగిపోతుంది. దీనివల్ల మెడ నరాలపై విపరీతమైన ఒత్తిడి పడి నరాలు లాగడం, తీవ్రమైన నొప్పి రావడం జరుగుతుంది. ఇది దీర్ఘకాలిక సర్వైకల్ సమస్యలకు దారితీస్తుంది. సరైన దిండును ఎలా ఎంచుకోవాలి? మెడ నొప్పి తగ్గడానికి దిండును పూర్తిగా మానేయడం పరిష్కారం కాదు, సరైన దిండును ఎంచుకోవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. దిండు మందం చాలా ముఖ్యం. అది మరీ ఎత్తుగా లేదా మరీ పలచగా ఉండకూడదు. నిద్రపోయేటప్పుడు  నొసలు, గడ్డం ఒకే స్థాయిలో సమాంతరంగా ఉండేలా దిండు సహకరించాలి. దిండు బాగా ఎత్తుగా ఉంటే గడ్డం ఛాతీ వైపు ఒంగిపోతుంది. అలాగే దిండు బాగా పలచగా ఉంటే తల వెనుకకు వాలిపోతుంది. ఇవి రెండూ మెడకు హానికరమే. పక్కకు తిరిగి పడుకునే అలవాటు ఉన్నవారు తమ భుజం చివర నుండి మెడ వరకు ఉండే దూరానికి సరిపోయేంత మందం ఉన్న దిండును ఎంచుకోవడం మంచిది. నిద్రపోయే భంగిమతో పాటు సరైన సపోర్ట్ ఇచ్చే దిండును వాడటం ద్వారా మాత్రమే మెడ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. తీవ్రమైన మెడ నొప్పి లేదా నరాల ఒత్తిడి ఉన్నప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోకుండా వైద్యులను సంప్రదించి తగిన సలహా తీసుకోవడం మంచిది.                                                                                                                                                   *రూపశ్రీ.