తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయ నిథి స్టాలిన్ ను పోలీసులు అరెస్టు చేశారు.  ముఖ్యమంత్రి విజయ్, ప్రముఖ నటి త్రిషను ఉద్దేశించి ఉదయనిధి స్టాలిన్ సోమవారం (ఆగస్టు 3) చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు వెలువడిన కేవలం 24 గంటల వ్యవధిలోనే చెన్నై పోలీసులు  ఉదయనిథి స్టాలిన్ ను అదుపులోనికి తీసుకున్నారు.  అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి  ఉదయనిధి స్టాలిన్‌పై   ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, మంగళవారం (ఆగస్టు 4)ఉదయం ఉదయనిథి స్టాలిన్ ను ఆయన నివాసంలోనే అరెస్టు చేసి తీసుకెళ్లారు.  నివాసం నుంచి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అసలు వివాదం ఏమిటంటే.. సోమవారం (ఆగస్టు 3) తంజావూరులో కావేరి  జలాల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన   బహిరంగ  సభలో ఉదయనిథి స్టాలిన్     ముఖ్యమంత్రి  విజయ్ పాలనపై, ఆయన రాజకీయ విధానాలపై విమర్శలు చేశారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో కొందరు డీఎంకే  కార్యకర్తలు..   విజయ్ వ్యక్తిగత విషయాలు, సినిమాలను ప్రస్తావిస్తూ..  త్రిష అంటూ నినాదాలు చేశారు. వాటికి స్పందనగా.. ఉదయ నిథి స్టాలిన్  నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు.  ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని సర్ది చెప్పుకోవడానికి ప్రయత్నించినా.. ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.  సోషల్ మీడియా వేదికగా ఉదయనిథి స్టాలిన్   వ్యాఖ్యల వీడి యోలు  తెగ వైరల్ అవ్వడంతో వివాదం మరింత ముదిరింది.  ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో తమిళనాడు హోంశాఖ,  చెన్నై పోలీసులు చట్టపరమైన చర్యలకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా శ్రీకారం చుట్టారు.  కాగా ఉదయనిథి స్టాలిన్ అరెస్టును డీఎంకే తీవ్రంగా ఖండించింది.   డీఎంకే లీగల్ సెల్  మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. డీఎంకే తరఫు న్యాయవాదులు మద్రాస్ హైకోర్టులో బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. అదలా ఉంటే..  డీఎంకే నేతలు ఉదయనిథి స్టాలిన్ అరెస్టును రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణిస్తుంటే..   ప్రభుత్వం  చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎవరూ  చట్టానికి అతీతులు కారని అంటోంది.  రాజకీయ పరిశీలకులైతే.. ప్రజా క్షేత్రంలో ఉండే నాయకులు బాధ్యతా యుతంగా మాట్లాడాలనీ, అనుచిత వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు ఇలానే ఉంటాయనీ అంటున్నారు.   Udayanithi Stalin arrested, Tamilnadu, Former, Deputy CM, Untoward, Comments, Actress, Trisha
తమిళనాట రాజకీయ విమర్శలకు త్రిష మరో సారి కేంద్ర బిందువుగా మారారు. త్రిషపై డీఎంకే నాయకుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అధికార టీవీకే, బీజేపీ, ఇతర రాజకీయ పార్టీలూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి.  తంజావూరులో కావేరి  జలాల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన   బహిరంగ  సభలో ఉదయనిథి స్టాలిన్     ముఖ్యమంత్రి  విజయ్ పాలనపై, ఆయన రాజకీయ విధానాలపై విమర్శలు చేశారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో కొందరు డీఎంకే  కార్యకర్తలు..   విజయ్ వ్యక్తిగత విషయాలు, సినిమాలను ప్రస్తావిస్తూ..  త్రిష అంటూ నినాదాలు చేశారు. వాటికి స్పందనగా.. ఉదయ నిథి స్టాలిన్  నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు.  ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా,  ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.    సోషల్ మీడియా వేదికగా ఉదయనిథి స్టాలిన్   వ్యాఖ్యల వీడియోలు  వైరల్ అవ్వడంతో వివాదం మరింత ముదిరింది.  ఉదయనిధి స్టాలిన్  ద్వంద్వార్థ వ్యాఖ్యలపై   టీవీకే, బీజేపీ  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. టీవీకే ఎమ్మెల్యే రేవంత్ చరణ్..   ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు.   ప్రజాజీవితం ఉన్న  నాయకుడు మహిళల పట్ల ఇలాంటి చౌకబారు భాషను ఉపయోగించడం డీఎంకే  దిగజారుతున్న రాజకీయ సంస్కృతికి అద్దం పడుతోందని విమర్శించారు.  అలాగే..  బీజేపీ   కూడా ఉదయనిథి స్టాలిన్  వ్యాఖ్యలను  ఖండించింది. మహిళలను కించపరిచేలా మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని   డిమాండ్ చేసింది. ఈ వివాదాన్ని టీవీకే అధిష్టానం  తీవ్రంగా పరిగణించింది. కేవలం రాజకీయ విమర్శలతో సరిపెట్టకుండా చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది.  ఉదయనిధి స్టాలిన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ కు అఫీషియల్ గా లేఖ రాసింది. సొసైటీలో ఎంతో గుర్తింపు పొందిన ఒక ప్రముఖ నటిని, మహిళను బహిరంగ వేదికపై అగౌరవపరిచినందుకు గాను ఆయనపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.  సమాజానికి, బాధితురాలికి ఆయన బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని, ఆయనపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్‌ను కోరింది.   Udhayanidhi Stalin, Actress Trisha, DMK TVK controversy, Cauvery water protest, Tamil Nadu news, NCW complaint
బీహార్ లోని  బంకీపూర్ అసెంబ్లీ నియోజక వర్గ ఉపఎన్నికలో జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త  ప్రశాంత్ కిషోర్  విజయం సాధించారు.  మూడు దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న బంకీపూర్ నియోజకవర్గం నుంచి పీకే సాధించిన ఈ విజయం బీహార్ రాజకీయాలలో సంచలనంగా మారింది. పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై  20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో  విజయం సాధించారు.  ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది.   నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి  ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు  నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు. ఇటీవల నితిన్ నబీన్ ను బీజేపీ రాజ్యసభకు పంపడంతో బంకీపూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.  ఈ ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ అనూహ్యంగా విజయం సాధించి బీజేపీకి గట్టి షాక్ ఇచ్చారు.   Prashantkumar win bamkipur by poll, election, Straregist, Shock, BJP
ALSO ON TELUGUONE N E W S
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో 'ది ప్యారడైజ్' మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ యాక్షన్ డ్రామాను సెప్టెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీని తర్వాత సుజీత్ డైరెక్షన్ లో 'బ్లడీ రోమియో' అనే యాక్షన్ ఎంటర్‌టైనర్ చేయనున్నాడు నాని. అయితే నాని 'ది ప్యారడైజ్' ఆలస్యం కావడంతో.. సుజీత్ తన ఫోకస్ ని పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ 'ఓజీ-2'పైకి షిఫ్ట్ చేసినట్లు వార్తలొచ్చాయి. 'ఓజీ-2' పూర్తయిన తర్వాత 'బ్లడీ రోమియో' ఉంటుందని ప్రచారం జరిగింది. దీంతో నాని ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తూ ఓ క్రేజీ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. 'బ్లడీ రోమియో' రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది అక్టోబర్ నుంచే ప్రారంభం కాబోతోందట. మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత లండన్ లో భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేశారట. ఏమాత్రం విరామం ఇవ్వకుండా ఒకే విడతలో ఈ లండన్ షెడ్యూల్ ను డిసెంబర్ కల్లా  కంప్లీట్ చేయాలని మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం. మొత్తానికి ఈ లేటెస్ట్ న్యూస్ ను బట్టి చూస్తే.. 'బ్లడీ రోమియో' పూర్తయిన తర్వాతే 'ఓజీ-2' పట్టాలెక్కే అవకాశముంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందేమో చూడాలి.      Bloody Romeo, Nani, Sujeeth, OG2, Pawan Kalyan  
  తెలుగు చిత్ర పరిశ్రమని  కుదిపేస్తున్న  సినీ అండ్ టీవీ డ్యాన్సర్స్ అసోసియేషన్ (TFTDDA) వివాదం మళ్లీ మొదటికొచ్చింది. గడిచిన కొద్ది రోజులుగా జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వివాదంతో పాటు యూనియన్ అంతర్గత రాజకీయం తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సాధారణ సర్వసభ్య సమావేశంలో బయటపడిన ఈ వివాదం, ఇప్పుడు లేబర్ కమిషనర్ కార్యాలయానికి చేరుకోవడమే కాకుండా న్యాయస్థానం మెట్లు ఎక్కే స్థాయికి చేరింది. ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (TFIEF) దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఇటీవల కార్మిక కమిషనర్ సమగ్ర విచారణ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే, ఈ కీలక సమావేశానికి డ్యాన్సర్స్ అసోసియేషన్ నాయకత్వం గైర్హాజరు కావడం ఇప్పుడు చిత్రసీమలో తీవ్ర ఉత్కంఠని  పెంచింది.   అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతా దేవి గతంలో అందించిన వినతిపత్రాన్ని పరిగణనలోకి తీసుకున్న కార్మిక కమిషనర్, వివాద పరిష్కారానికి ఇరువర్గాలను పిలిపించారు. కానీ, అసోసియేషన్ ప్రతినిధులు హాజరుకాకపోవడమే కాకుండా, ప్రస్తుతం ఈ వ్యవహారం హైకోర్టు పరిశీలనలో ఉన్నందున తుది తీర్పు వచ్చే వరకు ఎన్నికలు నిర్వహించవద్దంటూ ఒక ప్రత్యేక లేఖను సమర్పించారు. మరోవైపు, టాలీవుడ్‌లోని 24 విభాగాలకు చెందిన వేలాది మంది కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఫెడరేషన్ ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల ప్రక్రియ సుఫీడంగా పూర్తి కావడానికి రెండు కీలకమైన ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను కార్మిక శాఖ కమిషనర్ ముందు ఉంచారు.  ఈ వివాదం వెనుక సుదీర్ఘమైన ఆర్థిక, పాలనాపరమైన కారణాలు ఉన్నాయి. గత కమిటీ హయాంలో నిధుల దుర్వినియోగం జరిగిందని, దాదాపు 10 మందికి పైగా కార్యవర్గ సభ్యులు రాజీనామా చేయడంతో వివాదం చెలరేగింది. ఖాళీ అయిన పదవులకే బై-ఎలక్షన్స్ నిర్వహించాలని అసోసియేషన్ వాదిస్తుండగా, మొత్తం కార్యవర్గాన్ని రద్దు చేసి కొత్తగా పూర్తిస్థాయి ఎన్నికలు జరపాలని ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. గతంలో నిర్వహించిన ఒక అంతర్గత ఓటింగ్‌లో మొత్తం 78 మంది సభ్యులు పాల్గొనగా, అందులో 75 మంది బై-ఎలక్షన్స్‌కే మద్దతు తెలపడం విశేషం. అయితే ఫెడరేషన్ మాత్రం పూర్తి వర్గ ఎన్నికలకే మొగ్గు చూపుతూ, సహకరించకపోతే 'నాన్ కోఆపరేషన్' నిర్ణయాన్ని అమలు చేస్తామని హెచ్చరించడం పరిశ్రమలో ఆందోళన కలిగిస్తోంది.  డ్యాన్సర్ల సంక్షేమం పేరుతో తెరపైకి వచ్చిన ఈ పోరు వెనుక లక్షల రూపాయల ఆర్థిక లావాదేవీలు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. Also read: 29 ఏళ్ళ ఏజ్ గ్యాప్ హీరోతో మీనాక్షి చౌదరి.. సినిమా సూపర్ హిట్ అవుతుందా!  ఒక కొత్త డ్యాన్సర్ అసోసియేషన్ సభ్యత్వం పొందేందుకు సుమారు ₹6 లక్షల రూపాయల కార్డ్ ఫీజు వసూలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో, జానీ మాస్టర్ డ్యాన్సర్ల హెల్త్ ఇన్సూరెన్స్ ఫండ్ కోసం ₹18 లక్షల రూపాయల చెక్కును అందించారని క్లారిటీ ఇచ్చినప్పటికీ, రాజీనామాల వెనుక పెద్ద కుట్ర ఉందనే ప్రచారం కొనసాగుతూనే ఉంది. అసోసియేషన్ సుమారు 1.5 ఏళ్ల పదవీ కాలం ఇంకా మిగిలి ఉందని, నిధుల దుర్వినియోగాన్ని ప్రశ్నించినందుకే తమపై బురద జల్లుతున్నారని ప్రస్తుత నాయకత్వం స్పష్టం చేస్తోంది.  షూటింగ్‌లు ఆగిపోకుండా ఉండాలన్నా, వేలాది మంది సీనియర్, జూనియర్ డ్యాన్సర్ల ఉపాధి దెబ్బతినకుండా ఉండాలన్నా ఈ రగడకు త్వరగా ముగింపు పలకడం చాలా అవసరం. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు పెద్దలు ఈ విషయంలో జోక్యం చేసుకున్నప్పటికీ, చట్టపరమైన సమస్యలు పరిష్కారమయ్యే వరకు డ్యాన్సర్స్ అసోసియేషన్ రాజకీయాలు సద్దుమణిగేలా కనిపించడం లేదు. హైకోర్టు ఇవ్వబోయే ఆదేశాలు మరియు లేబర్ కమిషనర్ తీసుకోబోయే నిర్ణయంపైనే టాలీవుడ్ డ్యాన్సర్ల భవిష్యత్తు ఆధారపడి ఉంది. Jani master, Sekhar master, Tollywood
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కించిన హారర్ కామెడీ ఫిల్మ్ 'కొరియన్ కనకరాజు'. రాయలసీమకు చెందిన కనకరాజు అనే సాధారణ యువకుడి శరీరంలోకి కొరియా దేశం నుంచి వచ్చిన ఒక ఆత్మ ప్రవేశించడంతో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది. ఆగస్టు 7న థియేటర్లలో అడుగు పెట్టనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై మంచి అంచనాలే నెలకొన్నాయి. ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆకట్టుకోవడంతో బిజినెస్ భారీగానే జరిగింది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ లెక్కలను పరిశీలిస్తే, బాక్సాఫీస్ బరిలోకి దిగకముందే నిర్మాతలు సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దాదాపు రూ. 38 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకి సంబంధించిన నాన్-థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ. 26 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. సినిమా బడ్జెట్ లో చాలావరకు నాన్-థియేట్రికల్ డీల్స్ ద్వారానే రికవరీ కావడం మేకర్స్‌కు లభించిన అతిపెద్ద విజయం అని చెప్పవచ్చు. ఇక వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే, రూ.15 కోట్లకు పైగా బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. బ్రేక్ ఈవెన్ సాధించి, హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే.. రూ.16 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతం నెలకొన్న బజ్ కి, పాజిటివ్ టాక్ తోడైతే.. ఈ టార్గెట్ రీచ్ అవ్వడం అనేది చిన్న విషయమే అని చెప్పొచ్చు.  మరి ఈ 'కొరియన్ కనకరాజు' ఆగస్టు 7న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్ల వర్షం కురిపిస్తుందో, ఎంతటి సంచలనాలు నమోదు చేస్తుందో వేచి చూడాలి.     Korean Kanakaraju, Business, Varun Tej, Merlapaka Gandhi  
    మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary).. ఎనీ హీరో మీనాక్షి డేట్స్ ఖాళీగా ఉన్నాయేమో చూడండనే పరిస్థితి. అంతలా లక్కీ హీరోయిన్ హోదాలో దూసుకుపోతుంది. సితార లాంటి అగ్ర నిర్మాణ సంస్థ మీనాక్షి లేకుండా సినిమా తెరకెక్కించే పరిస్థితి లేదు. దీన్ని బట్టి ఈ ముద్దు గుమ్మ హవాని అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో మీనాక్షి చౌదరి పేరు సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. దానికి కారణం ఆమె నటిస్తున్న చిత్రాల్లోని హీరోలతో ఏజ్ గ్యాప్. ముఖ్యంగా సీనియర్ స్టార్ హీరోల సరసన ఆమె వరుసగా అవకాశాలు దక్కించుకోవడం సినీ విశ్లేషకులను, అభిమానులను విస్తుపోయేలా చేస్తోంది. ఉదాహరణకు, 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంలో విక్టరీ వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలో నటించింది.  వెంకటేష్ వయస్సు ప్రస్తుతం 64 ఏళ్లు కాగా మీనాక్షి వయస్సు 27 ఏళ్ళు. అంటే వెంకటేష్‌కు, మీనాక్షికి మధ్య దాదాపు 36 నుంచి 37 ఏళ్ల భారీ వయసు వ్యత్యాసం ఉంది.  Also read: ముగ్గురు స్టార్ హీరోల సినిమాల రిలీజ్ పోస్ట్ పోన్.. ఫ్యాన్స్ లో కలవరం  ఇది కేవలం ఒక్క సినిమాకే పరిమితం కాలేదు. తమిళ సూపర్‌స్టార్ విజయ్ 50 ఏళ్ల వయస్సులో నటించిన 'GOAT' చిత్రంలోను  మీనాక్షి కథానాయికగా అలరించింది. అక్కడ కూడా వారి మధ్య దాదాపు 23 ఏళ్ల వయస్సు తేడా స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు బాలీవుడ్ లోకి అడుగుపెడుతూ అక్షయ్ కుమార్ సరసన బాగం బాగ్ 2 తో జత కడుతుంది. అక్షయ్, మీనాక్షి మధ్య ఏజ్ గ్యాప్ 29 సంవత్సరాలు. ఈ విధంగా టాలీవుడ్, కోలీవుడ్ఎం బాలీవుడ్  అనే తేడా లేకుండా దాదాపు 25 నుంచి 30 ఏళ్లకు పైగా వయస్సు వ్యత్యాసం ఉన్న సీనియర్ హీరోల పక్కన జోడీగా నటించేందుకు మీనాక్షి అంగీకరించడం గమనార్హం. సాధారణంగా 20 ఏళ్ల వయస్సు తేడా ఉన్నప్పుడే నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తూ ఉంటారు, కానీ ఏకంగా 30 ఏళ్లకు పైగా వ్యత్యాసం ఉన్నప్పటికీ మీనాక్షి గ్లామర్ అండ్ యాక్టింగ్ టాలెంట్ వల్ల ఈ కాంబినేషన్లు తెరపై బాగా వర్కవుట్ అవుతుండడం విశేషం.మీనాక్షి స్వస్థలం  హర్యానా. 2021లో 'ఇచట వాహనములు నిలపరాదు' చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైంది.    Meenakshi chaudhary, Akshay Kumar  
Tom Holland and Zendaya are not just Hollywood's most talked-about couple—they are now its biggest box office force. With Christopher Nolan's The Odyssey and Spider-Man: Brand New Day dominating theatres across the globe, the duo has delivered one of the biggest months Hollywood has witnessed in recent years, with the two films together racing towards the $2 billion worldwide milestone. Released in July, The Odyssey opened to phenomenal response and quickly emerged as one of Christopher Nolan's highest-grossing films. Featuring both Tom Holland and Zendaya in pivotal roles, the epic adventure crossed the $912 million mark worldwide before the arrival of Marvel and Sony's next blockbuster. The momentum continued with Spider-Man: Brand New Day, where Holland returned as Peter Parker alongside Zendaya's MJ. The superhero spectacle shattered expectations with one of the biggest global openings in box office history, collecting US$ 932 Million, close to $1 billion worldwide within its opening weekend and pushing the combined total of the two films to nearly $2 billion. What makes the achievement even more remarkable is that the real-life couple headlines both of Hollywood's biggest releases of the summer. While The Odyssey showcased their dramatic chemistry in Nolan's grand vision, Spider-Man: Brand New Day reminded audiences why they remain one of cinema's most loved on-screen pairs. Their presence across two massive blockbusters has made them the undisputed faces of Hollywood's summer box office. The extraordinary success of the two films has also reaffirmed the power of event cinema. Premium formats, repeat audiences and strong word of mouth have driven collections across international markets, proving that audiences continue to flock to theatres for larger-than-life experiences. As the worldwide gross inches past the $2 billion mark, Tom Holland and Zendaya have firmly established themselves as Hollywood's newest power couple—not just in their personal lives, but at the global box office as well. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  హీరోల యందు స్టార్ హీరోలు వేరయా అనే రీతిలో స్టార్ హీరోల సినిమా వచ్చిందంటే చాలు  బాక్స్ ఆఫీస్ తో పాటు ఎంతో మంది కళకళలాడుతూ ఉంటారు. అసలు స్టార్ హీరోలు నాలుగు నెలలకి ఒక సినిమా చేసినా చాలు ఇండియా మొత్తం సుభిక్షంగా ఉంటుందనే సూత్రాన్ని అయితే  సినీ ప్రియులు చాలా బలంగా నమ్ముతూ ఉంటారు.  మరి  అలాంటి స్టార్ హీరోలు రిలీజ్ డేట్ విషయంలో వెనక్కి వెళ్తుండటం చర్చినీయాంశమయ్యింది. ధనుష్, రాజ్‌కుమార్ పెరియాసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ 'ఓమ్' (గతంలో D55) చిత్రం ప్రారంభం నుంచే ప్రేక్షక లోకంలో భారీ అంచనాలను నెలకొల్పింది. సాయి పల్లవి, శ్రీలీల, మమ్ముట్టి వంటి స్టార్ కాస్టింగ్‌తో రూపొందుతున్న ఈ సినిమా 2 నిమిషాల 32 సెకన్ల విజువల్స్ నిండిన టీజర్‌తో అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. మొదట ఈ చిత్రాన్ని దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16న థియేటర్లలోకి తీసుకురావాలని నిర్మాతలు అధికారికంగా నిర్ణయించారు. అయితే రజినీకాంత్ ప్రతిష్టాత్మక చిత్రం  'జైలర్ 2' అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుండటంతో, నేరుగా సూపర్ స్టార్‌తో బాక్సాఫీస్ పోరు వద్దనుకున్న ధనుష్ బృందం తమ సినిమాను దీపావళి బరిలోకి అంటే నవంబర్ 5 లేదా 6 వ తేదీకి వాయిదా వేయాలని భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కానీ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ముందుగా అనుకున్న అక్టోబర్ 16 తేదీకే స్ట్రీమింగ్ విండో లాక్ కావడంతో విడుదల మార్పుకు ఒప్పుకోవడం లేదని, దీనిపై చర్చలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. మరోవైపు వర్సటైల్ యాక్టర్ సూర్య, దర్శకుడు జితు మాధవన్‌తో కలసి చేస్తోన్న యాక్షన్ కామెడీ చిత్రం 'సూర్య 47' ఇటీవలె తన షూటింగ్ పనులను విజయవంతంగా పూర్తి చేసుకుంది. విభిన్నమైన పోలీస్ అధికారి పాత్రలో సూర్య కనిపించనున్న ఈ చిత్రంలో నజ్రియా నజీమ్ ఫహద్, నస్లేన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఆర్.జె. బాలాజీ దర్శకత్వంలో వచ్చిన 'కరుప్పు', ఆగస్టు 14న రాబోతున్న వెంకీ అట్లూరి చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్' తర్వాత, అదే ఏడాదిలో హ్యాట్రిక్ చిత్రంగా 'సూర్య 47' ను 2026 దీపావళి వేడుకల సందర్భంగా విడుదల చేయాలని నిర్మాతలు ప్రణాళికలు రచిస్తున్నారు.  Also read: ప్రముఖ నటులకి గాయాలు.. ఒకేసారి 40 బులెట్స్  అదే సమయంలో కోలీవుడ్ డైనమిక్ స్టార్ సిలంబరసన్ (సింబు) మరియు దిగ్గజ దర్శకుడు వెట్రిమారన్ కలయికలో రూపొందుతున్న భారీ గ్యాంగ్‌స్టర్ డ్రామా 'అరసన్' సైతం దీపావళి రేసులో ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ చిత్రం కోసం 5 నిమిషాల నిడివితో కూడిన ప్రత్యేక ప్రమోషనల్ వీడియోను అక్టోబర్ 16న థియేటర్లలో ప్రదర్శించి, ఆ మరుసటి రోజు యూట్యూబ్‌లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇలా దసరా మరియు దీపావళి పండగల రేసులో వరుసగా అగ్ర హీరోల సినిమాలు తమ విడుదల తేదీలను రీ-షెడ్యూల్ చేసుకుంటుండటంతో తమిళ బాక్సాఫీస్ వద్ద ఈ పండుగల సీజన్లలో ఎవరెవరు తలపడనున్నారో అని అభిమానులు అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. Dhanush, Simbu, Suriya
The countdown has officially begun for the teaser of Nani's The Paradise, and it has already become the talk of the town. With just two days left for its launch, excitement surrounding the film is at an all-time high. Directed by Srikanth Odela and produced by Sudhakar Cherukuri, the pan-world action spectacle has consistently remained one of the most talked-about Telugu films ever since its announcement glimpse grabbed global attention. The makers recently unveiled a striking new poster featuring Nani's fierce Jadal avatar with the reflection of a powerful eagle. The symbolism has sparked fresh discussions among fans, adding another layer of intrigue to the film. Nani's remarkable physical transformation, rugged body language and intense screen presence have already created massive expectations for what promises to be one of the biggest films of his career. The buzz has grown even stronger after Srikanth Odela described the upcoming teaser as "explosive." His confidence has further heightened curiosity, with audiences eager to witness the scale, action and visual grandeur the director has been promising. Fans are also keen to see whether the teaser will finally unveil the film's much-awaited theatrical release date. Music has played a major role in building the film's momentum. Anirudh Ravichander's background score for the promotional glimpses has become hugely popular, while the first single, Aaya Sher, has turned into a mass anthem by crossing 200 million views, further amplifying the excitement around the project. Mounted on the biggest budget of Nani's career, The Paradise is being positioned as a visually spectacular action entertainer with global appeal. With only two days to go for the teaser launch, expectations continue to soar, making it one of the most anticipated promotional events in recent Telugu cinema. The film also stars Raghav Juyal, Mohan Babu and Kayadu Lohar in pivotal roles. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
Varun Tej's Korean Kanakaraju has entered the final stage before its theatrical release, and the latest censor reports have added to the growing excitement surrounding the film. Directed by Merlapaka Gandhi, the horror-comedy has completed its censor formalities with a U/A certificate and a runtime of 2 hours and 36 minutes, with industry buzz suggesting the film is a thoroughly entertaining ride. The film has been generating curiosity ever since its announcement thanks to its innovative promotional campaign. The makers consistently kept audiences engaged with interesting updates, while the two released songs turned into chartbusters. However, it was the recently released trailer that significantly boosted the film's buzz and sparked widespread interest among moviegoers. According to inside reports, Korean Kanakaraju blends horror, comedy and cross-cultural confusion effectively, delivering entertainment from start to finish. Varun Tej is said to impress in a dual-shaded role, playing a simple and lovable Ananthapur native while also transforming into the menacing Korean mobster Four Fingers. His performance, along with Satya's comic timing and hilarious one-liners, is reportedly among the film's biggest strengths. Reports also praise Merlapaka Gandhi's screenplay for maintaining a fine balance between humor and horror while presenting a fresh concept. Thaman's music has already struck a chord with audiences, and his background score is said to elevate the overall experience. The film's technical quality has also earned appreciation for its scale and execution. With overwhelmingly positive censor talk and encouraging inside reports, Korean Kanakaraju has emerged as one of the most anticipated Telugu releases of the season. The film is all set to hit theatres on August 7, and expectations are steadily rising for Varun Tej's return to the big screen. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  మూవీ లవర్స్, రామభక్తులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ రామాయణ. భారతీయుల ఆధ్యాత్మిక జీవన విధానంతో ముడిపడి ఉన్న దశరధ రాముడు, కోదండ రాముడు, సీతా రాముడి కథ కావడంతో హిందువులంతా రిలీజ్ డేట్ నవంబర్ 8 కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మేకర్స్ కూడా రాముడి హోదాకి తగ్గట్టే మొదటి భాగాన్ని 2000 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించారు. దీన్ని బట్టి ఎంత ప్రెస్టేజియస్ట్ మూవీని అర్ధం చేసుకోవచ్చు.  ‘రామాయణ’విడుదలకి ముందే తమ సభ్యుల కోసం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయాలని, లేదంటే దేశవ్యాప్తంగా థియేటర్ల ముందు ఆందోళనలు చేపడతామని ‘శ్రీ రామ్‌లీలా మహాసంఘ్’ హెచ్చరిస్తుంది. ఈ మేరకు శ్రీ రామ్‌లీలా మహాసంఘ్ అధ్యక్షుడు అర్జున్ కుమార్ చిత్ర యూనిట్‌కి ఒక లేఖ రాశాడు.  ఆ లేఖలో 'సనాతన ధర్మం, సాంప్రదాయ రామలీల ప్రదర్శనలతో సంబంధం ఉన్న వ్యక్తులు, సంస్థల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకు ఈ ముందస్తు ప్రదర్శన అవసరం. హిందువుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసే దృశ్యాలు ఏవైనా ఉన్నాయేమోననే అనుమానం కూడా ఉంది. ఒక వేళ ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేయడానికి నిరాకరిస్తే, శ్రీ రామ్‌లీలా మహాసంఘ్‌తో పాటు ఇతర హిందూ సంఘాలు కలిసి దేశవ్యాప్తంగా సినిమా హాల్స్ వెలుపల నిరసనలు మరియు ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు…  ప్రభాస్ హీరోగా వచ్చిన ‘ఆదిపురుష్’ లో లంకని  బంగారానికి బదులుగా నలుపు రంగులో చూపడం…, రావణుడి రూపం, పాత్రల దుస్తులు, సంభాషణలు సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్నాయి. అదే తప్పులు మళ్లీ పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ డిమాండ్ చేస్తున్నాం. హిందువుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసే దృశ్యాలు ఏవైనా ఉన్నాయేమోననే అనుమానం కూడా ఉంది. సినిమా విడుదలయ్యే లోపు అటువంటి అభ్యంతరకర దృశ్యాలు లేదా డైలాగులు ఉంటే వాటిని గుర్తించి తొలగించాలి. also read: ఇక లీగల్ వార్నింగ్ ఉంటుంది.. వైరల్ గా మారిన మృణాల్  ఒక వేళ ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేయడానికి నిరాకరిస్తే, శ్రీ రామ్‌లీలా మహాసంఘ్‌తో పాటు ఇతర హిందూ సంఘాలు కలిసి దేశవ్యాప్తంగా సినిమా హాల్స్ వెలుపల నిరసనలు మరియు ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.  
మాచో స్టార్ గోపీచంద్ సినీ ప్రయాణం మొదలై 25 ఏళ్లు పూర్తయింది. 2001 ఆగస్టు 3న ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన 'తొలివలపు' సినిమా ద్వారా గోపీచంద్ హీరోగా తెలుగు వెండితెరకు పరిచయమయ్యారు. ప్రముఖ దర్శకుడు టి. కృష్ణ వారసుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ, మొదటి సినిమాతో ఆయనకు ఆశించిన విజయం దక్కలేదు. అయితే, సోలో హీరోగా విజయం లభించకపోయినా అధైర్యపడకుండా, విలన్ గా మారి తన సత్తా చాటారు.  2002లో తేజ దర్శకత్వంలో వచ్చిన 'జయం' సినిమా గోపీచంద్ నటనా జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ సినిమాలో 'రఘు' అనే క్రూరమైన విలన్ పాత్రలో ఆయన చూపించిన రౌద్రం, పవర్‌ఫుల్ పర్‌ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా వచ్చిన 'నిజం' (2003), ప్రభాస్ హీరోగా వచ్చిన 'వర్షం' (2004) సినిమాల్లో గోపీచంద్ చేసిన విలన్ పాత్రలు ఆయనకు ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి. విలన్‌గా విజయాల పరంపర కొనసాగుతున్న సమయంలోనే, మళ్లీ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు. 2004లో విడుదలైన 'యజ్ఞం'తో హీరోగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని నమోదు చేయడమే కాకుండా, ఆయనను పక్కా మాస్ హీరోగా నిలబెట్టింది. ఆ తర్వాత 'ఆంధ్రుడు', 'రణం', 'లక్ష్యం', 'శౌర్యం' వంటి విజయాలతో టాలీవుడ్‌లో 'మాచో స్టార్'గా ఎదిగారు. ముఖ్యంగా యాక్షన్ సినిమాలతో ఆయన మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కేవలం యాక్షన్ సినిమాలకే పరిమితం కాకుండా, 'లౌక్యం' వంటి పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌తో తనలోని అద్భుతమైన కామెడీ టైమింగ్‌ను కూడా ఆవిష్కరించారు. శ్రీవాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా గోపీచంద్ కెరీర్‌లోనే అతిపెద్ద కమర్షియల్ హిట్లలో ఒకటిగా నిలిచింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'గోలీమార్', చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కించిన 'ఒక్కడున్నాడు', 'సాహసం' సినిమాలు గోపీచంద్‌లోని నట వైవిధ్యాన్ని చాటిచెప్పాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ కొత్త తరహా కథలను ప్రోత్సహించే హీరోగా ఆయన తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. 2001 ఆగస్టు 3 నుండి ఇప్పటివరకు, అంటే ఈ 25 సంవత్సరాల సుదీర్ఘ నట ప్రయాణంలో గోపీచంద్ ఎన్నో ఎత్తుపల్లాలను, హెచ్చుతగ్గులను చూశారు. ఏ నాడూ గర్వాన్ని ప్రదర్శించకుండా, వివాదాలకు దూరంగా ఉంటూ కేవలం తన పనిపట్ల నిబద్ధతను చాటుకోవడం ఆయన ప్రత్యేకత. నటుడిగా పాతికేళ్లు పూర్తి చేసుకున్న ఈ శుభ తరుణంలో, అభిమానులు, టాలీవుడ్ ప్రముఖులు ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ 'భరతవర్ష', 'సింగ' వంటి వైవిధ్యభరితమైన సినిమాలతో బిజీగా ఉన్నారు.      Gopichand, 25 Years, Tollywood, Telugu Cinema  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
సహాయం.. మనిషికి ఉండాల్సిన మంచి గుణాలలో సహాయం చేయడం కూడా ఒకటి. ఆపదలో ఉన్నవారికి,  అవసరం లో ఉన్నవారికి,  ఇబ్బందులలో ఉన్నవారికి సహాయం చేయడం చాలామంచి లక్షణం.కానీ కొన్నిసార్లు, ఆలోచించకుండా చేసే సహాయం పెద్ద తలనొప్పిగా మారవచ్చు. చాణక్య నీతి ప్రకారం.. కొందరు వ్యక్తులకు సహాయం చేయడం వల్ల ఇబ్బందులు పడతారని, అంతే కాకుండా కొందరు వ్యక్తులకు సహాయం చేస్తే.. సహాయం చేసిన వారే నాశనం అవుతారని, తీవ్ర సమస్యలో చిక్కుకుంటారని చెబుతారు. అలాంటి మూడు రకాల వ్యక్తుల గురించి కూడా ఆచార్య చాణక్యుడు చెప్పాడు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. దుర్మార్గులు, చెడ్డ గుణం కలిగిన స్త్రీ, పురుషులు.. చెడ్డ మనసు లేదా చెడు గుణం కలిగిన , కోపిష్టి స్వభావం ఉన్నవారికి ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. అలాంటి వారికి సహాయం చేయడం అంటే మన కాళ్ళను  మనమే కాల్చుకోవడం లాంటిది. చెడ్డ   స్వభావం ఉన్నవారు ఎవరికీ స్నేహితులు కారు.  వారికి ఎంత దయ చూపినా,  అవకాశం దొరకగానే తిరిగి హాని చేయడానికి  వెనుకాడరు. అలాంటి వ్యక్తులకు సపోర్ట్ చేయడం  వల్ల సామాజిక హోదా , ప్రతిష్టపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందువల్ల అటువంటి వ్యక్తులకు సంబంధించిన ఏ విషయాలకు అయినా దూరంగా ఉండాలి. ఎప్పుడూ విచారంగా ఉండేవారు.. ఈ ప్రపంచంలో కొందరు ఎటువంటి కారణం లేకుండా ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు. అన్నీ ఉన్నప్పటికీ, వారు తమ విధిని, పరిస్థితులను ఎప్పుడూ  నిందించుకుంటూ ఉంటారు. ఇలాంటి నెది నెగిటివ్  మనస్తత్వం ఉన్నవారికి సహాయం చేయడం మానుకోవాలని చాణక్యుడు చెప్పాడు. అలాంటి వారు తమ జీవితంలో ఎప్పటికీ సంతోషంగా లేదా సంతృప్తిగా ఉండలేరు.  అలాంటి  వారికి సహాయం చేస్తే, వారి ప్రతికూల శక్తి  జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. క్రమంగా వారికి సహాయం చేసేవారు కూడా మానసిక ఒత్తిడికి గురై  సంతోషాన్ని కోల్పోతారు. మూర్ఖుడు.. మూర్ఖుడికి , బుద్ధిహీనుడికి ఏదైనా చెప్పడం,  మూర్ఖుడికి సలహా ఇవ్వడం లేదా సహాయం చేయడం అత్యంత మూర్ఖపు పనిగా చెబుతారు. తమ మంచి చెడులను తాము తెలుసుకోలేని వ్యక్తికి ఏదైనా వివరించడం పూర్తిగా సమయం వృధా చేసినట్టే. అలాంటి   సరైన మార్గంలోకి నడిపించడానికి ప్రయత్నించినప్పుడు, వారు తరచుగా  చెప్పేదాన్ని అపార్థం చేసుకుంటారు. అలాంటి వ్యక్తులు సహాయం అందించే వ్యక్తిని తమ శత్రువుగా భావిస్తారు. వారితో వాదించడం లేదా వారికి సహాయం చేయడానికి ప్రయత్నించడం వల్ల  మనశ్శాంతిని పూర్తిగా కోల్పోవాల్సి వస్తుంది. సహాయం చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.. ఇతరులకు సహాయం చేయడం అంటే తప్పనిసరిగా మిమ్మల్ని మీరు ప్రమాదంలో పడేసుకోవడం కాదు. సహాయం చేసే గుణం మంచిదే అయినప్పటికీ, ,తెలివిని  ఉపయోగించడం కూడా అంతే ముఖ్యం. ఎవరికైనా సహాయం చేసే ముందు, వారి ఉద్దేశాలను, ప్రవర్తనను జాగ్రత్తగా అంచనా వేయాలి. ఎదుటి వ్యక్తి మీ సహాయం చేసే గుణాన్ని  దుర్వినియోగం చేయవచ్చని మీకు అనుమానం వస్తే, వెంటనే వెనక్కి తగ్గడం మంచిది. మీ దయా గుణాన్ని ఎవరూ దుర్వినియోగం చేయకుండా ఉండేలా మీ హద్దులను మీరే ఏర్పరచుకోవడం నేర్చుకోవాలి. సరైన వ్యక్తికి సహాయం చేయడం సరైన వ్యక్తి సహాయం చేయడం చాలా మంచిది. మీరు అవసరంలో ఉన్న, నిజాయితీపరుడైన, నిష్కపటమైన వ్యక్తికి సహాయం చేసినప్పుడు,  తప్పకుండా ప్రతిఫలాన్ని పొందుతారు. సరైన వ్యక్తికి సహాయం చేయడం మనశ్శాంతిని ఇస్తుంది , సమాజంలో  గౌరవాన్ని పెంచుతుంది. మన సహాయ గుణాన్ని సరైన చోట ఉపయోగించాలని చాణక్య నీతి  బోధిస్తుంది. మీరు మీ శక్తిని, ధనాన్ని సరైన చోట, సరైన వ్యక్తుల వద్ద పెట్టుబడిగా పెట్టినప్పుడు మాత్రమే మీకు మంచి జరుగుతుందని అంటున్నాడు ఆచార్య చాణక్యుడు. అందువల్ల, ఎల్లప్పుడూ  మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకున్న తర్వాతే ఇతరులకు సహాయం చేయాలి.                                    *రూపశ్రీ.  
 తల్లిదండ్రులు చేసే ఈ తప్పులు.. పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తాయి..!++ ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలోని ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కోవాలని కోరుకుంటారు. కానీ కొన్నిసార్లు, తల్లిదండ్రులకు తెలియకుండానే వారి కొన్ని అలవాట్లు, వారి పిల్లల ఆత్మవిశ్వాసాన్ని బలహీనపరుస్తాయి. ఏ తల్లిదండ్రులు కూడా ఉద్దేశపూర్వకంగా తమ పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని కోరుకోరు.. పిల్లల మనసు చాలా సున్నితంగా ఉంటుంది,  వారు తమ పరిసరాల నుండి త్వరగా నేర్చుకుంటారు. తల్లిదండ్రులు ఇంట్లో పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ఏమైనా మాట్లాడితే అది వారి భవిష్యత్తును చాలా గందరగోళంగా మారుస్తుంది.  చిన్నతనంలో పిల్లలకు ఎమోషనల్ గా సపోర్ట్ చేస్తేనే వారు భవిష్యత్తులో ఆత్మవిశ్వాసంగా ఉండగలుగుతారు. తాము కూడా తెలియకుండానే తమ పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి, ఆ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేని స్థితికి తీసుకెళ్లే పరిస్థితి రాకుండా ఉండాలంటే.. తల్లిదండ్రులు కొన్ని విషయాలను తెలుసుకోవాలి.. పిల్లల తప్పుకు పోల్చి తిట్టడం.. చాలా మంది తల్లిదండ్రులు, తమ పిల్లల తప్పుకు కోపం తెచ్చుకుని, వారిని ఇతర పిల్లలతో పోల్చడం మొదలు పెడతారు.  ఇలా పోల్చడం ఎప్పుడైతై  మొదలవుతుందో అప్పుడు పిల్లలు ఇతరులను చూపించి, వారితో పోల్చి తిడతారు కూడా.  మార్కుల విషయంలో కావచ్చు,  తెలివి తేటల విషయంలో కావచ్చు, ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడంలో కావచ్చు,  చురుగ్గా ఉండే విషయంలో కావచ్చు..  ఇలా  ప్రతిదానికి తల్లిదండ్రులు పిల్లలను పోల్చి మాట్లాడితే..  పిల్లలు చాలా బాధపడతారు, తమను తాము పనికిరానివారిగా భావిస్తారు. ఇక్కడే వారి ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం మొదలవుతుంది. తిట్టడం.. తల్లిదండ్రులు తరచుగా తమ పిల్లలను తప్పులు చేసినందుకు కఠినంగా తిడతారు. కానీ తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సినది.. వారు పిల్లలని, ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నారని, అలాంటప్పుడు  తరచుగా తప్పులు జరుగుతాయని అర్థం చేసుకోవాలి.   పిల్లలను తప్పులకు పదేపదే తిడితే, వారు కొత్తగా ఏదైనా ప్రయత్నించడానికి భయపడతారు. తప్పు చేయడం చెడ్డ విషయమని, మళ్ళీ తిట్లు పడతాయని భావించి, ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి, లేదా ప్రయత్నించడానికి కూడా భయపడి ప్రయత్నాలు మానేస్తారు. ఎమోషన్స్ ను లైట్ తీసుకోవడం.. పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు.  వారు భయపడినప్పుడు, బాధపడినప్పుడు లేదా కలత చెందినప్పుడు,  "ఇంత చిన్న విషయానికి ఏడవకు"  అనడం లేదా "ఇది పెద్ద విషయమేమీ కాదు" అని తోసిపుచ్చేయడం.. వంటివి తల్లిదండ్రులు చేస్తుంటారు.  దీనివల్ల  తమ భావాలకు విలువ లేదని  పిల్లలు భావిస్తారు. దీనివల్ల, తమను ఎవరూ అర్థం చేసుకోరనే భావనతో వారు తమ భావాలను, ఆలోచనలను దాచుకుంటారు. ఇది వారి నమ్మకాన్ని బలహీనపరుస్తుంది, దాని ప్రభావం వారి ఆత్మవిశ్వాసంపై నేరుగా పడుతుంది ఓవర్ ప్రొటెక్షన్,  హెల్పింగ్.. చాలామంది తల్లిదండ్రులు, తమ పిల్లలకు సహాయం చేసే నెపంతో, వారి స్కూల్ బ్యాగులు సర్దడం, పిల్లల ఇష్టాలతో పని లేకుండా  తామే బట్టలు షాపింగ్ చేయడం లేదా నిర్ణయాలు తీసుకోవడం వంటి ప్రతి పనిని తామే చేస్తారు. దీనివల్ల పిల్లలు తమ పనులు తాము చేసుకునే అవకాశాన్ని కోల్పోతారు. పిల్లలు ఏదైనా పనిని  తామే చేసినప్పుడు వారికి తమ సామర్థ్యం పెరుగుతుంది. అలా కాకుండా అన్నీ తల్లిదండ్రులే చేస్తుంటే పిల్లలకు వారి సామర్థ్యం గురించి తెలియదు.  క్రమంగా, వారు చిన్న చిన్న విషయాలకు కూడా తమ తల్లిదండ్రులపై ఆధారపడతారు తక్కువ చేసి మాట్లాడటం.. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను తిడతారు లేదా బంధువులు, స్నేహితులు లేదా అతిథుల ముందు వారి బలహీనతలను  బయటపెడతారు. దీనివల్ల పిల్లలు చాలా షేమ్ గా ఫీలవుతారు. తమను తాము తక్కువగా భావించుకుంటారు. పదేపదే అందరి ముందు  అవమానపడటం వల్ల,  అందరి ముందు ఓపెన్ మాట్లాడటానికి , ఏదైనా చెప్పడానికి భయపడతారు. అది వారి ఆత్మవిశ్వాసంపై నేరుగా ప్రభావం చూపుతుంది. అభిరుచులు రుద్దడం.. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు చదువు విషయంలో గానీ, అభిరుచుల విషయంలో గానీ తమకు నచ్చినది చేయాలని కోరుకుంటారు. పిల్లల సొంత ఇష్టాయిష్టాలను, అభిప్రాయాలను  పట్టించుకోరు. పిల్లలకు తమకు నచ్చింది ఎంచుకోవడం,  నచ్చిన పని చేయడం వంటి అవకాశాలు లేనప్పుడు తమ నిర్ణయాలకు విలువ లేదని పిల్లలు భావిస్తారు. ఇది వారిలో ఆత్మవిశ్వాసం లోపించడానికి, అలాగే దృఢమైన నిర్ణయాలు తీసుకోవడంలో వెనకడుగు వేయడానికి  దారితీస్తుంది.                                *రూపశ్రీ  
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు. కానీ చాలామంది చేసే మిస్టేక్.. సైడ్ ఇన్కమ్ కోసం ప్రయత్నించకపోవడం. ఉద్యోగం చేస్తూనే ఎక్స్టాగా ఇన్కమ్ సంపాదించడం వల్ల ఆర్థికంగా ఎంతో వృద్ధి చెందవచ్చు.  దీనికోసం మంచి మార్గాలు,  ఎక్ట్సా ఇన్కమ్ సంపాదించాలనుకునే వారు చేయకూడని తప్పులు తెలుసుకుంటే.. ఫ్రీలాన్సింగ్..  రైటింగ్, డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, డిజిటల్ మార్కెటింగ్ లేదా కోడింగ్ వంటి స్కిల్స్  ఉంటే  ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు చేయవచ్చు. ఇది  మంచి ఆదాయాన్ని ఇస్తుంది. ఫ్రీలాన్సర్,  ఫైవర్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో క్లయింట్ లు ఉంటారు. వారానికి 10–12 గంటలు కేటాయించడం ద్వారా, ₹10,000 నుండి ₹25,000 వరకు సంపాదించవచ్చు. బ్లాగింగ్, కంటెంట్ క్రియేషన్.. రాయడం పట్ల మంచి అభిరుచి ఉంటే  బ్లాగింగ్, యూట్యూబ్ లేదా ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్‌ను క్రియేట్ చేయవచ్చు. సబ్స్క్రైబర్స్,  వ్యూస్ బాగా వచ్చిన తరువాత  యాడ్స్ , స్పాన్సర్‌షిప్‌లు కూడా వస్తాయి. వీటి ద్వారా అదనపు ఆదాయం కూడా ఉంటుంది. అయితే దీనికి మంచి కంటెంట్, క్లిక్ అయ్యేవరకు సమయం అవసరం అవుతాయి. ఆదాయం వెంటనే ఉండదు. కాస్త ఓపిక అవసరం. ఆన్లైన్ ట్యూటరింగ్.. కోర్సెస్.. ఏదైనా ఒక  సబ్జెక్టులో బాగా గ్రిప్ ఉంటే అలాంటి వారు  ఆన్‌లైన్ క్లాసెస్ చెప్పవచ్చు.  లేదా డిజిటల్ కోర్సులను క్రియేట్ చేసి  కూడా టీచింగ్ చేయవచ్చు. YouTube, Unacademy వంటి ప్లాట్‌ఫామ్‌లలో చేరవచ్చు.  లేదా Google Meetలో స్వయంగా  క్లాసెస్ చెప్పవచ్చు. ఇది   విద్యార్థులకు,  టీచింగ్ చేసేవారికి కూడా  చాలా బాగుంటుంది. ఈ-బుక్స్.. రాయడం పట్ల మంచి అబిరుచి ఉంటే ఈ-బుక్స్  రాసి కిండిల్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో అమ్మడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఇంటి నుండి వ్యాపారాన్ని ప్రారంభించడానికి రీసెల్లింగ్ లేదా ఈ-కామర్స్ కూడా ఒక గొప్ప మార్గం. ఈ కామర్స్-రీసెల్లింగ్.. అమెజాన్,  ఫ్లిప్‌కార్ట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఉత్పత్తులను అమ్మడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు.  ఇంటి నుండి చిన్నగా ప్రారంభించవచ్చు. దుస్తులు, హస్తకళలు లేదా గృహోపకరణాలను అమ్మవచ్చు. ఇది క్రమంగా లాభదాయకమైన వ్యాపారంగా మారవచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్.. సైడ్ ఇన్‌కమ్ అంటే కేవలం పని చేయడం ద్వారా సంపాదించేది మాత్రమే కాదు, డబ్బు సంపాదించడం గురించి. మ్యూచువల్ ఫండ్ SIPలు, స్టాక్ మార్కెట్, బాండ్లు లేదా డిజిటల్ గోల్డ్‌లో  వంటి వాటిలో క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టడం వల్ల క్రమంగా అదనపు నిధులు వస్తాయి. సరైన సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల దీర్ఘకాలికంగా మంచి ఆదాయం సృష్టించవచ్చు. ఈ తప్పులు చేయకండి.. సైడ్ ఇన్‌కమ్‌ను మొదలుపెట్టే ముందు  త్వరగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో  తరచుగా తప్పులు చేస్తాము. ఆ తప్పులేంటంటే.. తొందరపాటు చాలామందికి ఉంటుంది.  సైడ్ ఇన్కమ్ కావాలనే తొందరలో తప్పటడుగు వేయకూడదు. సైడ్ ఇన్కమ్ మీద ఆశతో ఎలాంటి పరిశోధనలు చేయకుండా లేదా డబ్బులు పెట్టుబడి పెట్టడం లేదా డబ్బు సరిగా చెల్లించని చోట వర్క్ చేయడానికి ఒప్పుకోవడం వంటివి చేయకూడదు. సైడ్ ఇన్కమ్ మోజులో పడిచాలామంది  ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఎక్కువ లాభం వస్తుందని ఇచ్చే ప్రకటనలు చూసి మోసపోయి డబ్బులు పెట్టకూడదు. కేవలం అదనంగా చేసే పని ద్వారా సైడ్ ఇన్కమ్ ఉండేలా చూసుకోవాలి. అంతేకానీ డబ్బు కోసం ఎక్కువ ఒత్తిడి తీసుకుని పని చేయకూడదు. సైడ్ ఇన్కమ్ అయిన, ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం అయినా కుటుంబం కోసమే.. కానీ పని కోసం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. గొప్పలు చెప్పుకోవడానికి  సైడ్ ఇన్కమ్ సంపాదించడం మంచిది కాదు. భవిష్యత్ కోసం పొదువు చేయడానికి  సైడ్ ఇన్కమ్ సంపాదించాలి.                               *రూపశ్రీ.
పిల్లలు తమ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని తల్లిదండ్రులతో స్వేచ్ఛగా పంచుకుంటున్నారా? లేక కొన్ని విషయాలను దాచిపెడుతున్నారా? పిల్లలు తమ సమస్యలు, భయాలు, సందేహాలు, విజయాలు, అపజయాలు అన్నింటినీ తల్లిదండ్రులతో నమ్మకంగా చెప్పుకోవడం వారి మానసిక ఎదుగుదలకు ఎంతో అవసరం.  ఈ వీడియోలో ప్రముఖ నిపుణురాలు డా. పూర్ణిమ నాగరాజ్ పిల్లలతో తల్లిదండ్రులు ఎలా స్నేహపూర్వకంగా ఉండాలి, పిల్లల్లో నమ్మకాన్ని ఎలా పెంచాలి, వారు ఏ పరిస్థితిలోనైనా తమ మనసులోని మాటను చెప్పేలా ఎలా ప్రోత్సహించాలి అనే అంశాలను సులభంగా వివరించారు. అలాగే పిల్లల మాటలను మధ్యలో అడ్డుకోకుండా వినడం, విమర్శించకుండా స్పందించడం, భయపెట్టకుండా మార్గనిర్దేశం చేయడం, కుటుంబంలో ఓపెన్ కమ్యూనికేషన్‌ను పెంపొందించడం వంటి ముఖ్యమైన పేరెంటింగ్ సూచనలను కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ప్రతి తల్లిదండ్రి తప్పకుండా చూడాల్సిన ఈ వీడియో పిల్లలతో బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఉపయోగపడుతుంది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)    
పంచదార.. నేటికాలంలో చాలా విరివిగా వాడుతున్నారు. కాఫీ, టీ,  స్వీట్లు,  ఇంట్లో చేసే తీపి పదార్థాలు, డిజర్ట్ లు.. ఇలా చాలా తీపి పదార్థాల తయారీలో పంచదారది అగ్రస్థానం.  కాఫీ, టీ ల విషయాని వస్తే.. రోజులో కప్పుల కొద్ది తాగేవారు కూడా ఉంటారు. అయితే.. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని నేటికాలంలో వైద్యులు కూడా పెద్ద ఎత్తునే చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా చక్కెరను ఎడాపెడా వాడిన వారిలో చాలా మంది ప్రస్తుతం డయాబెటిస్ పేషెంట్లుగా మారారన్నది ఒప్పుకోవాల్సిన నిజం. అయితే.. కేవలం ఒక వారం రోజుల పాటూ చక్కెర వాడకాన్ని ఆపి చూడమని వైద్యులు, ఆహార నిపుణులు చెబుతున్నారు.  వారం రోజులు చక్కెర వాడటం మానేస్తే శరీరంలో జరిగే మార్పుల గురించి కూడా వారు చెబుతున్నారు.  అసలు వారం రోజుల పాటూ పంచదార వాడటం మానేస్తే  ఏం జరుగుతుంది? పూర్తీగా తెలుసుకుంటే.. వారం రోజులు చక్కెర వాడటం మానేస్తే జరిగే మార్పులు.. చక్కెర అలవాటు ఉన్నవారు ఉన్నపళంగా చక్కెర వాడటాన్ని ఆపేస్తే.. మొదటి ఒకటి రెండు రోజులు తీపి తినాలని అనిపిస్తుంది. కానీ క్రమంగా శరీరం చక్కెర లేకుండా ఉండటానికి అలవాటు పడుతుంది. చక్కెర వాడటం మానేస్తే.. మునుపటి కంటే ఎక్కువగా శరీరంలో ఎనర్జీ ఉండటాన్ని గమనించవచ్చు.  దీన్ని అనుభూతి కూడా చెందవచ్చు. చర్మంలో కూడా గణనీయమైన మార్పులు కనిపిస్తాయి. చర్మంలో మెరుపు వస్తుంది.  ముఖ్యంగా చర్మం మీద మొటిమలు,  దద్దుర్లు.. వంటివి క్రమంగా తగ్గడం గమనించవచ్చు. చక్కెర వాడటం ఆపేస్తే జీవక్రియ మెరుగవుతుంది.  గతంలో అంటే.. చక్కెర వాడుతున్నప్పుడు కంటే.. చక్కెర వాడటం మానేసిన తర్వాత జీవక్రియ వేగంగా మారుతుంది. చక్కెర వాడటం మానేస్తే.. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యంగా మారతాయి. అధిక బరువు ఉన్నవారు చక్కెర వాడటం మానేస్తే.., క్రమంగా బరువు తగ్గడం మొదలవుతుంది.  వారం రోజులలో స్పష్టంగా మార్పు కనిపించకపోయినా.. చక్కెర వాడటం మానేస్తే.. క్రమంగా బరువు తగ్గడం సులువు అవుతుంది.                                       *రూపశ్రీ.
పిల్లలకు పేరు పెట్టడం అనేది ప్రతి తల్లిదండ్రులకు ఎంతో ప్రత్యేకమైన మరియు పవిత్రమైన సందర్భం. అయితే పేరు అనేది కేవలం పిలవడానికి మాత్రమే కాకుండా, వ్యక్తి జీవితంపై, వ్యక్తిత్వంపై, ఆలోచనా విధానంపై కూడా ప్రభావం చూపుతుందని భారతీయ సనాతన సంప్రదాయం చెబుతోంది. ఈ భక్తివన్ ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డా. అనంత లక్ష్మి గారు, పిల్లలకు పేరు ఎలా ఎంపిక చేయాలి, నామకరణంలో పాటించాల్సిన శాస్త్ర నియమాలు, జన్మ నక్షత్రం ఆధారంగా పేరు ఎందుకు పెట్టాలి, పేరుకు ఉన్న ఆధ్యాత్మిక మరియు సాంప్రదాయ ప్రాముఖ్యత వంటి అనేక ఆసక్తికరమైన విషయాలను సులభంగా వివరిస్తారు. అలాగే పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు పేరు ఎంపికలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి అనే విషయాలపై కూడా విలువైన సూచనలు అందిస్తున్నారు. పిల్లలకు పేరు పెట్టాలని ఆలోచిస్తున్న ప్రతి తల్లిదండ్రులు, అలాగే హిందూ ధర్మం, నామకరణ సంప్రదాయాల గురించి తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన ఆధ్యాత్మిక కార్యక్రమం ఇది. ఈ వీడియోను పూర్తిగా వీక్షించి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కూడా పంచుకోండి. ఆధ్యాత్మిక విశేషాలు, పూజా విధానాలు, దేవాలయాల మహిమ, పండుగల ప్రాముఖ్యత కోసం మా Bhakthi One యూట్యూబ్ ఛానల్‌ను సందర్శించండి. సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!