ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌తో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు సమావేశమయ్యారు. రాష్ట్రంలో సంచలన రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ విచారణ వివరాలను అధినేత కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. మరోవైపు రాబోయే మున్సిపల్ ఎన్నికలపై బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని వారికి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతంపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.  ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను  సిట్ విచారించే అవకాశం ఉన్నట్లు  తెలుస్తోంది. కవితతో పాటు ఆమె భర్త అనిల్ కుమార్‍, బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ సంతోశ్ రావుకు నోటీసులు ఇచ్చేందుకు సిట్ సిద్ధమైందనే ప్రచారం జరుగుతోంది. అతి త్వరలోనే వీరికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే ఛాన్స్ ఉంది. అయితే ఈ కేసులో ఆఖర్లో గులాబీ బాస్ కేసీఆర్‌ను  విచారణకు పిలిచే అవకాశం ఉందనే జోరుగా చర్చ జరుగుతోంది. 
వర్తమాన రాజకీయ, సామాజిక అంశాలపై తెలుగువన్ ‘వాస్తవ వేదిక’పై తెలుగువన్ ఎండీ రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్   విశ్లేషణాత్మక చర్చ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్వహణను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) మోడల్‌లోకి మార్చడంపై జరుగుతున్న చర్చ   రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో ‘వాస్తవ వేదిక’ ఈ సంచికలో ఆ అంశంపై విశ్లేషణాత్మక చర్చ జరిపారు.   ఆంధ్ర ప్రదేశ్ లో మెడికల్ కాలేజీల నిర్వహణపై   అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.  గత ప్రభుత్వం హయాంలో ప్రారంభించిన 17 మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్వహించాలనే ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాన్ని   వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.  అయితే  ప్రభుత్వం నేరుగా మెడికల్ కాలేజీలను నడపడం ఒక రకమైన  మూర్ఖత్వమని డోలేంద్ర ప్రసాద్ అన్నారు. ఏడు దశాబ్దాల తరువాత కూడా  ప్రభుత్వ ఆసుపత్రులు కిలోమీటర్ దూరం నుంచే గుర్తుపట్టగలిగేంత దుర్వాసనతో, అపరిశుభ్రంగా ఉంటున్నాయన్న ఆయన. విపరీతమైన   రద్దీ,  వైద్యుల కొరత, పారిశుద్ధ్య లోపం కారణంగా ప్రభుత్వ వైద్యం ప్రజలకు పూర్తి స్థాయిలో అందడం లేదని చెప్పారు.  ఇక  గత ప్రభుత్వం పార్వతీపురం, పిడుగురాళ్ల వంటి మారుమూల ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలను ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదన పూర్తిగా హేతు రహితం. ఎందుకంటే..మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం మెడికల్ సీట్లు రావాలంటే  అర్హత కలిగిన ఫ్యాక్ ల్టీ అంటే ప్రొఫెసర్లు ఉండాలి.  పెద్ద డాక్టర్లు లేదా ప్రొఫెసర్లు మారుమూల ప్రాంతాల్లో పనిచేయడానికి ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు.  నారాయణ వంటి ప్రైవేట్ సంస్థలే నెలకు 15 లక్షల రూపాయల జీతం ఇచ్చినా మంచి ప్రొఫెసర్లను తెచ్చుకోలేకపోతున్నాయి. అటువంటప్పుడు ప్రభుత్వ పే-స్కేల్స్‌తో వారు ఎలా వస్తారన్నది పెద్ద ప్రశ్న. ఇక మారుమూల ప్రాంతాలకు రావడానికి అర్హత కలిగిన వారు రావడానికి ఇష్టపడకపోవడానికి వారి పిల్లల చదువులు, కుటుంబ వసతులు వంటివి అవరోధాలుగా మారుతున్నాయని డోలేంద్ర ప్రసాద్ చెప్పారు.    ఇక పీపీపీ మోడల్ అన్నది ఈ సమస్యలకు పరిష్కారమా? వ్యాపారమా అన్న విషయానికి వస్తే.. ఈ పీపీపీ మోడల్ అన్నది దేశంలో కొత్తదేమీ కాదు,   హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్, కృష్ణపట్నం, గంగవరం పోర్టులు, జాతీయ రహదారులు ఇదే మోడల్‌లో విజయవంతంగా నడుస్తున్నాయి. అటువంటప్పుడు అదే పీపీపీ మోడల్ లో మెడికల్ కాలేజీల నిర్వహణకు అభ్యంతరమెందుకని ఆయన ప్రశ్నించారు. వాస్తవానికి పీపీపీ అంటే పేరుకు మాత్రమే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ఆచరణలో మాత్రం   ప్రైవేట్ నిర్వహణే అన్నారు.  ప్రైవేట్ రంగంలో మెడికల్ కాలేజీల సీట్ల ధరలు భారీగా ఉన్నాయి.   సీటు 50 లక్షల నుండి కోటి  రూపాయల వరకూ,  అదే పీజీ అయితే   3 నుండి 5 కోట్ల  రూపాయల వరకూ ఉన్నాయి. కానీ ప్రైవేట్ యాజమాన్యం లాభాపేక్షతోనైనా సరే ఆసుపత్రులను శుభ్రంగా, మెరుగైన సౌకర్యాలతో నడిపే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని డోలేంద్ర ప్రసాద్ వ్యక్తం చేశారు.   అయితే వైసీపీ ఈ వ్యవహారాన్ని రాజకీయ కారణాలతో  పెద్ద భూతంగా చూపిస్తూ , ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తోందన్నారు.  రాష్ట్రంలో  కూటమి ' ప్రభుత్వం కాకుండా, ప్రతిపక్షం మరియు అధికార పక్షం కలిపి నడిపే 'కుమ్మక్కు' ప్రభుత్వం నడుస్తోందన్నారు. ప్రజలకు సంబంధం లేని విషయాలను కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని డోలేంద్ర ప్రసాద్ విశ్లేషించారు. భారతదేశంలో అవినీతి అన్ని రంగాలకు విస్తరించిందనీ, చైనాతో పోలిస్తే మనం అభివృద్ధిలో వెనుకబడి ఉండటానికి కారణం ఇక్కడి రాజకీయ నాయకుల అవినీతి,  పాలకుల చిత్తశుద్ధి లేమే కారణమన్నది ‘వాస్తవ వేదిక’ చర్చ సారాంశం.  మెడికల్ కాలేజీల విషయంలో పీపీపీ మోడల్ అనేది కేవలం రాజకీయ ఆరోపణలకే పరిమితం కాకుండా, సామాన్యుడికి మెరుగైన వైద్యం అందే దిశగా అడుగులు వేయాల్సి ఉందని రవిశంకర్, డోలేంద్ర ప్రసాద్ అన్నారు.  పూర్తి వివరాలకు తెలుగువన్ న్యూస్ లో వాస్తవ వేదిక తొమ్మిదో ఎడిషన్ వీక్షించండి   
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.  ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ సమన్ల మేరకు వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ మిథున్ రెడ్డి శుక్రవారం (జనవరి 23) ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు.  మద్యం కుంభకోణంలో పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగాయని ఈడీ నిర్థారణకు వచ్చింది. ఈ కేసులో  కోట్లాది రూపాయల కిక్‌బ్యాగ్స్   ఉండొచ్చన్న అనుమానాలతో దర్యాప్తు ను మరింత వేగవంతం చేసింది.   జగన్ హయాంలో మద్యం విధానం రూపకల్పన, అమలు సమయంలో భారీ అవకతవకలు జరిగాయనీ,  మధ్యవర్తుల ద్వారా భారీ మొత్తాలు లావాదేవీలు జరిగాయని ఈడీ అనుమానిస్తోంది. ముఖ్యంగా హవాలా మార్గంలో నగదు తరలింపులు, మనీ లాండ రింగ్ చట్టాల ఉల్లంఘన జరిగిందని ఈడీ ప్రాథమికంగా నిర్థారణకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే  ఈడీ అధికారులు మిథున్ రెడ్డికి సంబంధించిన బ్యాంక్ ఖాతాలు, కంపెనీలతో జరిగిన లావాదేవీలు, అను బంధ వ్యక్తులు, సంస్థల వివరాలు సేకరిస్తున్నారు. లిక్కర్ వ్యాపారంలో పాల్గొన్న పలువురు వ్యాపా రులు, మధ్యవర్తులను విచారించడం ద్వారా వచ్చిన సమాచారంతో ఈడీ మిథున్ రెడ్డిని విచారిస్తున్నట్లు సమాచారం.   ఈ కుంభకోణంలో  రాజకీయ నేతల పాత్రపై ఇప్పటికే తీవ్ర చర్చ సాగుతున్న నేపథ్యంలో, ఎంపీ విజయసాయిని ఈడీ విచారణకు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మిధున్ రెడ్డి విచారణలో మద్యం కుంభకోణం వ్యవహారంలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.  ఈ కేసు రాజ కీయ ప్రేరేపితమని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తుండగా, చట్టప్రకారమే విచారణ జరుగుతోందని ఈడీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. 
ALSO ON TELUGUONE N E W S
Anil Ravipudi has become the hit machine of Telugu Cinema scoring 9 blockbusters out of his 9 films. He has been the continuous collaborator with Venkatesh. They did F2, F3, Sankrantiki Vasthunnam and Venky did a cameo in Mana Shankara Vara Prasad Garu, too. Now, the next movie of Anil Ravipudi will again star Venky.  This time though, the director wants to cast Rana Daggubati with Venkatesh and the multi-starrer will be produced by Dil Raju, say sources. The reports further state that the script work will continue till April and from pre-production works will go on till June. From July, they might start shooting aiming Sankranti 2027 release.  Anil Ravipudi has locked Sankranti Adirindi as title for the film, say reports. Also, the movie will have a different point from all previous Anil Ravipudi films but there could a similar character continuing in the film. Anil Ravipudi will start script works from February and then complete it with his team, say sources.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  ప్రస్తుతం థియేటర్లలో సంక్రాంతి సినిమాల హవానే కొనసాగుతోంది. 'మన శంకర వరప్రసాద్ గారు'తో పాటు 'అనగనగా ఒక రాజు', 'నారీ నారీ నడుమ మురారి', 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమాలు మంచి వసూళ్లనే రాబడుతున్నాయి. ఇప్పుడు థియేటర్లలో ఇతర సినిమాల తాకిడి లేదు. అయితే ఓటీటీలో మాత్రం పలు సినిమాలు, సిరీస్ లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.   శోభిత ధూళిపాళ ప్రధాన పాత్ర పోషించిన క్రైమ్ థ్రిల్లర్ 'చీకటిలో'(Cheekatilo) నేరుగా ఓటీటీలో విడుదలైంది. జనవరి 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్టీమింగ్ అవుతోంది.   Also Read: 'చీకటిలో' మూవీ రివ్యూ    ఇస్రో చేపట్టిన చంద్రయాన్ మిషన్ ఆధారంగా రూపొందిన 'స్పేస్ జెన్ - చంద్రయాన్'(Space Gen: Chandrayaan) వెబ్ సిరీస్ జనవరి 23 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది.   Also Read: 'స్పేస్ జెన్ - చంద్రయాన్' రివ్యూ    ఆది సాయికుమార్ రీసెంట్ హిట్ ఫిల్మ్ 'శంబాల'(Shambhala) ఓటీటీలో అడుగు పెట్టింది. ఈ సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ ఫిల్మ్, జనవరి 22 నుంచి ఆహాలోకి అందుబాటులోకి వచ్చింది.   Also Read: 'శంబాల' మూవీ రివ్యూ    అమెజాన్ ప్రైమ్ వీడియో: చీకటిలో మూవీ - జనవరి 23    జియో హాట్ స్టార్: 'స్పేస్ జెన్ - చంద్రయాన్' సిరీస్ - జనవరి 23  మార్క్ మూవీ - జనవరి 23    ఆహా: శంబాల మూవీ - జనవరి 22  మారియో మూవీ - జనవరి 23    జీ5:  45 మూవీ - జనవరి 23    నెట్ ఫ్లిక్స్: తేరే ఇష్క్‌ మే మూవీ - జనవరి 23    ఈటీవీ విన్: సంధ్యానామ ఉపాసతే మూవీ - జనవరి 22  గొల్ల రామవ్వ చిత్రం - జనవరి 25   
Kamaal R Khan, the famous "2-rupee" critic of Hindi films and Deshdrohi producer-director, has been arrested by Mumbai Police. Allegedly, he fired shots near writer Neeraj Kumar Mishra's residence in Andheri. Police took him into custody from his studio and the investigation into the matter is going on.  Reports have suggested that KRK told to police that he aimed at a nearby mangroove bush closer to the residence but the wind direction has resulted in wrong aim and shots going further. He clearly stated to police that he never intended to harm anyone and he did not harm anyone either.  The controversial incident happened on 18th January and KRK did admit to firing four rounds from his firearms. Earlier, reports suggest that tracking the person who fired those gunshots had been hard to identify but technical analysis aided in identifying the culprit.  Currently, the police are investigating to find out if Ego clashes between the writer and KRK might have resulted in this firing out of spite. More details to be revealed by the police and they are completing their further investigation into this matter in all possible angles.  Disclaimer: This article is written based on current reports and police statements. The organization is not responsible for the factual nature of the claims made by the parties involved. Readers’ discretion is advised.  
  పాన్ ఇండియా సినిమాలు, అందునా వీఎఫ్ఎక్స్ తో ముడిపడి ఉన్న సినిమాలు వాయిదా పడటం అనేది కామన్ అయిపోయింది. ఇప్పుడు ఆ లిస్టులో మరో సినిమా చేరింది.   'కార్తికేయ 2'తో పాన్ ఇండియా సక్సెస్ చూసిన నిఖిల్(Nikhil Siddhartha), ఇప్పుడు 'స్వయంభు'(Swayambhu) అనే మరో పాన్ ఇండియా సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. పిక్సెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ హిస్టారికల్ యాక్షన్ ఎపిక్ కి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నాడు.   'స్వయంభు' సినిమాను 2026, ఫిబ్రవరి 13న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడింది. ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు తాజాగా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.   'స్వయంభు' నిఖిల్ కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ సినిమా. కార్తికేయ 2 తర్వాత పాన్ ఇండియా స్థాయిలో హ్యుజ్ బజ్ ఉన్న సినిమా. ఇందులో వీఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉండబోతున్నాయి. ఇండియాలో టాప్ వీఎఫ్ఎక్స్ కంపెనీలు ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నాయి. వీఎఫ్ఎక్స్ కి కావాల్సినంత సమయం తీసుకొని, దీనిని విజువల్ వండర్‌ లా మార్చాలనే ఉద్దేశంతోనే మేకర్స్ ఈ వాయిదా నిర్ణయం తీసుకున్నారు.     Also Read: 2026 మెగా నామ సంవత్సరం.. మూడు నెలల్లో మూడు సినిమాలు!   స్వయంభులో తన పాత్ర కోసం నిఖిల్ పూర్తిగా ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అవ్వడంతో పాటు ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రమోషన్ కంటెంట్ ఆకట్టుకుంది.    ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న స్వయంభులో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్స్. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా సెంథిల్ కుమార్, ఎడిటర్ గా తమ్మిరాజు, ప్రొడక్షన్ డిజైనర్లుగా ఎం ప్రభాహరన్, రవీందర్ వర్క్ చేస్తున్నారు.    
  -వారణాసిలో ఆ హీరోయిన్ సెట్ అవుతుందా! -ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి  -రాజమౌళి తో ఎలా ఉంటుంది -అల్లు అర్జున్ సినిమా ఎంత వరకు వచ్చింది   వరల్డ్ సిల్వర్ స్క్రీన్ ని ఈ సారి చాలా స్ట్రాంగ్ గా వశం చేసుకోవడమే లక్ష్యంగా మహేష్(Mahesh Babu),రాజమౌళి ల 'వారణాసి'(varanasi)ముస్తాబవుతున్న విషయం తెలిసిందే. కథ, కథనాలు ఎవరి ఊహకి అందని విధంగా ఉండబోతున్నాయి.అందుకు నిదర్శనంగా ప్రచార చిత్రాల్లో మహేష్ తన మెడలో పరమేశ్వరుడిని ఆరాధించే భక్తుడిగా రుద్రాక్షలని ధరించి త్రిశూలం చేత బూని ఉన్నాడు. మరో వైపు రాముడిగా కూడా కనిపించబోతున్నాడు. దీన్ని బట్టే  కథ, కథనాలు అంచనా చెయ్యలేని విధంగా ఉన్నాయి. ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ క్యారక్టరయిజేషన్స్  పై కూడా అంచనా వెయ్యని విధంగా ఉండటంతో పాటు ఇంకా ఎవరెవరు వారణాసి లో కనిపించబోతున్నారనే ఆసక్తి అందరిలో ఉంది.     ఈ క్రమంలోనే బాలీవుడ్ మరో స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే వారణాసిలో చేయబోతుందనే రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులోను మహేష్ కి జోడి అనే న్యూస్ ఒక రేంజ్ లోనే చక్కర్లు కొడుతుంది. వారణాసి టీం నుంచి అయితే దీపికా పదుకునే  విషయంలో చిన్న క్లూ కూడా రావడంలేదు. మరి ఈ రూమర్  ఎలా సర్క్యులేట్ అవుతుందో తెలియడం లేదు. ఒక వేళ ఆ రూమర్ నిజమైతే ఫ్యాన్స్ కి పండుగే. గత కొన్ని రోజులుగా షూటింగ్ కి సంబంధించిన వర్కింగ్ అవర్స్ విషయంలో దీపికా పదుకునే, సందీప్ రెడ్డి వంగ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. వర్కింగ్ అవర్స్ కి సంబంధించిన విషయంలోనే కల్కి పార్ట్ 2 , స్పిరిట్ నుంచి తప్పించారనే వార్తలు వచ్చాయి.    Also read:  మద్యం తాగే ముందు, తాగాక.. ఇలా చేస్తే హెల్త్ సేఫ్    దీంతో దీపికా కాంట్రవర్సి హీరోయిన్ గా మారింది. మరి రాజమౌళి(Ss Rajamouli)సినిమా అంటే వర్కింగ్ అవర్స్ ఏ విధంగా ఉంటాయో తెలిసిందే. ప్రతి ఆర్టిస్ట్ తనతో పాటే ట్రావెల్ చెయ్యాలి. మరి ఈ లెక్కన  దీపికా  వారణాసిలో ఉండే అవకాశం లేదనే టాక్ కూడా జనరేట్ అవుతుంది. దీపికా పదుకునే ప్రస్తుతం అల్లు అర్జున్(Allu Arjun),అట్లీ(Atlee)కాంబోలో తెరకెక్కుతున్న మూవీలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంపై కూడా అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి.       
Ram Charan's Pan-India Magnum Opus Peddi also starring Janhvi Kapoor, Shiva Rajkumar directed by Buchi Babu Sana has created huge frenzy across the world with Chikiri Chikiri song and the first glimpse. The movie has been locked for 27th March 2026 release date but the rumour mills are rampant that it has been postponed. Sources state that the makers do not want to rush the most important final schedules, especially, after a global chartbuster like Chikiri Chikiri, they are cautious that expectations would've sky rocketed. Recent reports did reveal that first half edit has been locked and AR Rahman is working on background music, but they also claim that makers feel ample time needs to be given for post production works. On the other hand, even Nani's The Paradise has been postponed say sources from 26th March. The movie is currently shooting at a leisurely pace as Nani asked director Srikanth Odela to re-work on some portions of script, say inside reports. Even producer Sudhakar Cherukuri in recent interviews, did not really show confidence in movie releasing on-time.  Distributors and exhibitors who were worried about two big films clashing at the box office are breathing a sigh of relief with newpostponement reports doing rounds. Some sources claim that Peddi is eyeing a May date while The Paradise, going for June or July date. Speculations also point at both wanting to avoid clash with Dhurandhar 2, which could create box office tsunami on the back of 1300 crore gross All-Time Blockbuster success, releasing on 19th March.  If the reports are true, Pawan Kalyan's Ustaad Bhagat Singh could release for Peddi date. Well, TFI insider reports are rampant about this postponement but makers are tight-lipped about it. They might discuss with OTT platforms before making final announcements about the factors leading to it. Let's wait and watch.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  'మన శంకర వరప్రసాద్ గారు' హిట్ తో మెగా ఫ్యాన్స్ ఖుషీ ఇదే జోష్ లో మరో మూడు మెగా సినిమాలు ఉస్తాద్ భగత్ సింగ్, పెద్ది, విశ్వంభర తేదీలు ఖరారు!   2026 అనేది మెగా అభిమానులకు మరపురాని సంవత్సరంలా నిలిచిపోయేలా ఉంది. ఇప్పటికే చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై.. వరల్డ్ వైడ్ గా రూ.300 కోట్ల గ్రాస్ రాబట్టి, బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో మెగా అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు. వారి సంతోషాన్ని రెట్టింపు చేస్తూ.. ఈ ఏడాది మూడు నెలల వ్యవధిలో మరో మూడు మెగా సినిమాలు విడుదల కాబోతున్నాయి.   'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్(Pawan Kalyan), హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ యొక్క షూటింగ్ ను ఇప్పటికే పవన్ కళ్యాణ్ పూర్తి చేశారు. ఈ సినిమాని మార్చి 26న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.   రామ్ చరణ్(Ram Charan) హీరోగా 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఫిల్మ్ 'పెద్ది'(Peddi). వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాను మొదట మార్చి 27న విడుదల చేయాలి అనుకున్నారు. కానీ షూటింగ్ ఇంకా పూర్తికాక పోవడంతో.. కొత్త విడుదల తేదీగా మే 1ని లాక్ చేసినట్లు సమాచారం.   ఇక 'విశ్వంభర'(Vishwambhara) విషయానికొస్తే.. ఇది 'మన శంకర వరప్రసాద్ గారు' కంటే ముందు రావాల్సిన సినిమా. చిరంజీవి(Chiranjeevi) హీరోగా 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యు.వి. క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ షూటింగ్ పూర్తయినప్పటికీ, వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా విడుదల ఆలస్యమైంది. ఎట్టకేలకు ఇప్పుడు జులై 10 కి రావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.   అంటే కేవలం మూడు నెలల వ్యవధిలోనే మూడు మెగా సినిమాలు విడుదల కాబోతున్నాయి. మరి 'మన శంకర వరప్రసాద్ గారు' తరహాలోనే ఈ సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తాయేమో చూడాలి.   Also Read: చిరంజీవి కొత్త సినిమాకి ఊహించని టైటిల్!    
    -మద్యం తాగే ముందు ఏం చెయ్యాలి -తాగాక ఏం చెయ్యాలి -హర్ష వర్ధన్ ఏం చెప్పాడు  -నితిన్ సలహా ఏంటి   ప్రముఖ రచయిత హర్షవర్ధన్(Harsha Vardhan)నటుడుగా విభిన్న క్యారెక్టర్స్ చేస్తూ తన సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. ఈ కోవలోనే సంక్రాంతికి చిరంజీవితో కలిసి మన శంకర వరప్రసాద్ గారు తో సెల్యులాయిడ్ పై తనదైన మేనరిజంతో సందడి చేస్తున్నాడు. చిరంజీవి అసిస్టెంట్ నారాయణ గా హర్షవర్ధన్ ప్రదర్శించిన పెర్ఫార్మ్  కి ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. రీసెంట్ గా హర్ష వర్ధన్ తెలుగు వన్ కి ఇంటర్ వ్యూ ఇవ్వడం జరిగింది. సదరు ఇంటర్వ్యూ లో ఆల్కహాల్ తాగే అలవాటు ఉన్నవాళ్ళకి చెప్తున్న జాగ్రత్తలకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ గా మారింది. హర్ష వర్ధన్ మాట్లాడుతు నితిన్(Nithiin)వాళ్ళ నాన్నతో సిట్టింగ్ కి  కూర్చున్నప్పుడు  ఒక పెగ్ తాగగానే గ్లాస్ లో వాటర్ వస్తుంది. ఆ వాటర్ మనం తాగకపోతే ఇంకో పెగ్ తీసుకోనివ్వరు. ఆల్కహాల్ తాగే ముందు ఒక హాఫ్ లీటర్ వాటర్ కూడా తాగాలి. ఆ విధంగా చేయడం వల్ల హెల్త్ కి చాలా మంచిదని ఆ విధంగా చేయిస్తారు. నాకు అదే అలవాటు అయ్యింది. నా ఫ్రెండ్స్ తో పాటు వేరే పార్టీలకి వెళ్లినా ఆరోగ్యం కోసం అందరు ఆ సిస్టమ్ ఫాలో అయ్యేలా చేస్తున్నాను అని హర్ష వర్ధన్ చెప్పడం జరిగింది.   Also read:  ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే    https://x.com/Theteluguone/status/2014665061277823045?s=20
  'మన శంకర వరప్రసాద్ గారు' హిట్ తో జోష్ లో చిరంజీవి బాబీ దర్శకత్వంలో తదుపరి చిత్రం  త్వరలోనే షూటింగ్ ప్రారంభం టైటిల్ లాక్ చేసిన మేకర్స్!   ఈ సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Vara Prasad Garu)తో ప్రేక్షకులను పలకరించి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఈ ఉత్సాహంతో తన నెక్స్ట్ మూవీని మొదలు పెట్టనున్నారు చిరంజీవి.    బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి తన 158వ సినిమా చేస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాకు.. టైటిల్ వేటలో ఉంది టీమ్. ప్రస్తుతం 'కాకా', 'కాకాజీ' అనే టైటిల్స్ ని పరిశీలిస్తున్నారట. ఈ రెండు టైటిల్స్ లో 'కాకా' టైటిల్ కి ఎక్కువమంది మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అదే టైటిల్ ఫైనల్ అయ్యే అవకాశముంది. (Mega 158)   ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. దర్శకుడు బాబీ తన టీమ్ తో కలిసి దుబాయ్ వెళ్ళి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. త్వరలోనే ఫైనల్ స్క్రిప్ట్ లాక్ కానుందని, మార్చి నుంచి షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.     Also Read: రామ్ చరణ్ 'పెద్ది' వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!   నటీనటులు కూడా ఫైనల్ అయ్యారని తెలుస్తోంది. చిరంజీవి భార్యగా ప్రియమణి, కూతురుగా కృతి శెట్టి కనిపించనున్నారట. అనురాగ్ కశ్యప్ విలన్ గా నటించనున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో అలరించనున్నారని వినికిడి.   'మెగా 158' సినిమాని 2027 సంక్రాంతికి విడుదల చేయాలనే టార్గెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్ గారు'తో బ్లాక్ బస్టర్ అందుకున్న చిరంజీవి.. వచ్చే సంక్రాంతికి కూడా ఇదే రిజల్ట్ రిపీట్ చేస్తారేమో చూడాలి.    
    -ఇక ఓటిటి లవర్స్ లో పండుగే -నెట్ ఫ్లిక్క్ ఏమంటుంది -రోషన్ పెర్ ఫార్మ్ హైలెట్    శ్రీకాంత్ తనయుడు రోషన్(Roshan)సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటిన మూవీ 'ఛాంపియన్'(Champion).క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25 న విడుదలయ్యింది. ఇండియాకి స్వాతంత్రం వచ్చినా హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం నవాబు ఇండియాలో వీలినం చేయకపోవడానికి గల కారణాలకి, సిద్ధిపేట జిల్లాలోని భైరాన్ పల్లి లో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటానికి, ఇంగ్లాండ్ లో ఫుట్ బాల్ ప్లేయర్ గా సెటిల్ అవ్వాలన్న మైకేల్ విలియమ్స్  అనే యువకుడికి మధ్య సంబంధం ఏంటనే మూడు విభిన్నమైన పాయింట్స్ తో తెరకెక్కింది. మైకేల్ విలియమ్స్ గా రోషన్ పెర్ఫార్మెన్స్ ఒక రేంజ్ లో సాగడంతో పాటు, మూడవ చిత్రంతోనే అత్యుత్తమ ప్రతిభ కనపర్చడానే కితాబుని అభిమానులు, ప్రేక్షకులు, క్రిటిక్స్  నుంచి అందుకున్నాడు. ఇప్పుడు ఈ మూవీ ఓటిటి వేదికగా ఈ నెల 29 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా సందడి చేయనుంది. రోషన్ తో పాటు హీరోయిన్ గా చేసిన అనశ్వర రాజన్, నందమూరి కల్యాణ చక్రవర్తి, ప్రకాష్ రాజ్, సంతోష్ ప్రతాప్ పెర్ ఫార్మెన్స్ ఛాంపియన్ కి సరికొత్త లుక్ ని తీసుకొచ్చింది. ప్రదీప్ అద్వైతం(Pradeep Advaitham)నుంచి వచ్చిన కథ, కథనాలు, డైరెక్షన్ ఛాంపియన్ ద్వారా సరికొత్త లోకం ప్రేక్షకుల కళ్ల ముందు మెదలాడటం ఖాయం. మిక్కీ జె మేయర్ అందించిన మ్యూజిక్ కూడా అద్భుతం.  Also read:  పోలీస్ స్టేషన్ కి ఎస్ కె ఎన్.. అంతా రాజాసాబ్ నే చేసాడు   ముఖ్యంగా గిర గిర గింగిరాగిరే సాంగ్  పెద్ద హిట్ అయిన విషయం తెలిసిందే. కాంప్రమైజ్ కానీ ప్రియాంక దత్, జి కె మోహన్, జెమినీ కిరణ్ నిర్మాణ విలువలు  ఆకట్టుకుంటాయి. ఈ నేపథ్యంలో ఓటిటి సినీ ప్రేమికుల్లో   ఛాంపియన్ మూవీతో సరికొత్త జోష్ వచ్చినట్లయింది.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఆడపిల్ల ఇంటికి వెలుగు అంటారు. ఆడపిల్ల ఇంట్లో ఉండే  మహాలక్ష్మి ఇంట్లో ఉన్నట్టే అని కూడా అంటారు. అయితే కొన్ని దశాబ్దాల క్రితం ఆడపిల్ల పుడితే పురిట్లోనే చిదిమేసేవారు,  ఇంకొందరు బ్రూణ హత్యలు చేయించేవారు.  ఈ కారణాల వల్ల ప్రస్తుతం మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లల నిష్పత్తి తక్కువగా ఉంది.  పెళ్లిళ్ల కోసం ఆడపిల్లలు కరువయ్యారు అంటూ పెద్దలు మొరపెట్టుకుంటున్నారు.  అయితే ఆడపిల్లల గురించి, వారి భవిత గురించి ఆలోచించి వారి అబివృద్ది కోసం ప్రతి ఏడాది జనవరి 24వ తేదీన జాతీయ బాలికల దినోత్సవం జరుపుకుంటున్నారు,  బాలికల హక్కులు,  వారి భద్రత,  విద్య,  ఆరోగ్యం వంటి అంశాలపై సమాజంలో అవగాహన కల్పించేందుకే ఈ రోజును జరుపుకుంటారు.  ఈ రోజు గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. జాతీయ బాలికల దినోత్సవం.. 2008 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రారంభించింది. మహిళా,  శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Women and Child Development), భారత ప్రభుత్వం కలిసి ఉమ్మడిగా ఈ రోజును జరుపుకోవాలని పిలుపు ఇచ్చింది. జనవరి 24నే ఎందుకు.. ఈ తేదీకి ప్రత్యేకమైన చారిత్రక సంఘటన ఏమీ లేదు. కానీ బాలికల హక్కులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టేందుకు, సంవత్సర ఆరంభంలోనే సమాజానికి ఒక బలమైన సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ తేదీని ఎంపిక చేశారు.  ఎందుకు జరుపుకుంటారు.. సమాజంలో బాలికలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా.. బాల్యవివాహాలు,  శిశుహత్యలు, లింగ వివక్షత,  బాలికల విద్యకు అవకాశాల లోపించడం,  ఆరోగ్యం, పోషణలో నిర్లక్ష్యం వంటి సమస్యలు ఎక్కువగా ఉండేవి.  ఈ సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించి, బాలికలకు సమాన హక్కులు, గౌరవం, అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రధాన లక్ష్యాలు.. బాలికలపై జరుగుతున్న వివక్షను తగ్గించడం, బాలికల విద్యను ప్రోత్సహించడం, బాల్యవివాహాలు, ఆడ పిల్లలను పురిటిలో లేదా కడుపులోనే హత్య చేయడం,   వంటి  దారుణమైన కార్యకలాపాలను  అరికట్టడానికి,  బాలికల ఆరోగ్యం, భద్రతపై దృష్టి పెట్టడానికి  తగినట్టు కార్యాచరణ చేయడమే ఈ రోజు ప్రధాన లక్ష్యాలలో భాగంగా ఉంటుంది.  అదేవిధంగా.. బాలికలు కూడా సమాజానికి ఒక బలం అనే భావనను పెంపొందించడం దీని లక్ష్యం. ఎలా జరుపుకుంటారు.. పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం.  వ్యాసరచన, ప్రసంగ పోటీలు, బాలికల హక్కులపై చర్చలు, ర్యాలీలు.  ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం. బాలికలను ప్రోత్సహించే  కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఈ రోజును జరుపుకుంటారు. బాలికల గౌరవం, హక్కులు, భవిష్యత్తుపై దేశంలోని ప్రతి ఒక్కరి  బాధ్యతను గుర్తు చేసే రోజు ఇది.   ముఖ్యంగా ఆడపిల్ల చదువు బారం  అనే రోజు నుండి బాలిక చదువుకుంటే  దేశం అభివృద్ధి చెందుతుంది అని దేశం మొత్తం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఇలాంటి రోజులను నిర్వహిస్తూ ప్రజలలో అవగాహన కల్పించడం వల్లే వచ్చింది. బాలికల చదువును ప్రోత్సహించి, వారి రక్షణ చూసుకోవాల్సిన బాధ్యత దేశ పౌరుల మీద ఖచ్చితంగా ఉంటుంది.                            *రూపశ్రీ.
నేటి తరానికి పెద్దవారంటే చాదస్తపు మనుషులు.  కొంచెం కూడా ఫ్యాషన్ తెలియని మొరటు మనుషులు.  అమ్మమ్మలు, తాతయ్యలు అంటే కేవలం పాకెట్ మనీ లేదా పుట్టినరోజు, పండుగ రోజుకు డబ్బులు ఇచ్చే వారుగా మాత్రమే తెలుసు చాలామందికి.  కానీ వారి జీవితం ఎన్నో అనుభవాలను,  జీవిత పాఠాలను పోగేసుకొని ఉంటుంది.  చాలామంది పెద్దలు కూడా తమ మనవళ్లు,  మనవరాళ్లతో ఏదైనా మాట్లాడాలన్నా నేటికాలం యువత నుండి పిల్లల వరకు అస్తమానం పోన్లు చేతితో పట్టుకుని వాటికే ప్రాధాన్యత ఇస్తుంటారు.  తిన్నావా లేదా తినడానికి ఏమైనా కావాలా అని అడగడం లేదా ఏమైనా చేసివ్వాలా లేదా తెచ్చివ్వాలా  అని అడగడం వరకే ఉంటుంది. కానీ  వారి జీవితంలో ఎన్నో బయటకు తెలియని కథలు ఉంటాయి. పెద్దవారిని కొన్ని ప్రశ్నలు అడగడం ద్వారా.. వారిచ్చే సమాధానాలు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పుతాయి.  ఇంతకీ పెద్దవారిని అడగాల్సిన ప్రశ్నలు ఏంటి? తెలుసుకుంటే.. చిన్నతనం జ్ఞాపకాలు.. ప్రతి తరానికి జీవనం,  పరిస్థితులు,  సౌకర్యాలు,  ఇబ్బందులు అన్నీ మారుతూ ఉంటాయి.  30 ఏళ్ల కిందట ఉన్న సమస్యలు ఇప్పుడు లేవు, ఇప్పుడున్న సమస్యలు రేపటి తరానికి ఉండకపోవచ్చు.  బాల్యం కూడా అంతే.. పెద్దవారి బాల్యం గురించి ఒక్కసారి కదిలిస్తే.. వారి బాల్యం ఎన్నో పాఠాలు నేర్పుతుంది.  నేటికాలంలో మనకు లభిస్తున్న,  లభించిన జీవితం,  సౌకర్యాలు ఎంత గొప్పవో అర్థం అవుతుంది. అభిరుచులు.. వయసుతో పాటు అభిరుచులు మారుతూ ఉంటాయి.  పెద్దవారు కూడా వారి చిన్నతనం నుండి అభిరుచులు ఎలా ఉన్నాయి.  ఎంత వయసు పెరిగినా మారని  అభిరుచులు ఏంటి  అని అడిగితే.. వారు చెప్పే సమాధానంలో.. కాలం మారిన చెదరని ఎన్నో లక్ష్యాలు కనిపిస్తాయి.   జ్ఞాపకాలు.. పెద్దల జీవితం చాలా వరకు జ్ఞాపకాలలోనే మూలుగుతూ ఉంటుంది. వారి జ్ఞాపకాలను తిరిగి తీసుకొచ్చే విషయాలను కదిలిస్తే వారి జీవితంలో ఎంతో గొప్ప క్షణాలు బయటికి వస్తాయి.  అవి నేటి తరం వారికి ఎన్నో పాఠాలు నేర్పుతాయి. చెప్పలేని విషయాలు..  ప్రతి ఒక్కరికి కొన్ని రహస్యాలు ఉంటాయి.  చాలామంది గురించి బయటకు తెలిసిన విషయాలే కాకుండా,  బయటకు తెలియని విషయాలు కూడా ఉంటాయి. పెద్దలను ఒక్కసారి వీటి గురించి కదిలిస్తే వారిలో ఉన్న మరొక కోణం కూడా తెలుస్తుంది.  ఆ వయసులో వారి గురించి ఇలా తెలియడం పట్ల వారు కూడా ఎంతో సంతోషిస్తారు. కష్టాలు.. కష్టాలు ప్రతి ఒక్కరికి సహజం.  అయితే కొన్నేళ్ళ కిందట పెద్దలు ఎదుర్కున్న కష్టాల  గురించి వెంటే.. వాటి ముందు నేటి తరం వారి కష్టాలు దూదిపింజలా అనిపిస్తాయి.  నిజానికి ఈ కాలం వారు సమస్యలను ఎదుర్కోవడానికి,  ధైర్యంగా ఉండటానికి పెద్దల కష్టాలను వినడం కూడా గొప్ప ఊరట,  మనోనిబ్బరం ఇస్తాయి. సలహా.. పెద్దలు ఏదైనా చెప్పినా, సలహా ఇచ్చినా.. వారి జీవితంలో అప్పటికే ఎదురైన కొన్ని అనుభవాల ఆధారంగా ఇస్తారు. అంతే కానీ వయసు పెరిగింది కాబట్టి పెద్దరికంతో ఇస్తున్నారు అనుకోకూడదు.  వారు ఇచ్చే సలహాలు,  చెప్పే విషయాలు జీవితాన్ని మార్చే  గొప్ప పాఠాలు,  మలుపులు కాగలవు. ఆనందం.. ఆనందం అంటే సినిమా చూడటం, తినడం,  నచ్చినట్టు బ్రతకడం  అనుకుంటారు చాలా మంది.  కానీ ఆనందం గురించి పెద్దలను అడిగితే ఖచ్చితంగా తృప్తి అనే కోణంలో సమాధానం వస్తుంది. ఏ పుస్తకం అందించలేని జ్ఞానాన్ని పెద్దలు చెప్పే విషయాలు నేర్పుతాయి. పైన పేర్కొన్న ప్రశ్నలు.. కేవలం పెద్దలను పలకరించడానికి కాదు.. వారు చెప్పే సమాధానాలు ప్రతి వ్యక్తికి ఏ పుస్తకంలోనూ దొరకని పాఠాలు అవుతాయి.  జీవితంలో ఏదో ఒక సందర్భంలో పెద్దల సమాధానాలు పరిష్కారాలు చూపుతాయి.                                  *రూపశ్రీ.
సుభాష్ చంద్రబోస్ పేరు వెంటే భారతీయుల ఒళ్ళు పులకరిస్తుంది.  ముఖ్యంగా భారత యువతలో దేశ భక్తి పొంగుతుంది.  భారతీయులను బానిసలుగా చేసుకుని దేశాన్ని దోచుకున్న బ్రిటీషు వారిని గడగడలాడించిన వ్యక్తిగా  సుబాష్ చంద్రబోస్ అందరికీ సుపరిచితం.  అందరూ బోస్ అని ముద్దుగా పిలుచుకునే చంద్రబోస్ జనవరి 23వ తేదీ,  1897లో జన్మించారు. ఈయన జన్మస్థలం కటక్.. జానకీనాథ బోస్,  ప్రభావతి దేవి ఈయన తల్లిదండ్రులు. సుభాష్ చంద్రబోస్ జయంతి రోజును పరాక్రమ్ దివస్ గా జరుపుకుంటారు.  ఆయన దైర్యం, త్యాగానికి ప్రతీకగా ఈ రోజును జరుపుకుంటారు. ఆయన జీవితం అంతా తెలిసినదే అనిపించినా, బయటికి ఎక్కువగా రాని రహస్యమైన, కీలకమైన, లోతైన విషయాలు చాలానే ఉన్నాయి. వాటి గురించి స్పష్టంగా తెలుసుకుంటే.. బ్రిటీష్ ఇంటెలిజెన్స్ విషయంలో.. గాంధీజీని బ్రిటిష్‌లు “నెగోషియబుల్ శత్రువు”గా చూశారు. కానీ సుభాష్ చంద్రబోస్‌ను మాత్రం “నియంత్రించలేని విప్లవకారుడు”గా పరిగణించారు. బ్రిటిష్ MI5, MI6 ఫైళ్లలో ఆయన పేరు మీదే అత్యధిక నిఘా నివేదికలు ఉన్నాయి.  ఆయనపై నిఘా భారతదేశంలోనే కాదు.. జర్మనీ, ఇటలీ, జపాన్‌లలో కూడా సాగింది. ఈ వ్యక్తి బ్రిటిష్ సామ్రాజ్యానికి చాలా ప్రమాదకారి అని ఒక బ్రిటిష్ అధికారి వ్యాఖ్యానించారంటే బోస్ వారిని ఎంత భయపెట్టి ఉంటాడో ఊహించుకోవచ్చు. అంటే బ్రిటిష్‌లు నిజంగా భయపడింది గాంధీజీ కంటే ఎక్కువగా నేతాజీకే. జర్మనీ–హిట్లర్ సంబంధం.. నిజానిజాలు.. చాలామంది నేతాజీ హిట్లర్‌తో కలిసి పనిచేశాడు బోస్ గురించి అపార్థం చేసుకున్నారు.  కానీ నేతాజీకి హిట్లర్ జాతి సిద్ధాంతాలపై తీవ్ర అసహ్యం ఉంది. భారతీయులు ఆర్యులు కాదు అన్న హిట్లర్ వ్యాఖ్యను నేతాజీ తీవ్రంగా ఖండించాడు. హిట్లర్‌ను కలవడానికే నేతాజీ పెద్దగా ఆసక్తి చూపలేదు కాకపోతే ఆయన చెప్పింది మాత్రం ఒక్కటే.. బ్రిటిష్ శత్రువు – నా మిత్రుడు అని. ఇది వ్యూహం మాత్రమే, సిద్ధాంతం కాదు. ఆజాద్ హింద్ ప్రభుత్వం.. ఇది కేవలం ప్రతీక కాదు. 1943లో నేతాజీ స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని ప్రకటించారు.  జపాన్, జర్మనీ, ఇటలీ సహా 9 దేశాలు అధికారికంగా గుర్తించాయి. ఆయన వద్ద  స్వంత కరెన్సీు, పోస్టల్ స్టాంపులు, న్యాయస్థానాలు, మహిళా సైన్యం కూడా  ఉన్నాయి.  భారతదేశానికి గాంధీజీ కంటే ముందే  ప్రధాని లాంటి పాత్రను నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోషించాడు. మహిళలకు యుద్ధంలో స్థానం.. రాణి ఝాన్సీ రెజిమెంట్:- ఇది పూర్తిగా మహిళలతో కూడిన యుద్ధ విభాగం. అప్పట్లో యూరప్‌లో కూడా ఇది అసాధారణం. మహిళలు ఆయుధాలు ధరించి ముందుండాలని నేతాజీ స్పష్టంగా చెప్పారు  భారతదేశంలో మహిళా సాధికారతను యుద్ధ స్థాయికి తీసుకెళ్లిన తొలి నాయకుడు ఆయన. గాంధీజీతో విభేదాలు.. గాంధీకి, నేతాజీకి  మధ్య విభేదాలు ఉన్న..  గాంధీజీ నేతాజీని దేశభక్తులలో దేశభక్తుడు అన్నారు. నేతాజీ గాంధీజీని జాతిపిత అని గౌరవించారు. వివాదం ఒక్కటే.. గాంధీజీ అహింసనే ఆయుధంగా మార్చుకున్నాడు. అదే దిశలో పోరాటం జరగాలని అనుకున్నాడు. కానీ నేతాజీ మాత్రం.. అవసరమైతే సాయుధ పోరాటం తప్పు కాదని, సాయుధ పోరాటంతోనే బ్రిటీషర్ల నుండి దేశానికి విముక్తి సాధ్యమని స్పష్టం చేశారు. గాంధీ,నేతాజీ మధ్య వ్యక్తిగత శత్రుత్వం ఏదీ లేదు.. రెండు మార్గాల మధ్య తాత్విక పోరాటమే వారి మీద శత్రువులు అనే ముద్ర వేసింది. రహస్య రేడియో ప్రసారాలు.. నేతాజీ రేడియో ప్రసారాల ద్వారా భారత ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ప్రసారాలు జర్మనీ, జపాన్ నుంచి జరిగాయి.  బ్రిటిష్‌లు ఆ సిగ్నల్స్‌ని ఆపలేకపోయారు. ఆ ప్రసారాలు వినడం నేరంగా ప్రకటించారు.  సమాచార యుద్ధంలో కూడా ఆయన ముందే ఉన్నారు. నేతాజీ మరణం.. మిస్టరీ.. నేతాజీ మరణం – ఇప్పటికీ ఓ మిస్టరీ నేతాజీ మరణం గురించి ఒక అధికార కథ ప్రచారంలో ఉంది. 1945లో తైవాన్ విమాన ప్రమాదం జరిగిందని, అందులో బోస్ మరణించాడని చెబుతారు. కానీ అనేక ప్రశ్నలు పజిల్స్ గా ఉండిపోయాయి.. విమాన ప్రమాదంలో శవం దొరకలేదు. ఆ శవం ఎక్కడుంని ప్రశ్న.. DNA పరీక్ష ఎందుకు జరగలేదని కూడా ప్రశ్న ఉంది. జపాన్ రికార్డుల్లో అస్పష్టత ఉంది.  భారత ప్రభుత్వం ఫైళ్లను దశాబ్దాల పాటు రహస్యంగా ఉంచింది. అన్నింటి కంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే..  నేతాజీ కుటుంబసభ్యులే విమాన ప్రమాద కథను అనుమానించారు. ఆయన మరణం కంటే ఆయన జీవించి ఉండవచ్చన్న సందేహమే ఎక్కువ బలంగా ఉంది. స్వతంత్ర భారతానికి ఆయన కల.. నేతాజీ దేశం గురించి చాలా కలలు కన్నాడు.  బలమైన కేంద్ర ప్రభుత్వం ఉండాలని,   శాస్త్రీయ, పరిశ్రమాధారిత ఆర్థిక వ్యవస్థ ఉండాలని,  మతపరమైన రాజకీయాలకు స్థానం ఉండకూడదని,  క్రమశిక్షణ, జాతీయవాదం ముఖ్యంగా ఉండాలని కోరుకున్నాడు. ఆయన బతికి ఉంటే, భారత రాజకీయ దిశ పూర్తిగా వేరేలా ఉండేదని చరిత్రకారుల అభిప్రాయం. 1946లో జరిగిన రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటుకి ప్రధాన ప్రేరణ.. INA ట్రయల్స్.. నేతాజీ ప్రభావమే..  ఇది బ్రిటీషర్లకు చాలా పెద్ద షాక్ ఇచ్చింది.  ఈ కారణంగానే నేతాజీ భారత్ ను వదిలి వెళ్లారని అంటారు. నేతాజీ అంటే ఒక నాయకుడు కాదు.. ఆయన శత్రువుల పాలిట సింహ స్వప్నం.  దేశాన్ని దోచుకున్నవారికి ఆయన పేరు ఒక భయంకరమైన ప్రశ్న..                                 *రూపశ్రీ. 
వేసవి కాలంలో చల్లని పదార్థాలు, చలి కాలంలో వెచ్చని ఆహారాలు తీసుకోవాలని అనుకోవడం చాలా సాధారణం. ముఖ్యంగా చలికాలంలో ఉదయాన్నే వేడివేడి టీ తాగందే చాలామందికి తెల్లవారదు కూడా.  లేవగానే ఒక కప్పుతో మొదలు పెట్టి,  పూటకు ఒకసారి టీ తాగడమే కాకుండా.. పని చురుగ్గా జరగడం కోసం శరీరానికి ఉత్సాహం తెచ్చుకోవడానికి పదే పదే టీ తాగుతూ ఉంటారు. అయితే ఏదైనా సరే.. తీసుకునే దాన్ని బట్టి ఔషధంగానూ పనిచేస్తుంది,  విషంగానూ పనిచేస్తుంది.   ప్రతి రోజూ ఎన్ని కప్పుల టీ తాగడం ఆరోగ్యానికి మంచిది.  ఎన్ని కప్పులు తాగడం హానికరంగా పరిగణించబడుతుంది. తెలుసుకుంటే.. శీతాకాలంలో ఒక కప్పు వేడి టీ శరీరం,  మనస్సు రెండింటినీ ప్రశాంతపరుస్తుంది. టీ  వెచ్చదనం చేతులకు ఉపశమనం కలిగిస్తే.. దాని నుండి వచ్చే ఆవిరి మొత్తం వాతావరణాన్ని హాయిగా చేస్తుంది. చలి రోజులలో చాలా మంది రోజంతా లెక్కపెట్టనట్టు టీ తాగడానికి ఇదే కారణం.  అది వారి రోజువారీ అలవాటుగా మారుతుంది. మితంగా  టీ తాగడం సాధారణంగా ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. కానీ ఎక్కువగా టీ తాగితే కొన్ని నష్టాలు కూడా  కలిగిస్తుంది. ఎక్కువ టీ తాగడం వల్ల కలిగే నష్టాలేంటి? టీ తాగితే కలిగే ప్రయోజనాలు,  నష్టాలేంటి? టీ ప్రయోజనాలు.. సరైన మొత్తంలో టీ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కొన్ని పరిశోధనలు క్రమం తప్పకుండా టీ తాగడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్,  టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని సూచిస్తున్నాయి. అయితే ఇది టీ రకం,  తీసుకునే పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. టీలోని ఫ్లేవనాయిడ్లు, కాటెచిన్లు వంటి యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.  కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయని అంటున్నారు. టీలోని కెఫిన్,  ఎల్-థియనిన్ కాంబినేషన్ మనస్సును ప్రశాంతపరుస్తుంది,  దృష్టిని మెరుగుపరుస్తుంది, కాఫీ కలిగించే ఆందోళనను నివారిస్తుంది. అల్లం లేదా పుదీనా వంటి హెర్బల్ టీలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో,  శరీర సహజ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. జలుబు  ఫ్లూ సీజన్‌లో  రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తాయి. టీ తాగితే నష్టాలు.. అధికంగా టీ తాగడం వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి. ముఖ్యంగా కెఫిన్ ఉన్న టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. టీలోని టానిన్లు ఐరన్ శోషణకు ఆటంకం కలిగిస్తాయి. ఇది రక్తహీనతతో బాధపడేవారికి లేదా శాఖాహార ఆహారం తీసుకునేవారికి చాలా సమస్యగా  ఉంటుంది. రోజుకు 400 mg కెఫిన్ మించితే నిద్ర సమస్యలు, విశ్రాంతి లేకపోవడం,  హృదయ స్పందన రేటు పెరుగుదలకు దారితీస్తుంది. ఖాళీ కడుపుతో స్ట్రాంగ్  టీ తాగడం వల్ల వికారం, ఆమ్లత్వం లేదా తలతిరుగడం వంటివి జరుగుతాయి.  ఎక్కువకాలం  టీని ఎక్కువగా తాగడం వల్ల దంతాలు మరకలు పడతాయి.  కెఫిన్ వ్యసనానికి దారితీస్తుంది. రోజుకు ఎంత తాగితే మేలు.. ఎన్ని కప్పుల టీ తాగడం హాని కలిగిస్తుంది అనే విషయంలో చాలా మంది గందరగోళ పడుతుంటారు.  సాధారణంగా రోజుకు 3 నుండి 4 కప్పుల టీ తాగడం చాలా మందికి సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది.  కెఫిన్‌కు ఎక్కువ సెన్సిటివ్ గా ఉండేవారు లేదా కొన్ని ఆరోగ్య పరిస్థితులతో బాధపడేవారు టీ తీసుకోవడం పరిమితం చేసుకోవాలి. గర్భిణీ స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.  రోజుకు 2 కప్పుల కంటే ఎక్కువ తాగకూడదు.                        *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ఒకప్పుడు వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి కోల్పోవడం, శరీర వణుకు వంటి సమస్యలు వచ్చేవి. పెద్ద వయసులో ఇవి సాధారణం అని భావించేవారు. కానీ నేటి వేగవంతమైన జీవితాల్లో చిత్తవైకల్యం,  పార్కిన్సన్స్ వంటి వ్యాధులు ఊహించకుండా వచ్చేస్తున్నాయి.  అందులోనూ వయసుతో సంబందం లేకుండా చాలామంది ఈ సమస్యలు ఎదుర్కుంటున్నారు. ఈ రెండు వ్యాధులు  మెదడు పనితీరును ప్రభావితం చేస్తాయి. జన్యుశాస్త్రంతో పాటు,  జీవనశైలి కూడా ఈ వ్యాధులకు దోహదం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని వైద్యులు చెబుతున్నారు. మెదడు ఆరోగ్యంగా ఉండాలన్నా. చిత్త వైకల్యం,  పార్కిన్సన్స్ వంటి జబ్బులు రాకుండా ఉండాలన్నా మూడు అలవాట్లు  పొరపాటున కంటిన్యూ  చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుంటే.. నిద్ర.. శారీరక అలసటకు మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా నిద్ర చాలా అవసరం. మనం నిద్రపోతున్నప్పుడు మెదడు గ్లింఫాటిక్ వ్యవస్థ ద్వారా టాక్సిన్స్ తొలగిస్తుంది. వీటిలో అమిలాయిడ్-బీటా ప్రోటీన్ ఉంటుంది. ఇది అల్జీమర్స్,  చిత్తవైకల్యంతో నేరుగా కనెక్షన్ కలిగి ఉంటుంది. అందువల్ల క్రమం తప్పకుండా రోజుకు 6 గంటల కంటే తక్కువ నిద్రపోయే వ్యక్తుల మెదడులో హానికరమైన ప్రోటీన్లు పేరుకుపోతాయి. ఇవి మెదడు కణాలను నాశనం చేస్తాయి. రాత్రి నిద్ర ఆరోగ్యకరంగా ఉండాలంటే  ప్రతి రాత్రి ఒకే సమయంలో పడుకోవడం అలవాటు చేసుకోవాలి.   పడుకునే 1-2 గంటల ముందు  మొబైల్ ఫోన్ వాడటం మానేయాలి. అల్పాహారం.. అల్పాహారం మన మెదడుకు ఇంధనంగా పనిచేస్తుంది. రాత్రంతా ఆహారం లేకుండా శరీరం విశ్రాంతి స్థితిలో ఉంటుంది.  దీని  తర్వాత మెదడు సరిగ్గా పనిచేయడానికి గ్లూకోజ్ అవసరం. అందువల్ల, అల్పాహారం దాటవేసే వ్యక్తులకు పోషకాలు లోపిస్తాయి. ఇది మెదడు క్షీణత లేదా మెదడు కుంచించుకుపోయే ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది చిత్తవైకల్యం ప్రారంభానికి మూలం అయ్యే అవకాశం కలిగి ఉంటుంది. అందువల్ల అల్పాహారంలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, గింజలు,  తాజా పండ్లను చేర్చడం ముఖ్యం. ఇవి మెదడు కణాలను మరమ్మతు చేయడంలో సహాయపడతాయి. వ్యాయామం.. శరీరంలోని బద్ధకం మనస్సులో బద్ధకాన్ని కలిగిస్తుంది. వ్యాయామం శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది మెదడుకు తగినంత ఆక్సిజన్,  పోషకాలను అందిస్తుంది. అయితే వ్యాయామం లేకపోవడం వల్ల ఊబకాయం,  అధిక రక్తపోటు ప్రమాదం పెరుగుతుంది. ఇవి పార్కిన్సన్స్,  చిత్తవైకల్యానికి రెండు ప్రధాన ప్రమాద కారకాలు. శారీరకంగా చురుకుగా లేకపోవడం వల్ల మెదడులో డోపమైన్ స్థాయిలు తగ్గుతాయి. ఇది పార్కిన్సన్స్‌కు ప్రధాన కారణం. అందువల్ల ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు చురుకైన నడక, యోగా లేదా ఏదైనా ఇతర వ్యాయామం చేయాలి.                            *రూపశ్రీ.
క్యాన్సర్ ప్రపంచాన్ని కబళిస్తున్న జబ్బు. పూర్తీగా చెయ్యి దాటిన దశలో బయటపడటం అనే కారణం వల్ల క్యాన్సర్ అంటే ఇక మరణమే అనే అభిప్రాయం ఏర్పడింది.  క్యాన్సర్ కు వైద్యం ఉన్నా అది చాలా ఖర్చుతో కూడుకున్నది కావడంతో చాలా నరకం అనుభవించాల్సి వస్తుంది.  సింపుల్ గా చెప్పాలంటే.. క్యాన్సర్ ఒక మనిషి  శరీరాన్ని లోపలే విచ్చిన్నం చేయడమే కాకుండా.. ఒక కుటుంబాన్ని ఆర్థికంగా కూడా చితికిపోయేలా చేస్తుంది. నేటికాలంలో క్యాన్సర్ నిపుణులు కొన్ని ఆందోళనకరమైన మార్పులు గమనిస్తున్నారు. క్యాన్సర్ అంటే పెద్దవారిలో బయటపడేది అనుకునేవారు. కానీ నేటికాలంలో యువతలో కూడా క్యాన్సర్ బయటపడటం ఆందోళనగా మారుతోంది. కొంతమంది 20 లేదా 30 ఏళ్ల లోపు క్యాన్సర్ రోగులుగా మారుతున్నారు. రొమ్ము క్యాన్సర్ నుండి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వరకు అన్ని రకాల క్యాన్సర్‌లలో ఈ మార్పు కనిపిస్తోంది. శరీరాన్ని చాలా సైలెంట్ గా క్యాన్సర్ బారిన పడేలా చేసే 7 అలవాట్లు ఉన్నాయి. ఈ 7లో కూడా 3 పనులు చేసిన తర్వాత ప్రజలు చాలా గ్రేట్ గా ఫీలవుతూ ఉంటారు. అవేంటో అవి శరీరాన్ని క్యాన్సర్ బారిన పడేలా ఎందుకు చేస్తాయో.. తెలుసుకుంటే..   ప్రజలు మూడు పనుల విషయంలో చాలా గ్రేట్ ఫీలవుతారు.  పైగా వాటిని మార్చుకోవాలని కూడా అనుకోరు.  కానీ క్రమంగా అవి కణాలను,  హార్మోన్ల పనితీరును దెబ్బతీస్తాయి. ఉదాహరణకు.. గంటల తరబడి కూర్చోవడం వల్ల  తాము చాలా పని చేస్తున్నామని, చాలా భాద్యతగా ఉంటున్నామని అనుకుంటారు. ఇది విజయానికి  మంచిదే కానీ ఇది ఆరోగ్యపరంగా చాలా నష్టాలు కలిగిస్తుందని అంటున్నారు. అదేవిధంగా.. నిద్రించడానికి తగినంత సమయం లేకపోవడం వల్ల  తగినంత నిద్రపోని వారు అనేకమంది ఉన్నారు. కొంతమంది ఎక్కువగా మద్యం సేవించిన తర్వాత తమ సామర్థ్యం బాగా పెరిగిందని తమను తాము గొప్పగా చెప్పుకుంటారు. ఆహారం.. నేటికాలంలో ఆహారపు అలవాట్లు చాలా అనారోగ్యకరంగా తయారయ్యాయి. ప్యాక్ చేసిన స్నాక్స్, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు,  తక్కువ ఫైబర్ భోజనం ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇది ప్రేగులలోని బ్యాక్టీరియా సంఖ్యను ప్రభావితం చేస్తుంది. ఇది పెద్దప్రేగు,  గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌కు దారితీస్తుంది. యాంటీబయాటిక్ ఎక్కువ వాడటం కూడా ఈ ప్రమాదాన్ని పెంచుతుంది. పొల్యూషన్.. పర్యావరణ,  కాలుష్య కారకాలు క్యాన్సర్‌కు ప్రధాన కారణం. చుట్టూ ఉన్న కలుషితమైన గాలి,  ఇంటి లోపల,  వెలుపల గాలిని ప్రమాదకరంగా మారుస్తోంది. PM2.5,  వాయు కాలుష్యం నుండి వచ్చే టాక్సిన్స్ శరీరంలోకి ప్రవేశించి వాపుకు కారణమవుతాయి. రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి.  DNA ను దెబ్బతీస్తాయి. ఇది ధూమపానం చేయని వారిలో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణమవుతుంది. జన్యువులు.. చిన్న వయసులోనే క్యాన్సర్ వచ్చే వ్యక్తులు జన్యు కారణాల వల్ల ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉండటం వలన BRCA వంటి  సమస్యలు  సంభవించవచ్చు. అనారోగ్యకరమైన వాతావరణంలో జీవించడం దీని ప్రమాదం పెరుగుతుంది. పరీక్షలు.. యువతలో చాలామంది తమకు ఎదురయ్యే  ఆరోగ్య సమస్యలను లైట్ తీసుకుంటారు. మాది చిన్న వయసు మాకేం జబ్బులు వస్తాయి అని అనుకుంటారు. ఈ వయసులో క్యాన్సర్ ఎలా వస్తుందనే ఆలోచన యువతలో ఉంటుంది. దీనివల్ల ఈ ప్రాణాంతక వ్యాధిని గుర్తించడం ఆలస్యం అవుతుంది.  చికిత్స కష్టమవుతుంది.  దీర్ఘకాలిక నొప్పి, ఆకస్మికంగా బరువు తగ్గడం, మలద్వారం నుండి రక్తస్రావం, ఎప్పుడూ  దగ్గు రావడం,  రొమ్ములో ముద్దగా ఉండటం,  మూత్ర విసర్జన అలవాట్లలో మార్పు లేదా నోటిలో పూతలు ఎక్కువ కాలం ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.                         *రూపశ్రీ.