ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య   సమన్వయం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం   కూటమి ప్రభుత్వ స్థిరత్వంలో కీలక భూమిక పోషిస్తోంది. అలాగే కూటమి భాగస్వామ్య పార్టీల ఐక్యతకు ఊతంగా నిలుస్తోంది.  గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు.  ఇందుకు పవన్ కల్యాణ్ ఆరోగ్య సమస్య కారణం. గత కొంత కాలంగా ఆయన పలు కేబినెట్ భేటీలకు హాజరు కాలేదు. ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమాలలోనూ కనిపించలేదు. దీంతో వైసీపీ తెలుగుదేశం, జన సేన మధ్య విభేదాలు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎడముఖం పెడముఖం అంటూ కథనాలు వండి వార్చాయి. కూటమిలో చీలిక అంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశాయి. అయితే వైసీపీ ఆరోపణలు, విమర్శలు, ప్రచారాన్ని పూర్వ పక్షం చేస్తూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల మధ్య సయోధ్య ఇసుమంతైనా సడలలేదనడానికి నిదర్శనంగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించారు.  నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో మంగళవారం (సెప్టెంబర్ 29)న నిర్వహించిన పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వేదిక పంచుకున్నారు. చాలా కాలం తరువాత, పొలిటికల్ భాషలో చెప్పాలంటే సుదీర్ఘ విరామంతరువాత  ఈ ఇద్దరూ ఒకే వేదికను పంచుకోవడం ఇటు తెలుగుదేశం శ్రేణుల్లోనూ, అటు జనసేన క్యాడర్ లోనూ ఉత్సాహాన్ని నింపింది.  భుజం నొప్పికి శస్త్ర చికిత్స చేయించుకున్న పవన్ కల్యాణ్.. ఆ తరువాత కేరళలో చికిత్స, పునరావాసం తీసుకున్నారు. ఇప్పుడు పూర్తిగా కోలుకుని మళ్లీ క్రియాశీలంగా ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ, పార్టీ వ్యవహరాలలోనూ క్రియాశీలంగా పాల్గొంటున్నారు. ఈ పరిణామంతొ వైసీపీ సైలెంట్ అయిపోయింది. విభేదాలంటూ ఆ పార్టీ పెద్ద ఎత్తున చేసిన ప్రచారానికి పవన్ కల్యాణ్ చంద్రబాబులు ఒకే వేదికపై కనిపించడం చెక్ పెట్టింది.  [Palle Panduga, Chandrababu Naidu, Pawan Kalyan, Andhra Pradesh Rural Development, Nellore Ramapuram Meeting, Check, YCP Rumors, Telugu One]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైసీపీ తీరు ఎప్పుడూ వివాదాస్పదమే. ఆ పార్టీ ఆరోపణలు, విమర్శలకు ఆధారాల ఉండాలని భావించదు. ఆ పార్టీ ఎకో సిస్టమ్ (వ్యవస్థ)లోనే ఈ లోపం ఉందన్నది పరిశీలకుల విశ్లేషణ. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి విదేశీ పర్యటనపై కూడా వైసీపీ ఆరోపణలు గుప్పిస్తున్నది.  ఏపీ పొలిటికల్ ఎరీనాలో వైసీపీ తీరు ఎప్పుడూ విలక్షణమే. చంద్రబాబు విదేశీ పర్యటనపై  వైసీపీ సోషల్ మీడయా వింగ్ లో గత రెండు రోజులుగా   ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  చంద్రబాబు రహస్యంగా వియత్నాం   పర్యటనకు వెళ్లారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. చెప్పాపెట్టకుండా చంద్రబాబు చేపట్టిన ఈ విదేశీ పర్యటన వెనుక భారీ కుట్ర ఉందంటూ క్యాంపెయిన్ ఆరంభించింది.   వైసీపీ ప్రచారాన్ని మంత్రి నారా లోకేష్ కొట్టి పారేశారు. ఎదుటి వారి  మీద పడి ఏడవడం మాని మీ పని చూసుకోండంటూ సుతిమెత్తగా కాకుండా ఘాటుగా, దీటుగా ఆ దుష్ప్రచారానికి చెక్క పెట్టారు. చంద్రబాబు దంపతులు వారి మనవడితో కలిసి చిన్న హాలీడే ట్రిప్ కు వెళ్లారని లోకేష్ స్పష్టం చేశారు. పనీ పాటా లేని వైసీపీ చంద్రబాబు పర్యటనపై అర్ధంపర్ధం లేని ప్రచారం చేస్తోందన్నారు. వైసీపీ ప్రచారంపై సామాజిక మాధ్యమ వేదికలో స్పందించిన లోకేష్..  సీఎం చంద్రబాబు, భువనేశ్వరి తమ మనుమడు దేవాన్ష్‌తో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లారనీ, అది పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు కూడా మనుషులేనన్న వాస్తవాన్ని ఇక్కడ గమనించాలి. పొలిటికల్ యాక్టివిటీస్ తో ఎంత బిజీగా ఉన్నా కుటుంబంతో కూడా కొంత సమయం గడపాలి కదా. చంద్రబాబు అందుకు మినహాయింపు కూడా ఏమీ లేదు. అయినా.. స్థానిక ఎన్నికల వేళ విదేశీ పర్యటనకు సిద్ధమైన జగన్ ను వదిలేసి వైసీపీయులు, చంద్రబాబు మనవడిని తీసుకుని భార్యతో హాలీడే ట్రిప్ కు వెళ్లడంపై దుష్ప్రచారం ఏంటని పరిశీలులు విమర్శస్తున్నారు. అది పక్కన పెడితే..  విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు. అయినప్పటికీ, వైఎస్సార్‌సీపీ మాత్రం ఆయన విదేశీ పర్యటనపై పుంఖాను పుంఖాలుగా కథనాలను వండి వారుస్తోంది.  [Chandrababu Naidu, YCP, AP Politics, Personal Tour, YCP Social Media, Naralokesh, Telugu One]
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  దక్షిణాది ప్రజల సాంస్కృతిక, మత గుర్తింపునకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారాయి.  దేశ రాజధాని హస్తినలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఉత్తర, దక్షిణ భారతదేశ ప్రజల సాంస్కృతిక, మతపరమైన గుర్తింపుల గురించి చేసిన విశ్లేషణ రాజకీయదుమారాన్ని రేపింది. రాజకీయ ప్రయోజనాల కోసం సమాజంలో విభజన తెచ్చేలా సీఎం రేవంత్ మాట్లాడారంటూ బీజేపీ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తోంది.   దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజల ఆరాధనా విధానాలు, దేవుళ్ల ప్రాధాన్యతను వివరిస్తూ.. రేవంత్ రెడ్డి ఆ మీడియా సమావేశంలో దక్షిణాది  వారు ద్రావిడులని, ఉత్తరాది వారులు  ఆర్యులని అన్నారు.   దక్షిణాది వారు శివభక్తులు, ఉత్తరాది వారు శ్రీరామ భక్తులుగా అభివర్ణించారు.  అక్కడితో ఆగకుండా  బీజేపీ నాయకులు ఎప్పుడూ  జై శ్రీరామ్ నినాదాలకే పరిమితమవుతారని,  హర హర మహాదేవ్'అని ఎందుకు అనరని నిలదీశారు. శివుడిని పేదల దేవుడిగా, రాముడిని ధనవంతుల దేవుడిగా అభివర్ణిస్తూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. పెను వివాదానికి హేతువయ్యాయి.   రేవంత్ర రెడ్డి వ్యాఖ్యలపై  నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.  ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే హిందువులను ప్రాంతాల వారీగా, దేవుళ్ల పేరుతో విడగొట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విమర్శిస్తున్నారు. సోమనాథ్ ఆలయ నిర్మాణం మొదలుకొని అనేక ధార్మిక ప్రాజెక్టులను గతంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించిందని, ఇప్పుడు మళ్లీ అదే వైఖరిని ప్రదర్శిస్తోందని గుర్తు చేస్తున్నారు.  అంతేకాకుండా..  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  జై శ్రీరామ్'తో పాటు 'హర హర మహాదేవ్ అని కూడా నినదించే   అంటున్నారు. రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.  హిందువుల మధ్య ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడమే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా కనిపిస్తోందని దుయ్యబట్టారు.   [Revanth Reddy Comments, Lord Rama, Lord Shiva controversy, BJP,  Congress, North South India Identity, National politics, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
NTR addressed his fans at the Don't Trouble The Trouble movie event. He remarked that he is currently nursing his hand and recovering from surgery. He reassured everyone that his highly anticipated Dragon is not delayed but it right on the mark as planned. At the event, he looked highly emotional as he shared his relationship with SS Rajamouli's family and SS Karthikeya, who is debuting as producer with DTTT. The movie stars Fahadh Faasil, Ssara in leading roles. NTR attended the event as chief guest and this helped the buzz of the film. NTR called Fahadh has his most favourite actor and highly talented, who inspires him to push for excellence.  When fans pressed him about his next biggie, Dragon update, he stated that the movie is on track to release on time. He further commented that he is feeling lazy after the surgery but his fans have given him josh to join the sets. He stated that they are working hard to meet the deadlines and film will be a big treat.  Prashanth Neel is directing the film and the movie glimpse rose expectations to next level. Mythri Movie Makers are producing the magnum opus with Rukmini Vasanth playing the leading lady. Meanwhile, Don't Trouble The Trouble is releasing on 2nd October and it features magical elements about a thief finding a genie.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’పై రోజుకో కొత్త వార్త బయటకు వస్తోంది. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా విడుదల విషయంలో మరో ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. ‘రాకా’ను ఒకే భాగంగా కాకుండా రెండు భాగాలుగా తీసుకొచ్చే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ‘రాకా’ను రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయితే.. మొదటి భాగాన్ని 2027 డిసెంబర్‌లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్. అలా కాకుండా సినిమాను ఒకే భాగంగా విడుదల చేయాలని నిర్ణయిస్తే మాత్రం.. పూర్తి సినిమాను 2028లో రిలీజ్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అంటే ‘రాకా’ విడుదల ఎప్పుడు అనేది.. సినిమా రెండు భాగాలుగా వస్తుందా? లేదా ఒక్క భాగంతోనే కథను ముగిస్తారా? అనే నిర్ణయంపైనే ఆధారపడి ఉందన్నమాట. భారీ కథ, పెద్ద క్యాన్వాస్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తీస్తే కథకు మరింత స్పేస్ దొరుకుతుందని మేకర్స్ భావిస్తున్నారట. అదే సమయంలో ఒకే భాగంగా తీసుకురావడం వల్ల కథను ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చనే ఆలోచన కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో రెండు భాగాలుగా చేయాలా? లేక ఒకే సినిమాగా పూర్తి చేయాలా? అనే విషయంలో చిత్రబృందం ప్రస్తుతం తర్జన భర్జనలు పడుతున్నట్లు టాక్. ఇది కూడా చదవండి: డ్రాగన్ రిలీజ్ డేట్.. వాయిదాపై క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్.!       [Allu Arjun Raaka Movie, Raaka Release Date, Raaka Movie Two Parts, Raaka Release Plan, Allu Arjun Atlee Movie, Icon Star Allu Arjun, Allu Arjun New Movie, Telugu Film News]
    'ఎందరిని ఏ దరికి చేర్చినా, సంద్రాన ఒంటరిగా మిగలదా నావ' అని ఒక రైటర్ రాసినట్టుగా ఉంది టాక్సిక్ ఓటిటి డేట్ పరిస్థితి. అరే ఓటిటిలో వస్తే ఎందుకు డిజాస్టర్ అయ్యిందో, ఏ ఏ లోపాలు పర్ఫెక్ట్ గా కుదిరాయో చూద్దాం అని అభిమానులు ఆశించేకొద్దీ o డేట్ వెనక్కి వెళ్ళిపోతూ ఉంది. పోనీ లేటుగా అయినా పర్ఫెక్ట్ డేట్ వస్తుందా అంటే అది లేదు.      సాధారణంగా ఏదైనా పెద్ద సినిమా థియేటర్లలో విడుదలైన నాలుగు నుండి ఆరు వారాల వ్యవధిలోనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో డిజిటల్ స్ట్రీమింగ్‌కు రావడం పరిపాటి. ఆ లెక్కన చూస్తే, 'టాక్సిక్' చిత్రం సెప్టెంబర్ 25వ తేదీ నాటికి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) లో విడుదలవుతుందని సోషల్ మీడియాలోనూ, పలు సినీ విశ్లేషణల్లోనూ ప్రచారం జరిగింది. కానీ తీరా సెప్టెంబర్ చివరి వారం పూర్తయినా అందుబాటులోకి రాకపోవడంతో అభిమానులు ముఖ్యంగా ఓటిటి ప్రేమికులు తీవ్ర నిరాశకి  గురవుతున్నారు. తాజాగా ఆడియన్స్‌కు మరో ఊహించని షాక్ తగిలింది. జీ5 సంస్థ అధికారికంగా విడుదల చేసిన అక్టోబర్ నెల ఓటీటీ రిలీజ్ క్యాలెండర్, స్ట్రీమింగ్ స్లేట్‌లో 'టాక్సిక్' చిత్రం పేరు ఎక్కడా కనిపించకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది కూడా చదవండి: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌ అంటే ఇదే: డోంట్ ట్రబుల్ ది ట్రబుల్      దీంతో అక్టోబర్ నెలలో కూడాస్ట్రీమింగ్ అయ్యే సూచనలు కనిపించడం లేదని స్పష్టమవుతోంది. మేకర్స్ నుంచి లేదా డిజిటల్ ప్లాట్‌ఫామ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో ఈ సస్పెన్స్ మరింత పెరిగింది.   ఈ అనూహ్య ఆలస్యానికి ప్రధాన కారణం సినిమా బిజినెస్ రీ నెగోషియేషన్లు అయివుండవచ్చని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. థియేట్రికల్ రన్‌కు ముందు కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారంగా బాక్సాఫీస్ వద్ద సినిమా వసూళ్లు సాధించలేకపోతే, ఓటీటీ డిజిటల్ హక్కుల ధరలలో కోత విధించడం లేదా స్ట్రీమింగ్ విండో వ్యవధిని మార్చడంపై ప్రొడ్యూసర్లకు, ఓటీటీ సంస్థలకు మధ్య చర్చలు జరగడం సాధారణమే. అంతేకాకుండా, ఓటీటీ వెర్షన్ కోసం ప్రత్యేకంగా ఆల్టర్నేట్ కట్ తయారుచేస్తున్నారనే ప్రచారం సైతం జరుగుతోంది. ఏది ఏమైనా ఫ్యాన్స్ , ఓటిటి ప్రేమికులు దిగులుపడవద్దని ఒక రోజు మాత్రం టాక్సిక్ 'రాక' కన్ఫార్మ్ అని తెలుసుకుపోవాలి. సినీ ధర్మం కూడా.     [Toxic Ott Release Date Delayed Again,Toxic, yash, Kaira Adwani,  Zee5 Toxic, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tolywood News]
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'డ్రాగన్'. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమాను 2027, జూన్ 11న విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. అయితే ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో 'డ్రాగన్' షూటింగ్ కి బ్రేక్ వచ్చింది. దీంతో ఈ మూవీ జూన్ నుంచి అక్టోబర్ కి వాయిదా పడుతుంది అంటూ వార్తలొచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజంలేదని తేలిపోయింది. తాజాగా జరిగిన 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' మూవీ ప్రీ రిలీజ్ కి గెస్ట్ గా హాజరైన ఎన్టీఆర్.. 'డ్రాగన్' రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు. ముందుగా చెప్పినట్టుగా జూన్ 11నే విడుదలవుతుందని స్పష్టం చేశారు. ఈ ఈవెంట్లో పాల్గొన్న మైత్రి నిర్మాతలు సైతం.. ఇదే విషయాన్ని తెలిపారు. ఎన్టీఆర్ త్వరలోనే 'డ్రాగన్' షూటింగ్ లో జాయిన్ కానున్నారు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి.. ఆ తర్వాత త్రివిక్రమ్ మైథలాజికల్ ప్రాజెక్ట్ 'గాడ్ ఆఫ్ వార్' పైకి తన ఫోకస్ ను షిఫ్ట్ చేయనున్నారు. ఇది కూడా చదవండి: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌ అంటే ఇదే.. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్        [NTR Dragon Release Date, Don't Trouble The Trouble, Jr NTR Speech, NTR Neel Movie, Dragon On June 11 2027, Jr NTR Latest, SS Rajamouli, Prashanth Neel, Telugu Film News]  
  మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది! మాటలు సైతం మురిసిపోవు. ఎస్, ఎన్టీఆర్ మాట్లాడుతుంటే మాటలు సైతం మురిసిపోతాయని బుల్లి సినీ ప్రేమికుడ్ని అడిగినా చెప్తాడు. అచ్చులు, హల్లులుగా పుట్టినందుకు అక్షరాలు సైతం మురిసిపోవడంలో పోటీ పడుతుంటాయి. నిన్న జరిగిన 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' ఈవెంట్ లోను మరోసారి  అదే జరిగింది. మరి ఆ మాటలేంటో చూద్దాం. ‘ఎన్టీఆర్ మాట్లాడుతు 'కోవిడ్ అనే టఫ్ సమయంలో ఒక టాలెంట్ నెమ్మదిగా మనలోకి వచ్చింది. అదే ఫాహద్ సార్. మొదటిసారి బెంగళూరులో ఆయన సినిమా చూశా. నాకు అతి తక్కువ మంది యాక్టర్స్ ఇష్టం. అందులో మొదటి వ్యక్తి ఫాహద్ ఫాజిల్. దేశం గర్వించదగ్గ నటుడు ఫాహద్. ఆయన తెలుగులో మొదటిసారి లీడ్ యాక్టర్ గా చేస్తున్న ఫాహద్ గారికి మంచి విజయం దక్కుతుందని నమ్ముతున్నా. దర్శకుడిగా  శశాంక్ మొదటి సినిమా ఈ  డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఈ సినిమా ఆయనకు గొప్ప విజయం అందించాలని కోరుకుంటున్నా. కార్తికేయ ఈ రోజు నిర్మాతగా ఇక్కడ నిలబడటం చాలా సంతోషంగా ఉంది. మా జక్కన్న చేసే ప్రతి ప్రయత్నంలో కార్తికేయ ఉన్నాడు. ఆర్ఆర్ ఆర్,బాహుబలి సినిమాల వెనుక మా తమ్ముడు కార్తికేయనే ఉన్నాడు. కార్తికేయ కెరీర్ లో ఈ సినిమా గొప్ప చిత్రంగా నిలవాలని కోరుకుంటున్నా.  ఇది కూడా చదవండి: సంచలన వార్త: కుప్పకూలిన ఇరుముడి మూవీ బ్రిడ్జ్    గాయం నుంచి కోలుకున్నా. డ్రాగన్ చెప్పిన సమయానికే విడుదల అవుతుంది అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఈవెంట్ లో అభిమానుల గుండెచప్పుడు మాత్రం ఎన్టీఆర్, రాజమౌళి కాంబోలో జర లేటు చెయ్యకుండా పాన్ ఇండియా మూవీ రావాలని. 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అక్టోబర్ 2న రిలీజ్ అవుతుండగా ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో  ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్ల మీద శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ  నిర్మించారు. శశాంక్ ఏలేటి దర్శకుడు. అక్టోబర్ 2 రిలీజ్ డేట్.   [Ntr Speech In Dont Trouble The Trouble, Ntr latest Speech,  Dont Trouble The Trouble Cast, Ntr, Rajamouli, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tolywood News]  
    ఇరుముడి సినిమా సాధించిన ఘన విజయం వెనక కథకి, సన్నివేశాలకి తగ్గ లొకేషన్స్. దీంతో ప్రేక్షకులు థియేటర్స్ లో ఉన్నంతసేపు  ఇరుముడితో కనెక్ట్ అయిపోయారు. ప్రకృతి రమణీయతకి  నిలయమైన ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలోని  పొల్లూరులో షూటింగ్ జరిగింది.  ఆ ఏరియాలో ‘ఇరుముడి’చిత్రీకరణ కోసం ప్రత్యేకంగా నిర్మాణం చేసిన సెట్టింగ్ బ్రిడ్జి కొండవాగుల వరద తాకిడికి పూర్తిగా కుప్పకూలి కొట్టుకుపోయింది. గడిచిన కొద్ది రోజులుగా ఎగువ ప్రాంతాల నుంచి కొండవాగులు, వంకల ద్వారా భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో పొల్లూరు జలపాతం ఉగ్రరూపం దాల్చింది. ప్రవాహ ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో జలపాత ప్రాంగణంలో నదిపై ఏర్పాటు చేసిన  రంగురంగుల ఐకానిక్ బ్రిడ్జి,నీటి హోరుకి తట్టుకోలేక క్షణాల్లో కొట్టుకుపోయిందని స్థానికులు వెల్లడించారు. ఇరుముడి’ ఘన విజయం సాధించిన తర్వాత పొల్లూరు ప్రాంత పర్యాటక రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. గతంలో రోజువారీగా కేవలం వందల సంఖ్యలోనే పర్యాటకులు వచ్చే ఈ ప్రదేశానికి, సినిమా విడుదలైన నాటి నుంచి సందర్శకుల ప్రవాహం విపరీతంగా పెరిగింది.  సాధారణ రోజుల్లో వేలాది మంది వస్తుండగా, ముఖ్యంగా వారాంతాలు మరియు సెలవు రోజుల్లో కనీసం 5,000 నుండి 10,000 మంది వరకు పర్యాటకులు ఈ జలపాతాన్ని సందర్శించేందుకు క్యూ కడుతున్నారు. సినిమాలో హీరో రవితేజ మరియు ఇతర నటీనటులు నటించిన ప్రదేశాలను ప్రత్యక్షంగా చూసి ఆస్వాదించేందుకు పర్యాటకులు, అభిమానులు విశేష ఆసక్తి కనబరుస్తున్నారు.   ఈ పర్యాటక ఆకర్షణలో అత్యంత ప్రత్యేకమైన భాగం సినిమా సెట్ కోసం వేసిన ప్రత్యేక వంతెన. జలపాతం ఉరుకులు పరుగుల మధ్య తీసిన దృశ్యాలను గుర్తుచేసుకుంటూ, పర్యాటకులు ఈ బ్రిడ్జిపై నిలబడి సెల్ఫీలు, రీల్స్, ఫోటోలు తీసుకోవడానికి గంటల తరబడి వేచి చూసేవారు. పర్యాటకులకు ఇది ఒక ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌గా మారింది. అయితే ఇప్పుడు ఈ వంతెన నీటిపాలవ్వడంతో అక్కడికి వస్తున్న పర్యాటకులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.        ప్రస్తుతం పొల్లూరు వద్ద వరద ఉధృతి ప్రమాదకర స్థాయిలో ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా పర్యాటక ప్రేమికులు, సందర్శకులు జలపాతం వద్దకు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. నదీ ప్రవాహంలోకి ఎవరూ దిగవద్దని, సురక్షిత ప్రాంతాల్లో మాత్రమే ఉండాలని స్థానిక పోలీసులు మరియు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అందుకే అంటారు  ప్రళయం కూడా ఒక మహోజ్వల రూపుడని, అతని  ముందు ఏది శాశ్వతం కాదని.     Irumudi Movie Bridge Collapses Polluru Waterfalls, Irumudi, Raviteja, Polluru, Priya Bhavani Shankar, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tolywood News
కామెడీ హీరోగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్ ప్రస్తుతం విభిన్న కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఆయన తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ స్పెషల్ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. తన కుమార్తె ఆయనా ఎవికా ఎడారా 10వ పుట్టినరోజు సందర్భంగా ఆమెతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ అల్లరి నరేష్ చేసిన ఈ పోస్ట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఫొటోల్లో అల్లరి నరేష్ తన కూతురితో కలిసి కనిపించారు. తండ్రి, కూతుళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని చూపించేలా ఉన్న ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా తన సినిమాలకు సంబంధించిన విషయాలతోనే సోషల్ మీడియాలో కనిపించే అల్లరి నరేష్.. అప్పుడప్పుడు తన కుటుంబానికి సంబంధించిన ప్రత్యేక సందర్భాలను కూడా అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా కూతురి పుట్టినరోజు సందర్భంగా షేర్ చేసిన ఫొటోలు కూడా నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఆయనా ఎవికా 10వ పుట్టినరోజు సందర్భంగా అల్లరి నరేష్ అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా షేర్ చేసిన ఫొటోల్లో తండ్రి, కూతురు ఇద్దరూ ఎంతో ఆనందంగా కనిపించడంతో అభిమానులు కూడా తమదైన శైలిలో విషెస్ చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ బర్త్‌డే ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. అల్లరి నరేష్ ఇటీవల ‘రంభ ఊర్వశి మేనక’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కామెడీతో పాటు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న ఆయన.. ప్రస్తుతం మరికొన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు ఆయన కూతురి 10వ పుట్టినరోజు సందర్భంగా షేర్ చేసిన ఈ స్పెషల్ ఫొటోలు మాత్రం అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.       [Allari Naresh, Allari Naresh Daughter, Ayana Evika Edara, Allari Naresh Daughter Birthday, Ayana Evika Birthday, Allari Naresh Family Photos, Allari Naresh Daughter Photos, Telugu Cinema News, Allari Naresh Latest News]
విభిన్నమైన కథలు, పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీ విష్ణు ప్రస్తుతం ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జనకీరామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రెండు పాటలు విడుదల కాగా.. తాజాగా మూడో సింగిల్‌ను చిత్రబృందం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ‘ఎత్తర ఎత్తు.. పిడికిలి ఎత్తు’ అంటూ సాగే ఈ పాట ఇప్పుడు మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. ఈ పాటకు ప్రముఖ రచయిత భాస్కరభట్ల సాహిత్యం అందించగా.. నల్గొండ గద్దర్ నర్సన్న తనదైన శైలిలో ఆలపించారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించిన ఈ సాంగ్‌లో మాస్ బీట్‌తో పాటు పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించేలా లిరిక్స్ ఉన్నాయి. సినిమా కథకు తగ్గట్టుగా ఈ పాటను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు కొనసాగింపుగా వచ్చిన ఈ మూడో సింగిల్‌తో సినిమాపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు. ‘కామ్రేడ్ కళ్యాణ్’లో శ్రీ విష్ణుకు జోడీగా మహిమా నంబియార్ కనిపించనుండగా.. రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ, కోనా ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1992 నాటి ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనున్నట్లు ఇప్పటికే చిత్రబృందం వెల్లడించింది. శ్రీ విష్ణు ఈ సినిమాలో ‘కామ్రేడ్ కళ్యాణ్’గా ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడనే ఆసక్తి అభిమానుల్లో ఉంది. అక్టోబర్ 9న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం పాటలతో పాటు ఇతర ప్రమోషనల్ కంటెంట్‌ను విడుదల చేస్తూ సినిమాపై అంచనాలను పెంచుతోంది చిత్రబృందం.     [Sree Vishnu, Comrade Kalyan, Comrade Kalyan Song, Etthara Etthu Song, Sree Vishnu Latest Movie, Mahima Nambiar, Vijai Bulganin, Bhaskarabhatla, Nalgonda Gaddar Narsanna, Comrade Kalyan Release Date]
సూపర్‌స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జైలర్’ సినిమా 2023లో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘జైలర్ 2’పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి మరో పాటను విడుదల చేసింది. ‘వన్ నేమ్’ అంటూ సాగే ఈ లిరికల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఇప్పటికే ‘జైలర్ 2’ నుంచి ఓ పాట విడుదలై ఆకట్టుకోగా.. తాజాగా వచ్చిన ‘వన్ నేమ్’ సాంగ్‌తో సినిమాపై ఆసక్తిని మరింత పెంచే ప్రయత్నం చేశారు. రజినీకాంత్‌ను దృష్టిలో పెట్టుకుని సాగే ఈ పాట సినిమాలో ఆయన పాత్రకు సంబంధించిన మాస్ ఎలివేషన్‌ను చూపించేలా ఉంది. లిరికల్ వీడియోలోని పాట, మ్యూజిక్ అభిమానులను ఆకట్టుకునేలా ఉండటంతో రజినీ ఫ్యాన్స్ ఈ సాంగ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇక ‘జైలర్ 2’లో రజినీకాంత్‌తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్‌జే సూర్య, విద్యా బాలన్, హృతిక్ రోషన్, రమ్యకృష్ణ, యోగిబాబు, మిర్నా మీనన్ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ‘జైలర్’లో రజినీకాంత్‌ను నెల్సన్ చూపించిన విధానం, అనిరుధ్ మ్యూజిక్, యాక్షన్ ఎలివేషన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీంతో ‘జైలర్ 2’లో ఈ కాంబినేషన్ ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతోందన్న ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం పాటలు, ఇతర ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై అంచనాలను పెంచుతున్న చిత్రబృందం.. అక్టోబర్ 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.     [Jailer 2, Jailer 2 Song, One Name Song, Rajinikanth Jailer 2, Jailer 2 Lyrical Video, Rajinikanth New Movie, Nelson Dilipkumar, Anirudh Ravichander, Jailer 2 Release Date, Jailer 2 Telugu News]
మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్, నటి నజ్రియా నజీమ్‌ దంపతులకు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 2014లో వివాహం చేసుకున్న ఈ జంట తమ వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా బయటకు పంచుకోరు. అయితే తాజాగా ఫహాద్ ఫాజిల్ తన భార్య నజ్రియా గురించి చేసిన సరదా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం ఆయన నటించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. సినిమాలో తన సహనటి సారా పాలేకర్ గురించి మాట్లాడుతున్న సమయంలో ఫహాద్‌కు నజ్రియా ప్రస్తావన వచ్చింది. పిల్లలను చూసుకోవడంలో తనకు చాలా ఓపిక ఉందని కొందరు అంటుంటారని, దానికి కారణం ఇంట్లోనే ఓ చిన్నపిల్ల లాంటి వ్యక్తి ఉండటమేనని ఫహాద్ సరదాగా చెప్పాడు. ‘‘నేను ఓ చిన్నపిల్ల లాంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. అందుకే పిల్లలను చూసుకోవడంలో నాకు ఓపిక ఎక్కువ’’ అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించాడు. భార్యను ఉద్దేశించి ఫహాద్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమాలో తనతో కలిసి నటించిన సారా పాలేకర్‌ను కూడా ఫహాద్ ప్రశంసించాడు. షూటింగ్ సమయంలో ఆమె ఎంతో ఓపికగా వ్యవహరించిందని, తన డైలాగ్స్ విషయంలో కూడా సారా తనకు సహాయం చేసిందని చెప్పాడు. ఇప్పటివరకు తనతో కలిసి నటించిన వారిలో ఇంత ఓపిక ఉన్న సహనటి మరొకరు లేరని ఫహాద్ పేర్కొన్నాడు. దీంతో ప్రమోషన్ కార్యక్రమంలో ఫహాద్ చేసిన వ్యాఖ్యలు సరదాగా సాగాయి. ఇక ఫహాద్ ఫాజిల్, నజ్రియా నజీమ్‌ ‘బెంగళూరు డేస్’ సినిమాలో కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించగా.. 2014లో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి తమ వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలను చాలా అరుదుగా మాత్రమే బయటకు చెబుతున్న ఈ జంట, అప్పుడప్పుడు ఇంటర్వ్యూల్లో చేసే సరదా వ్యాఖ్యలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇక ఫహాద్ నటించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రానికి శశాంక్ యేలేటి దర్శకత్వం వహించగా.. అక్టోబర్ 2న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.     [Fahadh Faasil, Nazriya Nazim, Fahadh Faasil Nazriya Marriage, Fahadh Faasil Comments, Fahadh Faasil Wife, Nazriya Nazim Husband, Dont Trouble The Trouble, Fahadh Faasil Latest News, Shashank Yeleti, Fahadh Faasil Telugu News]
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
నేటి వేగవంతమైన జీవనశైలిలో అధిక రక్తపోటు లేదా సైలెంట్ కిల్లర్‌గా పిలిచే హై బీపీ సమస్య మిలియన్ల మంది ప్రజలను వేధిస్తోంది. బీపీని సహజసిద్ధంగా అదుపులో ఉంచుకోవడానికి సరైన ఆహార నియమాలు పాటించడం అత్యంత కీలకమని వైద్య నిపుణులు నిరంతరం హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మన దైనందిన ఆహారంలో ఎక్కువగా భాగమయ్యే అరటిపండు, నారింజలలో ఏది రక్తపోటును తగ్గించడానికి ఎక్కువ మేలు చేస్తుందనే ఆసక్తికరమైన ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ మెదులుతుంది. నిజానికి ఈ రెండు పండ్లూ ఆరోగ్యానికి ఎంతో శ్రేష్ఠమైనవే అయినప్పటికీ, వాటిలో ఉండే పోషక విలువలు శరీరంలో భిన్నమైన రీతిలో ప్రభావం చూపుతాయి. హై బీపీని నియంత్రించడంలో పొటాషియం అనే ఖనిజ లవణం అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ఆహారంలో పొటాషియం తగినంతగా లభించినప్పుడు అది శరీరంలో ఉండే అధిక సోడియం లేదా ఉప్పు ప్రభావాన్ని సమర్థవంతంగా సమతుల్యం చేస్తుంది. అలాగే రక్తనాళాల మూత్రపిండ వ్యవస్థ ద్వారా అదనపు సోడియంను మూత్రం రూపంలో బయటకు పంపివేసి, రక్తనాళాల గోడలపై పడే విపరీతమైన ఒత్తిడిని తగ్గించి వాటి సాధారణ పనితీరుకు సంపూర్ణ మద్దతు ఇస్తుంది. అరటిపండును పరిశీలిస్తే, ఇది పొటాషియానికి ఒక అద్భుతమైన సహజ సిద్ధమైన మూలంగా నిలుస్తుంది. ఒక సాధారణ మధ్యస్థ పరిమాణంలో ఉండే అరటిపండు ద్వారా శరీరానికి సుమారు 400 మిల్లీగ్రాముల అత్యధిక పొటాషియం లభిస్తుంది. ఈ అధిక పొటాషియం మోతాదు రక్తనాళాల సంకోచ సడలికలను క్రమబద్ధీకరించి, పెరిగిన రక్తపోటును తక్షణమే నియంత్రణలోకి తేవడానికి అమితంగా తోడ్పడుతుంది. మరోవైపు నారింజ పండు విషయానికి వస్తే, అరటిపండుతో పోలిస్తే ఇందులో పొటాషియం మోతాదు కొంత తక్కువగా ఉన్నప్పటికీ, ఇది రోగనిరోధక శక్తిని పెంచే శక్తివంతమైన విటమిన్ సి, ఫోలేట్ మరియు ఫ్లేవనాయిడ్స్ వంటి విశిష్టమైన పోషకాలను, యాంటీఆక్సిడెంట్లను పుష్కలంగా అందిస్తుంది. నారింజను కేవలం జ్యూస్‌ రూపంలో కాకుండా నేరుగా పూర్తి పండుగా తీసుకోవడం వల్ల శరీరానికి కావలసినంత విటమిన్ సీతో పాటు నాణ్యమైన ఫైబర్ కూడా లభించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అందువల్ల హై బీపీ ఉన్నవారు ఈ రెండింటిలో కేవలం ఒకే పండుపై ఆధారపడవలసిన అవసరం లేదు. అరటిపండు శరీరానికి కావలసిన పొటాషియంను అందిస్తే, నారింజ విటమిన్ సి, ఫోలేట్ వంటి పోషకాలతో రక్తనాళాల ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. కాబట్టి రోజువారీ డైట్‌లో ఈ రెండింటితో పాటు ఆపిల్, కివి, పుచ్చకాయ మరియు అవకాడో వంటి రకరకాల పండ్లను సమతుల్యంగా చేర్చుకోవడం అత్యంత శ్రేయస్కరం. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి; కేవలం పండ్లు తినడం వల్లే బీపీ పూర్తిగా తగ్గిపోదు. దీనితో పాటు ఉప్పు వాడకం తగ్గించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు బరువును అదుపులో ఉంచుకోవడం తప్పనిసరి. అలాగే తీవ్రమైన కిడ్నీ సమస్యలు ఉన్నవారు పొటాషియం అధికంగా ఉండే అరటిపండ్ల వంటి ఆహారాన్ని తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం.     Potassium Vs Vitamin C For Blood Pressure, High BP Control Potassium Benefits, Potassium 400mg For Hypertension, Vitamin C Blood Pressure Lowering, Best Nutrient To Lower BP, Sodium And Potassium Balance BP, Natural Remedies For High Blood Pressure, Hypertension Control Tips Telugu.  
నేటి తరం యువత లేదా జెన్ జీ (Gen Z) పండుగల షాపింగ్ చేసే విధానం పాత పద్ధతులకు పూర్తి భిన్నంగా, అత్యంత వినూత్నంగా మారుతోంది. ఒకప్పుడు పండుగ వస్తోందంటే నేరుగా బట్టల షాపులకు వెళ్లడం, నచ్చిన దుస్తులను కొనుగోలు చేయడం ఒక ఆనవాయితీగా ఉండేది. కానీ నేటి జెన్ జీ వినియోగదారులకు పండుగ షాపింగ్ అనేది కేవలం ఒక ట్రెండ్ చూసి వెంటనే బట్టలు కొనడం మాత్రమే కాదు; అదొక పెద్ద రీసెర్చ్ ప్రాసెస్. సోషల్ మీడియా ఆధారిత ఐడియాలు, పాత బట్టలను సరికొత్తగా మార్చే అప్‌సైక్లింగ్ హ్యాక్స్, నిజమైన కస్టమర్ రివ్యూలు, మరియు ఏఐ పరిజ్ఞానంతో బేరాలు ఆడటం వంటి అనేక ఆసక్తికరమైన వ్యూహాలు వీరి షాపింగ్ ప్లాన్‌లో ప్రధాన భాగంగా మారాయి. ఇటీవల వెలువడిన ప్రముఖ స్నాప్‌చాట్  జీడబ్ల్యూఐ (Snapchat GWI) అధ్యయనం ప్రకారం, ప్రతి 10 మంది జెన్ జీ వినియోగదారులలో ఏకంగా 7 మంది (70%) కొత్త దుస్తులు లేదా ప్రాడక్ట్‌లను కనుగొనడానికి సోషల్ మీడియా క్రియేటర్ల కంటెంట్‌‌పైనే ఆధారపడుతున్నారు. అంతేకాకుండా, అందులో 40 శాతం మంది ఏదైనా వస్తువును కొనుగోలు చేసే ముందు కచ్చితంగా ఇతర నెటిజన్లు లేదా స్నేహితుల సలహాలు, అభిప్రాయాలను కోరుతున్నారని ఈ గణంకాలు స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. జెన్ జీ పండుగ షాపింగ్‌లో  అప్‌సైక్లింగ్  (Upcycling) అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాక్‌గా నిలుస్తోంది. దుస్తుల కోసం వేలాది రూపాయలు తగలేయకుండా, ఇంట్లో ఉండే అమ్మల, నానమ్మల పాత పట్టు చీరలను, సూట్లను సరికొత్త డిజైనర్ దుస్తులుగా మార్చుకోవడానికి నేటి యువత అమితంగా ఇష్టపడుతున్నారు. ఉదాహరణకు, దీపావళి వంటి పెద్ద పండుగలకు తల్లి పట్టు చీరను ట్రెండీ కో ఆర్డ్ సెట్ (Co ord set) గా మార్చడం, లేదా పాత పట్టుచీర సరిహద్దులను (Borders) కొత్త కుర్తాలకు లేదా ప్లెయిన్ దుస్తులకు కుట్టించి సరికొత్త లుక్ తీసుకురావడం నేటి ట్రెండ్. ఇటీవలే ట్రెండ్ అయిన  గోటా పట్టీ  (Gota Patti) లేస్‌ను సాధారణ కుర్తాలకు జతచేసి సరికొత్త పండుగ డ్రెస్‌గా డిజైన్ చేసుకోవడం యువతను బాగా ఆకట్టుకుంటోంది. సంప్రదాయబద్ధమైన దుస్తుల రూపాన్ని కోల్పోకుండానే, బ్లౌజ్ డిజైన్, శారీ డ్రేపింగ్, ట్రెండీ జ్యువెలరీ లేదా సరికొత్త రంగుల కాంబినేషన్‌తో మోడర్న్ టచ్ ఇవ్వడం జెన్ జీ క్రియేటివిటీకి అద్దం పడుతోంది. పండుగ ఫ్యాషన్ ట్రెండ్స్‌‌ను తెలుసుకోవడానికి ఇన్‌స్టాగ్రామ్ (Instagram), పింటరెస్ట్ (Pinterest) వంటి ప్లాట్‌ఫామ్‌లు వీరికి ప్రధాన ఆమోదయోగ్యమైన మూలాలుగా మారాయి. పండుగలకు నెల రోజుల ముందే ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు ధరించే దుస్తులు రాబోయే పండుగ సీజన్ ట్రెండ్స్‌ను నిర్దేశిస్తాయి. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా కొత్త ఫ్యాషన్ ఐడియాలను చూసే యువత, వాటిని తాము నిజంగా కొనుగోలు చేయవచ్చా లేదా అని లోతుగా విశ్లేషించడానికి పింటరెస్ట్‌లో రీసెర్చ్ చేస్తున్నారు. ఇక్కడే కాకుండా, ఆన్‌లైన్ షాపింగ్ యాప్‌లలో బెస్ట్ డీల్స్ పొందడానికి కూడా ప్రత్యేకమైన ట్రిక్స్ వాడుతున్నారు. ఆన్‌లైన్ విష్‌లిస్ట్ (Wishlist) లేదా కార్ట్‌‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ, ధరలు తగ్గగానే నోటిఫికేషన్లు పొందడం ద్వారా బడ్జెట్ ఆదా చేస్తున్నారు. ఉత్పత్తుల నాణ్యతను అంచనా వేయడానికి ఫేక్ రివ్యూలను పక్కనబెట్టి, అత్యంత నిజాయితీతో కూడిన రివ్యూలు లభించే  రెడ్డిట్  (Reddit) వేదికను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. మరో ఆసక్తికరమైన అంశమేమిటంటే, ఈ ఆధునిక పండుగ షాపింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం పెరగడం. రకరకాల ఈ కామర్స్ సైట్లలో ఉన్న ధరలను పోల్చి చూడటానికి, అలాగే ఏవి ఒరిజినల్ కస్టమర్ రివ్యూలు, ఏవి బాట్ (Bot) రివ్యూలు అని విశ్లేషించడానికి జెన్ జీ యువత ఏఐ ప్రాంప్ట్‌లను వాడుతోంది. లగ్జరీ డిజైనర్ వేర్ నచ్చినప్పుడు, అదే డిజైన్ కలిగిన కాపీ లేదా డ్యూప్ (Dupe) దుస్తులు తక్కువ ధరలో ఎక్కడ లభిస్తాయో ఆన్‌లైన్‌లో వెతుకుతున్నారు. ఒకవేళ ఆన్‌లైన్ డ్యూప్ ధర, సొంతంగా బట్ట తీసి కుట్టించే ఖర్చు సమానంగా ఉంటే, లజపత్ నగర్ లేదా సరోజినీ నగర్ వంటి స్థానిక మార్కెట్లలో మెటీరియల్ కొని డిజైనర్ చేత కుట్టించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలా ఆధునిక సాంకేతికత, సోషల్ మీడియా ట్రెండ్స్, మరియు సాంప్రదాయకమైన పొదుపు సూత్రాలను సమ్మేళనం చేస్తూ జెన్ జీ జరిపే పండుగ షాపింగ్ ఇప్పుడు కొత్త చరిత్రను సృష్టిస్తోంది.     Gen Z Festive Fashion, Old Saree Conversion Ideas, DIY Designer Dresses Saree, Sustainable Fashion Gen Z, Old Saree to Indo Western Dress, Festive Shopping Hacks, Old Silk Saree Upcycling, Trending Saree Reuse Ideas.  
ఎవరూ దోచుకోలేని సంపద ఇదే.. చాణక్యుడు చెప్పిన గొప్ప సత్యం! జీవితంలో మనిషికి ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. డబ్బు, పదవి, అధికారం ఉన్నా.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోతే అవేవీ మనకు ఉపయోగపడవు. అందుకే చాణక్యుడు జ్ఞానానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చాడు. చాణక్య నీతి ప్రకారం.. మనిషి నిరంతరం జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉండాలి. ఎందుకంటే జ్ఞానం అనేది ఎవరూ దోచుకోలేని సంపద. మన దగ్గర ఉన్న డబ్బు పోవచ్చు.. పదవి మారిపోవచ్చు.. కానీ మనం నేర్చుకున్న జ్ఞానం మాత్రం జీవితాంతం మనతోనే ఉంటుంది. జ్ఞానం ఒక ఆయుధంలా పనిచేస్తుంది. ఏ పరిస్థితిలో ఎలా వ్యవహరించాలి? ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఎవరిని నమ్మాలి? ఎలాంటి సమస్యను ఎలా పరిష్కరించాలి? అనే విషయాల్లో జ్ఞానం మనకు మార్గనిర్దేశం చేస్తుంది. జ్ఞానం ఉన్న వ్యక్తి సమస్యలను చూసి భయపడకుండా.. వాటికి పరిష్కారం వెతుకుతాడు. ఒక సమస్య ఎదురైతే నిరాశ చెందకుండా, దాని నుంచి పాఠం నేర్చుకుని మరింత తెలివిగా ముందుకు సాగుతాడు. అందుకే జీవితంలో ఎంత బిజీగా ఉన్నా.. ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకునే అలవాటు చేసుకోవాలి. పుస్తకాలు చదవడం, అనుభవజ్ఞుల మాటలు వినడం, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, మన తప్పుల నుంచి పాఠాలు తీసుకోవడం.. ఇవన్నీ జ్ఞానాన్ని పెంచే మార్గాలే. గుర్తుంచుకోండి.. సంపదను కోల్పోతే తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ జ్ఞానం లేకపోతే.. సంపద ఉన్నా సరైన నిర్ణయాలు తీసుకోవడం కష్టం. కాబట్టి జీవితంలో ఎదగాలంటే.. డబ్బుతో పాటు జ్ఞానాన్ని కూడా సంపాదించండి. ఎందుకంటే జ్ఞానం మీకు దారి చూపే దీపం మాత్రమే కాదు.. కష్టాలను ఎదుర్కొనే ఆయుధం కూడా. ఇక నుంచి రోజుకు కనీసం 20 నిమిషాలు మీ జ్ఞానం కోసం కేటాయించండి. ఒక మంచి పుస్తకం చదవండి.. ఒక కొత్త విషయం నేర్చుకోండి.. ఒక తప్పు నుంచి ఒక పాఠం తీసుకోండి. ఎందుకంటే ఒక మంచి జ్ఞానం.. ఒక జీవితాన్నే మార్చగలదు.! 
ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఒక వినూత్నమైన వ్యాయామ విధానం విపరీతంగా ట్రెండ్ అవుతోంది. నెమ్మదిగా, ప్రశాంతంగా, డాన్స్ చేస్తున్నట్లుగా సాగే ఆ కదలికలే "తాయ్ చి". నార్మల్ గా అందరూ చేసే  జిమ్ వర్కౌట్లు, వేగంగా రన్నింగ్ చేయడం వంటివి కాకుండా  మానసిక ప్రశాంతతతో పాటు శరీరానికి  దారుఢ్యాన్ని ఇచ్చే ఈ ప్రాచీన విధానం వైపు నేటి యువత, ఫిట్‌నెస్ ప్రేమికులు విశేషంగా ఆకర్షితులవుతున్నారు. సోషల్ మీడియా లో రీల్స్, షార్ట్స్ లో వేలాదిమంది దీనికి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తుండటంతో ఇది నెట్టింట వైరల్ గా మారింది. అసలు ఏమిటీ తాయ్ చి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? వివరంగా తెలుసుకుంటే.. తాయ్ చి.. తాయ్ చి అనేది చైనాకు చెందిన ఒక ప్రాచీన మార్షల్ ఆర్ట్ విధానం. మొదట్లో  ఇది ఒక ఆత్మరక్షణ విద్యగా ఉద్భవించినప్పటికీ, కాలక్రమేణా ఇది ఒక అద్భుతమైన ఆరోగ్య, ఫిట్‌నెస్ సాధనగా రూపాంతరం చెందింది. దీనిని తరచుగా మూమెంట్ మెడిటేషన్ అని పిలుస్తారు. ఈ విధానంలో వేగవంతమైన కదలికలు ఉండవు. చాలా నెమ్మదిగా, శ్వాసపై ధ్యాస ఉంచుతూ, శారీరక సమతుల్యతను కాపాడుకుంటూ ఒక పోజిషన్ నుంచి మరొక పొజిషన్ కు  శరీరాన్ని తిప్పుతారు. శ్వాస ప్రక్రియను శరీర కదలికలతో అనుసంధానించడమే దీనిలోని ప్రధాన సూత్రం. ఇది శరీరంలోని అంతర్గత శక్తిని నిద్రలేపి, శరీరం అంతటా సరిగ్గా ప్రసరించేలా చేస్తుంది. చైనీస్ సంస్కృతిలో దీనిని 'చి' అని పిలుస్తారు. తాయ్ చి చేసే విధానం.. తాయ్  చి సాధనలో మూడు ముఖ్యమైన అంశాలు ఉంటాయి.. నెమ్మదిగా చేసే కదలికలు.. శరీరంలోని ప్రతి కండరాన్ని ఉపయోగిస్తూ, కీళ్లపై ఎటువంటి ఒత్తిడి పడకుండా చాలా సజావుగా కదలికలు ఉంటాయి. లోతైన శ్వాస.. కదలికలకు అనుగుణంగా ప్రశాంతంగా, లోతుగా శ్వాస తీసుకోవడం , వదలడం జరుగుతుంది. మానసిక ఏకాగ్రత.. వ్యాయామం చేసే సమయంలో దృష్టి మొత్తం శరీరం , శ్వాసపైనే ఉంటుంది. దీనివల్ల బయటి ఆలోచనల నుంచి మనస్సుకు విశ్రాంతి లభిస్తుంది. తాయ్ చి అందించే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. సోషల్ మీడియాలో ఇది కేవలం ఒక ఫ్యాషన్ గా మాత్రమే ట్రెండ్ కావడం లేదు, దీని వెనుక ఎన్నో శాస్త్రీయ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి తగ్గింపు.. ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన సర్వసాధారణమయ్యాయి. తాయ్ చి లోని లోతైన శ్వాస , ఏకాగ్రతతో కూడిన కదలికలు నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తాయి. ఇది శారీరక ఒత్తిడిని తగ్గించి, మనస్సుకు తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. శరీర బ్యాలెన్స్ , దృఢత్వం.. వయసు పైబడిన వారికి లేదా కాళ్ళ బలం తక్కువగా ఉన్నవారికి తాయ్ చి ఒక వరప్రసాదం. ఇది కాళ్ళు, నడుము భాగాల్లోని కండరాలను బలోపేతం చేసి, శరీర సమతుల్యతను పెంచుతుంది. దీనివల్ల కింద పడిపోయే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.. ఇది తక్కువ తీవ్రత కలిగిన వ్యాయామం అయినప్పటికీ, రక్తాప్రసరణను మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా చేయడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది, గుండె పనితీరు మెరుగుపడుతుంది. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం.. ఆర్థరైటిస్ (కీళ్ల వాతం) లేదా కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. వేగవంతమైన వర్కౌట్ల వల్ల కీళ్లపై పడే భారంతో పోలిస్తే, తాయ్ చి కీళ్లను మెల్లిగా కదిలిస్తూ నొప్పులను తగ్గిస్తుంది. శ్వాసకోశ వ్యవస్థకు మంచిది.. దీనిలో శ్వాసపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. శరీరంలోని ప్రతి కణానికి ప్రాణవాయువు సమృద్ధిగా అందుతుంది. నిద్రలేమి సమస్యకు పరిష్కారం.. ప్రతిరోజూ కొద్దిసేపు తాయ్ చి సాధన చేయడం వల్ల రాత్రి వేళల్లో మంచి, ప్రశాంతమైన నిద్ర పడుతుందని అనేక పరిశోధనల్లో తేలింది. ఏకాగ్రత , జ్ఞాపకశక్తి.. శరీరం , మనస్సు రెండింటినీ ఒకేసారి ఉపయోగించడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇది ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంచడంలో దోహదపడుతుంది. ఎవరైనా చేయవచ్చా? తాయ్ చి యొక్క అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే, దీనికి ప్రత్యేక పరికరాలు కానీ, పెద్ద స్థలం కానీ అవసరం లేదు. చిన్న పిల్లల నుంచి వయోవృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ దీనిని సాధన చేయవచ్చు. ఎటువంటి శారీరక శ్రమ లేకుండా, సున్నితమైన పద్ధతిలో ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన మార్గం.                    *రూపశ్రీ.
మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. వాటిలో బొప్పాయి పండుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.  పీచు పదార్థాలు, విటమిన్లు, అలాగే జీర్ణక్రియకు దోహదపడే పపైన్ అనే ప్రత్యేక ఎంజైమ్ బొప్పాయిలో సమృద్ధిగా లభిస్తాయి. ఇది కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడమే కాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలోనూ ఎంతో సహాయపడుతుంది. ఉదయాన్నే పరగడుపున లేదా సాయంత్రం వేళల్లో బొప్పాయిని తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడన్ని ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే ఎంతటి ఆరోగ్యకరమైన ఆహారమైనా దాన్ని తినే విధానం సరిగ్గా ఉండాలి. ముఖ్యంగా బొప్పాయిని కొన్ని రకాల ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల ప్రయోజనాలకు బదులు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. జీర్ణ వ్యవస్థను దెబ్బతీసే అటువంటి కొన్ని ఆహార కలయికల గురించి వివరంగా తెలుసుకుంటే.. పాలు , డైరీ ఉత్పత్తులు.. చాలామంది పండ్లతో పాటు పాలు లేదా ఇతర పాల పదార్థాలను తీసుకోవడం అలవాటుగా చేసుకుంటారు. ఎక్కువ శాతం మంది పండ్లతో మిల్క్ షేక్ తీసుకోవడానికే ఇష్టపడతారు.  కానీ బొప్పాయిని పాల ఉత్పత్తులతో కలిపి తీసుకున్నప్పుడు అందులోని ఎంజైములు రియాక్షన్ జరిపి కడుపులో గ్యాస్, యాసిడిటీ , ఉబ్బరం వంటి సమస్యలకు దారితీస్తాయి. జీర్ణవ్యవస్థపై ఇది తీవ్రమైన భారాన్ని పెంచి పొట్టలో అసౌకర్యాన్ని కలిగిస్తుంది.  అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాలు.. బొప్పాయిలోని ఎంజైములు ప్రోటీన్లను సులభంగా విచ్ఛిన్నం చేయగలవు. అయితే మాంసం, గుడ్లు లేదా పప్పు ధాన్యాలు వంటి అధిక ప్రోటీన్ కలిగిన భారీ ఆహారాలతో బొప్పాయిని ఒకేసారి తీసుకోవడం వల్ల జీర్ణక్రియలో తేడా జరుగుతుంది.  కాబట్టి బొప్పాయిని ఎల్లప్పుడూ తేలికపాటి ఆహారంతో మాత్రమే తీసుకోవడం శ్రేయస్కరం. నూనెలో వేయించిన పదార్థాలు.. బొప్పాయి వేగంగా అరిగిపోయే గుణం కలిగి ఉండే పండు, కానీ వేపుళ్లు లేదా నూనె పదార్థాలు జీర్ణం కావడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఈ రెండింటిని కలిపి తిన్నప్పుడు జీర్ణ వ్యవస్థ  సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల కడుపులో భారం, అసౌకర్యం , గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి. ఆహారం తినగానే పండ్లు తినే అలవాటు ఉండేవారు నూనెలో వేయించిన ఆహారాలు తిన్న వెంటనే బొప్పాయి తినడం అంత మంచిది కాదు.  పులియబెట్టిన లేదా ఈస్ట్ తో తయారు చేసిన ఆహారాలు..  ఫర్మెంటేషన్ ప్రక్రియ ద్వారా తయారయ్యే ఆహార పదార్థాలతో బొప్పాయిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే గ్యాస్, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ కాంబినేషన్ వల్ల ఇబ్బందులు మరింత ఎక్కువవుతాయి. అరటిపండు కాంబినేషన్.. అరటిపండు,  బొప్పాయి రెండూ పండ్లే అయినప్పటికీ, అరటిపండు , బొప్పాయిని ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకోవడం మంచిది కాదు. ఈ రెండింటినీ కలిపి తింటే జీర్ణక్రియ వేగం బాగా తగ్గిపోతుంది. ఫలితంగా ఎప్పుడూ  కడుపు నిండిపోయినట్లు, భారంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కాబట్టి బొప్పాయి ఇచ్చే సంపూర్ణ ఆరోగ్య ప్రయోజనాలను పొందాలంటే దాన్ని ఇతర ఆహారాలతో కలపకుండా విడిగా మాత్రమే తినడం మంచిది. అది కూడా ఆహారం తీసుకున్న వెంటనే కాకుండా కనీసం అరగంట నుండి గంట సమయం వ్యవధి ఇచ్చి పండిన బొప్పాయిని సరైన మోతాదులో తీసుకుంటే  ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.                                                                                                                                                     *రూపశ్రీ.
ఛాతిలో నొప్పి వస్తే అది గ్యాస్ సమస్యా? లేక గుండెపోటు లక్షణమా? ఈ రెండింటి మధ్య తేడాను ఎలా గుర్తించాలి? గుండెపోటు వచ్చినప్పుడు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఏమిటి? ఈ వీడియోలో కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజేష్ నటువా గారు వివరంగా చెబుతున్నారు. ఛాతీ మధ్యలో బరువుగా, బిగుతుగా లేదా పిండుతున్నట్టుగా అనిపించడం, నొప్పి ఎడమ చేయి, మెడ లేదా పొట్ట వైపు వ్యాపించడం వంటి లక్షణాలతో పాటు విపరీతమైన చెమటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆందోళన, త్వరగా అలసిపోవడం వంటి సంకేతాలను కూడా తెలుసుకోండి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు, 70 ఏళ్లు పైబడినవారు, మహిళల్లో కొన్నిసార్లు సాధారణ ఛాతినొప్పికి బదులుగా గ్యాస్ లేదా హార్ట్‌బర్న్‌లా లక్షణాలు కనిపించవచ్చు. డయాబెటిస్, అధిక రక్తపోటు, ఊబకాయం, పొగతాగడం, మద్యం వంటి గుండెపోటు ప్రమాద కారకాలు ఉన్నప్పుడు లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సహాయం తీసుకోవడం ఎందుకు ముఖ్యమో తెలుసుకోండి. చిన్న వయసులోనే గుండెపోటు ఎందుకు వస్తోంది? జంక్ ఫుడ్, శారీరక శ్రమ తగ్గిపోవడం, అధిక బరువు, కుటుంబ చరిత్ర, జన్యుపరమైన కారణాలు, కొలెస్ట్రాల్ వంటి అంశాలు గుండె ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతాయో కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఛాతినొప్పిని సాధారణ గ్యాస్ సమస్యగా భావించే ముందు ఈ ముఖ్యమైన విషయాలను తప్పక తెలుసుకోండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)