కూకట్‌పల్లి బాలిక హత్య కేసును  పోలీసులు ఛేదించారు. ఈ హత్యను ఇంటి పక్కనే ఉండే పదవ తరగతి చదువుతున్న అబ్బాయి  హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు.  బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.  దొంగతనం చేయడానికి వెళ్లి హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. ఈ కేసులో హంతకులెవరో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు. తల్లిదండ్రులు సహా కుటుంబీకులను విచారించినా ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో కేసును ఛేదించడం కష్టంగా మారింది.  చివరికి సహస్ర తండ్రి కృష్ణపై అనుమానం రాగా.. కూతుర్ని అల్లారుముద్దుగా పెంచుకుంటోన్న ఆయనకు చంపాల్సిన పనేంటని కుటుంబ సభ్యులు ఫైరయ్యారు. సహస్రపై కూర్చుని గొంతునులిమి, ఆపై బ్రతికి ఉందేమోనన్న అనుమానంతో కత్తితో గొంతు కోసినట్లు తెలుస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ సహస్ర బ్రతికి ఉండకూడదనే విచ్చలవిడిగా కత్తితో పొడిచినట్లు సమాచారం. దొంగతనం కోసం ఇంట్లోకి వెళ్లే ముందే.. ఎవరైనా అడ్డొస్తే ఏం చేయాలన్న దానిపై ఒక పేపర్‌పై రాసుకుని దానినే అమలు చేశాడని పోలీసులు తెలిపారు.
కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని కేసీఆర్, హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.   ఆ నివేదికను అసెంబ్లీలో పెట్టిన తర్వాత చర్యలు తీసుకుంటారా.. ముందే చర్యలు తీసుకుంటారా అన్నదానిపై క్లారిటీ కావాలని హైకోర్టు గురువారం (ఆగస్టు 21) విచారణ సందర్భంగా ప్రభుత్వాన్ని అడిగింది. దీనిపై శుక్రవారం (ఆగస్టు 22) న అడ్డకేట్ జనరల్ ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించిన అనంతరమే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరఫుర కోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు ప్రస్తుత పరిస్థితుల్లో జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన తదుపరి చర్యల విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది.  ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడతామని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరికీ కాపీలు ఇస్తామని.. సమగ్రంగా చర్చిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.  జస్టిస్ ఘోష్ కమిషన్‌కు చట్టబద్ధత లేదనుకుంటే కేసీఆర్, హరీష్ రావు తమకు నోటీసులు జారీ చేసినప్పుడే హైకోర్టుకు వెళ్లి ఉండాల్సిందని న్యాయ నిపుణులు అంటున్నారు.  కమిషన్ ముందుకు హాజరై తమ వాదనలు వినిపించిన తర్వాత, ఇప్పుడు ఆ నివేదిక తమకు వ్యతిరేకంగా వచ్చిందని దానికి చట్టబద్ధత లేదని విమర్శించడం సరికాదని అంటున్నారు.  
  హైదరాబాద్‌లో కేబుళ్ల తొలగింపు నేపథ్యంలో ఎయిర్ టెల్ వేసిన పిటిషన్‌పై  విచారణ సందర్బంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక కీలక ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీలో లైసెన్స్ తీసుకున్న కేబుళ్లు తప్ప ఏవీ ఉంచొద్దని స్పష్టం చేసింది. ఇష్టానుసారంగా కేబుళ్లు ఏర్పాటు చేయటం ప్రజలు ప్రాణాలతో చెలగాటం ఆడటమేనన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటంపై న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రామంతాపూర్‌ ఘటనను ఆయన ప్రస్తావించారు.  పుట్టిన రోజే తండ్రికి తలకొరివి పెట్టిన బాలుడి ఘటనపై ఉద్వేగభరితంగా మాట్లాడారు. కేక్‌ కట్‌ చేయాల్సిన 9 ఏళ్ల బాలుడు తలకొరివి పెట్టడం కలచివేసిందని జస్టిస్‌ నగేశ్‌ భీమపాక అన్నారు. విద్యుత్‌ ప్రమాదంపై ఎవరికి వారే చేతులు దులిపేసుకుంటే ఎలా?అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామంతాపూర్ లో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా విద్యుత్ తీగలు తగిలి ఆరుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలతో హైదరాబాద్‌లో ఉపయోగం లేని కేబుల్, ఇంటర్నెట్ వైర్లు కట్ చేసిన విషయం తెలిసిందే.   
ALSO ON TELUGUONE N E W S
చిత్ర పరిశ్రమలో వారసత్వం అనేది ఎప్పటి నుంచో ఉంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వారసులు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అలా వచ్చిన వారిలో హీరోలే ఎక్కువగా కనిపిస్తారు. టాలీవుడ్‌ని తీసుకుంటే సినీ ప్రముఖుల కుమార్తెలు హీరోయిన్లు పరిచయమైన సందర్భాలు చాలా తక్కువ. ఈ విషయంలో బాలీవుడ్‌ చాలా ముందుంది. బాలీవుడ్‌ ప్రముఖుల కుమార్తెలు ఎంతో మంది హీరోయిన్లుగా పరిచయమై విజయాలు సాధించారు. ఇప్పుడు ఆ కోవలోనే స్టార్‌ హీరోయిన్‌ రవీనా టాండన్‌ కుమార్తె రాషా తడాని బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అజయ్‌ దేవ్‌గణ్‌ హీరోగా నటించిన ‘ఆజాద్‌’ చిత్రంలో ఓ హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ ఏడాది జనవరిలో విడుదలైన ఈ సినిమా ఫ్లాప్‌గా నిలిచింది.  తాజా సమాచారం మేరకు.. సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు, రమేష్‌బాబు తనయుడు జయకృష్ణ హీరోగా నటించే చిత్రంలో రాషా తడానికి హీరోయిన్‌గా ఛాన్స్‌ లభించిందని తెలుస్తోంది. అజయ్‌ భూపతి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. రాషా తడాని బాలీవుడ్‌లో సినిమా చెయ్యక ముందే టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోందని గతంలో వార్తలు వచ్చాయి. రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’ చిత్రంలో మొదట రాషాను హీరోయిన్‌గా బుక్‌ చేసుకున్నారని, ఆ సినిమాతోనే తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతోందని ఆమధ్య వార్తలు వచ్చాయి. అయితే ఆ సినిమాలో జాన్వీకపూర్‌ను హీరోయిన్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ప్రశాంత్‌వర్మ డైరెక్షన్‌లో మోక్షజ్ఞ తొలి సినిమా ఉంటుందని ఆమధ్య ఎనౌన్స్‌ చేశారు. అంతేకాదు, ఈ సినిమాలో మోక్షజ్ఞ సరసన రాషా తడాని హీరోయిన్‌గా నటించబోతోందని చెప్పుకున్నారు. చివరికి వారి కాంబినేషన్‌లో సినిమాయే లేదని తేలింది. జయకృష్ణ హీరోగా నటించే సినిమాలో రాషా హీరోయిన్‌గా నటించబోతోందని వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అనేది అధికారిక ప్రకటన వస్తేనేగానీ తెలీదు. రవీనా టాండన్‌ బాలీవుడ్‌లోనే కాదు, సౌత్‌లోనూ కొన్ని సినిమాల్లో నటించారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన బంగారు బుల్లోడు చిత్రం హీరోయిన్‌గా ఆమెకు మంచి పేరు తెచ్చింది. అందం విషయంలో తల్లిని మించేలా ఉన్న రాషా.. హీరోయిన్‌గా ఏమేరకు విజయం సాధిస్తుందో చూడాలి. 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan),ఇళయదళపతి విజయ్(Ilayathalapathy VIjay).ఈ ఇద్దరు తమకున్న సినీ బ్యాక్ గ్రౌండ్ తోనే హీరోలుగా పరిచయమయ్యారు. కానీ తమదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్, మేనరిజమ్స్, డాన్స్ లతో లక్షలాది మంది అభిమానులని సంపాదించుకున్నారు. ఎంతలా అంటే సొంతంగా రాజకీయపార్టీ స్థాపించేంతలా. ఈ ఇద్దరు తెలుగు, తమిళ సినీ రంగానికి చెందిన వారే అయినా, రెండు దశాబ్డలపై నుంచే సినిమాల పరంగా ఇద్దరి  మధ్య మంచి అనుబందం ఉంది. విజయ్ తమిళంలో చేసిన 'ఖుషి', 'తిరుపాచి' వంటి సినిమాలని, పవన్ తెలుగులో రీమేక్ చేసి మంచి విజయాల్ని అందుకున్నాడు. ముఖ్యంగా పవన్ కెరీర్ లో 'ఖుషి' ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో  తెలిసిందే. పవన్, విజయ్ గతంలో ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలలో మాట్లాడుతు,ఒకరంటే ఒకరికి అభిమానమని చెప్పుకొచ్చిన సందర్భాలు  ఉన్నాయి. అలాంటి ఈ ఇద్దరు రాజకీయరంగంలో ప్రత్యర్థులుగా మారబోతున్నారే వార్తలు తెలుగు, తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.  రీసెంట్ గా విజయ్ తన  రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కజగం'(Tvk)కి సంబంధించిన సభని మదురైలో నిర్వహించడం జరిగింది. అందులో విజయ్ మాట్లాడుతు 'బీజెపి పార్టీ ఐడియాలజీకి నేను వ్యతిరేకం. బీజెపితో పొత్తు ఎప్పటికి ఉండదు. మోడీ(Narendra Modi)తమిళనాడుతో పాటు, తమిళనాడు లో ఉన్న ముస్లిమ్స్ పట్ల వివక్ష చూపిస్తున్నారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసాడు. ఇప్పుడు ఈ మాటలే పవన్ కళ్యాణ్, విజయ్ రాజకీయ యవనికపై ప్రత్యర్థులుగా మారే అవకాశమున్నట్టుగా పలువురు అభిప్రాయపడుతున్నారు. పవన్ రాజకీయపరంగా బిజెపి తో పొత్తులో ఉన్నాడు. అందులో భాగంగా ఎలక్షన్స్ జరుగుతున్న ప్రతి స్టేట్ కి బిజెపి తరుపున స్టార్ క్యాంపైనర్ గా వెళ్లి ప్రచారం చేస్తున్నాడు.  ఇటీవల తమిళనాడుకి చెందిన బిజెపి నాయకులు పవన్ తో పలు ధపాలుగా తమిళనాడులో బహిరంగ సభలని ఏర్పాటు చేసారు. ఆయా సభల్లో పవన్ స్పీచ్ తమిళనాడు బిజెపీ శ్రేణుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. వచ్చే ఏడాది ఏప్రిల్, మే మధ్య జరిగే తమిళనాడు సార్వ్రతిక ఎన్నికల్లో  బిజెపి(Bjp)తరుపున పవన్ ప్రచారం గ్యారంటీ. పైగా మోడీ అంటే పవన్ కి వ్యక్తిగతంగా చాలా ఇష్టం. మోడీ లాంటి నాయకుడు దేశానికీ చాలా అవసరమని చెప్తూనే ఉన్నాడు. మరి విజయ్ తన మాటల్లో మోడీ, బీజెపి కి వ్యతిరేకమని స్పష్టంగా చెప్పాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వార్ తప్పేలా లేదని సినీ, రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.   
Anil Ravipudi has been the most successful director in Telugu Cinema post SS Rajamouli. While both have 100% success ratio, Anil is just 8 films old while SSR is directing his 13th film. The director has been avoiding any sort of controversies as people like his colloquial style of talking on stage.  In his films too, he doesn't touch any controversial topics and tries to blend in comedy in the serious issues as well. But he made few comments casually that have a created a storm on social media. At Chiranjeevi's Mana Shankaravara Prasad Garu title glimpse launch press event, he commented, "In this film, we did not use VFX to change or enhance Chiranjeevi garu looks. It is 90-95% original and his own effort."  These comments might have been made casually to elevate Chiranjeevi's efforts to slim down at the age of 70. But they have triggered several fans of Telugu Cinema stars as these days using VFX to enhance actors' looks has become a common practice. There have been rumors about Prabhas, NTR using VFX in their recent films to change and enhance looks.  While makers did not confirm about any such practices except for stunt doubles in major high risk sequences, trolls upon looks and usage of extensive VFX enhancements have become common these days. Hence, Anil's words have trigged few trolls and fans against Chiranjeevi as well.  Producers Sahu Garapati and Sushmita Konidela have also participated in the event. While Mega fans are happy with the vintage style and looks of Megastar, they did not expect these sort of trolls. The movie is releasing for Sankranti 2026.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
  ఈ సోషల్ మీడియా యుగంలో స్టార్ హీరోలు చాలా జాగ్రత్తగా ఉండాలి. సినిమాలో లుక్ పరంగా ఏ చిన్న తేడా వచ్చినా ట్రోల్స్ ఎదుర్కోక తప్పదు. పోనీ లుక్ బాగుంటే సేఫ్ అని అనుకోడానికి కూడా లేదు. లుక్ బాగున్నా కూడా.. అంతా గ్రాఫిక్సే అనే విమర్శలు ఎదురవుతుంటాయి. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్స్ కొంతకాలంగా ఇటువంటి ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. సినిమాల్లో ఫిట్ గా కనిపించడం కోసం వారు వీఎఫ్ఎక్స్ ని నమ్ముకుంటున్నారని యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుంటారు. ఇప్పుడు చిరంజీవి విషయంలోనూ ఇదే జరుగుతోంది.   చిరంజీవి వయసు 70 ఏళ్ళు. ఇప్పటికీ ఈ తరం హీరోలతో పోటీపడి సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా లుక్ పరంగా అసలు 70 ఏళ్ళు అంటే నమ్మేలా లేకుండా చాలా ఫిట్ గా కనిపిస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన 'మన శంకరవరప్రసాద్ గారు' టైటిల్ గ్లింప్స్ లో అయితే.. చిరంజీవి లుక్స్ అందరినీ సర్ ప్రైజ్ చేశాయి. ఈ వయసులో ఇంత ఫిట్ గా ఉండటం ఎలా సాధ్యమని ఆశ్చర్యపడేలా ఆయన కనిపించారు.   'మన శంకరవరప్రసాద్ గారు'లో చిరంజీవి లుక్ వీఎఫ్ఎక్స్ అని కామెంట్స్ వస్తాయని దర్శకుడు అనిల్ రావిపూడి ముందే ఊహించారేమో. చిరు లుక్ గురించి టైటిల్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి.    "ఈ సినిమాలో లుక్ పరంగా క్రెడిట్ ఇవ్వాలంటే నేను చిరంజీవి గారికే ఇస్తాను. ఆయన లుక్ కోసం మేము వీఎఫ్ఎక్స్ చేసిందేమీ లేదు. 90-95 శాతం ఒరిజినల్. చిరంజీవి గారు బాగా వెయిట్ లాస్ అయ్యి, లుక్ పరంగా ఎంతో కేర్ తీసుకున్నారు. నా అదృష్టం.. నాకు ఆ లుక్ దొరికింది. ఈ క్రెడిట్ చిరంజీవి గారికే దక్కుతుంది. ఉదయం, సాయంత్రం జిమ్ చేసి బాగా కష్టపడుతున్నారు. అందుకే 45-50 ఏళ్ళ వ్యక్తిలా కనిపిస్తున్నారు." అని అనిల్ రావిపూడి అన్నారు.   మరి ఇప్పటికే సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ ని దృష్టిలో పెట్టుకొని రావిపూడి ఈ కామెంట్స్ చేశారా? లేక భవిష్యత్ లో ట్రోల్స్ రాకూడదన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా ఈ కామెంట్స్ చేశారా? అనేది ఆసక్తికరంగా మారింది.  
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)అనిల్ రావిపూడి(Anil Ravipudi)దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara varaprasad Garu).'పండక్కి వస్తున్నాం' అనేది టాగ్ లైన్. ఈ మేరకు హైదరాబాద్(Hyderabad)లోని ప్రసాద్ ఐమాక్స్ లో అభిమానుల సమక్షంలో  టైటిల్ ని ప్రకటించడంతో పాటు  కొన్ని గ్లింప్స్ ని రిలీజ్ చేసారు. సదరు గ్లింప్స్ లో ఆఫీసర్ లుక్ తో ఉన్న చిరంజీవి పెద్ద కారులో నుంచి దిగాడు. సూటు, బూటు, మెళ్ళో టై, ఐడి కార్డు ధరించిన చిరంజీవి   సిగరెట్ కాలుస్తూ స్టైల్ గా నడుస్తున్నాడు. వెనక పెద్ద పెద్ద గన్స్ చేతబూని, కమాండర్ డ్రెస్ లో, కొంత మంది చిరంజీవిని  ఫాలో అవుతున్నారు. దీంతో పాటు  చేతిలో గన్ తో మెట్లు దిగుతూ వస్తున్న చిరంజీవి, గుర్రంతో ఉన్న  చిరంజీవి గ్లింప్స్ కూడా రిలీజ్ చెయ్యడం జరిగింది. టైటిల్ గ్లింప్స్ రిలీజ్  సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతు మూవీలో 'చిరంజీవి' గారు ఇంటిలెజన్స్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఫ్యామిలీ డ్రామా, ఎంటర్ టైన్ మెంట్ ఒక లెవల్లో ఉండనుంది. మనం ఎంచుకున్న కథ ప్రకారం లుక్ డిజైన్ అవుతుంది.దీంతో  కథకి తగ్గ క్యారక్టర్ కోసం చిరంజీవి గారు చాలా కష్టపడ్డారు. ఆయన లుక్ వల్లే సినిమా చాలా బాగా వస్తుంది. సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నామని   చెప్పుకొచ్చాడు. చిరంజీవి, అనిల్ రావిపూడి ల చిత్రం ప్రకటించినప్పటి నుంచి కథ విషయంలో రకరకాల వార్తలు వచ్చాయి. ఇప్పుడు స్వయంగా అనిల్ రావిపూడినే చిరంజీవి క్యారక్టర్ గురించి చెప్పడంతో పాటు ఫ్యామిలీ డ్రామాతో  తెరకెక్కబోతుందన్న విషయం అర్ధమవుతుంది. అనిల్ రావిపూడి గత బ్లాక్ బస్టర్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం 'లో 'వెంకటేష్'(Venkatesh)పోలీస్ ఆఫీసర్ గా చేసిన విషయం తెలిసిందే. చిరంజీవి సరసన నయనతార(Nayanthara)జంటగా చేస్తున్న 'మన శంకర్ వరప్రసాద్ గారు' లో  విక్టరీ వెంకటేష్ కూడా ఒక క్యారక్టర్ లో కనిపించబోతున్నాడు. ఈ విషయాన్నీ అనిల్ రావిపూడి నే అధికారకంగా ప్రకటించాడు. భీమ్స్ సిసోరియా మ్యూజిక్ ని అందిస్తుండగా, సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతు చిరంజీవి గారిని నా కంటి తో ఎలా చూడాలని అనుకున్నానో అలా చూసే అవకాశం నాకు వచ్చింది. తప్పకుండా మన శంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతికి వచ్చి అందరకి నచ్చుతుంది.     
  స్టార్ హీరోలకు ఒక్కోసారి విచిత్ర పరిస్థితులు ఎదురవుతుంటాయి. త్వరలో విడుదల కాబోయే సినిమా కంటే కూడా.. ఆ తర్వాత రాబోయే సినిమాపై ఎక్కువ అంచనాలు ఏర్పడతాయి. ఆ సమయంలో హీరోలకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియదు. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అటువంటి పరిస్థితే ఎదురైంది. (Pawan Kalyan)   రీసెంట్ గా 'హరి హర వీరమల్లు'తో ప్రేక్షకులను పలకరించిన పవన్ కళ్యాణ్.. త్వరలో 'ఓజీ'తో అలరించనున్నారు. అయితే ఈ రెండు సినిమాల విషయంలో.. 'ఓజీ'ని ఓన్ చేసుకున్నంతగా పవన్ అభిమానులు 'వీరమల్లు'ని ఓన్ చేసుకోలేదని చెప్పాలి. 'వీరమల్లు' ప్రమోషన్స్ సమయంలో కూడా ఫ్యాన్స్ "ఓజీ ఓజీ" అని పదే పదే అరిచేవారు. దీంతో స్వయంగా పవన్ కళ్యాణే 'రెండూ మన సినిమాలే' అని చెప్పాల్సి వచ్చింది.    అయితే పవన్ ఎంత చెప్పినా అభిమానులు 'వీరమల్లు'ని పూర్తిగా ఓన్ చేసుకోలేకపోయారనే చెప్పాలి. జూలై 24న విడుదలైన వీరమల్లు.. డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ పై ట్రోల్ వచ్చాయి. ఫ్యాన్స్ కూడా ఎప్పటిలా ఈ సినిమాని భుజాన మోసి.. పవర్ స్టార్ రేంజ్ కి తగ్గ కనీస వసూళ్లను ఇవ్వలేదు. ఇదే ఇప్పుడు 'విశ్వంభర' సినిమా విషయంలో మెగాస్టార్ చిరంజీవిని ఆలోచనలో పడేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. (Chiranjeevi)   చిరంజీవి నుంచి తదుపరి రాబోతున్న రెండు చిత్రాలు.. ఒకటి 'విశ్వంభర' కాగా, మరొకటి 'మన శంకరవరప్రసాద్ గారు'. 'విశ్వంభర' అనేది వీఎఫ్ఎక్స్ తో ముడిపడిన భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ ఫిల్మ్ అయినప్పటికీ.. దీని కంటే 'మన శంకరవరప్రసాద్ గారు'పైనే అభిమానుల్లో ఎక్కువ అంచనాలు ఉన్నాయి. అందుకే 'విశ్వంభర'ను ఆలస్యంగా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   నిజానికి 'విశ్వంభర' ఈ ఏడాది ప్రారంభంలో విడుదల కావాల్సి ఉండగా.. షూటింగ్ ఆలస్యం, వీఎఫ్ఎక్స్ వర్క్ వంటి కారణాలతో వాయిదా పడింది. ఇటీవల షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. దీంతో 'విశ్వంభర' ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదలవుతుందని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా 2026 వేసవికి వాయిదా పడింది. ఓ రకంగా ఇది తెలివైన నిర్ణయమని చెప్పవచ్చు.   2026 సంక్రాంతికి 'మన శంకరవరప్రసాద్ గారు' విడుదలవుతోంది కాబట్టి.. ఇప్పుడు అందరి దృష్టి దానిపైనే ఉంటుంది. పైగా 'విశ్వంభర' వీఎఫ్ఎక్స్ తో ముడిపడిన సినిమా కాబట్టి.. ఏదో కంగారు కంగారుగా పూర్తి చేసి విడుదల చేస్తే.. అనవసరంగా ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనిని దృష్టిలో పెట్టుకునే వీఎఫ్ఎక్స్ కి తగినంత సమయం కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తాజాగా విడుదలైన 'విశ్వంభర' స్పెషల్ గ్లింప్స్ లో వీఎఫ్ఎక్స్ ను గమనిస్తే.. టీజర్ కంటే చాలా బెటర్ గా ఉంది. సినిమా అవుట్ పుట్ కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.   పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో చివరి మూమెంట్ లో 'వీరమల్లు'ని వేగంగా పూర్తి చేసి విడుదల చేశారు. అదే వీఎఫ్ఎక్స్ పై ట్రోల్స్ కి కారణమైంది. అందుకే, 'విశ్వంభర' విషయంలో ఆ తప్పు జరగకూడదని పక్క ప్లాన్ తో వెళ్తున్నట్లు సమాచారం. మొత్తానికి.. సైలెంట్ గా వచ్చి, సాలిడ్ అవుట్ పుట్ తో అందరినీ సర్ప్రైజ్ చేయాలనే ఉద్దేశంతోనే.. చిరంజీవి వెనక్కి తగ్గినట్లు వినికిడి.  
నటప్రపూర్ణ పద్మశ్రీ మంచు 'మోహన్ బాబు'(Mohan Babu)నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన విష్ణు(Vishnu),సుదీర్ఘ కాలం నుంచి చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. రీసెంట్ గా హిస్టారికల్ మూవీ  'కన్నప్ప'(Kannappa)తో వచ్చి తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన 'కన్నప్ప' విష్ణుకి సరికొత్త ఇమేజ్ ని కూడా ఏర్పాటు చేసింది.    ఎంటర్ టైన్ మెంట్ రంగంలో నూతన ఒరవడిని సృష్టించడానికి విష్ణు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. మొబైల్ వినియోగదారులకి సినిమాటిక్ అనుభవాన్ని పంచేలా, మైక్రోడ్రామా(Micro Drama) అనే  చిత్రాలని నిర్మించబోతున్నాడు. మూడు నుంచి ఏడు నిమిషాల నిడివితో సదరు మైక్రో డ్రామా చిత్రాలు ఉండనున్నాయి. దీంతో ఇవి భారతీయ వినోద రంగంలో సరికొత్త ట్రెండ్ ని క్రియేట్ చేస్తాయని విష్ణు నమ్ముతున్నాడు. వంద కోట్ల నిర్మాణ వ్యయంతో వీటిని రూపొందించబోతున్నారు. మైక్రో డ్రామా చిత్రాలని చైనా ప్రారంభించగా, యునైటెడ్ స్టేట్స్ తో పాటు మనదేశంలో కూడా ఇప్పుడిప్పుడే  విశేష ఆదరణ పొందుతు, బిలియన్ డాలర్ల పరిశ్రమగా అభివృద్ధి చెందుతుంది. విష్ణు అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే, కన్నప్ప తో ఏర్పడిన సరికొత్త ఇమేజ్ దృష్ట్యా, పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న సబ్జెట్స్ లోనే విష్ణు చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది. మరికొన్నిరోజుల్లో ఈ విషయంపై అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.  హీరోగానే కాకుండా నిర్మాతగాను విష్ణు తన సత్తా చాటుతున్న సంగతి  తెలిసిందే.
  మెగాస్టార్ చిరంజీవి తన 157వ సినిమాని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రకటనతోనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వరుస బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్స్ ని అందిస్తున్న అనిల్ రావిపూడి.. మెగాస్టార్ తో మొదటిసారి చేతులు కలపడంతో.. కేవలం అభిమానుల్లో మాత్రమే కాకుండా అందరిలోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ ను విడుదల చేశారు మేకర్స్. (Mega 157 Title Glimpse)   నేడు(ఆగస్టు 22) చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 'మెగా 157' టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే ఈ చిత్రానికి 'మన శంకరవరప్రసాద్ గారు' అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. 'పండగకి వస్తున్నారు' అనే ట్యాగ్ లైన్ ని కూడా జోడించారు. (Mana Shankara Varaprasad Garu)      దాదాపు నిమిషం నిడివితో రూపొందించిన 'మన శంకరవరప్రసాద్ గారు' టైటిల్ గ్లింప్స్ అదిరిపోయింది. వింటేజ్ చిరంజీవిని చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు. సిగరెట్ వెలిగించి, నల్ల కళ్లద్దాలు పెట్టుకొని, కార్ దిగి సూట్ లో మెగాస్టార్ నడిచి రావడం నెక్స్ట్ లెవెల్ లో ఉంది. 'బాస్' అంటూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ రావడం, "మన శంకరవరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు" అని వెంకటేష్ వాయిస్ తో చెప్పించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక గ్లింప్స్ చివరిలో గన్ పట్టుకొని చిరంజీవి మెట్లు దిగే షాట్, గుర్రాన్ని పట్టుకొని చిరు నడిచే షాట్ వేరే లెవెల్ లో ఉన్నాయి.   మొత్తానికి 'మన శంకరవరప్రసాద్ గారు'తో అభిమానులకు అసలుసిసలైన మెగా ట్రీట్ ఇవ్వబోతున్నట్లు గ్లింప్స్ తోనే క్లారిటీ ఇచ్చారు అనిల్ రావిపూడి. 2026 సంక్రాంతికి విడుదల కానున్న ఈ మూవీ బాక్సాఫీస్ ని షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో వెంకటేష్ కూడా ఓ స్పెషల్ రోల్ లో కనువిందు చేయనుండటం విశేషం.  
  Cast: Raju Jeyamohan, Aadhiya Prasad, Bhavya Trikha, Vikranth, Saranya Ponvannan, Devadarshini, VJ Pappu, Charle, Michael Thangadurai Crew:  Cinematography by Babu Kumar IE Editing by John Abraham Music by Nivas K. Prasanna Written & Directed by Raghav Mirdath Produced by Suresh Subramanian   Raju Jeyamohan became a highly popular TV star with his stint on Bigg Boss Tamil. Before joining the show in acted in several popular TV shows like Kana Kaanum Kaalangal, Saravanan Meenatchi Season 2, Andal Azhagar, Bharathi Kannamma. He hosted few TV shows and performed in films like Natpuna Ennanu Theriyuma, Murungakkai Chips, Don. Now, he debuted as main lead with Bun Butter Jam and the movie released in Telugu on 22nd August, post its Tamil release, last month.    Plot:  Chandru (Raju Jeyamohan) is a reckless stundent highly pampered by his mother Lalitha (Saranya Ponvannan). He passes out in Intermediate and looks to join Engineering college. But his mother Lalitha, is already worried about his marriage and she wants to be a love-arranged one. She meets Uma (Devadarshini) at a wedding, who is introduced to her by her husband Kumar (Charle). Well, both the women discuss about their children.  Uma wants her daughter Madhumitha (Aadhiya Prasad) to marry a decent one. So, the two women conspire to introduce their children to each other and make it love-arranged marriage. But Chandru falls in love with Nandini (Bhavya Trika) who wants to become an influencer. Even Madhumita has a love interest Akash (VJ Pappu). Will the mothers' plan workout? What will they do and to what extent will they go to achieve their motto? Watch the movie to know more.    Analysis:  Raju Jeyamohan is good in Chandru role and he is able to convey the emotional journey of the character well. Bhavya Trika as Nandhini got a glamor mixed Gen-Z girl role and she did well, too. Aadhiya Prasad and VJ Pappu evoke laughs until the climax portion. They did pull off their roles with good chemistry and comic timing. But the film lacks in consistent tone as the comedy feels a little bit forced in the first hour.  While Saranya and Devadarshini performed brilliantly, their roles seem too loud and indifferent to real life moms. Trying to play over possessive and highly manipulative mother figures, both of them did their job well but the writing did not do enough justice to their capabilities. It feels like a tad bit too stretched in the first hour in projecting them as such.  The second hour does bring central conflicts into the play but the writing again swings between being impulsive and matured. The narrative needed to be either catch an over-the-top tone consistently or be matured. It tries to be both and most of the jokes don't land. Still, the movie engages with timely big punches and comic reliefs. Raghav Mirdath needed to stick to Rajesh M's formula of nothing being too serious, so that, the comical tone would have consistent.  The second hour has moments that stick out above the rest with emotional climax being a homerun. All-in-all, we can say that the movie has several bumps but some laugh-out-loud moments that makes it watchable. Bun Butter Jam could have been much better but it ends up being an engaging flick to an extent. The Telugu dubbing quality is undermining too, as songs feel odd to the ear.     Bottomline:  Bun Butter Jam could have better but engages with good moments.    Rating: 2.75/5    Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.  
ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)పుట్టినరోజు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్టాలతోపాటు, దేశ, విదేశాల్లో ఉన్న మెగా అభిమానులు చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్ని చాలా ఘనంగా జరుపుతున్నారు. ఈ క్రమంలో నిన్న హైదరాబాద్ లోని శిల్ప కళావేదికగా అభిమానులు భారీ ఎత్తున ఈవెంట్ ని జరిపారు. ఈ వేడుకల్లో ప్రముఖ హీరో శ్రీకాంత్(Srikanth)తో పాటు ఇతర సినీ ప్రముఖులు పాల్గొని, చిరంజీవి తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.  రీసెంట్ గా  ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)ఎక్స్(X)వేదికగా చిరంజీవి బర్త్ డే పై స్పందిస్తు 'హ్యాపీ బర్త్ డే వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు అంటు ట్వీట్ చేసాడు. గతంలో చిరంజీవితో కలిసి డాన్స్ చేసిన పిక్ ని కూడా అల్లు అర్జున్  షేర్ చేసాడు. చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej)ట్వీట్ చేస్తు నేను చూసిన మొదటి హీరో మావయ్య, ఆయన జీవితం ఆదర్శం. మామ చేతి నడకే ఈ రోజు నా పయనం. మావయ్య నా సర్వస్వం. కష్టమైన సుఖమైనా కొండంత దైర్యం. మావయ్య మాటే శాసనం. ఎప్పటికి నా బలం. మీ మెగాస్టార్ మన మెగాస్టార్, నా ముద్దుల మావయ్య చిరంజీవి గారికి జన్మ దిన శుబాకాంక్షలని ట్వీట్ చేసాడు.   విక్టరీ వెంకటేష్(Venkatesth),తేజ సజ్జ, నారా రోహిత్, దర్శకుడు హరీష్ శంకర్ వంటి పలువురు సినీ ప్రముఖులుతో పాటు పలు రాజకీయ, వ్యాపార ప్రముఖులు చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న వారిలో ఉన్నారు.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  తల్లిదండ్రులు పిల్లలకు గైడ్లు, టీచర్లు, మార్గదర్శకులు. వారు పిల్లలకు ప్రేమపూర్వకమైన, సురక్షితమైన,  ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇవ్వడం ద్వారా జీవితాన్ని ఆశాజనకంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు.  అయితే తల్లిదండ్రులకు,  పిల్లలకు మధ్య బంధం జనరేషన్ మారగానే బంధం కూడా మార్పుకు లోనవుతూ ఉంటుంది.  పెళ్లిళ్లు చేసుకుని పిల్లలు పుట్టిన తరువాత చాలామంది తమ తల్లిదండ్రులకు దూరంగా జరుగుతూ ఉంటారు. ఇది కావాలని చేసేది కాకపోయినా కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల కూడా మార్పులు జరుగుతాయి. చిన్న పిల్లలు, వారి తల్లిదండ్రులు,  అవ్వ తాతలు.. ఇలా మూడు తరాల మధ్య బంధం బలంగా ఉంటే ఆ కుటుంబాలు చాలా గొప్ప సంపదను పోగేసుకున్నట్టే.. అయితే ఇలా మూడు తరాల బంధం బలంగా మారడానికి చేయాల్సిందేమిటి? తెలుసుకుంటే..  కృతజ్ఞత.. తల్లిదండ్రులు పిల్లల కోసం చేసే వాటికి మాటల్లో థాంక్స్ చెబితే సరిపోదు. కానీ మానసికంగా బలమైన కుటుంబ సంబంధాలను పెంపొందించడానికి,  భవిష్యత్ తరాలను పోషించడానికి ఇది ఒక మార్గం.  కుటుంబంతో ఏదైనా కార్యక్రమం నిర్వహించినప్పుడు  తల్లిదండ్రులతో ప్రేమ, ఆప్యాయత, గౌరవం,  కృతజ్ఞతను వ్యక్తం చేయాలి. ఇది చూస్తే మీ పిల్లలు కూడా తమ అవ్వతాతలు ఎంత గొప్పవారు, వారిని గౌరవించాలి అనే విషయాన్ని నేర్చుకుంటారు. ఇది పెద్దవారి పట్ల పిల్లలలో మంచి అభిప్రాయం,  మంచి నడవడికను పెంపొందిస్తుంది.  పిల్లల ముందు ఎట్టి పరిస్థితులలోనూ పెద్దలను దూషించడం,  గేళి చేసి మాట్లాడటం చేయరాదు.   పిల్లలు వారుకళ్లతో చూసే దాన్నే  నేర్చుకుంటారు. తమ తల్లిదండ్రులు తమ పెద్దలను జాగ్రత్తగా చూసుకోడం, గౌరవించడం వంటివి చేస్తే  పిల్లలు కూడా కరుణ, సున్నితత్వం వంటివి నేర్చుకుంటారు.   పెద్దలను చూసుకోవడం తమ భాద్యత అనే భావాన్ని మనసులో పెంపొందించుకుంటారు. ఇది పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రుల పట్ల మాత్రమే కాకుండా, సమాజంలోని ఇతరుల  పట్ల కూడా పాజిటివ్ గా ఉండేలా చేస్తుంది. వృద్ధులకు సేవ చేయడం భారం కాదని.. సేవ అనేది  ప్రేమ, కృతజ్ఞత చూపించే అవకాశం అని పిల్లలు అర్థం చేసుకుంటారు. ఇది పాఠశాల లేదా పుస్తకాల నుండి పిల్లలకు లభించే గుణం కాదు.. కేవలం తమ చుట్టూ ఉన్న వాతావరణం ద్వారానే సాధ్యమవుతుంది.  మందులు ఇవ్వడం, మాట్లాడటం, సమయం గడపడం వంటివి పిల్లల మనస్సుల్లో లోతైన ముద్ర వేస్తాయి. ఈ కారణంగానే పెద్దలకు ఏదైనా సేవ చేసేటప్పుడు తప్పనిసరిగా పిల్లలను కూడా వెంట ఉంచుకోవడం మంచిది. తల్లిదండ్రులకు కూడా ప్రేమ అవసరం.  తల్లిదండ్రుల కోసం ఏదైనా చేసినప్పుడు వారు చాలా సంతోషంగా ఉంటారు.చుట్టూ ఉన్న నలుగురికి తమ పిల్లలు తమకు ఏం చేశారు అనే విషయాన్ని చెప్పుకుని మరీ చాలా గర్వంగా ఫీలవుతూ సంతోషిస్తారు.  అందుకే తల్లిదండ్రుల కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటే అటు తల్లిదండ్రులను సంతోషంగా ఉంచడమే కాకుండా.. ఇటు పిల్లలకు కూడా ఒక అభ్యసనం అవుతుంది. ఇది మూడు తరాల బంధాన్ని చాలా ఆరోగ్యంగా,  బలంగా  ఉంచుతుంది.                                 *రూపశ్రీ
  వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ప్రత్యేకమైన,  ముఖ్యమైన సంబంధం. ఇది ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాల కలయిక కూడా. వివాహం జరిగిన మొదట్లో  కొత్త అలవాట్లు, కొత్త బాధ్యతలు,  బంధంలో అంచనాలు వంటి అనేక  పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. చాలా వరకు ఇలాంటి వాటి వల్ల భార్యాభర్తల మధ్య కానీ కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుంటే ఆ సంబంధాన్ని బలంగా, సంతోషంగా,  దీర్ఘకాలం కొనసాగించవచ్చు. వివాహం తర్వాత సంబంధాన్ని బలోపేతం చేయడానికి అత్యంత ముఖ్యమైన విషయాలేంటో తెలుసుకుంటే..  కమ్యూనికేషన్.. కొత్తగా పెళ్లైన వారు  సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం ఒకరితో ఒకరు స్పష్టంగా,  నిజాయితీగా మాట్లాడుకోవాలి. ఒకరితో ఒకరు ఓపెన్ గా  మాట్లాడాలి.  మనసులో ఏవైనా సందేహాలు, సందిగ్ధాలు, అనుమానాలు ఉంటే వాటిని ఓపెన్ గా మాట్లాడి పరిష్కరించుకోవాలి. లేకపోతే ఇది మనసులో పెద్ద అగాధాన్ని సృష్టించే అవకాశం ఉంటుంది.   చిన్న చిన్న విషయాలను కూడా పంచుకోవడం వల్ల జీవితం సంతోషంగా ఉంటుంది.  గౌరవం.. పెళ్లి చేసుకుంటే ఇద్దరూ తమ ఇష్టాలను కోల్పోయి ఇద్దరికి కలిపి కొన్ని ఉమ్మడి ఇష్టాలు పెట్టుకోవాలని కాదు.. మరీ ముఖ్యంగా అమ్మాయిల విషయంలో కొన్ని వదులుకోవాలనే విదంగా ఇంట్లో పరిస్థితులు,  ఒత్తిడులు జరుగుతూ ఉంటాయి. ఇది చాలా తప్పు..   వివాహం తర్వాత కూడా ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవించాలి.  ఒకరి కెరీర్ లక్ష్యాలను మరొకరు ప్రోత్సహించాలి.  ఎవరి గుర్తింపు వారికి ఉండనివ్వాలి. ప్రాధాన్యత.. వివాహం తర్వాత అత్తమామలు,  తల్లిదండ్రులిద్దరికీ సమ ప్రాముఖ్యత ఇవ్వడం చాలా ముఖ్యం. కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలు కలిసి తీసుకోవాలి. కుటుంబం, బంధువులు,  భాగస్వామి మధ్య సమన్వయం సంబంధంలో సామరస్యాన్ని తెస్తుంది. డబ్బు విషయాలు.. వివాహం తర్వాత బాధ్యతలు ఖర్చులు రెండూ పెరుగుతాయి.  ఖర్చులు, పొదుపులను కలిపి ప్లాన్ చేసుకోవాలి. డబ్బు విషయాలను బహిరంగంగా చర్చించడం ముఖ్యం. అలాగే డబ్బు విషయాలలో ఒకరి మాటే నెగ్గాలి అనే మనస్తత్వం ఉండకూడదు.  డబ్బు కారణంగా గొడవలు పెరిగే పరిస్థితులు ఉంటే.. ఆ డబ్బు గురించి కొన్ని రోజులు మాట్లాడకుండా వదిలేయడం మంచిది.  డబ్బు  ఎప్పుడూ భార్యాభర్తలను విడదీసే అంశం కాకూడదు. పర్సనల్ స్పేస్.. ప్రతి వ్యక్తికి తమకంటూ స్పేస్ లేదా కొంత స్వేచ్ఛ అవసరం. నువ్వు నా సొంతం అయిపోయావు అనే మెంటాలిటీని మితిమీరి  ప్రదర్శించకూడదు. భాగస్వామి  తమ స్వంత ఇష్టాల ప్రకారం జీవించగలిగేలా వారికి కొంత స్పేస్ ఇవ్వాలి. అన్నీ తాము కంట్రోల్ చేయాలని చూడకూడదు.  అధిక నియంత్రణ సంబంధాన్ని దెబ్బతీస్తుంది. సెలబ్రేట్స్.. పుట్టినరోజులు, వార్షికోత్సవాలు, ప్రమోషన్లు లేదా చిన్న విజయాలను కూడా కలిసి జరుపుకోవాలి. ఇది సంబంధాన్ని తాజాగా,  ప్రేమగా ఉంచుతుంది. కలిసికట్టుగా.. ఏ సమస్యనైనా "ఇద్దరు"గానే పరిష్కరించుకోవడం మంచిది. ఒకరినొకరు నిందించుకోవడం, వాదనలు చేసుకోవడం మానుకోవాలి. ఏదైనా గొడవ జరిగినప్పుడు కొద్దిసేపు సైలెంట్ గా ఉండి.. ఆ తర్వాత ఇద్దరూ ఒక చోట కూర్చుని ఇద్దరి మధ్య ఎందుకు గొడవ వచ్చింది?  ఎవరు ఎవరి వల్ల బాధపడ్డారు? తప్పు ఎవరిది?  వంటి విషయాలను నిజాయితీగా,  ఓపెన్ గా మాట్లాడుకుంటే సమస్య చాలా సులువుగా పరిష్కారం అవుతుంది. అయితే.. తప్పును ఒప్పుకోకుండా ఇగో ప్రదర్శించడం వంటివి చేస్తే బంధం నిలబడటం కష్టం అవుతుంది.  బంధంలో ఇగో ఎప్పుడూ ఉండరాదు.                                    *రూపశ్రీ.
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల మొదటి తేదీ వచ్చిందంటే దేశం మొత్తం అసక్తిగానూ అంతకు మించి ఆందోళన, అసంతృప్తులతోనూ మూల్గుతుంది. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టడమే.. ఈ బడ్జెట్ పుణ్యమా అని కొన్ని వస్తువుల ధరలు తగ్గితే.. మరికొన్ని వస్తువుల ధరలు రయ్యిమని పైకి ఎగిసిపడతాయి. ఇదంతా దేశానికి, ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించినది అయితే ఈ సమాజంలో ఉన్న ప్రతి కుటుంబానికి, కుటుంబ సభ్యులకు ప్రతి నెలా బడ్జెట్ బేజార్… బాబోయ్.. అనిపించేలా ఉంటుంది. కారణం ఏమిటంటే మార్కెట్ లో పద్దులు మారిపోవడం. అనుకోకుండా పెరిగే ధరలు సగటు మధ్యతరగతి జీవికి కొరివితో వా తలు పెట్టిన చందంగా ఉంటుంది. అయితే కాస్త అవగాహన ఉండాలి ఎలాంటి పరిస్థితిలో అయినా మీకున్న సంపాదనతోనే మంచి ప్రణాళిక వేసుకుని హాయిగా కాలం వెళ్లదీయచ్చు. ఇంతకూ ఎలాంటి పద్దులు వేస్తే లెక్కల చిట్టా సద్దుమనుగుతుందంటే… అవసరానికి అలవాటుకు తేడా తెలుసుకోవాలి!! చాలా మందికి కొన్ని ఖర్చులు ఓ అలవాటుగా మారిపోయి ఉంటాయి. సాయంత్రం అలా బయటకు వెళ్లి టీ తాగడం, ఆదివారం అవ్వగానే స్నేహితులతో మందు కొట్టడం, వీధి అమ్మలక్కలు అందరూ కలసి కిట్టీ పార్టీ చేసుకోడం. మొహమాటం కొద్దీ లేని బరువులు నెత్తిన వేసుకోవడం వంటివి చేస్తుంటారు. అవన్నీ అవసరాలు కాదు కేవలం అలవాట్లు అనే విషయం గుర్తించాలి. ఇది లేకపోతే పని జరగదు, ఇది చేయకపోతే సమస్య పరిష్కారం కాదు అనేలా ఉండేవి అవసరాలు. అలాంటి వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకుని సమయాన్ని, డబ్బును వృధా చేసే అలవాట్లను మానుకోవాలి. తృప్తితోనే సంతోషం!! తృప్తి పడటం నేర్చుకుంటే ఏమి లేకపోయినా సంతోషంగా ఉండవచ్చు. చాలామంది ఏదో లేదు అనుకుంటూ ఉన్న దాన్ని పట్టించుకోకుండా ఉన్న సుఖాన్ని అనుభవించి అనుభూతి చెందకుండా ఉంటారు. అలాంటి వాళ్లకు తృప్తి విలువ తెలియాలి. ఒక మనిషి వేల రూపాయలు పెట్టి బయట ఎంత ఎంజాయ్ చేసినా ఇంట్లో వారితో 100 రూపాయలతో సరదాగా గడిపే వ్యక్తి తృప్తి ముందు దిగదుడుపే.. కాబట్టి తృప్తి అనేది పెట్టె ఖర్చులో కాదు కలసి పంచుకోవడంలో ఉంటుంది. పొదుపే.. రేపటి బంగారు భవిత!! పొదుపు చేయడం కూడా ఒక విద్య అని చెప్పవచ్చు. ఈ విషయంలో చాలామంది ఆడవాళ్ళను ఉదాహరిస్తారు. కానీ పొదుపుకు జెండర్ తో సంబంధం లేదు. చక్కగా ప్రణాళికలు వేసి డబ్బు ఆదా చేసే మగవారు ఉన్నారు, పోపుల డబ్బా నుండి పాలసీలు వరకు ఎన్నో రూపాల్లో పొదుపు మార్గంలోకి పైసాలను మళ్లించే ఆడవారు ఉన్నారు. కావాల్సిందల్లా అవగాహన మాత్రమే. పైన చెప్పుకున్నట్టు అవసరమైనవి ఏవి అలవాట్లు ఏవి అనేది గుర్తిస్తే ఎంత డబ్బు ఆదా చేయవచ్చు. ఆ తరువాత దుబారా ఖర్చులు వదిలి తృప్తిగా బ్రతకడం తెలుసుకుంటే డబ్బు పోగేయడం ఇంత ఈసీ నా అని కూడా అనిపిస్తుంది.  కాబట్టి చెప్పొచ్చేది ఏమిటంటే.. మీ నెలసరి సంపాదన ఎంతైనా కావచ్చు. దానికి తగినట్టు మీ ఖర్చులు, పొదుపు, మదుపు ఉండేలా మీరే చక్కగా ప్రణాళికలు వేసుకోవచ్చు. అలా చేస్తే మీ బడ్జెట్ భలేగా హిట్టయ్యి టెన్షన్ లేని జీవితాన్ని మీకు అందిస్తుంది. మరి నిర్మలా సీతారామన్ కంటే మేటిగా, దేశ బడ్జెట్ కు ధీటుగా మీరూ వేయండి మీ ఇంటి కోసం బడ్జెట్ ప్లాన్..                                     ◆నిశ్శబ్ద.  
  మన మూత్రపిండాలు, చిక్కుడు గింజల ఆకారంలో ఉన్న రెండు శరీర అవయవాలు. ఇవి మన శరీరంలో సహజ ఫిల్టర్‌లుగా పనిచేస్తాయి, విషాన్ని,  వ్యర్థ ఉత్పత్తులను విసర్జిస్తాయి.  ద్రవాలు, ఎలక్ట్రోలైట్లు, ముఖ్యమైన ఖనిజాలు, సోడియం,  పొటాషియంలను సమతుల్యం చేస్తాయి. మనం మూత్రపిండాల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే, ముఖ్యంగా వృద్ధాప్యంలో దాని పనితీరు నెమ్మదిగా తగ్గిపోతుంది. మూత్రపిండాల వ్యాధులలో సమస్య ఉన్నట్టు దానికి లక్షణాలు వెంటనే బయటపడవు.  సమస్య గుర్తించే సమయానికి సాధారణంగా చాలా ఆలస్యం అవుతుంది. మధుమేహం , అధిక రక్తపోటు లేదా దీర్ఘకాలిక మందుల వాడకం వంటి సాధారణ  విషయాలు  కూడా  మూత్రపిండాలు వృద్ధాప్యంలో  వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని పెంచుతాయి. వృద్దాప్యంలో వచ్చే మూత్రపిండాల వ్యాధులు ఏవి? తెలుసుకుంటే.. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి(CKD)..   మధుమేహం, అధిక రక్తపోటు,  గుండె జబ్బుల రేటు పెరుగుదల కారణంగా CKD గణనీయంగా పెరుగుతోంది. ఇది ఏ వయసులోనైనా ఎవరినైనా ప్రభావితం చేయవచ్చు, కానీ 60 ఏళ్లు పైబడిన వారు మూత్రపిండాల పనితీరులో వయస్సు సంబంధిత క్షీణత కారణంగా ఎక్కువగా ప్రభావితమవుతారు. మధుమేహం,  అధిక రక్తపోటు మూత్రపిండాల రక్త నాళాలపై ఒత్తిడి తెస్తాయి. కాలక్రమేణా పనితీరును దెబ్బతీస్తాయి. తీవ్రమైన కిడ్నీ గాయం..   మూత్రపిండాలు అకస్మాత్తుగా రక్తం నుండి వ్యర్థాలను ఫిల్టర్ చేసే సామర్థ్యాన్ని కోల్పోయినప్పుడు అది తీవ్రమైన కిడ్నీ గాయం (AKI) కు దారితీస్తుంది. ఇది గంటల్లో లేదా రోజుల్లోనే సంభవించవచ్చు. ఇది సాధారణంగా ఇతర తీవ్రమైన వ్యాధి  దుష్ప్రభావంగా అభివృద్ధి చెందుతుంది. ఈ రకమైన కిడ్నీ వ్యాధి సాధారణంగా  మూత్రపిండాలను కూడా ప్రభావితం చేసే ఇతర అనారోగ్యాలు ఉన్న వృద్ధ రోగులలో వచ్చే అవకాశం ఉంటుంది. నిరంతర UTIలు, విరేచనాలు, శరీరంలో నీరు లేకపోవడం, అనారోగ్యంగా అనిపించడం లేదా ఉండటం, సాధారణం కంటే తక్కువ మూత్ర విసర్జన చేయడం అన్నీ ఈ సమస్య  సంకేతాలు,  లక్షణాలు. మందుల ప్రేరణ ద్వారా మూత్రపిండ వ్యాధి.. ఇబుప్రోఫెన్,  ఇతర నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAIDలు) ఎక్కువ కాలం తీసుకుంటే మూత్రపిండాలకు హాని కలిగించవచ్చు. మూత్రపిండాల ప్రధాన పాత్రలలో ఒకటి మందుల తొలగింపు,  జీవక్రియ. చాలా మందులు మూత్రంలో విసర్జించబడుతున్నందున అవి మూత్రపిండాల గుండా వెళ్ళాలి. అదనంగా మూత్రపిండాలు మందులను జీవక్రియ చేస్తాయి, తొలగింపుకు ముందు వాటిని క్రియాశీల నుండి క్రియారహిత రూపాలకు మారుస్తాయి. ఇవి  వ్యక్తి తీసుకునే మందులకు మూత్రపిండాలను ప్రభావితం  చేస్తాయి. గుండె జబ్బులు, అధిక రక్తపోటు లేదా మూత్రపిండాల బలహీనత ఉన్నవారు ప్రత్యేకంగా వైద్యుడు సూచించకపోతే సొంతంగా మందులు వాడటాన్ని నివారించాలి.                                          *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  
   నేటి కాలంలో నడుస్తున్న  బిజీ,  ఒత్తిడితో కూడిన జీవితంలో చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ట్రాఫిక్‌లో చిక్కుకోవడం, ఇంటర్నెట్ నెమ్మదిగా ఉండటం లేదా స్నేహితుల మాటలకు వెంటనే కోపం తెచ్చుకోవడం ఇవన్నీ చాలా మంది అనుభవిస్తూ ఉంటారు. అయితే కోపం అనేది కేవలం ఒక ఎమోషన్  మాత్రమే కాదు, అది  శారీరక,  మానసిక ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుందని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పదే పదే  కోపం రావడం అనేది అధిక రక్తపోటు, గుండె జబ్బులు,  జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా ఇది మానవ  సంబంధాలను,  వృత్తి జీవితాన్ని కూడా  ప్రభావితం చేస్తుంది.  అందువల్ల కోపాన్ని సరిగ్గా నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. అయితే కోపాన్ని నియంత్రించుకోవడం కూడా ఒక గొప్ప నైపుణ్యం అనే చెప్పవచ్చు. కోపాన్ని అదుపు చేసుకోవడం అంటే కోపాన్ని పూర్తిగా అణచివేయడం కాదు, దానిని వ్యక్తీకరించే విధానం కావచ్చు, దానిని ప్రదర్శించే ప్రాంతం కావచ్చు.. వీటిని మార్చుకోవడం.  ముఖ్యంగా  కోపానికి గల కారణాలను  అర్థం చేసుకుని, దానిని నియంత్రించుకోవడానికి పద్ధతులను అవలంబించినప్పుడు  భావోద్వేగాలపై  మంచి నియంత్రణను కలిగి ఉండగలుగుతాము. కోపాన్ని నియంత్రించుకునే పద్దతులు ఏంటో తెలుసుకుంటే.. ట్రిగ్గర్ లు..  కోపాన్ని నియంత్రించుకోవాలనుకుంటే,మొదట చేయాల్సింది ఎందుకు కోపం వస్తుంది? ఎవరి వల్ల కోపం వస్తుంది? ఎలాంటి పరిస్థితులలో కోపం వస్తుంది? ఈ విషయాలను అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు  పని ఒత్తిడి కావచ్చు లేదా ఒక  వ్యక్తి కావచ్చు,  కొన్నిసార్లు  రద్దీగా ఉండే ట్రాఫిక్ ప్రాంతం కావచ్చు. దేని వల్ల కోపం వస్తుందనేది గుర్తించగలిగితే ఆ కోపాన్ని నియంత్రించడానికి ఒక ప్రణాళికను తయారు చేసుకోవచ్చు.  శ్వాస సాధన..  కోపం వచ్చినప్పుడల్లా వెంటనే స్పందించే బదులు కొద్ది సేపు ఆగి లోతైన శ్వాసను ప్రాక్టీస్ చేయాలి. ఈ టెక్నిక్  శరీరాన్ని ప్రశాంతపరుస్తుంది.  హృదయ స్పందనను సాధారణీకరిస్తుంది.  ఆలోచించడానికి సమయం ఇస్తుంది. నెమ్మదిగా ఉచ్ఛ్వాసము,  నిశ్వాసము  కోపాన్ని తక్షణమే నియంత్రించగలవు. పరిస్థితి నుండి దూరం.. ఏదైనా  పరిస్థితి  చాలా ఇబ్బంది పెడుతుంటే ఆ ప్రదేశం నుండి కొంత సమయం దూరంగా వెళ్లడం మంచిది. తర్వాత  ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడటం  లేదా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించడం చేయాలి. దూరాన్ని సృష్టించడం వల్ల పరిస్థితిని కొత్త కోణం నుండి చూసే అవకాశం లభిస్తుంది. ఇది కోపాన్ని శాంతపరుస్తుంది. వ్యాయామం,  ధ్యానం.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా కోపాన్ని నియంత్రించడానికి సులువు అవుతుంది. శారీరక శ్రమ.. ఒత్తిడిని,  కోపాన్ని తగ్గించే హార్మోన్లను విడుదల చేస్తుంది. దీనితో పాటు ధ్యానం,  యోగా సాధన చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారి ఏకాగ్రత పెరుగుతుంది. తద్వారా  చిన్న విషయాలకు స్పందించడం మానేస్తారు.                          *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
 బొబ్బలు,  మొటిమలు చాలా సాధారణ సమస్య. ఇది తరచుగా కొంతమందిని ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్య సాధారణంగా చిన్న పిల్లలలో కనిపిస్తుంది. శరీరంపై బొబ్బలు, మొటిమలు ఉండటం ఒక సాధారణ విషయం. కానీ సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే వీటి పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. బొబ్బలు ఎరుపు, వాపు,  చీముతో ఉంటాయి. అలాగే మొటిమలు కూడా పదే పదే రావడం, చీము, రక్తం రావడం వంటివి జరుగుతుంటాయి.  ఇవి ఆరోగ్యం గురించి అనేక ముఖ్యమైన సూచనలను  ఇస్తాయి. బ్యాక్టీరియా మన రంధ్రాలలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ వ్యాప్తి చేసినప్పుడు బొబ్బలు,  మొటిమలు ఏర్పడతాయి. శరీర రోగనిరోధక వ్యవస్థ ఈ ఇన్ఫెక్షన్‌కు ప్రతిస్పందిస్తుంది. దీనివల్ల వాపు,  చీము ఏర్పడుతుంది. అయితే బాక్టీరియా మాత్రమే దీనికి కారణమని చెప్పలేం. అలవాట్లు, ఆరోగ్య పరిస్థితులు,  పర్యావరణ కారకాలు కూడా బొబ్బలు,  మొటిమల ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ కారణాలను తెలుసుకుని వాటిని నివారించడం ద్వారా  చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. దీని వెనుక ఉన్న మూడు అతిపెద్ద కారణాలను తెలుసుకుంటే.. వ్యక్తిగత పరిశుభ్రత సరిగా లేకపోవడం.. మొటిమలు,  బొబ్బలకు అతి పెద్ద కారణం వ్యక్తిగత పరిశుభ్రత సరిగా లేకపోవడం. శరీరాన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోనప్పుడు, చర్మంపై నూనె, చెమట,  బ్యాక్టీరియా పేరుకుపోతాయి. ఈ బాక్టీరియా చర్మ రంధ్రాలలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. దీని వలన బొబ్బలు,  మొటిమలు వస్తాయి. అందువల్ల క్రమం తప్పకుండా స్నానం చేయడం,  చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ..  రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే శరీరం బయట  బ్యాక్టీరియా,  సూక్ష్మక్రిములతో సరిగ్గా పోరాడదు. డయాబెటిక్ రోగులు లేదా చాలా కాలంగా ఏదైనా వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు కురుపులకు ఎక్కువగా గురవుతారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం,  తగినంత నిద్ర ద్వారా రోగనిరోధక శక్తిని బలోపేతం చేయవచ్చు. జీర్ణ ప్రక్రియ వల్ల బొబ్బలు వస్తాయి..  జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయనప్పుడు శరీరం ఆహారం నుండి టాక్సిన్లను పూర్తిగా తొలగించలేకపోతుంది. ఈ విషపదార్థాలు రక్తంలో పేరుకుపోవడం ప్రారంభిస్తాయి.  శరీరం చర్మం ద్వారా వాటిని తొలగించడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రక్రియలో ఈవిషపదార్థాలు చర్మ రంధ్రాలను మూసివేస్తాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్, బొబ్బలు లేదా మొటిమలు ఏర్పడతాయి. హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి.. పైన  మూడు ప్రధాన కారణాలతో పాటు బొబ్బలు,  మొటిమలు రావడానికి మరొక కారణం ఉంది. అది హార్మోన్ల అసమతుల్యత. ముఖ్యంగా కౌమారదశలో  మొటిమలకు ప్రధాన కారణం. దీనితో పాటు ఒత్తిడి శరీరంలో కార్టిసాల్ వంటి హార్మోన్లను కూడా పెంచుతుంది. ఇది చర్మంలో నూనె ఉత్పత్తిని పెంచుతుంది. దీనివల్ల రంధ్రాలు మూసుకుపోయి బొబ్బలు ఏర్పడతాయి. ఒత్తిడిని నియంత్రించడం ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చు.  నివారణకు అవసరమైన జాగ్రత్తలు.. కురుపులను నివారించడానికి చర్మాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. సమతుల్య ఆహారం తీసుకోవాలి.  పుష్కలంగా నీరు త్రాగాలి.  ఈ సమస్యను పదే పదే ఎదుర్కుంటుంటే వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే ఇది ఏదైనా అంతర్గత వ్యాధికి సంకేతం కావచ్చు.        రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...