అంబటిని పరామర్శించిన ముద్రగడ.. చంద్రబాబుపై విమర్శల జడివాన

posted on: Feb 23, 2026 2:13PM

రాజమహేంద్రవరం జిల్లా జైలు నుంచి బెయిలుపై ఇటీవల విడుదలైన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబును వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి సోమవారం (ఫిబ్రవరి 23) పరామర్శించారు. మాజీ మంత్రులు, వైసీపీనాయకులతో కలిసి గుంటూరులోని అంబటి నివాసానికి వెళ్లిన ముద్రగడ అంబటి రాంబాబును పరార్శించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభఉత్వం లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కాపు సామాజికవర్గం బానిస వర్గం కాదన్నారు. అరెస్టులకు భయపడేది లేదని ముద్రగడ ఈ సందర్భంగా చెప్పారు.

 గతంలో చంద్రబాబు తనను, తన కుటుంబాన్నీ వేధించిన తీరు అందరికీ తెలుసునని చెప్పిన ఆయన  మాజీ మంత్రి ఇంటిపై ఏడు గంటల పాటు దాడులు చేయడం, అరెస్టులతో భయపెట్టాలని చూడటం ప్రజాస్వామ్యంలో సరికాదన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో ప్రతిరోజూ అబద్ధాలాడుతున్నారంటూ చంద్రబాబు, తెలుగుదేశం నేతలపై విమర్శలు గుప్పించారు.  ఇప్పటికైనా  భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభరెడ్డి.. అంబటి రాంబాబు కుమార్తె మౌనికను ప్రత్యేకంగా పలకరించి.. ఆమె ధైర్యాన్ని అభినందించారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...