- ఎన్టీఆర్, చంద్రబాబుల ఆశయ సాధనే మన మార్గం  - పార్టీ కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించి టీడీపీ బలోపేతానికి కృషి చేయండి   "కాఫీ కబుర్లు" కార్యక్రమంలో టీడీపీ క్లస్టర్ ఇన్చార్జిల‌కు మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం  పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ క్లస్టర్ ఇన్‌చార్జుల‌ శిక్షణ తరగతుల్లో భాగంగా “కాఫీ కబుర్లు” కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తెలుగుజాతి విశ్వఖ్యాతి అంటే గుర్తుకు వచ్చేది అన్న ఎన్టీఆర్. తెలుగు జాతి శక్తి ఏంటో ప్రపంచానికి చూపించిన వ్యక్తి చంద్రబాబు. వీరిద్దరూ బలమైన సిద్ధాంతాలతోనే విజయం సాధించారని, వారిని ఆదర్శంగా తీసుకోవాలని నేతలకు మంత్రి సూచించారు.  సిద్ధాంతాలే నాయకత్వానికి బలం  “ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మాత్రమే కాకుండా, వాటి వెనుక ఉన్న పార్టీ సిద్ధాంతాలను కూడా ప్రజలకు వివరించడం అత్యంత కీలకం. కార్యకర్తల మధ్య ఐక్యత, క్రమశిక్షణ ఉంటేనే పార్టీ మరింత బలపడుతుంది. సిద్ధాంతాలపై ఆధారపడి ప్రజల్లో విశ్వాసం పెంచుకుంటేనే దీర్ఘకాలిక రాజకీయ విజయాలు సాధ్యమవుతాయి. సిద్ధాంతపరంగా ఎదిగిన నాయకత్వమే పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది” అని మంత్రి తెలిపారు.  ఆరు ముఖ్య సిద్ధాంతాలు గ్రామ‌స్థాయికి తీసుకెళ్లాలి  “ఎన్ని ప‌నులున్నా సీఎం , నేను ప్రతి వారం ఏదో ఒక‌ ఒక రోజు పార్టీ కార్యాలయంలో గడుపుతూ ప్రజా సమస్యలను వింటూ పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త ప్రత్యేక సమయం కేటాయించాలి. పార్టీ ప్రవేశపెట్టిన ఆరు ముఖ్య సిద్ధాంతాలను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం కల్పించాలి” అని సూచించారు.  పార్టీతో కార్య‌క‌ర్త‌ల‌ను అనుసంధానం చేసేది మై టీడీపీ యాప్  “ప్రతి బూత్, క్లస్టర్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం అత్య‌వ‌స‌రం. రాజకీయాల్లో కొత్త త‌రాన్ని ప్రోత్సహిస్తూ, సిద్ధాంతపరంగా శిక్షణ పొందిన నాయకత్వాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. “మై టీడీపీ” యాప్ ద్వారా కార్యకర్తలు తమ కార్యకలాపాలను తప్పనిసరిగా నమోదు చేయాలి. ప్రతి ఒక్కరి పనితీరును పార్టీ అధినేత పర్యవేక్షిస్తున్నారు. వ్య‌క్తిగ‌త ప‌నులు పూర్తిచేసుకుని కొంత స‌మ‌యం కేటాయించి క్షేత్ర‌స్థాయిలో ప్రజల సమస్యలను గుర్తించి వాటిని అధికారుల ద్వారా పరిష్కరించేందుకు కృషి చేయండి. సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించండి. కష్టపడిన వారికి తగిన గుర్తింపు తప్పకుండా లభిస్తుంది” అని హామీ ఇచ్చారు.  రెడ్ బుక్ స‌మాజ బాగు కోసం..రాజారెడ్డి రాజ్యాంగంతోఈ విధ్వంసం  “గతంలో దేవాలయంలాంటి  తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై, చంద్రబాబు ఇంటిపై, నాయకులపై వైసీపీ నాయకులు దాడులు చేశారు. కార్య‌క‌ర్త‌ల‌ను హింసించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై దమనకాండకు పాల్ప‌డ్డారు. అమర్నాథ్ గౌడ్‌, అబ్దుల్ సలాం, తోట చంద్రయ్యల‌ను వెంటాడి మ‌రీ చంపారు. డా.సుధాకర్‌,  కోడెల శివప్రసాద్, మిస్బా అనే చిన్నారిల‌ను వేధించి మ‌ర‌ణానికి కార‌కుల‌య్యారు. అధికారంలో ఉన్న‌ప్పుడు విధ్వంసం-దాడులు-హ‌త్య‌లు-అవినీతితో చెల‌రేగిపోయిన జ‌గ‌న్..అధికారం పోయాక కూట‌మి ప్ర‌భుత్వంపై విష‌ప్ర‌చారాల‌తో విరుచుకుప‌డుతున్నాడు.  ఐక‌మ‌త్యంగా పోరాట స్ఫూర్తితో వైసీపీ ఫేక్ ఫ్యాక్టరీ నుంచి వ‌చ్చే ఫేక్ స‌మాచారాన్ని తిప్పికొట్టండి. నా రెడ్ బుక్‌ సమాజ బాగు కోసం అయితే, రాజారెడ్డి రాజ్యాంగంతో జ‌గ‌న్‌ సమాజాన్ని నాశ‌నం చేయాల‌నుకున్నాడు.  ఏ ఆత్మ చెప్పిందో కానీ మావిగ‌న్ అంటూ క‌ల‌వ‌రిస్తున్నాడు జ‌గ‌న్‌. ``  నేతల మధ్య సఖ్యత ముఖ్యం  “రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టే అమరావతికి చట్టబద్ధత వచ్చింది, విశాఖ ఉక్కు పరిరక్షణ జరిగింది, రాష్ట్రానికి ప్రత్యేక నిధుల సాధన వంటి విజయాలు సాధ్యమవుతున్నాయి. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ కూటమి భాగస్వాములతో కలిసి పనిచేయాలి. కుటుంబంలా ఐక్యంగా ఉంటేనే ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది. కుటుంబసభ్యుల మధ్య కలహాలు వస్తే అంతా క‌లిసి కూర్చుని మాట్లాడుకుని ప‌రిష్క‌రించుకున్న‌ట్టే, కూట‌మి నేత‌లు కుటుంబంలా  కూర్చొని చ‌ర్చించుకుని విభేదాలు విడ‌నాడ‌లి`` అని సూచించారు.
  పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తన ప్రచార పర్వాన్ని ఉధృతం చేసింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అండదండలతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ క్షేత్రస్థాయిలో సుడిగాలి పర్యటనలు చేస్తూ క్యాడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. గత ఎన్నికల కంటే ఈసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా రెజీనగర్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో అభిషేక్ బెనర్జీ ప్రసంగిస్తూ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం వంటి పార్టీలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఏకమయ్యాయని, వాటి కలయిక అపవిత్రమైనదని ఆయన అభివర్ణించారు. సిద్ధాంతాలు లేని ఇటువంటి కూటములు రాష్ట్రంలో అస్థిరతను సృష్టిస్తాయని, ప్రజలు వీటిని నమ్మే స్థితిలో లేరని విమర్శించారు. ముఖ్యంగా ఏజేయూపీ నేత హుమాయున్ కబీర్‌కు సంబంధించిన వివాదాస్పద వీడియో అంశాన్ని అభిషేక్ ప్రస్తావిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు, విపక్ష నేతలు కుమ్మక్కై రాజకీయ డీల్స్‌కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎన్ని కుతంత్రాలు పన్నినా, తృణమూల్ కాంగ్రెస్ ప్రభంజనాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆయన స్పష్టం చేశారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు అభిషేక్ బెనర్జీ ఆధునిక సాంకేతికతను, సోషల్ మీడియా వ్యూహాలను సమర్థవంతంగా వాడుకుంటున్నారు. మమతా బెనర్జీ వారసుడిగా, పార్టీలో రెండో అత్యున్నత నాయకుడిగా ఆయన ఎదుగుతున్న తీరు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఎన్‌ఆర్‌సీ అమలును అడ్డుకోవడంలో దీదీ పోరాటాన్ని ప్రజలకు గుర్తుచేస్తూ, భావోద్వేగపూరిత ప్రసంగాలతో యువతను ఆకర్షిస్తున్నారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ ఎన్నికలు అభిషేక్ బెనర్జీ నాయకత్వ పటిమకు ఒక పెద్ద పరీక్ష వంటివి. పార్టీలోని సీనియర్ నేతలను కలుపుకుంటూనే, యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ ఆయన వేస్తున్న అడుగులు టీఎంసీకి కలిసి వస్తాయని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. రాబోయే రోజుల్లో బెంగాల్ రాజకీయ పోరు మరింత రసవత్తరంగా మారనుంది. విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ, అభివృద్ధి మంత్రంతో ప్రజల వద్దకు వెళ్తున్న అభిషేక్ బెనర్జీ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. ఏదేమైనా, బెంగాల్ పీఠంపై మరోసారి తృణమూల్ జెండా ఎగురుతుందా లేదా అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మరోసారి అగ్నిగుండంగా మారింది.  మాజీ సీఎం జగన్  తాజాగా తెరపైకి తెచ్చిన  మావిగన్  (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు) ప్రతిపాదన  పెను సంచలనానికి దారితీసింది. అయితే, ఈ ప్రతిపాదన పట్ల జనం నుంచి ఇసుమంతైనా సానుకూలత వ్యక్తం కాలేదు. సానుకూలత సంగతి అటుంచి, ప్రతికూలత తీవ్ర స్థాయిలో వ్యక్తం అయ్యింది. జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.  ఈ క్రమంలోనే ముగ్గురు మాజీ మంత్రులు జగన్ తీరును తప్పుబడుతూ గళమెత్తడం పార్టీ అసంతృప్తి, అసమ్మతి ఏ స్థాయిలో ఉందో తేటతెల్లం చేసిందంటున్నారు పరిశీలకులు.  జగన్మోహన్ రెడ్డి ఈ ప్రతిపాదనను ప్రకటించినప్పటి నుండి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ మొదలైంది. ముఖ్యంగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని ఏళ్ల తరబడి పోరాటం సాగుతుండగా, మళ్లీ కొత్త ప్రాంతాలను తెరపైకి తెచ్చి ఏం సాధిద్దామనుకుంటున్నారంటూ జగన్ ను నిలదీస్తున్నారు.   క్షేత్రస్థాయిలో ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం  ఈ ప్రాంతంలో పార్టీకి పుట్టగతులుండని పరిస్థితులు ఏర్పడుతున్నాయని వైసీపీ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే  పార్టీలో కీలకమైన ముగ్గురు నేతలు, మాజీ మంత్రులు ఈ విషయంలో జగన్‌కు గట్టి హెచ్చరికలే జారీ చేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.  ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఇలాంటి అంశాలను తాము సమర్థించలేమని వారు కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారంటున్నారు.  గతంలో రాజధాని విషయంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పటికే కేడర్ ఇబ్బందులు పడుతోందని, ఇప్పుడు  మావిగన్  అంటే ఇక ప్రజల ముందుకు వెళ్లడం అసాధ్యమని వారు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.  అమరావతికి చట్టబద్ధత వచ్చిన తరుణంలో జగన్ మావిగన్ ప్రతిపాదన వ్యూహాత్మక తప్పిదమని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  ఈ నిర్ణయం ప్రజలను ఆకట్టుకోవడం అటుంచి.. వారిని పారట్ీకి మరింత దూరం చేస్తుందని అంటున్నారు.  ముఖ్యంగా విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ప్రాంతాల్లోని వ్యాపార, వాణిజ్య వర్గాలు కూడా ఈ ప్రతిపాదనపై అయిష్టత వ్యక్తం చేస్తున్నాయి.  జగన్ మావిగన్  నినాదంతోనే ముందుకు సాగితే.. వచ్చే ఎన్నికల నాటికి ప్రజా వ్యతిరేకతే కాకుండా, పార్టీలో అసమ్మతి కూడా పీక్స్ కు చేరు అవకాశం ఉందని అంటున్నారు.   
ALSO ON TELUGUONE N E W S
- రిస్కీ స్టంట్స్ వెనుక అసలు రహస్యం - నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ యాక్షన్  - 'అతనొక్కడే' మాస్ ఎలివేషన్ వీడియో వైరల్! నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్‌లోని బ్లాక్‌బస్టర్ మూవీస్‌లో ఒక‌టైన 'అతనొక్కడే' లోని హై-వోల్టేజ్ ఛేజింగ్ మరియు యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌తో కూడిన వీడియో ఇది. సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా క‌ళ్యాణ్‌రామ్ కెరీర్‌కి చ‌క్క‌ని పునాది అయింది. ఆరోజుల్లో ఇది ఓ ట్రెండ్ సెట్టింగ్ సినిమాగా పేరు తెచ్చుకుంది.  ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్స్‌లు ఇప్పటికీ అభిమానులకు పూనకాలు తెప్పిస్తాయి. ఈ వీడియోలో కళ్యాణ్ రామ్ చేసిన సాహసోపేతమైన విన్యాసాలు చూస్తుంటే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎందుకు అంతటి విజయాన్ని సాధించిందో అర్థమవుతుంది. ఈ సినిమాలోని యాక్షన్ ఘట్టాల కోసం దర్శకుడు సురేందర్ రెడ్డి మరియు స్టంట్ మాస్టర్లు భారీ స్థాయిలో ప్లాన్ చేశారు. హీరో కళ్యాణ్ రామ్ ఏమాత్రం వెనకడుగు వేయకుండా రిస్కీ స్టంట్స్ స్వయంగా చేయడం విశేషం. యాక్షన్ సన్నివేశాల ప్రిపరేషన్ కోసం షూటింగ్‌కు ముందే ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వీడియోలో ప్రధానంగా కనిపించే బైక్ ఛేజింగ్ సీన్ సినిమాకే హైలైట్. రద్దీగా ఉండే రోడ్లపై కళ్యాణ్ రామ్ బైక్‌పై దూసుకెళ్తూ, విలన్లను వేటాడే విధానం అత్యంత ఉద్వేగభరితంగా ఉంటుంది. ఆ బైక్ స్కిడ్డింగ్ మరియు టర్నింగ్స్ చేసే సమయంలో హీరో చూపించిన ఏకాగ్రత అమోఘం. విలన్ల వాహనాన్ని అడ్డగించే క్రమంలో జరిగే కారు బోల్తా సీన్లు హాలీవుడ్ స్థాయిని తలపిస్తాయి. ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద విలన్‌ను కాల్చే సీన్ మాస్ ప్రేక్షకులకు అసలైన విందు. హెల్మెట్ ధరించి, చేతిలో క‌త్తి పట్టుకుని విల‌న్‌ని వెంటాడుతూ ఓ బ్ర‌డ్జిపై నుంచి ఎగిరి గాల్లోనే ఆ విల‌న్ త‌ల న‌ర‌క‌డం వంటి సీన్స్ అప్ప‌టి వ‌ర‌కు తెలుగు సినిమాల్లో రాలేద‌నే చెప్పాలి. ఈ ఇంట‌ర్వెల్ యాక్ష‌న్ సీక్వెన్స్ గురించి ఆరోజుల్లో క‌థ‌లు క‌థ‌లుగా చెప్పుకున్నారు. యాక్షన్ సీన్లలో కళ్యాణ్ రామ్ బాడీ లాంగ్వేజ్ మరియు గంభీరమైన చూపులు ఆ పాత్రకు మరింత బలాన్ని చేకూర్చాయి. స్టంట్ మాస్టర్ల నేతృత్వంలో ప్రాణాలకు తెగించి చేసిన ఈ పోరాట దృశ్యాలు నేటికీ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుండటం విశేషం. ఈ వీడియో చూసిన అభిమానులు కళ్యాణ్ రామ్ డెడికేషన్‌ను కొనియాడుతున్నారు. భవిష్యత్తులో కూడా ఆయన నుండి ఇటువంటి పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్స్ రావాలని కోరుకుంటున్నారు. 'అతనొక్కడే' లాంటి కల్ట్ క్లాసిక్ యాక్షన్ మూవీస్ ఎప్పటికీ తెలుగు సినిమా చరిత్రలో గుర్తుండిపోతాయి. ఇలాంటి మ‌రిన్ని థ్రిల్లింగ్ యాక్ష‌న్ సీక్వెన్స్‌ల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి. 
- సింగర్ మంగ్లీ వర్సెస్ అడ్వకేట్ సుబ్బు  - పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో పోటాపోటీ ఫిర్యాదులు! - మంగ్లీ తమ్ముడు డబ్బులు లెక్కిస్తున్న వీడియో వైరల్..  - 'గిరిజన కార్డు'పై నెటిజన్ల ఫైర్! ప్రముఖ జానపద గాయని మంగ్లీ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. అయితే ఇది ఆమె పాటల కోసం కాదు, ఒక భారీ ఆర్థిక వివాదం కారణంగా! దాదాపు 180 నుంచి 200 కోట్ల రూపాయల వరకు క్రౌడ్ ఫండింగ్ పేరుతో వసూలు చేశారనే ఆరోపణలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వ్యవహారంలో మంగ్లీ ప్రమేయం ఎంత? అసలు అడ్వకేట్ సుబ్బు చేస్తున్న ఆరోపణలేంటి? అనే విష‌యాల్లో ర‌క‌ర‌కాల అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  ముఖ్యంగా మంగ్లీ తమ్ముడికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అందులో కట్టల కొద్దీ నోట్లను మెషిన్లతో లెక్కిస్తున్న దృశ్యాలు ఉండటంతో ఈ స్కామ్ డెప్త్ ఎంత అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ బిజినెస్ నెట్‌వర్క్‌లో మంగ్లీ ఇమేజ్‌ను వాడుకుని సామాన్యుల నుంచి భారీగా పెట్టుబడులు సేకరించారనేది ప్రధాన ఆరోపణ. మ్యూచువల్ ఫండ్ తరహాలో లాభాలు వస్తాయని నమ్మించి, తీరా సమయం వచ్చాక చేతులెత్తేయడంతో బాధితులు లాయర్లను ఆశ్రయించారు. ఈ ఇష్యూపై మంగ్లీ కూడా గట్టిగానే స్పందించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఆమె, తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని వాపోయారు. తాను ఒక గిరిజన మహిళనని, తన ఎదుగుదల చూడలేక కొందరు టార్గెట్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఈ గిరిజన కార్డును వాడుకోవడంపై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. క్రైమ్ జరిగినప్పుడు సామాజిక నేపథ్యంతో సంబంధం ఏముంటుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, ఈ కేసును డీల్ చేస్తున్న అడ్వకేట్ సుబ్బు తీరుపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఆయన పబ్లిసిటీ కోసమే సెలబ్రిటీల పేర్లను బయటకు లాగుతున్నారని మంగ్లీ వర్గం అంటోంది. ఈ వివాదంలోకి దర్శకుడు వేణు ఉడుగుల పేరు కూడా రావడం విశేషం. కేవలం పరిచయాల రీత్యా జరిగిన సహాయాన్ని కూడా స్కామ్‌తో ముడిపెడుతున్నారని అభిప్రాయప‌డుతున్నారు.  ప్రస్తుతం ఈ కేసు పోలీసుల చేతుల్లో ఉంది. ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో విచారణ వేగవంతమైంది. నిజంగానే మంగ్లీ కుటుంబ సభ్యులు ఈ వసూళ్లకు పాల్పడ్డారా? లేక ఆమెకు తెలియకుండానే ఆమె పేరును వాడుకున్నారా? అనేది తేలాల్సి ఉంది. సెలబ్రిటీలు బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు లేదా వ్యాపారాల్లో భాగస్వాములయ్యేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఘటన మరోసారి నిరూపించింది. పోలీసుల ఛార్జ్‌షీట్ దాఖలయ్యే వరకు ఈ విషయంలో ఒక స్పష్టత రాకపోవచ్చు. అంతవరకు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలను గుడ్డిగా నమ్మలేమని, చట్టపరమైన విచారణ తర్వాతే అసలు నిజాలు బయటపడతాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్‌ను టాలీవుడ్‌లో సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లిన నటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna). ఆయన నటించిన పవర్ ఫుల్ సినిమాల్లో 'సీమ సింహం' (Seema Simham) ఒకటి. జి. రామ్ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ఈ పవర్‌ఫుల్ మాస్ సినిమాలోని ఒక ఐకానిక్ సీన్ సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతూ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. గడగడలాడించే గంభీర స్వరం.. 'దుర్గా ప్రసాద్' విశ్వరూపం ఈ వైరల్ వీడియోలో బాలయ్య తనలోని అసలైన మాస్ యాంగిల్‌ను ఆవిష్కరించారు. ముఖ్యంగా నిశ్చితార్థం జరిగే సమయంలో వచ్చే ఈ సీన్ సినిమాకే హైలైట్. సీమ ఫ్యాక్షనిస్టుల మధ్య ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా బాలయ్య తన ఇంటెన్సిటీని చూపించిన తీరు అద్భుతం. తన కంటిచూపుతోనే శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే 'దుర్గా ప్రసాద్'గా ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. వైరల్ అవుతున్న పవర్‌ఫుల్ డైలాగ్స్ బాలయ్య సినిమాల్లో యాక్షన్ ఎంత ముఖ్యమో, ఆయన చెప్పే డైలాగ్స్ కూడా అంతే ముఖ్యం. 'సీమ సింహం'లో ఆయన చెప్పిన డైలాగ్స్ ఇప్పటికీ ఫ్యాన్స్ నోళ్లలో నానుతూనే ఉంటాయి. ముఖ్యంగా "ఎక్కడ మొదలు పెట్టావో అక్కడే ఆపేయ్.. లేకపోతే నేను ఎక్కడ ఆపానో అక్కడి నుంచి మొదలు పెడతా!" అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ ఆయనలోని గంభీరత్వాన్ని, పాత్రలోని పవర్‌ను చాటిచెబుతుంది. తెలంగాణ, కోస్తా, రాయలసీమ అనే తేడా లేకుండా ఫ్యాక్షనిస్టులను, బడా నేతలను గడగడలాడించే ఎస్పీ దుర్గా ప్రసాద్‌గా ఆయన ఈ వీడియోలో మనకు కనిపిస్తారు. ప్రత్యర్థులను ఎదిరించే క్రమంలో ఆయన చూపించే ఆవేశం, స్వరం పెంచి చెప్పే డైలాగ్ డెలివరీ బాలయ్యకు మాత్రమే సాధ్యమైన ప్రత్యేకత. దశాబ్దాలు గడిచినా బాలకృష్ణ సినిమాలలోని పవర్‌ఫుల్ సీన్లు ఇప్పటికీ కొత్తగానే అనిపిస్తాయి. 'సీమ సింహం' లాంటి చిత్రాలు నందమూరి అభిమానులకు ఎప్పుడూ ఒక తీపి జ్ఞాపకం. ఈ వీడియో చూస్తుంటే, బాలయ్య పాత సినిమాలలోని మాస్ మ్యాజిక్ ఏ స్థాయిలో ఉండేదో స్పష్టమవుతుంది. ఇలాంటి పవర్ ఫుల్ సీన్స్, సినిమాల కోసం మా 'తెలుగువన్' (TeluguOne) యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.
The highly anticipated film Peddi is facing unexpected delays, and the rumor mill is in full swing trying to figure out who is responsible. According to inside whispers, the initial delay stemmed from Ram Charan. Rumors suggest he could not allocate the bulk dates the team expected due to various personal reasons, which pushed the shooting schedule back right from the start. Despite this early setback, the crew reportedly managed to wrap up the first half and a significant portion of the second half. On the musical front, AR Rahman has already finished the background score for the first half and recorded the songs. However, rumors suggest he might have to rework his score, as a few scenes in the first half could change following the current script rewrites. Things hit a major roadblock with the climax. Rumors indicate that director Buchi Babu Sana felt confused and unsatisfied with how the ending shaped up. Sources say Ram Charan shares this dissatisfaction, finding the current climax lacking. To resolve these creative differences, director Sukumar has reportedly stepped in to guide his former assistant and tweak the ending. But rumors say Sukumar is taking his own time to re-edit and rework the script. With re-shoots and heavy reworking now needed, industry gossip suggests Charan is growing quite annoyed with the drawn-out process. A special song shoot is still pending, and the team seems uncertain about the exact schedule for the re-shoots. Right now, there is a lot of confusion among sources providing updates about the film. The only confirmed news at the moment is that the director is actively reworking several portions. With all these struggles, the planned April 30th release date is definitely out of the question, and whether it releases in July, August, or September remains completely unclear.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.    
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'డెకాయిట్' (Dacoit). రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఇటీవల థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా ప్రేక్షకులను సైతం విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఈ సినిమాపై స్పందించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 'డెకాయిట్' చూసి ఎంజాయ్ చేశా.. తాజాగా 'డెకాయిట్' సినిమాని వీక్షించిన రామ్ చరణ్ తన అనుభూతిని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. "నేను డెకాయిట్ సినిమా చూశాను, చాలా బాగా ఎంజాయ్ చేశాను. హరి పాత్రలో అడివి శేష్ నటన అద్భుతం. ఆయన నటన గుర్తుండిపోతుంది. మృణాల్ తన పాత్రలోని భావోద్వేగాలను ఎంతో లోతుగా పండించి, పాత్రకు పూర్తి న్యాయం చేసింది. అనురాగ్ కశ్యప్ తో పాటు ఇతర నటీనటులంతా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. నిర్మాత సుప్రియ యార్లగడ్డ, అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ఉన్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మించారు" అంటూ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. కథా నేపథ్యం.. 'డెకాయిట్' మూవీ  ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీగా సాగుతూనే, యాక్షన్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది. అడివి శేష్ తనదైన శైలిలో సీరియస్ రోల్ లో మెప్పించగా.. మృణాల్ ఠాకూర్ తన గ్లామర్, నటనతో సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రం టెక్నికల్ గా కూడా చాలా రిచ్ గా ఉందని ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమా క్లైమాక్స్ గురించి ప్రస్తుతం సినీ వర్గాల్లో ప్రత్యేకంగా చర్చ సాగుతోంది. రామ్ చరణ్ 'పెద్ది' అప్‌డేట్.. ఒకవైపు ఇతర సినిమాలను అభినందిస్తూనే, మరోవైపు రామ్ చరణ్ తన తదుపరి చిత్రం 'పెద్ది' (Peddi) పనుల్లో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఉంటుంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన వాయిదా పడింది. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశముంది. https://x.com/AlwaysRamCharan/status/2043979111136407754
టాలీవుడ్ పాపులర్ యాంకర్ విష్ణుప్రియ చుట్టూ ఇప్పుడు వివాదాల ముసురు ముదురుతోంది. నిత్యం తన బోల్డ్ వీడియోలు మరియు గ్లామరస్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసే ఈ బ్యూటీ, ఇప్పుడు ఏకంగా పోలీస్ కేసును ఎదుర్కోవాల్సి రావడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. విజయవాడకు చెందిన AISF నాయకులు ఆమెపై ఫిర్యాదు చేయడం ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతోంది. విష్ణుప్రియ సోషల్ మీడియా వేదికగా అశ్లీలతను ప్రోత్సహిస్తున్నారని, యువతను తప్పుదోవ పట్టించేలా ఆమె కంటెంట్ ఉందనేది ప్రధాన ఆరోపణ. కేవలం వీడియోలే కాకుండా, కొన్ని ప్లాట్‌ఫామ్స్‌లో తన వాట్సాప్ నెంబర్ ఇస్తూ పెయిడ్ చాటింగ్ మరియు వీడియో కాల్స్ బిజినెస్‌ను ఎంకరేజ్ చేస్తున్నారంటూ AISF ప్రతినిధులు మండిపడుతున్నారు. దీని వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదంపై స్పందించిన విశ్లేషకులు ఇందులో మరో కోణాన్ని కూడా బయటపెట్టారు. కేవలం విష్ణుప్రియే కాకుండా, ఆమె పేరుతో కొన్ని ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి అమాయకులను ట్రాప్ చేస్తున్నారా? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. "మీ ఇమేజ్‌ని పది నిమిషాల్లో బ్రేక్ చేసి రోడ్డు మీద పడేస్తాం" అంటూ కొందరు కేటుగాళ్లు బ్లాక్ మెయిల్ దందాకు తెరలేపినట్లు తెలుస్తోంది. విజయవాడలో విష్ణుప్రియపై AISF విద్యార్థి సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో అశ్లీల వీడియోల ద్వారా జనాన్ని ఆకర్షిస్తున్నారని ఆరోపణ. వాట్సాప్ నెంబర్లు ఇచ్చి పర్సనల్ చాటింగ్‌కు పిలుస్తున్నారనేది మరో ప్రధాన పాయింట్. నిమిషానికి ఇంత చొప్పున టారిఫ్లు వసూలు చేసే యాప్స్‌ను ఎంకరేజ్ చేస్తున్నారని ఫిర్యాదు. ఇది విష్ణుప్రియ స్వయంగా చేస్తున్నదా లేక ఆమె ఇమేజ్‌ని వాడుకుని ఎవరైనా బిజినెస్ చేస్తున్నారా అనేది తేలాల్సి ఉంది. ఈ తరహా హనీ ట్రాప్స్ వల్ల యువత పరువు రోడ్డున పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం కేవలం ఒక నటిపై దాడి మాత్రమే కాదని, దీని వెనుక ఉన్న ‘బిజినెస్ మోడల్’పై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సామాజిక వేత్తలు కోరుతున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం హద్దులు దాటితే ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సెన్సేషనల్ ఇష్యూపై విష్ణుప్రియ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి!
   -ఇలాంటి సన్నివేశాలు అరుదుగా వస్తుంటాయి. -అన్నలని అవమానించాలని మనసెలా వచ్చింది -అసలు ఎందుకు అవమానించింది ఫ్యామిలీ ఎమోషన్ తో కూడిన కొన్ని చిత్రాలని మనం మర్చిపోదామని అన్నా మరిచిపోలేం. అలాంటి ఒక చిత్రమే 'శివరామరాజు'(SIvaramaraju). 2002 లో వచ్చిన ఈ మూవీని నేటికీ చాలా మంది వీక్షిస్తూ తమ దగ్గర ఉన్న సినీ పన్నీటి జల్లులని చూసి మురిసిపోతుంటారు  అన్నాచెల్లెళ్ళ అనుబంధం.. ఇచ్చిన మాట కోసం ప్రాణాన్ని సైతం తృణప్రాయంగా అర్పించే గొప్ప ధైర్య శీలి.. ఇలా ఎన్నో అంశాలు శివరామరాజుని నిత్య సినీ యవ్వనుడిగా మార్చాయి. మరి ఈ మూవీలోని ఒక అద్భుతమైన సన్నివేశాన్ని చూద్దాం.      స్వాతికి శ్రీమంతం జరుగుతూ ఉంటుంది. తన అన్నయ్యలు శివ రామరాజు, రామరాజు, రాజు వస్తారు. శివరామరాజు, రాజుకి పెళ్లవ్వడం వలన వెంట భార్యలు ఉంటారు. గొప్పింటి కుటుంబానికి చెందిన ఆ ముగ్గురు అన్మదమ్ములు స్వాతికి పెళ్లి చెయ్యడానికి తమ కోట్ల ఆస్థిని చెల్లెలకే రాసి ఇస్తారు. చెల్లెలంటే అంత ప్రేమ. ఇప్పుడు పేదవాళ్లుగా  తమ శక్తీ కొలది చెల్లెలి శ్రీమంతానికి పుట్టింటి తరుపు నుంచి తీసుకురావాల్సినవి తీసుకొస్తారు. స్వాతి తన వాళ్ళందర్నీ ఆప్యాయంగా పలకరిస్తుంది. కానీ పెద్ద వదిన అక్షింతలు వేస్తుంటే మెడలో ఏమైనా నగలు వేసుకోవచ్చుగా, లేదంటే అరువు తీసుకోవచ్చుగా ఇలా వస్తే నాకే కదా అవమానం, త్వరగా వెళ్ళండి. ఒక విఐపి ఎదురుచూస్తున్నాడు అంటుంది. ఆ తర్వాత  రెండో వదిన ని కూడా అవమానిస్తుంది. అన్నయ్య లేమో మనం ఒక రోజు ముందుగానైనా రాలేదని చెల్లళ్ళకి కోపం అని అనుకుంటూ ఉంటారు. కానీ ఏ అన్నయ్యని ఎవరు అవమానించని రీతిలో స్వాతి అవమానించి' చాటుగా తిని వెళ్ళచ్చు కదా అని కూడా అంటుంది.  స్వాతి ఇప్పడు సామాన్యుడైన శివరామరాజు చెల్లెలు కాదురా. కోటీశ్వరుడైన నరేంద్ర వర్మ గారి కోడలు అని శివరామరాజు బాబాయ్ అనుకోని అక్కడ్నుంచి అందరు వెళ్ళిపోతారు. కానీ ఆ తర్వాత తన అన్నయ్య లు వెళ్తుంటే ఎదురొచ్చి కన్నీటి పర్యంతమవుతూ తన అత్త ఇంటి వారు తన అన్నయ్యలని ఘోరంగా అవమానించాలని చూసారని, అలా జరిగితే నేను తట్టుకోలేనని అందుకే నేనే ఆ విధంగా మాట్లాడానని కన్నీటి పర్యంతమవుతూ చెప్తుంది. ఆ తర్వాత తన అన్నయ్య, వదిన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. ఆ సన్నివేశం చూస్తున్నంత సేపు కళ్ళ వెంట కన్నీళ్లు పెట్టుకోనోడు పాపాత్ముడు అనే విధంగా ఉంటుంది. అదే టైంలో స్వచ్ఛమైన ఆనందాన్ని పొందుతాడు  స్వాతి ముగ్గురు అన్నయ్యలుగా శివరామరాజు, శివాజీ, వెంకట్ తమ పెర్ఫార్మ్ తో అన్నయ్య అనే వర్డ్ కి నిండు తనాన్ని తీసుకొచ్చారు.చెల్లెలుగా మోనికా సూపర్ గా పెర్ఫార్మ్ చేసింది, లయ, పూనమ్, బ్రహ్మ్మనందం, సిజ్జు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ శివరామరాజు కోసమే సినీ లైఫ్ లోకి వచ్చామనే విధంగా పెర్ఫార్మ్ ఉంటుంది. సముద్ర(V. Samudra)దర్శకత్వ ప్రతిభ ప్రతి ఫ్రేమ్ లోను కనిపిస్తుంది. సముద్ర సగర్వంగా చెప్పుకునే మూవీ కూడా. ముఖ్యంగా ఆనంద భూపతి రాజుగా నందమూరి టైగర్ హరికృష్ణ(Harikrishna)పెర్ ఫార్మెన్స్ చూస్తే నోమాలు నిక్కపరుచుకుంటాయి. తల తీసి ఇచ్చే సీన్ అయితే ఒళ్ళు జలదరిస్తుంది.    Also read: Toxic: టాక్సిక్ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. వాయిదా పడినట్టేగా మరి  తమిళ మూవీ సముద్రం' కి రీమేక్ అయినప్పటికీ, మన తెలుగు సంస్కృతికి తగ్గట్టుగా చాలా బాగా తెరకెక్కించారు. తెలుగు సినిమాల్లో ఫ్యామిలీ సెంటిమెంట్‌కి  కేరాఫ్ అడ్రస్ లాంటిది. ముఖ్యంగా ఎస్.ఏ. రాజ్‌కుమార్ గారి సంగీతం ఆ ఎమోషన్‌ని మరింత పెంచుతుంది. ఈ రోజుల్లో వస్తున్న సినిమాల్లో ఇలాంటి స్వచ్ఛమైన కుటుంబ అనుబంధాలు చూడటం కొంచెం తక్కువైపోయింది. అందుకే ఇలాంటి పాత క్లిప్స్ చూసినప్పుడు మన పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి మనసుకి హత్తుకుంటాయి. సూపర్ గుడ్ ఫిలిమ్స్ పై ఆర్ బి చౌదరి నిర్మించాడు. చాలా కేంద్రాల్లో అర్ధ శతదినోత్సవం,శతదినోత్సవం జరుపుకుంది    
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు అదిరిపోయే న్యూస్. రాజకీయాల్లో బిజీగా ఉంటూనే, తన సినిమాల కోసం పవన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ‘OG’ సీక్వెల్, సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ గురించి వినిపిస్తున్న వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. OG 2 - ఓజాస్‌ గంభీర.. అసలు విధ్వంసం ఇక్కడే! గత ఏడాది బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ‘OG’ సినిమాకి సీక్వెల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ పార్ట్ 2కు ‘ఓజాస్‌ గంభీర - ర్యాంపేజ్ బిగిన్స్’ (Ojas Gambheera - Rampage Begins) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను మేకర్స్ దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మొదటి భాగంలో కేవలం శాంపిల్ మాత్రమే చూపించిన దర్శకుడు సుజీత్, ఈ సీక్వెల్‌లో పవన్ కళ్యాణ్ మార్క్ గ్యాంగ్‌స్టర్ గెటప్‌ను, యాక్షన్‌ను మరో లెవల్‌లో చూపించబోతున్నారట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్టును నిర్మించనున్నాయి. అమరావతిలో సురేందర్ రెడ్డి ఆఫీస్.. స్క్రిప్ట్ వర్క్ షురూ! మరోవైపు, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ కోసం ఒక భారీ యాక్షన్ డ్రామాను సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం సురేందర్ రెడ్డి ప్రస్తుతం విజయవాడలో ఉండి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం అమరావతిలో ప్రత్యేకంగా ఆఫీస్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఈ మధ్యే సురేందర్ రెడ్డికి కొన్ని మార్పులు సూచించారని, ఆ మార్పుల తర్వాత వచ్చే ఫైనల్ నేరేషన్ పట్ల పవన్ పూర్తి సంతృప్తి చెందితేనే షూటింగ్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు టాక్. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథను అందిస్తున్నారు. రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉన్నప్పటికీ, అభిమానుల కోసం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. ‘OG 2’ కోసం సుజీత్ సిద్ధం చేసిన భారీ స్కెచ్, అమరావతి వేదికగా సురేందర్ రెడ్డి చేస్తున్న కసరత్తులు చూస్తుంటే, పవర్ స్టార్ బాక్సాఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తోంది.  
తమిళ చిత్రసీమలో తిరుగులేని మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో దళపతి విజయ్. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాల కంటే, ఆయన రాజకీయ ప్రయాణం గురించే ఇండస్ట్రీలో ఎక్కువ చర్చ జరుగుతోంది. అయితే, తన రాజకీయ ఆరంగేట్రం కంటే ముందే తన నిర్మాత పట్ల విజయ్ చూపిన ఉదారత ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. 'జననాయగన్' (Jana Nayagan) సినిమా విషయంలో ఎదురైన అనుకోని ఇబ్బందుల వల్ల నష్టపోయిన నిర్మాతను ఆదుకునేందుకు విజయ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. విజయ్ కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన చిత్రంగా 'జననాయగన్' తెరకెక్కింది. సుమారు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, సంక్రాంతి బరిలో నిలవాల్సిన ఈ సినిమా సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. రాజకీయ నేపథ్యం ఉన్న చిత్రం కావడంతో నిబంధనల సాకుతో ఆలస్యం కాగా, ఊహించని విధంగా ఈ సినిమా ఆన్‌లైన్‌లో లీక్ కావడం చిత్ర యూనిట్‌ను కోలుకోలేని దెబ్బ తీసింది. ఈ లీక్ వ్యవహారంతో సినిమాపై ఉన్న క్రేజ్ తగ్గడమే కాకుండా, నిర్మాత నారాయణకు భారీ నష్టాలు వచ్చే ప్రమాదం ఏర్పడింది. ముందుగా ఈ సినిమా సుమారు 500 కోట్ల బిజినెస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ తాజా పరిణామాల వల్ల థియేట్రికల్ రన్, ఓటీటీ డీల్స్, శాటిలైట్ రైట్స్ రేట్లు భారీగా పడిపోయే అవకాశం ఉందని సమాచారం. దీనికి తోడు వడ్డీల భారం పెరగడంతో నిర్మాత దాదాపు 100 కోట్ల వరకు నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఒక నిర్మాతగా ఇంత పెద్ద మొత్తంలో నష్టాన్ని భరించడం అసాధ్యమనే చెప్పాలి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో హీరో విజయ్ ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తన పారితోషికంలో భారీ వాటాను వెనక్కి ఇచ్చేందుకు ఆయన అంగీకరించినట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో విజయ్ రెమ్యునరేషన్ దాదాపు సగం బడ్జెట్ కంటే ఎక్కువే ఉంటుందని టాక్. నిర్మాతను గట్టెక్కించేందుకు తన రెమ్యునరేషన్‌లో సగానికి పైగా మొత్తాన్ని వదులుకోవడానికి దళపతి సిద్ధపడ్డారట. ఒకవేళ భవిష్యత్తులో విజయ్ మళ్లీ సినిమాలు చేయాలని భావిస్తే, మొదటి సినిమా అవకాశం కూడా ఇదే నిర్మాతకు ఇస్తానని హామీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ తన రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కజగం' (TVK) పనుల్లో బిజీగా ఉన్నారు. రాజకీయ ప్రయాణం మొదలుపెట్టే ముందు ఎవరికీ అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని అభిమానులు సోషల్ మీడియాలో కొనియాడుతున్నారు. లీకుల వల్ల ఏర్పడిన నష్టాన్ని హీరో స్వయంగా పూడ్చడం అనేది ఇండస్ట్రీలో ఒక అరుదైన విషయమని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఏది ఏమైనా, 'జననాయగన్' సినిమా లీక్ కావడం దురదృష్టకరమే అయినప్పటికీ, విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం నిర్మాతకు పెద్ద ఊరటనిస్తోంది. మరి ఈ చిత్రం థియేటర్లలో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో, ఎన్నికల ముందు విజయ్ పాలిటిక్స్‌కు ఈ సినిమా ఎంతవరకు ప్లస్ అవుతుందో వేచి చూడాలి. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.  
- 'వారణాసి'లో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్? - శివుడి పాత్రలో కనిపించనున్న గ్రీక్ గాడ్! - మహేష్ ఫ్యాన్స్ లో మొదలైన టెన్షన్! - రాజమౌళి రిస్క్ చేస్తున్నారా? మహేశ్ బాబు (Mahesh Babu) హీరోగా ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ 'వారణాసి' (Varanasi). ప్రస్తుతం ఇండియన్ సినిమాలోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ ఇది. గ్లోబ్‌ట్రాటర్ థీమ్‌తో సాగే ఈ సినిమా గురించి ప్రతి రోజూ ఒక కొత్త వార్త హల్చల్ చేస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఒక రూమర్ ఇటు మహేశ్ ఫ్యాన్స్‌ను, అటు సినీ లవర్స్ ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అదేంటంటే.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) శివుడి పాత్రలో కనిపించబోతున్నారట. రాముడిగా మహేష్! వారణాసి సినిమా కేవలం ఒక జంగిల్ అడ్వెంచర్ మాత్రమే కాదు.. ఇందులో పురాణాలు, సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ ఎలిమెంట్స్ కూడా ఉండనున్నాయి. త్రేతాయుగం నాటి రహస్యాలను ఛేదించే క్రమంలో హీరో వారణాసి నుంచి ఆఫ్రికా అడవుల వరకు ప్రయాణిస్తాడని టాక్. ఇందులో మహేశ్ బాబు 'రుద్ర' అనే పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఆ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలై ఆకట్టుకుంది. అలాగే, శ్రీరాముడి పాత్రలోనూ మహేష్ కనువిందు చేయనున్నారు. రాముడిగా మహేష్ ని తెరపై చూడటం కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. శివుడిగా హృతిక్? 'వారణాసి'లో రాముడిగా మహేష్ కనిపించనున్నారని ఇప్పటికే అధికారికంగా తెలియగా.. ఇప్పుడు శివుడిగా హృతిక్ కనిపిస్తారనే వార్త హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళి లాంటి దర్శకుడు తన సినిమాలో ప్రత్యేక పాత్ర కోసం మరో స్టార్ హీరోను పెడుతున్నారంటే అది మామూలు విషయం కాదు. అయితే అది శివుడి పాత్ర కావడంతో.. ఒక స్టార్ చేస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో హృతిక్‌ను సంప్రదించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.  అంతేకాదు అభిమానులు ఇప్పటికే కొన్ని ఫోటోలు కూడా వైరల్ చేస్తున్నారు. వారణాసి ఘాట్ల నేపథ్యంలో హృతిక్ రోషన్ శివుడి వేషధారణలో ఉన్న ఏఐ ఫోటోలు, ఫ్యాన్ ఆర్ట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  రాజమౌళి మళ్ళీ ఆ రిస్క్ చేస్తారా? గతంలో 'ఆర్ఆర్ఆర్' సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి ఇద్దరు టాప్ స్టార్లను బ్యాలెన్స్ చేయడంలో రాజమౌళి సక్సెస్ అయ్యారు. కానీ, ఆ తర్వాత ఇద్దరు హీరోల అభిమానుల మధ్య జరిగిన క్రెడిట్ వార్, సోషల్ మీడియా గొడవలు అందరికీ తెలిసిందే. ఇప్పుడు 'వారణాసి' పూర్తిగా మహేశ్ బాబు చుట్టూ తిరిగే కథ. ఇందులో హృతిక్ లాంటి భారీ స్టార్ ఇమేజ్ ఉన్న నటుడు కనిపిస్తే.. మళ్ళీ క్రెడిట్ వార్ జరుగుతుందా? అన్న ఆందోళన అభిమానుల్లో నెలకొంది. హృతిక్ రోషన్ రాకపై ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. రాజమౌళి తన సినిమాల విషయంలో అత్యంత గోప్యత పాటిస్తారు కాబట్టి.. ఇది కేవలం రూమర్ గానే మిగిలిపోతుందా లేక థియేటర్లో బాంబు పేలుస్తారా అనేది చూడాలి. ఏదేమైనా, హృతిక్ శివుడిగా కనిపిస్తే మాత్రం అది ఇండియన్ స్క్రీన్ పై ఒక విజువల్ వండర్ అవుతుందనడంలో సందేహం లేదు.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్,  ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు. ఎక్స్ట్రోవర్ట్  లు అయితే బయటకు బాగా జాలీగా ఉంటూ, అందరిలో కలిసిపోతూ.. ఎక్కడైనా సరే ఇట్టే సర్దుకుపోయే స్వభావం కలిగి ఉంటారు. కానీ ఇంట్రోవర్ట్ లు అలా కాదు.. వారు ఎవరి ముందూ ఏమీ ఎక్కువ మాట్లాడలేరు, కనీసం కావలసిన వస్తువులు,  అవసరమైన విషయాల దగ్గర కూడా వారు మాట్లాడలేకపోవడం వల్ల నష్టపోతూ ఉంటారు. ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఈ కారణంగా ఇంట్రోవర్ట్ లను చాలా కామెడీ చేస్తుంటారు. వారు సిగ్గుపడుతూ ఉంటారని, మొహమాటం ఎక్కువని కూడా ఆటపట్టిస్తూ ఉంటారు. అయితే.. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే.. నాణేనికి మరొక వైపు కూడా ఉంటుంది. అదే ఇంట్రోవర్ట్ లలో ఉండే బలం.  వారి వ్యక్తిత్వమే వారికి పెద్ద బలం అని చాలామంది కూడా అంటుంటారు. ఇంతకీ.. ఇంట్రోవర్ట్ లలో ఉండే బలాలు ఏంటో తెలుసుకుంటే.. ఒంటరితనం.. ఇంట్రోవర్ట్ లు ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడతారు. వారు ఒంటరిగా ఉన్నప్పుడు పునరుత్తేజం పొందుతారు. వారికి జనాల మధ్యలో ఉండటం అనే విషయం  త్వరగా విసుగు తెప్పిస్తుంది. అయితే ఇలా ఒంటరిగా ఎక్కువ గడపడం వల్ల వారికి వారి మీద నమ్మకం, వారి నిర్ణయాల పట్ల నమ్మకం, తమ వ్యక్తిత్వం పట్ల దృఢంగా ఉంటారు. లోతైన మాటలు.. ఇంట్రోవర్ట్ లు  చిల్లర మాటల కంటే అర్థవంతమైన సంభాషణలకు ప్రాధాన్యత ఇస్తారు. అదే పనిగా ఏదో ఒకటి మాట్లాడటం అనే దాని కంటే.. అవసరమైనప్పుడు అవసరమైన విషయాలు మాట్లాడటానికే వారు ఆసక్తి చూపిస్తారు. అతి ఆలోచనలు.. ఇంట్రోవర్ట్ లు ఒంటరిగా గడపడం ఎక్కువ కాబట్టి చాలా ఎక్కువ ఆలోచిస్తుంటారు. ప్రతి విషయం గురించి లోతుగా ఆలోచిస్తారు ,  నిర్ణయాలను జాగ్రత్తగా పరిశీలిస్తారు. తక్కువే.. కానీ బలమైన స్నేహాలు.. ఇంట్రోవర్ట్ లకు ఎక్కువ మంది స్నేహితులు ఉండరు. వారి లిస్ట్ లో చాలా కొద్దిమంది మాత్రమే స్నేహితులు ఉంటారు.  కానీ ఆ కొద్ది మంది చాలా మంచి స్నేహితులై ఉంటారు.  వారి స్నేహం కూడా చాలా బలంగా ఉంటుంది. వారు పెద్దగా మాట్లాడరని అంటుంటారు.. కానీ వారి మనసుకు ఎవరైనా దగ్గరైనా,  ఎదుటి వారి వ్యక్తిత్వం వారికి నచ్చినా.. వారు బాగా మాట్లాడతారు. వినడానికి ప్రాధాన్యత.. ఎక్స్ట్రోవర్ట్ లు ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూ ఉంటే.. ఇంట్రోవర్ట్ లు మాత్రం ఎక్కువగా వినడానికే ఇష్టపడతారు. ఎవరైనా ఏదైనా మాట్లాడుతుంటే దాన్ని వినడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.  మౌనంగా ఉంటూ ఎదుటివారి మాటలను, వారి వ్యక్తిత్వాన్ని గమనించడానికి వీరు ఇష్టపడతారు.  వీరిలో పరిశీలనా శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది.                                 *రూపశ్రీ.
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి.  ప్రతి ఏడాది అంబేద్కర్ జయంతిని దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, గౌరవంతో , ఉత్సాహంతో జరుపుకోవడం కొనసాగుతుంది. భారతదేశ సామాజిక నిర్మాణాన్ని మార్చడంలో , సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి వాటిని బలోపేతం చేయడంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలకు విద్య, ఉద్యోగాలు అందడంలో అంబేద్కర్ చేసిన కృషి చాలా పెద్ది.  అంబేద్కర్ జయంతి సందర్బంగా ఒక్కసారి అంబేద్కర్ గారి జీవితం గురించి గుర్తు చేసుకుంటే.. అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్‌లోని మౌలో జన్మించారు. ఆయన తన జీవితాంతం సమాజంలో ప్రబలంగా ఉన్న అంటరానితనం, వివక్షలకు వ్యతిరేకంగా పోరాడారు. అంబేద్కర్ లక్షలాది మందిలో విద్య, హక్కుల పట్ల చైతన్యం కలిగించారు. ఆయన భారత రాజ్యాంగాన్ని రచించి, దేశానికి ప్రజాస్వామ్య, సమానత్వ వ్యవస్థను అందించారు. అంబేద్కర్ గురించి ఆసక్తికరమైన విషయాలు.. రాజ్యాంగ నిర్మాత.. భారతదేశ ప్రజాస్వామ్య స్వరూపాన్ని వ్యక్తం చేసేది భారత   రాజ్యాంగమే..  ఈ బారత రాజ్యాంగ  ప్రధాన రూపశిల్పిగా డాక్టర్ అంబేద్కర్ పరిగణించబడతారు. ఆయన రాజ్యాంగ పరిషత్తు ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనను భారత రాజ్యాంగ పితామహుడిగా , ప్రధాన రూపశిల్పిగా పిలుస్తారు. విద్యావంతుడు.. అంబేద్కర్ కొలంబియా విశ్వవిద్యాలయం , లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఉన్నత విద్యను అభ్యసించారు. డాక్టర్ భీమరావు అంబేద్కర్ మొత్తం 32 డిగ్రీలు పొందారు. ఆయన అత్యంత విద్యావంతులైన భారతీయులలో ఒకరు. ఆయన బి.ఏ, ఎం.ఏ, ఎం.ఎస్.సి, పి.హెచ్.డి, డి.ఎస్.సి, ఎల్.ఎల్.డి, మరియు బారిస్టర్ ఎట్ లా వంటి ప్రముఖ డిగ్రీలను పొందారు.  అంతేకాదు.. తొమ్మిది భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. 64 సబ్జెక్ట్స్ లో  నిపుణులు. ఆయన స్వతంత్ర భారతదేశానికి మొదటి  న్యాయశాఖ మంత్రి అయ్యారు. సామాజిక సంస్కర్త.. ఆయన తన జీవితాంతం అంటరానితనం, కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడి, సమానత్వాన్ని బోధించారు. అంటరానితనాన్ని నిర్మూలించడానికి బాబా సాహెబ్ మహాద్ సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. అంటరానివారికి ప్రభుత్వ చెరువుల నుండి నీరు తోడుకునే హక్కు, దేవాలయాల్లోకి ప్రవేశించే హక్కు కోసం ఆయన ప్రచారం చేశారు. హిందూ కోడ్ బిల్లు ద్వారా, ఆయన మహిళల విడాకుల , ఆస్తి హక్కులను సాధించడానికి ప్రయత్నించారు. భారతరత్న..  1990లో అంబేద్కర్ గారి మరణానంతరం భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రదానం చేశారు. అప్పటి రాష్ట్రపతి ఆర్. వెంకటరామన్ ఈ పురస్కారాన్ని ఆయన సతీమణి సవితా అంబేద్కర్ కు అందజేశారు. సత్యాగ్రహి.. నీటి కోసం సత్యాగ్రహం చేసిన ఏకైక సత్యాగ్రహి అంబేద్కర్ గారు మాత్రమే. న్యాయ శాఖ మంత్రి..  అంబేద్కర్ గారు స్వతంత్ర భారతదేశపు తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు.                            *రూపశ్రీ.  
ఆశా భోస్లే.. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర.  ఆమె గాత్రం కేవలం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి అయినా.. పాటల ప్రపంచంలో తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుని పాటల పల్లకిలో కోయిలలా ప్రయాణిస్తూ వచ్చింది. కానీ సంగీత ప్రపంచాన్ని విషాదం కమ్మేసింది.  ఆమె గాత్రానికి ఇక మౌనంగా ఉండిపోమని విధి శాసించిందేమో.. ఆమె పూర్తీగా తన శ్వాసనే వదిలేసింది.  ప్రముఖ గాయని ఆశా భోస్లే మరణం ఇప్పుడు భారతదేశాన్ని, ప్రపంచాన్ని కూడా   విషాదంలోకి నెట్టివేసింది. వైవాహిక జీవితంలో విషాదం నుండి,  కూతురిని కోల్పోవడం.. ఆమె జీవితంలో ఎన్నెన్నో విషాదాలు కూడా ఉన్నాయి,  ఆమె సాధించిన ఘనతలు ఉన్నాయి.   ఆశా భోస్లే గురించి చాలా మందికి తెలియని విషయాల గురించి తెలుసుకుంటే.. ఆశాభోస్లే ప్రస్తుత వయసు 92 సంవత్సరాలు.. శనివారం ఆమె గుండెపోటుకు గురవడంతో ఆసుపత్రిలో చేరిందని సమాచారం.  ఆయాసం ఎక్కువ కావడం,  ఛాతీ ఇన్పెక్షన్ కారణంగా ఆమె మరణించిందని సోషల్ మీడియా వార్తల సారాంశం. బాలీవుడ్‌లో పెద్ద బ్రేక్ రాకముందు, ఆశా భోస్లే తన 10 ఏళ్ల చిన్న వయసులోనే సినిమాల కోసం మరాఠీ పాటలు పాడుతూ తన గాన ప్రస్థానాన్ని ప్రారంభించారట. గాయనిగా ఆమె ప్రయాణం అక్షరాలా 80 ఏళ్లకు పైమాటే.. ఆశా బోస్లే ను ముద్దుగా ఆశా తాయ్ అని పిలుచుకుంటారు.  ఆమె రష్యన్, మలయ్ బాషలతో సహా  20 కి పైగా భాషలలో 12వేలకు పైగా పాటలు పాడారు. ఇలా ఇన్ని పాటలు పాడిన నేపథ్య గాయనిగా,  అత్యధిక స్టూడియో ట్రాక్ లను రికార్డ్ చేసినందుకు  గిన్నిస్ వర్డ్ రికార్డ్ లో కూడా ఆమె స్థానం సంపాదించారు. 16 ఏళ్ల వయసులో ఆశా బోస్లే  1949లో తన కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా తనకంటే రెట్టింపు వయసున్న 31ఏళ్ల గణప్రతాప్ భోస్లే తో పారిపోయి వివాహం చేసుకున్నారు.  వీరికి హేమంత్,  వర్ష,  ఆనంద్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆశా, గణ ప్రతాప్ 1960లో విడిపోయారు. 1980లో ఆశా బోస్లే తనకంటే ఆరు సంవత్సరాల చిన్న వాడైన ప్రఖ్యాత సంగీత స్వరకర్త ఆర్.డి బర్మన్ ను వివాహం చేసుకున్నారు.  ఆయనను ముద్దుగా పంచమ్ దా అని పిలిచేవారు. వీరిద్దరూ కలిసి దమ్ మారో దమ్.. పియా తు అబ్ తో ఆజా వంటి ఎన్నో ఎవర్ గ్రీన్ హిట్ లను అందించారు. కొన్ని వార్తా సమాచారాల ప్రకారం ఆశా కూతురు  వర్ష డిప్రెషన్ తో బాధపడుతూ 56 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఆమె చిన్న కుమారుడు హెమంత్ 2015లో క్యాన్సర్ తో మరణించాడు. ఆశా ఒక విజయవంతమైన వ్యాపారవేత్త కూడా, ఆమె పలు దేశాలలో “ఆశాస్” అనే పేరుతో రెస్టారెంట్ల చైన్ ను  నడుపుతున్నారు. గానంపై ఉన్న అభిరుచితో పాటు, ఆశా భోస్లే తన వంట నైపుణ్యాలకు కూడా ప్రసిద్ధి చెందారు. ఆమె దుబాయ్, కువైట్, అబుదాబి, దోహా , బహ్రెయిన్ వంటి నగరాల్లో 'ఆశాస్' అనే పేరుతో రెస్టారెంట్ల చైన్ ను  నడుపుతున్నారు. ఆశా గారెకి శాస్త్రీయ సంగీతంలో చాలా లోతైన పరిజ్ఞానం ఉందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్‌తో కలిసి 'లెగసీ' అనే ఆల్బమ్‌లో పనిచేసినందుకు ఆమె గ్రామీ నామినేషన్ గెలుచుకుంది. పాప్ , ఫ్యూజన్ ప్రధాన స్రవంతిగా మారడానికి చాలా కాలం ముందే, వాటితో ప్రయోగాలు చేసిన తొలి భారతీయ గాయకులలో ఆమె ఒకరు. ఆశా భోస్లే కూడా నటనారంగంలోకి అడుగుపెట్టి, 2013లో 'మై' అనే మరాఠీ చిత్రంలో తల్లి పాత్రతో రంగప్రవేశం చేశారు. తన విశిష్టమైన కెరీర్‌లో ఆశా భోస్లే అనేక గౌరవాలను అందుకున్నారు. 2000లో భారత ప్రభుత్వం ఆమెకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేయగా, 2008లో పద్మవిభూషణ్‌ను ప్రదానం చేసింది. ఆమె జీవితం క్రమశిక్షణ, సాహసోపేతమైన నిర్ణయాలు, నిరంతరం కొత్త ఆవిష్కరణలు చేయడం వంటి వాటితో ఆమె జీవితం నిండి ఉంది.                              *రూపశ్రీ.
మన భారతీయ సంప్రదాయంలో యోగాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. యోగా కేవలం ఆసనాలకే పరిమితం కాదు, 'ముద్రలు' కూడా మన శరీర ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. మన చేతి ఐదు వేళ్లు పంచభూతాలకు (అగ్ని, వాయువు, ఆకాశం, పృథ్వీ, జలం) ప్రతిరూపాలు. ఈ వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి ఉంచే పద్ధతినే 'ముద్ర' అంటారు. ఈ వీడియోలో TeluguOne Health మనకు కొన్ని ముఖ్యమైన యోగా ముద్రలను మరియు వాటి విశిష్టతను పరిచయం చేస్తోంది: ముఖ్యమైన ముద్రలు - ఉపయోగాలు: జ్ఞాన ముద్ర: జ్ఞాపకశక్తిని పెంచడానికి, ఏకాగ్రతను మెరుగుపరచడానికి మరియు మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఇది ఎంతో తోడ్పడుతుంది. వాయు ముద్ర: గ్యాస్ సమస్యలు, కీళ్ల నొప్పులు మరియు పక్షవాతం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. శూన్య ముద్ర: చెవి సంబంధిత సమస్యలు మరియు ఎముకల బలహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. పృథ్వీ ముద్ర: శరీరంలో విటమిన్ల లోపాన్ని సరిచేయడానికి, అలసటను తగ్గించి ఉత్సాహాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. సూర్య ముద్ర: బరువు తగ్గాలనుకునే వారికి మరియు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకునే వారికి ఇది చక్కటి పరిష్కారం. వరుణ ముద్ర: చర్మ సౌందర్యానికి, రక్త శుద్ధికి మరియు శరీరంలో నీటి శాతాన్ని క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది. వీటిని ఎలా వేయాలి? ఈ ముద్రలను రోజుకు కనీసం 15 నుండి 30 నిమిషాల పాటు ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుని సాధన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ఏ ముద్ర ఏ వేలితో వేయాలి మరియు అది చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పూర్తి వివరాల కోసం ఈ వీడియోను చివరి వరకు చూడండి. మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాలు మరియు ఇలాంటి అరుదైన వీడియోల కోసం ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌లో చూడండి (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
  మన శరీరంలో మెదడు తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన అవయవం కాలేయం (Liver). జీర్ణక్రియను మెరుగుపరచడం నుంచి, రక్తాన్ని శుద్ధి చేయడం వరకు కాలేయం సుమారు 500 పైగా పనులను నిర్వహిస్తుంది. అయితే, ప్రస్తుతం మనం తీసుకునే జంక్ ఫుడ్, ఆల్కహాల్, అధిక ఒత్తిడి మరియు సరైన వ్యాయామం లేకపోవడం వల్ల లివర్ తీవ్రమైన ఒత్తిడికి గురవుతోంది. చాలా సందర్భాల్లో లివర్ 70% నుండి 80% వరకు దెబ్బతినే వరకు మనకు ఎటువంటి బయటి లక్షణాలు కనిపించవు. అందుకే దీన్ని 'సైలెంట్ కిల్లర్' అని కూడా అంటారు. అయితే, మన శరీరం ఇచ్చే కొన్ని ముందస్తు హెచ్చరికలను గమనిస్తే ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చు. ఈ ప్రత్యేక వీడియోలో, ప్రముఖ నాడిపతి (Nadipathy) నిపుణులు డాక్టర్ పెన్మెత్స కృష్ణమ్ రాజు (Dr. P Krishnam Raju) గారు లివర్ ఆరోగ్యం గురించి, అది దెబ్బతిన్నప్పుడు శరీరం చూపే లక్షణాల గురించి లోతుగా వివరించారు. ఈ Video లింక్‌ను క్లిక్ చేసి తెలుసుకుందాం. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే ప్రధానాంశాలు: అలసట మరియు నీరసం:- ఎటువంటి పని చేయకపోయినా విపరీతమైన నీరసంగా అనిపించడం లివర్ సమస్యకు ప్రాథమిక సంకేతమా? చర్మం మరియు కళ్ళ రంగు:- కళ్లు పసుపు రంగులోకి మారడం (Jaundice) మరియు చర్మంపై దురదలు రావడం వెనుక ఉన్న అసలు కారణాలు. ఆకలి మందగించడం:- ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, వాంతులు వచ్చేలా ఉండటం దేనికి సంకేతం? పొత్తికడుపులో మార్పులు:- కడుపు ఉబ్బరంగా ఉండటం లేదా కుడి వైపున నొప్పి రావడం ఎందుకు జరుగుతుంది? నాడిపతి చికిత్స:- మందులు లేకుండా కేవలం నాడి నిదానం మరియు ప్రకృతి సిద్ధమైన పద్ధతులతో లివర్ సమస్యలను ఎలా నయం చేసుకోవచ్చు? మీరు లేదా మీ కుటుంబ సభ్యులు తరచుగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతుంటే, ఈ వీడియో తప్పక చూడండి. కాలేయాన్ని సహజ పద్ధతుల్లో ఎలా శుద్ధి చేసుకోవాలో డాక్టర్ గారి సూచనలను పాటించండి. మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాలు తెలుసుకోవడానికి మా  TeluguOne Health Youtube Channel సందర్శించండి! మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
ఈ రోజుల్లో అనారోగ్యకరమైన జీవనశైలి,  ఆహారపు అలవాట్ల కారణంగా గుండె జబ్బుల ప్రమాదం వేగంగా పెరుగుతోంది. భారతదేశంలో కొంతకాలంగా యువతలో గుండెపోటులు సంభవిస్తున్నాయి. గుండెను బలోపేతం చేయడానికి ఆహారంలో నైట్రేట్ అధికంగా ఉండే కూరగాయలను చేర్చుకోవడం ఎంతో ఉత్తమం అని ఆహార నిపుణులు అంటున్నారు. నైట్రేట్ అధికంగా ఉండే కూరగాయలు గుండెను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. అసలు గుండె బలంగా ఉండటానికి నైట్రేట్ ఎందుకు అవసరం? నైట్రేట్ ఆ కూరగాయలలో అధికంగా ఉంటుంది? ఆహార నిపుణులు ఏం చెబుతున్నారు? పూర్తీగా తెలుసుకుంటే.. ఆరోగ్యకరమైన గుండెకు నైట్రేట్ ఎందుకు ముఖ్యం? శరీరంలో నైట్రేట్, నైట్రిక్ ఆక్సైడ్‌గా మార్చబడుతుంది. నైట్రేట్ ఆక్సైడ్ రక్తనాళాలను విస్తరింపజేస్తుంది, ఇది రక్తపోటును నియంత్రిస్తుంది, తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అధిక రక్తపోటు సమస్య.. కొన్ని సంవత్సరాల క్రితం అధిక రక్తపోటును వృద్ధాప్య వ్యాధిగా పరిగణించేవారు. ఆ తరువాత 40 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గలవారిలో అధిక రక్తపోటు కనిపించేది. ఇప్పుడు 20 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులు కూడా అధిక రక్తపోటు బారిన పడుతున్నారు. అధిక రక్తపోటును సకాలంలో కంట్రోల్ చేయలేకపోతే అది గుండె జబ్బులు, పక్షవాతం , మూత్రపిండాల సమస్యలకు దారితీస్తుంది. అధిక రక్తపోటు అంటే ధమనులలో రక్తపోటు సాధారణం కంటే ఎక్కువగా ఉండటం. నైట్రేట్ అధికంగా ఉండే కూరగాయలు.. పాలకూర.. పాలకూరలో ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో నైట్రేట్లు కూడా ఉంటాయి. పాలకూరను తినడం వల్ల రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది , గుండె కండరాలను బలపరుస్తుంది. బీట్‌రూట్ .. బీట్‌రూట్ రసంలో నైట్రేట్లు ఉంటాయి. బీట్‌రూట్ రసం తాగడం వల్ల ఓపిక పెరిగి, గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఆకుకూర సలాడ్లు.. ఆకుపచ్చ ఆకు కూరల సలాడ్లలో నైట్రేట్లు ఉంటాయి.  ఆహారంలో సలాడ్లను చేర్చుకోవచ్చు.  ఆహారంలో ఆకుపచ్చ ఆకు కూరల సలాడ్లను చేర్చుకోవడం గుండె ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరం. మెంతులు.. మెంతిలో పీచుపదార్థం, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో నైట్రేట్లు కూడా ఉంటాయి, ఇవి గుండె జబ్బులను నివారించడంలో , చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి. కాలీఫ్లవర్.. క్యాబేజీలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మాత్రమే కాకుండా ధమనులలో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గించడంలో సహాయపడే నైట్రేట్లు ఉంటాయి.                      *రూపశ్రీ.