తెలంగాణ రాజకీయాల్లో ఖైరతాబాద్ బైపోల్ హాట్ టాపిక్ గా మారంది. అందులోనూ ఈ ఎన్నిక బరిలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) నిలబడనుండటంపై పోలిటికల్ సర్కిల్స్ లో ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. అంతే కాకుండా ఇక నుంచి రాబోయే ప్రతి ఎన్నికలోనూ టీఆర్ఎస్ పోటీ చేయాలన్న కవిత నిర్ణయం రాజకీయవర్గాలలో సంచలనంగా మారింది.   . బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలో జరగనున్న ఖైరతాబాద్ ఉప ఎన్నిక,  గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలోనూ,    గ్రేటర్ హైదరాబాద్ స్థానిక పోరులోనూ టీఆర్ఎస్ అభ్యర్థులను బరిలోకి దించనున్నట్లు విస్పష్టంగా ప్రకటించారు. టీఆర్ఎస్ పోటీ  ఏ పార్టీ ఓట్లకు ఆమె గండి కొట్టబోతున్నారనే చర్చ ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.  ఎన్నికలలో పోటీ ప్రకటనతో పాటు కవిత   కొన్ని గ్యారెంటీలు,   ప్రత్యేక హామీలూ కూడా  ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ విజయం సాధించి అధికారంలోకి వస్తే.. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే  4 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామనీ,   అలాగే ప్రైవేట్ స్కూళ్లలో  నాణ్యమైన, ఉచిత విద్యను అందించడం, దీర్ఘకాలిక వ్యాధులతో సహా అన్ని రకాల రోగాలకు పూర్తి ఉచిత వైద్య సౌకర్యాలు కల్పించడం వంటి హామీలూ, గ్యారెంటీలు ప్రకటించారు. యువతలో స్వయం ఉపాధి,  నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి స్టార్టప్‌లకు తగిన నిధులు అందించడంతో పాటు, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో రైతులకు ప్రత్యేక సహాయక డెస్క్‌లను ఏర్పాటు చేసి  రైతే రాజు' నినాదాన్ని నిజం చేస్తామని కవిత చెప్పారు. వెనుకబడిన తరగతులకు, మహిళలకు, యువతకు రాజకీయంగా, సామాజికంగా సమాన అవకాశాలు కల్పించి.. తద్వారా సామాజిక తెలంగాణ సాధిస్తామని కవిత చెప్పారు.  2029 సార్వత్రిక ఎన్నికల్లోనూ తమ పార్టీ పూర్తిస్థాయిలో పోటీ చేస్తుందని కవిత వెల్లిండించారు.  మొత్తానికి స్థానిక ఉప ఎన్నికల నుంచి సార్వత్రిక పోరు వరకు కవిత వ్యూహాత్మకంగా ఇప్పటి నుంచే టీఆర్ఎస్ ను సమాయత్తం చేయడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  [Kalvakuntla Kavitha,  political strategy, Telangana Rakshana Sena,TRS, manifesto, Graduate MLC elections, Khairatabad bypoll, Telangana politics, Telugu One]
2024 సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం అత్యంత చారిత్రక తీర్పును వెలువరించింది. తెలుగుదేశం పార్టీ  అభ్యర్థిగా నారా  లోకేష్ ఇక్కడి నుంచి  92 వేలకు పైగా భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారు.  మూడు దశాబ్దాలకు పైగా టీడీపీకి అందని ద్రాక్షలా ఉన్న ఈ స్థానంలో, లోకేష్ అఘండ మెజారిటీతో విజయం సాధించారు. అంతకు ముందు అంటే 2019 ఎన్నికలలో లోకేష్ ఇదే స్థానం నుంచి పరాజయం పాలయ్యారు. అయితే ఓటమి తరువాత.. నియోజకవర్గ సమస్యలపై ప్రజల తరఫున నిరంతరం గళం విప్పుతూ ప్రజాభిమానాన్ని చూరగొని ఎక్కడైతో పరాజయాన్ని ఎదుర్కొన్నారో అక్కడే తిరుగులేని విజయం సాధించి సత్తా చాటారు.  గెలిచిన క్షణం నుంచీ లోకేష్ మంగళగిరి ప్రజలతో మమేకమై ముందుకు సాగుతున్నారు.  స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.  మంగళగిరిలో   హౌసింగ్ డాక్యుమెంటేషన్ సమస్య నిన్న మొన్నటిది కాదు. దశాబ్దాలుగా తిష్ఠ వేసుకుని కూర్చున్న సమస్య. అటువంటి సమస్య పరిష్కారానికి నారా లోకేష్ నడుంబిగించి సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతున్నారు.  ఇక్కడ లోకేష్ గురించి చెప్పుకోవలసిన విషయం ఒకటి ఉంది.    సురక్షితం కాదని తెలిసినా మంగళగిరి నుంచే 2019 ఎన్నికల మంగళగిరి బరిలో నిలిచారు. ఆ పరాజయం తరువాత కూడా వెన్ను చూపని లోకేష్ 2024 ఎన్నికలలోనూ మంగళగిరినే ఎంచుకుని పోటీ చేశారు. ఆ సందర్భంలోనే మంగళగిరిలో అపరిష్కృతంగా ఉన్న  హౌస్ డాక్యుమెంటేషన్ సమస్య పరిష్కరించాలన్న విజ్ణప్తి స్థానిక ప్రజల నుంచి బలంగా వినిపించింది. అయితే..  లోకేష్ ఈ విషయంలో అప్పుడు ప్రజలకు హామీ ఇవ్వలేదు.  ఈ అంశంపై తనకు పూర్తి అవగాహన లేదని నిజాయితీగా ఒప్పుకుని, హామీ ఇవ్వలేనని విస్పష్టంగా చెప్పారు.  2024 ఎన్నికలలో విజయం తరువాత..  ఈ సమస్యకు సంబంధించిన పూర్తి అవగాహనకు వచ్చారు. అప్పుడు ఆయన విస్పష్ట హామీ ఇచ్చారు.  అర్హులైన ప్రతి  పేద కుటుంబానికి గృహ నిర్మాణ పత్రాలు అందిస్తామని  విస్పష్ట హామీ ఇచ్చారు. ఇప్పుు ఆ హామీని అంతే నిజాయితీగా పరిష్కరిస్తున్నారు.   ఇచ్చిన మాట ప్రకారం లోకేష్ హౌసింగ్ డాక్యుమెంటేషన్ సమస్యను పరిష్కరించి మాట నిలబెట్టుకుంటున్నారు.  ఇందులో భాగంగానే.. మంగళగిరిలో  హౌసింగ్ డాక్యుమెంటేషన్  పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. తద్వారా లోకేష్ మంగళగిరి ప్రజలకు మరింత చేరువ అవ్వడమే కాకుండా, రాబోయే సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగేలా బలమైన పునాది వేసుకన్నారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఈ ప్రజా సమస్యను పరిష్కరించడంలో చొరవ తీసుకున్న లోకేష్  మంగళగిరి ప్రజల హృదయాల్లో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నారు.   [Nara Lokesh, Mangalagiri housing Documentation, Promise, Mana Illu Mana Lokesh, AP Government Land Pattas, Permanent Title Deeds, Telugu One]
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!  దేశంలో గత కొన్నేళ్లుగా కుట్రపూరితంగా పౌరుల ఓటు హక్కును కాలరాస్తూ ‘ఓట్ల చోరీ’ జరుగుతోందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన హెచ్చరికలు ఇప్పుడు నిజమని తేలిపోయాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఎస్‌ఐఆర్‌ (SIR) పేరుతో పౌరుల ఓట్లను తొలగిస్తున్న తీరుపై ఇతర ఎన్నికల కమిషనర్లు సైతం స్వయంగా అంగీకరించడం ప్రజాస్వామ్యానికి దురదృష్టకర పరిణామమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో.. టీపీసీసీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో కాంగ్రెస్ శ్రేణులు భారీ నిరసన చేపట్టాయి. బీఆర్‌కే భవన్‌ వద్ద ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎదుట ఈ ఆందోళన నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ అజారుద్దీన్‌లతో కలిసి భట్టి విక్రమార్క నిరసనలో పాల్గొన్నారు. అనంతరం ఎన్నికల కమిషన్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఓటర్ల జాబితాల సవరణ, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటు హక్కు పరిరక్షణకు ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.     [ Congress Protest, Bhatti Vikramarka, Rahul Gandhi, Vote Chori, SIR, Special Intensive Revision, Election Commission, CEC Gyanesh Kumar, CEC Resignation, TPCC, Mahesh Kumar Goud, Sridhar Babu, Ponnam Prabhakar, Azharuddin, Telangana Congress ]
ALSO ON TELUGUONE N E W S
Nivin Pauly and Mamitha Baiju’s Bethlehem Kudumba Unit is now heading to OTT after enjoying a blockbuster theatrical run. The Girish A.D. directorial, which released on August 21, has emerged as one of the biggest Malayalam hits of the year and is reportedly nearing the Rs.330 crore mark worldwide. The film will make its digital premiere on JioHotstar on October 2, 2026. The platform has officially confirmed the streaming date, with the film set to be available in Malayalam along with Tamil, Telugu, Hindi and Kannada versions. Bethlehem Kudumba Unit revolves around Justin, played by Nivin Pauly, an unmarried man whose life takes a turn after Ashley, played by Mamitha Baiju, moves in next door. Their relationship forms the central thread of the film, which blends romance, family emotions and comedy. The film also stars Sangeeth Prathap, Suresh Krishna, Vinay Forrt, Srinda and Shyam Mohan in important roles. Directed by Girish A.D., the film is produced by Dileesh Pothan, Fahadh Faasil and Syam Pushkaran under Bhavana Studios. Vishnu Vijay composed the music, while Ajmal Sabu handled the cinematography and Akash Joseph Varghese took care of the editing. After its strong theatrical run, Bethlehem Kudumba Unit is now set to reach a much wider audience on OTT.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో నటించిన తాజా వెబ్ సిరీస్ ‘ష‌క్: ట్రస్ట్ నో వన్’. రెన్సిల్ డిసిల్వా దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో తాహిర్ రాజ్ భాసిన్, జెన్నిఫర్ వింగెట్, సోనీ రజ్దాన్, అనుప్ సోని, సుమీత్ వ్యాస్, హర్లీన్ సేథి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మిస్టరీ థ్రిల్లర్.. పుట్టిన వెంటనే మాయమైన తన కూతురి కోసం ఓ తల్లి చేసే సుదీర్ఘ పోరాటం చుట్టూ తిరుగుతుంది. సిమ్లాలో అన్విత, అలోక్ దంపతుల జీవితం సంతోషంగా సాగుతుంటుంది. అన్విత ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరగా.. పాపకు జన్మనిస్తుంది. ఆ చిన్నారికి అపేక్ష అని పేరు పెట్టుకోవాలని అనుకుంటారు. అయితే ఊహించని విధంగా ఆసుపత్రి నుంచి పాప కనిపించకుండా పోతుంది. నర్స్ వేషంలో వచ్చిన ఓ మహిళ చిన్నారిని తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. అదే సమయంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఆమె ఆచూకీ కనుగొనడం కష్టమవుతుంది. అలా సంవత్సరాలు గడిచిపోయినా అన్విత మాత్రం తన కూతురు బతికే ఉందనే నమ్మకంతో వెతుకుతూనే ఉంటుంది. ఈ క్రమంలో అన్విత జీవితంలోకి కొత్తగా గౌరవ్, సాక్షి దంపతులు వస్తారు. వారి కూతురు రియాను చూసిన అన్వితకు.. ఆ చిన్నారి తన కూతురు అపేక్ష కావచ్చనే అనుమానం మొదలవుతుంది. దీంతో ఆమె వారిని గమనించడం ప్రారంభిస్తుంది. మరోవైపు అన్విత అత్తగారు మూఢనమ్మకాలతో మాంత్రికుడిని కలుస్తూ ఉండటం, భాస్కర్-శ్రేయల మధ్య రహస్య సంబంధం, అలోక్ జీవితంలోని మరో కోణం వంటి అంశాలు కథలోకి వస్తాయి. ఈ పాత్రలన్నింటినీ కలుపుతూ కథలో అనేక మలుపులు చోటుచేసుకుంటాయి. మొత్తం ఏడు ఎపిసోడ్లుగా సాగే ఈ సిరీస్‌లో.. తన కూతురిని ఎలాగైనా తిరిగి దక్కించుకోవాలనే తల్లి పట్టుదల ప్రధానంగా కనిపిస్తుంది. ప్రతి ఎపిసోడ్‌ను ఓ కీలకమైన మలుపుతో ముగిస్తూ తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తిని కొనసాగించే ప్రయత్నం చేశారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో వచ్చే పరిణామాలు కథకు మరింత ఉత్కంఠను జోడిస్తాయి. అయితే ఈ సిరీస్‌పై వచ్చిన ఇతర సమీక్షల్లో కథనం కొన్ని చోట్ల ఊహించదగిన విధంగా ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది.     [Shaque Trust No One Review, Shaque Web Series, Parineeti Chopra Shaque, Shaque Netflix Series, Shaque Series Story, Parineeti Chopra Web Series, Jennifer Winget Shaque, Tahir Raj Bhasin, Shaque OTT Review, Netflix Thriller Series]
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) అభిమానులు మరోసారి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రస్సో బ్రదర్స్ దర్శకత్వం వహించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ రీ-రిలీజ్ వెర్షన్ ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’కు భారత్‌లో భారీ స్పందన లభించింది. బాక్సాఫీస్ మోజో ప్రకారం, ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’ ప్రపంచవ్యాప్తంగా తొలి వారాంతంలో సుమారు 86 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇందులో ఉత్తర అమెరికాలో 26 మిలియన్ డాలర్లు, అంతర్జాతీయ మార్కెట్లలో 60 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. దీంతో రీ-రిలీజ్‌లలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో ఇది రెండో స్థానంలో నిలిచింది. ఈ చిత్రానికి భారత్ లో కూడా భారీ స్పందన లభించింది. ఫస్ట్ వీకెండ్ లో ఇండియాలో సుమారు 2.8 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.25 కోట్లు) గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు అంచనా. దీంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ అందించిన మార్కెట్లలో భారత్ 5వ స్థానంలో నిలిచింది. భారత్ కంటే ముందు అమెరికా 26 మిలియన్ డాలర్లు, చైనా 13.5 మిలియన్ డాలర్లు, యూకే 5.4 మిలియన్ డాలర్లు, మెక్సికో 4.3 మిలియన్ డాలర్లతో ఉన్నాయి. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో మార్వెల్ అభిమానులు మరోసారి థియేటర్లకు క్యూ కట్టారు. ముఖ్యంగా కెప్టెన్ అమెరికా చెప్పే “Avengers, Assemble!” సన్నివేశంతో పాటు ఐరన్ మ్యాన్ త్యాగం వంటి ఎమోషనల్ సీన్లను బిగ్ స్క్రీన్‌పై మరోసారి చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’ ప్రస్తుతం భారత్‌లో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ స్పెషల్ ప్రెజెంటేషన్‌లో ‘అవెంజర్స్: డూమ్స్‌డే’కు కనెక్ట్ అయ్యే అదనపు సన్నివేశాలు కూడా ఉన్నాయి. ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ 2026 డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఇది కూడా చదవండి: ఓటీటీలోకి సందీప్ రెడ్డి వంగా 'రోమాంచకం' మూవీ.!       [Avengers Endgame Encore Collections, Avengers Endgame Re Release, Avengers Endgame Encore India, Avengers Endgame Encore Box Office, Avengers Doomsday, Avengers Endgame Encore, Telugu Film News, Telugu News]  
అనతికాలంలోనే పాన్ ఇండియా నటిగా గుర్తింపు పొంది ప్రస్తుతం నేషనల్ క్రష్ టాగ్ లైన్ తో వరుస సినిమాలతో బిజీగా ఉంది రష్మిక. ప్రస్తుతం విజయదేవర కొండ తో 'రణబలి' తో పాటు మరిన్ని కీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. అయితే ఇప్పుడు రష్మిక నేషనల్ క్రష్ క్రేజ్‌కే సవాల్ విసురుతూ, సోషల్ మీడియాలో ఒక కొత్త అందాల భామ సంచలనం సృష్టిస్తోంది. ఆ అందాల ముద్దు గుమ్మనే  మోడల్ అండ్ నటి తన్యా మిశ్రా. నెట్టింట ఎక్కడ చూసినా తన్యా మిశ్రా హాట్ ఫొటోలు, స్టైలిష్ వీడియోలే వైరల్ అవుతుండటంతో కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. దాంతో అభిమానులు ఇండియాస్ 'న్యూ నేషనల్ క్రష్' అని కొనియాడుతున్నారు. బిహార్‌లోని గయా నగరంలో 1999 జనవరి 31న జన్మించిన తన్యా మిశ్రా, మగధ్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (B.Com) డిగ్రీ పట్టా పుచ్చుకుంది. చదువు పూర్తయ్యాక మోడలింగ్‌పై ఉన్న తీవ్రమైన మక్కువతో గ్లామర్ హబ్ అయిన ముంబై నగరంలో అడుగుపెట్టింది. గ్లామర్ ప్రపంచంలో తనదైన ముద్ర వేయాలనే పట్టుదలతో ప్రయాణం ప్రారంభించిన తన్యా, 2019లో జరిగిన 'IAWA మిస్ ఇండియా' పోటీల్లో పాల్గొని 4th రన్నరప్‌గా నిలిచింది.  ఈ విజయంతో ఫ్యాషన్ రంగానికి పరిచయమైన తన్యా, తక్కువ సమయంలోనే ఫెమినా, ఫిల్మ్‌ఫేర్, గ్రాజియా వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఫ్యాషన్ మ్యాగజైన్ కవర్ పేజీలపై మెరిసింది. ముఖ్యంగా ఫెమినా ఏప్రిల్-మే 2024 ఎడిషన్ కవర్ పేజీపై ఆమె లుక్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫ్యాషన్ రంగంలో చూపించిన విశేష ప్రతిభకు గానూ ఫెమినా అచీవర్స్ అవార్డు 2024 మరియు లోక్‌మత్ అవార్డు 2023 సాధించి పరిశ్రమలో నిలదొక్కుకుంది.   కేవలం మోడలింగ్‌కే పరిమితం కాకుండా నటన వైపు అడుగులు వేసిన తన్యా, 'ఘజ్నవి' అనే చిత్రంతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత వచ్చిన థ్రిల్లర్ మూవీ 'చేజ్'లో ఏకంగా పవర్‌ఫుల్ సిబిఐ ఇన్‌స్పెక్టర్ పాత్రలో నటించి తనలోని నటిని ప్రదర్శించింది. అంతేకాకుండా, హర్మాన్ బావేజా ప్రొడక్షన్స్ నిర్మించిన 'చిడియా ఉడ్' అనే భారీ బిగ్ వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ ప్రముఖ నటులు జాకీ ష్రాఫ్, భూమిక చౌలా, సికందర్ ఖేర్‌లతో కలిసి కీలక పాత్రలో నటించింది. దీనికి తోడు 'నఖ్రో', 'తూ మేరా హో జాయేగా' వంటి 7 ప్రముఖ మ్యూజిక్ వీడియోలలో లీడ్ యాక్ట్రెస్‌గా అలరించింది.   ప్రస్తుతం సోషల్ మీడియాలో తన్యా మిశ్రా క్రేజ్ వేగంగా పెరుగుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు ఏకంగా 12 లక్షల (1.2 Million) మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.  ఇది కూడా చదవండి: మోక్షజ్ఞ డెబ్యూ స్క్రిప్ట్‌పై బాలకృష్ణ కీలక మార్పులు.. సెకండ్ హాఫ్ లో అలా!     ప్రతీ కొత్త ఫొటోషూట్‌లో ఆమె చూపిస్తున్న ఫ్యాషన్ సెన్స్, బోల్డ్ అండ్ గ్లామరస్ లుక్స్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. నేషనల్ క్రష్ అనేది అధికారిక బిరుదు కాకపోయినప్పటికీ, అభిమానులు ఆమె పట్ల చూపిస్తున్న ప్రేమే ఈ పేరుకు కారణమైంది. ఇప్పుడు బాలీవుడ్‌లోని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఆమెతో ఒక పెద్ద ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తోందనే ప్రచారం కూడా నడుస్తోంది. అందుకే అంటారు నిదానంగా అయినా 'తాడిని తన్నే వాళ్ళుంటే తలని దాన్నే వాళ్ళు వస్తారని.     [Tanya Mishra New National Crush India, Rashmika vs Tanya Mishra,Tanya Mishra National Crush,Rashmika Mandanna, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో పాన్ ఇండియా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో వచ్చిన తాజా చిత్రం 'రోమాంచకం'. థియేటర్లలో సందడి చేసిన ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్, ఇప్పుడు డిజిటల్ వరల్డ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైపోయింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా 'రోమాంచకం' మూవీ రాబోతోంది. ఈ చిత్రం అక్టోబర్ 1 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని అధికారిక ప్రకటన వచ్చింది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విశేషం ఏంటంటే... ఈ సినిమా కేవలం తెలుగుకే పరిమితం కాకుండా నెట్‌ఫ్లిక్స్‌లో ఇతర భాషల్లో కూడా అందుబాటులో ఉండనుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.  సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ ఈ చిత్రంలో హీరో హీరోయన్లుగా నటించారు. నూతన దర్శకుడు వేణు గోపాల్ రెడ్డి ఈ చిత్రాన్ని యూత్‌ఫుల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. ఇది కూడా చదవండి: రణబాలి డాక్యుమెంటరీ.. కోటి మంది భారతీయుల ప్రాణాలు తీసిన విషాధ ఘటన.! https://x.com/Netflix_INSouth/status/2104503885071008069       [Romanchakam OTT Release Date, Romanchakam Netflix, Romanchakam OTT Date, Romanchakam Movie Telugu, Sandeep Reddy Vanga, Sumanth Prabhas, Ananthika Sanilkumar, Telugu OTT Movies 2026, Telugu Movies]  
నందమూరి అభిమానుల ఆశలు ఫలించి యువ నటసింహం మోక్షజ్ఞ తన డెబ్యూ మూవీని  వశిష్ఠ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా బ్యానర్  మైత్రీ మూవీ మేకర్స్  కలవడంతో ఫ్యాన్స్ ఆనందానికైతే అవధులు లేవు. అయితే  ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో  బాలకృష్ణ ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా చాలా  జాగ్రత్తగా   వ్యవహరిస్తున్నారు. మోక్షజ్ఞ తొలి చిత్రంలో ఎలాంటి చిన్న లోపం కూడా ఉండకూడదని భావించిన బాలకృష్ణ స్వయంగా కథలోని కీలక సన్నివేశాలని పరిశీలించి, కొన్ని సవరణలు సూచించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ఊహాగానాలు జోరందుకున్నాయి.   ముఖ్యంగా సెకండాఫ్‌పై బాలయ్య ప్రత్యేకంగా దృష్టి సారించారు. కథలో మొదటి భాగం ఎంతో ఆసక్తికరంగా, మోక్షజ్ఞ క్యారెక్టర్‌ను ఆకట్టుకునేలా డిజైన్ చేసినప్పటికీ, ద్వితీయార్థంలో డ్రామా, ఎమోషన్స్ మరియు పేసింగ్ ఇంకాస్త బలంగా ఉండాలని బాలకృష్ణ భావించినట్లు తెలుస్తోంది. ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ ఎమోషనల్ హై మరియు ఇంపాక్ట్ నిలిచిపోయేలా ఉండటానికి రెండవ అర్ధభాగంలో కొన్ని మార్పులు చేయాలని ఆయన సూచించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: భగత్ సింగ్ జయంతి: వెండితెరపై ఆ మహా విప్లవకారుడిగా  ఏ హీరో అయితే అద్భుతంగా ఉంటుంది! బింబిసారలో టైమ్ ట్రావెల్, ఫాంటసీ ఎలిమెంట్స్  కమర్షియల్ ఫార్మాట్‌లో ఎంత అద్భుతంగా చూపించారో, మోక్షజ్ఞ సినిమాలో కూడా సోషియో-ఫాంటసీ అంశాలతో పాటు బలమైన మాస్ ఎలిమెంట్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.   ఈ చిత్రంలో బాలకృష్ణ దాదాపు 40 నిమిషాల నిడివి గల ఒక పవర్‌ఫుల్ అండ్ క్రూషియల్ రోల్‌లో కనిపించనున్నారనే చర్చ సైతం నడుస్తోంది. 100% పర్‌ఫెక్షన్ కోరుకునే బాలయ్య, తండ్రిగా మాత్రమే కాకుండా టాలీవుడ్ లెజెండ్‌గా తన కొడుకు లాంచ్ గ్రాండ్‌గా ఉండేలా స్క్రిప్ట్‌లోని ప్రతి ఎమోషనల్ గ్రాఫ్‌ను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. దసరా రోజు పూజా కార్యక్రమాలతో  ఓపెనింగ్ ఉండవచ్చని టాక్.     [Mokshagna Debut Movie Balakrishna Script Changes, Balakrishna, Vasishta, Mythri Movie Makers, Mokshagna Teja, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
ప్రభాస్ హీరోగా ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా మరోసారి అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచింది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం తన సోషల్ మీడియా ఖాతాలో ‘బాహుబలి: ది బిగినింగ్’లోని ఓ యాక్షన్ సన్నివేశాన్ని షేర్ చేసింది. కాలకేయుల సైన్యంతో అమరేంద్ర బాహుబలి పోరాడే సన్నివేశాలతో ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు ఇరాన్ రాయబార కార్యాలయం తన దేశ వైఖరిని తెలియజేసే సందేశాన్ని జత చేసింది. ఇటీవల ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. తమ దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ తలవంచబోదని పేర్కొంది. బాహుబలి కాలకేయుల సైన్యాన్ని ఎదుర్కొన్న విధంగానే తమ మాతృభూమి కోసం తాము కూడా త్యాగాలకు సిద్ధంగా ఉన్నామని సందేశం ఇచ్చింది. సెప్టెంబర్ 23న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడిన పెజెష్కియాన్.. అమెరికా ఒత్తిడికి ఇరాన్ లొంగిపోదని పేర్కొన్నారు. అదే సమయంలో చర్చలు, దౌత్య మార్గాలకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే ఒత్తిడి లేదా బలప్రయోగాన్ని అంగీకరించబోమని ఆయన చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఇరాన్ రాయబార కార్యాలయం ‘బాహుబలి’ యుద్ధ సన్నివేశాన్ని తమ సందేశానికి ప్రతీకగా ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఇరాన్ సోషల్ మీడియా కోసం తెలుగు సినిమాను ఉపయోగించడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’లోని యాక్షన్ సన్నివేశాన్ని కూడా ఇరాన్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఇప్పుడు ప్రభాస్ ‘బాహుబలి’ క్లిప్‌ను ఉపయోగించడంతో మరోసారి తెలుగు సినిమా సన్నివేశం అంతర్జాతీయ రాజకీయ సందేశంలో భాగంగా మారింది. దీంతో ప్రభాస్ అభిమానులతో పాటు సినీ వర్గాల్లోనూ ఈ పోస్టుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.     [Prabhas Baahubali, Iran Embassy Baahubali Video, Iran US Tensions, Baahubali Viral Video, Prabhas Latest News, Baahubali Battle Scene, Iran Embassy Hyderabad, Masoud Pezeshkian, SS Rajamouli, Baahubali The Beginning]
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ "రణబాలి". ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 16న "రణబాలి" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.  "రణబాలి" నెవర్ ఫర్ గెట్ ది ట్రూత్ పేరుతో రూపొందించిన 4 ఎపిసోడ్స్ డాక్యుమెంటరీ సిరీస్ లో ఫస్ట్ ఎపిసోడ్ 'ది ఫెమైన్ వి ఫర్ గాట్' ఈ రోజు స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ ఎపిసోడ్ లో 1876 - 78 మధ్య కాలంలో బ్రిటీషర్స్ సృష్టించిన కరువు కోటి మంది భారతీయుల ప్రాణాలు తీసిన విషాధ ఘటనను వెల్లడించారు. భారతీయులు ఆకలితో చనిపోతుంటే, బ్రిటీషర్లు తమ దేశానికి టన్నుల కొద్దీ ధాన్యం ఎలా తరలించారో చూపించారు. 150 ఏళ్ల ఈ చరిత్రను రీసెర్చ్ చేసి ఈ సినిమాగా రూపొందించారు. ఈ భారీ ప్రయత్నాన్ని హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రశ్మిక, డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ తెలిపారు.  డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ మాట్లాడుతూ.. "మేము బ్రిటీషర్స్, వారి సామ్రాజ్య చరిత్ర గురించి వందలాది చిత్రాలు  చూశాం. ఎక్కడా కరువు గురించి వాళ్లు పేర్కొనలేదు. హిస్టరీలో 1976 - 78 మధ్య కాలంలో ది గ్రేట్ మద్రాస్ కరువు ఏర్పడింది అని ఉంది. ఈ రెండేళ్ల కాలంలో కరువు కారణంగా కోటి మంది భారతీయులు చనిపోయారు. ఆ కాలంలో భారతీయుల మొత్తం జనాభా 25-30 కోట్లుగా ఉండేది. వారిలో కోటి మంది చనిపోవడం అంటే ఎంత విషాధమో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటన గురించి తెలుసుకునేందుకు లోతైన పరిశోధన చేశాం. కలెక్టర్ ఆఫీస్ లకు, లైబ్రరీలకు, పాత లైబ్రరీలకు వెళ్లి ఎన్నో పుస్తకాలను, గెజిట్ లను పరిశీలించాం." అన్నారు హీరోయిన్ రశ్మిక మందన్న మాట్లాడుతూ.. "ఈ కరువు ఘటన గురించి విన్నప్పుడు చాలా బాధగా అనిపించింది. వారు చేసిన త్యాగాలను, పడిన బాధను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాను. చరిత్రలో ఏం జరిగిందో తెలుసుకున్నాను. ఇలాంటి గొప్ప చిత్రంలో నటించే అవకాశం అరుదుగా వస్తుంటుంది." అన్నారు. హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. "ఈ కరువు కాలంలో మన భారతీయులు ఆకలితో చనిపోతుంటే, మరోవైపు బ్రిటీషర్స్ లక్షలాది టన్నుల ధాన్యం బ్రిటన్ కు, వారు యుద్ధాలు చేస్తున్న ప్రాంతాలకు తరలించేవారు. 150 ఏళ్ల క్రితం ఈ ఘోర ఘటన జరిగింది. ఆకలితో అలమటిస్తూనే బ్రిటీషర్స్ కోసం ప్రజలు ధాన్యం మోసేవారు. ఇది ఒకప్పుడు నిజంగా జరిగిందనే వాస్తవాన్ని గుర్తుపెట్టుకుంటూ ఒక మంచి స్టోరీని తెరకెక్కించాం. ఆ కరువు కాలంలో అమరులైన ప్రజలకు నివాళిగా ఈ మూవీని రూపొందించాం." అన్నారు. ఈ నెల 30న సెకండ్ ఎపిసోడ్ 'ది హిస్టరీ వి ఫర్ గాట్', అక్టోబర్ 2న మూడో ఎపిసోడ్ 'ది మెన్ వి ఫర్ గాట్' స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. నాలుగో ఎపిసోడ్ 'ది లాస్ట్ లోడ్' స్ట్రీమింగ్ డేట్ ను త్వరలో ప్రకటించనున్నారు. ఇది కూడా చదవండి: బాలయ్య - కొరటాల మూవీ లేటెస్ట్ అప్‌డేట్‌ ఇదే.!       [Ranabaali Documentary First Episode, The Famine We Forgot, Ranabaali Documentary, Ranabaali Release Date, Ranabaali Movie Story, Vijay Deverakonda, Rashmika Mandanna, Director Rahul Sankrityan, Telugu Film News]  
Ranabaali, the prestigious pan-India epic starring Vijay Deverakonda and Rashmika Mandanna, is gearing up for a grand worldwide theatrical release on October 16 during the Vijayadashami festival. Directed by Rahul Sankrityan, the film is being produced on a massive scale by Naveen Yerneni and Y. Ravi Shankar under the Mythri Movie Makers banner and is presented by T-Series. The first episode of the four-part documentary series, Ranabaali: Never Forget The Truth, titled The Famine We Forgot, began streaming today. The episode sheds light on the tragic famine created during 1876–78 under British rule, which claimed the lives of nearly 10 million Indians. It also reveals how, while Indians were dying of starvation, the British continued transporting enormous quantities of grain to Britain and other regions where they were fighting wars. The episode explains how this forgotten chapter of history was extensively researched and became the foundation for Ranabaali. Director Rahul Sankrityan, "We have watched hundreds of films about the British Empire and its history, but hardly any of them spoke about this famine. History records the Great Madras Famine of 1876–78, during which nearly 10 million Indians died within two years. At that time, India's population was only around 250–300 million, so the scale of this tragedy is unimaginable. We carried out deep research to understand this incident, visiting collector offices, libraries, old archives, and studying numerous books and government gazettes before bringing it to the screen." Jayamma aka Rashmika Mandanna, "When I first heard about this famine, it was heartbreaking. I tried to understand the pain and sacrifices of the people who lived through that period and learned what truly happened in history. Opportunities to be part of a film like this come very rarely." Ranabaali aka Vijay Deverakonda, "While Indians were dying of hunger during this famine, the British were transporting lakhs of tonnes of grain to Britain and other war zones. This horrific incident happened nearly 150 years ago. Even while starving, people were forced to carry grain for the British. We wanted to tell this true story and ensure people remember what really happened. Ranabaali is our tribute to the millions who lost their lives during that famine." The documentary series will continue with The History We Forgot on September 30 and The Men We Forgot on October 2. The streaming date for the fourth and final episode, The Last Load, will be announced soon. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటివరకు ఎప్పుడూ చూడని వినూత్న రీతిలో బాలయ్యను ప్రెజెంట్ చేయడానికి కొరటాల శివ తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారనే వార్త ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో కనిపిస్తారని సమాచారం. అంటే తండ్రీ కొడుకులుగా రెండు విభిన్నమైన రోల్స్‌లో బాలయ్య సందడి చేయనున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒకవైపు పవర్‌ఫుల్ తండ్రి పాత్ర, మరొకవైపు డిఫరెంట్ షేడ్స్ ఉన్న కొడుకు పాత్రలో బాలకృష్ణ కనిపించి నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం బాలయ్య తన లుక్‌ను పూర్తిగా మార్చుకుని సరికొత్త మేకోవర్‌లో రాబోతున్నారట. ఈ భారీ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్‌ను డిసెంబర్ మొదటి వారం నుంచే ఘనంగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 'దేవర' చిత్రం తర్వాత కొరటాల శివ ఎంతో జాగ్రత్తగా, కథపై ప్రత్యేక దృష్టి పెట్టి ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు రాజకీయ అంశాలను కూడా ప్రధానంగా ప్రస్తావించబోతున్నారట. సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలయ్య పవర్‌ఫుల్ మాస్ డైలాగ్స్, కొరటాల శివ మార్క్ కంటెంట్, ద్విపాత్రాభినయం, పొలిటికల్ టచ్.. ఈ ఎలిమెంట్స్ అన్నీ కలసి ఈ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి. ఇది కూడా చదవండి: 400 కోట్ల బాక్సాఫీస్ సునామీ.. హనుమాన్ అంశ్ ఓటీటీ డీటెయిల్స్.!       [Balakrishna Koratala Movie Latest Update, Balakrishna Double Role, NBK112 Shooting Update, NBK112 Latest Update, Nandamuri Balakrishna, Koratala Siva, NBK 112 Movie, Telugu Film News, Telugu News]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
విడాకులు తీసుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకునే ముందు.. ఈ విషయాలు క్లియర్ చేసుకోండి..!   జీవితంలో విడాకులు అనేది ఒక అధ్యాయానికి ముగింపు మాత్రమే తప్ప, జీవితానికి కాదు. విడాకులు తీసుకున్న వ్యక్తి మళ్లీ ఒక కొత్త బంధంలోకి అడుగుపెట్టడం, కొత్త జీవితాన్ని ప్రారంభించడం చాలా సహజమైన విషయం. అయితే,  భాగస్వామిగా ఎంచుకోబోయే వ్యక్తికి విడాకులు అయి ఉండి, ఇప్పటికీ వారు తమ మాజీ భాగస్వామితో మాట్లాడుతూ, సన్నిహితంగా ఉంటూ,  పరిచయంలో ఉంటే  ఎన్నో సందేహాలు, భయాలు రావడం కూడా అంతే సహజం. వారు ఇప్పటికీ స్నేహితులుగా మాట్లాడుకుంటున్నా, లేదా పెళ్లి వంటి శుభకార్యాలకు ఆహ్వానించుకుంటున్నా  కొంత అభద్రతా భావం కలిగే అవకాశం ఉంటుంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఆందోళన చెందడం కంటే, వివాహానికి ముందే కొన్ని విషయాలపై స్పష్టత తెచ్చుకోవడం ఎంతో ఉత్తమం. స్పష్టత.. ఈ రోజుల్లో విడాకుల తర్వాత కూడా ఇద్దరు వ్యక్తులు పరస్పర గౌరవంతో స్నేహాన్ని కొనసాగించడం తరచుగా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా పిల్లల బాధ్యతలు, ఆర్థిక లావాదేవీలు లేదా పాత బంధాన్ని మానసికంగా దాటి ముందుకు సాగినప్పుడు ఇటువంటి వాతావరణం ఉంటుంది. కానీ కొత్తగా వారి జీవితంలోకి వస్తున్న భాగస్వామికి మాత్రం కొన్ని  అనుమానాలు రావచ్చు. వారు ఇప్పటికీ ప్రేమలో ఉన్నారా, కేవలం స్నేహం మాత్రమేనా, పెళ్లి తర్వాత కూడా ఈ స్నేహం  సంబంధాన్ని ప్రభావితం చేస్తుందా అనే ఆలోచనలు రావడం సహజం. ఈ సందేహాలను మనసులోనే దాచుకోకుండా, పెళ్లికి ముందే  భాగస్వామితో బహిరంగంగా మాట్లాడటం వల్ల భవిష్యత్తులో వచ్చే అనేక సమస్యలను నివారించవచ్చు. లైఫ్ పార్ట్నర్  తమ మాజీతో పరిచయంలో ఉండటం ఎల్లప్పుడూ తప్పు కాకపోవచ్చు. పిల్లలు, ఉమ్మడి ఆస్తులు, వ్యాపారాలు లేదా కుటుంబ సంబంధాల వల్ల వారు మాట్లాడుకోవాల్సి రావచ్చు. కాబట్టి వారు కేవలం మాట్లాడుతున్నారనే కారణంతోనే ఏదో తప్పు జరుగుతోందని భావించలేం. వారు ఎంతవరకు లిమిట్ లో ఉన్నారో..  వారు ఇంకా మాట్లాడుకోవడానికి కారణం  ఏమిటో అర్థం చేసుకోవడం ప్రధానం. అలాగే, వారిద్దరి విడాకులకు అసలు కారణం ఏమిటో, ఆ పాత బంధం నుండి  భాగస్వామి ఏం నేర్చుకున్నారో తెలుసుకోవడం వల్ల మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత  భాగస్వామి స్వభావాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది. సంకోచం వద్దు.. భార్య అయినా భర్త అయినా.. రెండో సారి పెళ్లి చేసుకున్న తర్వాత  మాజీ భార్యతో లేదా భర్తతో మాట్లాడటం మీకు నచ్చదు అనిపిస్తే .. ఆ విషయాన్ని మనసులో  దాచుకోవడం కంటే, పెళ్లికి ముందే వారితో  ఆ విషయం చెప్పడం ఇద్దరికీ  మంచిది. మీతో విషయాలను పంచుకోవడంలో మీ భాగస్వామి ఎంతవరకు ట్రాన్సపరెంట్ గా  ఉంటున్నారు అనేది ఇక్కడ ముఖ్యమైన అంశం. మాట్లాడటంలో దాపరికం లేకుండా  ఉన్నప్పుడు అనుమానాలకు తావుండదు. మానసిక బంధం.. భార్యా లేదా భర్తతో విడిపోయిన తర్వాత రెండో పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పటికీ.. ఇంకా వదిలేసిన వ్యక్తితో మానసికంగా అటాచ్మెంట్ అయి ఉన్నారా అనేది కూడా పరిశీలించాలి. పాత బంధం పూర్తిగా ముగిసిపోయిందా, లేక ఇప్పటికీ ప్రతి చిన్న విషయానికి మాజీ లైఫ్ పార్టనర్ పై  ఆధారపడుతున్నారా అనేది గమనించాలి. మిమ్మల్ని ఎప్పుడూ పాత లైఫ్ పార్టనర్ తో  పోల్చడం లేదా పాత బంధంలోని సమస్యల్లోనే ఇంకా ఉండిపోవడం వంటివి ఉంటే, వారు మానసికంగా రెండో పెళ్లి చేసుకుని కొత్త  బంధానికి సిద్ధంగా లేరని అర్థం చేసుకోవాలి. భవిష్యత్తు.. భవిష్యత్తులో వారి మాజీ లైఫ్ పార్టనర్  పాత్ర ఎంతవరకు ఉంటుంది అనే దానిపై కూడా స్పష్టత ఉండాలి. పిల్లలు ఉన్నట్లయితే వారి పెంపకం కోసం మాజీ లైఫ్ పార్ట్నర్  జీవితంలో ఉండే అవకాశం ఉంటుంది. కానీ  కలుసుకుంటూ ఉండటం అనేది ఎంత తరచుగా ఉంటుంది? ఎంత వరకు వారు హద్దులో ఉంటున్నారు, , కుటుంబ వేడుకలకు వారు వస్తారా లేదా, అలాగే ఆ సందర్భాల్లో మిమ్మల్ని ఏ విధంగా ట్రీట్  చేస్తారు అనే విషయాలపై ముందే మాట్లాడేసుకోవడం వల్ల భవిష్యత్తు వివాదాలు తగ్గుతాయి. కష్టంలో.. ఒకవేళ మాజీ లైఫ్ పార్ట్నర్ కు  ఏదైనా కష్టం వచ్చినప్పుడు మీ భాగస్వామి ఎంతవరకు స్పందిస్తారు అనే దానిపై కూడా హద్దులు ఉండాలి. పిల్లల విషయంలో సహాయం చేయడం వేరు, కానీ మీ ప్రాధాన్యతలను పక్కన పెట్టి పాత భాగస్వామికే మొదటి స్థానం ఇవ్వడం సరైనది కాదు. మీ భాగస్వామికి మీకే మొదటి ప్రాధాన్యత ఉందా లేదా అనేది స్పష్టంగా తెలియాలి. విడాకులు తీసుకున్న వ్యక్తితో కొత్త జీవితాన్ని ప్రారంభించడంలో ఎలాంటి తప్పు లేదు. బంధం బలపడటానికి నమ్మకం, స్పష్టమైన కమ్యూనికేషన్, ట్రాన్పరెంట్ గా ఉండటం , పరస్పర గౌరవం ప్రధానమైనవి. వివాహానికి ముందే ఇరువైపులా అన్ని విషయాలు తెరిచిన పుస్తకంలా మాట్లాడేసుకుంటే, ఇద్దరి మధ్య నమ్మకం పెరుగుతుంది. ఇది భవిష్యత్తులో రాబోయే సమస్యలను తొలగించి, ఒక బలమైన, సంతోషకరమైన కొత్త బంధానికి నాంది పలుకుతుంది.                                                                                                                                                    రూపశ్రీ.
మానవ జీవితంలో విజయం సాధించాలన్నా, సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్నా తెలివితేటలు ఎంత ముఖ్యమో, మన ఆలోచనలు , అలవాట్లు కూడా అంతే ముఖ్యం. కొన్నిసార్లు ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ, రోజువారీ జీవితంలో చేసే కొన్ని పొరపాట్లు లేదా ప్రతికూల ఆలోచనలు, అలవాట్ల వల్ల మనుషులు వెనకబడిపోతుంటారు. ఆలోచనా విధానంలో లోపాలు, సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం , ప్రవర్తనలో వివేకం లేకపోవడం వంటివి మనిషి ఎదుగుదలకు పెద్ద అవరోధాలుగా మారతాయి. జీవితంలో ప్రశాంతతను, సాధించిన అభివృద్ధిని కాపాడుకోవాలంటే మన ప్రవర్తనను మనం నిరంతరం సమీక్షించుకోవడం చాలా అవసరం. మానసిక పరిణతి లేకపోవడం వల్ల సాధారణంగా కనిపించే కొన్ని చెడ్డ అలవాట్లు , వాటి ప్రభావం గురించి  వివరంగా తెలుసుకుంటే..  గుడ్డిగా అందరిని  నమ్మేయడం.. సమాజంలో రకరకాల స్వభావాలు కలిగిన వ్యక్తులు ఉంటారు. ఎవరి నిజస్వరూపం ఏమిటో, వారి ఉద్దేశాలు ఎలాంటివో పూర్తిగా తెలుసుకోకుండా, ఒకరిని అతిగా నమ్మడం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన మానసిక వేదనను, నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరినైనా నమ్మే ముందు వారి ప్రవర్తనను, నిజాయితీని గమనించడం వివేకవంతమైన లక్షణం. డబ్బు, విజయం దక్కగానే గర్వపడటం... ఆర్థికంగా చిన్నపాటి ఎదుగుదల కనిపించగానే విర్రవీగడం లేదా ఇతరులను తక్కువగా చూడటం వల్ల మనుషుల మధ్య సంబంధాలు దెబ్బతింటాయి. నిజమైన విజేతలు ఎప్పుడూ ఒద్దికగా, వినయంతో ఉంటారు. సంపాదన పెరిగినప్పుడు సంస్కారం కూడా పెరిగితేనే ఆ ధనానికి, హోదాకు విలువ ఉంటుంది. సొంత పనులను పక్కన పెట్టి ఇతరుల పనుల్లో  జోక్యం.. మన జీవితాన్ని మనం చక్కదిద్దుకోవడం మొదటి ప్రాధాన్యత కావాలి. మన లక్ష్యాలను, వ్యక్తిగత పనులను నిర్లక్ష్యం చేస్తూ ఇతరుల విషయాలలో అనవసరంగా సమయాన్ని వృథా చేయడం వల్ల చివరికి మనకే నష్టం జరుగుతుంది. ప్లానింగ్ వేసి ఆచరించకపోవడం..  అది చేయాలి, ఇది సాధించాలి అని పెద్ద పెద్ద ప్లాన్లు వేయడం, కానీ వాటిని అమలు చేయడానికి ఎటువంటి ప్రయత్నం చేయకపోవడం వల్ల ప్రయోజనం ఉండదు. కేవలం ఆలోచనలకే సమయాన్ని కేటాయించి, ఆచరణలో ఏమీ చేయకపోవడం వ్యక్తిగత ఎదుగుదలను పూర్తిగా అడ్డుకుంటుంది. ఏ చిన్న పనైనా ఆచరణలో పెట్టినప్పుడే దానికి ఫలితం లభిస్తుంది.  ఆడంబరాలకు, సోకుల కోసం  డబ్బును వృథా చేయడం..  సమాజంలో గొప్పలు ప్రదర్శించడం కోసం, లేని ఆడంబరాల కోసం డబ్బులు  దుర్వినియోగం చేయడం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. పొదుపు , సరైన ఆర్థిక నిర్వహణ లేకపోవడం వల్ల మనిషి నిరంతరం ఒత్తిడికి గురవుతాడు. పైన చెప్పుకున్న అలవాట్లు మనిషి  లో ఆలోచన లేనితనానికి అద్దం పడతాయి. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే కేవలం చదువు, తెలివితేటలు మాత్రమే సరిపోవు, మన ప్రవర్తనను సరిదిద్దుకోవడం, సమయాన్ని ఆదా చేసుకోవడం, ఆర్థిక విషయాల గురించి తెలుసుకుని, అవగాహన పెంచుకోవడం, మంచి ఆలోచనా విధానాన్ని అలవరచుకోవడం ఎంతగానో అవసరం. మనలో ఉన్న ఇటువంటి చిన్న చిన్న లోపాలను గుర్తించి తీర్చిదిద్దుకున్నప్పుడే జీవితంలో స్థిరమైన ప్రశాంతత, విజయం సాధ్యమవుతాయి.                   *రూపశ్రీ.  
మన భారతీయ వంటగదిలోని మసాలా దినుసులలో లవంగానికి (Clove) అత్యంత ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సాధారణంగా వంటలలో సువాసన, రుచి కోసం వాడే ఈ చిన్న లవంగం కేవలం మసాలా దినుసు మాత్రమే కాదు, అద్భుతమైన ఆయుర్వేద మూలికా నిధి. ప్రాచీన కాలం నుండి మన పెద్దలు లవంగాన్ని రకరకాల ఆరోగ్య సమస్యల నివారణకు ఒక శక్తివంతమైన నివారణిగా ఉపయోగిస్తున్నారు. ఆధునిక పోషకాహార నిపుణులు మరియు వైద్య పరిశోధనల ప్రకారం ప్రతీ రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒకే ఒక్క లవంగాన్ని నమిలి తినడం లేదా దానిని నీటితో తీసుకోవడం వల్ల శరీరంలో ఆశ్చర్యకరమైన ఆరోగ్యకర మార్పులు చోటుచేసుకుంటాయి. మన జీర్ణవ్యవస్థను శక్తివంతం చేయడం నుండి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు ఇది ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. లవంగంలో ఉండే అత్యంత క్రియాశీలక కాంపౌండ్  యూజినాల్  (Eugenol). ఇది ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా మరియు యాంటీబ్యాక్టీరియల్ మూలకంగా పనిచేస్తుంది. ప్రతిరోజూ ఉదయాన్నే ఒక లవంగాన్ని పరగడుపున నమిలి నమలడం వల్ల నోటిలోని హానికర బ్యాక్టీరియా నశించిపోతుంది. లవంగంలో ఉండే సహజ నూనెలు చిగుళ్ల వాపును, పంటి నొప్పిని మరియు నోటి దుర్వాసనను తక్షణమే నివారిస్తాయి. అంతేకాకుండా, ఇది నోటిలోని లాలాజల గ్రంథులను ప్రేరేపించి, జీర్ణరసాల ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా ఉదయాన్నే మన జీర్ణవ్యవస్థ వేగవంతమై, తిన్న ఆహారం సులభంగా అరగడానికి నాంది పలుకుతుంది. జీర్ణకోశ సమస్యలతో బాధపడేవారికి పరగడుపున లవంగం తినడం ఒక గొప్ప వరంగా మారుతుంది. లవంగంలో ఉండే పీచు పదార్థం మరియు ఎంజైములు కడుపులో గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం మరియు మలబద్ధకం వంటి సమస్యలను సమర్థవంతంగా అరికడతాయి. కడుపులోని అల్సర్లను కలిగించే హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకోవడంలో లవంగం కీలక పాత్ర పోషిస్తుంది. ఉదయాన్నే పరగడుపున ఒక లవంగం తీసుకోవడం వల్ల జీర్ణశక్తి బలపడటమే కాకుండా, శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్లిపోయి జీర్ణ వ్యవస్థ శుభ్రపడుతుంది. మానవ శరీరంలో రోగనిరోధక శక్తిని (Immunity) పెంపొందించడంలో లవంగం ఎంతో అద్భుతంగా తోడ్పడుతుంది. లవంగంలో విటమిన్ సి, విటమిన్ కే, మాంగనీస్ మరియు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఒక టీస్పూన్ లవంగాల పొడి నుండి మన శరీరానికి రోజువారీ కావలసిన మాంగనీస్ అవసరాలలో దాదాపు 55 శాతం లభిస్తుంది. మాంగనీస్ మెదడు పనితీరుకు, ఎముకల బలానికి ఎంతో అవసరం. క్రమం తప్పకుండా ఉదయాన్నే లవంగం తినడం వల్ల రక్తంలో తెల్ల రక్త కణాల సంఖ్య పెరిగి, కాలగుణంగా వచ్చే సర్ది, దగ్గు, గొంతు నొప్పి మరియు ఇన్ఫెక్షన్ల నుండి శరీరానికి బలమైన రక్షణ కవచం లభిస్తుంది. అంతేకాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలను (Blood Sugar Levels) సమతుల్యం చేయడంలో మరియు కాలేయం (Liver) ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో లవంగం సమర్థవంతంగా పనిచేస్తుందని శాస్త్రీయ అధ్యయనాలు నిరూపించాయి. లవంగంలో ఉండే కాంపౌండ్లు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి, కణాలు గ్లూకోజ్‌ను త్వరగా గ్రహించేలా చేస్తాయి. దీనివల్ల టైప్ 2 మధుమేహంతో బాధపడేవారికి రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అలాగే శరీరం యొక్క జీవక్రియ రేటు (Metabolism) పుంజుకుని అదనపు కొవ్వు కరగడానికి సహకరిస్తుంది. రోజుకో లవంగం పరగడుపున తినే చిన్న అలవాటును మన జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యాన్ని, అమితమైన ఉత్సాహాన్ని సులభంగా పొందే వీలుంది.     [ Clove, Clove Benefits, Eugenol, Oral Health, Dental Health, Digestive Health, Immunity, Antioxidants, Blood Sugar, Liver Health ]
మన జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళన, సమస్యలకు బయట పరిస్థితులే కారణమా? లేక మనలోని ఆలోచనలు, భావాలు, నిర్ణయాలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయా? ఈ వీడియోలో Inner Engineering అంటే ఏమిటి? మనలోని ఆలోచనా విధానం మారితే మన ప్రవర్తన, నిర్ణయాలు, జీవన విధానంలో ఎలాంటి మార్పులు వస్తాయి? అనే విషయాలను డాక్టర్ శారదా దేవి, Professor of Human Development and Family Studies వివరిస్తున్నారు. మనల్ని మనం అర్థం చేసుకోవడం, Self-Awareness పెంచుకోవడం, మన ఆలోచనలు మరియు ప్రవర్తనను గమనించడం ద్వారా జీవితంలో సానుకూల మార్పులు ఎలా తీసుకురావచ్చో ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. Stress Relief, Mental Well-being, Self-Awareness, Motivation వంటి అంశాలపై ఉపయోగకరమైన విషయాలను తెలుసుకోవడానికి ఈ పూర్తి వీడియోను చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది ఒక్క రోజులో జరిగే  పని కాదు. నేటి ఆధునిక జీవనశైలి, సరైన పోషకాహారం లేకపోవడం, శారీరక శ్రమ తగ్గడం వంటి అనేక కారణాల వల్ల చిన్న వయసులోనే గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. నివేదికల ప్రకారం మన దేశంలో సంభవిస్తున్న మరణాలలో ఎక్కువ భాగం గుండె జబ్బుల వల్లే జరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం సమస్య వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవడం కంటే, ముందే మన లైఫ్ స్టైల్ లో  కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చని ప్రముఖ వైద్యులు సూచిస్తున్నారు. వాటి గురించి వివరంగా తెలుసుకుంటే.. చురుగ్గా ఉండటం..  బాగా  వర్కవుట్లు చేయలేకపోయినా, రోజూ కొంత సమయం నడవడాన్ని అలవాటు చేసుకోవాలి. రోజంతా ఒకే చోట కూర్చుని పనిచేసే వారు మధ్యమధ్యలో లేచి కాసేపు అటుఇటు తిరగడం వల్ల శరీరంలో రక్తం సరఫరా మెరుగ్గా ఉంటుంది. ఆహారం..  బరువు తగ్గడం కోసమే కాకుండా, శరీర జీవక్రియలను క్రమబద్ధీకరించే పౌష్టికాహారాన్ని ఎంచుకోవాలి. మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారం ఎంత పరిమాణంలో ఉందో, అందులో ఎలాంటి పోషకాలు ఉన్నాయో గమనించడం చాలా అవసరం. దీర్ఘకాలంలో గుండెకు మేలు చేసే బాలెన్స్డ్  ఆహారాన్ని అలవాటు చేసుకోవడం మంచిది. కండరాలను బలంగా ఉంచే వ్యాయామాలు..  వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో కండరాల సాంద్రత తగ్గుతుంది. అందుకే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లేదా కండరాలను దృఢపరిచే వ్యాయామాలు చేయడం ద్వారా రక్తపోటు అదుపులో ఉంటుందని, ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో రక్షణ ఇస్తుందని వైద్యులు చెబుతున్నారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం.. ఇప్పటి వేగవంతమైన జీవితంలో ఒత్తిడి చాలా సాధారణమైపోయింది. ఒత్తిడి గుండెపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే మనస్సును, నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచడానికి సంగీతం వినడం, ధ్యానం చేయడం, లోతైన శ్వాస తీసుకోవడం వంటివి చేయాలి. రోజులో కొంత సమయాన్ని మనస్సును తేలికపరిచే కార్యకలాపాల కోసం కేటాయించడం చాలా ఉపయోగకరం. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఏవేవో  ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. మన రోజువారీ అలవాట్లలో నడకను భాగం చేసుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని దూరం చేసుకోవడం వంటి చిన్న చిన్న మార్పుల ద్వారానే ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు.                                  *రూపశ్రీ.  
60 ఏళ్లు దాటిన తర్వాత మతిమరుపు పెరగడం సహజమేనా? కుటుంబ సభ్యుల పేర్లు లేదా బంధుత్వాలను గుర్తుపట్టలేకపోవడం, రోజువారీ పనులు చేయడంలో ఇబ్బంది పడటం వంటి మార్పులు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి సాధారణ మతిమరుపు లక్షణాలా? లేక డిమెన్షియా, అల్జీమర్స్ వంటి సమస్యలకు సంకేతాలా? ఈ వీడియోలో డాక్టర్ ప్రవీణ్ కుమార్ 60 ఏళ్ల తర్వాత కనిపించే మతిమరుపు, జ్ఞాపకశక్తి తగ్గడం, రోజువారీ పనుల్లో ఎదురయ్యే ఇబ్బందులు, అల్జీమర్స్ మరియు డిమెన్షియాకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను వివరిస్తున్నారు. జ్ఞాపకశక్తిలో మార్పులు కనిపించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వైద్యుల సలహా ఎందుకు అవసరమో కూడా తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో కొన్ని హోమియోపతి మందులు, వైద్య అనుభవాలకు సంబంధించిన విషయాలు కూడా ప్రస్తావించబడ్డాయి. అయితే మతిమరుపు, డిమెన్షియా లేదా అల్జీమర్స్ సమస్యలకు సొంతంగా మందులు వాడకుండా అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. సరైన వైద్య పరీక్షల ద్వారా సమస్యకు కారణాన్ని గుర్తించుకోవాలి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)