సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!  దేశంలో గత కొన్నేళ్లుగా కుట్రపూరితంగా పౌరుల ఓటు హక్కును కాలరాస్తూ ‘ఓట్ల చోరీ’ జరుగుతోందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన హెచ్చరికలు ఇప్పుడు నిజమని తేలిపోయాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఎస్‌ఐఆర్‌ (SIR) పేరుతో పౌరుల ఓట్లను తొలగిస్తున్న తీరుపై ఇతర ఎన్నికల కమిషనర్లు సైతం స్వయంగా అంగీకరించడం ప్రజాస్వామ్యానికి దురదృష్టకర పరిణామమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో.. టీపీసీసీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో కాంగ్రెస్ శ్రేణులు భారీ నిరసన చేపట్టాయి. బీఆర్‌కే భవన్‌ వద్ద ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎదుట ఈ ఆందోళన నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ అజారుద్దీన్‌లతో కలిసి భట్టి విక్రమార్క నిరసనలో పాల్గొన్నారు. అనంతరం ఎన్నికల కమిషన్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఓటర్ల జాబితాల సవరణ, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటు హక్కు పరిరక్షణకు ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.     [ Congress Protest, Bhatti Vikramarka, Rahul Gandhi, Vote Chori, SIR, Special Intensive Revision, Election Commission, CEC Gyanesh Kumar, CEC Resignation, TPCC, Mahesh Kumar Goud, Sridhar Babu, Ponnam Prabhakar, Azharuddin, Telangana Congress ]
సంచలనం సృష్టిస్తున్న ఎన్నికల కమిషన్   వివాదంపై  బొద్దింకల పార్టీ  వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు  చేశారు. దేశంలో ఎన్నికల ప్రక్రియపై, ముఖ్యంగా ఓట్ల తొలగింపు,  రిగ్గింగ్ ఆరోపణలపై పెద్దఎత్తున చర్చ జరుగుతున్న తరుణంలో ఆయన ప్రతిపక్ష పార్టీలకు ఎన్నికల బహిష్కరణ పిలుపునిచ్చారు. ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.  ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్   జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేశారు. ఆయన రాజీనామా డిమాండ్ తో. లేనిపక్షంలో జంతర్‌మంతర్ 2.0'పేరిట  ఆందోళనను చేపడతామని  హెచ్చరించారు.     దేశంలో ఎన్నికలు  పారదర్శకంగా జరగడం లేదనీ, ఓట్లు చోరీ అవుతున్నాయని ఆరోపించిన అభిజిత్ దిప్కే.. ఎన్నికలను బహిష్కరిస్తే తమ రాజకీయ ఉనికి కోల్పోతామనే భయంతోనే ప్రతిపక్షాలు ఈ తంతులో భాగం అవుతున్నాయని  విమర్శించారు. కానీ..  ఇలాంటి దెబ్బతిన్న, పక్షపాత వ్యవస్థలో కేవలం ఉనికిని కాపాడుకోవడం వల్ల ఒరిగేదేమిటని నిలదీశారు.  పార్టీలు విడిపోతున్నా, నాయకులు ఫిరాయిస్తున్నా ఎలాంటి రక్షణ లభిస్తుందని ప్రశ్నించారు. కేవలం తమకు ప్రయోజనం ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే ఎన్నికల అక్రమాల గురించి మాట్లాడి.. ఇతర ప్రాంతాల్లో జరిగే అన్యాయాన్ని విస్మరించడం సబబు కాదన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ఫిక్స్డ్ మ్యాచ్ వ్యాఖ్యానం సోషల్ మీడియాలో  ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్స్ అయినప్పటికీ, ప్రజలను నమ్మించడానికి కొన్ని క్యాచ్‌లు వదిలేయడం, కొన్ని క్యాచ్‌లు పట్టడం, చివరి ఓవర్ వరకు మ్యాచ్‌ని పొడిగించడం చేస్తారన్న ఆయన... దేశంలో  ఎన్నికలో కూడా  కూడా ప్రతిపక్షాలకు కొన్ని విజయాలను ఇస్తారనీ,  అది చూసి ప్రజలు నిజంగానే అక్కడ పోటీ జరుగుతోందని భ్రమపడతారని  అభిజిత్ దిప్కే అన్నారు. ఆ చిన్న గెలుపులే ప్రతిపక్షాలను ఆటలో నిలబెట్టడానికి ఉద్దేశించిన బిస్కెట్లుగా అభివర్ణించారు.   ఇటీవల ఎన్నికల కమిషన్‌లో సీఈసీ నిర్ణయాలను మిగిలలిన ఇద్దరు కమిషనర్లు  10 నెలల వ్యవధిలో   14 సార్లు  అధికారికంగా అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే రాజకీయ మనుగడ కంటే దేశహితం ముఖ్యం అని భావించి, రిగ్గింగ్‌కు గురవుతున్న ఎన్నికలను ప్రతిపక్షాలు పూర్తిగా బహిష్కరించాలని అభిజిత్ దిప్కే పిలుపునిచ్చారు. [Abhijeet Dipke, Cockroach Janta Party, Election Commission Controversy, Election Boycott Call, CEC Gyanesh Kumar, India Election Rigging]
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో ఆ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మెరకముడిదాం వైసీపీ మండల అధ్యక్షుడు కోట్ల వెంకట్రావుతో పాటు 13 గ్రామాలకు చెందిన పలువురు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ముఖ్య నేతలు ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తమ రాజీనామా లేఖలను వైసీపీ అధినేత జగన్‌కి పంపుతున్నట్లు వారు వెల్లడించారు. ఇటీవలే వైసీపీని వీడి టీడీపీలో చేరిన బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)ను తామంతా అనుసరిస్తామని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు. త్వరలోనే వారంతా తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా చీపురుపల్లికి చెందిన ఓ మాజీ జెడ్పీటీసీ దంపతులు పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న సీనియర్ నేత సొంత నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనూహ్య రీతిలో ఎదురుదెబ్బ తగిలింది. దశాబ్దాలుగా బలమైన పట్టు కలిగి ఉన్న ప్రాంతంలో కీలక నాయకులు పార్టీని వీడటం స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పార్టీ అధిష్టానం తీసుకున్న కొన్ని నిర్ణయాలు స్థానిక కేడర్ మధ్య తలెత్తిన విభేదాలు ఈ పరిణామాలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా కీలక పదవుల్లో ఉన్న నాయకులు పార్టీ వీడుతుండటంతో ఆ ప్రభావం జిల్లాలవారీగా పార్టీ శ్రేణులపై పడుతోంది.ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ క్యాడర్‌లో కొంత గందరగోళం నెలకొంది. అయితే, అధిష్టానం మాత్రం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు వేగవంతం చేసింది. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టత కోసం ప్రత్యేక వ్యూహాలను రచిస్తూ, శ్రేణుల్లో మనోధైర్యం నింపేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.     [ Vizianagaram YSRCP politics, Botsa Satyanarayana, AP local politics updates, YSRCP leader defection, Cheepurupalli political,  Majji Srinivasarao, YS Jagan, CM Chandrababu, Naralokesh, Telugu One, Telugu News ]
ALSO ON TELUGUONE N E W S
       మహారాష్ట్రలోని థానే నగర పరిధిలో ఒళ్ళు గగుర్పొడిచే సంచలన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హిందీ వెబ్‌సిరీస్‌లతో పాటు భోజ్‌పురి సినిమాల్లో నటిగా మంచి పేరు సంపాదించుకున్న ఒక హీరోయిన్, అనూహ్యంగా వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తూ పోలీసులకు చిక్కిన ఉదంతం ఇప్పుడు సినీ పరిశ్రమలో తీవ్ర కలకలాన్ని రేపుతోంది.  వాగ్లే ఎస్టేట్ ప్రాంతంలో ఉన్న ఒక బార్ అండ్ రెస్టారెంట్‌లో అక్రమ కార్యకలాపాలు సాగుతున్నాయని థానే పోలీసులకి సమాచారం అందింది. దీంతో సీక్రెట్ టీమ్‌తో ఒక పక్కా 'డీకాయ్' ఆపరేషన్‌  ప్లాన్ చేశారు. పోలీసులు వేసిన పథకంలో సదరు నటి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కుకోవడంతో అధికారులు ఆమెని  అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు మహిళలని కూడా పట్టుకోవడం జరిగింది.  అరెస్టయిన నటి నేపథ్యాన్ని పరిశీలిస్తే  ఇప్పటివరకు దాదాపు 10 హిందీ వెబ్‌సిరీస్‌లు, మూడు ప్రజాదరణ పొందిన భోజ్‌పురి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది. వెండితెరపై మరియు డిజిటల్ మాధ్యమాల్లో ఎంతో గ్లామరస్‌గా కనిపించే ఈ నటి, తెర వెనుక మాత్రం ఇలాంటి అక్రమ నెట్‌వర్క్‌ను నడుపుతోందని తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ దందా వెనుక జరుగుతున్న ఆర్థిక లావాదేవీల అసలు రంగు బయటపడింది. సదరు నటి ప్రతి విటుడి నుంచి  25,000 వరకు భారీ మొత్తంలో వసూలు చేసేది. ఈ మొత్తంలో  10,000 మాత్రమే పనిచేసే మహిళలకు చెల్లించి, మిగిలిన 15,000 తన కమీషన్‌. సదరు హీరోయిన్ నే స్వయంగా విచారణలో ఒప్పుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: Sardar 2: సర్దార్ 2 ఓటిటి డేట్ వచ్చేసింది. వాళ్ళకి పండగే    ప్రస్తుతం ఈ ఘటనపై శ్రీనగర్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా కేసు నమోదు చేసి  దర్యాప్తు జరుపుతున్నారు. రక్షించబడిన ఇద్దరు మహిళల వాంగ్మూలాలను పోలీసులు వివరంగా నమోదు చేసుకున్నారు. వారు ఈ వ్యభిచార కూపంలోకి ఎలా వచ్చారు, వారిని ఎవరైనా మోసం చేసి తీసుకువచ్చారా అనే కోణాల్లో విచారణ సాగుతోంది. అంతేకాకుండా, అరెస్టయిన నటి బ్యాంక్ ఖాతాలు, ఆర్థిక లావాదేవీలు మరియు ఫోన్ కాల్ డేటాను విశ్లేషిస్తూ, ఈ రాకెట్ వెనుక ఇంకా పెద్ద స్థాయి వ్యక్తులు లేదా అంతరాష్ట్ర నెట్‌వర్క్ ఏదైనా ఉందా అనే కోణంలో పోలీసు అధికారులు తమ దర్యాప్తుకి పదును పెట్టారు.   [Actress Arrested Prostitution Racket Thane, actress arrested, prostitution racket bust, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
ఆర్జీవీ హీరోయిన్ అనైకా సోటి పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్, సోషల్ మీడియాలో ‘టెడ్ ది స్టోనర్’గా గుర్తింపు తెచ్చుకున్న జితేంద్ర శర్మను ఆమె వివాహం చేసుకున్నారు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట తాజాగా తమ బంధాన్ని పెళ్లితో మరో అడుగు ముందుకు తీసుకెళ్లారు. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి ఇప్పుడు వైరల్‌గా మారాయి. తమ ప్రేమ ప్రయాణం గురించి అనైకా సోటి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ముందుగా స్నేహితులుగా మొదలైన తమ పరిచయం ఆ తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్‌గా మారిందని, క్రమంగా ప్రేమలో పడ్డామని ఆమె తెలిపారు. దాదాపు ఆరేళ్లుగా కలిసి ఎన్నో మధురమైన జ్ఞాపకాలు, సంతోషాలు, త్యాగాలు, ప్రేమను పంచుకున్నామని పేర్కొన్నారు. ఇప్పుడు తమ బంధాన్ని శాశ్వతంగా మార్చుకున్నామని చెప్పడంతో అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక అనైకా సోటి సినీ కెరీర్ విషయానికి వస్తే.. వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘సత్య 2’ సినిమాతో ఆమె హీరోయిన్‌గా పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే తన గ్లామర్‌తో యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఆ తర్వాత ఆర్జీవీ దర్శకత్వంలోనే ‘365 డేస్’ చిత్రంలో నటించారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసినప్పటికీ అనుకున్న స్థాయిలో అవకాశాలు దక్కలేదు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న అనైకా.. ఇప్పుడు పెళ్లి తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించారు. జితేంద్ర శర్మతో కలిసి దిగిన వెడ్డింగ్ ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకోవడంతో అవి నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ సందర్భంగా నూతన దంపతులకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.     [Anaika Soti Marriage, Anaika Soti Wedding, Anaika Soti Husband, Jitendra Sharma, Ted The Stoner, Anaika Soti Wedding Photos, RGV Heroine Marriage, Satya 2 Actress Anaika Soti]
Karthik Subbaraj’s Dorothy has become a talking point after its theatrical release, particularly over the film’s climax and its LGBTQ themes. While the film has received appreciation from several quarters, the climax has also triggered criticism, with some viewers questioning the sudden shift in the relationship between the two lead characters. Responding to the discussion, Karthik Subbaraj has now explained what he intended with the ending. The director said that a “new girl” is born in the climax and insisted that the sequence should not be viewed through an LGBTQ lens. According to him, after the transformation, Rishikanth’s character falls in love with Sananth’s character, and the emotional transition is what the film wanted to explore. Karthik further pointed to Thiruchitrambalam as an example, saying audiences have already seen how a friendship can gradually turn into love. He revealed that he was clear from the beginning that this particular climax was how Dorothy needed to end. The filmmaker’s explanation has now added another layer to the debate surrounding the film, with audiences interpreting the climax in different ways. Dorothy, starring Keerthy Suresh, Sananth and Rishikanth, is set in the 1990s and explores friendship, identity, masculinity and social divisions. The film premiered at the Toronto International Film Festival before its theatrical release, and the mixed response has kept the film in discussion. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
‘కచ్చి సేరా’తో ఒక్కసారిగా సౌత్ ఇండియాలో సెన్సేషన్‌గా మారిన మ్యూజిక్ కంపోజర్ సాయి అభ్యంకర్.. ఆ తర్వాత వరుసగా భారీ ప్రాజెక్టులు సైన్ చేస్తూ దూసుకెళ్తున్నారు. సూర్య ‘కరుప్పు’ నుంచి అల్లు అర్జున్-అట్లీ ‘రాకా’ వరకు వరుస ఆఫర్లు అందుకున్నారు. అయితే ఇంత క్రేజ్ వచ్చినా.. సాయి అభ్యంకర్ ఇప్పటివరకు తెలుగులో మరో సినిమా ఎందుకు సైన్ చేయలేదనే ప్రశ్న చాలామందిలో ఉంది. దీనికి ఇప్పుడు ఓ ఆసక్తికరమైన కారణం సోషల్ మీడియాలో చర్చకు వచ్చింది. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’తోనే సాయి అభ్యంకర్ తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా కంటే ముందుగా విడుదలయ్యే మరో తెలుగు సినిమాకు ఆయన మ్యూజిక్ చేయకుండా ఒప్పందంలో ఓ క్లాజ్ పెట్టారనే ప్రచారం జరుగుతోంది. అంటే ‘రాకా’ రిలీజ్ అయ్యే వరకు మరో తెలుగు ప్రాజెక్ట్‌ను సాయి చేయకూడదనే కండిషన్ ఉందన్నమాట.  2024లో ‘కచ్చి సేరా’తో భారీ పాపులారిటీ సంపాదించిన సాయి కెరీర్‌.. ఆ తర్వాత ‘ఆస కుడా’, ‘సితిర పుతిరి’, ‘విజి వీకురా’, ‘పవళ మల్లి’ వంటి ఇండిపెండెంట్ సాంగ్స్‌తో తన క్రేజ్‌ను మరింత పెంచుకున్నారు. ఆయన పాటలు వందల మిలియన్ల వ్యూస్ సాధించడంతో చాలా తక్కువ సమయంలోనే మ్యూజిక్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల విషయానికి వస్తే.. మలయాళంలో ‘బాల్టీ’, తమిళంలో ‘డ్యూడ్’తో ఆయన ఫిల్మ్ కంపోజర్‌గా ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత సూర్య నటించిన ‘కరుప్పు’, ‘రాకా’తో పాటు పలు క్రేజీ సినిమాలకు సంగీతం అందిస్తున్నారు. ఇది కూడా చదవండి: 'ఉరికే చిలకా' పాట అసలైన అర్ధం తెలిస్తే కన్నీళ్ళు ఆగవు.!       [Sai Abhyankkar Telugu Debut, Sai Abhyankkar Telugu Movies, Sai Abhyankkar Songs, Raaka Movie, Allu Arjun Atlee Movie, Allu Arjun, Director Atlee, Telugu Film News, Telugu News]
    తమిళ, తెలుగు నాట సమానమైన క్రేజ్ సంపాదించాడు కార్తీ. ఈ నెల 10 న సెల్యులాయిడ్ పై అడుగుపెట్టాడు. కానీ ఎప్పటిలాగానే పరాజయం నా సినీ హక్కు అని చాలా బలంగానే చాటి చెప్పాడు.  తాజా సమాచారం ప్రకారం, 'సర్దార్ 2'  అక్టోబర్ 1 నుంచి ఓటీటీ లో  స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి అధికారప్రకటన వచ్చింది.సాధారణంగా ప్రతి పెద్ద సినిమా థియేటర్లలో విడుదలైన 4 నుంచి 6 వారాల తర్వాత ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుంది. కానీ నెలరోజుల లోపే  స్ట్రీమింగ్ కి వస్తుండటం గమనార్హం. ఇది కూడా చదవండి: రకుల్ ప్రీత్ సింగ్ పై సంచలన ఆరోపణలు: ఆ ఇద్దరు ప్రముఖులపై కూడా! పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో 2022 లో వచ్చిన సర్దార్ కి సిక్వెల్ గా సర్దార్ 2 వచ్చింది. కార్తీ ద్విపాత్రాభినయం చేయగా, ప్రముఖ నటుడు ఎస్.జె. సూర్య, మాళవిక  మోహనన్, ఆషికా రంగనాథ్, రజీషా విజయన్ ముఖ్య పాత్రల్లో మెరిసారు. పక్కా స్పై యాక్షన్ థ్రిల్లర్.      [Sardar 2 Ott Release Date,  Sardar 2 OTT Date, Karthi Sardar 2 Movie, Malavika Mohan, Ashika Ranganath, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]  
అమెరికాలో స్థిరపడిన తెలుగు అమ్మాయి వారాహి మల్లిపాముల. విదేశాలు వెళ్ళినా సరే మనసంతా ఇండియాపై, సినిమాపై ఉంది. సినిమాలపై ఇష్టంతో రచయితగా, నటిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. తల్లి శ్రీదేవి మల్లిపాములతో కలిసి వారాహి నిర్మించిన ఇండియన్ ఇంటర్నేషనల్ సినిమా 'ఇంప్యూర్'. ఈ చిత్రానికి ఆమె కథ అందించడంతో పాటు ఓ ప్రధాన పాత్రలో నటించారు. నిశాంతి ఇవని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యష్న, వారాహి, సాయి కృష్ణ ప్రధాన తారాగణం. ఇటీవల జరిగిన 'ఇంప్యూర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ నందినీ రెడ్డి అటెండ్ అయ్యారు. అక్టోబర్ 2న థియేటర్లలో సినిమా విడుదల అవుతోంది. ఇటీవల విడుదలైన 'ఇంప్యూర్' ట్రైలర్, 'ఓఎంజీ' (ఓ మై గాడ్) పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. 'ఓఎంజీ' సాంగ్ ప్రత్యేకత ఏమిటంటే... తెలుగు మూలాలు ఉన్న అమెరికన్ ర్యాపర్, సింగర్ రాజ కుమారి పాడటం. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ 'జవాన్' టైటిల్ ట్రాక్ పాడినది ఆవిడే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమాలోని 'ధోప్...' కూడా పాడారు. ఇక... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ'లో 'ఫైర్ స్ట్రోమ్' అయితే ఛార్ట్ బస్టర్ అయ్యింది. 'ఓజీ' సాంగ్ తర్వాత తెలుగులో రాజ కుమారి పాడిన పాట 'ఇంప్యూర్'లో 'ఓఎంజీ' కావడం విశేషం. ఈ పాటకు తెలుగు లిరిక్స్ కడలి సత్యనారాయణ అందించారు. ఈ సినిమాతో రాజ కుమారి సంగీత దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఈ పాటతో పాటు మరొక పాటను పాడటమే కాదు... సినిమాలో ప్రత్యేక అతిథి పాత్రలో ఆమె నటించించారని నిర్మాత శ్రీదేవి మల్లిపాముల తెలిపారు. 'ఇంప్యూర్' సినిమా గురించి నిర్మాత శ్రీదేవి మల్లిపాముల మాట్లాడుతూ... ''కాలంతో పాటు సమాజంలో మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులను చూపిస్తూ మోడ్రన్ రిలేషన్షిప్స్ మీద తీసిన చిత్రమిది. మహిళలను సమాజం చూసే కోణాన్ని సున్నితంగా ప్రశ్నిస్తుంది. మానవ సంబంధాల నేపథ్యంలో, మోడ్రన్ జనరేషన్ - అంతకు ముందు తరం మధ్య ఎటువంటి అనుబంధం ఉండాలనేది చెబుతూ తీసిన చిత్రమిది. జెన్ జి మాత్రమే కాదు... అన్ని వయసుల వాళ్ళను, అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే చిత్రమిది'' అని చెప్పారు.  యష్న, వారాహి, సాయి కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఇంప్యూర్' సినిమాలో రాజకుమారి ప్రత్యేక పాత్రలో నటించారు. అభిజీత్, కిరీటి దామరాజు, ఆర్జే కాజల్, శ్రీవాణి ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి స్టోరీ: వారాహి మల్లిపాముల, ఎడిటర్స్: అశుతోష్ మతేల, రామకృష్ణ ఆరమ్, ఒరిజినల్ స్కోర్: కరణ్ పాండవ్ & నిర్వాణ్ ఆత్రేయ, సినిమాటోగ్రాఫర్: జ్ఞానశేఖర్ వీఎస్, మ్యూజిక్ డైరెక్టర్: రాజ కుమారి & కరణ్ పాండవ్, ప్రొడ్యూసర్స్: వారాహి మల్లిపాముల & శ్రీదేవి మల్లిపాముల, డైరెక్టర్: నిశాంతి ఇవని.       [telugu movie impure, rajakumari as music director with impure, telugu cinema latest updates, telugu movie latest news]
Raja Kumari is a highly sought after popular rapper who made a name for herself Internationally. The US-based singer crooned songs like Jawan, Firestorm from They call him OG, making her superlatively popular in India too. Now, she crooned and composed OMG, wedding song, for Indian International movie, Impure.  The movie talks about how times are changing and purity cannot be judged using old age terms and beliefs. It also showcases how making a connection, fulfilling dreams and passion can be devastating. Directed by Nishanthi Ivani, the film stars Sai Krishna, Yashna, and Abhijith in the lead roles. It is produced by Varahi Mallipamula and Sridevi Mallipamula.  Successful director Nandhini Reddy attended the pre-release event of the film wished the mother-daughter duo, who are producing the film, a grand debut. Interestingly, the movie is made with desi technicians and cast in English. The movie trailer promises a bold and interesting take on the social aspects in today's age.  Raja Kumari composed the wedding song, OMG with Karan Pandav and the ong becomes important in this context as the movie delivers a satire on how premodial thought process is still prevailing among everyone. She did appear on screen with producer Varahi in the music video. Impure is releasing on 2nd October in theatres. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
తమిళ సినీ చరిత్రలో నటుడిగా, ఆ తర్వాత రాజకీయ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎం.జి. రామచంద్రన్‌ జీవిత కథ ఇప్పుడు వెండితెరపైకి రాబోతోంది. ఆయన జీవితాన్ని ఆధారంగా చేసుకుని పూర్తి స్థాయి బయోపిక్‌ తెరకెక్కించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ‘పురట్చి తలైవర్ ఎం.జి.ఆర్’ అనే టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుండటం విశేషం. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి అక్టోబర్ 17న షూటింగ్ ప్రారంభించనున్నారు.  ఈ సినిమాలో ఎం.జి.ఆర్ పాత్రను నటుడు జె.ఎం. బషీర్ పోషించనున్నారు. గతంలో ‘నేషనల్ లీడర్’ అనే చిత్రంలో పసుంపొన్ ముత్తురామలింగ దేవర్ పాత్రలో నటించిన ఆయన.. ఇప్పుడు ఏకంగా ఎం.జి.ఆర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఎం.జి.ఆర్ గెటప్‌లో బషీర్‌కు సంబంధించిన ఫొటోలు సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.  ఇదిలా ఉంటే.. ఈ బయోపిక్‌ను కేవలం ఎం.జి.ఆర్ సినీ జీవితానికే పరిమితం చేయకుండా, ఆయన జీవితంలోని వివిధ దశలను చూపించేలా తెరకెక్కించనున్నట్లు సమాచారం. నాటక రంగం నుంచి ఆయన కళా ప్రయాణం ఎలా మొదలైంది? ఆ తర్వాత సినిమాల్లో కథానాయకుడిగా ఎలా ఎదిగారు? ప్రజల్లో ఆయనకు వచ్చిన ప్రత్యేక గుర్తింపు ఏంటి? వంటి అంశాలకు సినిమాలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎం.జి.ఆర్‌తో సన్నిహితంగా పనిచేసినవారు, కుటుంబ సభ్యులు, రాజకీయ సహచరులు, ప్రభుత్వ అధికారులు, సహ నటీనటులు, సినీ ప్రముఖులు పంచుకున్న అనుభవాలను కూడా ఈ కథలో భాగం చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. దీంతో ఎం.జి.ఆర్ జీవితంలోని తెరపై కనిపించని మరిన్ని కోణాలను కూడా ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది.  ఎం.జి.ఆర్ తమిళ సినిమాల్లో అగ్ర కథానాయకుడిగా ఎదిగి, అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన నటించిన సినిమాలు, ప్రజా జీవితంలో ఆయనకు ఏర్పడిన గుర్తింపు ఇప్పటికీ తమిళనాడు సంస్కృతి, సినీ చరిత్రలో ప్రస్తావనకు వస్తూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆయన జీవితాన్ని పూర్తి స్థాయి బయోపిక్‌గా తెరపైకి తీసుకురావడం సహజంగానే ఆసక్తిని కలిగిస్తోంది.  మొత్తంగా.. ‘పురట్చి తలైవర్ ఎం.జి.ఆర్’ సినిమాతో ఎం.జి.ఆర్ జీవితంలోని కీలక ఘట్టాలను వెండితెరపై ఎలా ఆవిష్కరిస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అక్టోబర్ 17న రామావరం గార్డెన్స్‌లో షూటింగ్ ప్రారంభించనున్నట్లు తాజా సమాచారం.     [MGR Biopic, MGR Biopic Movie, Puratchi Thalaivar MGR, MGR Life Story, MGR Biography Movie, JM Bashir MGR, MGR Biopic Tamil Movie, MGR Movies, MGR Latest News, Tamil Cinema News, MGR Life Story Movie]
  ఇంకో రెండు సినిమాలు చేస్తే చాలు అగ్ర హీరోయిన్ అనే టాగ్ లైన్ తన దగ్గర చేరుతుందనంగా రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ కి జంప్ అయ్యింది.  రీసెంట్ గా రకుల్ తో పాటు ప్రముఖ నిర్మాత  వాసు భగ్నానీ,  బడా నిర్మాణ సంస్థ  ‘పానోరమ స్టూడియోస్’ ప్రతినిధులే లక్ష్యంగా ముంబై ఐటీ అధికారులు ఆకస్మిక తనిఖీలకు దిగారు.  ముంబై నగరంతో పాటు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఏకకాలంలో దాదాపు 12 కీలక ప్రదేశాల్లో ప్రత్యేక ఐటీ బృందాలు ఈ దాడులు నిర్వహిస్తుండటం విశేషం. ఈ సోదాల వార్త బయటకు రావడంతోనే బాలీవుడ్ సహా టాలీవుడ్ వర్గాల్లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఐటీ అధికారులు ఉదయం నుంచే అన్ని రికార్డులు, బ్యాంక్ ఖాతాలు, డిజిటల్ డేటాను నిశితంగా పరిశీలిస్తున్నారని ప్రాథమిక వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.   సినీ పరిశ్రమలో భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణం, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ హక్కుల విక్రయం, సినిమా ప్రొడక్షన్ వ్యయాల పేరుతో నిధులను చట్టవిరుద్ధంగా విదేశాలకు తరలిస్తున్నారనే పక్కా సమాచారంతోనే ఈ ఐటీ సోదాలు ప్రారంభమయ్యాయి. విదేశాల్లో చేసే ఖర్చుల సాకుతో  కోట్లలో పన్నుల అవకతవకలకు పాల్పడ్డారని, ఆర్థిక నిబంధనలను ఉల్లంఘించి భారీగా హవాలా మార్గాల్లో నగదు బదిలీలు జరిగాయని దర్యాప్తు సంస్థలు బలంగా అనుమానిస్తున్నాయి. ఇది కూడా చదవండి: ప్రముఖ బుల్లితెర నటి ఆత్మహత్య: అసలు నిజం ఇదేనా!      ఈ ఐటీ దాడులు కేవలం ఒకే సంస్థకు పరిమితం కాకుండా 12 వేర్వేరు చోట్ల ఒకే సమయంలో జరుగుతుండటం వల్ల సినీ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. విదేశీ షెడ్యూళ్ల పేరుతో నిధుల మళ్లింపు ప్రక్రియలో పెద్ద ఎత్తున పన్ను ఎగవేత జరిగినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, అధికారులు కీలక పత్రాలు, లావాదేవీలకు సంబంధించిన హార్డ్ డిస్కులు మరియు నిధుల రికార్డులను స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించి రాబోయే రోజుల్లో సంచలనాత్మక వివరాలు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.   [Rakul Preet Singh Faced Income Tax Raid, Rakul Preet Singh latest News, Rakul Preet singh, Panorama Studios IT Search, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
Puri Jagannadh’s Slum Dog: 33 Temple Road has been creating curiosity with its intense promotional material, but the latest glimpse shifts the focus from the film’s action to its emotional world. The makers unveiled the glimpse of veteran actress Zarina Wahab as Zubeidaa on the occasion of Puri’s birthday. Zubeidaa is introduced through a disturbing episode from her past. At a railway station, she reaches a point where she decides to end her life, only to be stopped by something far more basic — hunger. With no other option, she begins begging to survive. The sequence captures the desperation of a woman pushed to the absolute edge, making the character’s backstory immediately impactful. The scene also hints at the emotional foundation of Slum Dog: 33 Temple Road. Rather than presenting poverty merely as a backdrop, Puri uses Zubeidaa’s situation to establish the human struggle at the heart of the story. Zarina Wahab’s restrained performance gives the episode considerable weight and adds another layer to the film beyond its action-driven premise. Vijay Sethupathi leads the film, with Samyuktha as the female lead, while Tabu and Duniya Vijay play prominent roles. Produced by JB Narayan Rao, Puri Jagannadh and Charmme Kaur, Slum Dog: 33 Temple Road is gearing up for a pan-India release in Telugu, Tamil, Kannada, Malayalam and Hindi. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మానవ జీవితంలో విజయం సాధించాలన్నా, సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్నా తెలివితేటలు ఎంత ముఖ్యమో, మన ఆలోచనలు , అలవాట్లు కూడా అంతే ముఖ్యం. కొన్నిసార్లు ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ, రోజువారీ జీవితంలో చేసే కొన్ని పొరపాట్లు లేదా ప్రతికూల ఆలోచనలు, అలవాట్ల వల్ల మనుషులు వెనకబడిపోతుంటారు. ఆలోచనా విధానంలో లోపాలు, సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం , ప్రవర్తనలో వివేకం లేకపోవడం వంటివి మనిషి ఎదుగుదలకు పెద్ద అవరోధాలుగా మారతాయి. జీవితంలో ప్రశాంతతను, సాధించిన అభివృద్ధిని కాపాడుకోవాలంటే మన ప్రవర్తనను మనం నిరంతరం సమీక్షించుకోవడం చాలా అవసరం. మానసిక పరిణతి లేకపోవడం వల్ల సాధారణంగా కనిపించే కొన్ని చెడ్డ అలవాట్లు , వాటి ప్రభావం గురించి  వివరంగా తెలుసుకుంటే..  గుడ్డిగా అందరిని  నమ్మేయడం.. సమాజంలో రకరకాల స్వభావాలు కలిగిన వ్యక్తులు ఉంటారు. ఎవరి నిజస్వరూపం ఏమిటో, వారి ఉద్దేశాలు ఎలాంటివో పూర్తిగా తెలుసుకోకుండా, ఒకరిని అతిగా నమ్మడం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన మానసిక వేదనను, నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరినైనా నమ్మే ముందు వారి ప్రవర్తనను, నిజాయితీని గమనించడం వివేకవంతమైన లక్షణం. డబ్బు, విజయం దక్కగానే గర్వపడటం... ఆర్థికంగా చిన్నపాటి ఎదుగుదల కనిపించగానే విర్రవీగడం లేదా ఇతరులను తక్కువగా చూడటం వల్ల మనుషుల మధ్య సంబంధాలు దెబ్బతింటాయి. నిజమైన విజేతలు ఎప్పుడూ ఒద్దికగా, వినయంతో ఉంటారు. సంపాదన పెరిగినప్పుడు సంస్కారం కూడా పెరిగితేనే ఆ ధనానికి, హోదాకు విలువ ఉంటుంది. సొంత పనులను పక్కన పెట్టి ఇతరుల పనుల్లో  జోక్యం.. మన జీవితాన్ని మనం చక్కదిద్దుకోవడం మొదటి ప్రాధాన్యత కావాలి. మన లక్ష్యాలను, వ్యక్తిగత పనులను నిర్లక్ష్యం చేస్తూ ఇతరుల విషయాలలో అనవసరంగా సమయాన్ని వృథా చేయడం వల్ల చివరికి మనకే నష్టం జరుగుతుంది. ప్లానింగ్ వేసి ఆచరించకపోవడం..  అది చేయాలి, ఇది సాధించాలి అని పెద్ద పెద్ద ప్లాన్లు వేయడం, కానీ వాటిని అమలు చేయడానికి ఎటువంటి ప్రయత్నం చేయకపోవడం వల్ల ప్రయోజనం ఉండదు. కేవలం ఆలోచనలకే సమయాన్ని కేటాయించి, ఆచరణలో ఏమీ చేయకపోవడం వ్యక్తిగత ఎదుగుదలను పూర్తిగా అడ్డుకుంటుంది. ఏ చిన్న పనైనా ఆచరణలో పెట్టినప్పుడే దానికి ఫలితం లభిస్తుంది.  ఆడంబరాలకు, సోకుల కోసం  డబ్బును వృథా చేయడం..  సమాజంలో గొప్పలు ప్రదర్శించడం కోసం, లేని ఆడంబరాల కోసం డబ్బులు  దుర్వినియోగం చేయడం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. పొదుపు , సరైన ఆర్థిక నిర్వహణ లేకపోవడం వల్ల మనిషి నిరంతరం ఒత్తిడికి గురవుతాడు. పైన చెప్పుకున్న అలవాట్లు మనిషి  లో ఆలోచన లేనితనానికి అద్దం పడతాయి. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే కేవలం చదువు, తెలివితేటలు మాత్రమే సరిపోవు, మన ప్రవర్తనను సరిదిద్దుకోవడం, సమయాన్ని ఆదా చేసుకోవడం, ఆర్థిక విషయాల గురించి తెలుసుకుని, అవగాహన పెంచుకోవడం, మంచి ఆలోచనా విధానాన్ని అలవరచుకోవడం ఎంతగానో అవసరం. మనలో ఉన్న ఇటువంటి చిన్న చిన్న లోపాలను గుర్తించి తీర్చిదిద్దుకున్నప్పుడే జీవితంలో స్థిరమైన ప్రశాంతత, విజయం సాధ్యమవుతాయి.                   *రూపశ్రీ.  
మన భారతీయ వంటగదిలోని మసాలా దినుసులలో లవంగానికి (Clove) అత్యంత ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సాధారణంగా వంటలలో సువాసన, రుచి కోసం వాడే ఈ చిన్న లవంగం కేవలం మసాలా దినుసు మాత్రమే కాదు, అద్భుతమైన ఆయుర్వేద మూలికా నిధి. ప్రాచీన కాలం నుండి మన పెద్దలు లవంగాన్ని రకరకాల ఆరోగ్య సమస్యల నివారణకు ఒక శక్తివంతమైన నివారణిగా ఉపయోగిస్తున్నారు. ఆధునిక పోషకాహార నిపుణులు మరియు వైద్య పరిశోధనల ప్రకారం ప్రతీ రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒకే ఒక్క లవంగాన్ని నమిలి తినడం లేదా దానిని నీటితో తీసుకోవడం వల్ల శరీరంలో ఆశ్చర్యకరమైన ఆరోగ్యకర మార్పులు చోటుచేసుకుంటాయి. మన జీర్ణవ్యవస్థను శక్తివంతం చేయడం నుండి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు ఇది ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. లవంగంలో ఉండే అత్యంత క్రియాశీలక కాంపౌండ్  యూజినాల్  (Eugenol). ఇది ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా మరియు యాంటీబ్యాక్టీరియల్ మూలకంగా పనిచేస్తుంది. ప్రతిరోజూ ఉదయాన్నే ఒక లవంగాన్ని పరగడుపున నమిలి నమలడం వల్ల నోటిలోని హానికర బ్యాక్టీరియా నశించిపోతుంది. లవంగంలో ఉండే సహజ నూనెలు చిగుళ్ల వాపును, పంటి నొప్పిని మరియు నోటి దుర్వాసనను తక్షణమే నివారిస్తాయి. అంతేకాకుండా, ఇది నోటిలోని లాలాజల గ్రంథులను ప్రేరేపించి, జీర్ణరసాల ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా ఉదయాన్నే మన జీర్ణవ్యవస్థ వేగవంతమై, తిన్న ఆహారం సులభంగా అరగడానికి నాంది పలుకుతుంది. జీర్ణకోశ సమస్యలతో బాధపడేవారికి పరగడుపున లవంగం తినడం ఒక గొప్ప వరంగా మారుతుంది. లవంగంలో ఉండే పీచు పదార్థం మరియు ఎంజైములు కడుపులో గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం మరియు మలబద్ధకం వంటి సమస్యలను సమర్థవంతంగా అరికడతాయి. కడుపులోని అల్సర్లను కలిగించే హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకోవడంలో లవంగం కీలక పాత్ర పోషిస్తుంది. ఉదయాన్నే పరగడుపున ఒక లవంగం తీసుకోవడం వల్ల జీర్ణశక్తి బలపడటమే కాకుండా, శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్లిపోయి జీర్ణ వ్యవస్థ శుభ్రపడుతుంది. మానవ శరీరంలో రోగనిరోధక శక్తిని (Immunity) పెంపొందించడంలో లవంగం ఎంతో అద్భుతంగా తోడ్పడుతుంది. లవంగంలో విటమిన్ సి, విటమిన్ కే, మాంగనీస్ మరియు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఒక టీస్పూన్ లవంగాల పొడి నుండి మన శరీరానికి రోజువారీ కావలసిన మాంగనీస్ అవసరాలలో దాదాపు 55 శాతం లభిస్తుంది. మాంగనీస్ మెదడు పనితీరుకు, ఎముకల బలానికి ఎంతో అవసరం. క్రమం తప్పకుండా ఉదయాన్నే లవంగం తినడం వల్ల రక్తంలో తెల్ల రక్త కణాల సంఖ్య పెరిగి, కాలగుణంగా వచ్చే సర్ది, దగ్గు, గొంతు నొప్పి మరియు ఇన్ఫెక్షన్ల నుండి శరీరానికి బలమైన రక్షణ కవచం లభిస్తుంది. అంతేకాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలను (Blood Sugar Levels) సమతుల్యం చేయడంలో మరియు కాలేయం (Liver) ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో లవంగం సమర్థవంతంగా పనిచేస్తుందని శాస్త్రీయ అధ్యయనాలు నిరూపించాయి. లవంగంలో ఉండే కాంపౌండ్లు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి, కణాలు గ్లూకోజ్‌ను త్వరగా గ్రహించేలా చేస్తాయి. దీనివల్ల టైప్ 2 మధుమేహంతో బాధపడేవారికి రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అలాగే శరీరం యొక్క జీవక్రియ రేటు (Metabolism) పుంజుకుని అదనపు కొవ్వు కరగడానికి సహకరిస్తుంది. రోజుకో లవంగం పరగడుపున తినే చిన్న అలవాటును మన జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యాన్ని, అమితమైన ఉత్సాహాన్ని సులభంగా పొందే వీలుంది.     [ Clove, Clove Benefits, Eugenol, Oral Health, Dental Health, Digestive Health, Immunity, Antioxidants, Blood Sugar, Liver Health ]
మన ఆహార అలవాట్లలో అత్యంత సులభంగా లభించే అద్భుతమైన పండ్లలో బొప్పాయి (Papaya) ఒకటి. ప్రకృతి మనకిచ్చిన ఒక గొప్ప అమృతంగా దీనిని చెప్పుకోవచ్చు. చాలామంది దీనిని సాధారణ పండుగానే భావిస్తుంటారు, కానీ ప్రతీ రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక కప్పు బొప్పాయి ముక్కలను తినడం వల్ల మన ఆరోగ్యానికి చేకూరే మేలు అంతా ఇంతా కాదు. ఆధునిక వైద్య పరిశోధనలు మరియు పోషకాహార నిపుణుల ప్రకారం బొప్పాయిని ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం వల్ల శరీరంలో ఎన్నో ఆశ్చర్యకరమైన ఆరోగ్యకర మార్పులు చోటుచేసుకుంటాయి. మన జీర్ణవ్యవస్థను వేగవంతం చేయడం నుండి రోగనిరోధక శక్తిని పెంచడం మరియు గుండె ఆరోగ్యాన్ని పరిరక్షించడం వరకు బొప్పాయి ఎంతో శక్తివంతమైన మూలకంగా పనిచేస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో బొప్పాయికి సాటి మరొకటి లేదు. బొప్పాయిలో  పాపైన్  (Papain) అనే ప్రత్యేకమైన డైజెస్టివ్ ఎంజైమ్ సమృద్ధిగా ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారంలోని ప్రొటీన్లను త్వరగా విచ్ఛిన్నం చేసి జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ఒక కప్పు బొప్పాయిలో దాదాపు 3 గ్రాముల పీచు పదార్థం (ఫైబర్) మరియు సుమారు 88 శాతం నీటి శాతం ఉంటాయి. ఉదయాన్నే పరగడుపున దీనిని తినడం వల్ల ప్రేగుల కదలికలు సులభతరమై మలబద్ధకం, గ్యాస్, కడుపు ఉబ్బరం మరియు ఎసిడిటీ వంటి తీవ్రమైన సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. జీర్ణకోశాన్ని శుభ్రపరచి, పేగుల్లోని వ్యర్థాలను బయటకు పంపడంలో ఇది ఒక అద్భుతమైన నేచురల్ డిటాక్స్ డ్రింక్‌లా పనిచేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని (Immunity) కొండంత పెంచడంలో బొప్పాయి ఎంతో నమ్మకమైనది. ఒక సాధారణ బొప్పాయి పండులో మన శరీరానికి రోజువారీ కావలసిన విటమిన్ సి అవసరాల కంటే దాదాపు 200 శాతం కంటే ఎక్కువ విటమిన్ సి లభిస్తుంది. ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపించి, కాలగుణంగా వచ్చే సర్ది, దగ్గు, జ్వరం మరియు రకరకాల ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. దీనికి తోడు ఇందులో లభించే విటమిన్ ఏ, విటమిన్ ఈ మరియు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరంలో కణాల క్షీణతను అరికట్టి, నిత్యం ఉత్సాహంగా ఉండేలా చూస్తాయి. గుండె ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో కూడా బొప్పాయి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్, పొటాషియం మరియు విటమిన్లు రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా నిరోధిస్తాయి. బొప్పాయిలో ఉండే లైకోపీన్ మరియు విటమిన్ సి గుండెకు రక్షణగా నిలిచి, చెడు కొలెస్ట్రాల్ (LDL) ఆక్సీకరణ చెందకుండా చూస్తాయి. తద్వారా హృద్రోగాలు, హై బీపీ మరియు గుండెపోటు ముప్పు గణనీయంగా తగ్గుతుంది. అంతేకాకుండా, బొప్పాయిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఒక కప్పు బొప్పాయి ముక్కల్లో కేవలం 60 కేలరీలు మాత్రమే ఉంటాయి, కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి మరియు మధుమేహం ఉన్నవారికి ఇది ఎంతో అనుకూలమైన పండు. రోజూ ఉదయం బొప్పాయి తినే అలవాటు చేసుకోవడం ద్వారా చర్మం ప్రకాశవంతంగా మారడమే కాకుండా, పరిపూర్ణ ఆరోగ్యాన్ని సులభంగా సొంతం చేసుకోవచ్చు.     [ Papaya, Papaya Benefits, Papain Enzyme, Digestive Health, Vitamin C, Immunity, Heart Health, Lycopene, Antioxidants, Weight Management ]  
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది ఒక్క రోజులో జరిగే  పని కాదు. నేటి ఆధునిక జీవనశైలి, సరైన పోషకాహారం లేకపోవడం, శారీరక శ్రమ తగ్గడం వంటి అనేక కారణాల వల్ల చిన్న వయసులోనే గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. నివేదికల ప్రకారం మన దేశంలో సంభవిస్తున్న మరణాలలో ఎక్కువ భాగం గుండె జబ్బుల వల్లే జరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం సమస్య వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవడం కంటే, ముందే మన లైఫ్ స్టైల్ లో  కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చని ప్రముఖ వైద్యులు సూచిస్తున్నారు. వాటి గురించి వివరంగా తెలుసుకుంటే.. చురుగ్గా ఉండటం..  బాగా  వర్కవుట్లు చేయలేకపోయినా, రోజూ కొంత సమయం నడవడాన్ని అలవాటు చేసుకోవాలి. రోజంతా ఒకే చోట కూర్చుని పనిచేసే వారు మధ్యమధ్యలో లేచి కాసేపు అటుఇటు తిరగడం వల్ల శరీరంలో రక్తం సరఫరా మెరుగ్గా ఉంటుంది. ఆహారం..  బరువు తగ్గడం కోసమే కాకుండా, శరీర జీవక్రియలను క్రమబద్ధీకరించే పౌష్టికాహారాన్ని ఎంచుకోవాలి. మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారం ఎంత పరిమాణంలో ఉందో, అందులో ఎలాంటి పోషకాలు ఉన్నాయో గమనించడం చాలా అవసరం. దీర్ఘకాలంలో గుండెకు మేలు చేసే బాలెన్స్డ్  ఆహారాన్ని అలవాటు చేసుకోవడం మంచిది. కండరాలను బలంగా ఉంచే వ్యాయామాలు..  వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో కండరాల సాంద్రత తగ్గుతుంది. అందుకే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లేదా కండరాలను దృఢపరిచే వ్యాయామాలు చేయడం ద్వారా రక్తపోటు అదుపులో ఉంటుందని, ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో రక్షణ ఇస్తుందని వైద్యులు చెబుతున్నారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం.. ఇప్పటి వేగవంతమైన జీవితంలో ఒత్తిడి చాలా సాధారణమైపోయింది. ఒత్తిడి గుండెపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే మనస్సును, నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచడానికి సంగీతం వినడం, ధ్యానం చేయడం, లోతైన శ్వాస తీసుకోవడం వంటివి చేయాలి. రోజులో కొంత సమయాన్ని మనస్సును తేలికపరిచే కార్యకలాపాల కోసం కేటాయించడం చాలా ఉపయోగకరం. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఏవేవో  ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. మన రోజువారీ అలవాట్లలో నడకను భాగం చేసుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని దూరం చేసుకోవడం వంటి చిన్న చిన్న మార్పుల ద్వారానే ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు.                                  *రూపశ్రీ.  
60 ఏళ్లు దాటిన తర్వాత మతిమరుపు పెరగడం సహజమేనా? కుటుంబ సభ్యుల పేర్లు లేదా బంధుత్వాలను గుర్తుపట్టలేకపోవడం, రోజువారీ పనులు చేయడంలో ఇబ్బంది పడటం వంటి మార్పులు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి సాధారణ మతిమరుపు లక్షణాలా? లేక డిమెన్షియా, అల్జీమర్స్ వంటి సమస్యలకు సంకేతాలా? ఈ వీడియోలో డాక్టర్ ప్రవీణ్ కుమార్ 60 ఏళ్ల తర్వాత కనిపించే మతిమరుపు, జ్ఞాపకశక్తి తగ్గడం, రోజువారీ పనుల్లో ఎదురయ్యే ఇబ్బందులు, అల్జీమర్స్ మరియు డిమెన్షియాకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను వివరిస్తున్నారు. జ్ఞాపకశక్తిలో మార్పులు కనిపించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వైద్యుల సలహా ఎందుకు అవసరమో కూడా తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో కొన్ని హోమియోపతి మందులు, వైద్య అనుభవాలకు సంబంధించిన విషయాలు కూడా ప్రస్తావించబడ్డాయి. అయితే మతిమరుపు, డిమెన్షియా లేదా అల్జీమర్స్ సమస్యలకు సొంతంగా మందులు వాడకుండా అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. సరైన వైద్య పరీక్షల ద్వారా సమస్యకు కారణాన్ని గుర్తించుకోవాలి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  
ఆధునిక కాలంలో ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండానే మనస్సులో ఆందోళన, భయం, ఒక రకమైన అశాంతి కలగడం చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.  బయటకు  పరిస్థితులన్నీ బాగున్నప్పటికీ, లోపల ఏదో తెలియని బెంగ మనశ్శాంతిని దూరం చేస్తుంది. దీనికి ఏదో పెద్ద సమస్యే కారణం కావాల్సిన అవసరం లేదు. మనకు తెలియకుండానే మనం పాటించే కొన్ని చిన్న చిన్న జీవనశైలి అలవాట్లే మన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ, ఆందోళనను పెంచుతాయని నిపుణులు చెప్తున్నారు. అవేంటో వివరంగా తెలుసుకుంటే.. శారీరక శ్రమ లేకపోవడం.. శారీరక శ్రమ లేకపోవడం  మనసుపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. రోజంతా ఒకే చోట కూర్చుని ఉండటం వల్ల శరీరంలో రక్తప్రసరణ మందగించడమే కాకుండా, మనస్సుకు ఉపశమనం కలిగించే హార్మోన్ల విడుదల తగ్గుతుంది. క్రమం తప్పకుండా చిన్నపాటి వ్యాయామం లేదా నడక చేయడం వల్ల మెదడులో ఎండోర్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి మూడ్‌ను మెరుగుపరుస్తాయి. శారీరక చురుకుదనం తగ్గినప్పుడు మనస్సులో నెగిటివ్ ఆలోచనలు పెరిగి ఆందోళనకు దారితీస్తాయి. సోషల్ మీడియా.. నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వినియోగం శృతిమించడం మానసిక అశాంతికి మరో ముఖ్యమైన కారణం. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు నిరంతరం ఫోన్ స్క్రీన్‌ను చూడటం, ఇతరుల జీవితాలతో మన జీవితాన్ని పోల్చుకోవడం వంటివి తెలియకుండానే ఒత్తిడిని పెంచుతాయి. డిజిటల్ స్క్రీన్ల నుంచి వచ్చే కాంతి నిద్ర లేమికి కారణమవుతుంది. సరిపడా నిద్ర లేకపోవడం వల్ల మెదడు అలసిపోయి, చిరాకు , భయాలు పెరిగే అవకాశం ఉంది. చెడు అలవాట్లు.. మద్యపానం లేదా ఇతర వ్యసనాలు తాత్కాలికంగా ఉపశమనాన్ని ఇచ్చినట్లు అనిపించినప్పటికీ, ఎక్కువ  కాలంలో అవి మానసిక ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తాయి. ఇవి నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపి, ఆందోళన తీవ్రతను మరింత పెంచుతాయి. శరీరం ఈ పదార్థాలపై ఆధారపడటం మొదలైనప్పుడు  అశాంతి మరింత తీవ్రమవుతుంది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు.. మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి రోజూ కొంత సమయం వ్యాయామానికి కేటాయించడం, సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించి నచ్చిన పనులపై దృష్టి పెట్టడం, క్రమశిక్షణతో కూడిన ఆహారపు అలవాట్లు , మంచి నిద్రను అలవర్చుకోవడం ఎంతో అవసరం. జీవనశైలిలో చేసుకునే ఈ చిన్న మార్పులు మానసిక ఒత్తిడిని తగ్గించి జీవితంలో ప్రశాంతతను నింపుతాయి.                                                                                                                                                  *రూపశ్రీ.