వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు సొంత జిల్లాలో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సొంత మనుషులే ఆయనకు, ఆయన పెద్ద దిక్కుగా ఉన్న పార్టీకీ దూరం అవుతున్నారు. ఆయన సొంత మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు వైసీపీని వీడిన సంగతి తెలిసిందే. ఇది జిల్లాలో పార్టీకే కాకుండా, వ్యక్తిగతంగా కూడా బొత్స సత్యనారాయణకు గట్టి ఎదురు దెబ్బే కాకుండా పూడ్చలేని నష్టం కూడా. అయితే ఆ తరువాత కూడా జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.  తాజాగా  మాజీ ఎమ్మెల్యే, జడ్పీ మాజీ చైర్మన్ బడ్డుకొండ అప్పలనాయుడు పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవలే ఆయనను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ వైసీపీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన తన సస్పెన్షన్ ను వ్యతిరేకిస్తూ.. వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామ చేశారు.  పార్టీ అధిష్టానం తనపై వేసిన సస్పెన్షన్ వేటుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన విస్పష్టంగా ప్రకటించారు.  సొంత పార్టీ నేతల వైఖరి, నాయకత్వ సరళిపై విమర్శలు గుప్పించిన ఆయన త్వరలో తన కార్యాచరణను ప్రకటించనున్నట్లు చెప్పారు. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా.. నేతలు పార్టీ వీడిన తరువాత, సమావేశాలు ఏర్పాటు చేసో, అసంతృప్తులను పలిపించుకునో బుజ్జగింపు చర్యలకు దిగుతుంది. పార్టీ నుంరచి వలసలు పెరగకుండా నివారణ చర్యలకు ఉపక్రమిస్తుంది. అయితే ఆశ్చర్యకరంగా వైసీపీలో అటువంటి పరిస్థితి కనిపించడం లేదు.  మజ్జి పార్టీకి రాజీనామా చేసిన తరువాత జరిగిన విజయనగరం జిల్లా వైసీపీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది, ఇప్పుుడు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన బడ్డుకొండ అప్పలనాయుడు.. అప్పుడు నాడు జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తాను వైపీలోనే కొనసాగుతానని ప్రకటించారు.  అలా ఆయన ప్రకటించిన రోజు రాత్రే పార్టీ హైకమాండ్ ఆయనను నెల్లమర్ల నియోజకవర్గ ఇన్ చార్జి బాధ్యతల నుంచి తొలగించింది.  దీనిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయనను పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫారసుల మేరకు అంటూ  పార్టీ నుంచే సస్పెండ్ చేసింది.     స్పెన్షన్ ప్రకటన వెలువడిన కొద్ది గంటలకే బడ్డుకొండ అప్పలనాయుడు విజయనగరంలో తన అనుచరులు, అభిమానులతో సమావేశం నిర్వహించి, పార్టీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను, అవమానాలను వారికి వివరించారు. గౌరవం లేని చోట తాను, తన అనుచరులు కొనసాగలేమని స్పష్టం చేస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు  ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత జగన్‌పై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. జగన్ వైసీపీని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా నడుపుతున్నారని దుయ్యబట్టారు. ఆయన నియంతృత్వ పోకడల కారణంగానే ప్రజాగ్రహానికి గురై గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నారు.  మజ్జి శ్రీను తనకు బావ అవుతారన్న ఒకే ఒక్క కారణంతో తనపై ఎలాంటి ఆధారాలు లేకుండా చర్యలు తీసుకున్నారని విమర్శించారు. అదే రీతిలో పరిశీలిస్తే మజ్జి శ్రీనుకి సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ కూడా బంధువు అవుతారని, ధైర్యం ఉంటే ఆయన్ని కూడా సస్పెండ్ చేయాలనీ సవాల్ విసిరారు.   [YCP Vizianagaram Crisis, Baddukonda Appalanaidu Resignation, Nellimarla Former MLA YCP, Vizianagaram Politics, Botsa Satyanarayana, Telugu One]
 ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల కదలికలు, అధికార పక్షం అనుసరిస్తున్న విధానాలు రాష్ట్ర రాజకీయాలను నిత్యం వేడెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్న నూతన రాజకీయ వ్యూహాలు, ఆయన అడుగులు ఏ విధంగా మారుతున్నాయనే అంశంపై రాష్ట్ర రాజకీయ విశ్లేషకులు తీవ్రంగా చర్చిస్తున్నారు. వాస్తవ వేదిక కార్యక్రమంలో తెలుగు వన్ ఎండీ కంఠమనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకులు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని పలు ఆసక్తికర అంశాలపై చర్చించారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే, ఎన్నికల ఫలితాల తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ  దాని అధినేత జగన్  తమ ఉనికిని కాపాడుకోవడానికి, ప్రజల్లో నిత్యం ఉండేందుకు వినూత్న మార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే, పార్టీ శ్రేణుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు నాయకత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తోంది. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ప్రజాక్షేత్రంలో గళం విప్పేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. మరోవైపు, ప్రభుత్వ పథకాల అమలుతీరు, ఎన్నికల హామీల వైఫల్యాలపై ప్రజలను చైతన్యవంతం చేయడమే లక్ష్యంగా వైఎస్సార్‌‌సీపీ అడుగులు వేస్తోంది. జగన్  ప్రవేశపెడుతున్న ఈ కొత్త స్కెచ్ వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉంది. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేయడం, సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, ప్రజలతో నేరుగా మమేకమయ్యే కార్యక్రమాలను రూపొందించడం ఈ వ్యూహంలో ప్రధాన భాగాలు. ఎన్నికల ఫలితాల ద్వారా వచ్చిన రాజకీయ వెనకడుగును అధిగమించడానికి, నాయకత్వ శైలిలోనూ, ప్రజా సమస్యల స్పందనలోనూ మార్పులు తీసుకువస్తున్నారు. ఈ వ్యూహం వల్ల పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నిండినప్పటికీ, అధికార పక్షం నుంచి వచ్చే ప్రతిఘటనను సమర్థవంతంగా ఎదుర్కొనే సవాలు కూడా జగన్ ఎదుట నిలిచింది. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయడం ద్వారా మళ్లీ ప్రజల్లో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని పార్టీ భావిస్తోంది. ఈ రాజకీయ పరిణామాలు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. రానున్న కాలంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉంది. జగన్ అనుసరిస్తున్న కొత్త రాజకీయ వ్యూహాలు ఫలితమిస్తే, అది రాష్ట్రంలో బలమైన ద్విముఖ పోరుకు దారితీసే అవకాశం ఉంది. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడడం ద్వారా అధికార పార్టీని ఇరుకున పెట్టడంలో ఈ వ్యూహాలు ఎంతవరకు విజయవంతమవుతాయనేది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనప్పటికీ, ఈ రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల లేదా భవిష్యత్ ఎన్నికలపై గణనీయమైన ముద్ర వేయడం ఖాయం.     [ Vasthava Vedika, Kanthamaneni Ravi Shankar, Dolendra Prasad, TOne News, Telugu one, YSJagan, CM Chandrababu, Naralokesh, YSRCP, TDP,  Telugu One, Telugu News ]
కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన ఎంపీ విజయసాయిరెడ్డి, వరుస ప్రెస్ మీట్లతో ఒకదాని వెంట ఒకటిగా సంచలన విషయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా ఆయన వైజాగ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పిన విషయాలు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన చెప్పిన విషయం, ప్రస్తావించిన అంశం, వెల్లడించిన వివరాలను అలా ఉంచితే..   పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని.  విజయసాయిరెడ్డి  కొత్త పార్టీ రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుందనేది పక్కనపెడితే..  వైసీపీ అధినేత  జగన్‌  సమావేశాల కంటే సాయిరెడ్డి ప్రెస్‌మీట్లే ప్రజల్లో ఎక్కువ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.  వివిధ అంశాలపై వైఎస్ జగన్ సుదీర్ఘంగా ప్రసంగించడమే కాకుండా, గణాంకాలు, పోలికలపైనే ఎక్కువ దృష్టిపెడుతుంటారు. దీంతో ఆయన విలేకరుల సమావేశాలు సాగదీతగా, రొడ్డకొట్టుడు ప్రసంగాలుగా మీడియా ప్రతినిథులు చెబుతుంటారు. అంతే కాకుండా జగన్ ప్రెస్ మీట్లలో గణాంకాల విషయంలో ఫ్యాక్చువల్ ఎర్రర్స్ సర్వసాధారణమి  చెబుతారు.దీంతో ఆయన మాట్లాడే విషయంలోని తప్పులు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవ్వడమే కాకుండా, జగన్ ను కూడా ట్రోల్ మెటీరియల్ గా మర్చేస్తుండటం కద్దు. అయితే అందుకు భిన్నంగా విజయసాయిరెడ్డి మీడియా సమావేశాలు రంజుగా, పసందుగా, పదునుగా, స్ట్రాటజిక్ గా సాగుతుంటాయి.  గణాంకాల జోలికి పోకుండా, ప్రజలను,  మీడియాను ఇట్టే ఆకట్టుకునే సంచలన రాజకీయ విమర్శలకు విజయసాయి ప్రాధాన్యత ఇస్తారు.   ఉదాహరణకు చెప్పాలంటే.. రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం, మత మార్పిడులు, వైసీపీలో సజ్జల ఆధిపత్యం, పార్టీలో అంతర్గతంగా ఆయన సాగిస్తున్న అరాచకం, తననే స్వయంగా కొట్టారంటూ సజ్జలపై సంచలన ఆరోపణలు,   విశాఖపట్నం వర్సెస్ మావిగున్   వంటి వాటిని ఆయన ప్రస్తావిస్తూ, ఇటు మీడియానూ, అటు ప్రజలనూ ఏకకాలంలో ఆకట్టుకోగలుగుతున్నారు. అన్నిటికీ మించి దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికీ, వైసీపీ ఆవిర్భావానికి ముందు నుంచీ జగన్ కు సన్నిహితంగా మెలిగిన విజయసాయి రెడ్డి.. ఇప్పుడు జగన్ కు వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలను సహజంగా జనం నమ్ముతున్నారు. కేవలం సంచలన వ్యాఖ్యలుగా కొట్టిపారేయకుండా, అందులో వాస్తవం ఉండే ఉంటుందన్న కోణంలో చర్చ జరుగుతోంది.  ఈ కారణంగానే జనం విజయసాయి ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతారు? ఏ సంచలన విషయాలు వెల్లడిస్తారు? అని ఆసక్తిగా చూస్తున్నారు.   [Vijayasai Reddy Jagan, AP Politics, Visakhapatnam, Press meet, YSR Congress Party, Vijayasai, New Party, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
మామూలుగానే ప్రభాస్ మూవీ,సందీప్ రెడ్డి మూవీ అంటేనే క్రేజ్ ఒక రేంజ్ లో ఉంటుంది. అలాంటిది ఇద్దరి కలిసి 'స్పిరిట్' చేస్తుంటే క్రేజ్ స్థాయి పరిస్థితి ఏ సిట్యువేషన్ ని ఎదుర్కొంటు ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.  రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్న స్పిరిట్ కి సంబంధించిన తాజా న్యూస్ సోషల్ మీడియాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది.  ప్రభాస్  పోలీసు ఆఫీసర్ క్యారక్టర్ తో పాటు, మాఫియా డాన్  షేడ్స్ ఉన్న నెగటివ్, గ్రే క్యారెక్టర్ లో దర్శనమివ్వబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, సమాజంలో సాధారణంగా గ్రే లేదా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను విలనిజంతో ముడిపెడతారు. కానీ సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ చిత్రంలో డిజైన్ చేస్తున్న ప్రభాస్ క్యారెక్టర్ లోని గ్రే షేడ్స్ వెనుక ఒక ఊహించని, బలమైన పాజిటివ్ యాంగిల్ దాగి ఉందని సమాచారం. కథా కథనాల ప్రకారం, ఒక నీతివంతమైన పోలీసు ఆఫీసర్ గా ప్రయాణం ప్రారంభించే కథానాయకుడు, సమాజంలో పేరుకుపోయిన అవినీతి, అన్యాయాలని  అంతమొందించడానికి చట్ట పరిధులని  దాటాల్సి వస్తుంది. నీతి నిజాయితీలతో మాత్రమే విజయం సాధించలేమని గ్రహించిన వేళ, దుష్టులను శిక్షించేందుకు తాను  ఒక పవర్ ఫుల్ మాఫియా డాన్  అవతారమెత్తుతాడు. బయటికి కఠినంగా, గ్రే షేడ్స్ తో కనిపించినప్పటికీ, ఆ రోల్ చేసే ప్రతి పని వెనుక సమాజ శ్రేయస్సు, ఒక గొప్ప ధర్మ పోరాటం ఉందనేదే క్యారక్టర్ లోని అసలైన పాజిటివ్ కోణం. ఇది కూడా చదవండి: సింగీతం శ్రీనివాసరావు స్పెషల్ ఏంటి!     ఏది ఏమైనా ప్రభాస్, సందీప్ రెడ్డి మూవీ కాబట్టి పైన చెప్పకున్న న్యూస్ లాంటివి వస్తూనే ఉంటాయి. అసలు నిజం మాత్రం వాళ్ళు చెప్పినప్పుడే తెలుస్తుంది. ప్రభాస్ సరసన యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి జత కడుతున్న విషయం తెలిసిందే.   [Prabhas character In Spirit Movie, Spirit Prabhas movie updates, Sandeep Reddy Vanga Prabhas film, Prabhas grey shades character Spirit, Spirit movie budget 300 crores, Prabhas cop role Spirit, Spirit film latest news,Telugu Cinema  News, Telugu cinema, Tollywood News, Tollywood]      
"ఎస్ఆర్ కళ్యాణమండపం" చిత్రంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించి దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న డైరెక్టర్ శ్రీధర్ గాదె మరో కొత్త చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్ పై ఆది సాయికుమార్ తో 'చుట్టాలబ్బాయ్' వంటి ఫ్యామిలీ మూవీ, ఆనంద్ దేవరకొండతో "హైవే" వంటి యూనిక్ థ్రిల్లర్ మూవీని నిర్మించిన ప్రొడ్యూసర్ వెంకట్ తలారి తమ ప్రొడక్షన్ నెం.3గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో "కమిటీ కుర్రోళ్లు" మూవీ ఫేమ్ ఈశ్వర్ రాచిరాజు హీరోగా నటిస్తుండగా, నందు, లిఖిత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పూజిత పొన్నాడ, సింధు కాసారం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో నర్తకి క్యారెక్టర్ లో టాలెంటెడ్ యాక్ట్రెస్ పూజిత పొన్నాడ నటిస్తున్నారు. ఈ రోజు పూజిత పొన్నాడ బర్త్ డే సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నర్తకి క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. రాజభవనంలో నర్తకిమణిగా ముస్తాభైన పూజిత పొన్నాడ లుక్ ఆకట్టుకుంటోంది. నటిగా ఆమెకు ఈ సినిమా మంచి గుర్తింపు తీసుకొస్తుందనే అంచనాలు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఏర్పడుతున్నాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే హారర్ చిత్రమిది. ఈ సినిమాను సరికొత్త కథా కథనాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడు శ్రీధర్ గాదె  తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు. ఇది కూడా చదవండి: బోయపాటి బిగ్ అనౌన్స్‌మెంట్‌.. త్వరలో 'అఖండ 3'.. చిరంజీవి, బాలయ్యతో మల్టీస్టారర్.!       [Pujita Ponnada As Narthaki, Poojitha Ponnada Birthday, Poojitha Ponnada, Pujita Ponnada, SR Kalyanamandapam Movie, Director Sridhar Gade, Telugu Movies 2026, Telugu Film News]
  తెలుగు సినిమా సగర్వంగా ఇది నా సినిమా అని చెప్పుకునే స్థాయిలో చిత్రాలని తెరక్కెక్కించిన దర్శక శిఖామణి సింగీతం శ్రీనివాసరావు. తెలుగు సినిమా కురువృద్ధుడుగా కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుత జనరేషన్ దర్శకులకి షాక్ ఇస్తూ ప్రీవియస్ మూవీ సింగ్ గీతం తో ఎంత వైవిధ్యమైన దర్శకులో మరోసారి  నిరూపించారు. మరి  సింగీతం శ్రీనివాసరావుకి కొంత మంది ఇతర దర్శకులకి ఉన్న తేడా ఏంటో చూద్దాం. తెలుగు సినీ ప్రపంచంలో ఎంతో మంది గొప్ప దర్శకులు ఉన్నారు. ఎంతో మంది బ్లాక్‌బస్టర్ హిట్లు, విజువల్ వండర్స్ అందించారు. కానీ, దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు చేసిన ప్రయోగాలు, చూపించిన వైవిధ్యం భారతీయ చిత్రసీమలోనే అత్యంత అరుదైనది. సాధారణంగా ఒక దర్శకుడు ఒక నిర్దిష్ట జానర్‌లో విజయం సాధిస్తే, జీవితాంతం ఆ తరహా కథలతోనే సేఫ్ జోన్ వెతుక్కుంటారు. మాస్ యాక్షన్, లవ్ స్టోరీలు లేదా పౌరాణిక చిత్రాలు... ఇలా ఏదో ఒక విభాగంలో స్థిరపడిపోతారు. కానీ సింగీతం శ్రీనివాసరావు గారి సినీ ప్రయాణాన్ని గమనిస్తే, ఆయనకు ఎలాంటి పరిమితులు లేవని అర్థమవుతుంది. ప్రతి సినిమాతో ఒక సరికొత్త లోకాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే ఆయన అసలు సిసలైన నైజం. ఆయన సృజనాత్మకతకు నిదర్శనం ఆయన తీసిన వైవిధ్యమైన చిత్రాలు. ఎలాంటి మాటలు లేకుండా, కేవలం నటుల అభినయం, నేపథ్య సంగీతంతో ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టిన 'పుష్పక విమానం' ఒక అద్భుతమైన ప్రయోగం. వినోదం, ఉత్కంఠను కలగలిపి సైలెంట్ సినిమాతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకోవడం సామాన్యమైన విషయం కాదు. అలాగే, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో సైన్స్ ఫిక్షన్ మూవీ తీయవచ్చని భారతీయ సినిమాకు 'ఆదిత్య 369' ద్వారా ఆనాడే పరిచయం చేశారు. 90ల కాలంలోనే భవిష్యత్తు, భూతకాలం చుట్టూ తిరిగే కథను ఇంత స్పష్టంగా, ఆహ్లాదకరంగా తెరకెక్కించడం ఆయనకే చెల్లింది. ఇది కూడా చదవండి: సర్దార్ 2 ఊచకోత రికార్డు: ఫ్యాన్స్ సంబరాలు. ఓటిటిలో ఎందుకు ఎలా! అక్కడితోనే ఆగకుండా, కమల్ హాసన్‌తో కలిసి ఆయన చేసిన ప్రయోగాలు ఇండియన్ సినిమా హిస్టరీలోనే మైలురాళ్ళుగా నిలిచాయి. 'అపూర్వ సహోదరులు' సినిమాలో పొట్టి కమల్ హాసన్ పాత్రను సృష్టించిన విధానం, ఆ రోజుల్లో అందుబాటులో ఉన్న పరిమిత సాంకేతికతతోనే 100 శాతం కచ్చితత్వంతో విజువల్ మ్యాజిక్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. 'మైఖేల్ మదన్ కామరాజు'లో నలుగురు పోలికలున్న వ్యక్తుల కామెడీ టైమింగ్, 'భామనే సత్యభామ'లో వృద్ధురాలి పాత్రలో కమల్‌ను చూపించిన తీరు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి.  ఆదిత్య 369 లో కొత్త తరహా ప్రపంచాన్ని చూపించారు. టైం ట్రావెల్ మిషన్ లో కొన్ని వందల ఏళ్ళు వెనక్కి వెళ్లడం, ముందు వెళ్లడం అనేది ఆ రోజుల్లో ఎవరి ఊహకి కూడా రాని పాయింట్. దీన్ని బట్టి ఆయన ఆలోచనల రేంజ్ క్వాలిటీని అర్ధం చేసుకోవచ్చు.  హాస్యం, సెంటిమెంట్, ప్రయోగాత్మకత... ఈ మూడింటినీ సమపాళ్లలో కలపడంలో ఆయన ఆరితేరిన మేధావి.     ఇతర దర్శకులు ఒకే తరహా విజయవంతమైన ఫార్ములా నమ్ముకుంటే, సింగీతం గారు మాత్రం ప్రతిసారీ కొత్త సాంకేతికతను, సరికొత్త కథానరేషన్‌ను నమ్ముకున్నారు. ఆయన కథనంలో సంభాషణలు ఎంత బలంగా ఉంటాయో, మౌనం కూడా అంతే ప్రతీకాత్మకంగా ఉంటుంది. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు అందరినీ ఆకట్టుకునేలా కథను తీర్చిదిద్దడమే ఆయన ప్రత్యేకత. అందుకే, కాలం మారినా ఆయన సినిమాలు నేటికీ తాజాగా, సరికొత్త అనుభూతిని ఇస్తూనే ఉంటాయి. టెక్నాలజీ లేని కాలంలోనే అత్యున్నత స్థాయి విజన్‌తో సినిమాలు తీసి, మిగిలిన దర్శకులకి మార్గదర్శకుడిగా నిలిచిన దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు.  1972 లో వచ్చిన నీతి, నిజాయితీ ఆయన తొలి మూవీ.   [Singeetam Srinivasa Rao Speciality, Singeetam Srinivasa Rao Death, Singeetam Srinivasa Rao, Singeetam vs other directors, Aditya 369 time travel, Telugu Cinema  News, Telugu cinema, Tollywood News, Tollywood]    
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే మాస్ ఆడియన్స్‌లో ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’, ‘అఖండ-2’తో ఈ కాంబినేషన్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. ఇప్పుడు ఈ కాంబోలో మరో సినిమా వస్తుందా? అనే ప్రశ్నకు బోయపాటి శ్రీను స్వయంగా క్లారిటీ ఇచ్చారు. సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బోయపాటి శ్రీను.. దర్శనం అనంతరం తన రాబోయే సినిమాల గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. తన కొత్త ప్రాజెక్ట్‌ను ఈ నెలాఖరులోగా ప్రకటించనున్నట్లు వెల్లడించారు. అయితే ఇందులో అందరి దృష్టినీ ఆకర్షించిన విషయం ‘అఖండ 3’. ‘అఖండ 3’ కూడా ఉంటుందని బోయపాటి స్పష్టం చేశారు. సరైన సమయంలో బాలకృష్ణతో కలిసి ఈ సినిమాకు సంబంధించిన వివరాలను ప్రకటిస్తామని చెప్పారు. దీంతో బాలయ్య–బోయపాటి కాంబో మరోసారి తెరపైకి రావడం ఖాయమనే విషయం క్లారిటీ వచ్చింది. ఇక బోయపాటి మరో ఆసక్తికరమైన కోరికను కూడా బయటపెట్టారు. చిరంజీవి, బాలకృష్ణలతో కలిసి మల్టీస్టారర్ సినిమా చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని చెప్పారు. అయితే ‘అఖండ 3’, చిరు-బాలయ్య మల్టీస్టారర్ వంటి సినిమాల కంటే ముందు.. ఈ నెలాఖరులోగా బోయపాటి తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించనున్నారు. అందులో హీరో ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: నాలాంటోడికి ఇదే హై మూమెంట్.. బాలయ్య, నాగార్జునతో కిరణ్ పోటీ.!       [Boyapati Srinu Big Announcement, Boyapati Srinu Next Movie, Akhanda 3 Movie, Chiranjeevi Balakrishna Multistarrer, Megastar Chiranjeevi, Nandamuri Balakrishna, Boyapati Sreenu, Telugu Film News]  
Rakul Preet Singh has broken her silence on the recent Income Tax searches in Mumbai after reports linked her name to an ongoing probe into suspected financial irregularities involving overseas transactions. The actress has strongly denied any involvement, stating that the search was not pertaining to her. Rakul said she has been paying her due taxes since the age of 20 and described herself as a responsible, law-abiding citizen. She also made it clear that she is not involved in any illegal foreign remittance, either in her personal capacity or on behalf of any production house. The actress further denied holding any benami property for anyone in India or abroad. She also stated that nobody has ever gifted her any property and that she does not accept expensive gifts as a matter of principle. Rakul criticised what she called false, malicious and speculative reports and urged those who published them to retract the reports and clarify the facts. The Income Tax Department had reportedly conducted searches at around 12 locations on September 28, including places linked to Rakul, her father-in-law and producer Vashu Bhagnani, and Panorama Studios. The probe is reportedly looking into suspected irregularities involving film financing and overseas transactions. However, no specific finding or formal charge against Rakul has been publicly announced. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.   https://www.instagram.com/p/DeGdfNeKvhl
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తూ.. తొలిసారి మెగాఫోన్ పట్టిన సినిమా ‘రియాలిటీ’. ఇంతకుముందు #KA13గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు ‘రియాలిటీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. తాజాగా మేకర్స్ టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. గ్లింప్స్ చూస్తే.. ఇందులో కిరణ్ అబ్బవరం 'ఆనందం' అనే సాధారణ మధ్యతరగతి యువకుడిగా కనిపిస్తున్నాడు. ఓ హోటల్‌ను నడుపుకుంటూ కుటుంబాన్ని చూసుకునే పాత్రలా తెలుస్తోంది. అయితే ఈ పాత్రకు సంబంధించిన అసలు హైలైట్ మాత్రం 'కుటుంబ అప్పులు తీర్చడం'. “ఈ రోజుటితో నాకు కానీ, నా కుటుంబానికి కానీ ఒక్క రూపాయి కూడా అప్పు లేదు. నాలాంటోడికి ఇంతకు మించిన హై మూమెంట్ ఏముంటుంది?” అనే డైలాగ్ గ్లింప్స్‌లో బాగా వర్కౌట్ అయ్యింది. అప్పులు తీర్చిన తర్వాత వచ్చే ఆనందాన్ని ఇంత సింపుల్‌గా చూపించడం.. మధ్యతరగతి ప్రేక్షకులకు ఈజీగా కనెక్ట్ అయ్యే పాయింట్. ఇక గ్లింప్స్‌లో పెద్ద యాక్షన్ బ్లాక్స్, భారీ ఎలివేషన్స్ కాకుండా.. రోజువారీ జీవితంలోని చిన్న చిన్న ఆనందాలను చూపించారు. కుటుంబ సభ్యులతో కలిసి వడియాలు చేసుకోవడం, ఇంట్లో సరదాగా గడపడం లాంటి సీన్లు కనిపిస్తున్నాయి. ‘రియాలిటీ’ అనే టైటిల్ కు తగ్గట్టుగానే.. సినిమా కూడా నిజ జీవితానికి దగ్గరగా ఉండే అంశాలను చూపించబోతున్నట్టుగా గ్లింప్స్‌తో హింట్ ఇచ్చారు. బ్యాక్‌గ్రౌండ్‌లో భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ కూడా ఈ ఫ్యామిలీ ఎమోషన్‌కు తగ్గట్టుగానే ఉంది. ముఖ్యంగా ‘భజ గోవిందం’ను ఉపయోగించిన విధానం గ్లింప్స్‌కు ప్రత్యేకమైన ఫీల్ తీసుకొచ్చింది. సుధాకర్ చాగంటి నిర్మిస్తున్న ఈ సినిమాలో దేవిక భట్ హీరోయిన్‌గా నటిస్తోంది. శరత్ కుమార్, సాయికుమార్, రోహిణి, అన్నపూర్ణమ్మ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ‘రియాలిటీ’కి మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. బాలకృష్ణ ‘దాదా’, నాగార్జున ‘కింగ్ 100’ సినిమాలతో పాటు ఈ సినిమా కూడా క్రిస్మస్ బరిలోకి దిగుతోంది. ఇది కూడా చదవండి: పొలిటికల్ హీట్.. రాజకీయాల్లోకి వస్తున్న మరో స్టార్ హీరో.!       [Reality Title Glimpse, Kiran Abbavaram Reality Movie, Reality Glimpse, Kiran Abbavaram, Reality Movie, Nandamuri Balakrishna, Dada Movie, Akkineni Nagrjuna, King 100 Movie, Telugu Film News]  
ఊచకోతకి అర్ధం తెలియకపోతే సర్దార్ 2 రికార్డ్స్ చూడండనే వర్డ్ ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు బిజీగా ఉంది. దీంతో సర్దార్ 2 డిజాస్టర్ అన్నారుగా, మా కార్తీ సృష్టించుకుంటూ వెళ్తున్న రికార్డ్స్ ఇవే చూడండి, ఇది ఇంతటితో ఆగదు. ఇంకా, ఇంకా పెరుగుతాయని కూడా అంటున్నారు. మరి ఆ న్యూస్ ఏంటో చూసేద్దాం.   సెప్టెంబర్ 10న థియేటర్లలోకి అడుగుపెట్టిన  సర్దార్ 2  బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా  23.85 కోట్ల గ్రాస్  వసూళ్లతో థియేట్రికల్ రన్ ముగించింది. థియేటర్ల వద్ద టికెట్ కొని చూడటానికి వెనుకాడిన ప్రేక్షకులు.. ఇప్పుడు తమ ఇళ్లలోని డిజిటల్ తెరల ముందు కూర్చొని ఈ స్పై డ్రామాను ఎగబడి చూస్తున్నారు. అక్టోబర్ 1 అర్ధరాత్రి నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' వేదికగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ అనే 5 ప్రధాన భాషల్లో స్ట్రీమింగ్ కు వచ్చింది. డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే 'సర్దార్ 2' అద్భుతమైన వ్యూవర్‌షిప్ సాధించి ప్రైమ్ వీడియోలో ఇండియా వైడ్ గా నంబర్ 1 పొజిషన్ లో ట్రెండింగ్ లో నిలిచింది. ఇది కూడా చదవండి: డీప్ ఫేక్ పై హీరో అభిమానుల బాధ్యతాయుతమైన పోరాటం: ఇక అసాంఘిక శక్తుల ఆట కట్టు!       ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో కార్తీ నటన, ఎస్.జె. సూర్య పవర్ ఫుల్ విలనిజం, ఆషికా రంగనాథ్ మరియు మాళవికా మోహనన్ ల పాత్రలు ప్రైమ్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రో ఏజెంట్ విజయ్ చుట్టూ తిరిగే హై-వోల్టేజ్ కాన్స్పిరసీ, మిషన్ డోకు మరియు బ్లాక్ డాగర్ గ్యాంగ్ ను ఛేదించే యాక్షన్ ఎలిమెంట్స్ ఓటీటీ వీక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ను అందిస్తున్నాయి. మరి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌‌పై మాత్రం 'సర్దార్ 2' చూపించిన ఊచకోత సినీ విశ్లేషకులని సైతం ఆశ్చర్యపరుస్తోంది.  అందుకే అంటారు ఏ నిమిషాన ఏ రికార్డు ఎవరిని వరిస్తుందో అని!     [Sardar 2 Ott Number 1 Trending Prime Video, Sardar 2 OTT Records, Karthi Sardar 2 Prime Video, Sardar 2 Number 1 Trending, Sardar 2 OTT Streaming, Telugu Cinema  News, Telugu cinema, Tollywood News, Tollywood]    
కల్మషం లేని స్వచ్ఛమైన శృంగారాన్ని బూతు వస్తువుగా భావించే కొంత మంది అసాంఘిక శక్తులు నేటి డిజిటల్ యుగాన్ని ఆసరాగా చేసుకొని ఏఐ సాయంతో సభ్య  సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. దేవరలోని చుట్టమల్లే సాంగ్ విషయంలో అసాంఘిక శక్తులు ప్రవర్తించిన తీరు చూస్తే ఒళ్ళు గగుర్పాటుకి గురవ్వాలసిందే.  ఎన్టీఆర్ నే రంగంలోని ఆ నీచులని వదలనని బహిరంగ ప్రకటన చేసాడంటే వాళ్ల బరితెగింపు ఏ స్థాయిలో హద్దులు దాటిందో అర్ధమవుతుంది.    సాంకేతికత పేరుతో జరిగే ఈ డిజిటల్ దాడి కేవలం ఒక వ్యక్తి గౌరవానికి మాత్రమే కాకుండా మొత్తం సమాజపు నైతిక విలువలకి  సవాలుగా నిలుస్తోంది. ఇలాంటి విపరీత ధోరణి పెరిగిపోతున్న సమయంలో ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా,హీరోల అభిమానిగా ప్రతి ఒక్కరి రోల్ ఎంతో కీలకమైనది. కేవలం అభిమాన హీరోల సినిమాలు చూడటమే కాకుండా, వారి పేరును మరియు ఇమేజ్‌ను అపహాస్యం చేసేలా తప్పుడు కంటెంట్‌ను సృష్టించే ముఠాల పట్ల అభిమానులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ఇలాంటి అసభ్యకర డీప్‌ఫేక్ వీడియోలను లేదా ఫోటోలను చూసినప్పుడు వాటికి లైక్‌లు కొట్టడం, షేర్ చేయడం లేదా కామెంట్ల ద్వారా పబ్లిసిటీ పెంచడం తీవ్రమైన పొరపాటు. అభిమానులు మరియు సోషల్ మీడియా వినియోగదారులు ఆ కంటెంట్‌ను ఏమాత్రం ప్రోత్సహించకుండా వెంటనే గుర్తింపు పట్టి, సంబంధిత ఆధారాలను సేకరించాలి. సైబర్ వింగ్‌లోని రికార్డుల ప్రకారం దేశవ్యాప్తంగా ప్రతిరోజూ వందలాది డిజిటల్ ఫోర్జరీ, డీప్‌ఫేక్ మార్ఫింగ్ ఫిర్యాదులు నమోదవుతున్నాయి. 1930 హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా ప్రతిరోజూ వేలాదిమంది పౌరులు సైబర్ నేరాలపై ఫిర్యాదులు నమోదు చేస్తూ అప్రమత్తంగా ఉంటున్నారు. సమాజానికి హాని కలిగించే లేదా ప్రముఖుల గౌరవానికి భంగం కలిగించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్ఫింగ్ వీడియోలు కంటపడగానే అభిమానులు వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ www.cybercrime.gov.in ద్వారా గానీ, లేదా నేరుగా 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి గానీ పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఇంటర్నెట్ సమాజంలో ఐటీ యాక్ట్ (Information Technology Act) అలాగే బిఎన్ఎస్ (BNS Section 318) కింద డిజిటల్ రూపంలో అశ్లీలత వ్యాప్తి చేయడం, మార్ఫింగ్ చేయడం తీవ్రమైన శిక్షార్హమైన నేరం. ఇది కూడా చదవండి: సంచలన విషయాలు బయటపెట్టిన సుప్రీత: ఆ ముగ్గురు వీళ్లేనా!     బాధ్యతగల పౌరులుగా మరియు ఆర్మీ లాంటి అభిమాన సంఘాలుగా ప్రతి ఒక్కరూ ఒకటై సైబర్ క్రిమినల్స్ ఆటకట్టించాలి. ఫేక్ వీడియోలను తయారు చేసే ముఠాల అసలు మూలాలను బయటపెట్టి, వాటిని సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లి నేరస్థులకు కఠిన శిక్ష పడేలా సహకరించడమే మన ప్రియమైన హీరోలకు మరియు సమాజానికి ఇచ్చే నిజమైన గౌరవం. నూటికి నూరు శాతం మీరు అనుకుంటే అవుతుంది.. ఇది సినీ చరిత్ర ఎప్పట్నుంచో నిరూపిస్తూ వస్తున్న అభిమాన సత్యం .   [Hero Fans Responsibility AI Deepfakes, Ntr Warning  AI Deepfakes, Ai Deepfake Celebrity Scams cyber crime report, AI Deepfakes, Cyber Crime Reporting, Hero Fans Responsibility, National Cyber Crime Portal 1930,Telugu Cinema  News, Telugu cinema, Tollywood News, Tollywood]    
తమిళనాడు రాజకీయాల్లోకి సినీ ప్రముఖుల ఎంట్రీపై ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా విజయ్ రాజకీయాల్లోకి వచ్చి, సీఎం అయిన తర్వాత.. పలువురు సినీ నటుల రాజకీయ ఆసక్తిపై చర్చ మొదలైంది. తాజాగా ఈ జాబితాలోకి శివకార్తికేయన్ పేరు కూడా చేరింది. శివకార్తికేయన్ ఆదివారం చెన్నైలో తన అభిమానులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి సుమారు 3 వేల మంది అభిమానులు, ఫ్యాన్స్ అసోసియేషన్ నిర్వాహకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శివకార్తికేయన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను పీపుల్ మేడ్ స్టార్‌ని. మీ వల్లే ఈ స్థాయికి వచ్చాను” అని అన్నారు. ఏ రంగంలో ఉన్నా తమ లక్ష్యంపై క్లారిటీ ఉండాలని అభిమానులకు సూచించారు. విమర్శించే వాళ్లు ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటారని.. వాటిని పట్టించుకోకుండా ప్రేమతో కలిసి ఉండాలని చెప్పారు. ఇక సమావేశానికి హాజరైన విద్యార్థులకు కూడా శివకార్తికేయన్ కొన్ని సూచనలు చేశారు. బాగా చదవాలని, బాగా సంపాదించాలని.. కుటుంబానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఎక్కువగా చదివితే ఆలోచనా విధానం మెరుగవుతుందని.. సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉండొచ్చని చెప్పారు. అయితే ఈ ఫ్యాన్ మీట్‌కు పొలిటికల్ కలర్ రావడానికి మరో కారణం ఉంది. తమిళనాట ప్రస్తుతం హీరోలు వరుసగా అభిమానులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ధనుష్, విశాల్ కూడా తమ ఫ్యాన్స్‌తో భేటీ అయ్యారు. ప్రజాసేవకు సంబంధించిన అంశాలపై వారు మాట్లాడారు. మరోవైపు కొరియోగ్రాఫర్, దర్శక నటుడు రాఘవ లారెన్స్ తాను రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీంతో తమిళ సినీ ప్రముఖుల ఫ్యాన్ మీట్లు ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్నాయి. అయితే శివకార్తికేయన్ మాత్రం తన తాజా సమావేశంలో రాజకీయ ప్రవేశంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆయన మాటలన్నీ అభిమానులు, విద్యార్థులు, కుటుంబం, చదువు, వ్యక్తిగత ఎదుగుదల చుట్టూనే ఉన్నాయి. మరి శివకార్తికేయన్ భవిష్యత్తులో రాజకీయాల వైపు అడుగులు వేస్తారా? లేక ఫ్యాన్స్‌తో ఈ సమావేశం కేవలం అభిమానుల కోసం నిర్వహించిన కార్యక్రమంగానే మిగిలిపోతుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: డీప్‌ఫేక్‌ వివాదం.. ఇంటి దొంగల పనే.. మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్.!       [Sivakarthikeyan Political Entry, Sivakarthikeyan Fans Meet, Sivakarthikeyan Politics, Sivakarthikeyan Meeting, Sivakarthikeyan Comments, Sivakarthikeyan, Tamil Nadu CM Vijay, Telugu News]  
తమిళ కమెడియన్‌గా సుదీర్ఘ కాలం గుర్తింపు తెచ్చుకున్న సూరి.. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘మండాడి’ థియేటర్లలో మంచి విజయాన్ని అందుకుంది. తెలుగు నటుడు సుహాస్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో మహిమా నంబియార్, సత్యరాజ్ తదితరులు కనిపించారు. మాథిమారన్ పుగళేంధి దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సముద్రం, సంప్రదాయ పడవల రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ‘మండాడి’లో సూరి, సుహాస్ పాత్రల మధ్య పోటీ, వైరం ప్రధానంగా సాగుతుంది. ముఖ్యంగా సుహాస్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించడం సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో పాటు సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.140 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. ఇక థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులకు గుడ్ న్యూస్ వచ్చింది. ‘మండాడి’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. అక్టోబర్ 9 నుంచి తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్‌కు రానున్నట్లు తాజా సమాచారం. దసరా పండుగ సమయంలో ఓటీటీ ప్రేక్షకులకు ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా అందుబాటులోకి రానుంది. మొత్తంగా థియేటర్లలో సక్సెస్ అందుకున్న ‘మండాడి’ ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా సుహాస్‌ను నెగెటివ్ షేడ్స్‌లో చూడాలనుకునే తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఆసక్తికరమైన ఎంపికగా మారే అవకాశం ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్ 9 నుంచి స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో ఓటీటీ ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.     [Mandaadi OTT Release Date, Mandaadi OTT, Mandaadi Netflix, Soori Mandaadi, Suhas Mandaadi, Mandaadi Telugu OTT, Mandaadi Movie, Mandaadi Netflix Release, Mandaadi Telugu Streaming, Soori Suhas Movie]
నాన్ వెజ్ ప్రియులకు చికెన్ కర్రీ పేరు వింటేనే నోరూరిపోతుంది. వారాంతాల్లో లేదా ప్రత్యేక సందర్భాల్లో ఇళ్లలో రకరకాల మసాలాలు నూరి చికెన్ కూరను ఎంతో రుచిగా వండుతుంటారు. అయితే కేవలం రుచి కోసమే కాకుండా, మన ఆరోగ్యానికి, ముఖ్యంగా కంటి చూపుకు చికెన్ కర్రీ అద్భుతమైన ఔషధంగా మారుతుందంటే మీరు నమ్ముతారా? సాధారణంగా మనం వంటకాల్లో సువాసన కోసం వాడే కరివేపాకును చాలామంది తినేటప్పుడు పక్కన పడేస్తుంటారు. కానీ, చికెన్ కర్రీ వండేటప్పుడు కరివేపాకులను ధారాళంగా ఉపయోగించి తింటే కంటి చూపు మెరుగుపడి, కాలక్రమేణా కళ్ళజోడు వాడాల్సిన అవసరమే రాదని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చికెన్‌లో శరీరానికి అవసరమైన అత్యధిక నాణ్యత కలిగిన ప్రొటీన్లతో పాటు విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రత్యేకించి చికెన్‌లో లభించే విటమిన్ A, విటమిన్ B3 (నియాసిన్), మరియు విటమిన్ B6 కంటి ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. మన కంటిలోని రెటీనా కాంతిని సరిగ్గా గ్రహించి స్పష్టమైన ప్రతిబింబాన్ని ఏర్పరచడానికి విటమిన్ A ప్రాథమిక మూలకం. శరీరంలో విటమిన్ A లోపిస్తే రేచీకటి, కళ్ళు పొడిబారడం (డ్రై ఐస్) వంటి తీవ్ర సమస్యలు తలెత్తుతాయి. చికెన్ కర్రీలోని పోషకాలు కంటి నరాలకు బలాన్ని చేకూర్చి, కంటి కండరాలు అలసిపోకుండా కాపాడతాయి. ఇక కరివేపాకు విషయానికి వస్తే, ఇది కంటి చూపును మెరుగుపరిచే ఒక సహజమైన దివ్యౌషధం. కరివేపాకులో విటమిన్ A, విటమిన్ C మరియు విటమిన్ E తో పాటు ల్యూటిన్, జియాజంతిన్ మరియు కెరోటినాయిడ్స్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి కణాలను ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సిడేటివ్ ఒత్తిడి నుండి రక్షిస్తాయి. వయస్సు పెరగడం వల్ల వచ్చే మెక్యులర్ డిజెనరేషన్, క్యాటరాక్ట్ (కంటి శుక్లాలు) మరియు రేచీకటి వంటి సమస్యలు రాకుండా నిరోధించడంలో కరివేపాకులోని పోషకాలు అద్భుతంగా పనిచేస్తాయి. చికెన్ మరియు కరివేపాకు కలయిక వల్ల విటమిన్ A మరియు యాంటీఆక్సిడెంట్ల లభ్యత రెట్టింపై కంటి ఆరోగ్యానికి అత్యంత మేలు జరుగుతుంది. మరి ఈ అద్భుతమైన కాంబినేషన్ ప్రయోజనాలు పూర్తిగా పొందాలంటే చికెన్ కర్రీని ఎలా వండుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం. చికెన్ వండేటప్పుడు నూనెలో కేవలం పోపు కోసం మాత్రమే కాకుండా, గణనీయమైన పరిమాణంలో కరివేపాకులను వేసి మగ్గనివ్వాలి. వీలైతే కరివేపాకును లేతగా ఉన్నప్పుడే సేకరించి, పేస్ట్‌గా నూరి లేదా పొడి చేసి చికెన్ మసాలాలో కలిపి వండుకోవచ్చు. దీనివల్ల కరివేపాకును ఏరి పక్కన పడేసే అవకాశం ఉండదు మరియు అందులోని పోషకాలన్నీ కర్రీ రసంలోకి ఇంకి శరీరానికి సంపూర్ణంగా అందుతాయి. అంతేకాకుండా చికెన్ వండేటప్పుడు విపరీతంగా నూనె, ఘాటైన మసాలాలు వాడకుండా పరిమితంగా ఉపయోగిస్తే పోషక విలువలు దెబ్బతినకుండా ఉంటాయి. ఆధునిక డిజిటల్ యుగంలో గంటల తరబడి కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు మరియు స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లను చూడటం వల్ల పిల్లల నుండి పెద్దల వరకు అందరిలో కంటి అలసట, మంటలు, కళ్ళు పొడిబారడం మరియు చిన్న వయస్సులోనే సైట్ రావడం సర్వసాధారణమైపోయింది. ఇటువంటి తరుణంలో కంటికి అవసరమైన క్యారెట్లు, ఆకుకూరలతో పాటు చికెన్ కరివేపాకు కాంబినేషన్‌ను క్రమం తప్పకుండా వారంలో కనీసం ఒకట్రెండు సార్లు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కంటి నరాల బలహీనత తగ్గి కంటి చూపు మెరుగవుతుంది. క్రమశిక్షణతో కూడిన ఈ ఆహారపు అలవాట్లతో కళ్ళజోడు ధరించే అవసరం లేకుండా సులభంగా కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.     Secret Chicken Curry Ingredient Vision, Improve Eyesight Naturally Foods, Chicken Curry Healthy Additions, Foods to Sharpen Vision Fast, Nutritional Eye Health Recipe.  
మన ఆరోగ్యానికి, శరీర బలానికి ఆహారమే ప్రాథమిక మూలాధారం. సాధారణంగా ఎముకల బలానికి పాలు, శరీర పోషణకు గుడ్లు తప్పనిసరి అని మనమందరం భావిస్తుంటాము. కానీ, మన సాంప్రదాయ ధాన్యాలైన రాగులు మరియు నల్ల శెనగలలో పాలు, గుడ్ల కంటే ఏకంగా 5 రెట్లు ఎక్కువ క్యాల్షియం మరియు అత్యంత సమృద్ధిగా పోషకాలు లభిస్తాయని తెలుసా? ప్రాచీన కాలంలో మన పూర్వీకులు రోజూ ఈ ధాన్యాలను తమ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్లనే రూపంలోనూ, శారీరక దృఢత్వంలోనూ ఎంతో బలంగా, ఆరోగ్యానందంగా జీవించగలిగారు. నేటి ఆధునిక జీవనశైలిలో అనేక రకాల అనారోగ్య సమస్యలు, ఎముకల బలహీనత మరియు నరాల నిస్సత్తువ వేధిస్తున్న తరుణంలో రాగులు, నల్ల శెనగలను రోజూ తీసుకోవడం ద్వారా వీటన్నింటికీ నాచురల్ పరిష్కారం లభిస్తుంది. రాగుల విశిష్టత విషయానికి వస్తే, ఇందులో క్యాల్షియం పరిమాణం సాధారణ పాలతో పోలిస్తే 5 రెట్లు అధికంగా ఉంటుంది. ఎముకలను ఉక్కులా మార్చడంలో ఇది ఒక సూపర్ ఫుడ్‌లా సహాయపడుతుంది. రాగులను రోజుకు రెండు పూటలా తీసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. విశేషంగా ఉదయం పరగడుపున అలాగే మధ్యాహ్న సమయంలో రాగి సంకటి లేదా రాగి అంబలి రూపంలో తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన సమగ్ర పోషణ సులభంగా అందుతుంది. రాగులలో ఉండే ప్రత్యేక పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడమే కాకుండా, జీర్ణక్రియ పనితీరును వేగవంతం చేసి పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే రాగులను సరిగ్గా నానబెట్టి ఆహారంగా తీసుకున్నప్పుడే అందులోని పోషకాలన్నీ మన శరీరానికి సంపూర్ణంగా లభిస్తాయి. మరొకవైపు నల్ల శెనగలు పోషకాల ఘనిగా పనిచేస్తాయి. నల్ల శెనగలను ఉడకబెట్టి గానీ లేదా వేయించుకుని గానీ తినవచ్చు, అలాగే పొడి రూపంలో కూడా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. నల్ల శెనగలు గుండె పనితీరును మెరుగుపరచడంలో అద్భుతంగా తోడ్పడతాయి. గుండె రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ చేరకుండా కాపాడటంతో పాటు నరాల బలహీనతతో బాధపడేవారికి ఇది గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. చర్మాన్ని వివిధ రకాల సమస్యలు, ఇన్ఫెక్షన్ల నుండి రక్షించి నిగారింపును అందించడంలో కూడా నల్ల శెనగలలోని పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి. రోజూ వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు ఉక్కులా మారడమే కాక, రోగనిరోధక శక్తి పెరిగి శరీరం రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో ఖరీదైన సప్లిమెంట్ల వెనుక పడకుండా, మన పూర్వీకులు అందించిన రాగి సంకటి, రాగి అంబలి, నానబెట్టిన లేదా ఉడకబెట్టిన నల్ల శెనగలను మన దైనందిన ఆహారంలో చేర్చుకోవడం ఎంతైనా అవసరం. రోజుకు రెండు పూటలా ఈ ప్రకృతి ప్రసాదించిన ఆహారాన్ని సరైన పద్ధతిలో తీసుకుంటే ఎముకల బలహీనత, నరాల నీరసం, గుండె సమస్యలు మరియు జీర్ణకోశ సమస్యలకు స్వస్తి చెప్పి సంపూర్ణ ఆరోగ్యాన్ని సులభంగా సొంతం చేసుకోవచ్చు.     Ragi Sangati Health Benefits, Black Chickpeas Benefits Nalla Senagalu, Ragi Sangati and Kala Chana, South Indian Superfood Combo, Ragi Sangati Weight Loss Diabetes.
నేటి ఆధునిక కాలంలో మహిళలను అత్యంత వేగంగా మరియు తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో రొమ్ము క్యాన్సర్ మొదటి వరుసలో నిలుస్తోంది. రొమ్ము క్యాన్సర్ అనగానే చాలామందికి వెంటనే గుర్తొచ్చేది కేవలం రొమ్ములో ఏర్పడే గడ్డలు లేదా భరించలేని తీవ్రమైన నొప్పి మాత్రమే. అయితే వైద్య రంగంలో ఎంతగానో అవగాహన పెరుగుతున్నప్పటికీ, నేటికీ ఎంతోమంది మహిళలు కేవలం గడ్డలు, నొప్పి ఉంటేనే క్యాన్సర్ అని భావిస్తూ తీవ్రమైన పొరపాటు పడుతున్నారు. కానీ క్యాన్సర్ నిపుణులు మరియు ప్రముఖ వైద్యులు స్పష్టం చేస్తున్న విషయమేమిటంటే, రొమ్ము క్యాన్సర్ ప్రారంభ దశలో అసలు ఎటువంటి నొప్పిగానీ, ముట్టుకుంటే తెలిసే గడ్డలుగానీ ఉండాల్సిన అవసరం లేదు. ఎటువంటి శారీరక రుగ్మతలు లేకుండా మహిళలు చాలా ఆరోగ్యంగా ఉన్నారని భావించే సమయంలో కూడా లోపల క్యాన్సర్ కణాలు నిశ్శబ్దంగా విస్తరించే అవకాశం ఉంది. అందువల్ల ప్రతి మహిళా తన శరీరంలో జరిగే సూక్ష్మమైన, నిశ్శబ్ద మార్పులను కూడా నిశితంగా గమనించడం అత్యంత ముఖ్యం. క్యాన్సర్ వ్యాప్తిని ప్రతిబింబించే ప్రధానమైన మరియు దాగి ఉన్న 5 దాగి ఉన్న హెచ్చరిక సంకేతాలను తెలుసుకోవడం ప్రాణరక్షణకు ఎంతగానో తోడ్పడుతుంది. మొదటిది, చంక భాగంలో లేదా కాలర్ బోన్ (ఎముక) దగ్గర అకస్మాత్తుగా కనిపించే వాపులు లేదా గడ్డలు. రొమ్ము భాగంలో ఎటువంటి మార్పులు లేదా నొప్పి కనిపించకపోయినా, రొమ్ము క్యాన్సర్ కణాలు అత్యంత వేగంగా సమీపంలోని లింఫ్ నోడ్స్‌కు వ్యాపిస్తాయి. దీనివలన చంక భాగంలో చిన్నపాటి గడ్డలు లేదా వాపులు ఏర్పడతాయి. వీటిని సాధారణ అలసట లేదా చిన్న ఇన్ఫెక్షన్ అని నిర్లక్ష్యం చేయడం చాలా ప్రమాదకరం. రెండవది, రొమ్ము చర్మం యొక్క ఆకృతిలో వచ్చే మార్పులు. రొమ్ముపై ఉండే చర్మం ఒక్కసారిగా గుంటలు పడటం, చర్మం గరుకుగా మారడం, మందంగా అవ్వడం లేదా నారింజ పండు తొక్క రూపంలోకి మారడం క్యాన్సర్ తీవ్రతను సూచించే బలమైన సంకేతం. చర్మంలో వచ్చే ఈ విధమైన మార్పును మెడికల్ పరిభాషలో చాలా కీలకమైన హెచ్చరికగా భావిస్తారు. మూడవది, నిపుల్స్ అమరికలో వచ్చే అకస్మాత్తు మార్పులు. సహజంగా బయటకు కనిపించే నిపుల్స్ సడన్‌గా లోపలికి ముడుచుకుపోవడం లేదా వాటి రూపురేఖలు మారిపోవడం గమనిస్తే తక్షణమే డాక్టర్‌ను సంప్రదించాలి. నాల్గవ అత్యంత కీలకమైన సంకేతం, నిపుల్స్ నుండి అసాధారణంగా ద్రావణాలు విడుదల కావడం. ఎటువంటి ఒత్తిడి లేదా పిండటం లేకుండానే దానంతట అదే రక్తం, నీరు లేదా పసుపు రంగు స్రావాలు కారడం గమనిస్తే దీనిని ఏమాత్రం తేలికగా తీసుకోకూడదు. ఐదవ సంకేతం, రొమ్ము పరిమాణం మరియు ఆకారంలో సడన్‌గా వచ్చే తేడాలు. సాధారణంగా రెండు రొమ్ములు పూర్తి స్థాయిలో ఒకేలా ఉండవు, అది సహజమే. కానీ హఠాత్తుగా ఒక రొమ్ము మాత్రమే అసాధారణంగా పెద్దదిగా మారడం, భరించలేని బరువుగా అనిపించడం లేదా వీడని వాపు రావడం జరిగితే ఖచ్చితంగా వైద్య పరీక్షలు అవసరం. చాలామంది మహిళలు నొప్పి ఉంటేనే డాక్టర్ దగ్గరకు వెళ్లాలని అనుకుంటారు. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రాథమిక దశల్లో క్యాన్సర్ కణాలు నొప్పిని కలిగించవు. అందుకే ప్రతి మహిళ నెలకు కనీసం ఒకసారైనా ఇంట్లోనే స్వయం రొమ్ము పరీక్ష (సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్) చేసుకోవడం ద్వారా తమ రొమ్ముల సాధారణ ఆకారాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇంటర్నెట్‌లో అరకొర సమాచారం వెతికి భయాందోళనకు గురికాకుండా, ఏ చిన్న అనుమానాస్పద మార్పు కనిపించినా వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించి మమోగ్రామ్ లేదా స్కానింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ప్రాథమిక దశలోనే ముందస్తుగా గుర్తించడమే రొమ్ము క్యాన్సర్ నుండి పూర్తిగా కోలుకోవడానికి ఏకైక మార్గం.     Is Cancer Always Painful, Painless Cancer Symptoms Women, Early Cancer Warning Signs, Women Cancer Awareness Facts, Silent Cancer Symptoms.
ఉదయాన్నే  పరగడుపున టీ లేదా కాఫీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. రోజును చురుగ్గా ప్రారంభించడానికి కాఫీ, టీ లు తాగుతూ ఉంటారు.  అయినప్పటికీ ఇవి శరీరంలో  అసిడిటీ, హార్మోన్ల అసమతుల్యత , ఇతర జీర్ణ సమస్యలకు కారణమవుతాయి. వీటి స్థానంలో శరీరాన్ని చురుగ్గా ఉంచుతూనే శరీరంలో ఉన్న అనారోగ్యాలను, జబ్బులను, ఇబ్బందులను తగ్గించగల పానీయం తాగడం చాలా మంచిది.  ఈ పానీయాన్ని తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలు తొలగిపోవడమే కాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంతకీ అంత శక్తివంతమైన ఆ పానీయం ఏమిటో? దాన్ని ఎలా తయారుచేసుకుని తాగాలో.. వివరంగా తెలుసుకుంటే.. కావలసిన పదార్థాలు.. ధనియాలు,  జీలకర్ర,  సోంపు ,  వాము  పైన పేర్కొన్న దినుసులలో ఆరోగ్యానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు , ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ​తయారీ విధానం... ఈ పానీయాన్ని తయారు చేయడం చాలా సులభం. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాసు నీటిని తీసుకుని మరిగించాలి. అందులో అర టీస్పూన్ ధనియాలు, అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ సోంపు , పావు టీస్పూన్ వాము వేయాలి. ఈ మిశ్రమాన్ని నీరు సగం అయ్యేంత వరకు చిన్న మంటపై బాగా మరిగించాలి. నీరు బాగా మరిగిన తర్వాత వడకట్టి, గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. రుచి కోసం లేదా అదనపు ఆరోగ్య ప్రయోజనాల కోసం కాస్త నిమ్మరసం లేదా తేనె కూడా కలపవచ్చు. ఈ పానీయం తాగడం వల్ల శరీరానికి కలిగే  ఉపయోగాలు.. ​హార్మోన్ల సమతుల్యత.. మహిళల్లో ఎదురయ్యే థైరాయిడ్, పిసిఓడి , పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం  వంటి సమస్యలకు ఈ పానీయం చాలా మేలు చేస్తుంది. ధనియాలు , సోంపు శరీరంలో హార్మోన్ల ఉత్పత్తిని క్రమబద్ధీకరించడానికి తోడ్పడతాయి. ​జీర్ణవ్యవస్థ మెరుగుదల.. జీలకర్ర , వాము జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ , మలబద్ధకం వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. ​రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ.. టైప్-2 డయాబెటిస్‌తో బాధపడేవారికి ఈ పానీయం సహాయపడుతుంది. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. బరువు తగ్గేందుకు సహాయం.. శరీరంలో ఉన్న కొవ్వును కరిగించడంలో జీలకర్ర , వాము కీలక పాత్ర పోషిస్తాయి. క్రమం తప్పకుండా ఈ పానీయం తాగడం ద్వారా శరీర మెటబాలిజం పెరిగి బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ​చర్మ సౌందర్యం , డిటాక్సిఫికేషన్.. శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఫలితంగా చర్మంపై మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం సహజంగా మెరుస్తుంది. ​కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం.. ఈ పదార్థాల్లో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు , వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. ​ఈ డిటాక్స్ డ్రింక్‌ను ప్రతిరోజూ ఉదయం పరగడుపున క్రమం తప్పకుండా తాగడం ద్వారా శరీరంలో సహజమైన మార్పులను గమనించవచ్చు. టీ, కాఫీలకు ప్రత్యామ్నాయంగా ఈ నేచురల్  పానీయాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా శరీరంలో చాలా మార్పులు గమనించవచ్చు.                       *రూపశ్రీ.
గొంతుకు, గడ్డానికి మధ్య భాగంలో , గడ్డానికి కింద చర్మం, కండర కణజాలం పెరిగి.. గొంతు, గడ్డం ఏకం అయినట్టు చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. దీన్ని డబుల్ చిన్ అని అంటారు. లావు పెరగడం వల్ల డబుల్ చిన్ వచ్చిందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే లావు ఎక్కువగా లేకపోయినా కొందరిలో డబుల్ చిన్ కనిపిస్తూ ఉంటుంది. అయితే   డబుల్ చిన్ కు,  థైరాయిడ్ సమస్యలకు మధ్య ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు ఉన్నాయని  వైద్యులు చెబుతున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. డబుల్ చిన్ ఎందుకు, ఎలా వస్తుంది? థైరాయిడ్ గ్రంథి పనితీరు సరిగ్గా లేనప్పుడు శరీర జీవక్రియ మందగిస్తుంది. ముఖ్యంగా హైపోథైరాయిడిజం ఉన్నవారిలో బరువు వేగంగా పెరగడం, శరీరంలో నీరు చేరడం లేదా వాపులు రావడం సాధారణం. దీని ప్రభావం ముఖం , మెడ భాగాలపై స్పష్టంగా కనిపిస్తుంది. మెడ కింద కొవ్వు చేరడం లేదా ముఖం ఉబ్బినట్లు అవ్వడం వల్ల డబుల్ చిన్ ఏర్పడుతుంది. అంతేకాకుండా థైరాయిడ్ సమస్య వల్ల మెడ ముందు భాగంలో ఉన్న గ్రంథి వాచి గాయిటర్ గా మారినప్పుడు కూడా గడ్డం కింద వాపు వచ్చి డబుల్ చిన్ లాగా కనిపించే అవకాశం ఉంది. థైరాయిడ్ సమస్య ఉన్నవారు డబుల్ చిన్ తగ్గించుకోవడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు , జీవనశైలి మార్పులు పాటించాలి..  థైరాయిడ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం.. థైరాయిడ్  లెవెల్స్ కంట్రోల్ లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. వైద్యుల సలహా మేరకు సరైన మోతాదులో థైరాయిడ్ మందులు క్రమం తప్పకుండా వాడాలి. శరీరంలో థైరాయిడ్ హార్మోన్లు సమతుల్యంగా ఉన్నప్పుడు జీవక్రియ వేగవంతమై, అదనపు బరువు , వాపు తగ్గుతాయి.  పోషకాహార నియమం..  ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక చక్కెర ఉన్న పదార్థాలు, మైదా , వేపుళ్లను పూర్తిగా తగ్గించాలి. పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు , తృణధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. శరీరంలో సోడియం నిల్వలు ఎక్కువైతే నీరు చేరే అవకాశం ఉంది కాబట్టి ఉప్పు చాలా పరిమితంగా తినాలి. నీరు..  ప్రతిరోజూ తగినన్ని నీళ్లు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. నీరు బాగా తాగితే ముఖం , మెడ భాగంలో నీరు చేరడం తగ్గి వాపు తగ్గుతుంది.  వ్యాయామం.. కేవలం మెడ భాగంలోనే కాకుండా శరీరం మొత్తానికి సంబంధించిన వ్యాయామాలు చేయాలి. రోజూ క్రమం తప్పకుండా నడక, యోగా లేదా కార్డియో వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలోని క్యాలరీలు కరిగి బరువు తగ్గుతారు. దీనితో పాటు మెడ , గడ్డం కండరాలను బలోపేతం చేసే చిన్న చిన్న ముఖ వ్యాయామాలు చేయవచ్చు. ఈ ఫేస్ వ్యాయామాలు మెడ వద్ద ఉన్న చర్మాన్ని బిగుతుగా మార్చడానికి తోడ్పడతాయి.  నిద్ర , ఒత్తిడి..  రోజుకు కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల ప్రశాంతమైన నిద్ర అవసరం. నిద్రలేమి , మానసిక ఒత్తిడి వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత పెరిగి బరువు పెరిగే ప్రమాదం ఉంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం ప్రాణాయామం వంటివి పాటించాలి. పైన చెప్పుకున్న విధంగా థైరాయిడ్ కు సరైన వైద్యం పొందుతూ, ఆరోగ్యకరమైన ఆహారం , రోజువారీ వ్యాయామం అలవాటు చేసుకుంటే డబుల్ చిన్ సమస్య నుండి క్రమంగా బయట పడవచ్చు.                                                                                                                                     *రూపశ్రీ.
తలనొప్పి వచ్చిందంటే చాలు.. చాలామంది వెంటనే మెడికల్ షాప్‌‌కి వెళ్లి పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ తెచ్చుకుని  మింగేస్తుంటారు. కానీ, తరచూ మాత్రలు వాడటం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎటువంటి టాబ్లెట్ వాడకుండానే ఇంట్లోనే చాలా తేలిగ్గా, సహజ పద్ధతుల ద్వారా తలనొప్పిని తగ్గించుకోవచ్చు. ​మనం చేసే చిన్న చిన్న పనులు,  ఆక్యుప్రెషర్ పద్ధతులు తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనాన్ని ఇస్తాయి. టాబ్లెట్ అక్కర్లేకుండానే తలనొప్పి తగ్గించుకోవడానికి ఏం చేయాలో తెలుసుకుంటే.. LI4 పాయింట్.. ​మన బొటనవేలు, చూపుడు వేలు కలిసే మధ్య భాగంను LI4 పాయింట్ అంటారు. ఈ భాగంలో  మరొక చేతి వేళ్లతో మెల్లగా నొక్కి పట్టి, వృత్తాకారంలో మసాజ్ చేయడం వల్ల తలనొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఈ పాయింట్‌ను కొన్ని నిమిషాల పాటు నొక్కడం వల్ల శరీరంలో ఒత్తిడి తగ్గి ఉపశమనం కలుగుతుంది. యాంగ్ టాంగ్ పాయింట్.. ​నుదురు, కనుబొమ్మల మధ్య భాగం, రెంటి మధ్య పాయింట్  ను యాంగ్ టాంగ్ పాయింట్అంటారు. ఈ పాయింట్ వద్ద చూపుడు వేలితో కాసేపు సున్నితంగా మసాజ్ చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా, తలనొప్పి క్రమంగా తగ్గుతుంది. నీరు.. ​శరీరంలో నీటి శాతం తగ్గడం (డీహైడ్రేషన్) వల్ల కూడా చాలామందికి తలనొప్పి వస్తుంటుంది. కాబట్టి తలనొప్పిగా అనిపించిన వెంటనే ఒక పెద్ద గ్లాసు నీళ్లు లేదా నిమ్మకాయ నీళ్లు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కాంప్రెస్.. ​తలనొప్పిగా ఉన్నప్పుడు చల్లని లేదా వేడి కాంప్రెస్ ఉపయోగించడం చాలా మంచిది. ఐస్ క్యూబ్స్‌ను ఒక గుడ్డలో చుట్టి నుదుటిపై లేదా మెడ వెనుక భాగంలో ఉంచడం వల్ల, లేదా వేడి నీటిలో ముంచిన తువ్వాలును ఉంచడం వల్ల రక్తనాళాలు విశ్రాంతి పొంది నొప్పులు తగ్గుతాయి. ఆయిల్స్.. పుదీనా నూనె లేదా ల్యావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ కొద్దిగా తీసుకుని నుదుటిపై రాసి సున్నితంగా మసాజ్ చేయడం వల్ల లేదా వాటి సువాసన పీల్చడం వల్ల తలనొప్పి, ఒత్తిడి త్వరగా దూరం అవుతాయి. అధిక వెలుతురు, స్క్రీన్ల వెలుతురు వల్ల వచ్చే తలనొప్పిని తగ్గించుకోవడానికి కాసేపు లైట్లు ఆర్పివేసి ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణంలో కళ్లు మూసుకుని పడుకోవడం మంచిది. ఈ చిన్న చిన్న సహజ చిట్కాలను పాటించడం ద్వారా రూపాయి ఖర్చు లేకుండా, టాబ్లెట్ మింగే అవసరం లేకుండా తలనొప్పికి సులభంగా చెక్ పెట్టవచ్చు.                      *రూపశ్రీ.