Home

»

Latest News

సర్దార్ 2 ఊచకోత రికార్డు: ఫ్యాన్స్ సంబరాలు.. ఓటిటిలో ఎందుకు ఎలా!

Oct 5, 2026 1:09PM

ఊచకోతకి అర్ధం తెలియకపోతే సర్దార్ 2 రికార్డ్స్ చూడండనే వర్డ్ ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు బిజీగా ఉంది. దీంతో సర్దార్ 2 డిజాస్టర్ అన్నారుగా, మా కార్తీ సృష్టించుకుంటూ వెళ్తున్న రికార్డ్స్ ఇవే చూడండి, ఇది ఇంతటితో ఆగదు. ఇంకా, ఇంకా పెరుగుతాయని కూడా అంటున్నారు. మరి ఆ న్యూస్ ఏంటో చూసేద్దాం.  


సెప్టెంబర్ 10న థియేటర్లలోకి అడుగుపెట్టిన  సర్దార్ 2  బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా  23.85 కోట్ల గ్రాస్  వసూళ్లతో థియేట్రికల్ రన్ ముగించింది. థియేటర్ల వద్ద టికెట్ కొని చూడటానికి వెనుకాడిన ప్రేక్షకులు.. ఇప్పుడు తమ ఇళ్లలోని డిజిటల్ తెరల ముందు కూర్చొని ఈ స్పై డ్రామాను ఎగబడి చూస్తున్నారు. అక్టోబర్ 1 అర్ధరాత్రి నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' వేదికగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ అనే 5 ప్రధాన భాషల్లో స్ట్రీమింగ్ కు వచ్చింది. డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే 'సర్దార్ 2' అద్భుతమైన వ్యూవర్‌షిప్ సాధించి ప్రైమ్ వీడియోలో ఇండియా వైడ్ గా నంబర్ 1 పొజిషన్ లో ట్రెండింగ్ లో నిలిచింది.

ఇది కూడా చదవండి: డీప్ ఫేక్ పై హీరో అభిమానుల బాధ్యతాయుతమైన పోరాటం: ఇక అసాంఘిక శక్తుల ఆట కట్టు! 

 

 

 ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో కార్తీ నటన, ఎస్.జె. సూర్య పవర్ ఫుల్ విలనిజం, ఆషికా రంగనాథ్ మరియు మాళవికా మోహనన్ ల పాత్రలు ప్రైమ్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రో ఏజెంట్ విజయ్ చుట్టూ తిరిగే హై-వోల్టేజ్ కాన్స్పిరసీ, మిషన్ డోకు మరియు బ్లాక్ డాగర్ గ్యాంగ్ ను ఛేదించే యాక్షన్ ఎలిమెంట్స్ ఓటీటీ వీక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ను అందిస్తున్నాయి. మరి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌‌పై మాత్రం 'సర్దార్ 2' చూపించిన ఊచకోత సినీ విశ్లేషకులని సైతం ఆశ్చర్యపరుస్తోంది.  అందుకే అంటారు ఏ నిమిషాన ఏ రికార్డు ఎవరిని వరిస్తుందో అని!

 

 

[Sardar 2 Ott Number 1 Trending Prime Video, Sardar 2 OTT Records, Karthi Sardar 2 Prime Video, Sardar 2 Number 1 Trending, Sardar 2 OTT Streaming, Telugu Cinema  News, Telugu cinema, Tollywood News, Tollywood]

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com