
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే మాస్ ఆడియన్స్‌లో ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’, ‘అఖండ-2’తో ఈ కాంబినేషన్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. ఇప్పుడు ఈ కాంబోలో మరో సినిమా వస్తుందా? అనే ప్రశ్నకు బోయపాటి శ్రీను స్వయంగా క్లారిటీ ఇచ్చారు.
సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బోయపాటి శ్రీను.. దర్శనం అనంతరం తన రాబోయే సినిమాల గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. తన కొత్త ప్రాజెక్ట్‌ను ఈ నెలాఖరులోగా ప్రకటించనున్నట్లు వెల్లడించారు.
అయితే ఇందులో అందరి దృష్టినీ ఆకర్షించిన విషయం ‘అఖండ 3’. ‘అఖండ 3’ కూడా ఉంటుందని బోయపాటి స్పష్టం చేశారు. సరైన సమయంలో బాలకృష్ణతో కలిసి ఈ సినిమాకు సంబంధించిన వివరాలను ప్రకటిస్తామని చెప్పారు. దీంతో బాలయ్య–బోయపాటి కాంబో మరోసారి తెరపైకి రావడం ఖాయమనే విషయం క్లారిటీ వచ్చింది.
ఇక బోయపాటి మరో ఆసక్తికరమైన కోరికను కూడా బయటపెట్టారు. చిరంజీవి, బాలకృష్ణలతో కలిసి మల్టీస్టారర్ సినిమా చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని చెప్పారు.
అయితే ‘అఖండ 3’, చిరు-బాలయ్య మల్టీస్టారర్ వంటి సినిమాల కంటే ముందు.. ఈ నెలాఖరులోగా బోయపాటి తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించనున్నారు. అందులో హీరో ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: నాలాంటోడికి ఇదే హై మూమెంట్.. బాలయ్య, నాగార్జునతో కిరణ్ పోటీ.!
[Boyapati Srinu Big Announcement, Boyapati Srinu Next Movie, Akhanda 3 Movie, Chiranjeevi Balakrishna Multistarrer, Megastar Chiranjeevi, Nandamuri Balakrishna, Boyapati Sreenu, Telugu Film News]
.webp)






