TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉదయాన్నే కాఫీ,టీ బదులు ఈ డ్రింక్ తాగి చూడండి.. అద్భుతాలు చూస్తారు..

Published on: Mon Oct 5, 2026 10:37AM

ఉదయాన్నే  పరగడుపున టీ లేదా కాఫీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. రోజును చురుగ్గా ప్రారంభించడానికి కాఫీ, టీ లు తాగుతూ ఉంటారు.  అయినప్పటికీ ఇవి శరీరంలో  అసిడిటీ, హార్మోన్ల అసమతుల్యత , ఇతర జీర్ణ సమస్యలకు కారణమవుతాయి. వీటి స్థానంలో శరీరాన్ని చురుగ్గా ఉంచుతూనే శరీరంలో ఉన్న అనారోగ్యాలను, జబ్బులను, ఇబ్బందులను తగ్గించగల పానీయం తాగడం చాలా మంచిది.  ఈ పానీయాన్ని తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలు తొలగిపోవడమే కాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంతకీ అంత శక్తివంతమైన ఆ పానీయం ఏమిటో? దాన్ని ఎలా తయారుచేసుకుని తాగాలో.. వివరంగా తెలుసుకుంటే..

కావలసిన పదార్థాలు..

ధనియాలు, 

జీలకర్ర, 

సోంపు , 

వాము 

పైన పేర్కొన్న దినుసులలో ఆరోగ్యానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు , ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి.

​తయారీ విధానం...

ఈ పానీయాన్ని తయారు చేయడం చాలా సులభం. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాసు నీటిని తీసుకుని మరిగించాలి. అందులో అర టీస్పూన్ ధనియాలు, అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ సోంపు , పావు టీస్పూన్ వాము వేయాలి. ఈ మిశ్రమాన్ని నీరు సగం అయ్యేంత వరకు చిన్న మంటపై బాగా మరిగించాలి. నీరు బాగా మరిగిన తర్వాత వడకట్టి, గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. రుచి కోసం లేదా అదనపు ఆరోగ్య ప్రయోజనాల కోసం కాస్త నిమ్మరసం లేదా తేనె కూడా కలపవచ్చు.

ఈ పానీయం తాగడం వల్ల శరీరానికి కలిగే  ఉపయోగాలు..

​హార్మోన్ల సమతుల్యత..

మహిళల్లో ఎదురయ్యే థైరాయిడ్, పిసిఓడి , పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం  వంటి సమస్యలకు ఈ పానీయం చాలా మేలు చేస్తుంది.

ధనియాలు , సోంపు శరీరంలో హార్మోన్ల ఉత్పత్తిని క్రమబద్ధీకరించడానికి తోడ్పడతాయి.

​జీర్ణవ్యవస్థ మెరుగుదల..

జీలకర్ర , వాము జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ , మలబద్ధకం వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.

​రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ..

టైప్-2 డయాబెటిస్‌తో బాధపడేవారికి ఈ పానీయం సహాయపడుతుంది. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

బరువు తగ్గేందుకు సహాయం..

శరీరంలో ఉన్న కొవ్వును కరిగించడంలో జీలకర్ర , వాము కీలక పాత్ర పోషిస్తాయి. క్రమం తప్పకుండా ఈ పానీయం తాగడం ద్వారా శరీర మెటబాలిజం పెరిగి బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

​చర్మ సౌందర్యం , డిటాక్సిఫికేషన్..

శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఫలితంగా చర్మంపై మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం సహజంగా మెరుస్తుంది.

​కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం..

ఈ పదార్థాల్లో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు , వాపులను తగ్గించడంలో సహాయపడతాయి.

​ఈ డిటాక్స్ డ్రింక్‌ను ప్రతిరోజూ ఉదయం పరగడుపున క్రమం తప్పకుండా తాగడం ద్వారా శరీరంలో సహజమైన మార్పులను గమనించవచ్చు. టీ, కాఫీలకు ప్రత్యామ్నాయంగా ఈ నేచురల్  పానీయాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా శరీరంలో చాలా మార్పులు గమనించవచ్చు.

                      *రూపశ్రీ.