Home

»

Latest News

డీప్ ఫేక్ పై హీరో అభిమానుల బాధ్యతాయుతమైన పోరాటం: ఇక అసాంఘిక శక్తుల ఆట కట్టు! 

Oct 5, 2026 12:48PM


కల్మషం లేని స్వచ్ఛమైన శృంగారాన్ని బూతు వస్తువుగా భావించే కొంత మంది అసాంఘిక శక్తులు నేటి డిజిటల్ యుగాన్ని ఆసరాగా చేసుకొని ఏఐ సాయంతో సభ్య  సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. దేవరలోని చుట్టమల్లే సాంగ్ విషయంలో అసాంఘిక శక్తులు ప్రవర్తించిన తీరు చూస్తే ఒళ్ళు గగుర్పాటుకి గురవ్వాలసిందే.  ఎన్టీఆర్ నే రంగంలోని ఆ నీచులని వదలనని బహిరంగ ప్రకటన చేసాడంటే వాళ్ల బరితెగింపు ఏ స్థాయిలో హద్దులు దాటిందో అర్ధమవుతుంది.  

 సాంకేతికత పేరుతో జరిగే ఈ డిజిటల్ దాడి కేవలం ఒక వ్యక్తి గౌరవానికి మాత్రమే కాకుండా మొత్తం సమాజపు నైతిక విలువలకి  సవాలుగా నిలుస్తోంది. ఇలాంటి విపరీత ధోరణి పెరిగిపోతున్న సమయంలో ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా,హీరోల అభిమానిగా ప్రతి ఒక్కరి రోల్ ఎంతో కీలకమైనది. కేవలం అభిమాన హీరోల సినిమాలు చూడటమే కాకుండా, వారి పేరును మరియు ఇమేజ్‌ను అపహాస్యం చేసేలా తప్పుడు కంటెంట్‌ను సృష్టించే ముఠాల పట్ల అభిమానులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ఇలాంటి అసభ్యకర డీప్‌ఫేక్ వీడియోలను లేదా ఫోటోలను చూసినప్పుడు వాటికి లైక్‌లు కొట్టడం, షేర్ చేయడం లేదా కామెంట్ల ద్వారా పబ్లిసిటీ పెంచడం తీవ్రమైన పొరపాటు. అభిమానులు మరియు సోషల్ మీడియా వినియోగదారులు ఆ కంటెంట్‌ను ఏమాత్రం ప్రోత్సహించకుండా వెంటనే గుర్తింపు పట్టి, సంబంధిత ఆధారాలను సేకరించాలి.

సైబర్ వింగ్‌లోని రికార్డుల ప్రకారం దేశవ్యాప్తంగా ప్రతిరోజూ వందలాది డిజిటల్ ఫోర్జరీ, డీప్‌ఫేక్ మార్ఫింగ్ ఫిర్యాదులు నమోదవుతున్నాయి. 1930 హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా ప్రతిరోజూ వేలాదిమంది పౌరులు సైబర్ నేరాలపై ఫిర్యాదులు నమోదు చేస్తూ అప్రమత్తంగా ఉంటున్నారు. సమాజానికి హాని కలిగించే లేదా ప్రముఖుల గౌరవానికి భంగం కలిగించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్ఫింగ్ వీడియోలు కంటపడగానే అభిమానులు వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ www.cybercrime.gov.in ద్వారా గానీ, లేదా నేరుగా 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి గానీ పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఇంటర్నెట్ సమాజంలో ఐటీ యాక్ట్ (Information Technology Act) అలాగే బిఎన్ఎస్ (BNS Section 318) కింద డిజిటల్ రూపంలో అశ్లీలత వ్యాప్తి చేయడం, మార్ఫింగ్ చేయడం తీవ్రమైన శిక్షార్హమైన నేరం.


ఇది కూడా చదవండి: సంచలన విషయాలు బయటపెట్టిన సుప్రీత: ఆ ముగ్గురు వీళ్లేనా!

 

 

బాధ్యతగల పౌరులుగా మరియు ఆర్మీ లాంటి అభిమాన సంఘాలుగా ప్రతి ఒక్కరూ ఒకటై సైబర్ క్రిమినల్స్ ఆటకట్టించాలి. ఫేక్ వీడియోలను తయారు చేసే ముఠాల అసలు మూలాలను బయటపెట్టి, వాటిని సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లి నేరస్థులకు కఠిన శిక్ష పడేలా సహకరించడమే మన ప్రియమైన హీరోలకు మరియు సమాజానికి ఇచ్చే నిజమైన గౌరవం. నూటికి నూరు శాతం మీరు అనుకుంటే అవుతుంది.. ఇది సినీ చరిత్ర ఎప్పట్నుంచో నిరూపిస్తూ వస్తున్న అభిమాన సత్యం .

 

[Hero Fans Responsibility AI Deepfakes, Ntr Warning  AI Deepfakes, Ai Deepfake Celebrity Scams cyber crime report, AI Deepfakes, Cyber Crime Reporting, Hero Fans Responsibility, National Cyber Crime Portal 1930,Telugu Cinema  News, Telugu cinema, Tollywood News, Tollywood]

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com