
మామూలుగానే ప్రభాస్ మూవీ,సందీప్ రెడ్డి మూవీ అంటేనే క్రేజ్ ఒక రేంజ్ లో ఉంటుంది. అలాంటిది ఇద్దరి కలిసి 'స్పిరిట్' చేస్తుంటే క్రేజ్ స్థాయి పరిస్థితి ఏ సిట్యువేషన్ ని ఎదుర్కొంటు ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్న స్పిరిట్ కి సంబంధించిన తాజా న్యూస్ సోషల్ మీడియాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది.
ప్రభాస్ పోలీసు ఆఫీసర్ క్యారక్టర్ తో పాటు, మాఫియా డాన్ షేడ్స్ ఉన్న నెగటివ్, గ్రే క్యారెక్టర్ లో దర్శనమివ్వబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, సమాజంలో సాధారణంగా గ్రే లేదా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను విలనిజంతో ముడిపెడతారు. కానీ సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ చిత్రంలో డిజైన్ చేస్తున్న ప్రభాస్ క్యారెక్టర్ లోని గ్రే షేడ్స్ వెనుక ఒక ఊహించని, బలమైన పాజిటివ్ యాంగిల్ దాగి ఉందని సమాచారం. కథా కథనాల ప్రకారం, ఒక నీతివంతమైన పోలీసు ఆఫీసర్ గా ప్రయాణం ప్రారంభించే కథానాయకుడు, సమాజంలో పేరుకుపోయిన అవినీతి, అన్యాయాలని అంతమొందించడానికి చట్ట పరిధులని దాటాల్సి వస్తుంది. నీతి నిజాయితీలతో మాత్రమే విజయం సాధించలేమని గ్రహించిన వేళ, దుష్టులను శిక్షించేందుకు తాను ఒక పవర్ ఫుల్ మాఫియా డాన్ అవతారమెత్తుతాడు. బయటికి కఠినంగా, గ్రే షేడ్స్ తో కనిపించినప్పటికీ, ఆ రోల్ చేసే ప్రతి పని వెనుక సమాజ శ్రేయస్సు, ఒక గొప్ప ధర్మ పోరాటం ఉందనేదే క్యారక్టర్ లోని అసలైన పాజిటివ్ కోణం.
ఇది కూడా చదవండి: సింగీతం శ్రీనివాసరావు స్పెషల్ ఏంటి!
.webp)
ఏది ఏమైనా ప్రభాస్, సందీప్ రెడ్డి మూవీ కాబట్టి పైన చెప్పకున్న న్యూస్ లాంటివి వస్తూనే ఉంటాయి. అసలు నిజం మాత్రం వాళ్ళు చెప్పినప్పుడే తెలుస్తుంది. ప్రభాస్ సరసన యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి జత కడుతున్న విషయం తెలిసిందే.
[Prabhas character In Spirit Movie, Spirit Prabhas movie updates, Sandeep Reddy Vanga Prabhas film, Prabhas grey shades character Spirit, Spirit movie budget 300 crores, Prabhas cop role Spirit, Spirit film latest news,Telugu Cinema News, Telugu cinema, Tollywood News, Tollywood]
.webp)






