LATEST NEWS
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఒకవైపు ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అనర్హతతో నియోజకవర్గం ఖాళీ కాగా.. మరోవైపు ఉపఎన్నిక నోటిఫికేషన్‌ విషయంలో హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఖైరతాబాద్‌ ఉపఎన్నికకు సంబంధించి కాంగ్రెస్‌ నేత పి. విజయారెడ్డి దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ తుది పరిష్కారం అయ్యే వరకు ఉపఎన్నిక నోటిఫికేషన్‌ జారీ చేయబోమని భారత ఎన్నికల సంఘం (ECI) హైకోర్టుకు తెలిపింది. విజయారెడ్డి 2024లోనే దానం నాగేందర్‌ ఎన్నికను సవాల్‌ చేస్తూ ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నుంచి దానం నాగేందర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గెలిచారు.  అనంతరం ఆయన కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ ఫిరాయింపుపై దాఖలైన పిటిషన్ల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్‌ 18న దానం నాగేందర్‌ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించింది. ఆ తర్వాత ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువడింది. దానం నాగేందర్‌ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేసినప్పటికీ.. సెప్టెంబర్‌ 24న ఆయన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.  దీంతో ఖైరతాబాద్‌కు ఉపఎన్నిక జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో 2024లో దానం నాగేందర్‌ ఎన్నికను సవాల్‌ చేస్తూ తాను దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ తుది తీర్పు వచ్చే వరకు ఉపఎన్నిక నోటిఫికేషన్‌ ఇవ్వకుండా ఈసీఐని ఆదేశించాలని విజయారెడ్డి తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఎలక్షన్‌ పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నందున ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక నిర్వహించబోమని ఈసీఐ హైకోర్టుకు తెలిపింది. ఇప్పుడు ఈ పిటిషన్‌పై హైకోర్టు తీసుకునే నిర్ణయం కీలకంగా మారింది. కోర్టు విచారణ నేపథ్యంలో ఖైరతాబాద్‌ ఉపఎన్నిక నోటిఫికేషన్‌ ఎప్పుడు వెలువడుతుందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. దీంతో ఖైరతాబాద్‌ ఉపఎన్నికపై రాజకీయ ఆసక్తితో పాటు న్యాయపరమైన ఉత్కంఠ కూడా కొనసాగుతోంది.       [ Khairatabad by-election notification, Telangana High Court, Danam Nagender, Election Commission, Vijaya Reddy, CM Revanth reddy, BRS Party, KTR, Telugu One, Telugu News ]
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా.. అసాధారణ ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గుజరాత్ ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని ప్రకటించింది. ఆయనకు రాష్ట్ర అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన విశిష్ట గుజరాత్ గరిమా అవార్డును అందించనున్నట్లు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటించారు. దుబాయ్‌ నుంచి టెల్‌ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్‌ ఎఫ్‌జెడ్‌1073 విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగా.. కాక్‌పిట్‌లో కో-పైలట్ అకస్మాత్తుగా కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై క్రాష్ యాక్స్ వంటి వస్తువుతో దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడినప్పటికీ స్మిత్ మచ్చర్ ఏమాత్రం ధైర్యం కోల్పోలేదు. అదే సమయంలో విమానం ఒక్కసారిగా భారీగా కిందకు దిగింది. దాదాపు 17 వేల అడుగుల ఎత్తును కేవలం ఒక్క నిమిషంలోనే కోల్పోయినట్లు ఫ్లైట్‌ ట్రాకింగ్‌ వివరాలు వెల్లడించాయి. పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారినప్పటికీ.. స్మిత్ మచ్చర్ విమానాన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు.తీవ్ర గాయాలతోనే కాక్‌పిట్‌ తలుపు తెరిచేందుకు ఆయన ప్రయత్నించడంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లగలిగారు. అనంతరం కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్‌కు మళ్లించి అత్యవసరంగా సురక్షిత ల్యాండింగ్ చేశారు. విమానంలో ఉన్న 174 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు. స్మిత్ మచ్చర్ అసాధారణమైన సహనం, సమయస్ఫూర్తి, ధైర్యాన్ని ప్రదర్శించారని ప్రశంసించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ సైతం స్మిత్ ధైర్యాన్ని కొనియాడారు.  ఆయన చర్యల వల్ల భారీ విషాదం తప్పిందని పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన స్మిత్ మచ్చర్‌కు తొలుత సౌదీ అరేబియాలోని మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయనను యూఏఈకి ఎయిర్‌లిఫ్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు భారత అధికారులు తెలిపారు.స్మిత్ మచ్చర్ తెగువను గుర్తించిన గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్.. ఆయన్ను ‘గుజరాతీ వీరపుత్రుడుగా అభివర్ణించారు. రక్తమోడుతున్న పరిస్థితుల్లోనూ 174 మంది ప్రాణాలను కాపాడేందుకు ఆయన చూపిన ధైర్యం స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. స్మిత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు సీఎం తెలిపారు.గాల్లో ప్రాణాపాయం.. కళ్లముందు 174 మంది ప్రాణాలు.. ఒంటిపై తీవ్ర గాయాలు.. అయినా విమానాన్ని కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.         [ Pilot Smit Machchhar, Flydubai hero pilot, Gujarat Garima Award, Bhupendra Patel, Flydubai emergency landing,Heroic Indian pilot, Flydubai pilot attack, Indian pilot bravery, Dubai Tel Aviv flight incident, PM Modi supports pilot family ]  
కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న వేళ.. దాని భవిష్యత్తుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు టెక్ రంగంలోని ప్రముఖులు అత్యంత శక్తివంతమైన ఏఐ వ్యవస్థలు అదుపు తప్పితే మానవాళికి తీవ్ర ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. మరోవైపు అమెరికా వంటి దేశాల రాజకీయ నాయకత్వం మాత్రం ఏఐ అభివృద్ధిని నెమ్మదించడం భవిష్యత్ ఆర్థిక, సాంకేతిక, భౌగోళిక ఆధిపత్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని భావిస్తోంది. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ గతంలో వ్యక్తం చేసిన ఆందోళనల ప్రకారం.. అత్యంత శక్తివంతమైన ఏఐ వ్యవస్థలు చెడు ఉద్దేశాలు కలిగిన వ్యక్తుల చేతుల్లోకి వెళితే భారీ స్థాయిలో విపత్తులు సంభవించే అవకాశం ఉంది. ఏఐ స్వయంగా ‘చెడు’గా ఉండాల్సిన అవసరం లేదని.. అది అత్యంత శక్తివంతంగా ఉండి, దాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తుల చేతుల్లో పడితేనే ప్రమాదం తీవ్రంగా మారుతుందని ఆయన హెచ్చరించినట్లు వీడియోలో ప్రస్తావించారు. ఈ తరహా పరిస్థితుల్లో భారీ ప్రాణనష్టం సంభవించే అవకాశాన్ని కూడా ఆయన సూచించారు. ఏఐ సంస్థలు తమంతట తామే నియంత్రణలు విధించుకోవడం లేదా అత్యవసర సమయంలో వ్యవస్థను ఆపేందుకు ‘కిల్ స్విచ్’లు ఏర్పాటు చేయడం మాత్రమే సరిపోదన్నది మరో ఆందోళన. ఆధునిక ఏఐ వ్యవస్థలు కంప్యూటింగ్ నెట్‌వర్క్‌లు, ఆర్థిక వ్యవస్థలు, కీలక మౌలిక సదుపాయాలు వంటి అనేక రంగాలతో అనుసంధానమవుతున్న నేపథ్యంలో.. వాటి సామర్థ్యం పెరిగే కొద్దీ భద్రతా ప్రమాదాలు కూడా పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడీ కూడా ఏఐ ఏజెంట్ల సామర్థ్యం వేగంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసినట్లు వీడియో పేర్కొంది. స్వతంత్రంగా పనిచేసే ఏఐ ఏజెంట్లు ఇంటర్నెట్‌లోని వివిధ కార్యకలాపాలను చేపట్టే స్థాయికి చేరితే.. నియంత్రణలు విఫలమైన సందర్భంలో భారీ ఆర్థిక నష్టం సంభవించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడినట్లు ఇందులో వివరించారు. ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్‌తో కలిసి ఆస్ట్రేలియా సెనేట్‌లో ఏఐ భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన విషయాన్ని కూడా వీడియో ప్రస్తావిస్తుంది. అయితే అమెరికా రాజకీయ దృక్పథం మరో కోణాన్ని చూపిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ వైఖరి ప్రకారం.. అమెరికా ఏఐ అభివృద్ధిని నిలిపివేయడం లేదా నెమ్మదించడం వల్ల చైనా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ప్రపంచ ఏఐ పోటీలో అమెరికా ఆధిపత్యాన్ని కొనసాగించాలంటే అభివృద్ధి వేగాన్ని తగ్గించకూడదన్నదే ఈ వాదన సారాంశం. ఏఐ ప్రభావాన్ని పారిశ్రామిక విప్లవం, ఇంటర్నెట్ వంటి గతంలోని సాంకేతిక మార్పులతో పోల్చుతూ.. ఇది ఆర్థిక వ్యవస్థను, సాంకేతిక రంగాన్ని పూర్తిగా మార్చగల సామర్థ్యం కలిగిన పరిణామంగా ఈ దృక్పథం చూస్తోంది. ముందస్తుగా అభివృద్ధిని నిలిపివేయడం కంటే.. ఏఐ దుర్వినియోగం లేదా నేరాలకు పాల్పడిన సందర్భాల్లో చట్టపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా సమస్యలను ఎదుర్కోవచ్చనే ఆలోచన కూడా ఇందులో ఉంది. ఇలా ఏఐపై ప్రపంచవ్యాప్తంగా రెండు భిన్నమైన దృక్పథాలు స్పష్టమవుతున్నాయి. ఒకటి.. నియంత్రణలు, అంతర్జాతీయ సహకారం, భద్రతకు ప్రాధాన్యమిస్తూ భవిష్యత్‌లో సంభవించే భారీ ప్రమాదాలను ముందుగానే నివారించాలనే ఆలోచన. మరొకటి.. ఏఐ అభివృద్ధిని నెమ్మదించడం ద్వారా ఆర్థిక, సాంకేతిక, వ్యూహాత్మక ఆధిపత్యాన్ని కోల్పోయే ప్రమాదమే ఎక్కువని భావించే దృక్పథం. అసలు ప్రశ్న మాత్రం ఒక్కటే.. ఏఐ అభివృద్ధి వేగాన్ని కొనసాగిస్తూ భద్రతను ఎలా కాపాడాలి? సాంకేతిక పురోగతి ఎంత వేగంగా సాగుతుందో.. దానికి అనుగుణంగా నియంత్రణ వ్యవస్థలు, భద్రతా ప్రమాణాలు కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్న చర్చ ఇప్పుడు మరింత కీలకంగా మారుతోంది.       [ AI, Artificial Intelligence, AI Risks, AI Safety, Bill Gates, Dario Amodei, Anthropic, Sam Altman, OpenAI, Donald Trump, US AI Race, China AI Race, AI Regulation, AI Governance, AI Security, Autonomous AI Agents, AI Apocalypse, AI Development, AI Geopolitics, AI Technology, Global AI Race ]
బైక్ క్లచ్ వైరుతో గొంతు బిగించి కిరాతకంగా హతమార్చాడు.! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో సెప్టెంబర్ 22న జరిగిన 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి హత్య ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు తీవ్రంగా శ్రమించి చివరకు మిస్టరీని ఛేదించారు. అదే గ్రామానికి చెందిన దేవరకొండ పవన్ కుమార్‌ను ఏపీలోని తిరుపతిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంగన్నపాలెంకు చెందిన సతీష్, రాజేశ్వరి దంపతుల కుమార్తె హరిణి, నిందితుడు పవన్ కుమార్‌ గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. అయితే పవన్ ఎలాంటి పనిపాట లేకుండా మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతుండటంతో హరిణి అతనికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే సుమారు ఏడాది క్రితం ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో పెద్ద మనుషుల పంచాయతీ కూడా నిర్వహించారు.  పవన్ ప్రవర్తన సరిగా లేకపోవడంతో తమ కుమార్తెను ఇచ్చి వివాహం చేసేది లేదని ఆమె కుటుంబ సభ్యులు తేల్చిచెప్పినప్పటికీ పవన్ తీరులో ఎలాంటి మార్పు రాలేదు. పైగా ఆమె వెంటపడుతూ తరచూ వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు. ఈ వేధింపులతో తీవ్రంగా విసిగిపోయిన హరిణి, అతడి ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేయడంతో పాటు తన సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను సైతం మార్చేసింది. తనను పూర్తిగా దూరం పెడుతోందన్న తీవ్రమైన కక్ష, అక్కసుతోనే పవన్ కుమార్ ఈ రాక్షసానందానికి ఒడిగట్టాడు.   పథకం ప్రకారమే సెప్టెంబర్ 22న మధ్యాహ్నం సమయంలో హరిణి ఇంటికి వెళ్లిన పవన్, ఆ సమయంలో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయాన్ని ఆసరాగా చేసుకుని వాగ్వాదానికి దిగాడు. తనను ఎందుకు కాదంటున్నావంటూ ఆమెను నిలదీశాడు. హరిణి ఎంతకీ అంగీకరించకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి, ఆవేశానికి గురైన నిందితుడు పవన్.. తన వెంట తెచ్చుకున్న బైక్ గేర్ వైరుతో హరిణి మెడకు గట్టిగా బిగించి అత్యంత క్రూరంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఇంటి పక్కన ఉన్న మెట్ల సందులో పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు.  సాయంత్రం వేళ తల్లి రాజేశ్వరి ఇంటికి వచ్చి చూసేసరికి హరిణి ఒళ్లంతా గాయాలతో, ముక్కు నుంచి రక్తంతో విగతజీవిగా పడి ఉంది. ఈ ఘటనపై తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడి సెల్‌ఫోన్ ఐఎంఈఐ నంబర్‌ ఆధారంగా నిఘా పెట్టగా కీలక విషయం వెలుగులోకి వచ్చింది. గత రెండు మూడు రోజులుగా మరో వ్యక్తి సెల్‌ఫోన్ హాట్‌స్పాట్‌ను వినియోగిస్తూ పవన్ తన ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్‌లను పరిశీలిస్తున్నట్లు పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా గుర్తించారు.   ఆ లొకేషన్‌ను కచ్చితంగా ట్రేస్ చేసిన పోలీసులు పవన్ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు బృందం తిరుపతికి వెళ్లి అక్కడ హాట్‌‌స్పాట్ ఇచ్చిన ఓ సుతారి మేస్త్రీని అదుపులోకి తీసుకుని విచారించారు. గత ఐదారు రోజులుగా పవన్ తన వద్దే పని చేస్తున్నట్లు ఆ మేస్త్రీ చెప్పిన సమాచారంతో పోలీసులు సరిగ్గా ఆ ప్రాంతానికి వెళ్లి మంగళవారం సాయంత్రం పవన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జూలూరుపాడు సర్కిల్ పరిధిలోని పోలీస్‌‌స్టేషన్‌కు తరలించి, ఇద్దరు సీఐల ఆధ్వర్యంలో తీవ్రంగా విచారిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు వివరాలను కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ విలేకరుల సమావేశంలో అధికారికంగా వెల్లడించారు. 24 గంటల్లో నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ గతంలో జరిగిన రాస్తారోకోలు, ఉద్రిక్తతల అనంతరం పోలీసులు చూపిన ప్రతిభను స్థానికులు అభినందిస్తున్నారు.        [ Harini murder case, Julurupadu police, Bhadradri Kothagudem, nursing student Harini, Pawan Kumar arrested, Vengannapalem crime news,CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand, Hyderabad police, Telugu One, Telugu News ]
మోసపోయాం.. గోసపడుతున్నాం..సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం.! తెలంగాణలో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు రైతులు కరెంట్, రైతుబంధు, యూరియా కోసం అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. కనీసం ఆరు గంటలు కూడా విద్యుత్ అందడం లేదని రైతులు తన దృష్టికి తీసుకొస్తున్నారని చెప్పారు.‘‘మీరు మా పక్షాన నిలబడి ఈ ప్రభుత్వంపై పోరాడాలి’’ అని ప్రజలు కోరుతున్నారని కేటీఆర్ అన్నారు. రైతుబంధు రావడం లేదని, యూరియా దొరకడం లేదని రైతులు కంటతడి పెడుతున్నారని చెప్పారు. కేసీఆర్ హయాంలో ఒక్క ఫోన్ చేస్తే యూరియా పొలం వద్దకే వచ్చేదని రైతులు చెబుతున్నారని తెలిపారు. కేసీఆర్ అప్పట్లోనే ‘‘మోసపోకండి.. మోసపోతే గోసపడతాం’’ అని హెచ్చరించారని, ఇప్పుడు అదే పరిస్థితి తెలంగాణలో కనిపిస్తోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పదేళ్లు పాలన చూశాం.. కొత్తవారికి అవకాశం ఇద్దామని ప్రజలు భావించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు.! కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీరు, విద్యుత్ విషయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్‌రెడ్డి గత పరిస్థితులను తిరిగి తీసుకొస్తానని చెప్పారని.. ఇప్పుడు రైతులకు కన్నీళ్లు తెప్పించే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోళ్లు, ఫార్ములా-ఈ రేసు తదితర అంశాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్లను ప్రస్తావిస్తూ.. వాటి పేరుతో పెద్ద ఎత్తున రాజకీయ ప్రచారం చేసినా చివరకు ఏమి తేలలేదని కేటీఆర్ విమర్శించారు.ప్రజల దృష్టిని మళ్లించేందుకే గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, గ్యారెంటీలపై ప్రజలు ప్రశ్నిస్తారని భయంతో ఇతర అంశాలను తెరపైకి తెస్తున్నారని అన్నారు. సిరిసిల్లలో నేతన్నల సమస్యలపై ప్రశ్నలు.! సిరిసిల్ల పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి నేతన్నల సమస్యలపై స్పష్టమైన ప్రకటన చేస్తారని తాము ఆశించామని కేటీఆర్ అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు తగ్గాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఆరోపించారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు, స్కూల్ యూనిఫాం ఆర్డర్లు నిలిచిపోయాయని, నేతన్న బీమా పరిస్థితి ఏమిటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులకు పరిహారం ప్రకటిస్తారని ఆశించినా.. ఎలాంటి ప్రకటన చేయలేదని విమర్శించారు. రేవంత్‌పై వ్యక్తిగత విమర్శలు.! సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి తన కుటుంబ ఆస్తులు, వ్యాపారాలపై చేసిన వ్యాఖ్యలపైనా కేటీఆర్ స్పందించారు. తాను అమెరికాలో ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బుతో 2006లో హోటల్ వ్యాపారం ప్రారంభించానని చెప్పారు. తన ఆస్తులకు సంబంధించిన వివరాలను ఎన్నికల అఫిడవిట్లలోనే వెల్లడించానన్నారు. తన అఫిడవిట్లలో ఉన్న విషయాలను కొత్తగా బయటపెట్టినట్టుగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. వ్యాపారం చేసుకోవడం తప్పా? అని ప్రశ్నించారు. తనకు భార్య, పిల్లలకు జీవనం కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. రేవంత్‌రెడ్డి తనపై ఎన్ని విమర్శలు చేసినా.. ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటానని కేటీఆర్ స్పష్టం చేశారు. హామీలపై నిలదీస్తూనే ఉంటాం..! ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన ఎస్సీ, యువత, రైతు, బీసీ డిక్లరేషన్లపై కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. దళితబంధు కింద రూ.12 లక్షలు ఇస్తామని చెప్పి అమలు చేయలేదని ఆరోపించారు. బీసీలకు లక్ష కోట్ల నిధులు, కాంట్రాక్టులు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.మైనారిటీలకు రూ.4 వేల కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పి ఆ హామీని కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు. కేసీఆర్ కిట్, బతుకమ్మ చీరలు, రైతుబీమా వంటి పథకాలు నిలిచిపోయాయని ఆరోపించారు.రాహుల్ గాంధీ, బీజేపీ ఇచ్చిన హామీలను కూడా కేటీఆర్ ప్రస్తావిస్తూ.. ఎన్నికల హామీల అమలుపై అన్ని పార్టీలను ప్రజలు ప్రశ్నించాలని అన్నారు. ‘మళ్లీ కేసీఆర్ నాయకత్వమే’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు.! గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రజలు కేసీఆర్‌ను గుర్తుచేసుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ తిరిగి వస్తే తెలంగాణ మళ్లీ అభివృద్ధి బాటలోకి వస్తుందని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు.రాష్ట్రంలో రైతులు, పేదలు సంతోషంగా ఉండాలంటే కేసీఆర్ నాయకత్వం అవసరమని కేటీఆర్ అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని, ప్రజలు ఆ పార్టీకి తగిన సమాధానం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.       [ KTR, KTR Hot Comments, KTR Hotels, KTR Five Star Hotels, KTR Business, KTR Affidavit, CM Revanth Reddy,Telangana Politics, BRS, Congress, Telangana News, KTR Counter, KTR Latest News, Telangana Political News ]
ALSO ON TELUGUONE N E W S
Actress and producer Amala Akkineni launched S.S. Krishna Kiriti’s debut novel Shiva Rupaya Vishnave: Part One – The Warhorse and The Dancer at an event held at Annapurna Studios, Hyderabad, on September 30. The launch was attended by students and alumni of Annapurna International School of Film and Media, where Krishna Kiriti is an alumnus. Published by Mayasabha Publications, Shiva Rupaya Vishnave: Part One – The Warhorse and The Dancer is the opening volume of a planned trilogy that explores faith, memory, political power, loyalty, betrayal and the human consequences of belief against the backdrop of South Indian history. The story begins three years after a war, with Emperor Sri Krishna Devaraya returning to a prosperous Vijayanagara. Unable to escape the weight of his memories despite trying conventional remedies, he encounters a dancer from Kuchipudi who offers him an unusual cure — a story. The narrative then moves backwards through nearly eight centuries, connecting the lives of kings, warriors, sculptors, philosophers, priests, dancers and ordinary people whose choices eventually contribute to the creation of a God. A distinctive feature of the novel is its reverse-chronological narrative, with the trilogy beginning with consequences and gradually moving towards the origins of the story. Written in English but deeply rooted in Telugu cultural and historical traditions, the book combines historical fiction, mythology, literary fiction and philosophical inquiry. The book also features an original song written by Krishna Kiriti, composed by Mani Sharma and sung by the late S.P. Balasubrahmanyam, which readers can access through a QR code inside the novel. Krishna Kiriti holds a Master's degree in Film and Media from Annapurna International School of Film and Media and has worked as a writer and assistant director in Telugu cinema. Shiva Rupaya Vishnave: Part One – The Warhorse and The Dancer marks his first novel and the beginning of the planned trilogy. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, ఆయన ప్రేయసి, నటి-సింగర్ సబా ఆజాద్ తమ సంబంధంలో మరొక అద్భుతమైన మైలురాయిని చేరుకున్నారు. 2026 అక్టోబర్ 1వ తేదీన ఈ  జంట కలిసి ఐదేళ్ల బంధాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని హృతిక్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని మధురమైన, మునుపెన్నడూ చూడని వెకేషన్ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. "ఇది మన బర్త్‌డే.. హ్యాపీ 5త్ మై లవ్" అంటూ అత్యంత ప్రేమపూర్వక శీర్షికను జోడించి సబాపై ఉన్న ప్రేమాభిమానాన్ని వ్యక్తపరిచారు. విమానంలో పైలట్ హెడ్‌సెట్‌లతో దిగిన క్యాజువల్ సెల్ఫీ, సముద్రపు ఒడ్డున సూర్యాస్తమయం వేళ పక్కపక్కనే నిలబడిన అందమైన జ్ఞాపకాలు వీరిద్దరి మధ్య ఉన్న గాఢమైన అనుబంధాన్ని ప్రతిబింబిస్తున్నాయి. వీరిద్దరి ప్రేమ ప్రయాణం 2021 చివరలో ప్రారంభమైనప్పటికీ, 2022లో ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ 50వ జన్మదిన వేడుకలకు ఇద్దరూ చేతిలో చెయ్యి వేసి హాజరవ్వడంతో వీరి ప్రేమ వ్యవహారం ప్రపంచానికి అధికారికంగా తెలిసింది. 1974 జనవరి 10న జన్మించిన 52 ఏళ్ల హృతిక్, 1985 నవంబర్ 1న జన్మించిన 40 ఏళ్ల సబా ఆజాద్‌ ల మధ్య దాదాపు 12 ఏళ్ల వయస్సు వ్యత్యాసం ఉంది. వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, నిజమైన ప్రేమకు భావాలు, అర్థం చేసుకునే మనసే ముఖ్యమని వీరు నిరూపించారు.2000 సంవత్సరంలో సుసాన్ ఖాన్‌ను వివాహం చేసుకుని, 14 ఏళ్ల సుదీర్ఘ బంధం తర్వాత 2014లో విడాకులు తీసుకున్న హృతిక్, ఆమెతో ఇద్దరు కుమారులు హ్రేహాన్, హ్రిదాన్‌లను పంచుకుంటున్నారు. అయితే వీరి గతం వీరి ప్రస్తుత ఆనందానికి ఏమాత్రం అడ్డంకిగా మారలేదు. హృతిక్ మాజీ భార్య సుసాన్ ఖాన్ కూడా ఈ ముచ్చటైన జంటను అభినందిస్తూ "సో స్వీట్, హ్యాపీ యానివర్సరీ" అంటూ హృదయపూర్వక కామెంట్ చెయ్యడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సబా సైతం రోషన్ కుటుంబంలో ఒకరిగా మారిపోయి, పండుగలు, కుటుంబ వేడుకలు మరియు ఫ్యామిలీ డిన్నర్లలో క్రమం తప్పకుండా పాల్గొంటోంది.        ఇది కూడా చదవండి: అశ్లీల సన్నివేశాలు: అమలాపాల్ షాకింగ్ కామెంట్స్.. ఎవరి కోసం!  కెరీర్ విషయానికి వస్తే, హృతిక్ రోషన్ ఇటీవల ఎన్టీఆర్, కియారా అద్వానీలతో కలిసి భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'వార్ 2'లో కబీర్ ధలివాల్ పాత్రలో నటించి ఆకట్టుకోగా, అలియా భట్ 'ఆల్ఫా'లో అతిథి పాత్రలో మెరిసారు. సబా ఆజాద్ కూడా అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన 'బందార్' చిత్రంలో మరియు సంగీత ప్రపంచంలో తన సత్తా చాటుతోంది. ఐదేళ్లుగా నిలకడగా, అప్యాయంగా సాగుతున్న ఈ ప్రయాణం రాబోయే రోజుల్లో వివాహ బంధంగా మారుతుందేమోనని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.   [Hrithik Roshan Saba Azad celebrate Five Years Together,Hrithik Roshan, Saba Azad, Bollywood, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]  
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో నాయక్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలతో' వంటి చిత్రాల్లో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న భామ అమలాపాల్.దీంతో ఆమె పేరు చెప్పగానే మెమొరీబుల్ సినీ మూమెంట్స్ గుర్తుకొస్తాయి.  ఇక తను  2019వ సంవత్సరంలో వచ్చిన ‘ఆడై’ (తెలుగులో ‘ఆమె’) చిత్రం ద్వారా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద సంచలనమే సృష్టించారు. రత్నకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమలాపాల్ కామిని అనే టీవీ జర్నలిస్ట్ పాత్రలో కనిపించి, ఎవరూ చేయని విభిన్నమైన సాహసాన్ని చేశారు. అయితే, తాజాగా ఈ సినిమాలో తాను చేసిన రిస్కీ నగ్న ఘట్టాల చిత్రీకరణ గురించి, ఆ సమయంలో పడ్డ భయాల గురించి అమలాపాల్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.   ముఖ్యంగా ఈ చిత్రంలోని ఒక అత్యంత కీలకమైన అశ్లీల సన్నివేశాన్ని దర్శకుడు రత్నకుమార్ ఏ విధంగా తీస్తారో అనే తీవ్రమైన ఆందోళన తనను వెంటాడిందని ఆమె తెలిపారు.  కథలోని ఆత్మను పక్కన పెట్టి, కేవలం ఆ బోల్డ్ మరియు న్యూడ్ అంశంపైనే శ్రద్ధ పెడతారేమో అని తను తీవ్రంగా భయపడినట్లు వివరించారు. ఆ సినిమా మేకర్ల ఆలోచనా విధానాన్ని, విజన్‌ను పూర్తిగా అర్థం చేసుకోవడానికి తనకు దాదాపు 2 నెలల సుదీర్ఘ సమయం పట్టిందని అమలాపాల్ గుర్తుచేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై నిర్ణయం తీసుకునే ముందు చిత్ర బృందంతో కలిసి ప్రయాణం చేస్తూ వారి నిజాయితీని పరిశీలించిన తర్వాతే తను ముందడుగు వేశారు.   ఒక వైపు తన వ్యక్తిగత ఇమేజ్ దెబ్బతింటుందేమోనన్న భయం, మరోవైపు భవిష్యత్తు కెరీర్‌లో కూడా తనను ఇలాంటి టైప్ కాస్ట్ లేదా స్టీరియోటైప్ పాత్రలకే పరిమితం చేస్తారేమోనన్న ఆందోళన ఆమెను తీవ్రంగా కలిచివేశాయి. అయినప్పటికీ, దర్శకుడి పనితనం పై ఉన్న నమ్మకంతో ఒక పెద్ద రిస్క్ తీసుకుని  గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది కూడా చదవండి: ది ప్యారడైజ్ కి సంబంధించి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారో తెలుసా: పాపం భయ్యా!      చిత్రీకరణ సమయంలో తనను ఎంతో సౌకర్యవంతంగా ఉంచడానికి సెట్‌లో కేవలం అతితక్కువ మంది క్రూ సభ్యులను మాత్రమే అనుమతించారని, సుమారు 20 రోజులకు పైగా సాగిన ఈ తరహా బోల్డ్ షూటింగ్‌లో తనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేకర్స్ జాగ్రత్త పడ్డారని చెప్పారు.   అప్పట్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుని, సెన్సార్ బోర్డు నుండి ఏ సర్టిఫికెట్ పొందింది. అయితే తన జీవితంలో వయస్సు, అనుభవంతో పాటు ప్రాధాన్యతలు మారాయని చెబుతూ, 'ఒకవేళ ఇప్పుడు గనుక నన్ను ఆడై వంటి పాత్ర చేయమని అడిగితే, కచ్చితంగా నేను అలాంటి నిర్ణయం తీసుకోను మరియు నటించను' అని అమలాపాల్ స్పష్టం చేశారు.      [Amala Paul About Aadai Movie Bold Scenes,Amala Paul, Aadai Movie, Amala Paul Nude Scene, Aame Movie Telugu, Amala Paul Interview, Telugu Cinema News, Telugu Cinema, Tollywood Cinema News, Tollywood]  
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు.. ఈ పేరు చెప్పగానే తెలుగు సినిమా అమ్ముల పొదిలో  దాగి ఉన్న తన సినీ లిస్ట్ బయటకి వస్తుంది. కామెడీ, స్ఫూఫ్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సంపూర్ణేష్ బాబునేచురల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' లో బిర్యానిగా అలరించాడు.  రీసెంట్ గా తను ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు 'గతం లో నేను  హీరోగా చేసినప్పుడు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చేవారో , అంతకు మూడు రెట్లు రెమ్యూనరేషన్ ఇచ్చారని చెప్పుకొచ్చాడు. అంటే 3 కోట్ల రూపాయిలు వరకు అన్నమాట. అయితే రెమ్యూనరేషన్ పరంగా సంపూర్ణేష్ బాబు కి న్యాయం చేశారు కానీ , అతనిలో మంచి నటుడు ఉన్నాడని , ఆ నటుడిని వాడుకోలేకపోయారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి కామెంట్స్ వినిపిస్తోంది. తాను చెప్పడమే కాకుండా ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం, 'ది ప్యారడైజ్' 2 కోట్ల నుండి 3 కోట్ల వరకు పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.  ఇది కూడా చదవండి: ఓటిటిలోకి మహేంద్రగిరి వారాహి: కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే!     మరి హీరోగా సంపూర్ణేష్ బాబు ఎంత అందుకునేవాడని  3 కోట్ల రూపాయిలు అంటున్నారో, సినీ సర్కిల్స్ లో కూడా అదే 3 కోట్లు ఎందుకు చక్కర్లు కొడుతుందో తెలియదు. ఏది ఏమైనా కరెక్ట్ రెమ్యునరేషన్ చెప్పేవరకు 3 కోట్లు అనేది రూమర్ మాత్రమే. రూమర్ వీరుల ఆనందాన్ని మనమెందుకు కాదనాలి.   [Sampoornesh Babu Remuneration For The Paradise Movie, Sampoornesh Babu Remuneration, The Paradise Telugu Movie, Nani The Paradise, Telugu Cinema News, Telugu Cinema, Tollywood Cinema News, Tollywood]  
    సుదీర్ఘ నటనా అనుభవం ఉన్న  సుమంత్ నుంచి వచ్చిన రీసెంట్ చిత్రం మహేంద్రగిరి వారాహి'. డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కగా.సెప్టెంబర్ 11, 2026న థియేటర్లలో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకుంది.  అయితే థియేట్రికల్ రన్ ముగిసిన కేవలం 21 రోజుల్లోనే ఈ డివైన్ థ్రిల్లర్ డిజిటల్ ప్రియుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ప్రసిద్ధ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' (Amazon Prime Video) వేదికగా అక్టోబర్ 2, 2026 నుంచి ఈ సినిమా గ్రాండ్ స్ట్రీమింగ్ కానుంది. విశేషమేమిటంటే, ఈ చిత్రం ఒక్క తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మరియు మలయాళం అనే 5 ప్రధాన భారతీయ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే, గతంలో సుమంత్‌తో 'సుబ్రహ్మణ్యపురం' లాంటి సూపర్ హిట్ డివోషనల్ థ్రిల్లర్ తీసిన దర్శకుడు సంతోష్ జాగర్లపూడి, ఈ చిత్రాన్ని వారాహి అమ్మవారి నేపథ్యంతో 200 ఏళ్ల నాటి రాజవంశ శాపం చుట్టూ అత్యంత ఆసక్తికరంగా మలిచారు. మహేంద్రగిరి సంస్థానంలోని ఒక రాజవంశంలో జన్మించిన మగవారికి 33 ఏళ్లు నిండగానే ప్రాణాలు కోల్పోయే భయంకరమైన దోషం ఉంటుంది. అయితే కథలో కథానాయకుడు సిద్ధార్థ్ (సుమంత్) మూఢనమ్మకాలు, దొంగ బాబాలను ఎండగట్టే ఒక ప్రముఖ యూట్యూబర్. దేవుడు, దెయ్యాలను అస్సలు నమ్మని సిద్ధార్థ్, తన సోదరుడు రాజీవ్ (రాజీవ్ కనకాల) కి ఉన్న దోష నివారణ కోసం కుటుంబంతో కలిసి మహేంద్రగిరిలోని వారాహి అమ్మవారి క్షేత్రానికి వెళ్తాడు. అక్కడ ఊహించని రీతిలో రాజీవ్ మరణించడంతో కథ తీవ్ర ఉత్కంఠభరిత మలుపు తిరుగుతుంది. ఇది కూడా చదవండి: హాస్యనటిగా ఓ వెలుగు వెలిగింది.. కానీ ఆ అలవాటుకి బానిస అవ్వడంతో!   తన అన్నయ్య మరణం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని, ఆ రాజవంశాన్ని వెంటాడుతున్న 200 ఏళ్ల నాటి శాపం నిజమైనదా లేక దాని వెనుక ఏదైనా మానవ కుట్ర ఉందా అనే కోణంలో సిద్ధార్థ్ అన్వేషణ ప్రారంభిస్తాడు. మొదటి భాగంలో వచ్చే ఆలయ మిస్టరీ, ఇంటర్వెల్ లో ఇచ్చే భారీ ట్విస్ట్, మరియు క్లైమాక్స్ లో వచ్చే రెండు అనూహ్యమైన టర్నింగ్ పాయింట్స్ ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడతాయి. ఈ చిత్రంలో సుమంత్‌కి జోడీగా మీనాక్షి గోస్వామి నటించగా, ఐశ్వర్య రాజేష్, మాళవిక నాయర్, సిద్ధు జొన్నలగడ్డ, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించి మెప్పించారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు బ్రిడ్జ్ ఫిల్మ్స్ బ్యానర్లపై భారీ నిర్మాణ విలువలతో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి అనూప రూబెన్స్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ డివైన్ థ్రిల్‌ను పీక్స్‌కి తీసుకెళ్లింది. థియేటర్లలో మిస్ అయిన సస్పెన్స్, మిస్టరీ థ్రిల్లర్ అభిమానులకు ఈ దసరా పండగ పూట ప్రైమ్ వీడియోలో ఓవర్ నైట్ బెస్ట్ ఆప్షన్‌గా 'మహేంద్రగిరి వారాహి' నిలవనుంది.   [Mahendragiri Varahi Ott Release Date, Mahendragiri Varahi OTT Release, Sumanth Mahendragiri Varahi Prime Video, Mahendragiri Varahi OTT Date, Telugu Cinema News, Telugu Cinema, Tollywood Cinema News, Tollywood]  
కొంత మంది నటీనటులపై కాలానికి ఏమైనా కన్ను గొడుతుందో, లేక వాళ్ళ స్వయంకృతాపరాధమో తెలియదు కానీ ఒక వెలుగు వెలిగిన జీవితాలు హఠాత్తుగా చీకటి కోణంలోకి నెట్టబడతాయి. తెలుగు చలనచిత్ర స్వర్ణయుగంలో తన సహజసిద్ధమైన నటనతో, హాస్య చతురతతో, అద్భుతమైన హావభావాలతో కోట్లాదిమంది ప్రేక్షకులను అలరించిన లెజెండరీ నటి సురభి బాలసరస్వతి. తెరపై ఎప్పుడూ నవ్వులు పూయించే ఈ మహానటి జీవితం వెనుక ఒక గుండెలను పిండేసే విషాద కోణం ఉందంటే నమ్మడం కష్టం.  నాటక రంగానికి పెట్టింది పేరైన సురభి కుటుంబం నుంచి వచ్చిన ఆమె, చిన్నతనంలోనే నటనపై మక్కువ పెంచుకుని నాటకాల ద్వారా చిత్రసీమలోకి అడుగుపెట్టారు. 1950ల కాలంలో తెలుగు, తమిళ భాషల్లో స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, అప్పటి అగ్ర కథానాయకులైన ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, శివాజీ గణేషన్ వంటి దిగ్గజ సరసన నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. హాస్య నటుడు రేలంగి వెంకట్రామయ్యతో సురభి బాలసరస్వతి కాంబినేషన్ అప్పట్లో ఒక పెద్ద సంచలనం. వీరిద్దరూ కలిసి నటించిన హాస్య సన్నివేశాలు, పాటలు ప్రేక్షకులు పొట్టచెక్కలయ్యేలా నవ్వించేవి. "శాంతి నివాసం", "కన్యాశుల్కం", "ఇల్లరికం" వంటి 100కు పైగా అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఆమె పోషించిన పాత్రలు ఇప్పటికీ తెలుగు సినీ ప్రేక్షకులకు చిరస్మరణీయమే. 1950 నుండి 1970 మధ్యకాలంలో విడుదలైన పదుల కొద్దీ సినిమాల్లో ఆమె కీలక పాత్రల్లో నటించి టాలీవుడ్ తెరపై చెరగని ముద్ర వేశారు. ఇది కూడా చదవండి: తెలుగు సినిమాని చంపేస్తోంది ఏంటి: వాళ్ళు రాకపోవడం కూడా ఒక కారణమా! అయితే వెండితెరపై నిరంతరం డిమాండ్ ఉన్న నటిగా, వెలుగులు విరజిమ్మిన కథానాయికగా కోట్లాదిమంది గుండెల్లో నిలిచిన ఈ నటి వ్యక్తిగత జీవితం మాత్రం తీవ్ర నైరాశ్యంలో సాగింది. నటన ద్వారా సంపాదించిన కోట్లాది రూపాయల ఆస్తులు, పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ, ఆమె చివరి రోజుల్లో అనుభవించిన మానసిక వేదన అపారం. బాలసరస్వతిది ముక్కుసూటి మనస్తత్వం. శకునాలు, జాతకాలని నమ్మేవారు కాదు. జీవితంలో ఒంటరి పోరాటం చేశారు.     పరిశ్రమలో తోడు అవసరమని భావించి, దర్శకుడు తాపీ చాణక్యతో కొంతకాలం సహజీవనం చేశారు. ఆయనకు అప్పటికే వివాహమైంది. పిల్లలు లేరు. చాణక్య హఠాన్మరణంతో ఆమె జీవితం మరో మలుపు తిరిగింది. నలుగురితో స్నేహంగా మెలిగే ఆమె, మహానటి సావిత్రికి మంచి స్నేహితురాలు. సావిత్రికి మద్యం అలవాటు చేసింది బాలసరస్వతినే అనే ప్రచారమూ ఉంది. వృత్తిపరంగా పోటీ పెరిగి అవకాశాలు తగ్గడం, మద్యానికి బానిస కావడం ఆమె చివరి రోజులను దుర్భరంగా మార్చాయి. మద్రాసు వదిలి గూడూరు చేరుకున్న బాలసరస్వతి, 1983 సెప్టెంబర్ 10న దీనమైన పరిస్థితుల్లో కన్నుమూశారు.      [Surabhi Balasaraswati Untold Life Story, Surabhi Balasaraswati, Surabhi Balasaraswati story, Surabhi Balasaraswati movies, Yesteryear Telugu actress Balasaraswati, telugu Cinema News, Telugu Cinema, Tollywood Cinema News, Tollywood]  
సినిమా.. అందులోనూ తెలుగు సినిమా.. సరైన తెలుగు సినిమా పడిందంటే దివి నుంచి దేవతలు సైతం దిగొచ్చి మానవరూపంలో సినిమా చూసి తెలుగు ప్రేక్షకులు ఎంతటి అదృష్టవంతులు అని ఈర్ష్య పడుతుంటారని సినీ ప్రేమికులు తమ చాయ్, బిస్కెట్ కబుర్లలో చెప్పుకుంటూ ఉంటారు. అంతటి కథ, కథనం, పాటలు, మాటలు, పెర్ ఫార్మెన్స్  కలగలిపిన తెలుగు సినిమా చాలా ఏళ్ళ నుంచి దిగులని మనసులో ఉంచుకొని పైకి మాత్రం నవ్వుతు ఉంది. అందుకు కారణమేంటో చూద్దాం. తెలుగు సినిమా పరిశ్రమలో ఒకప్పుడు ఒక హిట్ సినిమా వచ్చిందంటే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టి, అదే సినిమాని రెండు మూడు సార్లు చూసే సంస్కృతి స్పష్టంగా కనిపించేది. కానీ ఈ డిజిటల్ యుగంలో ఆ ‘రిపీట్ వాచ్ కల్చర్’ క్రమంగా మాయమవుతోందనే చర్చ టాలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా, దీర్ఘకాలం థియేటర్లలో నిలబడటానికి రిపీట్ ఆడియన్స్ ఎంతో కీలకం. అయితే నేటి కాలంలో ఒక్కసారి చూస్తే చాలు అనే భావన ప్రేక్షకుల్లో పెరిగిపోవడానికి అసలు కారణాలు ఏమిటి?  ఇది కూడా చదవండి: ఈ సారి 'ఇరుముడి'ని మించిన టైటిల్: ఏడూకొండల వాడ వెంకటేశా! .ఈ పరిస్థితికి ప్రధాన కారణాల్లో మొదటిది ఆకాశాన్నంటిన టికెట్ ధరలు మరియు స్నాక్స్ ఖర్చులు. మల్టీప్లెక్స్‌లలో ఒక్కో టికెట్ ధర . 295 నుంచి . 413 వరకు పెరిగిపోవడం, దానికి తోడు 300 నుంచి 500 వరకు ఉండే ఆహార పదార్థాల ధరలు సగటు కుటుంబ బడ్జెట్‌ను దెబ్బతీస్తున్నాయి. నలుగురు ఉన్న ఒక కుటుంబం సినిమాకు వెళ్తే  2,000 నుంచి 3,000 వరకు ఖర్చవుతుండటంతో, థియేటర్ అనుభవం కాస్త భారం గా మారుతోంది.      ఇక రెండవ ముఖ్యమైన అంశం ఓటీటీ (OTT) ప్లాట్‌ఫారమ్‌ల వేగవంతమైన విస్తరణ. థియేటర్ విడుదలైన కేవలం 3 నుంచి 4 వారాల వ్యవధిలోనే (వంద శాతం ఓటీటీ విండో) డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుండటంతో, సెకండ్ టైమ్ చూడాలనుకునే వారు ఓటీటీ రిలీజ్ కోసమే వేచి చూస్తున్నారు. ఇది ఓటీటీ హక్కుల ద్వారా నిర్మాతలకు 20% నుండి 30% వరకు అదనపు రాబడిని అందిస్తున్నప్పటికీ, థియేట్రికల్ ఫుట్‌ఫాల్స్‌పై మాత్రం తీవ్ర ప్రభావం చూపుతోంది.   అంతేకాకుండా కంటెంట్ నాణ్యత కూడా ఇక్కడ కీలక పాత్ర పోషిస్తోంది. మొదటి రోజు ఉదయం ఆట పూర్తయిన 5 గంటల్లోపే సోషల్ మీడియా ద్వారా పబ్లిక్ టాక్, రివ్యూలు విస్తృతంగా ప్రచారంలోకి వస్తున్నాయి. సినిమా కథలో బలమైన ఎమోషన్లు, రిపీట్ వాల్యూ లేకపోతే ప్రేక్షకులు కేవలం ఒకసారి చూసి వదిలేస్తున్నారు. పైగా రిలీజ్ అయిన 5 గంటల్లోనే పైరసీ వెర్షన్లు అందుబాటులోకి రావడం కూడా థియేటర్ రన్ సమయాన్ని తగ్గిస్తోంది. ఇటీవల టికెట్ ధరలను అందుబాటులో ఉంచిన మీడియం బడ్జెట్ సినిమాలు, బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న చిత్రాలు మాత్రమే థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులతో మంచి విజయం సాధించడం గమనార్హం.అయితే ఆ సినిమాలకి కూడా రిపీట్ ఆడియెన్స్ ఉండటం లేదు. ఏది ఏమైనా రిపీట్ ఆడియన్స్ ఉన్నప్పుడే తెలుగు సినిమా పూర్తి ఆనందంతో ఉండగలదు.
  'ఇరుముడి'తో మాస్ మహారాజ రవితేజ మంచి జోష్ లో ఉన్నాడు. ఫ్యాన్స్ అయితే మా మాస్ మహారాజా ఇక పట్టిందల్లా బంగారం అనే మూడ్ లో సరిపోదా శనివారం ఫేమ్ 'వివేక్ ఆత్రేయ' దర్శకత్వంలో తెరకెక్కే మూవీ సెట్స్ పైకి వెళ్లే శుభ సమయం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా కథాంశం ఒక సరికొత్త హారర్ కామెడీ థ్రిల్లర్ జానర్‌లో ఉండబోతున్నట్లు టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా 'తులా భారం’ అనే విభిన్నమైన మరియు శక్తివంతమైన టైటిల్‌ని  పరిశీలించి ఖరారు చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హారర్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌కి 'తులా భారం' అనే పేరును లాక్ చేయడం వెనుక పెద్ద కాన్సెప్ట్ దాగ ఉందనే చర్చ మొదలైంది. ఇప్పటివరకు రవితేజ తన సుదీర్ఘ కెరీర్‌లో మాస్, యాక్షన్, సెంటిమెంట్, ప్యూర్ కామెడీ జానర్లలో అనేక సినిమాలు చేసినప్పటికీ, పూర్తి స్థాయి హారర్ కామెడీ థ్రిల్లర్ జానర్‌‌ను ఎంచుకోవడం ఇదే ప్రథమం. ఇది కూడా చదవండి: ఆదర్శ కుటుంబం: ఈ సారి అలాంటి అనుమానాలు వద్దు!     ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌ను దర్శకుడు వివేక్ ఆత్రేయ ఇప్పటికే 100 శాతం పూర్తి చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కథ, కథనాలపై సంపూర్ణ స్పష్టతతో ఉన్న దర్శకనిర్మాతలు ఈ దసరా పండుగ శుభ ముహూర్తాన సినిమాని  అధికారికంగా లాంచ్ చేసి సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా 'ఓజీ' బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా 'తులాభారం' అనే టైటిల్ ఫిక్స్ అయితే బాక్స్ ఆఫీస్ తుక్కు రేగిపోవడమే. పైగా ఏడుకొండల వాడి భక్తులతో పాటు అన్ని దేవుళ్ళ భక్తుల హృదయాల్లో తులాభారానికి ఎంతో విశిష్టత ఉంది.   [Ravi Teja And Vivek Athreya New movie Title, Ravi Teja, Vivek Athreya, Tula Bharam, Ravi Teja Next Movie, RT Vivek Athreya Movie, telugu Cinema News, Telugu Cinema, Tollywood Cinema News, Tollywood]       
  నిర్మాతగా అభిమానులని సంపాదించడం చాలా అరుదు. అలాంటి అరుదైన వాళ్ళల్లో నాగ వంశీ ఒకరు. ఈ నెల 9 న విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల  'ఆదర్శ కుటుంబం'తో మరో సారి సెల్యులాయిడ్ పై అడుగుపెట్టనున్నాడు. సోషల్ మీడియాలోను యాక్టీవ్ గా ఉండే నాగవంశీ రీసెంట్ గా' మా బ్యానర్ పై మీకు అనుమానం ఉండవచ్చు. కానీ ఈ సారి ఎలాంటి డౌట్స్ పెట్టుకోవద్దు. అనుకున్న డేట్ కే 'ఆదర్శ కుటుంబం' వస్తుంది. 6 న ట్రైలర్ లాంచ్ ఉంటుంది.మరుసటి రోజు నుంచి బుకింగ్స్ స్టార్ట్ అవుతాయి. దసరాని మా సినిమాతోనే స్టార్ట్ చెయ్యండని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసాడు. ఇది కూడా చదవండి: వారణాసి తర్వాత ప్రియాంక చోప్రా నెక్స్ట్ హీరో ఎవరో తెలుసా! దశాబ్దకాలం నిరీక్షణకి తెరపడనుందా?   హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌‌పై  నాగ వంశీ బాబాయి  ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తుండగా నాగవంశీ సమర్పకుడు. వెంకటేష్ సరసన కేజియఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుండగా, నారా రోహిత్, నివేతా పేతురాజ్, డింపుల్ హయతి, సత్య, రావు రమేష్ వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే యూట్యూబ్‌లో  చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. ముఖ్యంగా 'నారాయణమ్మ' లిరికల్ సాంగ్ సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబట్టి శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంది.    [Naga Vamsi About Aadarsha Kutumbam, Aadarsha Kutumbam Trailer Update, Aadarsha Kutumbam, Venkatesh Aadarsha Kutumbam Trailer, Trivikram Srinivas, telugu Cinema News, Telugu Cinema, Tollywood Cinema News, Tollywood]  
  'ఇరుముడి'లో కామవాంఛ ఉన్న ఒక ప్రజాప్రతినిధి దగ్గరకి ప్రభుత్వ పాఠశాల టీచర్ విద్యార్థులని పంపిస్తూ ఉంటుంది. థియేటర్ లో ఈ సన్నివేశానికి సంబంధించిన సీన్స్ వస్తుంటే రక్తం మరగని ప్రేక్షకుడు లేడు. మరి ఇలాంటి సంఘటనే నిజ జీవితంలో జరిగితే ఎలా ఉంటుంది పరిస్థితి.  ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు నగరంలో తల్లిదండ్రులు నమ్మి పంపిన బిసి వెల్ఫేర్ హాస్టల్‌లోని అమాయక మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని, ఒక ముఠాలాగా దారుణానికి ఒడిగట్టిన తీరు స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. సరిగ్గా ఇటీవలే విడుదలైన ‘ఇరుముడి’ సినిమా కథను తలపించేలా, నిజ జీవితంలోనూ అత్యంత దారుణమైన కుట్రకు తెగబడటం అందరినీ కలవరపెడుతోంది. విద్యార్థినులకు రక్షణగా నిలవాల్సిన హాస్టల్ సిబ్బందే ఈ ఘోరానికి ప్రధాన పాత్రధారులుగా మారడం పట్ల సర్వత్రా తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘోరానికి సూత్రధారిగా మారిన జరుగుమల్లి బిసి హాస్టల్ వంటమనిషి శారద, అక్కడి ఇద్దరు బాలికలను లక్ష్యంగా చేసుకుంది. ఇటీవల ఒక బాలిక తండ్రి మరణించడంతో, ఆ కుటుంబానికి రావాల్సిన డెత్ సర్టిఫికెట్ ఇప్పిస్తానంటూ ఆమెకు మాయమాటలు చెప్పింది. డెత్ సర్టిఫికెట్ ఇప్పిస్తానని, డీఆర్‌డీఏ (DRDA) శాఖలో పనిచేసి రిటైర్ అయిన వెంకట్రావు వద్దకు వెళితే పని త్వరగా పూర్తవుతుందని నమ్మబలికింది. ఆ విధంగా ప్రణాళిక ప్రకారమే ఆ ఇద్దరు తొమ్మిదో తరగతి విద్యార్థినులను హాస్టల్ నుంచి బయటకు తీసుకువచ్చి, నిందితుడైన రిటైర్డ్ ఉద్యోగి వెంకట్రావు సెల్ నంబర్ ఇచ్చి అతని ఇంటికి పంపించింది. రిటైర్డ్ ఉద్యోగి వెంకట్రావు ఇంటికి చేరుకున్న ఆ బాలికలకు మొదట బిర్యానీ తినిపించి ఆశ చూపాడు. ఆ తర్వాత తన నిజస్వరూపాన్ని బయటపెడుతూ, తన సెల్‌ఫోన్‌లో ఉన్న నీలిచిత్రాలు (పోర్న్ వీడియోలు) చూపిస్తూ వారిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. పరిస్థితి ప్రమాదకరంగా మారుతోందని, ఆ వృద్ధుడి ప్రవర్తనలో తేడా ఉందనే విషయాన్ని సమయస్ఫూర్తితో గ్రహించిన ఒక 9వ తరగతి బాలిక, తన స్నేహితురాలితో కలిసి అత్యంత చాకచక్యంగా అక్కడ నుంచి బయటపడి తప్పించుకుంది. అక్కడ నుంచి బయటకు వచ్చిన ఆ బాలికలు భయంతో ఒంగోలులోని ఒక స్థానిక పార్కులో కొంతసేపు గడిపారు. కానీ, సాయంత్రం వేళ మళ్లీ ఆ కామాంధుడి వద్దకే వెళ్లాల్సి రావడంతో నిందితుడు వెంకట్రావు మరలా వారిపై పాశవికంగా విరుచుకుపడి అసభ్యకరంగా ప్రవర్తించాడు. అయితే, బాలికలు ధైర్యం కోల్పోకుండా అత్యంత సమయస్ఫూర్తితో వెంటనే తమ ఫోన్ ద్వారా 112 అత్యవసర నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడమే కాకుండా తమ బంధువులకు కూడా విషయాన్ని తెలియజేశారు. 112 అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ నుండి సమాచారం అందుకున్న వెంటనే ఒంగోలు పోలీసులు వేగంగా స్పందించారు. స్థానిక టూటౌన్ పోలీసులు నిందితుడి ఇంటిపై దాడి చేసి, రిటైర్డ్ ఉద్యోగి వెంకట్రావును అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై కఠినమైన పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించి విచారణ ప్రారంభించారు. ఇది కూడా చదవండి:  నాని పర్మిషన్ తోనే వచ్చారా? శ్రీకాంత్ ఓదెలపై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!     ఈ సంఘటన కలకలం రేపడంతో బిసి వెల్ఫేర్ అధికారి ఎస్.నిర్మల జ్యోతి, జరుగుమల్లి తహశీల్దార్ కె.వెంకటేశ్వరరావు వెంటనే హాస్టల్‌ను సందర్శించి పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి బాలికలను బయటకు పంపిన వంటమనిషి శారదను విధుల నుంచి తక్షణమే తొలగించడమే కాకుండా, నిర్లక్ష్యంగా ఉన్న హాస్టల్ వార్డెన్ తెరెజమ్మపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. జరుగుమల్లి ఎస్‌ఐ భాగ్యరాజ్ నేతృత్వంలో వీరిద్దరినీ కూడా విచారణ కోసం ఒంగోలుకు తరలించారు. హాస్టళ్లలో భద్రతపై సమగ్ర విచారణకు అంతర్గత కమిటీ వేసినట్లు అధికారులు వెల్లడించారు. బాలికల సమయస్ఫూర్తి, 112 నంబర్‌కు కాల్ చేసే అవగాహన వారిని పెద్ద ప్రమాదం నుండి కాపాడాయి.   Irumudi style Ongole Retired Employee Hostel Girls incident, Irumudi Scenes, Irumudi, Ongloe, Raviteja, telugu Cinema News, Telugu Cinema, Tollywood Cinema News, Tollywood  
నేటి వేగవంతమైన జీవనశైలిలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరిగి చాలామంది కఠినమైన డైట్ ప్రణాళికలను అనుసరిస్తున్నారు. వారం పొడవునా తక్కువ కేలరీలు, పోషకాలు ఉన్న ఆహారాన్ని తింటూ తమ శరీరాన్ని క్రమశిక్షణలో ఉంచుకుంటారు. అయితే వారం చివర్లో లేదా ప్రత్యేకమైన సందర్భాలలో చాలామంది తమకు అత్యంత ఇష్టమైన ప్రాసెస్డ్ ఫుడ్, నూనెలో వేయించిన తినుబండారాలు, తీపి పదార్థాలు మరియు ఫాస్ట్ ఫుడ్‌ను ఆస్వాదించడానికి  చీట్ డే  (Cheat Day) లేదా  చీట్ మీల్  క్రమాన్ని ఎంచుకుంటారు. వారం మొత్తం పడిన కష్టానికి ఇది ఒక రివార్డులా అనిపించినప్పటికీ, ఒక్కసారిగా అత్యధిక కేలరీలు, అధిక మోతాదులో సోడియం (ఉప్పు), సంతృప్త కొవ్వులు (Saturated Fats) మరియు ప్రాసెస్డ్ చక్కెరలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల మన హృదయనాళ వ్యవస్థ (Cardiovascular System) పై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో ఒకేసారి భారీగా కేలరీలు చేరుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ మరియు ట్రైగ్లిజరైడ్ల స్థాయిలు హఠాత్తుగా పెరుగుతాయి. దీనివల్ల రక్తనాళాలలో తాత్కాలికంగా వాపు (Inflammation) ఏర్పడి, రక్తనాళాలు కుంచించుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఒక్క చీట్ మీల్ వల్ల రక్తపోటు (Blood Pressure) తాత్కాలికంగా పెరగడమే కాకుండా, గుండె రక్తాన్ని పంప్ చేయడానికి సాధారణం కంటే ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. నిపుణుల పరిశోధనల ప్రకారం, వారంలో క్రమం తప్పకుండా తీసుకునే కఠినమైన డైట్ కంటే, చీట్ డే సమయంలో ఒకేసారి పరిమితికి మించి ఎక్కువ కేలరీలు తీసుకోవడం గుండె ఆరోగ్యానికి ఎక్కువ హాని కలిగిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, డయాబెటిస్ లేదా కుటుంబంలో గుండెజబ్బుల చరిత్ర ఉన్నవారు చీట్ మీల్స్ విషయంలో తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తే అది తీవ్రమైన గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. అయితే చీట్ డేస్ అనేవి కేవలం శారీరక ఆరోగ్యాన్నే కాకుండా మానసిక సమతుల్యతను కూడా ప్రభావితం చేస్తాయి. డైట్ క్రమంలో ఇష్టమైన ఆహారానికి దూరంగా ఉండటం వల్ల కలిగే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి పరిమితమైన చీట్ మీల్స్ తోడ్పడతాయి. కానీ దీనిని ఆరోగ్యకరంగా నిర్వహించడం చాలా అవసరం. చీట్ డే రోజున ఆకలిని తట్టుకోలేక ఒకేసారి పెద్ద మొత్తంలో తినడానికి బదులుగా, పోర్షన్ కంట్రోల్ (పరిమిత పరిమాణం) పాటించడం అత్యంత ముఖ్యం. ఉదాహరణకు చీట్ మీల్‌లో అధికంగా ఆయిల్ ఉన్న పిజ్జాలు, బర్గర్లు, ఫ్రైడ్ చికెన్ వంటి ప్రాసెస్డ్ పదార్థాలకు దూరంగా ఉంటూ.. ఇంటి వద్ద తక్కువ నూనెతో శుభ్రంగా తయారుచేసిన ఇష్టమైన వంటకాలను ఎంచుకోవచ్చు. అలాగే ఆహారాన్ని నమిలి మెల్లగా తినడం వల్ల తక్కువ ఆహారంతోనే కడుపు నిండిన భావన కలిగి గుండెపై అదనపు భారం పడకుండా ఉంటుంది. చీట్ మీల్ తీసుకున్న తర్వాత రోజంతా పుష్కలంగా నీరు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు, అధికంగా ఉన్న సోడియం సమర్థవంతంగా బయటకు వెళ్లిపోతాయి. అంతేకాకుండా చీట్ మీల్ తిన్న తర్వాత కొద్దిసేపు తేలికపాటి నడక లేదా వ్యాయామం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా అదుపులో ఉంటాయి. ఆహారాన్ని ఎంజాయ్ చేయడం ఎంత ముఖ్యమో, దాని పరిమితులను గుర్తించి గుండెను కాపాడుకోవడం అంతకంటే ప్రధానం. కఠినమైన డైటింగ్ మినహాయింపుల పేరుతో గుండె ఆరోగ్యాన్ని పణంగా పెట్టకుండా, సమతుల్య ఆహారం మరియు క్రమబద్ధమైన వ్యాయామంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యాధికారులు స్పష్టం చేస్తున్నారు.     Cheat day impact on heart health, high calorie cheat meal risks, junk food effect on heart, cheat meals cardiovascular risk, fitness cheat day heart warning.
మన పూర్వీకులు 80 నుండి 90 ఏళ్ల వయస్సు వచ్చినా కూడా ఎలాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేకుండా చాలా ఆరోగ్యంగా, చలాకీగా తమ పనులు తామే చేసుకుంటూ జీవించేవారు. వారు అంతటి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటానికి ముఖ్యమైన కారణం మన సాంప్రదాయ ఆయుర్వేద విలువలు కలిగిన ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లే. ముఖ్యంగా పొలం గట్లపై, ఇంటి చుట్టుపక్కల దొరికే ప్రకృతి ప్రసాదిత ఆకుకూరలను రోజూవారి వంటకాల్లో భాగంగా పప్పు, పచ్చడి రూపంలో తీసుకునేవారు. అటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన మొక్కల్లో ప్రధానమైనది తెల్ల గలిజేరు . సాధారణంగా చూసేందుకు పొలాల్లో ఏదో పిచ్చిమొక్కలా కనిపిస్తున్నప్పటికీ, ఆయుర్వేద వైద్యంలో దీనిని  పునర్నవ అని ఎంతో గౌరవంగా పిలుస్తారు. శాస్త్రీయంగా బోరేవియా డిఫ్యూసా (Boerhavia diffusa) అని పిలిచే ఈ మొక్క పేరులోని  పునః  అంటే మళ్లీ,  నవ  అంటే కొత్తగా అని అర్థం. అంటే పాడైపోయిన శరీర కణాలకు మరియు ముఖ్యమైన అవయవాలకు మళ్లీ కొత్త జీవాన్ని పోసి పునరుజ్జీవింపజేసే గొప్ప శక్తి ఈ తెల్ల గలిజేరుకు ఉంది. వైద్య నిపుణులు మరియు ఆయుర్వేద పరిశోధకుల ప్రకారం, తెల్ల గలిజేరు సుమారు 350కి పైగా రకాల కిడ్నీ సంబంధిత వ్యాధులకు మరియు మూత్రనాళ సమస్యలకు ఒక దివ్యౌషధంగా లేదా సంజీవనిగా పనిచేస్తుంది. ఆధునిక కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న మూత్రనాళ ఇన్ఫెక్షన్లు (UTI), యూరియా మరియు క్రియాటినిన్ స్థాయిలు పెరగడం, శరీరంలో విపరీతంగా నీరు చేరి వాపులు రావడం వంటి తీవ్రమైన సమస్యలకు ఇది అద్భుతంగా తోడ్పడుతుంది. తెల్ల గలిజేరులో విటమిన్ సి, విటమిన్ డి, క్యాల్షియం, ఐరన్ తో పాటు పొటాషియం నైట్రేట్ మరియు హైడ్రోక్లోరైడ్ వంటి అత్యంత కీలకమైన బయోయాక్టివ్ సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని విషపదార్థాలను సమర్థవంతంగా బయటకు పంపి, డయాబెటిస్ బాధితుల్లో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే రక్తపోటును సమతుల్యం చేసి, గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదాలను తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇంతటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న తెల్ల గలిజేరును మన ఇంట్లోనే ఎంతో రుచికరమైన పచ్చడి రూపంలో సులభంగా తయారుచేసుకోవచ్చు. ఈ పచ్చడి తయారీకి 3 కప్పుల శుభ్రం చేసిన తెల్ల గలిజేరు ఆకులు, పావు కప్పు వేరుశనగ గుళ్లు (పల్లీలు), 3 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, 1 చెంచా జీలకర్ర, 2 చెంచాల ధనియాలు, పావు చెంచా మిరియాలు, నిమ్మకాయ పరిమాణమంత చింతపండు, చిటికెడు ఇంగువ, 6 వెల్లుల్లి రెబ్బలు మరియు తగినంత ఉప్పు, నూనె అవసరమవుతాయి. తయారీ విధానంలో భాగంగా ముందుగా గలిజేరు ఆకులను బాగా కడిగి తడి లేకుండా ఆరబెట్టాలి. బాండీలో నూనె లేకుండా ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, వేరుశనగ గుళ్లు, మిరియాలను దోరగా వేయించి చల్లార్చుకోవాలి. వీటిని మిక్సీలో బరకగా పొడి చేసిన తర్వాత, అందులో గలిజేరు ఆకులు, చింతపండు, వెల్లుల్లి, ఉప్పు చేర్చి కొద్దిగా నీటితో మిక్సీ పట్టుకోవాలి. చివరగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, ఇంగువతో నూనెలో తాలింపు వేస్తే నోరూరించే తెల్ల గలిజేరు పచ్చడి సిద్ధమవుతుంది. ఈ తెల్ల గలిజేరు పచ్చడి సుమారు 4 రోజుల పాటు చెక్కుచెదరకుండా నిల్వ ఉంటుంది. వేడివేడి అన్నంతో పాటు ఇడ్లీ, దోశల్లోకి కూడా ఇది ఎంతో రుచిగా ఉంటుంది. వారానికి 2 నుండి 3 సార్లు ఈ పచ్చడిని లేదా ఆకుకూరను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మూత్రపిండాల పనితీరు గణనీయంగా మెరుగుపడుతుంది. అయితే ఆయుర్వేద నిపుణుల సూచన ప్రకారం, ఐరన్ మరియు శక్తివంతమైన మూలికా ప్రభావం ఎక్కువగా ఉండే తెల్ల గలిజేరును గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు మరియు 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు తీసుకోకూడదు. తీవ్రమైన గుండె సంబంధిత సమస్యలు లేదా ఆటో ఇమ్యూన్ జబ్బులు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే దీనిని వాడటం శ్రేయస్కరం. ఈ సహజసిద్ధమైన ఆయుర్వేద మూలికను మన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చు.     Learn how to make Tella Galijeru (White Punarnava) leaves chutney, an ancient Ayurvedic natural remedy known for supporting kidney health and boosting immunity.
భారతీయ వంటకాల్లోనూ, సాంప్రదాయ గృహ వైద్యంలోనూ వెల్లుల్లికి ప్రత్యేక స్థానం ఉంది. వెల్లుల్లి కేవలం వంటకాలకు రుచి, సువాసనను అందించడమే కాకుండా అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుందని శతాబ్దాలుగా విశ్వసిస్తున్నారు. చాలామంది రాత్రి వేళల్లో శ్వాస సరిగ్గా ఆడటానికి, శ్వాసనాళాలు శుభ్రపడటానికి లేదా ప్రశాంతమైన నిద్ర కోసం వెల్లుల్లిని తినడం లేదా దిండు కింద పెట్టుకోవడం వంటి చిట్కాలను పాటిస్తుంటారు. అయితే, నిద్రపోతున్న సమయంలో వెల్లుల్లి ఘాటైన వాసన శ్వాసనాళాలను శుభ్రం చేసి శ్వాస తీసుకోవడాన్ని సులభతరం చేస్తుందనే వాదనను బలంగా నిర్ధారించే ఎలాంటి ప్రత్యక్ష మానవ వైద్య ఆధారాలు (Human Clinical Trials) ప్రస్తుతం లేవు అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వెల్లుల్లికి వచ్చే ప్రత్యేకమైన ఘాటైన వాసనకు మరియు రుచికి అందులోని  అల్లిసిన్  (Allicin) అనే శక్తివంతమైన సమ్మేళనం ప్రధాన కారణం. వెల్లుల్లి రెబ్బలను కోసినప్పుడు, నలిపినప్పుడు లేదా మెత్తగా చేసినప్పుడు ఈ అల్లిసిన్ ఏర్పడుతుంది. ప్రయోగశాల (Laboratory) స్థాయిలో జరిగిన అధ్యయనాలలో అల్లిసిన్‌కు అద్భుతమైన యాంటీ మైక్రోబయల్ మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ (ఉపాధి, వాపు నిరోధక) లక్షణాలు ఉన్నట్లు తేలింది. అల్లిసిన్ కలిగిన వెల్లుల్లి సప్లిమెంట్లను వాడిన ఒక చిన్న అధ్యయనంలో జలుబు కేసులు తక్కువగా నమోదైనప్పటికీ, ఈ ప్రయోగశాల ఫలితాలను నేరుగా మనుషులలో నిద్ర సమయంలో శ్వాస మెరుగుపడటానికి అన్వయించలేమని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అనేకమంది భావిస్తున్నట్లుగా వెల్లుల్లి తినడం లేదా దాని వాసన పీల్చడం ద్వారా రాత్రివేళ శ్వాసనాళాలు శుభ్రపడి గురక, ముక్కు దిబ్బడ తగ్గుతాయని చెప్పడానికి అందుబాటులో ఉన్న ఆధారం చాలా పరిమితం. అందువల్ల ఆస్తమా, గురక, స్లీప్ అప్నియా (Sleep Apnea) వంటి తీవ్ర శ్వాసకోశ సమస్యలకు వెల్లుల్లిని ఒక ప్రాథమిక వైద్య చికిత్సగా భావించడం ఎంతమాత్రం సరికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెల్లుల్లిని సాధారణ ఆహారంలో భాగంగా పప్పులు, కూరలు, సూప్‌లలో పరిమిత మోతాదులో (రోజుకు 1,2 రెబ్బలు) తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తికి, గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కానీ నిద్రలో ఊపిరి ఆడకపోవడం, ఛాతిలో తీవ్రమైన నొప్పి లేదా విపరీతమైన గురక వంటి సమస్యలు ఉన్నవారు సొంత వైద్యంపై ఆధారపడకుండా వెంటనే అర్హులైన వైద్యులను సంప్రదించి సరైన పరీక్షలు చేయించుకోవడం అత్యంత అవసరం.     Eating garlic before bed health effects, garlic and sleep apnea breathing, nighttime raw garlic benefits risks, garlic before sleep breathing issues, garlic side effects at night.
చేతులు వణకడం, కాళ్లలో బలహీనంగా అనిపించడం, చేతులు లేదా కాళ్లలో తిమ్మిర్లు, మొద్దుబారడం, చిన్న పని చేసినా త్వరగా అలసిపోవడం వంటి సమస్యలను చాలామంది సాధారణ నీరసంగా భావిస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇవి నరాల ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలకు సంకేతాలు కావచ్చు. నరాల బలహీనతకు కారణాలు ఏమిటి? నరాలపై ప్రభావం చూపించే సమస్యలు ఏంటి? చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, నొప్పి, వణుకు, బలహీనత ఎందుకు వస్తాయి? నరాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి ఆహారం, జీవనశైలి పాటించాలి? ఈ వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ నరాల బలహీనతకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను సులభంగా వివరిస్తున్నారు. అలాగే నరాల ఆరోగ్యానికి ఉపయోగపడే సంప్రదాయ పద్ధతిలో అశ్వగంధ, వాము, దాల్చిన చెక్క, లవంగాలతో తయారు చేసుకునే చిట్కా గురించి కూడా తెలుసుకోవచ్చు. నరాల బలహీనత, నరాల నష్టం, తాత్కాలిక నీరసం మధ్య తేడా ఏమిటి? నరాలు దెబ్బతిన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? నరాల ఆరోగ్యానికి మంచి ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి ఎందుకు అవసరం? వంటి విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి. నరాలకు సంబంధించిన సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, లక్షణాలు కొనసాగితే వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం. నరాల ఆరోగ్యం గురించి పూర్తి అవగాహన కోసం ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
క్యాన్సర్ పేరు వినగానే భయపడాల్సిన అవసరం లేదు. అయితే శరీరంలో చాలాకాలంగా కొనసాగుతున్న కొన్ని అసాధారణ మార్పులను నిర్లక్ష్యం చేయకుండా, వాటికి కారణం ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా సాధారణ సమస్యలుగా భావించే కొన్ని లక్షణాలు తరచూ కనిపిస్తుంటే వైద్యుల సలహా తీసుకోవడం అవసరం. నోటిలో తగ్గకుండా ఉండే పుండ్లు, రొమ్ములో కనిపించే మార్పులు, జీర్ణవ్యవస్థలో సమస్యలు, కారణం లేకుండా బరువు తగ్గడం, శరీరంలో అసాధారణ మార్పులు వంటి వాటిని ఎప్పుడు సీరియస్‌గా తీసుకోవాలి? క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించేందుకు స్క్రీనింగ్ పరీక్షలు ఎంతవరకు ఉపయోగపడతాయి? ఏ వయసులో ఎలాంటి జాగ్రత్తలు అవసరం? అంతేకాదు, క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్సా విధానాలు ఏమిటి? రోబోటిక్ సర్జరీ, ఆంకో-రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ, మైక్రోసర్జరీ, బ్రెస్ట్ రీకన్‌స్ట్రక్షన్ వంటి విధానాల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. సీనియర్ రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అజయ్ వరుణ్ రెడ్డి క్యాన్సర్‌కు సంబంధించిన ముఖ్యమైన విషయాలను సులభంగా వివరించారు. క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోవడంతో పాటు, శరీరం ఇచ్చే అసాధారణ సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా ఉండేందుకు ఈ వీడియో ఉపయోగపడుతుంది. గమనిక: ఈ వీడియో అవగాహన కోసం మాత్రమే. ఏదైనా అసాధారణ లక్షణం కొనసాగితే స్వయంగా నిర్ధారణ చేసుకోకుండా వైద్య నిపుణులను సంప్రదించండి.మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఒక వినూత్నమైన వ్యాయామ విధానం విపరీతంగా ట్రెండ్ అవుతోంది. నెమ్మదిగా, ప్రశాంతంగా, డాన్స్ చేస్తున్నట్లుగా సాగే ఆ కదలికలే "తాయ్ చి". నార్మల్ గా అందరూ చేసే  జిమ్ వర్కౌట్లు, వేగంగా రన్నింగ్ చేయడం వంటివి కాకుండా  మానసిక ప్రశాంతతతో పాటు శరీరానికి  దారుఢ్యాన్ని ఇచ్చే ఈ ప్రాచీన విధానం వైపు నేటి యువత, ఫిట్‌నెస్ ప్రేమికులు విశేషంగా ఆకర్షితులవుతున్నారు. సోషల్ మీడియా లో రీల్స్, షార్ట్స్ లో వేలాదిమంది దీనికి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తుండటంతో ఇది నెట్టింట వైరల్ గా మారింది. అసలు ఏమిటీ తాయ్ చి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? వివరంగా తెలుసుకుంటే.. తాయ్ చి.. తాయ్ చి అనేది చైనాకు చెందిన ఒక ప్రాచీన మార్షల్ ఆర్ట్ విధానం. మొదట్లో  ఇది ఒక ఆత్మరక్షణ విద్యగా ఉద్భవించినప్పటికీ, కాలక్రమేణా ఇది ఒక అద్భుతమైన ఆరోగ్య, ఫిట్‌నెస్ సాధనగా రూపాంతరం చెందింది. దీనిని తరచుగా మూమెంట్ మెడిటేషన్ అని పిలుస్తారు. ఈ విధానంలో వేగవంతమైన కదలికలు ఉండవు. చాలా నెమ్మదిగా, శ్వాసపై ధ్యాస ఉంచుతూ, శారీరక సమతుల్యతను కాపాడుకుంటూ ఒక పోజిషన్ నుంచి మరొక పొజిషన్ కు  శరీరాన్ని తిప్పుతారు. శ్వాస ప్రక్రియను శరీర కదలికలతో అనుసంధానించడమే దీనిలోని ప్రధాన సూత్రం. ఇది శరీరంలోని అంతర్గత శక్తిని నిద్రలేపి, శరీరం అంతటా సరిగ్గా ప్రసరించేలా చేస్తుంది. చైనీస్ సంస్కృతిలో దీనిని 'చి' అని పిలుస్తారు. తాయ్ చి చేసే విధానం.. తాయ్  చి సాధనలో మూడు ముఖ్యమైన అంశాలు ఉంటాయి.. నెమ్మదిగా చేసే కదలికలు.. శరీరంలోని ప్రతి కండరాన్ని ఉపయోగిస్తూ, కీళ్లపై ఎటువంటి ఒత్తిడి పడకుండా చాలా సజావుగా కదలికలు ఉంటాయి. లోతైన శ్వాస.. కదలికలకు అనుగుణంగా ప్రశాంతంగా, లోతుగా శ్వాస తీసుకోవడం , వదలడం జరుగుతుంది. మానసిక ఏకాగ్రత.. వ్యాయామం చేసే సమయంలో దృష్టి మొత్తం శరీరం , శ్వాసపైనే ఉంటుంది. దీనివల్ల బయటి ఆలోచనల నుంచి మనస్సుకు విశ్రాంతి లభిస్తుంది. తాయ్ చి అందించే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. సోషల్ మీడియాలో ఇది కేవలం ఒక ఫ్యాషన్ గా మాత్రమే ట్రెండ్ కావడం లేదు, దీని వెనుక ఎన్నో శాస్త్రీయ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి తగ్గింపు.. ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన సర్వసాధారణమయ్యాయి. తాయ్ చి లోని లోతైన శ్వాస , ఏకాగ్రతతో కూడిన కదలికలు నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తాయి. ఇది శారీరక ఒత్తిడిని తగ్గించి, మనస్సుకు తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. శరీర బ్యాలెన్స్ , దృఢత్వం.. వయసు పైబడిన వారికి లేదా కాళ్ళ బలం తక్కువగా ఉన్నవారికి తాయ్ చి ఒక వరప్రసాదం. ఇది కాళ్ళు, నడుము భాగాల్లోని కండరాలను బలోపేతం చేసి, శరీర సమతుల్యతను పెంచుతుంది. దీనివల్ల కింద పడిపోయే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.. ఇది తక్కువ తీవ్రత కలిగిన వ్యాయామం అయినప్పటికీ, రక్తాప్రసరణను మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా చేయడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది, గుండె పనితీరు మెరుగుపడుతుంది. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం.. ఆర్థరైటిస్ (కీళ్ల వాతం) లేదా కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. వేగవంతమైన వర్కౌట్ల వల్ల కీళ్లపై పడే భారంతో పోలిస్తే, తాయ్ చి కీళ్లను మెల్లిగా కదిలిస్తూ నొప్పులను తగ్గిస్తుంది. శ్వాసకోశ వ్యవస్థకు మంచిది.. దీనిలో శ్వాసపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. శరీరంలోని ప్రతి కణానికి ప్రాణవాయువు సమృద్ధిగా అందుతుంది. నిద్రలేమి సమస్యకు పరిష్కారం.. ప్రతిరోజూ కొద్దిసేపు తాయ్ చి సాధన చేయడం వల్ల రాత్రి వేళల్లో మంచి, ప్రశాంతమైన నిద్ర పడుతుందని అనేక పరిశోధనల్లో తేలింది. ఏకాగ్రత , జ్ఞాపకశక్తి.. శరీరం , మనస్సు రెండింటినీ ఒకేసారి ఉపయోగించడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇది ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంచడంలో దోహదపడుతుంది. ఎవరైనా చేయవచ్చా? తాయ్ చి యొక్క అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే, దీనికి ప్రత్యేక పరికరాలు కానీ, పెద్ద స్థలం కానీ అవసరం లేదు. చిన్న పిల్లల నుంచి వయోవృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ దీనిని సాధన చేయవచ్చు. ఎటువంటి శారీరక శ్రమ లేకుండా, సున్నితమైన పద్ధతిలో ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన మార్గం.                    *రూపశ్రీ.