LATEST NEWS
డీలిమిటేషన్ కు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది.  దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రస్తుతం ఉన్న ప్రాతినిధ్య వాటా తగ్గకుండా, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా డీలిమిటేషన్ ప్రక్రియ జరగాలని  బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు.  లోక్‌సభ స్థానాలను ప్రస్తుత సంఖ్య కంటే 50 శాతం పెంచడంతో పాటు, 2051 వరకు రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా రక్షణ కల్పించే కేంద్ర ప్రభుత్వ తాజా ప్రతిపాదనకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు.  పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న   24 శాతం ప్రాతినిధ్య వాటాను యథాతథంగా నిలబెట్టాలని బీఆర్ఎస్ మొదటి నుంచీ డిమాండ్ చేస్తోందన్న అందుకు అనుగుణంగానే కేంద్రం బిల్లును తీసుకురావడానికి అంగీకరించినందునే మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.  కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన తాజా ఫార్ములా అమల్లోకి వస్తే తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 లోక్‌సభ స్థానాల సంఖ్య 26కు పెరిగే అవకాశం ఉందన్న కేటీఆర్ వివరించారు. అన్ని రాష్ట్రాల్లోనూ దామాషా ప్రకారం 50 శాతం మేర లోక్‌సభ సీట్లను పెంచడం వల్ల రాష్ట్రాల మధ్య ప్రస్తుత ప్రాతినిధ్య నిష్పత్తి చెక్కుచెదరకుండా కొనసాగుతుందని, అదే సమయంలో ప్రజలకు మరింత విస్తృతమైన పార్లమెంటరీ ప్రాతినిధ్యం లభిస్తుందని అన్నారు. తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు. రాష్ట్రానికి అదనపు లోక్‌సభ స్థానాలు దక్కడంతో పాటు దక్షిణాది రాష్ట్రాల వాటాకు రక్షణ కల్పించే అంశాలను బీఆర్ఎస్ స్వాగతిస్తోందని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ల అంశంపై..    చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయానికి బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తోందని, ఆ రిజర్వేషన్ల అమలుకు తమ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియలో రాష్ట్రాల హక్కులు, సమాన ప్రాతినిధ్యం, మహిళా ప్రాధాన్యత వంటి అంశాలకు సముచిత స్థానం కల్పించాలన్నారు. ఇది కూడా చదవండి:  డీలిమిటేషన్ బిల్లు: ఆమోదం కోసం కేంద్రం వ్యూహాలు.!​   పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు చర్చకు రానున్న నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల వైఖరులు జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారాయి. లోక్‌సభలో ప్రస్తుతం బీఆర్ఎస్‌కు సభ్యులు లేనప్పటికీ, రాజ్యసభలో ఉన్న ముగ్గురు ఎంపీల మద్దతు  ప్రాధాన్యత సంతరించుకుంది. దక్షిణాది రాష్ట్రాల వాటా పరిరక్షణపై కేంద్రం ఇచ్చిన 2051 స్థిరీకరణ ప్రతిపాదన ప్రాంతీయ పార్టీల ఆందోళనలను  తగ్గించిదని పరిశీలకులు అంటున్నారు.    మొత్తం మీద, దక్షిణాది రాష్ట్రాల 24 శాతం వాటా రక్షణ, 2051 వరకు సీట్ల నిష్పత్తి స్థిరీకరణ,  వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని డీలిమిటేషన్ ప్రతిపాదనకు మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. రా మీకు నచ్చవచ్చు:  డీలిమిటేషన్‌ ముసుగులో రాజ్యాంగాన్ని మార్చే యత్నం.. కేంద్రంపై గౌరవ్‌ గొగోయ్‌ విమర్శలు డీలిమిటేషన్ ఎందుకు అవసరం: దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరిగేదెలా.?​ [BRS Support Delimitation, KTR Announce,   Lok Sabha seats, Telangana, TeluguOne]
కాంగ్రెస్ తనంత తానుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి సర్కార్ కు ప్రయోజనం చేకూర్చిందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. తమిళనాడులో టీవీకే ప్రభుత్వాన్ని గద్దెనెక్కించేందుకు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మోడీ సర్కార్ కు ఆయాచిత వరంగా పరిణమించింది. తమిళనాడు విషయంలో కాంగ్రెస్ తీసుకున్న ఒక రాజకీయ నిర్ణయం  జాతీయ స్థాయిలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు  అనూహ్య లబ్ధిని చేకూర్చిపెట్టింది.  ఆ నిర్ణయమే ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలతో సంబంధాలను సమన్వయం చేసుకోవడం, బలోపేతం చేసుకోవడంలో కాంగ్రెస్ వైఫల్యాలను జాతీయ స్థాయిలో తిరుగులేని విధంగా బదనాం చేసింది.  తమిళనాడులో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు పలకడం ద్వారా దశాబ్దాలుగా తోడుగా ఉన్న డీఎంకేను కాంగ్రెస్ చేజేతులా దూరం చేసుకుంది. ఇప్పుడు అదే ఎన్డీయే కూటమికి కలిసి వచ్చింది. అంతే కాకుండా ఇండియా కూటమిని బలహీన పరిచి.. కాంగ్రెస్ కు ఇసుమంతైనా రుచించని, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటు ఆమోదం పొందేందుకు దోహదం చేస్తున్నది. గత ఏప్రిల్‌లో పార్లమెంటులో అవసరమైన మెజారిటీ లేక డీలిమిటేషన్ బిల్లు వీగిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సమయం కోసం వేచి చూసిన మోదీ-షా ద్వయం.. అదును చూసి పార్లమెుంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి మరీ ఆ బిల్లుకు ఆమోదం పొందేందుకు పక్కాగా వ్యూహరచన చేసింది.  ఈ బిల్లు ఆమోదంలో ఇప్పుడు 22 మంది లోక్‌సభ సభ్యులున్న డీఎంకే కీలక పాత్ర పోషిస్తోంది. గతంలో ఎప్పుడూ కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమికి వెన్నెముకగా నిలిచిన డీఎంకే.. తమిళనాడులో విజయ్ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ కు దూరం జరుగుతూ వచ్చింది.  ఇప్పుడు  22 మంది ఎంపీల బలం ఉన్న డీఎంకే డీలిమిటేషన్ బిల్లుకు సానుకూలంగా ఉందన్న వార్తలు, గతంలో టీవీకేకు మద్దతు ఇవ్వడం రాజకీయంగా కాంగ్రెస్ కు ఆత్మహత్యాసదృసంగా మారిందన్న విషయాన్ని ఎత్తి చూపుతున్నాయి.  సరిగ్గా ఇదే అవకాశాన్ని అందిపుచ్చుకున్న బీజేపీ అగ్రనాయకత్వం, డీఎంకే ప్రధాన డిమాండ్లకు అనుగుణంగా బిల్లులో మార్పులు చేసి వారి మద్దతు  సాధించింది. తమిళనాడు సహా ఏ   రాష్ట్రంలోనూ సీట్ల నిష్పత్తి తగ్గకుండా అన్ని రాష్ట్రాల్లోనూ 50 శాతం మేర లోక్‌సభ స్థానాలను పెంచేందుకు కేంద్రం అంగీకరించడం ద్వారా డీఎంకే మద్దతు సాధించడమే కాకుండా, కాంగ్రెస్ ను కోలుకోలేని దెబ్బతీయగలిగింది.   దీనికి తోడు, పాతికేళ్ల  రాష్ట్రాల మధ్య సీట్ల సంఖ్య వాటాను స్థిరంగా కొనసాగించాలన్న డీఎంకే మరో ప్రధాన షరతుకు కూడా కేంద్రం ఆమోదం తెలిపడం, అలాగే ఎన్సీపీ( శరద్ పవార్ )వర్గంతోనూ   సంప్రదింపులు జరిపి మద్దతు కూడగట్టడంలో మోడీ షా ద్వయం సక్సెసయ్యింది. ఈ విధంగా టీవీకేకు తమిళనాడులో మద్దతు పలకడం ద్వారా కాంగ్రెస్ ఇండియా కూటమికి రెండు కీలక రాజకీయపార్టీలు దూరం కావడానికి కారణమైంది. ఇది కూడా చదవండి:  ఇండియా కూటమిలో సంక్షోభం.. కాంగ్రెస్ ను వీడుతున్న మిత్రపక్షాలు​ ఇప్పుడు డీఎంకే, ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీల మద్దతుతో పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లుకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీకి ఎన్డీయే చేరువ అయ్యింది. తద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా..  మహిళా రిజర్వేషన్ల అమలు క్రెడిట్‌ను,   మరోవైపు డీలిమిటేషన్ ఘనతను మోడీషా ద్వయం తమ ఖాతాలో వేసుకునే అవకాశం దక్కించుకుంది. అదే సమయంలో కూటమి విభేదాలు జాతీయ స్థాయిలో రచ్చకెక్కేలా చేయగలిగింది.    పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   మీకు నచ్చవచ్చు: ప్రధాని అభ్యర్థిగా రాహుల్.. ఇండియా కూటమి పార్టీలు ఓకే.!​ ఇండియా కూటమిలోకి జగన్?​ [Congress, StratagicFailur, Tamilnadu, TVK Support, Delimitation,  Cut, DMK, INDIA Alliance, TeluguOne]
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలు క్షేత్రస్థాయిలో వైసీపీ దయనీయ పరిస్థితికి మరోమారు అద్దంపట్టాయి.  పట్టణ ప్రాంతాలు, ఆ  తర్వాత గ్రామీణ ఓటర్లలో తమకు గట్టి పట్టు ఉందంటూ వైసీపీ వర్గాలు తమ భుజాలను తామే చరుచుకుంటే చేస్తున్న ఆర్భాటం అంతా ఉత్తిదేననీ స్పష్టం చేస్తూ పంచాయతీ తొలి విడత ఎన్నికల ఫలితాలు వాస్తవ పరిస్థితిని కళ్లకు కట్టాయి.  తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు.  గతంలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ వైసీపీకి ప్రతికూల ఫలితాలు ఎదురైన విషయం తెలిసిందే. ఇప్పుడు గ్రామపంచాయతీ స్థాయిలోనూ అదే పరిస్థితి కొనసాగడంతో వైసీపీయులలో తీవ్ర నిరాశా నిస్ఫృహలు వ్యక్తమౌతున్నాయి.  ఏకగ్రీవమైన పంచాయతీల నుంచి పోలింగ్ జరిగిన స్థానాల వరకు అత్యధిక స్థానాలలో  కూటమి మద్దతుదారులే జయభేరి మోగించారు.  పంచాయతీ ఎన్నికలలో అభ్యర్థులు పార్టీ గుర్తులపై పోటీ చేయకపోయినా..  అభ్యర్థుల వెనుక రాజకీయ పార్టీల మద్దతు కీలకంగా ఉంటుంది. మండల కేంద్రాలు, మేజర్ గ్రామపంచాయతీలలో అసెంబ్లీ ఎన్నికలను తలపించే స్థాయిలో ప్రచారం, సమీకరణలు, స్థానిక అంశాలు,  ప్రభావం చూపుతాయి. గ్రామీణ సమాజంలో ఏ పార్టీకి క్షేత్రస్థాయిలో బలమైన యంత్రాంగం ఉందనేదానికి ఈ ఫలితాలు ఒక లాండ్ మార్క్ అనడంలో సందేహం లేదు. తొలి విడతలో 3,949 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగ్గా, వాటిలో 750కి పైగా స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఆ ఏకగ్రీవ స్థానాల్లో అత్యధిక భాగం టీడీపీ మద్దతుదారుల ఖాతాలో చేరినట్లు తెలుస్తోంది. ఇక పోలింగ్ జరిగిన 3,200కు పైగా పంచాయతీల ఫలితాలను పరిశీలిస్తే, మేజర్ పంచాయతీలలో చాలాచోట్ల కూటమి-టీడీపీ మద్దతుదారులే విజయం సాధించారని, వైసీపీకి బలమైన ప్రాంతంగా భావించే రాయలసీమలోనూ వైసీపీ మద్దతుదారులు గెలవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇది కూడా చదవండి: మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించింది: సీఎం చంద్రబాబు​ గ్రామీణ స్థాయిలో వైసీపీకి ఈ స్థాయిలో ప్రతికూల ఫలితాలు రావడానికి   సమన్వయ లోపం, కార్యకర్తల నిరాసక్తతే కారణమని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీ అధినేత  జగన్  బెంగళూరు నుంచి చుట్టపు చూపుగా మాత్రమే ఏపీకి వస్తుండటం, స్థానిక నేతలు కూడా క్యాడర్ కు అందుబాటులో లేకపోవడం కారణంగానే పంచాయతీపోరులో వైసీపీ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయిందని అంటున్నారు.    ఇక ఆదివారం (నవంబర్29),  డిసెంబర్ 2 తేదీల్లో జరగనున్న తదుపరి విడతల పంచాయతీ ఎన్నికలపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. తొలి విడతలో కనిపించిన ధోరణే మిగిలిన విడతల్లోనూ కొనసాగుతుందా, లేక క్షేత్రస్థాయిలో సమీకరణలు మారుతాయా అనేదానిపై ఆసక్తి నెలకొంది. ఈ ఫలితాల ప్రభావం రానున్న రోజుల్లో పార్టీల సంస్థాగత వ్యూహాలు, భవిష్యత్ ఎన్నికల సన్నద్ధతపై పడే అవకాశం ఉంది. మీకు నచ్చవచ్చు: అభ్యర్థుల ప్రకటనలో తెలుగుదేశం జోరు: స్థానిక సమరం.. క్యాండేట్ల రెండో జాబితా విడుదల.!​ పురపోరు: తెలుగుదేశం కూటమి జోరు.! [APPanchayatElections, FirstPhase, Results, TDPAlliance, YCP, TeluguOne] 
 డీలిమిటేషన్  ప్రతిపక్ష ఇండియా కూటమిలో చీలికకు దారి తీస్తోందా? అంటే పరిశీలకుల నుంచి ఔనన్న సమాధానమే వస్తోంది.  కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచేందుకు, రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తిని స్థిరంగా ఉంచేందుకు రూపొందించిన ప్రతిపాదనలపై ఇండియా కూటమిలోభిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతుండటమే ఇందుకు నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో ఇండియా కూటమి ఐక్యత ప్రశ్నార్థకంగా మారింది.   ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. తాజాగా కేంద్రం  రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లను 50 శాతం పెంచడం, పాతికేళ్ల పాటు సీట్ల వాటా నిష్పత్తిని స్తంభింపజేయడం వంటి అంశాలు దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలలో బిల్లుకు అనుకూలత వ్యక్తం అయ్యేలా చేసింది.  తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే తమ రాష్ట్ర సీట్ల వాటా తగ్గకూడదని, 1971 జనాభా ప్రాతిపదికన నిష్పత్తిని కొనసాగించాలని అలాగే సీట్ల వాటా పతికేళ్లు స్థిరంగా ఉంచాలన్న డిమాండ్ కు తన  తాజా ప్రతిపాదన ద్వారా కేంద్రం అంగీకరించినట్లైంది. దీంతో డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా నిలబడాలన్న ఆ పార్టీ వైఖరిలో మార్పు చోటు చేసుకునే అవకాశాలే మెండుగా ఉన్నాయంటున్నారు. ఇక ఇప్పటికే   ఎన్సీపీ (శరద్ పవార్ ) నేతలు బిల్లు పూర్తి స్వరూపాన్ని చూసిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించినప్పటికీ, జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే.. ఆ పార్టీ ఎన్డీయేకు జై కొట్టడం ఖాయమని తేటతెల్లమైపోయింది.  కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ బిల్లును, ప్రత్యేక సమావేశాల నిర్వహణను బలంగా వ్యతిరేకిస్తోంది. మహిళా రిజర్వేషన్ల పేరుతో నియోజకవర్గాల పునర్విభజనను ముందుకు తీసుకెళ్లడం రాజకీయ లబ్ధి కోసమేనని కాంగ్రెస్ అంటోంది. పునర్విభజన బాధ్యతల నిర్వహణ, ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయత, అలాగే రాజ్యాంగ సవరణకు అవసరమైన మెజారిటీని సమీకరించే తీరుపై కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ పరిస్థితే ఇండియా కూటమిలో చీలిక అనివార్యం అన్న భావన కలిగిస్తోందని పరిశీలకులు అంటున్నారు.  ఇది కూడా చదవండి:  ఇండియా కూటమి కీలక నిర్ణయం...ఇకపై రెండు నెలలకు ఒకసారి భేటీ!​ గతంలో ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లభించక ఆమోదం పొందని విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే.. ఇప్పుడు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు పెట్టి మరీ ఆ బిల్లును ప్రవేశ పెట్టాలని కేంద్రం నిర్ణయించడానికి ఇండియా కూటమిలో చీలిక ఆశతోనే నని అంటున్నారు.   మొత్తంగా చూస్తే, డీలిమిటేషన్ బిల్లు ప్రతిపక్ష కూటమిలోని భిన్న రాజకీయ ఆలోచనలు, ప్రాంతీయ ప్రయోజనాల మధ్య ఉన్న తేడాలను మరోసారి బట్టబయలు చేసింది. పార్లమెంట్ సమావేశాల్లో జరిగే పరిణామాలు జాతీయ రాజకీయాల్లో కొత్త మలుపులకు దారితీసే అవకాశం ఉంది. మీకు నచ్చవచ్చు:  ప్రధాని అభ్యర్థిగా రాహుల్.. ఇండియా కూటమి పార్టీలు ఓకే.! ఇండియా కూటమిలోకి జగన్? [Delimitation Effect, India allience, Split, Shock, Congress, TeluguOne]
కేంద్రం డీలిమిటేషన్ బిల్లు ఆమోదం కోసం సోమవారం (నవంబర్ 30) నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలన్న నిర్ణయం ఒక్కసారిగా రాజకీయవాతావరణాన్ని వేడెక్కించింది. డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ ప్రత్యేక సమావేశాల వెనుక అసలు లక్ష్యం నియోజకవర్గాల పునర్విభజన, తద్వారా బీజేపీకి చేకూరే రాజకీయ లబ్ధి మాత్రమే ఉందని కాంగ్రెస్ కూడా విమర్శలు గుప్పిస్తోంది.   చట్టసభల్లో మహిళలకు మూడో వంతు ప్రాతినిధ్యం కల్పించే  నారీ శక్తి వందన్‌ అధినియమ్ చట్టాన్ని పార్లమెంట్ 2023 సెప్టెంబర్‌లో ఏకగ్రీవంగా ఆమోదించిన విషయాన్ని గుర్తు చేసిన కాంగ్రెస్ సీనియన్ నేత జైరాం రమేష్.. ఆ చట్టాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని  పలుమార్లు కోరినా పట్టించుకోని కేంద్రం, ఇప్పటికే  పార్లమెంటు ఉభయ సభల ఆమోదాన్ని పొందిన చట్టాన్ని అమలు చేయకుండా, దాని అమలును డీలిమిటేషన్ తో ముడిపెట్టి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించడం రాజకీయ ప్రయోజనాలను ఆశించేనని దుయ్యబట్టారు.   డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా బీజేపీకి అనుకూలంగా నియోజకవర్గాల  స్వరూపాన్ని మారుస్తారనే ఆందోళన కాంగ్రెస్ లో బలంగా వ్యక్తమౌతోంది. అంతేకాకుండా, నియోజకవర్గాల సరిహద్దులు, స్వరూపాన్ని నిర్ణయించే బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే అంశంపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నది. ఓటర్ల జాబితాల రూపకల్పన, ఎన్నికల నిర్వహణ తీరుపై విమర్శలు ఎదుర్కొంటున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు పునర్విభజన బాధ్యతలు అప్పగించడం సరికాదని కాంగ్రస్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది. ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతపై సందేహాలు ఉన్న వ్యక్తుల చేతుల్లో  డీలిమిటేషన్ బాధ్యతలు ఉంచడం   ప్రజాస్వామ్యానికి హానికరమని అంటోంది.  ఇది కూడా చదవండి:  డీలిమిటేషన్‌ ముసుగులో రాజ్యాంగాన్ని మార్చే యత్నం.. కేంద్రంపై గౌరవ్‌ గొగోయ్‌ విమర్శలు​ నవంబర్ 30న లోక్‌సభ, డిసెంబర్ 2న రాజ్యసభ సమావేశాలను  ప్రారంభం కానున్నాయి. సభా కార్యకలాపాలను బట్టి డిసెంబర్ 3న సమావేశాలు ముగిసే అవకాశం ఉంది.   ఆగస్టు 13న వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడినప్పటికీ అధికారికంగా ప్రొరోగ్ చేయలేదని, వాటి కొనసాగింపుగానే ఈ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లులను ఆమోదించుకోవడానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీని సమకూర్చుకోవడమే ఈ సమావేశాల వెనుక ఉన్న ప్రధాన రాజకీయ ఎత్తుగడ అని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.    ఆపరేషన్ లోటస్ ప్రారంభమై 105 రోజులు పూర్తయిన తర్వాత, రాజ్యాంగ దినోత్సవం వేళ ఈ సమావేశాల ప్రకటన వెలువడటంలో  ఉన్న రాజకీయలెక్కలేంటో తేలాల్సి ఉందంటున్నారు. మహిళా రిజర్వేషన్ల అమలును అడ్డం పెట్టుకుని డీలిమిటేషన్ బిల్లును ముందుకు తేవడాన్ని ఇండియా కూటమి పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. రాజ్యాంగ సవరణకు అవసరమైన బలాన్ని అనుచిత మార్గాల్లో కూడగట్టే ప్రయత్నాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని విమర్శిస్తున్నాయి. ఆ ప్రయత్నాలను అడ్డుకుంటామని గట్టిగా చెబుతున్నాయి.   నవంబర్ 30 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ల అమలుపై ఎలాంటి చర్చలు జరుగుతాయి, ప్రభుత్వం ఏ ప్రతిపాదనలు ముందుకు తెస్తుంది, ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయి అనేదానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.  మీకు నచ్చవచ్చు:  డీలిమిటేషన్ ఎందుకు అవసరం: దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరిగేదెలా.? డీలిమిటేషన్‌పై కేంద్రం మాస్టర్ ప్లాన్.. 2051 వరకు రాష్ట్రాల ప్రాతినిధ్యం స్థిరం.! [Special Parliament Session, Delimitation, Womens Reservation Act, Congress, Fire, BJP, Political, Intention, TeluguOne]
ALSO ON TELUGUONE N E W S
Sharwanand and Sampath Nandi’s Bhogi has failed to make the expected impact at the box office on its opening day. Released amid modest buzz, the period action drama struggled to draw audiences to theatres and has also received largely negative reviews. The film collected around Rs. 1.90 crore net in India on Day 1, with its domestic gross estimated at Rs. 2.18 crore. Including overseas earnings, the worldwide gross stands at approximately Rs. 2.53 crore, a disappointing start for a film mounted on a relatively big scale. The opening is also lower than Sharwanand’s previous release Biker, which reportedly collected around Rs. 2.8 crore net on its first day. The comparison makes Bhogi’s underwhelming start more evident, especially considering the actor’s physical transformation and the film’s action-heavy setup. Critically, Bhogi has failed to impress reviewers, with the screenplay and the second half emerging as major drawbacks. The excessive violence and lack of emotional engagement have also been criticised, leaving the film with little positive word-of-mouth to support its theatrical run. Also Read: Vishwak Sen completes Legacy shoot Sharwanand’s performance and his rugged mass avatar have received some appreciation, but they have not been enough to compensate for the film’s weak writing. Sampath Nandi’s attempt to present a raw rural action drama has largely failed to connect with audiences. With a poor opening and negative reviews, Bhogi faces a tough road ahead at the box office. The weekend will be crucial, but without a significant turnaround in audience response, the film is likely to end up as a major disappointment for its makers. Check Out:  Box Office: Ramayana Part-1 crosses Baahubali 2                      Salman Khan's Maatrubhumi finally passes censor Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Rashmika Mandanna has unveiled the first glimpse of Niro, titled First Spark. The unusual promotional video has caught attention with its powerful presentation, offering a striking introduction to the film and its world. The glimpse takes a different approach from conventional first-look videos, building its impact through an intense visual treatment. Rather than revealing much about the story, the makers have chosen to establish the film’s mood and leave audiences curious about what lies ahead. Niro marks the directorial debut of lyricist Kalyan Chakravarthy Tripuraneni, who is stepping behind the camera after contributing to several popular Telugu films as a writer. The project gives him an opportunity to explore storytelling in a new format. The film is being produced by Anurag Parvathaneni under the Gold Mountain banner and introduces a newcomer as the lead protagonist. The makers are reportedly mounting the project on a large scale, making the first glimpse an important step in building awareness. Also Read: Salman Khan's Maatrubhumi finally passes censor The promotional campaign carries the tagline, “Love is fair until it declares war. Every fire begins with a moment. Every clash begins here.” The line hints at a story where love could lead to intense conflict, while the glimpse itself keeps the central narrative under wraps. With Rashmika Mandanna launching First Spark, Niro has received an attention-grabbing introduction. The makers are expected to reveal more details about the film, including its cast and release plans, in the coming days. Check Out:   Naslen vs Sandeep Pradeep: Both fail November test                        Box Office: Ramayana Part-1 crosses Baahubali 2    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
సంక్రాంతి సినిమాలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు అనగానే గుర్తొచ్చే దర్శకుడు అనిల్ రావిపూడి. తనదైన కామెడీ టైమింగ్, కమర్షియల్ కథలతో ప్రేక్షకులను నవ్విస్తూ వరుస విజయాలు అందుకుంటున్న ఆయన ఇప్పుడు పూర్తిగా కొత్త జానర్‌లోకి అడుగుపెడుతున్నారు. ఏకంగా రామాయణం ఆధారంగా యానిమేషన్ సినిమా రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వేదికగా అనిల్ రావిపూడి ఈ విషయాన్ని వెల్లడించారు. రామాయణం ఆధారంగా యానిమేటెడ్ సినిమా చేస్తున్నానని, ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ నిర్మాణ దశలో ఉందని చెప్పారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటిస్తామని తెలిపారు. ఈ సినిమా తనకు డ్రీమ్ ప్రాజెక్ట్ అని అనిల్ చెప్పారు. చిన్నప్పటి నుంచి మన పురాణాలంటే తనకు ఎంతో గౌరవం, ఇష్టమని వెల్లడించారు. విభిన్నమైన జానర్లలో సినిమాలు చేయాలని ఉందని, ఈ యానిమేషన్ సినిమాతో ప్రేక్షకులు తనలోని మరో కోణాన్ని చూస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు అనిల్ రావిపూడి అంటే కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు గుర్తొస్తాయి. ‘ఎఫ్2’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సినిమాలతో ప్రేక్షకులను నవ్వించిన ఆయన.. ఇప్పుడు పౌరాణిక కథను యానిమేషన్ రూపంలో చెప్పబోతుండటం ఆసక్తి కలిగిస్తోంది. అయితే ఈ సినిమాలో రామాయణంలోని ఏ ఘట్టాలను చూపించబోతున్నారు? యానిమేషన్ స్టైల్ ఎలా ఉండబోతోంది? అనే వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఇది కూడా చదవండి: ఎన్టీఆర్, అనిల్ రావిపూడి కాంబో.. తెలుగు సినిమాకు మంచి రోజులు వస్తాయా.? ఇదిలా ఉంటే, యానిమేషన్ సినిమా చేస్తున్నంత మాత్రాన తనకు పేరు తెచ్చిన కామెడీ సినిమాలను వదిలిపెట్టనని అనిల్ స్పష్టం చేశారు. తన కామెడీ సినిమాలకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణే వాటిని కొనసాగించడానికి కారణమని చెప్పారు. వారమంతా పని ఒత్తిడితో అలసిపోయి థియేటర్లకు వచ్చే ప్రేక్షకులను నవ్వించి, సంతోషంగా ఇంటికి పంపించడమే తనకు సంతృప్తినిస్తుందని అన్నారు. కాగా, ప్రస్తుతం 'జనవరి 12 విడుదల' సినిమాతో బిజీగా ఉన్న అనిల్ రావిపూడి.. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో ఓ మూవీ చేయనున్నారు. ఈ కాంబినేషన్‌ను ఎన్టీఆర్, అనిల్ ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతుందని వెల్లడించారు. ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించనున్నారు. మీకు నచ్చవచ్చు: కాకా రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. విశ్వంభర పరిస్థితి ఏంటి.? ఓటీటీలోకి ఆదర్శ కుటుంబం.. రెస్పాన్స్ ఎలా ఉందంటే.?       [Anil Ravipudi, Dream Project, Ramayana, Animated Film, January 12 Vidudala]  
డిసెంబర్ 4 న తెలుగు సినిమా ప్రేమికులని చూసి ఇతర భాష ప్రేమికులు కుళ్ళుకునే పరిస్థితి. నాగ చైతన్య 'వృష కర్మ', నితిన్ 'అలియాస్ రుక్మిణి' వంటి భిన్న జోనర్స్ తో తెరకెక్కిన చిత్రాలు డిసెంబర్ 4 న సెల్యులాయిడ్ పై సాక్షాత్కరించడమే ప్రధాన కారణం. మరి ఆ చిత్రాలపై ఒక లుక్ వేద్దాం. టాలీవుడ్‌లో ఒకే సమయంలో రెండు ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటే.. వాటి మధ్య పోటీ కంటే ప్రేక్షకులకు దక్కే వినోదం గురించే ఎక్కువగా ఆలోచించాలి. ముఖ్యంగా రెండు సినిమాలు రెండు భిన్నమైన జానర్లలో తెరకెక్కితే ఆ అడ్వాంటేజ్ మరింత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వృషకర్మ, అలియాస్ రుక్మిణి సినిమాల విషయంలోనూ ఇదే ఆసక్తి కనిపిస్తోంది. ఒకే తరహా కథలు, ఒకే తరహా ఎమోషన్స్‌తో సినిమాలు వస్తే ప్రేక్షకులకు కొంత మొనాటనీ అనిపించవచ్చు. కానీ ఒక సినిమా థ్రిల్, అడ్వెంచర్ వైపు తీసుకెళ్తే.. మరో సినిమా పూర్తిగా భిన్నమైన అనుభూతిని అందించవచ్చు. అందుకే ఈ రెండు సినిమాలని  బాక్సాఫీస్ ప్రత్యర్థులుగా కాకుండా.. ప్రేక్షకులకు రెండు రకాల వినోదాన్ని అందించే చిత్రాలుగా చూడాలి. నాగచైతన్య హీరోగా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో వస్తున్న వృషకర్మపై ఇప్పటికే ఆసక్తి పెరిగింది. విరూపాక్షతో సూపర్ నేచురల్ థ్రిల్లర్‌ను అద్భుతంగా తెరకెక్కించిన కార్తీక్.. ఈసారి పురాణాలు, ప్రాచీన రహస్యాలు, అతీంద్రియ శక్తుల నేపథ్యంలో కథను సిద్ధం చేశారు. ట్రైలర్ చూస్తుంటే 5 వేల సంవత్సరాల నాటి రహస్యం, నిధి అన్వేషణ, భయంకరమైన శక్తులు, వాటిని ఎదుర్కొనే హీరో ప్రయాణం ప్రధాన ఆకర్షణగా కనిపిస్తున్నాయి. నాగచైతన్య కూడా ఇంతకుముందు కంటే భిన్నమైన లుక్‌లో కనిపిస్తున్నారు. విజువల్స్, గ్రాఫిక్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ఉన్నాయి. ఇది కూడా చదవండి: కాకా తెలంగాణ రిలీజ్ హక్కులు ఈ సంస్థకే: ఎవరో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!  మరోవైపు  మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వంలో తెరకెక్కిన అలియాస్ రుక్మిణి పూర్తిగా భిన్నమైన కథతో వస్తోంది. ఇందులో  కృష్ణ అనే క్యారక్టర్ లో నితిన్ కనిపిస్తున్నాడు. ఫ్యామిలీ కోర్టులో స్టెనోగ్రాఫర్‌గా పనిచేస్తూ, రుక్మిణి అనే పేరుతో రహస్యంగా పుస్తకాలు రాసే వ్యక్తి రోల్ లో  కనిపించనున్నారు.   ఆ రహస్య రచనా ప్రపంచం ఆయన వ్యక్తిగత జీవితంలో ఎలాంటి సమస్యలకు దారితీసింది? పెళ్లి తర్వాత భార్యకు ఆ నిజం తెలియడంతో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? అనే ఆసక్తికరమైన అంశాలతో కథ సాగనున్నట్లు ట్రైలర్ చెబుతోంది. కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపిన ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా కనిపిస్తోంది. నేచురల్  స్టార్ నాని సమర్పిస్తుండటం అలియాస్ రుక్మిణి స్పెషల్.  పోటీ కంటే కంటెంట్ ముఖ్యం! సాధారణంగా ఒకే రోజు రెండు సినిమాలు విడుదలవుతున్నాయంటే అభిమానుల్లో పోటీ మొదలవుతుంది. ఏ హీరో సినిమా ఎక్కువ వసూళ్లు సాధిస్తుంది? ఏ సినిమా హిట్ అవుతుంది? అనే చర్చ జరుగుతుంది. కానీ ఇక్కడ రెండు సినిమాల మధ్య జానర్ పరంగా స్పష్టమైన వ్యత్యాసం ఉంది. వృషకర్మను ఇష్టపడేవారు మిస్టరీ, థ్రిల్లర్, ఫాంటసీ, అడ్వెంచర్ అంశాలను కోరుకుంటారు. అలియాస్ రుక్మిణి చూసేవారు ప్రేమ, నవ్వులు, కుటుంబ అనుబంధాలు, కొత్త తరహా కథనాన్ని ఆస్వాదించాలనుకుంటారు. అంటే ఒక సినిమా చూడాలనుకునే ప్రేక్షకులు మరో సినిమాను కూడా చూసే అవకాశం ఉంది. రెండు సినిమాలు హిట్ కావాలని కోరుకుందాం! ఇండస్ట్రీలో ఒక సినిమా విజయం సాధిస్తే మరో సినిమా పరాజయం చెందాలనే పరిస్థితి ఉండకూడదు. ముఖ్యంగా కొత్త కథలు, భిన్నమైన జానర్లతో సినిమాలు చేయడానికి ముందుకొచ్చే దర్శక నిర్మాతలని ప్రేక్షకులు ప్రోత్సహించాలి. అప్పుడే తెలుగు సినిమా మరిన్ని ప్రయోగాలు చేయగలుగుతుంది.  సినీ ప్రియులు కూడా అంత స్వార్ధ పరులేమి కాదు. ఐ మీన్..రెండు సినిమాలు బాగున్నా ఒక సినిమానే బాగుందని అనడానికి. రెండు సినిమాలు బాగుంటే ఎలాంటి పోలికలు తీసుకురాకుండా హిట్ చేస్తారు. కాబట్టి అభిమానులు ఎలాంటి టెన్షన్ తీసుకోవద్దు. సినీ ప్రియులు స్వార్ధ పరులేమి కాదు. చాలా మంచి మనసు ఉన్న వాళ్ళు... ఎంజాయ్...   మీకు నచ్చవచ్చు  చిరంజీవి, బాలకృష్ణ మల్టీస్టారర్‌కి కథ రెడీ: డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు! ఎగతాళి చేసారు: ఇప్పుడు వరల్డ్ మొత్తాన్ని తన కామెడీతో నవ్విస్తున్నాడు!   [Vrushakarma, Alias Rukmini,Naga Chaitanya,Nithiin]  
Vishwak Sen’s political action drama Legacy has completed its entire shooting schedule. The film has moved into post-production and is now gearing up for a worldwide theatrical release in February 2027. The film was initially scheduled to hit theatres on December 4, 2026, but the release was pushed to next year. With the shoot now wrapped, the team is focused on completing the post-production work ahead of its new release window. Written and directed by Saikiran Reddy Daida, Legacy is produced by Yeshwanth Daggumati and Saikiran Reddy Daida under the Kalaahi Media banner. The film marks the director’s second feature after Pindam and the production house’s second venture. The story unfolds against a political backdrop and revolves around a reluctant heir who finds himself drawn into a world shaped by his father’s political legacy. Power, ambition, family, love and betrayal form the core of the drama. Also Read: Box Office: Ramayana Part-1 crosses Baahubali 2 Vishwak Sen plays the lead role, with Kay Kay Menon portraying the antagonist and Ekta Rathod as the female lead. The supporting cast includes Murali Mohan, Rao Ramesh, Sachin Khedekar, Raja Ravindra, Rajeev Kanakala, Aneesh Kuruvilla, Khushee Ravi, Kalyani Natarajan and others. Govind Vasantha is composing the music, while Jiju Sunny handles cinematography and Sirish Prasad takes care of editing. With filming complete, Legacy is set to arrive in theatres worldwide in February 2027. Check Out: SRK talks about playing his age on screen                      Naslen vs Sandeep Pradeep: Both fail November test  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
అక్కినేని నాగచైతన్య నటిస్తున్న ‘వృషకర్మ’ సినిమాపై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచగా, తాజాగా దర్శకుడు కార్తీక్ దండు చేసిన ఓ రిక్వెస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సినిమా చూడటానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు మొదటి 10 నిమిషాలు మాత్రం అస్సలు మిస్ కావొద్దని ఆయన కోరారు. తాజాగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కార్తీక్ దండు ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. మీడియా కూడా ఈ విషయాన్ని ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లాలని కోరారు. కొంతమంది థియేటర్లకు ఆలస్యంగా వస్తుంటారని, అలా వచ్చి సినిమా మొదటి పది నిమిషాలు మిస్ అయితే కథలోని అసలు ఫ్లోను అర్థం చేసుకోవడం కష్టమవుతుందని ఆయన చెప్పారు. అంటే సినిమా ప్రారంభంలోనే కథకు చాలా కీలకమైన అంశాలను చూపించబోతున్నారన్నమాట. మొదటి పది నిమిషాల్లో వచ్చే సన్నివేశాలు తర్వాత కథను అర్థం చేసుకోవడానికి ఎంత ముఖ్యమో దర్శకుడి మాటలతో తెలుస్తోంది. అందుకే టికెట్ బుక్ చేసుకున్నవాళ్లు సినిమా మొదలయ్యే సమయానికే థియేటర్‌లో ఉండాలని ఆయన సూచిస్తున్నారు. ‘విరూపాక్ష’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కార్తీక్ దండు ఈసారి ‘వృషకర్మ’తో మిస్టికల్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నారు. నాగచైతన్య ఇందులో హీరోగా నటిస్తుండగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా కనిపించనున్నారు. స్పర్శ్ శ్రీవాస్తవ విలన్ పాత్రలో నటిస్తున్నారు. జయరామ్, బేబీ కియారా ఖన్నా ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇది కూడా చదవండి: వృషకర్మ ట్రైలర్‌.. పాన్ ఇండియా షేక్ అవుతుందేమో.! ‘వృషకర్మ’ డిసెంబర్ 4, 2026న థియేటర్లలో విడుదల కానుంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కథలో మిస్టరీ, థ్రిల్‌తో పాటు కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నామని చిత్రబృందం చెబుతోంది. మొత్తానికి దర్శకుడు మొదటి పది నిమిషాలు మిస్ కావద్దని చెప్పడంతో ‘వృషకర్మ’పై ఆసక్తి మరింత పెరిగింది. అసలు ఆ మొదటి పది నిమిషాల్లో ఏం చూపించబోతున్నారు? తెలియాలంటే డిసెంబర్ 4 వరకు వేచి చూడాల్సిందే. మీకు నచ్చవచ్చు:  ఇరుముడి 100 డేస్ గిఫ్ట్.. రవితేజ ఫ్యాన్స్‎కు మర్చిపోలేని ట్రీట్.! తెలుగు సినిమాకు మంచి రోజులు వస్తాయా.?       [Vrushakarma, First 10 Minutes, Karthik Dandu, Naga Chaitanya, Meenakshi Chaudhary]  
చిరంజీవి ఫ్యాన్స్ మంచి 'కాక' మీద ఉన్నారు. మరి వన్ ఇయర్ అవుతుంది బాస్ నుంచి మూవీ వచ్చి. అందుకే 'కాక' ఎలా ఉండబోతుంది. బాస్ ఈ సారి ఎలాంటి మెస్మరైజ్ చేయబోతున్నారనే అతృతతో వాళ్లంతా ఉన్నారు. జనవరి 13 2027 కి  కౌంట్ డౌన్ పెరగడం కూడా ఒక కారణం. ఈ క్రమంలో 'కాక' కి సంబంధించిన ప్రతి న్యూస్ ని క్షుణ్ణంగా గమనిస్తూ ఉన్నారు. అందులో నైజాం  బిజినెస్ డీల్. మరి ఆ డీటెయిల్స్ మనం కూడా చూద్దాం. నైజాం హక్కులు సొంతం చేసుకున్న ఏషియన్ సురేశ్! చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘కాకా’ సినిమాపై మొదటి నుంచి మంచి క్రేజ్ ఉంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా నైజాం థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా సంక్రాంతి సందర్భంగా ఈ సంస్థ భారీ స్థాయిలో సినిమాను విడుదల చేయనుంది. సంక్రాంతి రేసులో మెగాస్టార్! ఈ సినిమాకు సంబంధించి విడుదల తేదీ విషయంలో గత కొంతకాలంగా రకరకాల ప్రచారాలు జరిగాయి. సినిమా వాయిదా పడుతుందనే వార్తలు కూడా వినిపించాయి. అయితే మేకర్స్ మాత్రం జనవరి 13, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మరోసారి స్పష్టం చేశారు.   ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. మిగిలిన చిత్రీకరణను పూర్తి చేసి ప్రమోషన్లను భారీ స్థాయిలో నిర్వహించేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. ఇది కూడా చదవండి: చిరంజీవి, బాలకృష్ణ మల్టీస్టారర్‌కి  కథ రెడీ.. బోయపాటి ముందుగా బాలయ్యని ఒప్పించారా?   చిరంజీవి డ్యూయల్ రోల్.. భారీ అంచనాలు! ఈ సినిమాలో చిరంజీవి రెండు విభిన్న క్యారెక్టర్స్ లో  కనిపించనున్నారనే ప్రచారం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. అనశ్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తుండగా, నివేదా పేతురాజ్, అనురాగ్ కశ్యప్ తదితరులు కూడా ఈ చిత్రంలో భాగమయ్యారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా థమన్  మ్యూజిక్. ముఖ్యంగా చిరంజీవి, బాబీ కాంబినేషన్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుందనే ఆశాభావంతో మెగా అభిమానులు ఉన్నారు. బాక్సాఫీస్ దగ్గర ఎంత ప్రభావం చూపిస్తుంది? సంక్రాంతి సీజన్ తెలుగు సినిమాలకు అత్యంత కీలకం. ఈ సమయంలో పెద్ద హీరోల సినిమాలు విడుదలైతే థియేటర్ల దగ్గర సందడి మామూలుగా ఉండదు. ఇప్పుడు చిరంజీవి కాకా కూడా సంక్రాంతి బరిలో ఉండటంతో ఈ సినిమా బిజినెస్‌పై ఆసక్తి పెరిగింది.   ముఖ్యంగా నైజాం వంటి కీలక మార్కెట్‌లో ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ రంగంలోకి దిగడం సినిమాకు మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. మరి చిరంజీవి తన మాస్ ఇమేజ్‌తో సంక్రాంతి బాక్సాఫీస్‌ను ఏ స్థాయిలో షేక్ చేస్తారో చూడాలి. మొత్తానికి ‘కాకా’ నైజాం హక్కుల విషయంలో క్లారిటీ రావడంతో సినిమా బిజినెస్ మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు అందరి దృష్టి సినిమా ఫస్ట్ సింగిల్, ట్రైలర్‌తో పాటు తదుపరి ప్రమోషనల్ అప్‌డేట్స్‌పై ఉంది.    మీకు నచ్చవచ్చు  సీతమ్మ లుక్‌పై ట్రోలింగ్: సాయి పల్లవి రిప్లై తెలిస్తే షాక్ అవుతారు! బయటపడిన గుట్టు: మిగతా హీరోలు ఈ ఇద్దర్ని చూసి నేర్చుకుంటారా!   [Kaka, Nizam Rights, Asian Suresh Entertainment, Tollywood]  
మెగాస్టార్ చిరంజీవి.. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ కాంబోలో సినిమా వస్తుందంటే.. వస్తుందని అలా మాములుగా చెప్తున్నావేంటి, ఆల్రెడీ చిరంజీవి, బాలకృష్ణ కలిసి సినిమా చేస్తామని బహిరంగంగా చెప్పారు కదా! బోయపాటి శ్రీనుతో కథ రెడీ చేసుకోమని   చిరంజీవి ఛాలెంజ్ కూడా విసిరాడు కదా! ఏమైనా అప్ డేట్ వస్తే చెప్పు అని గట్టిగా అడిగే పరిస్థితి.  రూమరో, మరి సినీ చుట్టాలు చెప్తున్నారో గాని అప్ డేట్ మాత్రం చాలా ధైర్యంగానే చక్కర్లు కొడుతూ ఉంది.  ఇద్దరు హీరోల ఇమేజ్‌కు తగ్గట్టుగా కథ! చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ మాస్ ఇమేజ్ ఉన్న అగ్ర హీరోలు. వీరిద్దరినీ ఒకే సినిమాలో చూపించాలంటే కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇద్దరి పాత్రలకు సమానమైన ప్రాధాన్యత ఉండాలి. ఎక్కడా ఒకరి ఇమేజ్ మరొకరిని డామినేట్ చేయకూడదు. అలాంటి కథను సిద్ధం చేయడం దర్శకుడికి పెద్ద సవాలే. ఇదే క్రమంలో బోయపాటి శ్రీను ఈ ఇద్దరు హీరోల ఇమేజ్‌కు సరిపోయే కథను సిద్ధం చేస్తున్నట్లు ఎన్టీవీ కథనం పేర్కొంది. ఇప్పటికే కథ దాదాపు ఫైనల్ దశకు చేరుకుందని, ముందుగా బాలకృష్ణకు కథ వినిపించగా ఆయనకు బాగా నచ్చిందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోందట. చిరంజీవి క్యారక్టర్ పై మరింత కసరత్తు! బాలకృష్ణకు కథ నచ్చడంతో ఇప్పుడు చిరంజీవి రోల్ ని మరింత పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దే పనిలో బోయపాటి ఉన్నట్లు సమాచారం. ఇద్దరు స్టార్ హీరోల అభిమానులని  సంతృప్తిపరిచేలా క్యారెక్టర్స్  ఉండటం అత్యంత కీలకం. ముఖ్యంగా ఇద్దరికీ అదిరిపోయే ఎలివేషన్లు, పవర్‌ఫుల్ డైలాగులు, భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండేలా కథని రూపొందిస్తే అభిమానుల అంచనాలు మరో స్థాయికి చేరతాయి.   బోయపాటికి ఇదే కెరీర్‌లో బిగ్గెస్ట్ ఛాన్స్! బాలకృష్ణతో బోయపాటికి మంచి అనుబంధం ఉంది. వీరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ వంటి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరోవైపు రామ్ చరణ్‌తో వినయ విధేయ రామ సినిమాను తెరకెక్కించిన అనుభవం కూడా బోయపాటికి ఉంది. ఇప్పుడు చిరంజీవి, బాలకృష్ణలను ఒకే ఫ్రేమ్‌లో చూపించే అవకాశం వస్తే అది ఆయన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: సీతమ్మ లుక్‌పై ట్రోలింగ్.. సాయి పల్లవిస్ట్రాంగ్ కౌంటర్.. నా ఆత్మవిశ్వాసాన్ని కదిలించలేరు!   నిజంగా ఈ కాంబినేషన్ సెట్ అవుతుందా? గతంలో బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ వేడుకల్లో చిరంజీవి మాట్లాడుతూ.. సమరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి పాత్రలను కలిపి ఒక మంచి కథ సిద్ధం చేస్తే తామిద్దరం కలిసి నటించడానికి సిద్ధమని దర్శకులకు సవాల్ విసిరారు. దీంతో ఈ మల్టీస్టారర్‌పై అప్పటి నుంచే చర్చ మొదలైంది.   అయితే ఇలాంటి భారీ ప్రాజెక్టుకు కథతో పాటు ఇద్దరు హీరోల డేట్స్, ఇతర కమిట్‌మెంట్స్ కూడా కీలకం. ప్రస్తుతం బోయపాటి కథను మరింత పకడ్బందీగా సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి చిరంజీవి, బాలకృష్ణలను ఒకే తెరపై చూడాలన్న అభిమానుల కల ఎప్పుడు నిజమవుతుందో చూడాలి. నిజంగానే బోయపాటి ఈ ఇద్దరినీ ఒప్పించి సినిమా పట్టాలెక్కిస్తే టాలీవుడ్‌లోనే కాదు.. ఇండియన్ సినిమా దగ్గర కూడా ఇదొక సంచలన కాంబినేషన్‌గా మారడం ఖాయం. అయితే ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.   మీకు నచ్చవచ్చు  కామెడీ కింగ్ మిస్టర్ బీన్ అసలు కథ ఇదే! ధనుష్, దుల్కర్ సల్మాన్ ని చూసి నేర్చుకునే హీరోలు ఉన్నారా? మొత్తం ఎంత మంది!   [Chiranjeevi,Balakrishna, Boyapati Srinu, Tollywood]
Naslen and Sandeep Pradeep are being touted as the next-generation superstars of Malayalam cinema. Both actors have built a strong following through their performances and choice of films, with audiences and industry circles placing considerable faith in their potential. However, their November releases have offered a reality check. Naslen's Bachelor Party D'eux and Sandeep Pradeep's Cosmic Samson failed to secure substantial openings, indicating that the growing popularity of these young actors has not yet translated into consistent box-office pull. Naslen has made a significant breakthrough with Scene in Tamil cinema, expanding his reach beyond Malayalam. The success has given him a fresh boost, but his recent Malayalam outings, including Mollywood Times, have failed to make the desired impact. For Naslen, a major blockbuster comeback in Malayalam has become crucial. While his performance and versatility have earned appreciation, a film that connects strongly with audiences and delivers big numbers could firmly establish him as one of the leading stars of his generation. Also Read: What is really happening with Vishwambhara release? Sandeep Pradeep, meanwhile, is looking forward to Picnic, produced by Bhavana Studios. The film is expected to be an important release for him as he looks to regain momentum and strengthen his position after the setback of Cosmic Samson. The November results underline an interesting phase in Malayalam cinema, where promising young actors are being celebrated as future superstars even before they establish consistent theatrical success. Naslen and Sandeep Pradeep have the potential, but their upcoming films will determine how quickly that promise translates into genuine box-office stardom. Check Out:  Chaitanya expresses high confidence on Vrushakarma                       King Daddy Cool: SRK and Kareena back with a banger Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
సాయిపల్లవి.. హీరోయిన్ అనే వర్డ్ ని చెప్పుకునే ఈ మోడరన్ సినీ డేస్ లో నటీమణి అని చెప్పుకున్నా జెన్ జి బ్యాచ్ యాక్సెప్ట్ చేసే విధంగా నటనకి ఎనలేని గౌరవాన్ని తీసుకొచ్చింది. ప్రెజెంట్ రామాయణ ద్వారా నయా సీతమ్మ వారుగా అభిమానులు, ప్రేక్షకుల గుండెల్లో కొలువుతీరింది. అయితే రామాయణలో ఆమె లుక్‌పై సోషల్ మీడియాలో కొంతమంది విమర్శలు చేశారు. సీతమ్మ వారి రోల్ కి  సాయి పల్లవి సరిపోతుందా? ఆమె అందం క్యారక్టర్ కి తగినట్టుగా ఉందా? అంటూ రకరకాల కామెంట్లు చేశారు. తాజాగా ఈ విమర్శలపై సాయి పల్లవి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీతమ్మ అందం గురించి కామెంట్స్.. సాయి పల్లవి ఏమన్నారంటే? ముంబైలో జరిగిన 'వీ ది ఉమెన్' కార్యక్రమంలో జర్నలిస్ట్ బర్ఖా దత్‌తో జరిగిన సంభాషణలో సాయి పల్లవి తన అనుభవాలను పంచుకున్నారు. రామాయణలో సీత పాత్ర పోషించిన తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న విమర్శల గురించి ఆమెను ప్రశ్నించగా.. తనకు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల గురించి తెలియదని అనుకోవద్దని చెప్పారు.   సీతమ్మ ఎంత అందంగా ఉండాలి? ఆమె లుక్ ఇలా ఉండాలి అంటూ వచ్చే కామెంట్లు తన దృష్టికి వస్తూనే ఉంటాయని తెలిపారు. అయితే అలాంటి అభిప్రాయాలు మనలోని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే స్థాయికి చేరకూడదని అన్నారు. మనలో మనకు బలమైన నమ్మకం ఉండాలని, అప్పుడే బయటి ప్రపంచం నుంచి వచ్చే విమర్శలను ఎదుర్కోగలమని చెప్పారు. తనకు సాధ్యమైనంత వరకు తాను ఆత్మవిశ్వాసంతో ఉంటానని, ఎవరి అభిప్రాయాలు వారివని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: చిన్నప్పుడు మాట తడబడేది: ఇప్పుడు ప్రపంచాన్నే నవ్విస్తున్నాడు.. మిస్టర్ బీన్ అసలు కథ ఇదే!   గ్లామర్ పాత్రలంటే ఆసక్తి లేదు! సినిమాల్లో ఎలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడరు? అనే ప్రశ్నకు కూడా సాయి పల్లవి తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. కేవలం గ్లామర్ కోసం ఉపయోగించే పాత్రలు తనకు నచ్చవని తెలిపారు. ఒక హీరోయిన్‌ను కేవలం అందంగా చూపించడానికి లేదా మరొకరితో భర్తీ చేయగలిగే పాత్రల్లో నటించడం తనకు ఇష్టం లేదన్నారు. తాను ఎప్పుడూ బలమైన పాత్రల కోసమే ఎదురుచూస్తానని చెప్పారు. కెరీర్ ప్రారంభంలో మంచి పాత్రల కోసం ఎదురుచూడటం చాలా కష్టంగా ఉండేదని, దాదాపు నాలుగైదేళ్ల పాటు తనకు నచ్చిన పాత్రల కోసం ఓపికగా వేచి ఉన్నానని వెల్లడించారు. మంచి పాత్రలు వస్తాయో రావో తెలియని పరిస్థితుల్లో కూడా తనకు నచ్చని సినిమాలు చేయకుండా ఉండటం అంత సులభం కాదని వివరించారు. మేనేజర్ కూడా లేకుండా సినిమాలు చేస్తున్న సాయి పల్లవి! ఇప్పటి స్టార్ హీరోయిన్లు చాలామంది మేనేజర్లు, ప్రత్యేక బృందాలతో పనిచేస్తుంటారు. కానీ సాయి పల్లవి మాత్రం మేనేజర్ లేదా ప్రత్యేక ఎంటూరేజ్ లేకుండానే తన పనులు తానే చూసుకుంటానని తెలిపారు. దర్శకులు, నటీనటులు తనను సులభంగా సంప్రదించగలిగేలా ఉండటం తనకు ఇష్టమని చెప్పారు. సినిమాల విషయంలో మధ్యవర్తులు లేకుండా నేరుగా కథలు వినడం, అందరితో సులభంగా మాట్లాడటం తనకు నచ్చుతుందని వెల్లడించారు.   మహిళల అందంపై సమాజం అభిప్రాయం మారాలి! సినిమాల్లో హీరోలకు వయసు, శరీరాకృతి విషయంలో ఎన్నో రకాల పాత్రలు దక్కుతుంటాయని.. కానీ హీరోయిన్ల విషయంలో మాత్రం ఎప్పుడూ అందంగా, పర్ఫెక్ట్‌గా కనిపించాలనే అంచనాలు ఉంటాయని సాయి పల్లవి అభిప్రాయపడ్డారు. మహిళలను కూడా సహజమైన రూపాల్లో తెరపై చూపించాల్సిన అవసరం ఉందని ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది. మొత్తానికి సీత పాత్రపై వస్తున్న విమర్శలను పట్టించుకోకుండా తన ఆత్మవిశ్వాసమే ముఖ్యమని సాయి పల్లవి చెప్పడం ఆసక్తికరంగా మారింది. అందం కంటే పాత్రలోని బలం, నటనకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఆమె ఆలోచన ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది. ఒక్కటి మాత్రం నిజం ఏంటంటే వెండితెర నటినిగాని నటీమణిని గాని దత్తత(ఓన్) తీసుకునేదే నిజమైన అందం.     మీకు నచ్చవచ్చు  అయోధ్యలో యాక్షన్ కింగ్ అర్జున్.. ఇండియాలోనే ఫస్ట్ మూవీగా రికార్డు! నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ నయా అప్ డేట్ ఇదే!   [Sai Pallavi, Ramayana, Seethamma Trolls, Bollywood ]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
వయసు పెరిగినా యవ్వనంగా కనిపించాలంటే.. ఇవి అలవాటు చేసుకోండి..! వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో అలసట పెరగడం, బరువు పెరగడం, ముఖంలో కాంతి తగ్గడం చాలా మందికి ఎదురయ్యే సమస్యే. కానీ గంటల తరబడి జిమ్‌లో కష్టపడకుండా లేదా కఠినమైన డైట్లు చేయకుండా, మన రోజువారీ అలవాట్లలో చిన్న మార్పులు చేసుకుంటే ఎప్పటికీ ఉత్సాహంగా, ఫిట్‌గా, యవ్వనంగా ఉండొచ్చు.  ఆ అలవాట్లు ఏమిటో అవి వయసు పెరిగినా యవ్వనంగా ఉండటంలో ఎలా సహాయపడతాయో వివరంగా  తెలుసుకుంటే.. ఉదయం లేవగానే ఫోన్ చూడకుండా ప్రశాంతంగా రోజును ప్రారంభించాలి. ఫోన్ చూస్తే వెంటనే అనవసరపు ఆలోచనలు, ఒత్తిడి మొదలవుతాయి. కనీసం మొదటి 15 నిమిషాలు ఫోన్‌కు దూరంగా ఉండటం మంచిది. లేవగానే టీ లేదా కాఫీ తాగే బదులు ఒకటి రెండు గ్లాసుల నీళ్లు తాగాలి. తర్వాత కాసేపు ఉదయపు ఎండలో నిలబడి కనీసం 10 నిమిషాలు నడవాలి. ఇది శరీరానికి కొత్త శక్తిని ఇచ్చి, బద్ధకాన్ని తగ్గిస్తుంది. భోజనం చేసేటప్పుడు టీవీ లేదా ఫోన్ చూడకూడదు. ఆహారాన్ని గమనిస్తూ నెమ్మదిగా నమిలి తింటే కడుపు నిండిన భావన సమయానికి తెలిసి, అతిగా తినకుండా ఉంటాము. ఇది కూడా చదవండి   ఈ ఐదు ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చాలు.. జీవితం మారిపోతుంది.. జిమ్‌కు వెళ్లే సమయం లేకపోయినా రోజంతా శరీరానికి కదలిక ఉండేలా చూసుకోవాలి. లిఫ్ట్‌కు బదులు మెట్లు ఎక్కడం, ఫోన్ మాట్లాడేటప్పుడు నడవడం, భోజనం తర్వాత 10 నిమిషాలు వాకింగ్ చేయడం వంటి చిన్న అలవాట్లు శరీరాన్ని చురుకుగా ఉంచుతాయి. కడుపు పూర్తిగా నిండేంత వరకు కాకుండా 80 శాతం నిండగానే తినడం ఆపేయాలి. అలాగే ప్లేట్‌లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో జంక్ ఫుడ్, చిప్స్, కూల్ డ్రింక్స్ కనిపించేలా ఉంచుకోకుండా, పండ్లు , నీళ్ల బాటిళ్లను కళ్ల ముందు ఉంచుకోవాలి. చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చుకుంటే ఆటోమేటిక్‌గా మంచి ఆహారం తీసుకునే అలవాటు పెరుగుతుంది. ఒకేసారి పెద్ద పెద్ద మార్పులు చేసుకోవాలని గట్టి నిర్ణయాలు తీసుకుని తర్వాత వదిలేయడం కంటే, రోజుకు కొంచెం కొంచెంగా చిన్న అలవాట్లు మార్చుకోవడం ఉత్తమం. అలాగే ఒకరోజు తప్పు జరిగినా నిరుత్సాహపడకుండా మరుసటి రోజు మళ్లీ కొనసాగించడం ముఖ్యం. రాత్రి పడుకునే కనీసం గంట ముందు ఫోన్, టీవీ స్క్రీన్లకు దూరంగా ఉండాలి. గాఢ నిద్ర సరిగ్గా లభిస్తే మరుసటి రోజు శరీరం ఉత్సాహంగా ఉంటుంది, అనవసరమైన ఆకలి కోరికలు కూడా తగ్గుతాయి.                                                                                                                                            *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు   రిలేషన్‌షిప్‌లో పర్సనల్ స్పేస్..భాగస్వామి ఒంటరిగా గడపాలని కోరుకోవడానికి      అసలు కారణాలు..!                                   జీవితంలో డబ్బు, గౌరవం రెండూ కావాలంటే.. ఈ నియమాలు పాటించండి..!
మగాళ్ల రహస్యం..  భార్యకు,  కుటుంబ సభ్యులకు ఈ విషయాలు అస్సలు చెప్పరట..! మన సమాజంలో ఎన్నో ఏళ్లుగా మగవారికి ఒక రకమైన  నియమం ఉంది. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఒత్తిడి ఉన్నా మొహంలో చిరునవ్వు చెరగకూడదు, ఎవరి ముందూ కన్నీళ్లు పెట్టుకోకూడదు, అన్ని బాధ్యతలను ఒంటిచేత్తో మోయాలి అనే మాటలు చిన్నప్పటి నుంచే వారి మనసులో బలంగా నాటుకుపోతాయి. ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలైనా, ఆర్థిక ఇబ్బందులైనా, శారీరక అలసటైనా వాళ్లు చాలావరకు బయటకు చెప్పుకోరు. కానీ బయటకు గట్టిగా కనిపించే ప్రతి మనిషి లోపలా ఎన్నో సున్నితమైన భావోద్వేగాలు, చిన్న చిన్న ఆశలు దాగి ఉంటాయి. మగవారు తమ భార్య నుంచి, కుటుంబ సభ్యుల నుంచి మనసులో ఏం కోరుకుంటారో, కానీ బయటకు ఎందుకు చెప్పలేరో వివరంగా తెలుసుకుంటే.. అసలు మీరు ఎలా ఉన్నారు అని ఎవరైనా అడిగితే బాగుంటుందని.. కుటుంబంలోని ప్రతి ఒక్కరి బాగోగులు మగవారే చూసుకుంటూ ఉంటారు. పిల్లల చదువు, అమ్మానాన్నల ఆరోగ్యం, ఇంటి ఖర్చులు ఇలా అన్నింటి గురించి ఆలోచిస్తారు. కానీ వారిని ఎవరైనా ఒక్కసారి మీరు ఎలా ఉన్నారు, ఈరోజు మీకు ఎలా గడిచింది అని అడిగితే చాలా సంతోషిస్తారు. తమ మనసులోని మాటలను ఎలాంటి భయం లేకుండా, మొహమాటం లేకుండా చెప్పుకునే మనిషి ఒకరు పక్కన ఉండాలని వాళ్లు లోలోపల కోరుకుంటారు. ప్రతి సమస్యకు పరిష్కారం వాళ్లే చూపించాలని అనుకోరు.. ఇంట్లో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా అందరి చూపు ముందుగా ఇంటిలోని మగవారి వైపే ఉంటుంది. ఆర్థిక సమస్యలైనా, ఇతర కష్టాలైనా వాళ్లే పరిష్కరించాలని అందరూ ఆశిస్తారు. కానీ కష్టకాలంలో తమను ఒంటరిని చేయకుండా, కుటుంబ సభ్యులు కూడా అండగా నిలబడాలని, కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవాలని వాళ్లు కోరుకుంటారు. ప్రతి భారాన్ని వాళ్ల మీదే వేయకుండా పంచుకుంటే ఎంతో ఊరటగా ఉంటుందని భావిస్తారు. చేసే కష్టానికి చిన్న మెచ్చుకోలు ఆశిస్తారు.. కుటుంబం కోసం మగవారు తమ సొంత ఆనందాలను, కోరికలను చాలాసార్లు పక్కన పెడతారు. రోజుల తరబడి కష్టపడి పని చేస్తారు. అయితే తమ పనికి పెద్ద పెద్ద బహుమతులు లేదా ఘనమైన సన్మానాలు ఏమీ ఆశించరు. కానీ మీ కష్టం నాకు కనిపిస్తోంది, మీరు చేస్తున్న పని చాలా గొప్పది లేదా ఒక్క చిన్న థ్యాంక్స్ వంటి మాటలు వినాలని మనసులో ఆశపడతారు. ఆ చిన్న ప్రశంస వాళ్లకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇది కూడా చదవండి  రోజూ వాకింగ్ చేయలేకపోతున్నామని బాధపడుతున్నారా ఎలాంటి గిల్టీ ఫీలింగ్ లేకుండా కాస్త విశ్రాంతి కావాలి.. సంపాదన, బాధ్యతలు అంటే జీవితకాలం పరుగెడుతూనే ఉండాలి అన్నట్టు కొందరు ప్రవర్తిస్తుంటారు. దానివల్ల కాసేపు తీరిక తీసుకుందామన్నా, సరదాగా గడుపుదామన్నా మగవారికి ఎక్కడో ఒక మూల తప్పు చేస్తున్నామనే భావన కలుగుతుంది. స్నేహితులతో కలవడమో, ఇష్టమైన సినిమా లేదా ఆట చూడటమో, లేదంటే కాసేపు ప్రశాంతంగా ఒంటరిగా ఉండటమో వాళ్లకు కూడా అవసరం. ఏ విధమైన అపరాధ భావన లేకుండా అలాంటి సమయాన్ని కుటుంబం ఇస్తే వాళ్లు ఎంతో రిలాక్స్ అవుతారు. భావోద్వేగాలను తక్కువ చేసి చూడకూడదు.. చాలామంది మగవారు తమ బాధలను బయటకు చెప్పడానికి జంకుతారు. ఎక్కడ నన్ను బలహీనుడు అనుకుంటారో, ఎక్కడ హేళన చేస్తారో అనే భయం వారిలో ఉంటుంది. బాధ వచ్చినప్పుడు కన్నీళ్లు రావడం లేదా మనసు విప్పి మాట్లాడటం బలహీనత కాదు, అది సహజమైన మనిషి స్వభావం. తాము ఏడ్చినా, బాధపడినా దాన్ని తేలికగా తీసుకోకుండా, అర్థం చేసుకుని గౌరవించాలని వాళ్లు కోరుకుంటారు. భార్య, కుటుంబం నుంచి ప్రేమ, ఆత్మీయతతో కూడిన తోడు.. భార్యాభర్తల బంధం కేవలం ఖర్చులు, బాధ్యతలు, అవసరాలకే పరిమితం కాకూడదు అని ప్రతి భర్త కోరుకుంటాడు. ఇద్దరూ కలిసి మనసు విప్పి మాట్లాడుకోవడం, ఒకరికొకరు సమయం కేటాయించడం, కష్టసుఖాల్లో తోడుగా నిలబడటం ఎంతో ముఖ్యం. కుటుంబ సభ్యుల నుంచి కూడా ప్రేమ, నమ్మకం, ఆత్మీయత లభిస్తే ఆ మనిషికి అంతకంటే పెద్ద బలం మరొకటి ఉండదు. సొంత ఇష్టాలు, వ్యక్తిత్వాన్ని కూడా గౌరవించాలి.. పెళ్లయ్యాక, కుటుంబ బాధ్యతలు పెరిగాక చాలామంది మగవారు తమ సొంత అభిరుచులను, కలలను, ఇష్టాలను వదులుకుంటూ ఉంటారు. కేవలం డబ్బు సంపాదించే యంత్రంలానో, బాధ్యతల మనిషిలానో కాకుండా, తమకూ ఒక వ్యక్తిత్వం ఉందని, సొంత ఇష్టాలు ఉంటాయని కుటుంబం గుర్తించాలని వాళ్లు ఆశిస్తారు. తమ కలలను, స్నేహాలను, ఆసక్తులను గౌరవిస్తే వాళ్లు మరింత సంతోషంగా, సంతృప్తిగా ఉంటారు. మొత్తానికి బయటకు ఎంత గట్టిగా, ధైర్యంగా కనిపించినా మగవారికి కూడా ప్రేమ, ఓదార్పు, విశ్రాంతి, అండ అవసరం. ఈ విషయాలను వాళ్లు మాటల్లో చెప్పకపోయినా, మనసులో మాత్రం ఎంతో బలంగా కోరుకుంటారు. ఇంటిల్లిపాది కలిసి ఆ చిన్న చిన్న విషయాలను అర్థం చేసుకుంటే కుటుంబంలో ప్రేమ, సంతోషం ఇంకా పెరుగుతాయి.                                                                                                                                                *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు   ప్రేమ, నమ్మకం ఉన్నప్పటికీ.. లైఫ్ పార్ట్నర్ ఎందుకు మారిపోతారు.!                                    ఈ నాలుగు పాటిస్తే అత్తాకోడళ్ల మధ్య గొడవలే ఉండవు
చలికాలం రాగానే వాతావరణం చల్లగా మారుతుంది, ఎండ వేడి తగ్గినట్టు అనిపిస్తుంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు చాలామంది సన్‌స్క్రీన్ వాడటం ఆపేస్తారు. కానీ మన చర్మం థర్మామీటర్ చూసి స్పందించదు, కాంతికి స్పందిస్తుంది. మిద్దె మీద లేదా ఆరుబయట కొన్ని గంటలు గడిపితే చల్లని గాలిలో కూడా ముఖం, చేతులు నల్లబడతాయి. నిపుణుల ప్రకారం, సన్ ట్యాన్ వేడి వల్ల కాదు, అతినీలలోహిత కిరణాల (UV rays) వల్ల వస్తుంది. వేడిని మనం అనుభవించగలం కానీ UV కిరణాలను అనుభవించలేం. చలికాలంలో UVB కిరణాలు తక్కువగా ఉన్నా, వృద్ధాప్య ఛాయలు మరియు ట్యానింగ్‌కు కారణమయ్యే UVA కిరణాలు మాత్రం చురుకుగానే ఉంటాయి. ఇవి మేఘాలను మరియు కిటికీ అద్దాలను కూడా దాటుకుని చర్మాన్ని తాకుతాయి. దీనివల్ల చర్మం తనను తాను కాపాడుకోవడానికి మెలనిన్ (melanin) ఉత్పత్తి చేస్తుంది, అదే ట్యాన్‌గా మారుతుంది. చలికాలపు ఎండ బయటకు కనిపించినంత అమాయకంగా ఉండదు. చల్లని గాలి వల్ల వేడి హెచ్చరిక తెలియక మనం ఎండలో ఎక్కువ సమయం గడిపేస్తాం. స్పష్టమైన రోజుల్లోనే కాకుండా పలుచని మేఘాలు ఉన్నప్పుడు కూడా గణనీయమైన UV కిరణాలు కిందకు వస్తాయి. మంచు, నీరు, లేదా ప్రకాశవంతమైన ఉపరితలాలు UV కిరణాలను తిరిగి చర్మంపై ప్రతిబింబిస్తాయి. ఎత్తైన ప్రాంతాలు లేదా హిల్ స్టేషన్లకు వెళ్లినప్పుడు UV తీవ్రత మరింత పెరుగుతుంది. 2024లో ప్రచురించబడిన ఒక అధ్యయన సమీక్ష ప్రకారం, UVA కిరణాలు మరియు దృశ్య కాంతి మేఘాలు, కిటికీ అద్దాల గుండా ప్రయాణించగలవు, అలాగే మెలస్మా వంటి నల్లటి మచ్చల సమస్యలో సూర్యకాంతి కీలక పాత్ర పోషిస్తుంది. భారతీయ చర్మతత్వానికి చలికాలపు ఎండ వల్ల అదనపు జాగ్రత్తలు అవసరం. ముదురు చర్మంలో మెలనిన్ ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా కమిలిపోదు కానీ సులభంగా ట్యాన్ అవుతుంది మరియు నల్లటి మచ్చలు ఏర్పడతాయి. చలికాలపు ఎండ ముఖం, చేతులు, మెడను నల్లబర్చడమే కాకుండా, మెలస్మా (బుగ్గలు, నుదురుపై గోధుమ లేదా బూడిద రంగు మచ్చలు)ను తీవ్రతరం చేస్తుంది మరియు మొటిమల మచ్చలను ఎక్కువకాలం ఉంచుతుంది. 2022లో జరిగిన ఒక సమీక్ష ప్రకారం, దృశ్య కాంతి మరియు దీర్ఘ తరంగ UVA కిరణాలు మెలస్మాకు ముఖ్య కారణాలుగా నిలిచాయి, అయినప్పటికీ మెలస్మా ఉన్నవారిలో ఎక్కువమంది సూర్యరశ్మి నుంచి రక్షణ చర్యలు సరిగ్గా పాటించడం లేదని తేలింది. అందుకే చలికాలంలోనూ ప్రతిరోజూ ఉదయం కనీసం SPF 30 మరియు PA+++ లేదా అంతకంటే ఎక్కువ రేటింగ్ ఉన్న బ్రాడ్-స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్ తప్పనిసరిగా వాడాలి. సన్‌స్క్రీన్ వాడటంలో సంఖ్య కంటే వాడే పద్ధతి, మోతాదు చాలా ముఖ్యం. ముఖం మరియు మెడ కోసం సుమారు రెండు వేళ్ల పొడవు (two finger lengths) అంత సన్‌స్క్రీన్ తీసుకోవాలి. బయట ఉన్నప్పుడు ప్రతి రెండు నుంచి మూడు గంటలకు ఒకసారి మళ్లీ రాయాలి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య నీడలో ఉండటం మంచిది. టోపీ, సన్‌గ్లాసెస్, ఫుల్ స్లీవ్ దుస్తులు ధరించాలి మరియు చేతుల వెనుక భాగం, చెవులు, మెడను కూడా కవర్ చేసుకోవాలి. చల్లని గాలి వల్ల చర్మం పొడిబారి సున్నితంగా మారుతుంది కాబట్టి మాయిశ్చరైజర్ కూడా వాడాలి. ఉష్ణోగ్రత కంటే వాతావరణ యాప్‌లో UV ఇండెక్స్ చూసి ప్రణాళిక వేసుకోవాలి. ఇది కూడా చదవండి:జలుబు, పొడి దగ్గు వేధిస్తోందా? ఇంట్లోనే ఈ సులభ పరిష్కారాలు విటమిన్ D కోసం గంటల తరబడి ఎండలో నిలబడాల్సిన అవసరం లేదు; అలా చేస్తే పిగ్మెంటేషన్ మరియు చర్మ సమస్యలు పెరుగుతాయి. విటమిన్ D లోపం గురించి ఆందోళన ఉంటే వైద్యుడిని సంప్రదించి రక్త పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. 2021లో ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో వచ్చిన సమీక్ష ప్రకారం, ముదురు చర్మం ఉన్నవారికి అదే స్థాయిలో విటమిన్ D ఉత్పత్తి కావడానికి ఎండలో ఎక్కువ సమయం పట్టవచ్చు, కాబట్టి అంచనా వేయడం సరికాదు.  అలాగే, విస్తరిస్తున్న లేదా తగ్గని నల్లటి మచ్చలు, ఆకారం లేదా రంగు మారుతున్న పుట్టుమచ్చలు, చర్మం కాలిపోవడం లేదా పొట్టు ఊడటం, లేదా సన్‌స్క్రీన్ వాడినా పెరుగుతున్న పిగ్మెంటేషన్ కనిపిస్తే వెంటనే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించాలి. చలికాలంలోనూ రోజూ సన్‌స్క్రీన్ రాయడం, చర్మాన్ని కప్పి ఉంచడం ద్వారా మీ చర్మాన్ని ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా ఉంచుకోవచ్చు. మీకు నచ్చవచ్చు:ఆంధ్ర స్టైల్, మిరపకాయ బజ్జీ కూర.. సింపుల్ టిప్స్‌తో పర్ఫెక్ట్ గ్రేవీ!                              ఈజీగా చేసుకునే, రుచికరమైన పొట్లకాయ పచ్చిశనగపప్పు, కూర విధానం           Winter Sun Tan, Sun Tan In Winter Causes, Dermatologist Skincare Tips, Winter Sunscreen Tips, UV Rays In Winter, Prevent Tanning In Cold Weather, Skincare Tips In Telugu.
ప్రేమతో అన్నం పెడితే సరిపోదు.. పిల్లల ఎదుగుదలకు ఈ పోషకాలు తప్పనిసరి! 5 నుంచి 10 ఏళ్ల వయసు పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు సరైన పోషకాహారం ఎంతో అవసరం. ఈ వయసులో పిల్లలు వేగంగా ఎదుగుతుంటారు. వారి ఎముకలు, కండరాలు బలంగా అభివృద్ధి చెందడానికి, మెదడు చురుకుగా పనిచేయడానికి, రోజంతా ఉత్సాహంగా ఉండటానికి సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే పిల్లలకు ప్రతిరోజూ ఎలాంటి ఆహారం ఇవ్వాలి? వారి ఎదుగుదలకు అవసరమైన పోషకాలు ఏయే ఆహార పదార్థాల ద్వారా లభిస్తాయి? అనే విషయాలపై తల్లిదండ్రులకు ఎన్నో సందేహాలు ఉంటాయి. ఈ వీడియోలో డాక్టర్ శ్రీలత గారు 5-10 ఏళ్ల పిల్లల కోసం ఎలాంటి రోజువారీ డైట్ ప్లాన్ పాటించాలో వివరించారు. పిల్లల ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు ఎందుకు ముఖ్యమో, ఇవి శరీర ఎదుగుదలకు, కండరాల అభివృద్ధికి ఎలా తోడ్పడతాయో తెలియజేశారు. పిల్లలకు సరైన మోతాదులో పోషకాలు అందించడానికి ఎలాంటి ఆహారాన్ని ఎంచుకోవాలో వివరించారు. పిల్లల రోజువారీ ఆహారంలో అన్నం, పప్పులు, పాలు, పెరుగు, గుడ్లు, కూరగాయలు, పండ్లు వంటి పోషకవిలువలు కలిగిన పదార్థాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే పిల్లల వయసు, శారీరక ఎదుగుదల, చురుకుదనం, ఆహార అవసరాలను బట్టి వారి డైట్‌లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. పిల్లలు భోజనం సరిగ్గా చేయకపోవడం, పోషకాహారం పట్ల ఆసక్తి చూపకపోవడం, బయట ఆహార పదార్థాలపై ఎక్కువగా ఆధారపడటం వంటి అలవాట్ల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సరైన ఆహారపు అలవాట్లు చిన్నప్పటి నుంచే నేర్పించడం వల్ల పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పునాది పడుతుంది. మీ పిల్లలు ఆరోగ్యంగా, చురుకుగా ఎదగాలంటే వారి రోజువారీ ఆహారంలో ఎలాంటి మార్పులు చేయాలి? 5-10 ఏళ్ల పిల్లలకు ఎలాంటి డైట్ ప్లాన్ ఉపయోగపడుతుంది? పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరమైన పోషకాహారం గురించి డాక్టర్ శ్రీలత గారు అందించిన విలువైన సూచనలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోండి. పిల్లల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ఈ వీడియోను తల్లిదండ్రులు తప్పక చూడండి.
జుట్టు ఒత్తుగా పెరగాలంటే.. మజ్జిగలో ఈ మూడు పొడులు కలిపి తీసుకోండి!   జుట్టు రాలడం, పలుచబడటం, జుట్టు ఒత్తుగా పెరగకపోవడం వంటి సమస్యలతో చాలామంది ఇబ్బందిపడుతుంటారు. జుట్టు ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే బయట ఉపయోగించే నూనెలు, షాంపూలతో పాటు మనం తీసుకునే ఆహారం కూడా ఎంతో ముఖ్యం. ముఖ్యంగా పోషకాలు సమృద్ధిగా ఉండే సహజ ఆహారాలు తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. మునగాకు పొడి, కరివేపాకు పొడి, మెంతుల పొడిని మజ్జిగలో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి పోషకాలు అందుతాయి? మునగాకులో ఉండే పోషకాలు జుట్టు ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి? కరివేపాకును ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? మెంతులు మన ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తాయి? ఈ సహజ పదార్థాలను రోజువారీ ఆహారంలో ఎలా భాగం చేసుకోవాలి? అలాగే చిరుధాన్యాలు (Millets) మన ఆరోగ్యానికి అందించే ప్రయోజనాలు ఏమిటి? రాగులు, జొన్నలు, సజ్జలు వంటి చిరుధాన్యాలను తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి పోషకాలు లభిస్తాయి? సంప్రదాయ ఆహారపు అలవాట్లు, సహజంగా పండించిన ఆహార పదార్థాల ప్రత్యేకత ఏమిటి? అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో ప్రముఖ నేచురల్ ఫార్మింగ్ నిపుణులు  గున్న రాజేందర్ రెడ్డి (Gunna Rajender Reddy) గారు వివరించారు. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారపు అలవాట్లు పాటించాలి? ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన సహజ ఆహారాలను మన రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి? వంటి ఎన్నో ఉపయోగకరమైన విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. జుట్టు ఆరోగ్యం, సహజ ఆహారం, మునగాకు, కరివేపాకు, మెంతులు, చిరుధాన్యాల పయోజనాల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. గమనిక: ఈ ఆహార పదార్థాలు పోషకాలను అందించవచ్చు. అయితే 90 రోజుల్లో జుట్టు తప్పనిసరిగా ఒత్తుగా పెరుగుతుందని హామీ ఇవ్వలేము. జుట్టు అధికంగా రాలుతున్నట్లయితే కారణాన్ని గుర్తించేందుకు వైద్య నిపుణులను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
భోజనం చేసిన కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేయడం లేదా ఎప్పుడూ ఏదో ఒకటి కొరుకుతూ ఉండాలని అనిపించడం చాలామందిలో కనిపిస్తుంది. ఎక్కువ పని చేసినప్పుడు లేదా సరిగ్గా తిననప్పుడు ఇలా అనిపిస్తే అది సాధారణమే. కానీ కడుపు నిండా తిన్నాక కూడా పదేపదే ఆకలి వేస్తుంటే మాత్రం దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. అది మన అలవాటా లేక శరీరంలో  ఏదైనా సమస్య గురించి అలా లక్షణం రూపంలో బయటకు తెలుస్తోందా అన్నది తెలుసుకోవడం ముఖ్యం. చాలామంది ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ ఉంటారు.  అలాంటి వారు తప్పక తెలుసుకోవాల్సిన నిజాలివి. అవేంటో తెలుసుకుంటే.. అలవాట్లు.. మన రోజువారీ ఆహారపు అలవాట్లు, తినే సమయం, తినే ఆహారం మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయి. కొన్నిసార్లు ఆకలి వెనుక శరీరంలోని హార్మోన్లు లేదా ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. సాధారణ ఆకలికి, అనారోగ్య సంకేతానికి మధ్య తేడాను గుర్తించాలి. డయాబెటిస్.. డయాబెటిస్ ఉన్నవారిలో పదేపదే ఆకలి వేయడం ఒక సాధారణ లక్షణం. రక్తంలోని గ్లూకోజ్‌ను శరీర కణాలకు చేర్చడానికి ఇన్సులిన్ అవసరం. డయాబెటిస్‌లో ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కణాలకు తగినంత శక్తి అందదు. దాంతో ఆకలి ఎక్కువగా అనిపిస్తుంది. దీనికి తోడు ఎక్కువ దాహం, తరచుగా మూత్రవిసర్జన, బరువు తగ్గడం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. అలాగే రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా తగ్గినప్పుడు కూడా విపరీతమైన ఆకలి వేస్తుంది. అప్పుడు చెమట పట్టడం, వణుకు, తలతిరగడం, కంగారుగా అనిపించడం లాంటివి కలగవచ్చు. థైరాయిడ్.. థైరాయిడ్ సమస్య వల్ల కూడా ఆకలి పెరగవచ్చు. థైరాయిడ్ గ్రంథి అవసరం కంటే ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేసే స్థితిలో శరీర జీవక్రియ వేగంగా జరుగుతుంది. దీనివల్ల ఆకలి పెరిగినా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. గుండె వేగంగా కొట్టుకోవడం, ఎక్కువ చెమట పట్టడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. నిద్ర సరిగ్గా లేకపోవడం, ఒత్తిడి, కొన్ని రకాల మందుల వల్ల కూడా ఆకలిని నియంత్రించే హార్మోన్లపై ప్రభావం పడి ఎక్కువ ఆకలి వేయవచ్చు. ఇది కూడా చదవండి   మునగాకు లడ్డూ రోజూ 2 తింటే.. శరీరానికి ఇన్ని పోషకాలా.! ఆకలితో పాటు బరువు తగ్గడం.. ఎప్పుడూ ఆకలి వేస్తూ దానితో పాటు బరువు తగ్గడం, ఎక్కువ దాహం, తరచుగా మూత్రానికి వెళ్లాల్సి రావడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను కలవడం మంచిది. అవసరమైన రక్త పరీక్షలు, థైరాయిడ్ పరీక్షలు చేయించుకుంటే అసలు కారణం తెలుస్తుంది.                                                                                                                                              *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు   అవిసె గింజలు ఎలా తింటే ఎక్కువ మేలు సరైన పద్ధతి ఇదే!                                   ఇదిగో ఈ ఆహారాలు తింటే గట్ హెల్త్ సేఫ్ గా ఉంటుంది..!