LATEST NEWS
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే పక్కా ప్లాన్‌తో హత్య చేశాడు. అది కూడా ప్రమాదంగా కనిపించేలా పథకం వేసి మరీ ప్రాణాలు తీశాడు. చివరకు పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బయటపడటంతో ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన ప్రయాస్ పాండే, కవితా చౌదరి మూడేళ్ల క్రితం ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. త్వరలో తమ జీవితంలోకి మరో అతిథి రాబోతున్నాడన్న ఆనందంలో ఉన్న సమయంలోనే కవితకు ఊహించని విషాదం ఎదురైంది. కవిత పేరిట ఉన్న రూ.20 లక్షల ఇన్సూరెన్స్ డబ్బులపై భర్త ప్రయాస్ కన్ను పడినట్లు పోలీసులు గుర్తించారు.  భార్యను హత్య చేసి ఆ మొత్తాన్ని దక్కించుకోవాలని పథకం వేశాడు. ఇందుకోసం మరికొందరితో కలిసి పక్కా స్కెచ్ సిద్ధం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.పథకంలో భాగంగా కవితను స్కూటీపై బయటకు తీసుకెళ్లాడు. ముందుగా మాట్లాడుకున్న వ్యక్తులతో కలిసి ఓ లోడింగ్ ఆటోతో ఆమె ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టించాడు. ఈ ప్రమాదంలో కవిత తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయింది. తొలుత ఇది సాధారణ రోడ్డు ప్రమాదమేనని అందరూ భావించారు. అయితే.. పోలీసుల దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ అనుమానాలు మొదలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన వివరాలు, సాంకేతిక ఆధారాలను పరిశీలించగా ఇది యాదృచ్ఛికంగా జరిగిన ప్రమాదం కాదని తేలింది. ఎవరో కావాలనే ఈ ప్రమాదాన్ని సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో భర్త ప్రయాస్ పాండేపై అనుమానం బలపడింది. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.  రూ.20 లక్షల ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఈ హత్యకు పథకం వేసినట్లు విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.అయితే ఈ ఘటనలో అత్యంత విషాదకరమైన విషయం.. కవిత గర్భవతిగా ఉన్నట్లు సమాచారం. తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తే.. తన కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి కూడా ఆలోచించకుండా డబ్బు కోసం ప్రాణాలు తీశాడన్న విషయం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.జీవితాంతం తోడుగా ఉంటాడని నమ్మిన భర్తే.. తన జీవితాన్ని ముగించినట్లు తెలుసుకున్న కవిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. డబ్బు కోసం ఇంతటి దారుణానికి పాల్పడిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.ఒకప్పుడు ప్రేమతో మొదలైన ఆ బంధం.. చివరకు రూ.20 లక్షల కోసం ఓ ప్రాణాన్ని బలిగొంది. నమ్మిన మనిషే నయవంచకుడిగా మారితే.. ఆ గాయం ఎంతటి విషాదాన్ని మిగుల్చుతుందో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.       [ Insurance Money Murder, Husband Kills Wife, Madhya Pradesh Crime, Jabalpur Crime, Pregnant Woman Murder, Insurance Murder  Case, Husband Wife Crime, Love Marriage Murder, Madhya Pradesh Murder, Jabalpur Murder Case ]  
కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌కు కోటి నజరానా.! దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. కాక్‌పిట్‌లో ఉన్న గొడ్డలితో కో-పైలట్ పైలట్‌పై దాడి చేసినట్లు యూఏఈ ప్రాసిక్యూటర్లు శనివారం అధికారికంగా నిర్ధారించారు.విమానం కాక్‌పిట్‌లో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే ‘క్రాష్ యాక్స్’తోనే ఈ దాడి జరిగినట్లు అధికారులు వెల్లడించారు.  ఈ ఘటనతో విమాన భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.అంతర్జాతీయ విమానయాన నిబంధనల ప్రకారం.. అత్యవసర పరిస్థితుల్లో విమానం నుంచి బయటపడేందుకు వీలుగా ప్రతి వాణిజ్య విమానంలోనూ క్రాష్ యాక్స్‌ను తప్పనిసరిగా ఉంచుతారు. అయితే, 9/11 ఉగ్రదాడుల తర్వాత భద్రతా కారణాలతో ఈ గొడ్డళ్లను ప్రయాణికుల క్యాబిన్‌ల నుంచి కాక్‌పిట్‌కు తరలించారు.ఇప్పుడు ప్రయాణికుల భద్రత కోసం కాక్‌పిట్‌లో ఉంచిన అదే అత్యవసర పరికరం.. పైలట్‌పై దాడికి ఆయుధంగా మారడం విమానయాన భద్రతపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. ప్రాణాలను పణంగా పెట్టి వందలాది మంది ప్రయాణికులను కాపాడిన ఫ్లైదుబాయ్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌కు భారీ నజరానా లభించింది. ఆయన ధైర్యసాహసాలను గుర్తించిన మ్యాన్‌కైండ్‌ ఫార్మా రూ.కోటి ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. కెప్టెన్‌ మచ్చర్‌, ఆయన కుటుంబానికి ఈ మొత్తాన్ని అందించనున్నట్లు సంస్థ శనివారం వెల్లడించింది. సెప్టెంబర్‌ 30న దుబాయ్‌ నుంచి టెల్‌అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్‌ FZ1073 విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలో 174 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో 27 మంది చిన్నారులు ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి. విమానం గాల్లో ఉండగా కాక్‌పిట్‌లో కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌పై సహ పైలట్‌ కత్తితో దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.  ఈ దాడిలో మచ్చర్‌ తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో విమానం వేగంగా కిందకు దిగడం ప్రారంభించింది. దాదాపు 14 వేల అడుగుల మేర విమానం కేవలం కొన్ని సెకన్లలోనే దిగిపోయినట్లు రాయిటర్స్‌ నివేదించింది. తీవ్రంగా గాయపడి కాక్‌పిట్‌లో నేలపై పడిపోయినప్పటికీ కెప్టెన్‌ మచ్చర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాక్‌పిట్‌ తలుపును తెరవగలిగారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానంలో ఉన్న మరో ఇద్దరు ఫ్లైదుబాయ్‌ పైలట్లు విమానాన్ని తమ నియంత్రణలోకి తీసుకుని సౌదీ అరేబియాలోని తబూక్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. విమానంలోని 174 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.  ఈ ఘటనలో తన ప్రాణాల కోసం పోరాడుతూనే ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు మచ్చర్‌ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయనతో మాట్లాడి ధైర్యసాహసాలను అభినందించారు. ఆసుపత్రి నుంచి మోదీతో మాట్లాడిన సందర్భంగా మచ్చర్‌ తన అనుభవాన్ని వివరించారు. కెప్టెన్‌ మచ్చర్‌ సాహసాన్ని గుర్తించిన మ్యాన్‌కైండ్‌ ఫార్మా వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ జూనేజా ఆయనకు లేఖ రాశారు. “మీరు చూపిన అసాధారణ ధైర్యం, సంయమనం, బాధ్యతాభావం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని తాకింది” అంటూ ప్రశంసించారు.  ప్రాణాల విలువతో ఏ నగదు బహుమతినీ పోల్చలేమని, రూ.కోటి సాయం కేవలం తమ గౌరవం, కృతజ్ఞతలకు ప్రతీక మాత్రమేనని సంస్థ పేర్కొంది.ఇదిలా ఉండగా, కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌కు జాతీయ స్థాయి ధైర్య పురస్కారం ఇవ్వాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఆయన సాహసాన్ని గుర్తించి అత్యున్నత ధైర్య పురస్కారానికి పరిగణించాలని రాజ్యసభ సభ్యుడు మిలింద్‌ దేవరా ప్రధాని మోదీకి లేఖ రాశారు.విమానం కూలిపోయే ప్రమాదం నెలకొన్న అత్యంత క్లిష్ట సమయంలో తీవ్రంగా గాయపడినప్పటికీ కాక్‌పిట్‌ తలుపు తెరిచి ప్రయాణికులకు లోపలికి వచ్చే అవకాశం కల్పించడం ద్వారా మచ్చర్‌ కీలక పాత్ర పోషించారు. కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ ధైర్యానికి గుర్తింపుగా మ్యాన్‌కైండ్‌ ఫార్మా ప్రకటించిన రూ.కోటి నజరానా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.     [ Captain Smith Match, Flydubai incident, Flydubai FZ1073 flight,  Nina Maneesh, Flydubai news in Telugu, cockpit incident, TeluguOne news, aviation safety, flight emergency news, Hamam Al Hamami, Crash axe attack, UAE aviation safety, Cockpit assault, Telugu News]  
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా సామాన్యుల నుంచి పెద్ద వ్యాపార సంస్థల వరకు విస్తరించిన ఈ డిజిటల్ లావాదేవీలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు రాబోతున్నాయి. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనల ప్రకారం, కొన్ని ప్రత్యేక లావాదేవీలపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలను వర్తింపజేయనున్నారు.తాజా మార్పుల ప్రకారం, రూ.2,000 మించిన డిజిటల్ చెల్లింపులపై 0.4 శాతం మేర ఎండీఆర్ ఛార్జీలు పడనున్నాయి. అయితే ఈ నిర్ణయం వ్యాపార వర్గాల్లో భిన్నమైన స్పందనలకు దారితీస్తోంది. ఛార్జీల భారాన్ని తప్పించుకునేందుకు వ్యాపారులు మళ్లీ నగదు లావాదేవీలవైపే మొగ్గు చూపుతారనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అప్రమత్తమైంది. అక్టోబర్ 15 తర్వాత మార్కెట్‌లో నగదు డిమాండ్ పెరిగే అవకాశాలు ఉండటంతో, దేశంలోని అన్ని ఏటీఎంలలోనూ తగినంత కరెన్సీ నిల్వలు ఉండేలా చూడాలని బ్యాంకులను ఆదేశించింది. ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది.అయితే సామాన్య వినియోగదారులకు మాత్రం ప్రభుత్వం ఊరటనిచ్చింది. స్నేహితులు, బంధువుల మధ్య జరిపే వ్యక్తిగత (P2P) యూపీఐ లావాదేవీలు యథావిధిగా పూర్తిగా ఉచితం. ఎంత మొత్తం బదిలీ చేసినా ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయబోరని స్పష్టం చేశారు. కేవలం రిజిస్టర్డ్ వ్యాపారులకు (Merchants) చేసే రూ.2,000 పైబడిన చెల్లింపులకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ రుసుములను నేరుగా వ్యాపారి బ్యాంక్ ఖాతా నుంచే మినహాయించుకుంటారు తప్ప, కస్టమర్లపై ఎలాంటి ప్రత్యక్ష భారం ఉండదని అధికారులు వెల్లడించారు. మరోవైపు, కొన్ని కీలక రంగాలకు ఈ ఛార్జీల నుంచి మినహాయింపు లభించింది. రైల్వే టికెట్ల బుకింగ్స్, టెలికాం బిల్లులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, పెట్రోల్, డీజిల్ కొనుగోళ్ల వంటి సేవలకు రూ.2,000 దాటినా వ్యాపారికి కేవలం రూ.5 మాత్రమే స్థిర ఛార్జీగా వర్తిస్తుంది.డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడమే ఈ నిబంధనల ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది. అయినప్పటికీ, చిన్న వ్యాపారులు ఏ విధంగా స్పందిస్తారనేది మార్కెట్‌లో ఆసక్తికరంగా మారింది. అక్టోబర్ 15 తర్వాత దేశ ఆర్థిక లావాదేవీలు ఏ మలుపు తిరుగుతాయోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.       [ UPI Rules October 15 2026, MDR Charges on UPI, Digital Payments India, RBI ATM Cash Rules,UPI Transaction Charges, Merchants, RBI, MDR charges ]  
ALSO ON TELUGUONE N E W S
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ ల మూవీ దసరా రోజు స్టార్ట్ కాబోతుందనే న్యూస్ అయితే సినీ సర్కిల్స్ లో ఒక రేంజ్ లోనే చక్కరకొడుతుంది.సినీ క్లైమెట్ కూడా అందుకు తగ్గట్టే ఉంది. దీంతో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని విషయాల కోసం అభిమానులు, సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజా న్యూస్ ఒకటి వైరల్ హోదాలో జోష్ ని తీసుకొచ్చింది. సాధారణంగా సుకుమార్ మూవీ అనగానే ఎంతో నిడివి, సుదీర్ఘమైన షూటింగ్ షెడ్యూల్స్ గుర్తుకొస్తాయి. ఆయన గత చిత్రాల ట్రాక్ రికార్డ్ చూస్తే.. 2017 ఏప్రిల్‌లో ప్రారంభమైన 'రంగస్థలం' షూటింగ్ దాదాపు ఏడాదికి పైగా సమయం తీసుకుంది. ఇక 'పుష్ప 1' ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్థాయిలో రూపొందడంతో కోవిడ్ మరియు ఇతర కారణాల వల్ల ఆలస్యమైంది. ఆ తర్వాత వచ్చిన 'పుష్ప 2' షూటింగ్ అయితే 2022లో ప్రారంభమై, సుదీర్ఘంగా సాగి 2024 నవంబర్‌ వరకు దాదాపు 2 సంవత్సరాల పైనే సమయాన్ని తీసుకుంది. స్క్రిప్ట్ విషయంలో, అలాగే ప్రతి సన్నివేశాన్ని పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దడంలో సుకుమార్ ఎంత సమయమైనా కేటాయిస్తారు. కానీ 'RC17' విషయంలో మాత్రం ఒక అనూహ్యమైన మార్పు కనిపిస్తోంది. నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కాంబినేషన్‌లో ఎంతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఒక కఠినమైన డెడ్‌‌లైన్‌ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్‌ను రాబోయే డిసెంబర్  నాటికి పట్టాలెక్కించి, కేవలం 12 నెలల వ్యవధిలోనే.. అంటే సరిగ్గా 2027 డిసెంబర్ నాటికి షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నింటినీ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట. ఇది కూడా చదవండి: రెండు వారాల గ్యాప్‌లో: రెండు పాన్ ఇండియా సినిమాలు.. ప్లస్సా? నిర్మాతలకి రిస్కా!     ఇలాంటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను కేవలం 12 నెలల పక్కా టైమ్‌ఫ్రేమ్‌లో పూర్తి చేయాలని భావించడం సుకుమార్ స్టైల్‌కి పూర్తి భిన్నమైనదని సినీ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ప్రతి పాత్ర, విజువల్, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టే ఆయన, ఈ 12 నెలల డెడ్‌లైన్‌‌ను అందుకోగలరా లేదా అనేది ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చగా మారింది.ఏది ఏమైనా సబ్జెక్ట్ గా పక్కాగా ఉండి మైండ్ లో  టార్గెట్ ఫిక్స్ అయితే పెద్ద కష్టమేమి కాదు.    [Rc17 Update, Rc17 Shooting Deadline Target, Ram Charan, Sukumar, RC17 shooting deadline, RC17 movie update]    
  హీరోయిన్స్ కి గౌరవం తెచ్చిన నటీమణుల్లో సాయిపల్లవి ఒకరు. హీరోయిన్ కట్ అవుట్  చూసి కూడా థియేటర్స్ కి ప్రేక్షకులు వస్తారని నిరూపించిన ఈ నాచురల్ సుందరాంగి రాబోయే కొన్ని నెలల వ్యవధిలోనే వరుసగా పెద్ద ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం సినీ ప్రియులను ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తోంది.   రణబీర్ కపూర్, నితేష్ తివారీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'రామాయణ'లో సీతాదేవిగా నవంబర్ 6 న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోవైపు తమిళంలో ధనుష్‌తో చేసిన భారీ యాక్షన్ డ్రామా 'ఓం' (OM Chapter-1 Udhiram: The Blood Wood) సరికొత్త రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకుంది. నవంబర్ 20, 2026న ఈ చిత్రం థియేటర్లలో అడుగుపెట్టనుంది. అంటే కేవలం 2 వారాల (14 రోజుల) వ్యవధిలోనే సాయిపల్లవి నటించిన రెండు అతిపెద్ద పాన్-ఇండియా చిత్రాలు 'రామాయణ', 'ఓం' బాక్సాఫీస్ వద్దకు రాబోతున్నాయి. ఇలాంటి అరుదైన అవకాశం ఏ హీరోయిన్ కి  త్వరగా లభించదని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా దాదాపు 100 శాతానికి పైగా డెడికేషన్‌తో ప్రాజెక్టులను ఎంచుకునే సాయిపల్లవి, తన కరియర్‌లో ఈ 2026-2027 కాలంలో వరుసగా 4 ప్రధాన చిత్రాలతో దాదాపు 1500 కోట్ల వ్యాపార మార్కెట్‌పై ప్రభావం చూపబోతోంది.   ఇది కూడా చదవండి: 'చుట్టమల్లే’ఏఐ మార్ఫింగ్ వీడియో చేసింది వీళ్ళే!      గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ, కేవలం తన అభినయం, డాన్స్ నైపుణ్యాలతోనే కోట్లమంది అభిమానులను సంపాదించుకున్న ఈ న్యాచురల్ బ్యూటీ, బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో గ్లోబల్ లెవెల్లో ఎలాంటి మేజిక్ క్రియేట్ చేస్తుందో అని సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.   [Sai Pallavi Back To Back Movies Release, Sai Pallavi upcoming movies, Ramayana movie release date, Sai Pallavi Dhanush Om,Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]    
  ఎన్టీఆర్ యాక్టింగ్ కి, డాన్స్ లకి ఉన్న కెపాసిటీ తెలిసిందే. సాంగ్స్ కూడా దాదాపు అన్ని హిట్.  ఆ కోవలోనే ప్రీవియస్ మూవీ 'దేవర తో పాటు అందులోని  'చుట్టమల్లే' పాట ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించి ప్రేక్షకులను అలరించిన ఈ చార్ట్‌బస్టర్ సాంగ్ ఆధారంగా కొందరు ఆకతాయిలు అత్యంత అసభ్యకరమైన రీతిలో ఏఐ మార్ఫింగ్ వీడియో సృష్టించారు. నెట్టింట తీవ్రంగా సర్క్యులేట్ అవుతున్న ఈ వికృత కంటెంట్‌పై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా నిందితులకు అత్యంత కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. తన అధికారిక ఎక్స్ (X) ఖాతా ద్వారా స్పందించిన ఎన్టీఆర్, ఈ చర్యను అత్యంత రోత పుట్టించే, సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. "స్త్రీలను తల్లులుగా, దేవతలుగా పూజించే పవిత్రమైన భారతావని మనది. 'మాతృదేవోభవ' అనేది కేవలం మాట మాత్రమే కాదు, అది తరతరాలుగా మన రక్తంలో ప్రవహిస్తున్న సంస్కృతిలో ఒక భాగం. అలాంటి సాంప్రదాయం ఉన్న గడ్డపై, సాంకేతికతను వాడుకొని ఒక మహిళ ఆత్మగౌరవాన్ని బజారుకీడ్చేలా ఇంత నీచానికి దిగజారడం మాటల్లో చెప్పలేనంత సిగ్గుచేటు. ఈ మార్ఫింగ్ వీడియోని తయారుచేసిన కీచకులని, దానిని రకరకాల ప్లాట్‌ఫారమ్‌లలో సర్క్యులేట్ చేస్తూ వైరల్ చేస్తున్న ప్రతి ఒక్కరినీ చట్టపరంగా ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే  లేదు. ప్రతీ ఒక్కరిపై కఠినమైన లీగల్ యాక్షన్ తీసుకుంటానని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: హనుమాన్ అంశ' తెలుగు రిలీజ్ డేట్ వచ్చేసింది: ఆ డేట్ స్పెషల్ ఇదే!     దీంతో ఇప్పుడు ఆ అసభ్యకరమైన ఏఐ వీడియోని ఎవరు రెడీ చేసారనే చర్చ అభిమానులతో పాటు సోషల్ మీడియాలో జరుగుతుంది. ఏది ఏమైనా అణువణువున   పైత్యం ఎక్కువ నిండిన వాళ్లే చేసుంటారనేది మాత్రం నిజం.     [Ntr Warning Ai Morphed Chuttamalle Video,Jr NTR, Chuttamalle Morphed Video, AI Deepfake Controversy, Jr NTR Warning Legal Action,Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]      
సినిమా అంటే ఆకట్టుకొనే కథ, కథనం, మాటలు, పాటలు, క్యారెక్టర్స్ అనే సినీ సత్యాన్ని మరో సారి నిరూపించిన చిత్రం 'హనుమాన్ అంశ్'.  అందుకే బడ్జెట్, భారీ లొకేషన్స్, గ్రాఫిక్స్ లేకుండా  2 కోట్ల రూపాయిల స్వల్ప బడ్జెట్‌తో తెరకెక్కి స్టిల్ 400 కోట్ల క్లబ్ ని క్రాస్ చేసింది. ఈ కలెక్షన్ల సునామీతో పాటు హిందీ మరియు ఇతర భాషల్లో వచ్చిన అపూర్వ స్పందనను చూసి, ఈ కథను తెలుగు ప్రేక్షకులకు అందిస్తే ఇక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని నిర్మాతలు భావించారు. దీంతో సెప్టెంబర్ 18న  తెలుగులో విడుదల చేయడానికి ప్రయత్నాలు జరిగాయి.  త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ప్రాజెక్ట్‌ను ప్రెజెంట్ చేసేందుకు బాధ్యతలు తీసుకున్నారు. అయితే సాంకేతిక కారణాలు మరియు విడుదల ప్రణాళికల మార్పుల వల్ల ఆ సమయంలో సినిమా విడుదల కాలేదు. దసరా పండుగ కానుకగా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా తెలుగు వెర్షన్‌లో తీసుకురావాలని ప్రముఖ పాన్ ఇండియా నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్’ (Hombale Films) రంగంలోకి దిగింది.       ఇది కూడా చదవండి: నేను కూడా వాళ్ల సంగతి తెలుస్తా: వైరల్ గా నిలిచిన రామ్ చరణ్  ఈ మేరకు  అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా 'హనుమాన్ అంశ్' తెలుగు వెర్షన్‌ని  భారీ స్థాయిలో విడుదల చేస్తున్నట్లు హోంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియా వేదికగా  అధికారికంగా ప్రకటించింది.    [Hanuman Ansh, Neem Karoli Baba Biopic, Hanuman Ansh Telugu Release, Hombale Films, Hanuman Ansh Box Office Collection, Vishal Chaturvedi, Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]    
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటే, ఆ న్యూస్ సృష్టించబోయే రికార్డు తాలూకు వ్యూస్ ని గుర్తు చేస్తూ  'ఆరా' అనేది ముందుగానే మనకి హింట్ ఇస్తూనే ఉంటుంది. సేమ్ ఇప్పడు కూడా అదే పరిస్థితి.     పెద్ది సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌‌గా నిలిచింది. థియేటర్లు మరియు డిజిటల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రికార్డు వ్యూస్‌ సాధించిన పెద్ది, ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.శాటిలైట్ హక్కులని  ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ జీ తెలుగు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఆ సంస్థ  పెద్ది వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ అక్టోబర్ 11న సాయంత్రం 5:30 గంటలకు ‘ప్రసారం కానున్నట్లు ప్రకటించడంతో ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. ఇది కూడా చదవండి: Drishyam 3: దృశ్యం 3 ఫస్ట్ డే కలెక్షన్స్ తుఫాన్: వీకెండ్ కి పెను తుఫాను తప్పదా!    దీంతో థియేటర్లలో, ఓటీటీలో  వీక్షించిన ప్రేక్షకులు మరోసారి టీవీలో చూసే అవకాశం లభించనుంది. అదే టైంలో పెద్ది టెలివిజన్ కి సంబంధించి టిఆర్ పి రేటింగ్స్ లో తన  హవా ఏ మేర చాటుతాడో చూడాలి.   [Ram Charan Latest News, Peddi World Television Premiere, Ram Charan Peddi TV Premiere Date, Peddi Telecast Channel Sony MAX, Peddi ZEE Telugu Telecast, Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]      
  ఇండియన్ సినిమా సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్.. వివాదాస్పద జ్యోతిష్యుడుగా పిలవబడుతున్న వేణుస్వామి.. ఈ ఇద్దరి పేర్లు పక్కన, పక్కన ప్రచురించాల్సి వస్తుందని ఏ సినీ సైటు అనుకోని ఉండదు.  కానీ చాలా గట్టిగానే ప్రచురించాల్సి వచ్చింది.  వేణుస్వామి సల్మాన్ ఖాన్ తమ్ముడికి ఫోన్ చేసి, సెప్టెంబర్ తర్వాతి కాలంలో సల్మాన్ కి  తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేదా తీవ్రమైన సవాళ్లు ఎదురవుతాయని, శరీరంపై రాచపుండు లేదా దారుణమైన రుగ్మతలు వచ్చే అవకాశం ఉందంటూ హెచ్చరించాడు. దీంతో  సల్మాన్ తమ్ముడు వెనుస్వామితో ఐ విల్ టేక్ కేర్ అన్నాడు.  ఈ విషయాన్ని  వేణుస్వామినే ఒక మీడియా సమావేశంలో చెప్పాడు.  ఇది కూడా చదవండి: ఇరుముడిపై పరుచూరి బ్రదర్స్ వ్యాఖ్యలు వైరల్: గురుస్వామి రోల్ ముగింపు అలా!   దీంతో ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు వేణు స్వామి చెప్పింది నిజామా, కాదా అనే ఆలోచనలో పడ్డారు. సల్మాన్ మాత్రం  'మాతృభూమి', వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న సినిమాలతో పాటు బిగ్ బాస్ సీజన్ 20 తో బిజీగా ఉన్నాడు.   [Venu Swamy About Salman Khan Health, venu swamy About Salman, Salman Khan health update, Venu Swamy astrology, Venu Swamy Salman Khan predictions,Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]       
మాటలకి రిపీట్ ఆడియెన్స్ వస్తారని, వీరాభిమానులు సైతం పుట్టుకొస్తారని నిరూపించిన మాటల శిఖరం 'పరుచూరి బ్రదర్స్' లో ఒకరు పరుచూరి గోపాల కృష్ణ. సెల్యులాయిడ్ పై మాటలు పరుచూరి బ్రదర్స్ అని పడగానే విజిల్స్ కూడా మోగుతాయంటే క్రేజ్ తాలూకు  రేంజ్ అర్ధం చేసుకోవచ్చు.పరుచూరి పలుకులు పేరుతో ఎప్పట్నుంచో సినీ విశ్లేషణలు చేస్తూ ఎంతో మంది సినీ ఆ శా కిరణాలకి సినీ రచనా భీష్మాచార్యుడుగా ఉన్నారు. రీసెంట్ గా ఇరుముడిపై మాట్లాడుతు 'సినిమా అంటే 'ఇరుముడి'లాగే ఉండాలి.  రవితేజ సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఈ చిత్రం ఒక మైలురాయిగా  నిలిచిపోతుంది.తండ్రీకూతుళ్ల గాఢమైన బంధం తన డ్రీమ్ ప్రాజెక్ట్, కెరీర్ క్లాసిక్ 'సర్పయాగం' సినిమా జ్ఞాపకాలని  గుర్తుచేసింది. గురుస్వామి క్యారక్టర్ ముగింపుని మరింత ప్రభావంతంగా మలచి ఉంటే బాగుండేది. ఎందుకంటే  సాయికుమార్ పోషించిన గురుస్వామి రోల్ భక్తి, ప్రవృత్తికి ప్రతీక కాబట్టి ఆ చేతుల మీదుగా జరిగే పాపాన్ని మరింత నాటకీయంగా ఆత్మహత్య వంటి ముగింపుతో చూపిస్తే ఔచిత్యం దక్కుండేది.  అలాగే అజయ్ ఘోష్ క్యారక్టర్ లో వచ్చిన మార్పు ఇంకాస్త బలంగా చూపించడంతో పాటు చట్టపరంగా జైలు శిక్ష అనుభవించి వచ్చినట్లు చూపిస్తే న్యాయం మరింత స్పష్టంగా కనిపించేది .అలాగే క్లైమాక్స్ సన్నివేశాలలో హీరోకి కనిపించే మణెమ్మ రూపం సీన్‌ని కేవలం ఒక భావోద్వేగ భ్రమలా మాత్రమే చూపిస్తే కథనం ప్రేక్షకులకి ఇంకా బలంగా హత్తుకునేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గంజాయి ముఠాలు, పాఠశాల విద్యార్థులను వేధించే ఆకతాయిల చుట్టూ కథను తిప్పుతూ, తెరవెనుక అసలైన విలన్‌ను చివరి నిమిషం వరకూ దాచిపెట్టిన స్క్రీన్‌ప్లే నేర్పుని  దాసరి నారాయణరావు వంటి దర్శక దిగ్గజాలు చేసారు.  ఇది కూడా చదవండి: మాళవిక మోహన్ ఆసక్తికర ట్వీట్: అతను ఎంతో ప్రత్యేకం     చిత్ర పరిశ్రమలో సినిమా నిర్మాణం అనేది కేవలం ఒక వ్యాపార ప్రయోగం మాత్రమే కాదని, ఎంతోమంది కష్టంతో కూడుకున్న భారీ ఆర్థిక వ్యవహారమని పరుచూరి చెప్పుకొచ్చారు.     [Paruchuri Gopala Krishna About Irumudi, Paruchuri Gopala Krishna, Ravi Teja Irumudi, Irumudi Box Office Collections, Shiva Nirvana Irumudi, Paruchuri Palukulu,Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]      
సినీ ప్రేమికుల హార్ట్ బీట్ లో ఒకరిగా మారింది మాళవిక మోహనన్. రాజాసాబ్ తో ఆకట్టుకున్న ఈ భామ రీసెంట్ గా 'సర్దార్ 2 'లో ప్రాధాన్యత గల క్యారక్టర్ తో మెప్పించింది. ప్రస్తుతం విజయ్‌ సేతుపతితో ‘పాకెట్‌ నోవెల్‌’ చేసి ఫలితం కోసం ఎదురుచూస్తూ ఉంది.  మాళవిక మోహనన్ రీసెంట్ గా 'ఎక్స్' వేదికగా' విజయ్ సేతుపతితో పనిచేయడం నా జీవితంలో అత్యంత మరపురాని, అందమైన అనుభవం. సెట్స్‌లో ఆయన చూపించిన ఆప్యాయత, తోటి నటీనటులకి  ఇచ్చే గౌరవం, ప్రతీ సన్నివేశంలో అందించే ప్రోత్సాహం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా "ఆయన అత్యంత శ్రద్ధ కలిగిన, ఉదార మనస్కుడు. ఆయన కాకుండా ఈ ప్రయాణాన్ని మరొకరితో ఊహించుకోలేను. ఇది కూడా చదవండి:  ప్రకాష్ రాజ్ సంచలన పిలుపు      షూటింగ్‌ అనేది కేవలం కెమెరా ముందు నటించడం మాత్రమే కాదు. ఒక బృందంతో కలిసి నెలల తరబడి ప్రయాణించడం, వారితో ఎన్నో అనుభవాలని పంచుకోవడం కూడా అందులో భాగమే. కొన్ని సినిమాలు చేస్తున్న సమయంలో ఆ చిత్ర బృందమే ఒక ప్రత్యేకమైన ప్రపంచంలా మారిపోతుంది.  పాకెట్‌ నోవెల్‌ కూడా నాకు అలాంటి అనుభూతినే ఇచ్చిందని చెప్పింది.    [Malavika Mohanan Comments On Vijay Sethupathi, Malavika Mohanan Latest Tweet, Vijay Sethupathi, Pocket Novel, Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]              
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
భార్యాభర్తలు ఒకరికి ఒకరు టైం కేటాయించుకోవడం ఎందుకు ముఖ్యం.! ​భార్యాభర్తలు ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఒకరి కోసం ఒకరు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించుకోవడం దాంపత్య జీవితంలో అత్యంత కీలకమైన అంశం. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఉద్యోగం, వ్యాపారం, పిల్లల చదువులు, ఇంటి పనులు, ఆర్థిక బాధ్యతలతో రోజంతా గడిచిపోతుంటుంది. ఈ హడావుడిలో దంపతులు ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి, మనసులో విషయాలను పంచుకోవడానికి సమయం దొరకడం కష్టం. అయితే, కేవలం ఒకే ఇంట్లో  జీవించడం మాత్రమే కాకుండా, ఒకరికొకరు క్వాలిటీ టైమ్ కేటాయించుకోవడం చాలా అవసరం . భార్యాభర్తలు ఒకరికొకరు టైమ్ కేటాయించుకోవడం వల్ల వైవాహిక బంధంలో జరిగే అద్భుతాలు తెలుసుకుంటే..  కష్టాలలో నిలబెడుతుంది. ఎంతటి కష్టసమయంలోనైనా దంపతులను కలిపి ఉంచేది వారి మధ్య ఉన్న అనుబంధమే. రోజూ కొంత సమయం ఒకరి కోసం ఒకరు కేటాయించుకోవడం వల్ల ఇద్దరి మధ్య బంధం మరింత గట్టిపడుతుంది. ఒకరి ఆలోచనలు, ఆశయాలు, భయాలు మరొకరు అర్థం చేసుకోవడానికి ఈ సమయం సహాయపడుతుంది. దీనివల్ల భాగస్వామి పట్ల ప్రేమ, గౌరవం పెరుగుతాయి. గొడవలు తగ్గుతాయి.. చాలా కాపురాల్లో వచ్చే చిన్న చిన్న గొడవలకు లేదా విభేదాలకు ప్రధాన కారణం సరిగ్గా మాట్లాడుకోకపోవడమే. రోజూ కాసేపు ఎలాంటి ఫోన్లు, టీవీలు లేకుండా ఒకరితో ఒకరు మాట్లాడటం వల్ల మనసులోని భ్రమలు, అపోహలు తొలగిపోతాయి. భాగస్వామి చెప్పేది శ్రద్ధగా వినడం వల్ల మన సమస్యలను వారు అర్థం చేసుకుంటున్నారనే నమ్మకం కలుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.. ఆఫీసు పని, కుటుంబ బాధ్యతల వల్ల కలిగే శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించడంలో భాగస్వామితో గడిపే సమయం అద్భుతంగా పనిచేస్తుంది. రోజంతా పడిన కష్టాన్ని మరిచిపోయి, భాగస్వామితో కాసేపు నవ్వుతూ మాట్లాడినా లేదా చిన్న నడకకు వెళ్లినా మనసుకు ఎంతో ఉపశమనం లభిస్తుంది. భాగస్వామి ఇచ్చే ధైర్యం ఎలాంటి ఒత్తిడినైనా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. జీవితం ఎప్పుడూ కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది.. వివాహమై కొన్ని సంవత్సరాలు గడిచాక చాలామందిలో జీవితం రొటీన్‌గా మారిపోయిందనే భావన వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం చాలా అవసరం. కలిసి కాఫీ తాగడం, కొత్త ప్రదేశాలకు వెళ్లడం లేదా పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం వంటివి వైవాహిక జీవితంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. పిల్లలకు మార్గదర్శనం.. పిల్లలు ఎప్పుడూ తల్లిదండ్రులను చూసే విషయాలు నేర్చుకుంటారు. ఇంట్లో భార్యాభర్తలు ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ, ప్రేమగా సమయం గడుపుతుంటే పిల్లలు కూడా ప్రేమ, అనురాగాలు ఉన్న వాతావరణంలో పెరుగుతారు. ఇది వారిలో మానసిక స్థిరత్వాన్ని పెంచుతుంది. భవిష్యత్తులో వారు కూడా మంచి సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకోవడానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది. మార్పులను గ్రహించవచ్చు.. కాలంతో పాటు మనుషుల ఆలోచనలు, అలవాట్లు మారుతుంటాయి. పెళ్లి సమయానికి ఉన్న భాగస్వామి, కొన్నేళ్ల తర్వాత శారీరకంగా, మానసికంగా మారవచ్చు. తరచూ మాట్లాడుకోవడం వల్ల భాగస్వామిలో వస్తున్న మార్పులను, వారి కొత్త అవసరాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల జీవితంలో ఏ దశలోనైనా ఒకరికొకరు అండగా నిలబడటం తేలికవుతుంది. భార్యాభర్తలు ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం అనేది ఒక బాధ్యత మాత్రమే కాదు, అది దాంపత్య జీవితానికి పునాది వంటిది. రోజూ కనీసం ఒక అర గంట పాటు ఫోన్లకు దూరంగా ఉండి,  మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటే, ఎలాంటి సమస్యలనైనా సులభంగా దాటవచ్చు. ఎంత బిజీగా ఉన్నా భాగస్వామికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మాత్రమే వైవాహిక బంధం సుదీర్ఘకాలం సంతోషంగా, ఆరోగ్యకరంగా సాగుతుంది.                      *రూపశ్రీ.  
 అంతర్జాతీయ వృద్దుల దినోత్సవం..  అనుభవాల సారం వృద్దుల జీవితం.. ! వయసు పైబడిన ప్రతి ఒక్కరి అనుభవం సమాజానికి గొప్ప మార్గదర్శకం. ప్రతి ఏటా అక్టోబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం జరుపుకుంటాం. ముసలివాళ్లు అయిపోయారు, ఇక వాళ్లతో ఏం పని అని కొందరు అనుకుంటూ ఉంటారు.  కానీ  జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసి, ఎన్నో పాఠాలను నేర్చుకున్న వారు వృద్దులు.  వృద్ధుల త్యాగాలను, వారు అందించిన సేవలను గుర్తుచేసుకోవడానికి ,  వారి పట్ల మన బాధ్యతను గుర్తుచేసుకోవడానికి,  అంతర్జాతీయ వృద్దుల దినోత్సవం ఎంతగానో సహాయపడుతుంది. వృద్దుల ప్రాధాన్యత,  వారి విషయంలో ఉండాల్సిన బాధ్యత,  సమాజంలో వారి పాత్ర మొదలైన విషయాలను వివరంగా తెలుసుకుంటే.. వృద్దుల జీవితం..  తీపి జ్ఞాపకాలు, చేదు అనుభవాలు, కష్టాలు, విజయాలు అన్నీ కలగలిపిన ఒక గొప్ప పుస్తకం వృద్ధుల జీవితం. జీవితంలో ఏది మంచి, ఏది చెడు అనే విషయాన్ని అనుభవంతో తెలుసుకున్న వారు మన ఇళ్లలో ఉండటం ఒక రక్షణ కవచం లాంటిది. కుటుంబం కోసం, సమాజం కోసం తమ యవ్వనాన్ని, శ్రమను ధారపోసిన వారు వృద్ధాప్యంలో మన నుంచి ఆశించేది కేవలం కొద్దిపాటి ప్రేమ, ఆప్యాయత , గౌరవం మాత్రమే. సమయమే ఇవ్వడం లేదు.. ఈనాటి వేగవంతమైన డిజిటల్ యుగంలో చాలామంది కుటుంబాల్లో పెద్దవారికి సరైన సమయం కేటాయించడం లేదు. ఒంటరితనం అనేది వారిని వేధించే అతిపెద్ద సమస్యగా మారుతోంది. వారితో రోజూ కొద్దిసేపు ప్రశాంతంగా మాట్లాడటం, వారి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకోవడం, వారి అనుభవాలను వినడం వల్ల వారికి కొండంత బలంతో పాటు మనసుకి ఎంతో సంతోషం లభిస్తుంది. సంరక్షణ.. వృద్ధుల సంక్షేమం, భద్రత, వారి ఆరోగ్య సంరక్షణ మనందరి ప్రాథమిక బాధ్యత. వారి అనుభవాల ద్వారా లభించే జ్ఞానాన్ని  గౌరవించాలి,  వారు తమ జీవితంలో కష్టాల నుండి బాధల నుండి నేర్చుకున్న విషయాలు కుటుంబంలో ఎందరికో ముందుజాగ్రత్తలు నేర్పుతాయి.  వారి వృద్ధాప్య జీవితం ప్రశాంతంగా, గౌరవప్రదంగా సాగేలా చూడటమే మనం వారికి ఇచ్చే నిజమైన కానుక. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా మన ఇంట్లో, మన చుట్టుపక్కల ఉన్న పెద్దలందరికీ సేవ చేయడం, వారిని ఎల్లప్పుడూ ఆనందంగా చూసుకోవడం కోసం కనీస చిరు ప్రయత్నం అయినా చెయ్యాలి. పిల్లలిచ్చే గౌరవమే కొండంత ఆనందం.. వృద్దులకు తమ పిల్లలు ఇచ్చే గౌరవమే కొండంత ఆనందాన్ని ఇస్తుంది.  సాధారణంగా కొన్ని ఇళ్లలో మనవళ్లు,  మనవరాళ్లు వృద్దులను చీదరించుకుంటూ,  చిరాకు పడుతూ.. వారితో మాట్లాడటానికి  ఇష్టపడరు. కానీ తమ తల్లిదండ్రులను పిల్లలు గౌరవిస్తూ వారితో ఆప్యాయంగా బాధ్యతగా ఉంటే.. వారి పిల్లలు కూడా తమ అవ్వ తాతల పట్ల ఎంతో ఆదరంగా, ప్రేమగా ఉండగలుగుతారు.  కాబట్టి వృద్దులను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు.                             *రూపశ్రీ.  
 అంతర్జాతీయ వృద్దుల దినోత్సవం..  అనుభవాల సారం వృద్దుల జీవితం.. ! వయసు పైబడిన ప్రతి ఒక్కరి అనుభవం సమాజానికి గొప్ప మార్గదర్శకం. ప్రతి ఏటా అక్టోబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం జరుపుకుంటాం. ముసలివాళ్లు అయిపోయారు, ఇక వాళ్లతో ఏం పని అని కొందరు అనుకుంటూ ఉంటారు.  కానీ  జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసి, ఎన్నో పాఠాలను నేర్చుకున్న వారు వృద్దులు.  వృద్ధుల త్యాగాలను, వారు అందించిన సేవలను గుర్తుచేసుకోవడానికి ,  వారి పట్ల మన బాధ్యతను గుర్తుచేసుకోవడానికి,  అంతర్జాతీయ వృద్దుల దినోత్సవం ఎంతగానో సహాయపడుతుంది. వృద్దుల ప్రాధాన్యత,  వారి విషయంలో ఉండాల్సిన బాధ్యత,  సమాజంలో వారి పాత్ర మొదలైన విషయాలను వివరంగా తెలుసుకుంటే.. వృద్దుల జీవితం..  తీపి జ్ఞాపకాలు, చేదు అనుభవాలు, కష్టాలు, విజయాలు అన్నీ కలగలిపిన ఒక గొప్ప పుస్తకం వృద్ధుల జీవితం. జీవితంలో ఏది మంచి, ఏది చెడు అనే విషయాన్ని అనుభవంతో తెలుసుకున్న వారు మన ఇళ్లలో ఉండటం ఒక రక్షణ కవచం లాంటిది. కుటుంబం కోసం, సమాజం కోసం తమ యవ్వనాన్ని, శ్రమను ధారపోసిన వారు వృద్ధాప్యంలో మన నుంచి ఆశించేది కేవలం కొద్దిపాటి ప్రేమ, ఆప్యాయత , గౌరవం మాత్రమే. సమయమే ఇవ్వడం లేదు.. ఈనాటి వేగవంతమైన డిజిటల్ యుగంలో చాలామంది కుటుంబాల్లో పెద్దవారికి సరైన సమయం కేటాయించడం లేదు. ఒంటరితనం అనేది వారిని వేధించే అతిపెద్ద సమస్యగా మారుతోంది. వారితో రోజూ కొద్దిసేపు ప్రశాంతంగా మాట్లాడటం, వారి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకోవడం, వారి అనుభవాలను వినడం వల్ల వారికి కొండంత బలంతో పాటు మనసుకి ఎంతో సంతోషం లభిస్తుంది. సంరక్షణ.. వృద్ధుల సంక్షేమం, భద్రత, వారి ఆరోగ్య సంరక్షణ మనందరి ప్రాథమిక బాధ్యత. వారి అనుభవాల ద్వారా లభించే జ్ఞానాన్ని  గౌరవించాలి,  వారు తమ జీవితంలో కష్టాల నుండి బాధల నుండి నేర్చుకున్న విషయాలు కుటుంబంలో ఎందరికో ముందుజాగ్రత్తలు నేర్పుతాయి.  వారి వృద్ధాప్య జీవితం ప్రశాంతంగా, గౌరవప్రదంగా సాగేలా చూడటమే మనం వారికి ఇచ్చే నిజమైన కానుక. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా మన ఇంట్లో, మన చుట్టుపక్కల ఉన్న పెద్దలందరికీ సేవ చేయడం, వారిని ఎల్లప్పుడూ ఆనందంగా చూసుకోవడం కోసం కనీస చిరు ప్రయత్నం అయినా చెయ్యాలి. పిల్లలిచ్చే గౌరవమే కొండంత ఆనందం.. వృద్దులకు తమ పిల్లలు ఇచ్చే గౌరవమే కొండంత ఆనందాన్ని ఇస్తుంది.  సాధారణంగా కొన్ని ఇళ్లలో మనవళ్లు,  మనవరాళ్లు వృద్దులను చీదరించుకుంటూ,  చిరాకు పడుతూ.. వారితో మాట్లాడటానికి  ఇష్టపడరు. కానీ తమ తల్లిదండ్రులను పిల్లలు గౌరవిస్తూ వారితో ఆప్యాయంగా బాధ్యతగా ఉంటే.. వారి పిల్లలు కూడా తమ అవ్వ తాతల పట్ల ఎంతో ఆదరంగా, ప్రేమగా ఉండగలుగుతారు.  కాబట్టి వృద్దులను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు.                             *రూపశ్రీ.  
ఉలవచారు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. కానీ ఉలవలు కేవలం రుచికరమైన ఆహారం మాత్రమే కాదు.. మన సంప్రదాయ ఆహార విధానంలో వీటికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా నల్ల ఉలవలను ఆహారంగా ఎలా ఉపయోగించాలి? వాటి వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటి? అనే విషయాలు చాలామందికి తెలియకపోవచ్చు. ఈ వీడియోలో 35 సంవత్సరాల ఆయుర్వేద అనుభవం ఉన్న Dr. Chittibhotla Madhusudhana Sharma గారు ఉలవల గురించి సులభమైన తెలుగులో వివరించారు. నల్ల, తెల్ల, ఎర్ర ఉలవల్లో ఉన్న తేడాలు, నల్ల ఉలవలను ఎందుకు ప్రత్యేకంగా భావిస్తారు, ఉలవల్లో ఉండే పోషకాలు, ఫైబర్ జీర్ణక్రియకు ఎలా ఉపయోగపడుతుంది వంటి విషయాలను ఇందులో తెలుసుకోవచ్చు. అలాగే ఉలవలు బరువు నియంత్రణకు ఉపయోగపడతాయా? రోజువారీ ఆహారంలో ఉలవలను ఎలా చేర్చుకోవాలి? ఉలవచారు లేదా ఇతర రూపాల్లో తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవచ్చు? ఉలవలు తింటే కిడ్నీలో రాళ్లు కరుగుతాయనే ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉంది? వంటి ముఖ్యమైన సందేహాలకు కూడా ఈ వీడియోలో వివరణ లభిస్తుంది. మన వంటింట్లో సులభంగా లభించే ఉలవలను సరైన విధంగా ఆహారంలో చేర్చుకోవడం ద్వారా వాటి పోషక విలువలను ఎలా పొందవచ్చో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. గమనిక: కిడ్నీలో రాళ్లు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఆహారంలో మార్పులు చేసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి. ఉలవలను ఏదైనా వ్యాధికి చికిత్సగా భావించి వైద్య చికిత్సను నిలిపివేయకండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
ప్రతిరోజూ ఉదయం ఉడకబెట్టిన గుడ్డు తినడం చాలామందికి అలవాటు. శారీరక బలానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కోడిగుడ్డును అత్యంత చౌకైన , సమర్థవంతమైన ఆహారంగా నిపుణులు చెబుతుంటారు. అయితే  చాలామంది గుడ్డు తినేటప్పుడు తెల్లసొనను మాత్రమే తిని, పచ్చసొనను తీసి పక్కన పడేస్తుంటారు. పచ్చసొన తింటే శరీరంలో కొలెస్ట్రాల్ లేదా చెడు కొవ్వు పెరిగిపోతుందని, గుండె ఆరోగ్యానికి మంచిది కాదని, బరువు పెరుగుతారని రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. అలాగే చిన్న పిల్లలకు పచ్చసొన ఇస్తే అరగదని భావించేవారు కూడా ఉన్నారు. కానీ ఇవన్నీ కేవలం శాస్త్రీయ ఆధారం లేని అపోహలు మాత్రమే అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.  నిజానికి గుడ్డులోని అసలైన పోషక నిధి పచ్చసొనలోనే దాగి ఉంటుంది. పచ్చసొనలో ఉన్న ముఖ్యమైన పోషకాలు , వాటి ప్రాముఖ్యత గుడ్డులోని సంపూర్ణ పోషక విలువలు మన శరీరానికి అందాలంటే పచ్చసొనను తీసివేయకుండా పూర్తిగా తినడం ఎంతో అవసరం. పచ్చసొనలో లభించే ప్రధానమైన పోషకాలు మన శరీరానికి ఏ విధంగా తోడ్పడతాయో వివరంగా తెలుసుకుంటే.. మెదడు అభివృద్ధికి.. గుడ్డు పచ్చసొనలో కోలిన్ అనే పోషక పదార్థం అధిక పరిమాణంలో ఉంటుంది. ఇది మెదడు సరైన రీతిలో పనిచేయడానికి , జ్ఞాపకశక్తిని పెంచడానికి ఎంతో ముఖ్యం. విశేషమేమిటంటే, ఎదుగుతున్న చిన్న పిల్లలలో మెదడు వికాసానికి , నరాల వ్యవస్థ నిర్మాణానికి కోలిన్ అత్యంత కీలకంగా పనిచేస్తుంది. నరాల బలానికి, రక్తకణాల తయారీకి విటమిన్ బి12.. పచ్చసొనలో విటమిన్ బి12 సమృద్ధిగా లభిస్తుంది. ఇది కొత్త రక్తకణాలు తయారవ్వడానికి, శరీరం చురుగ్గా ఉండటానికి , నరాల ఆరోగ్యానికి చాలా అవసరం. సాధారణంగా మనం తినే శాఖాహారంలో ఈ విటమిన్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే శాఖాహార లోపాలను భర్తీ చేసుకోవడానికి గుడ్డు పచ్చసొన ఒక గొప్ప ఆహార మూలంగా పనిచేస్తుంది. కంటి చూపుకు, రోగనిరోధక శక్తికి విటమిన్ ఏ..  ఇందులో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరచడంలో ఎంతో సాయపడుతుంది. అలాగే శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలపరిచి, పలురకాల ఇన్ఫెక్షన్లు , వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. థైరాయిడ్ పనితీరుకు సెలీనియం..  గుడ్డు పచ్చసొనలో సెలీనియం అనే ముఖ్యమైన ఖనిజ లవణం ఉంటుంది. ఇది థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి , శరీరంలో జీవక్రియల వేగాన్ని నియంత్రించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. గుడ్డును పూర్తిగా ఎందుకు తినాలి? గుడ్డు తెల్లసొనలో కేవలం ప్రోటీన్ మాత్రమే లభిస్తుంది, కానీ పచ్చసొనలో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ , మేలైన పోషకాలన్నీ నిండి ఉంటాయి. కేవలం తెల్లసొన మాత్రమే తింటే గుడ్డు నుంచి వచ్చే పూర్తి పోషకాహార ప్రయోజనాలను మనం కోల్పోయినట్లే అవుతుంది. అందుకే అనవసరమైన భయాలు, అపోహలు పక్కన పెట్టి రోజువారీ ఆహారంలో గుడ్డును పచ్చసొనతో సహా పూర్తిగా తీసుకోవడం వల్ల  ఆరోగ్యం ఎంతగానో మెరుగవుతుంది.                      *రూపశ్రీ.