
సినిమా అంటే ఆకట్టుకొనే కథ, కథనం, మాటలు, పాటలు, క్యారెక్టర్స్ అనే సినీ సత్యాన్ని మరో సారి నిరూపించిన చిత్రం 'హనుమాన్ అంశ్'. అందుకే బడ్జెట్, భారీ లొకేషన్స్, గ్రాఫిక్స్ లేకుండా 2 కోట్ల రూపాయిల స్వల్ప బడ్జెట్‌తో తెరకెక్కి స్టిల్ 400 కోట్ల క్లబ్ ని క్రాస్ చేసింది.
ఈ కలెక్షన్ల సునామీతో పాటు హిందీ మరియు ఇతర భాషల్లో వచ్చిన అపూర్వ స్పందనను చూసి, ఈ కథను తెలుగు ప్రేక్షకులకు అందిస్తే ఇక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని నిర్మాతలు భావించారు. దీంతో సెప్టెంబర్ 18న తెలుగులో విడుదల చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ప్రాజెక్ట్‌ను ప్రెజెంట్ చేసేందుకు బాధ్యతలు తీసుకున్నారు. అయితే సాంకేతిక కారణాలు మరియు విడుదల ప్రణాళికల మార్పుల వల్ల ఆ సమయంలో సినిమా విడుదల కాలేదు. దసరా పండుగ కానుకగా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా తెలుగు వెర్షన్‌లో తీసుకురావాలని ప్రముఖ పాన్ ఇండియా నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్’ (Hombale Films) రంగంలోకి దిగింది.

ఇది కూడా చదవండి: నేను కూడా వాళ్ల సంగతి తెలుస్తా: వైరల్ గా నిలిచిన రామ్ చరణ్
ఈ మేరకు అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా 'హనుమాన్ అంశ్' తెలుగు వెర్షన్‌ని భారీ స్థాయిలో విడుదల చేస్తున్నట్లు హోంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.
[Hanuman Ansh, Neem Karoli Baba Biopic, Hanuman Ansh Telugu Release, Hombale Films, Hanuman Ansh Box Office Collection, Vishal Chaturvedi, Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]
.webp)
.webp)






