LATEST NEWS
  తెలంగాణ‌లో మా బ‌లం పెరిగింద‌న్నారు టీబీజేపీ చీఫ్  రామ‌చంద్ర‌రావు. నిజ‌మే గత 2018, 19 అసెంబ్లీ, లోక్ స‌భ‌ ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో పోల్చుకుంటే బీజేపీ బ‌లం ఇటు తెలంగాణ అటు ఏపీలో గ‌ణ‌నీయంగా త‌న బ‌లాన్ని పెంచుకుంది. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీల‌తో పాటు.. ముగ్గురు ఎమ్మెల్సీల‌తో బ‌లంగానే ఉంది బీజేపీ. ఇటీవ‌లి మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో 15 శాతం పెరిగిన‌ ఓట్ ప‌ర్శంటేజీతో .. 204 నుంచి 336 వార్డుల‌కు త‌న సంఖ్యా బ‌లం పెంచుకుంది.  ఇక ఏపీలో 3 ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలతో గ‌తంక‌న్నా మెరుగ్గానే ఉంది.  ప్ర‌స్తుతం ఇక్క‌డ కూట‌మితో క‌ల‌సి రాష్ట్ర ప్ర‌భుత్వ అధికారంలోనూ పాల్పంచుకుంది బీజేపీ. తెలంగాణ‌లో బీజేపీ ఎప్ప‌టి నుంచి పుంజుకుంది?  ప్ర‌స్తుతం దాని ప‌రిస్థితి ఏంటి? అంత‌ర్గ‌త రాజ‌కీయ వ్య‌వ‌హారాల్లో కీల‌క పాత్ర ఎవ‌రిది? ఈ కార‌ణంగా బీజేపీ రాష్ట్రంలో అధికారం చేప‌ట్టే అవ‌కాశ‌మెంత‌? అన్న‌దొక చ‌ర్చ‌.  తెలంగాణ‌లో బీజేపీ దూకుడు ఎప్పుడు పెంచిందంటే అప్ప‌టి వ‌ర‌కూ ఇక్క‌డ కిష‌న్ రెడ్డి నాయ‌క‌త్వంలోని బీజేపీ  నీరుగారి  నిరుత్సాహంగా మాత్ర‌మే ఉండేది. రాజాసింగ్ ఒక్క‌డే ఎమ్మెల్యేగా ఉండేవాడు. కిష‌న్ ఆడింది ఆట పాడింది పాట‌గా ఇక్క‌డ ఉండేది. అయితే క‌రీంన‌గ‌ర్ నుంచి బీజేపీ  ఎంపీగా గెలిచిన బండి సంజ‌య్‌కి  ఎప్పుడైతే అధ్య‌క్ష ప‌ద‌వి ఇచ్చారో అప్ప‌టి నుంచి బీజేపీ  గ్రేట‌ర్ నుంచి త‌న బ‌లం పుంజుకోవ‌డం మొద‌లు పెట్టింది. ఏకంగా 4 సీట్ల నుంచి 48 సీట్ల వ‌ర‌కూ గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఎగ‌బాకింది క‌మ‌లం పార్టీ. ఆ త‌ర్వాత కూడా బీఆర్ఎస్ త‌ర్వాత బీజేపీ పేరు ఎక్కువ‌గా వినిపించేది. అనూహ్యంగా క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ పార్టీ  విజ‌యం సాధించింది. ఆ హ‌వా ఇక్క‌డి కాంగ్రెస్‌కి ఒక బూస్టింగ్‌లా మారింది. ఎలా  పుంజుకుందో ఏమో ఇక్క‌డ కాంగ్రెస్ మూడు నుంచి ఎక‌బికిన 1వ స్థానంలో వ‌చ్చి నిలిచింది. అసెంబ్లీ  ఎన్నిక‌ల విజేత‌గా  గెలిచి అధికారం చెపట్టింది. ఈ విష‌యంలో బీజేపీ  వెన‌కంజ వేయ‌డానికి గ‌ల ప్రధాన కార‌ణం కిష‌న్ రెడ్డిగా చెబుతారు. తిరిగి అధిష్టానం ఆయ‌న నాయ‌క‌త్వంలోకి రాష్ట్ర పార్టీని పంప‌డంతో.. మొత్తం ఉల్టా- ప‌ల్టా  అయిపోయిందని అంటారు. అప్ప‌టికీ 2023 ఎన్నిక‌ల్లో గ‌తం క‌న్నా మెరుగైన ఫ‌లితాల‌నే సాధించింది క‌మ‌లం పార్టీ. ఒక‌ప్పుడు ఒన్ అండ్ ఓన్లీ విన్న‌ర్ గా ఉన్న రాజాసింగ్ చెప్పే థియరీ ఏంటంటే.. ఇక్క‌డ కిష‌న్ అనే కింగ్ పిన్ మొత్తం పార్టీని కొలాప్స్ చేస్తున్నార‌ని. ఆయ‌న  అధికారంలోకి రావాల‌ని ఎప్పుడూ అనుకోర‌నీ.. ఎవ‌రు అధికారంలో ఉంటే వారి మోచేతి నీళ్లు తాగుతూ ల‌బ్ధి పొందుతూ ఉంటార‌ని ఆరోపిస్తారు రాజాసింగ్. ఈ మాట‌లు నిజం  కాకుంటే రాజాసింగ్ ప్ర‌స్తుతం పార్టీలోనే ఉండేవారేమో తెలీదు గానీ.. మొత్తంగా  అయితే ఇక్క‌డ పార్టీ ఎంత బ‌లం పుంజుకున్నా.. అది అధికారంలోకి  రానివ్వ‌కుండే అడ్డుకునే అడ్డుగోడ కిష‌న్ రూపంలో ఉంద‌ని అంటారు ప‌లువురు కాషాయ‌వాదులు సైతం. మ‌రి ఈ అడ్డంకి  తొల‌గించుకోకుండా ఇక్క‌డ పార్టీ ఎలా అధికారం చేప‌డుతుంది? అన్న మీమాంశ ఎదుర‌వుతోంది ప్ర‌తి  ఒక్క‌రికీ. ఊపు తెచ్చిన బండిని ప‌క్క‌న  పెట్టి, నీర‌స   నాయ‌కుడైన కిష‌న్‌కి  ప‌గ్గాలిచ్చిన‌పుడే బీజేపీ  ప‌నైపోయింద‌ని అంటారు రాజాసింగ్. ఇక బీఆర్ఎస్ తో ఆ పార్టీ కుమ్మ‌క్క‌య్యింద‌న్న మాట కూడా చేటు తెచ్చేదిగానే తెలుస్తోంది.. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో క‌విత‌ను అరెస్టు చేయ‌కుంటే అంద‌రూ ఇదే అనుకుంటార‌ని అన్నారు కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి. ఆ మాటే నిజ‌మైంది. జ‌నం కూడా బీఆర్ఎస్ బీజేపీ మ‌ధ్య  లోపాయికారి ఒప్పందం జ‌రిగిందేమో  అన‌ని న‌మ్మ‌డం  మొద‌లు పెట్టారు.  సీఎం రేవంత్ కూడా ఈ విష‌యాన్ని ప‌దే ప‌దే మొన్న‌టి జూబ్లీహిల్స్ ఉప‌ ఎన్నిక‌ల‌పుడు నొక్కి చెప్ప‌గా.. ఈ ఎల‌క్ష‌న్లో.. క‌మ‌ల‌నాథుల ఓట్ల శాతం మ‌రింత క్షీణించింది.  ఇప్పుడు మున్సిపాల్టీల్లో పెరిగిన ఓట్ల శాతాన్ని బ‌ట్టీ ఉత్త‌ర  తెలంగాణ‌లోని కీల‌క‌మైన  క‌రీంన‌గ‌ర్, నిజామాబాద్ ల‌లో సింగిల్ లార్జెస్ట్  పార్టీగా అవ‌త‌రించ‌డం వంటి గ‌ణాంకాల‌ను చూసి రామ‌చంద్ర‌రావు ఈ త‌ర‌హా కామెంట్లు చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. అయితే కిష‌న్ రెడ్డి మ్యాచ్ ఫినిష‌ర్ కాదు.. ఉన్న మ్యాచ్ తీస్కెళ్లి  ఇత‌రుల చేతుల్లో పెట్టేవాడ‌ని  అంటారు రాజాసింగ్ త‌దిత‌రులు. అందుకే ఇక్క‌డ పార్టీ అధికారంలోకి రావాలంటే అతి పెద్ద విల‌న్ కిష‌న్ అంటారు వీరు.
  వికారాబాద్ జిల్లా అనంతగిరి హరితా రిసార్ట్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్‌తో పోటీ పడుతున్న ఏ రాజకీయ పార్టీ కూడా దేశ స్వాతంత్ర్యానికి ముందు పుట్టలేదని తెలిపారు. 141 సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన కాంగ్రెస్ పార్టీ 140 కోట్ల భారత ప్రజలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చి దిశానిర్దేశం చేసిన పార్టీ కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. వందేళ్ల చరిత్ర కలిగిన మరో పార్టీ సీపీఐ మాత్రమేనని పేర్కొన్నారు. ఏఐసీసీ చేపట్టిన ఈ శిక్షణా కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని తెలిపారు. దేశ స్వాతంత్ర్యానికి ముందు 140 ఏళ్ల క్రితమే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని గుర్తుచేశారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్ తెచ్చిన స్వాతంత్ర్యం, ఇచ్చిన రాజ్యాంగాన్ని ఉపయోగించుకుని ఏర్పడిన కొన్ని పార్టీలు ఇప్పుడు “కాంగ్రెస్ ముక్త భారత్” అంటూ నినాదాలు చేస్తున్నాయని రేవంత్ విమర్శించారు. భారతదేశ ఆత్మగౌరవం గ్రామాల్లో ఉందని నమ్మే పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని, సమూలంగా మార్చాలని కుట్రలు జరుగుతున్న ఈ సమయంలో ఈ శిక్షణా కార్యక్రమం మరింత ప్రాధాన్యత సంతరించుకుందని అన్నారు. డీసీసీ అధ్యక్షులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. వారసత్వంగా పదవులు పొందే అవకాశం ఉన్నప్పటికీ వైఎస్ షర్మిల అలా చేయలేదని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ దేశం కోసం జైలు శిక్షలు అనుభవించారని తెలిపారు. మహాత్మా గాంధీ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడగా, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతీయుల తూటాలకు ఆయనే బలయ్యారని గుర్తుచేశారు. గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేశారని అన్నారు. దేశ సమగ్రత కోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ తమ ప్రాణాలు అర్పించారని చెప్పారు. రాజీవ్ గాంధీ ఆశయాల సాధన కోసం సోనియా గాంధీ త్యాగం చేసి కాంగ్రెస్‌కు అండగా నిలిచారని పేర్కొన్నారు. సౌకర్యంగా పదవులు పొందే అవకాశం ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లారని తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర, ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు కాంగ్రెస్ విజయాల్లో ప్రస్తావించాల్సినవని అన్నారు. వైఎస్ షర్మిల తెలంగాణలో 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి, ప్రస్తుతం ఏపీలో పార్టీ కోసం కష్టపడుతున్నారని చెప్పారు. డీసీసీ అధ్యక్షులు జిల్లాలకు అధిపతులమని భావించవద్దని సూచించారు. విభేదించిన వారిని అణగదొక్కే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతి నాయకుడి ఇంటికి వెళ్లి మద్దతు కోరానని గుర్తుచేశారు. కలిసికట్టుగా పనిచేసినందువల్లే 2.5 శాతం ఓట్లున్న కాంగ్రెస్ పార్టీ 40 శాతం ఓట్లు సాధించి అధికారంలోకి వచ్చిందని తెలిపారు. 119 నియోజకవర్గాల్లో 42 లక్షల డిజిటల్ సభ్యత్వాలు నమోదు చేసినట్లు చెప్పారు. డీసీసీ అధ్యక్షులుగా కృషి చేసిన వారికి ఎమ్మెల్యేలుగా అవకాశాలు ఇచ్చామని, అనుబంధ విభాగాల్లో పనిచేసిన వారికి కార్పొరేషన్ పదవులు కల్పించామని తెలిపారు. డీసీసీ అధ్యక్షుల ప్రతి చర్యను పార్టీ పరిశీలిస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్‌లో ఎలాంటి కోటాలు లేవని, మెరిట్‌ కోటా మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. డీసీసీ అధ్యక్ష పదవిని దుర్వినియోగం చేయవద్దని, పార్టీ విశ్వాసాన్ని దెబ్బతీయవద్దని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రత్యర్థి పార్టీలతో 2 శాతం తేడా ఉండగా, అది పార్లమెంట్ ఎన్నికల్లో 4 శాతానికి, మున్సిపల్ ఎన్నికల్లో 12 శాతానికి పెరిగిందని వివరించారు. ఇది కార్యకర్తల శ్రమ, ప్రజల్లో ఉన్న నమ్మకం వల్ల సాధ్యమైందని చెప్పారు. దేశాన్ని, కాంగ్రెస్‌ను విడదీయలేమని, దేశ ఆత్మనే కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్‌పై బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. పార్లమెంట్‌లో రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అడ్డుకుంటోందని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై కేసులు పెట్టి అవమానిస్తున్నారని విమర్శించారు. మూడు తరాలు ప్రాణత్యాగం చేసిన గాంధీ కుటుంబానికి డబ్బుల అవసరమా అని ప్రశ్నించారు. రాజకీయంగా గాంధీ కుటుంబాన్ని అడ్డుకోవడానికే బీజేపీ ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. దళితులు, మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలు, పేదల గొంతును నొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. 100 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో కులగణన చేపట్టామని, ఎస్సీ వర్గీకరణ అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామని తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో 49.83 శాతం బీసీలు గెలిచారని, మున్సిపల్ ఎన్నికల్లో 63 శాతం ఓబీసీలు ఎన్నికయ్యారని వివరించారు. ఇది కాంగ్రెస్ వల్లే సాధ్యమైందని అన్నారు. పైరవీలు చేయకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తే నాయకుల గౌరవం పెరుగుతుందని సూచించారు. తాను ఎప్పుడూ పైరవీల కోసం పనిచేయలేదని తెలిపారు. 16 ఏళ్లలో జెడ్పీటీసీ నుంచి సీఎం వరకు అడుగడుగునా కాంగ్రెస్ తనకు అవకాశం ఇచ్చిందని అన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పటికీ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలపడాలని ఆకాంక్షించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ కలిసి అభివృద్ధి చెందాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై రాజమహేంద్రవరంలో తాజాగా  కేసు నమోదయింది. ఆయనతో పాటు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పలువురు వైసీపీ నేతలపై కూడా రాజమండ్రి పోలీసులు కేసులు నమోదు చేశారు. కారణమేంటంటే.. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో   18 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబు బెయిలుపై జైలు నుంచి విడుదలైన సందర్భంగా ఈ నెల 19న నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ రాజమహేంద్ర వరం నుంచి గుంటూరు వరకూ సాగింది. అయితే రాజమహేంద్రవరంలో భారీగా కార్లతో ర్యాలీ నిర్వహించరాదంటూ పోలీసులు సెక్షన్ 30 కింద నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైలు బ్రిడ్జిపై నుంచి అధిక  సంఖ్యలో కవాహనాలతో వెళ్ల కూడదని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ అంబడి రాంబాబు, జక్కంపూడి రాజా ఆ నోటీసులను ధిక్కరించి భారీ ర్యాలీ నిర్వహించడమే కాకుండా  రైల్ కం రోడ్డ బ్రిడ్జిపై పెద్ద సంఖ్యలో వాహనాలతో వెళ్లడంతో రాజమహేంద్రవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
ALSO ON TELUGUONE N E W S
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీపై విమర్శలు చేయడం హీరోయిన్ తాప్సీకి అలవాటుగా మారిపోయింది. గతంలో పలుసార్లు సౌత్ ఇండస్ట్రీపై కామెంట్స్ చేసింది. తాజాగా మరోసారి సౌత్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. (Taapsee Pannu) 2010లో వచ్చిన 'ఝుమ్మంది నాదం'తో హీరోయిన్ గా ప్రయాణం మొదలుపెట్టిన తాప్సీ.. తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలు చేసి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. కొన్నేళ్లుగా హిందీ సినిమాలకే పరిమితమైన తాప్సీ.. సౌత్ వైపు పెద్దగా చూడటంలేదు. అయితే హిందీ సినిమాల ప్రమోషన్స్ లో భాగంగా.. సౌత్ ఇండస్ట్రీపై కామెంట్స్ మాత్రం చేస్తోంది. 'అస్సీ' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తాను ఇబ్బంది పడినట్లు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గ్లామర్ సీన్స్, సాంగ్స్ లో ప్యాడెడ్ బ్రాలు ధరించమని ఒత్తిడి చేసేవారని ఆరోపించింది. అంతేకాదు, సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ల నాభిపై ఎక్కువ దృష్టి పెడతారని కామెంట్స్ చేసింది. తాప్సీ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అప్పుడు ఫేమ్ కోసం సౌత్ కావాల్సి వచ్చింది, ఇప్పుడు బాలీవుడ్ లో అవకాశాలు వస్తుండటంతో సౌత్ ని టార్గెట్ చేసిందని కొందరు తాప్సీ తీరుని తప్పుబడుతున్నారు. కాగా, తాప్సీ అడ్వకేట్ గా నటించిన 'అస్సీ' మూవీ ఫిబ్రవరి 20న థియేటర్లలో అడుగుపెట్టింది. Also Read: ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో పుష్పరాజ్ హవా  
National Award-winning filmmaker Prasanth Varma, who delivered the true pan-Indian blockbuster HanuMan, is now gearing up for its highly anticipated sequel, Jai Hanuman, the next chapter in the expanding Prasanth Varma Cinematic Universe. The film will be mounted on a massive scale by the prestigious banner Mythri Movie Makers, with T-Series presenting it. National Award-winner Rishab Shetty steps into the lead role, portraying Lord Hanuman in what is expected to be a powerful, immersive, and transformative performance. This prestigious collaboration of National Award-winning talent brings together some of the most influential names in Indian cinema, instantly making Jai Hanuman one of the most anticipated and crazy films in the country. Prasanth Varma is widely acclaimed for his bold and innovative storytelling that seamlessly blends contemporary narratives with mythology, while Mythri Movie Makers continues its streak of delivering blockbuster spectacles. Riding high on nationwide acclaim following the Kantara Chapter 1, Rishab Shetty’s casting has further amplified expectations. The film was officially launched today in a traditional and majestic ceremony at Anjanadri Betta, Hampi, Vijayanagara—a sacred location believed to be the birthplace of Lord Hanuman. T-Series head Bhushan Kumar sounded the clapboard, while Anil Thadani rolled the camera for the inaugural shot, which was directed by HanuMan star Teja Sajja. In a symbolic gesture, Anil Thadani, Bhushan Kumar, Naveen Yerneni, and Ravi Shankar handed over the script to director Prasanth Varma. With pre-production already underway, the film’s regular shoot will commence soon. The makers earlier unveiled Rishab Shetty as Lord Hanuman with a stunning first-look poster that captures the character’s spirit and divinity, while the actor undergoes a rigorous physical transformation to portray him authentically. Jai Hanuman is designed as a high-octane action epic set in Kaliyug. The film highlights that Hanuman’s silence reflects purpose, not surrender, concealing a power destined to rise. Celebrating unshakeable devotion, loyalty, and timeless strength, Jai Hanuman stands as a tribute to an immortal spirit. The film is produced by Naveen Yerneni and Y Ravi Shankar, mounted on a massive budget with top-tier technical standards, promising a cinematic experience of mythological grandeur and emotional depth. The film boasts a top-tier technical team, with M.M. Keeravani composing the music, S. Thirunavukkarasu behind the lens as cinematographer, and Srinagendhra Thangala overseeing the production design.  
'డ్రాగన్' తరువాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఏది? 'దేవర-2', 'గాడ్ ఆఫ్ వార్' సినిమాల పరిస్థితి ఏంటి? 'అదుర్స్-2'కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా? జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్'(Dragon) సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఫిల్మ్ షూటింగ్ దశలో ఉంది. రీసెంట్ గా జోర్డాన్ షెడ్యూల్ పూర్తయింది. నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. 'డ్రాగన్' తరువాత ఎన్టీఆర్ ఏ సినిమా చేస్తాడా? అనే ఆసక్తి నెలకొంది. కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర-2' చేస్తాడా లేక త్రివిక్రమ్ తో 'గాడ్ ఆఫ్ వార్' చేస్తాడా అనే చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో అనూహ్యంగా 'అదుర్స్-2'(Adhurs 2) తెరపైకి వచ్చింది. 'అదుర్స్-2' చేయాలనే డిమాండ్స్ అప్పట్లో ఫ్యాన్స్ నుంచి తెగ వినిపించేవి. దర్శకుడు వి.వి. వినాయక్, రచయిత కోన వెంకట్ సైతం 'అదుర్స్-2' చేయడానికి రెడీనే అని పలు సందర్భాల్లో చెప్పారు.  అయితే ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోలంతా భారీ సినిమాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ 'అదుర్స్' లాంటి కామెడీ సినిమా చేస్తాడా అనే సందేహాలు ఉన్నాయి. అయినప్పటికీ వినాయక్, కోన వెంకట్ 'అదుర్స్-2' కోసం తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.  ఇటీవల 'బ్యాండ్ మేళం' మూవీ ప్రమోషన్స్ లో 'అదుర్స్-2' గురించి కోన వెంకట్ మాట్లాడాడు. అదుర్స్ సీక్వెల్ స్టోరీ రెడీగా ఉందని, ఎన్టీఆర్ కమిట్ మెంట్స్ పూర్తయ్యాక కలిసి స్టోరీ వినిపిస్తానని చెప్పాడు. చెప్పడమే కాదు.. ఆ దిశగా కోన ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.  అదుర్స్-2 కథ వినడానికి కాస్త టైం ఇవ్వమని ఎన్టీఆర్ ని కోన వెంకట్ కోరినట్లు తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ కథ వింటాడా? విన్న తరువాత 'అదుర్స్-2' చేయడానికి ఓకే అంటాడా?  అసలు ఈ సీక్వెల్ విషయంలో ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. Also Read: తెరపైకి చిరంజీవి, బాలకృష్ణ మల్టీస్టారర్!  
  70వ ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డుల వేడుక శనివారం రాత్రి కొచ్చిలో జరిగింది. 2024 లో విడుదలైన సినిమాలకుగాను అవార్డులు ఇవ్వగా.. తెలుగులో 'పుష్ప-2'(Pushpa 2 The Rule) ఎక్కువ అవార్డులతో సత్తా చాటింది. బెస్ట్ ఫిల్మ్ తో పాటు బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్(Allu Arjun), బెస్ట్ డైరెక్టర్ గా సుకుమార్(Sukumar) నిలిచారు. వీరితో పాటు మరికొన్ని అవార్డులు కూడా 'పుష్ప-2' ఖాతాలో చేరాయి.  '35: చిన్న కథ కాదు' చిత్రానికి గాను ఉత్తమ నటిగా నివేదా థామస్ అవార్డు అందుకుంది. అలాగే కల్కి, హనుమాన్, కమిటీ కుర్రోళ్ళు, దేవర, గుంటూరు కారం సినిమాలు సత్తా చాటాయి.   అవార్డుల జాబితా: ఉత్తమ చిత్రం - పుష్ప 2  ఉత్తమ నటుడు - అల్లు అర్జున్ (పుష్ప 2) ఉత్తమ దర్శకుడు - సుకుమార్(పుష్ప 2) ఉత్తమ చిత్రం(క్రిటిక్స్) - లక్కీ భాస్కర్ ఉత్తమ నటుడు(క్రిటిక్స్) - తేజ సజ్జా (హనుమాన్) ఉత్తమ నటి - నివేదా థామస్(35) ఉత్తమ నటి(క్రిటిక్స్) - కాజల్ అగర్వాల్ (సత్యభామ) ఉత్తమ సహాయ నటుడు - అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 AD) ఉత్తమ సహాయ నటి - అంజలి (గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి) బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ - పుష్ప 2  ఉత్తమ గీత రచయిత - రామజోగయ్య శాస్త్రి (చుట్టమల్లే సాంగ్, దేవర) ఉత్తమ గాయకుడు - శ్రీకృష్ణ (కుర్చీ మడతపెట్టి సాంగ్, గుంటూరు కారం) ఉత్తమ గాయని - శిల్పారావు  (చుట్టమల్లే సాంగ్, దేవర) బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ - యదు వంశీ (కమిటీ కుర్రోళ్ళు) బెస్ట్ డెబ్యూ యాక్టర్ - సందీప్ సరోజ్ (కమిటీ కుర్రోళ్ళు) బెస్ట్ డెబ్యూ హీరోయిన్ - నయన్ సారిక (గం గం గణేశా) బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ - నితిన్ జిహాని(కల్కి 2898 AD), రామకృష్ణ-మోనిక(పుష్ప 2) బెస్ట్ కొరియోగ్రఫీ - శేఖర్ మాస్టర్ (కుర్చీ మడతపెట్టి సాంగ్, గుంటూరు కారం)
టాలీవుడ్ మోస్ట్ అవైటింగ్ మల్టీస్టారర్ చిరంజీవి-బాలకృష్ణ కాంబినేషన్ సినిమా ఎప్పుడు? త్వరలో అభిమానుల కోరిక నెరవేరుతుందా? కోలీవుడ్ సీనియర్ స్టార్స్ కమల్ హాసన్(Kamal Haasan), రజినీకాంత్(Rajinikanth) కలయికలో భారీ మల్టీస్టారర్ రానున్న సంగతి తెలిసిందే. 'జైలర్' ఫేమ్ నెల్సన్ దర్శకత్వంలో రెడ్ జెయింట్ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అదే సమయంలో సోషల్ మీడియాలో టాలీవుడ్ సీనియర్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ కాంబినేషన్ మల్టీస్టారర్ గురించి తెగ చర్చ జరుగుతోంది. (KHxRK reunion) తెలుగునాట చిరంజీవి(Chiranjeevi), బాలకృష్ణ(Balakrishna) ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఇద్దరి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తలపెడితే పండగ వాతావరణం నెలకొంటుంది. ఇక ఇద్దరు కలిసి ఒక సినిమాలో నటిస్తే.. హైప్ ఏ రేంజ్ కి వెళ్తుందో ఊహలకు కూడా అందదు. చిరంజీవి, బాలకృష్ణ కాంబో మల్టీస్టారర్ కోసం తెలుగు సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవం వేడుకలో పాల్గొన్న చిరంజీవి సైతం.. బాలకృష్ణతో కలిసి నటించాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టారు. అప్పటి నుంచి చిరు-బాలయ్య మల్టీస్టారర్ గురించి చర్చ మొదలైంది.  ఇక ఇప్పుడు కమల్ హాసన్, రజినీకాంత్ మల్టీస్టారర్ ప్రకటన నేపథ్యంలో.. చిరు-బాలయ్య మల్టీస్టారర్ చర్చ మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని సోషల్ మీడియా వేదికగా అభిమానులు కోరుతున్నారు. అనిల్ రావిపూడి, బాబీ కొల్లి వంటి దర్శకులు ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. మరి త్వరలోనే అభిమానుల కోరిక నెరవేరుతుందేమో చూడాలి.  
Karthi and Lokesh Kanagaraj have kick started a highly appreciated Cinematic Universe with Kaithi. Now, the long-awaited expansion of the Lokesh Cinematic Universe has finally taken a massive step forward. It is stated that Kaithi 2 censor has been completed as Dilli and announcement glimpse will release soon. A leaked censor certificate reveals that a 30-second video titled Dilli Teaser has been granted an 'U' certificate by the CBFC. For the uninitiated, Dilli is the iconic character played by Karthi, whose journey from a prisoner to a savior formed the backbone of the original film. The fact that the certificate was applied for by Dream Warrior Pictures, the production house behind the first part, confirms that the world of Kaithi is officially reopening. Speculation is rife that this glimpse could be a surprise title announcement or a specialized intro video, similar to how Lokesh Kanagaraj introduced Vikram and Leo. Interestingly, some reports suggest the sequel might be titled simply as Dilli, emphasizing the character's legendary status within the LCU. While director Lokesh is currently occupied with his upcoming project with Allu Arjun, AA23, this censor update suggests that the team is ready to keep the LCU momentum alive. With Anirudh Ravichander likely handling the score and Karthi returning to his most raw avatar, the 30-second glimpse is expected to drop any moment, potentially setting a new record for digital views. ' Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Following the massive reception of the #CULT teaser, the film's team held a celebratory event where emotions ran high. While action lovers are busy praising the technical brilliance and Mass ka Das Vishwak Sen’s directorial vision, a heartwarming moment between the director and music composer Ravi Basrur has stolen the spotlight. During the event, Vishwak Sen surprised Ravi Basrur by gifting him a prestigious Rolex Gold Watch. Vishwak revealed that he has a deep personal connection to this specific edition, having bought one for himself two years ago. To show his immense gratitude for the composer’s work on #CULT, he decided to gift the same model to Basrur, personally placing the watch on his wrist on stage. Ravi Basrur was visibly moved by the gesture. "Many people know my success, but Vishwak Sen appreciated my soul," the composer stated. He explained that their connection during the composition process went beyond professional boundaries, reaching a "soul level." Basrur graciously dedicated the gift to his fellow musicians and the entire music community. The composer further promised that the music for #CULT would be sensational and a "smash hit" on the big screen. The film, which features Gayatri Bhardwaj as the leading lady and dialogues by Tharun Bhascker, is produced on a grand scale by Sandeep Kakarala. With the teaser already creating waves, the bond between the director and composer only adds to the film's growing hype. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Mass ka Das Vishwak Sen has already proved his directorial mettle and he is now back in the director's chair with India’s first slasher thriller, #CULT. The teaser was unveiled today, and it is every bit as raw and bloody as promised. The teaser introduces us to a party in Goa with no laws and no limits. A mysterious hologram appears forcing the guests to play a deadly game. Those who lose are brutally killed slashing body parts. Amidst the chaos, Vishwak Sen makes a powerful entry, taking on the sinister organizers. While the slasher genre is a rarity in Indian cinema, Vishwak Sen hasn't held back. His stylish framing, commanding screen presence, and unique world-building raise significant curiosity. He manages to handle the "slashing" with a sense of taste, making it thrilling without being unwatchable. The film’s dialogue, written by Tharun Bhascker, feels perfectly apt for the gritty setting. In a bold move, the makers are introducing 100 new actors in the ensemble, with Gayatri Bhardwaj playing the leading lady. Produced by Sandeep Kakarala, the film boasts high-class production values. Ravi Basrur is scoring music for the film. The teaser for #CULT has successfully set a massive expectation for action lovers, promising a stylish, high-octane experience on the big screen. Similarities with HIT 3 are uncanny but film looks different from the basic plot line.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
కొత్త వస్తువులు కొంటేనే చాలామంది చాలా సంతోషంగా ఉంటారు.  ఇక మహిళలు అయితే వంటింటి వస్తువుల నుండి వారు కొనుగోలు చేసే వస్తువు పట్ల చాలా ఇష్టంతో ఉంటారు.  కానీ కొత్త వస్తువుల లుక్ పాడు చేసే వాటిలో వాటి మీద ఉండే స్టిక్కర్లు ప్రధానంగా ఉంటాయి.  స్టిక్కర్లను అలాగే ఉంచడం ఇష్టం ఉండదు, పోనీ వాటిని తీసేద్దాం అనుకుంటే స్టిక్కర్ల తాలూకు గమ్ వాటి మీద కనిపిస్తూ వస్తువుల లుక్ పాడు చేస్తుంది.  పైగా ఈ గమ్ మీద దుమ్ము దూళి చాలా తొందరగా పేరుకుపోతుంది.  అయితే కొత్త వస్తువుల మీద స్టిక్కర్లు సులువుగానే తొలగించవచ్చని చాలా మందికి తెలియదు. కేవలం కొన్ని టిప్స్ ఫాలో కావడం వల్ల స్టిక్కర్లను వాటి మూలాలు కనిపించకుండా తొలగించవచ్చు.  ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే.. హెయిర్ డ్రైయర్ వేడి.. స్టిక్కర్‌ను వేడి చేయడం వల్ల దాని జిగట మృదువుగా మారుతుంది, దీని వలన స్టిక్కర్ తీయడం సులభం అవుతుంది.  మీడియం వేడి మీద హెయిర్ డ్రైయర్‌ను ఆన్ చేయాలి. స్టిక్కర్ కు 2-3 అంగుళాల దూరంలో 30-40 సెకన్ల పాటు హెయిర్ డ్రైయర్ ను పట్టుకోండి. తర్వాత ఒక మూల నుండి స్టిక్కర్‌ను పట్టుకుని మెల్లిగా లాగితే   స్టిక్కర్ సులువుగా వచ్చేస్తుంది.  ఒకవేళ స్టిక్కర్ సరిగా రాకపోతే మరికొంతసేపు డ్రైయర్ తో స్టిక్కర్ ఉన్న ప్రాంతాన్ని వేడి చేయాలి. బేకింగ్ సోడా, నూనె పేస్ట్.. ఈ ఇంట్లో తయారుచేసిన బేకింగ్ సోడా,  నూనె పేస్ట్ స్టిక్కర్ల జిగటను తొలగిస్తుంది. బేకింగ్ సోడా,  వంట నూనె లేదా కొబ్బరి నూనె సమాన భాగాలుగా కలిపి పేస్ట్ లా చేయాలి. దానిని స్టిక్కర్ లేదా జిగురు మరక ఉన్న ప్రాంతంలో అప్లై చేయాలి. 15 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై ఒక గుడ్డతో రుద్దాలి.  ఎలాంటి ఆనవాళ్లు లేకుండా స్టిక్కర్ కానీ దాని తాలూకు జిగురు కానీ తొలగిపోతుంది. వెనిగర్ వాటర్.. వెనిగర్ స్టిక్కర్ మీద ఉన్న జిగురును వదిలిస్తుంది. ఒక కాటన్ బాల్ లేదా క్లాత్ ను వెనిగర్ లో ముంచి స్టిక్కర్ మీద ఉంచాలి. 10-15 నిమిషాల తర్వాత స్టిక్కర్ సులభంగా ఊడిపోతుంది. తర్వాత  మృదువైన గుడ్డతో ఆ ప్రాంతాన్ని తుడవాలి. నెయిల్ పాలిష్ రిమూవర్.. గట్టి స్టిక్కర్లకు నెయిల్ పాలిష్ రిమూవర్  ఒక గొప్ప ఛాయిస్. దీన్ని ఉపయోగించడానికి నెయిల్ పాలిష్  రిమూవర్‌ను ఒక కాటన్ బాల్‌పై అద్ది, స్టిక్కర్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. 5-7 నిమిషాల తర్వాత  సున్నితంగా గీకాలి. జిగురు గుర్తులు పూర్తిగా మాయమవుతాయి. వేడినీరు..  వాటర్ ప్రూఫ్ ఉన్న ప్రాంతాలలో స్టిక్కర్లు ఉంటే వేడి నీరు చాలా బాగా సహాయపడుతుంది. దీని కోసం  గోరువెచ్చని నీటితో కొద్దిగా డిష్ సోప్ కలపాలి. ద్రావణంలో స్పాంజ్ ముంచి స్టిక్కర్ మీద సున్నితంగా రుద్దాలి. స్టిక్కర్ లేదా జిగురు   పదార్థం సులభంగా తొలగిపోతాయి.                                    *రూపశ్రీ.
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి గుర్తుగా బుధవారం దేశంలో రంజాన్ చంద్రుడు కనిపించాడు. అంతకుముందు సౌదీ అరేబియాలో ఫిబ్రవరి 17న చంద్రుడు కనిపించాడు.  ఫిబ్రవరి 18న అక్కడ రంజాన్ ఉపవాసం ప్రారంభానికి గుర్తుగా చంద్రుడు కనిపించాడు. భారతదేశంలో ఉపవాసం సాధారణంగా మరుసటి రోజు ప్రారంభమవుతుంది. రంజాన్ ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల.  దీనిని అత్యంత పవిత్రమైన మాసంగా  పరిగణిస్తారు. ఈ నెల చాలా ప్రత్యేకమైనది.  ఈ సమయంలోనే పవిత్ర ఖురాన్ అవతరణ ప్రారంభమైందని చెబుతారు. రంజాన్ ఉపవాసం,  దాహం గురించి మాత్రమే కాదు, రంజాన్ మాసంలో చెయవలసిన పనులు,  చేయకూడని పనులు కూడా ఉంటాయి.  అవేంటో తెలుసుకుంటే.. రంజాన్ ప్రాముఖ్యత.. రంజాన్ మాసం దయ, ఆశీర్వాదం,  క్షమాపణల మాసంగా పరిగణించబడుతుంది. ఈ కాలంలో ముస్లింలు ఉపవాసం ఉండి, తమ పాపాలకు క్షమాపణ కోసం అల్లాహ్‌ను ప్రార్థిస్తారు. ఉపవాసం సహనం, క్రమశిక్షణ,  స్వీయ నియంత్రణను నేర్పుతుంది. రోజంతా ఆకలితో,  దాహంతో ఉండటం వల్ల పేదవారి కష్టాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. మనుషులలో స్పందించే గుణం పెరుగుతుంది. రంజాన్ నెలలో జకాత్,  సదఖా (దానధర్మాలు) ఇవ్వడం  చాలా ముఖ్యమైనదిగా చెబుతారు. పేదలకు  ఆదాయంలో కొంత భాగాన్ని ఇవ్వడం సమాజంలో సమానత్వాన్ని,  సోదరభావాన్ని పెంపొందిస్తుంది.  రంజాన్ చివరి పది రాత్రులు ప్రత్యేకంగా పరిగణించబడతాయి. షబ్-ఎ-ఖదర్ రాత్రి వెయ్యి నెలల కంటే మెరుగైనదిగా పరిగణించబడుతుంది. రంజాన్ మాసంలో ఏం చెయ్యాలి.. ఐదుసార్లు ప్రార్థన చేయడం చాలా ముఖ్యం అని చెబుతారు.  అది కూడా  సరైన సమయానికి చేయాలి. ప్రతిరోజూ ఖురాన్‌లో కొంత భాగం చదవడం లేదా వినడం చేయాలి. ఈ నెల ఖురాన్‌తో అనుసంధానం కావడానికి ఉత్తమ సమయం. ఖర్జూరం,  నీటితో ఉపవాసం విరమించడం సున్నత్‌గా పరిగణించబడుతుంది. జకాత్,  సదఖా ఇవ్వడం ద్వారా పేదవారికి సహాయం చేయాలి.  ప్రవర్తనను నియంత్రించుకోవాలి. కోపం, వాదనలు,  కఠినమైన మాటలు నివారించాలి. ఇఫ్తార్ సమయంలో  ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి,  సమతుల్య భోజనం తినాలి. రంజాన్ లో చేయకూడనివి.. అబద్ధాలు చెప్పడం, గాసిప్ చెప్పడం,  ఇతరులను   బాధపెట్టడం మానుకోవాలి. చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకోకూడదు. ఇఫ్తార్ సమయంలో ఆహారం వృధా చేయకూడదు.  లేదా వృధా ఖర్చులు చేయకూడదు. ప్రార్థనలో అజాగ్రత్తగా ఉండకూడదు. పనికిరాని కార్యకలాపాలలో లేదా చెడు అలవాట్లలో సమయాన్ని వృధా చేయకూడదు.                                                     *రూపశ్రీ
ప్రతి వ్యక్తి జీవితం గురించి చాలా ఆలోచిస్తారు.  తమ జీవితం ఎలా ఉండాలో,  ఎలా ఉంటే బాగుంటుందో అని చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.  సరిగ్గా గమనిస్తే.. కొందరు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అని అంటూ ఉంటారు.  కొందరు మాత్రం ఇలాంటి మాటలు విన్నప్పుడు అదేదో కామెడీ అన్నట్టు రియాక్ట్ అవుతూ ఉంటారు.  మనిషి వ్యక్తిత్వంలో సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా కీలకపాత్ర పోషిస్తుంది.  అయితే మనిషిలో ఉండే లక్షణాలను బట్టి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంత ఉందనేది చెప్పవచ్చట. సెల్ప్ రెస్పెక్ట్ లేకపోతే.. ఎప్పుడూ తమను తాము తక్కువ చేసుకుంటూ ఉంటారు చాలామంది.  ఇంతకీ మనుషుల్లో ఏ లక్షణాలు ఉంటే అవి వ్యక్తిత్వం మీద ప్రభావితం చూపిస్తాయి? సెల్ప్ రెస్పెక్ట్ తక్కువ ఉందని ఏ లక్షణాలు సూచిస్తాయి?  మనస్తత్వవేత్తలు ఏం చెబుతున్నారు? తెలుసుకుంటే.. తప్పు చేయకపోయినా క్షమాపణ చెప్పడం.. తప్పు లేకుండా క్షమాపణ చెప్పడం లేదా  అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు అపరాధ భావన కలిగి ఉండటం.. తక్కువ సెల్ప్ రెస్పెక్ట్ కలిగి ఉన్నారని  సూచిస్తుందని మనస్తత్వవేత్తలు అంటున్నారు.  నిజంగా ఎవరికైనా హాని చేశారా అని  ఎవరికి వారు ప్రశ్నించుకోవాలని మనస్తత్వవేత్తలు సలహా ఇస్తున్నారు. ఎవరికి  ఎలాంటి హాని చేయకపోతే ధైర్యంగా, నమ్మకంతో నిలబడాలని చెబుతున్నారు. తక్కువ చేసి మాట్లాడే వారి ముందు.. ఎవరైనా తక్కువ చేసి మాట్లాడుతుంటే.. కుటుంబ సభ్యులు లేదా లైఫ్ పార్ట్నర్.. స్నేహితులు, ఇతరులు తక్కువ చేసి మాట్లాడినప్పుడు వారికి ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతే.. వారి మాటలను అంగీకరించినట్టే.. ఇలా చేస్తే తమను తాము తక్కువ చేసుకున్నట్టే. ఇలాంటి వారికి సెల్ప్ రెస్పెక్ట్ తక్కువగా ఉంటుందని అంటున్నారు. ఫెయిల్యూర్.. తమను తాము ఫెయిల్యూర్ పర్సన్ గానూ,  తెలివి తక్కువ వారి గానూ భావించే వారికి సెల్ప్ రెస్పెక్ట్ కూడా తక్కువగానే ఉంటుంది. ఇలాంటి వారు తమకు తాము హాని చేసుకుంటారని అంటున్నారు. ప్రశంసలు, భరోసా.. ఎప్పుడూ తమను ఎవరో ఒకరు పొగుడుతూ, మెచ్చుకుంటూ,  భరోసా ఇస్తూ తమ వెంట ఉండాలని కోరుకునేవారు ఉంటారు. ఇలాంటి వారికి సెల్ప్ రెస్పెక్ట్ తక్కువగా ఉంటుందట.  మెచ్చుకోలు,  భరోసా లోపించినప్పుడు తాము వేస్ట్ అనుకునే మెంటాలిటీ వీరిలో ఏర్పడుతుందట. ఇది ఎమోషనల్ గా తమను తాము దెబ్బతీసుకోవడానికి దోహదం చేస్తుందట. ఇతరుల కోసం.. ఇతరుల కోసం బాధపడటం,  అన్నం తినడం మానేయడం,  ఇతరుల కోసం తమను తాము హింసించుకోవడం, ఇతరుల ముందు తమను తాము తక్కువ చేసుకోవడమేనని అంటున్నారు. ప్రతి ఒక్కదానికి ఒక హద్దు అనేది ఉంటుంది. ఈ హద్దులను నిర్ణయించుకోలేని వారు సెల్ఫ్ రెస్పెక్ట్ తక్కువ కలిగి ఉంటారు. బంధాలు.. తెలిసో, తెలియకో.. బంధాలు ఏర్పడిపోతాయి. అయితే ఒక చెడు బంధంలో ఉన్నప్పుడు.. అవతలి వ్యక్తి మారతారనే ఆశతో బాధ కలిగించే విషయాలను మభ్యపుచ్చుకోవడం, భరించడం అనేది సెల్ప్ రెస్పెక్ట్  తక్కువగా ఉందని సూచిస్తుంది. అవతలి వ్యక్తి తప్పు ఉంటే తప్పు ఉందని చెప్పకపోగా,  తమదే తప్పు అని అంగీకరించే వారు సెల్ప్ రెస్పెక్ట్ చాలా తక్కువ కలిగి ఉంటారు. పోలిక.. ఇతరులతో పోల్చుకునే వారు కూడా తక్కువ సెల్ప్ రెస్పెక్ట్ కలిగి ఉంటారు. ఇతరుల జీవితాలతో తమను తాము పోల్చుకోవడం అనేది ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. సెల్ప్ కేర్.. సెల్ప్ కేర్ ఎంత ఎక్కువ ఉంటే వారు అంత  సెల్ప్ రెస్పెక్ట్ కూడా కలిగి ఉంటారు.  చాలామందిలో సెల్ప్ కేర్ అనేది ఉండదు.  తమ చుట్టూ ఉన్నవారి గురించి ఆలోచించి,  వారి కోసం అన్నీ చేసి, కష్టపడి.. వారు మెచ్చుకుంటే ఆ మాటలతోనే తృప్తి పడుతుంటారు. అయితే ఇది చాలా తప్పు.  తమ గురించి తాము కేర్ తీసుకోని వ్యక్తులు తమను తాము ఇతరుల ముందు రెస్పెక్ట్ గా నిలబెట్టుకోలేరు.                               *రూపశ్రీ.
చాలామందికి బాదం పప్పు గురించి తెలిసి ఉంటుంది. కానీ బాదం బంక అనే పేరు బహుశా చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది.  కానీ బాదం బంక ఆరోగ్యానికి చాలామంచిదని చెబుతారు.  బాదం బంకను నీటిలో నానబెట్టుకుని తింటుంటారు.  ముఖ్యంగా వేసవి కాలంలో బాదం బంక వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇది చిన్న బంక గడ్డల్లా ఉంటుంది. నీటిలో వేసి సుమారు 2 గంటల సేపు నానబెడితే బాదం బంక కాస్తా జెల్లీ లాగా మారుతుంది. దీన్ని నేరుగా తింటారు,  నీటిలో కలిపి తాగుతారు,  ఇందులో సబ్జా, పంచదార వంటివి కూడా కలుపుకుని తాగుతారు.  వేసవిలో పానీయాలలో బాదం బంకను యాడ్ చేసుకుంటారు. ఇది శరీరానికి చలువ చేస్తుందని చెబుతారు. అయితే.. బాదం బంక తినడం వల్ల మొటిమలు తగ్గుతాయని కొందరు అంటుంటారు.  దీని వెనుక గల నిజం ఏమిటో తెలుసుకుంటే.. మొటిమలకు కారణం.. చర్మం మీద మొటిమలు, కురుపులు వంటివి వేడి వల్ల వస్తాయి. దీని వల్ల చర్మం చాలా దెబ్బతింటుంది. ఈ వేడిని తగ్గించడం ద్వారా మొటిమలు, కురుపులు తగ్గించడంలో బాదం బంక చక్కగా.. ఔషధంలా పనిచేస్తుంది. బాదం బంక.. చర్మ ప్రయజనాలు.. బాదం బంకను తీసుకోవడం వల్ల చాలా రకాల చర్మ సమస్యలు తగ్గిపోతాయి.   బాదం బంకను రాత్రంతా నీటిలో నానబెట్టాలి.  ఉదయానికి ఈ బంక కాస్తా జెల్లీ లాగా మారుతుంది.  దీనికి కొంచెం చల్లని నీరు కలపాలి.  ఇందులో కొంచెం నిమ్మరసం కలపాలి.  దీన్ని డీహైడ్రేట్ పానీయంలా తీసుకోవాలి.  కనీసం 3 నుండి 4 రోజులు రెగ్యులర్ గా తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. బాదం బంక ఎందుకు మంచిది? బాదం బంక తినడం వల్ల సహజంగానే శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇది చర్మాన్ని తేమ చేస్తుంది.  బాదం బంకలో ఉండే  యాంటీ-ఏజింగ్ లక్షణాల కారణంగా చాలా ప్రయోజనాలు అందిస్తుంది. ఇది శరీరం లోపలి నుండి విషాన్ని తొలగిస్తుంది.  మొటిమలు, ముడతలు,  వడదెబ్బ వంటి సమస్యలను తగ్గిస్తుంది. బాదం బంక తినడం వల్ల  చర్మానికి మెరుపు, యవ్వనం   లభిస్తుంది. ఇది చర్మ ఆరోగ్యానికి మాత్రమే కాకుండా శరీర ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.                                    *రూపశ్రీ.
నేటికాలంలో కిడ్నీలో రాళ్లు ఏర్పడటం చాలా సాధారణం అయిపోయింది.   ఏ వయసు వారికైనా ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం వల్ల పిల్లలు,  యువకులలో కిడ్నీలో రాళ్ల సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ ప్రకారం దాదాపు 10 మందిలో ఒకరు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో కిడ్నీలో రాళ్ల సమస్యను ఎదుర్కుంటూ ఉన్నారట. ఈ సమస్యలు సాధారణంగా తేలికపాటి చికిత్స లేదా శస్త్రచికిత్స ద్వారా సులభంగా  పరిష్కారం అవుతాయి.  కానీ కొంతమందిలో రాళ్ల సమస్యలు తీవ్రమైన మూత్రపిండాల సమస్యలకు దారితీయవచ్చు. అసలు కిడ్నీలో రాళ్ల సమస్య ఎలా ఏర్పడుతుంది? బీర్ తాగితే కిడ్నీలో రాళ్ల సమస్య తగ్గుతుందనే మాట నిజమా? దీని గురించి వైద్యులు ఏం చెబుతున్నారు? తెలుసుకుంటే.. మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటానికి కారణాలు.. మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటానికి అతిపెద్ద కారణం తగినంత నీరు తీసుకోకపోవడం. తగినంత నీరు త్రాగనప్పుడు మూత్రం ఘాడతగా మారుతుంది.  దానిలోని ఖనిజాలు స్ఫటికాలను ఏర్పరుస్తాయి. ఇవే   కిడ్నీలో రాళ్లుగా రూపాంతరం చెందుతాయి.    ఉప్పు అధికంగా తీసుకోవడం, ప్రోటీన్ అధికంగా తీసుకోవడం, ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాలైన పాలకూర, చాక్లెట్  వంటివి తినడం,  అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలో రాళ్ల  ప్రమాదం పెరుగుతుంది. ఊబకాయం, మధుమేహం,  జీవక్రియ సమస్యలు కూడా రాళ్ళు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి. మూత్రపిండాలలో రాళ్లు ఎలా నయమవుతాయి? వైద్యులు చెబుతున్న దాని ప్రకారం..  కిడ్నీలో రాళ్ళు సాధారణంగా  ఎక్కువ నీరు త్రాగడం ద్వారా వాటంతట అవే బయటకు వస్తాయి.  నొప్పిని తగ్గించడానికి,  రాళ్ల పరిమాణాన్ని తగ్గించడానికి వైద్యులు  మందులను సూచించవచ్చు. అయితే రాళ్ల పరిమాణం పెద్దగా ఉన్నప్పుడు  శస్త్రచికిత్స అవసరం ఏర్పడవచ్చు. కిడ్నీలో రాళ్లను ముందుగానే తొలగించడం చాలా ముఖ్యం ఎందుకంటే అవి కాలక్రమేణా కిడ్నీ లోపలి పొరను దెబ్బతీస్తాయి. బీరు తాగితే కిడ్నీలో రాళ్లు తగ్గుతాయా? బీరు తాగడం వల్ల మూత్ర ఉత్పత్తి పెరుగుతుందని, తరచుగా మూత్ర విసర్జన జరుగుతుందని,  రాళ్లు బయటకు వెళ్లడానికి సహాయపడుతుందని  చాలామంది నమ్ముతారు. కానీ వైద్యులు  ఈ నమ్మకాన్ని తోసిపుచ్చుతున్నారు. బీరు తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు బయటకు వెళ్లడానికి సహాయపడతాయనే నమ్మకం ప్రజలలో ఉన్నా.. బీరు తాగితే చాలు కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయి అనుకోవడం చాలా తప్పని, అది వైద్యులు రికమెండ్ చేయరని చెబుతున్నారు. బీరు తాత్కాలికంగా మూత్ర ఉత్పత్తిని పెంచుతుంది, కానీ అది శరీరం డీహైడ్రేట్ అవ్వడానికి కారణం అవుతుంది.  ఇది రాళ్లు ఏర్పడటానికి ప్రధాన కారణం అవుతుంది. బీరులో ప్యూరిన్లు కూడా ఉంటాయి, ఇవి యూరిక్ ఆమ్లాన్ని పెంచుతాయి, మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి, అప్పటికే కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు బీర్ తాగితే.. ఈ రాళ్ల ప్రమాదం మరింత పెరుగుతుంది. కాబట్టి కిడ్నీలో రాళ్ల సమస్యకు ఔషదంగా బీర్ ను తీసుకోవడం అస్సలు మంచిది కాదు.                            *రూపశ్రీ.