LATEST NEWS
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. భారత నావికాదళానికి చెందిన ఒక కీలక సమాచారాన్ని పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చేరవేసిన వ్యవహారంలో 31 సంవత్సరాల వయసున్న నావికాదళ సైనికుడిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియా వేదికగా జరిగిన ఆన్‌లైన్ హనీట్రాప్‌లో పడి, దేశ భద్రతకే ముప్పు వాటిల్లేలా వ్యవహరించిన ఈ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రదీప్ ముఖర్జీ అనే వ్యక్తి గత 2014 సంవత్సరంలో భారత నావికాదళంలో నావికుడిగా రిక్రూట్ అయ్యారు. విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న తూర్పు నావికా కమాండ్ పరిధిలో అతను విధులు నిర్వర్తిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కోయంబత్తూరులోని రెడ్ ఫీల్డ్స్‌లో ఉన్న ప్రముఖ నావికాదళ నాయకత్వ శిక్షణా సంస్థ అయిన ఐఎన్ఎస్ అగ్రానిలో మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ కోర్సు చేయడానికి ప్రదీప్ వెళ్లారు. అయితే కోర్సు ప్రారంభమైన కొద్ది రోజులకే ఏపీ పోలీసుల కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ అతడిని అదుపులోకి తీసుకోవడం గమనార్హం. కొన్ని నెలల క్రితం సోషల్ మీడియా ద్వారా ప్రదీప్ ముఖర్జీని ఒక పాకిస్తానీ మహిళా గూఢచారి సంప్రదించింది. అత్యంత చాకచక్యంగా వలపు వల పన్నిన ఆ మహిళా ఏజెంట్, క్రమంగా ఆ నావికుడితో సోషల్ మీడియాలో స్నేహం పెంచుకుంది. కొద్ది రోజుల్లోనే ఆన్‌‌లైన్ ప్రేమాయణంలో మునిగిపోయిన ప్రదీప్, ఆ మహిళా ఏజెంట్ కోరిన వెంటనే విశాఖపట్నం నావికా స్థావరానికి సంబంధించిన అత్యంత సున్నితమైన, రహస్య వివరాలను లీక్ చేయడం ప్రారంభించాడు. నావికాదళానికి చెందిన వ్యూహాత్మక ఆస్తులు, నౌకాదళ కదలికలు మరియు కీలకమైన ఆపరేషన్లకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆ పాకిస్తానీ ఏజెన్సీకి చేరవేశాడు. సరిహద్దు గూఢచర్యం, ఉగ్రవాద ముఠాలు మరియు దేశ భద్రతను దెబ్బతీసే శక్తులపై నిరంతరం నిఘా ఉంచే ఆంధ్రప్రదేశ్ పోలీసుల కౌంటర్ ఇంటెలిజెన్స్ (CI) విభాగం, ప్రదీప్ యొక్క డిజిటల్ కదలికల్లో కొన్ని అనుమానాస్పద ఆనవాళ్లను గుర్తించింది. వెంటనే అప్రమత్తమైన సీఐ అధికారులు అతడిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. దేశ రహస్య సమాచారం శత్రు దేశాలకు వెళుతున్నట్లు స్పష్టమైన ఆధారాలు సేకరించిన తర్వాత, దర్యాప్తు అధికారులు నావికా దళ ఉన్నతాధికారుల నుంచి అరెస్టుకు అధికారిక అనుమతి పొందారు. శనివారం ఉదయం కోయంబత్తూరులోని ఐఎన్ఎస్ అగ్రాని ప్రాంగణం వద్దకు ఒక ప్రత్యేక సీఐ బృందం చేరుకుని ప్రదీప్ ముఖర్జీని అదుపులోకి తీసుకుంది. ఈ ఆపరేషన్‌కు సంబంధించి స్థానిక పోలీసు అధికారులకు తక్షణ సమాచారం అందించారు. అనంతరం తదుపరి చట్టపరమైన విచారణ నిమిత్తం ట్రాన్సిట్ వారెంట్ కోసం కోర్టులో హాజరుపరిచారు. శనివారం సాయంత్రం అతడిని విజయవాడలోని కౌంటర్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయానికి తరలించి, మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే అనుమానాస్పద పరిచయాలు, హనీట్రాప్ పట్ల రక్షణ సిబ్బంది ఎంతటి అప్రమత్తంగా ఉండాలనేదానికి ఈ ఘటన ఒక పెద్ద హెచ్చరికగా నిలిచింది.       [ indian navy data leak, pakistani spy honeytrap, vizag naval base secret leak, ins agrani arrest, ap counter intelligence, navy sailor arrested, Telugu One, Telugu News ]  
సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేశాడు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవని భావించాడు.. కానీ చివరకు చేసిన చిన్న పొరపాటే అతడిని పోలీసులకు పట్టించింది. క్రైమ్ థ్రిల్లర్ సినిమా స్ఫూర్తితో కన్నతండ్రినే హత్య చేసిన ఓ కొడుకు ఉదంతం బిహార్‌లో కలకలం రేపింది. బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. దర్వా గ్రామానికి చెందిన రఘువీర్ సాహ్ని, ఆయన కుమారుడు శివ్ శంకర్ మధ్య కొంతకాలంగా ఆస్తి, కుటుంబ విషయాలపై వివాదాలు కొనసాగుతున్నాయి. సూరత్‌లో నివసిస్తున్న శివ్ శంకర్.. తండ్రిపై కక్ష పెంచుకుని హత్యకు కుట్ర పన్నాడు. ఈ క్రమంలో సూరత్‌లో ‘దృశ్యం-3’ సినిమా చూసిన శివ్ శంకర్.. సినిమాలో చూపించినట్టుగా పోలీసులకు ఆధారాలు దొరకకుండా హత్య చేయాలని ప్లాన్ చేశాడు. సూరత్ నుంచి బయలుదేరే ముందే తన మొబైల్ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేశాడు. అనంతరం రైలులో సుమారు 2 వేల కిలోమీటర్లు ప్రయాణించి బిహార్‌లోని పటోరి చేరుకున్నాడు. అక్కడి నుంచి ఆటోలో గ్రామానికి వెళ్లి.. అర్ధరాత్రి సమయంలో ఇంటి వెనుక తలుపు నుంచి లోపలికి ప్రవేశించాడు. గాఢ నిద్రలో ఉన్న తండ్రి రఘువీర్ సాహ్నిపై గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం ఎలాంటి అనుమానం రాకుండా అక్కడి నుంచి తిరిగి సూరత్‌కు బయలుదేరాడు. అయితే.. నిందితుడు ఎంత పక్కాగా ప్లాన్ చేసినా ఓ చిన్న తప్పిదం అతడి గుట్టును రట్టు చేసింది. పటోరి రైల్వే స్టేషన్‌కు చేరుకున్న శివ్ శంకర్.. అప్పటివరకు స్విచ్ ఆఫ్‌లో ఉన్న ఫోన్‌ను ఆన్ చేసి తన భార్యకు కాల్ చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఫోన్ ఆఫ్ చేశాడు. ఈ కాల్ పోలీసులకు కీలక ఆధారంగా మారింది. కాల్ డేటా, మొబైల్ టవర్ లొకేషన్ ఆధారంగా పోలీసులు అతడి కదలికలను ట్రాక్ చేశారు. హత్య జరిగిన సమయంలో పటోరి ప్రాంతంలో అతడి ఫోన్ యాక్టివ్‌గా ఉన్నట్లు గుర్తించారు. అనంతరం సూరత్‌లో అతడి కదలికలను గుర్తించి అక్కడే అదుపులోకి తీసుకున్నారు. విచారణలో శివ్ శంకర్ తండ్రిని తానే హత్య చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. సినిమా తరహాలో పోలీసులను మోసం చేయాలని చూసిన నిందితుడు.. చివరకు ఒక్క ఫోన్ కాల్‌తో పోలీసులకు చిక్కాడు.           [ Drishyam 3, Bihar Murder, Father Murder, Son Kills Father, Samastipur Crime, Shivsankar, Raghuveer Sahni, Crime Thriller, Movie Inspired Murder, Axe Attack, Property Dispute, Murder Case, Police Investigation, Technical Surveillance, Call Data Record, Mobile Tower Location, Patouri Railway Station, Surat, Bihar Crime, Crime News ]  
అంతర్జాతీయ విమానయాన రంగంలో కలకలం సృష్టించిన ఫ్లైదుబాయ్ విమాన హైజాక్ యత్నం కేసులో విచారణ వేగవంతం కాగా, ఊహించని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌‌లోని టెల్ అవీవ్ నగరానికి బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానాన్ని గాల్లోనే హైజాక్ చేసేందుకు, కూల్చివేసేందుకు యత్నించినట్లు తీవ్ర అనుమానాలు ఎదుర్కొంటున్న కో-పైలట్ హమామ్ అల్-హమ్మామీ  విచారణలో తన నేరాన్ని ఎట్టకేలకు అంగీకరించాడు. విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో పథకం ప్రకారమే కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ దృష్టిని మరల్చి అతడిపై దాడి చేసినట్లు హమ్మామీ విచారణ అధికారుల ఎదుట ఒప్పుకున్నాడు. తనకు ఎలాంటి ప్రాణభయం లేదని అతడు నిర్లక్ష్యంగా వ్యాఖ్యానించినప్పటికీ, ఈ భారీ ఉగ్ర కుట్ర వెనుక అసలు సూత్రధారులు ఎవరనే దానిపై భద్రతా బలగాలు లోతుగా ఆరా తీస్తున్నాయి. ఈ కుట్రకు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో లేదా ఇరాన్‌తో ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో ఇజ్రాయెల్, సౌదీ అరేబియా దేశాలకు చెందిన ప్రత్యేక నిఘా బృందాలు సంయుక్తంగా ముమ్మర దర్యాప్తు చేపట్టాయి. యూఏఈలో జన్మించిన హమ్మామీ కుటుంబ నేపథ్యాన్ని పరిశీలిస్తే, ఇతడి తండ్రి ఒమన్ దేశానికి చెందినవారు కాగా, తల్లి సిరియా దేశస్థురాలు. ఫ్లైదుబాయ్ ఎయిర్‌లైన్స్‌‌లో ఉద్యోగంలో చేరడానికి ముందు హమ్మామీ ఒమన్, సిరియా, మొరాకో వంటి పలు దేశాలలో నివసించినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా సిరియాలో సుదీర్ఘకాలం పాటు భీకరంగా సాగిన అంతర్యుద్ధం సమయంలో అతడు అక్కడే ఉండటంతో, ఆ సమయంలోనే తీవ్రవాద భావజాలం వైపు ఆకర్షితుడై ఉంటాడని భద్రతా అధికారులు గట్టిగా అనుమానిస్తున్నారు. నిందితుడి సోషల్ మీడియా ఖాతాలను నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించగా, వాటిలో వేలాదిగా ఉగ్రవాద పూరిత సందేశాలు, అనుమానాస్పద పోస్టులు లభించినట్లు గుర్తించారు. అతనిలో బలపడిన మత తీవ్రవాద ధోరణులే ఈ విమాన ప్రమాద కుట్రకు ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం హమ్మామీని కస్టడీలోకి తీసుకుని విచారణను మరింత వేగవంతం చేశారు. గుట్టుచప్పుడు కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పన్నిన ఈ కుట్ర మూలాలను పూర్తిగా ఛేదించేందుకు ఇటు ఇంటెలిజెన్స్ వర్గాలు, అటు భద్రతా సంస్థలు రంగంలోకి దిగి పక్కా ఆధారాలు సేకరిస్తున్నాయి.        [ Flydubai hijacking, Hamam Al Hammami, co-pilot admit, Tel Aviv flight, international terror conspiracy, aviation security news,Smith Matcher, Hamam Al Hammami, Co-Pilot Attack, Cockpit Attack, Pilot Axe Attack, Dubai to Tel Aviv Flight, Benjamin Netanyahu, Indian Pilot, Mid-Air Attack, Flight Safety, Aviation Security, Flydubai News, Israel News ]  
ALSO ON TELUGUONE N E W S
‘దేవర’లోని ‘చుట్టమల్లే’ పాటకు సంబంధించిన AI మార్ఫింగ్ వీడియో వివాదంపై జాన్వీ కపూర్ తొలిసారి స్పందించారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన నోట్‌లో.. మహిళలను ఆబ్జెక్టిఫై చేయడానికి, వారి అనుమతి లేకుండా కల్పిత కంటెంట్‌ను సృష్టించి ప్రచారం చేయడానికి టెక్నాలజీని ఉపయోగించడం చాలా తీవ్రమైన విషయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. “మహిళలను ఆబ్జెక్టిఫై చేయడానికి, వారి అనుమతి లేకుండా ఫిక్షనల్ కంటెంట్‌ను సర్క్యులేట్ చేయడానికి టెక్నాలజీని దుర్వినియోగం చేయడం చాలా బాధాకరం. ఇది లైంగిక వేధింపులతో సమానం” అంటూ జాన్వీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. తన ఇండస్ట్రీలోని దాదాపు ప్రతి మహిళా ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ఒక రూపంలో బాధపడిందని కూడా ఆమె చెప్పారు. మహిళ ఏ దుస్తులు వేసుకోవాలి, ఎక్కడ కంఫర్ట్‌గా ఉండాలి, తన శరీరంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనేది పూర్తిగా ఆమె వ్యక్తిగత హక్కు అని జాన్వీ స్పష్టం చేశారు. ఒక మహిళ మినీ స్కర్ట్ వేసుకున్నంత మాత్రాన.. ఆమెను ఎవరైనా అనుమతి లేకుండా చిత్రీకరించడానికి లేదా ఆమె శరీరాన్ని అసభ్యంగా చూపించడానికి హక్కు ఇచ్చినట్టు కాదని పేర్కొన్నారు. ఇది కేవలం తనకు ఎదురైన AI వీడియో సమస్య మాత్రమే కాదని జాన్వీ అన్నారు. మహిళలు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న చూపులు, తీర్పులు, భద్రతపై భయం వంటి సమస్యలు ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి కూడా వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. “ఒక మహిళ శరీరం కంటెంట్ కాదు.. ఆమె గౌరవం ఎంటర్‌టైన్‌మెంట్ కాదు” అనే బలమైన సందేశాన్ని ఆమె ఇచ్చారు. ఈ విషయంలో ఎన్టీఆర్ తీసుకున్న స్టాండ్ తనను ఎంతో టచ్ చేసిందని జాన్వీ పేర్కొన్నారు. తనకు మద్దతుగా నిలిచి ఈ ఘటనను ఖండించినందుకు ఎన్టీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే చిరంజీవి, విజయ్ దేవరకొండ, ఖుష్బూ తదితరులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని చర్యలు తీసుకోవాలని కోరినందుకు కూడా ఆమె ధన్యవాదాలు చెప్పారు. చివరగా జాన్వీ చెప్పిన మాట ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. “ఆమె శరీరం.. ఆమె ఇమేజ్.. ఆమె హద్దులు.. ఆమె నిర్ణయం.” AI టెక్నాలజీ దుర్వినియోగంపై జాన్వీతో పాటు టాలీవుడ్ ప్రముఖులంతా ఒకే మాటపై నిలబడటంతో.. ఈ వ్యవహారంలో ఇక ఎలాంటి చర్యలు జరుగుతాయన్నది ఆసక్తిగా మారింది. ఇది కూడా చదవండి: చిరంజీవి ‘డాడీ’కి 25 ఏళ్లు.. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ కి కూడా స్పెషల్ మూవీ.!       [Janhvi Kapoor Reaction On AI Morphed Video, Janhvi Kapoor Instagram, Janhvi Kapoor AI Video, Janhvi Kapoor, Chuttamalle Song, Jr NTR, Chiranjeevi, Vijay Deverakonda, Telugu Film News]  
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్లు ఉన్నాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం కమర్షియల్ రిజల్ట్ కంటే.. వాటిలోని ప్రత్యేకతతో ప్రేక్షకుల జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. అలాంటి సినిమాల్లో ‘డాడీ’ కూడా ఒకటి. 2001 అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘డాడీ’కి నేటితో 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి ఇప్పుడు గుర్తు చేసుకుంటే.. కేవలం చిరంజీవి నటించిన ఓ ఫ్యామిలీ డ్రామా కంటే చాలా ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తాయి. ‘డాడీ’కి ముందు చిరంజీవి అంటే మాస్, యాక్షన్, కామెడీ, డ్యాన్స్‌తో కూడిన కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌కు కేరాఫ్ అడ్రస్. అలాంటి సమయంలో ఆయన ఓ కుటుంబ కథలో తండ్రి పాత్రను ప్రధానంగా తీసుకోవడం అప్పట్లోనే చాలా కొత్త ప్రయత్నం. కథను మొదట విన్నప్పుడు చిరంజీవికి ఈ సినిమా తన కంటే వెంకటేష్ చేస్తే ఇంకా బాగా సెట్ అవుతుందనే అభిప్రాయం కలిగిందట. కుటుంబ కథలకు వెంకటేష్ అప్పటికే బాగా కనెక్ట్ అయి ఉండటంతో.. ఈ పాత్ర ఆయనకు మరింత సహజంగా ఉంటుందని చిరంజీవి భావించారట. అయితే రచయిత భూపతిరాజా మాత్రం చిరంజీవి ఇమేజ్‌కు ఇది కొత్తగా ఉంటుందని చెప్పి ఒప్పించారట. ‘డాడీ’కి మంచి స్పందన వచ్చినప్పటికీ.. చిరంజీవి రేంజ్‌లో భారీ కమర్షియల్ విజయాన్ని అందుకోలేకపోయింది. అప్పటి ప్రేక్షకులకు చిరంజీవిని ఇలాంటి ఫ్యామిలీ డ్రామాలో చూడటం కొత్తగా అనిపించడంతో కొంత మిశ్రమ స్పందన కూడా వచ్చింది. ఇక ఈ సినిమా ప్రత్యేకత గురించి మాట్లాడేటప్పుడు ఇప్పుడు తప్పకుండా గుర్తొచ్చే పేరు అల్లు అర్జున్. ఈ సినిమాతోనే అల్లు అర్జున్ తొలిసారి వెండితెరపై కనిపించారు. అప్పటికి ఆయన వయసు 19 ఏళ్లు. ‘డాడీ’లో డ్యాన్స్ స్టూడెంట్‌గా చిన్న పాత్రలో కనిపించారు. ఆ తర్వాత 2003లో ‘గంగోత్రి’తో హీరోగా పరిచయమైన బన్నీ.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ‘డాడీ’లోని యాక్షన్ సన్నివేశాలకు విక్రమ్ ధర్మతో పాటు పవన్ కళ్యాణ్ కూడా కొరియోగ్రఫీ చేయడం మరో ఆసక్తికరమైన విషయం. అప్పటికే పవన్ కళ్యాణ్ యాక్షన్, స్టైల్‌కు మంచి క్రేజ్ ఉంది. అన్నయ్య చిరంజీవి సినిమాలో ఫైట్స్ విషయంలో ఆయన భాగస్వామ్యం కావడం అభిమానులకు ప్రత్యేకమైన విషయంగా నిలిచింది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాకు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. చిరంజీవి సరసన సిమ్రాన్ హీరోయిన్‌గా నటించగా.. రాజేంద్ర ప్రసాద్, ఆషిమా భల్లా, శరత్‌బాబు, కోట శ్రీనివాసరావు, ఎం.ఎస్. నారాయణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాలో చిరంజీవి చేసిన గొప్ప విషయం.. తన స్టార్ ఇమేజ్‌ను పక్కనపెట్టి పాత్రలోకి వెళ్లడం. మాస్ ఇమేజ్ ఉన్న స్టార్‌గా కాకుండా.. కుటుంబం కోసం త్యాగం చేసే తండ్రిగా, భార్యతో అనుబంధాన్ని కాపాడుకోవాలని ప్రయత్నించే భర్తగా కనిపించారు. కొన్ని సన్నివేశాల్లో ఆయన నటనలోని సున్నితత్వం అప్పటి ప్రేక్షకులకే కాదు.. ఇప్పటికీ సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తోంది. అందుకే ‘డాడీ’ కమర్షియల్‌గా చిరంజీవి కెరీర్‌లో అతిపెద్ద విజయాల జాబితాలో లేకపోయినా.. నటుడిగా ఆయనలోని మరో కోణాన్ని చూపించిన సినిమాగా మాత్రం ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇది కూడా చదవండి: 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్'కి బిగ్ షాక్.. సెలబ్రిటీ ప్రమోషన్స్ కూడా పని చేయలేదా.?       [25 Years For Daddy Movie, Daddy Movie 25 Years, 25 Years Of Daddy Movie, Chiranjeevi Daddy Movie, Megastar Chiranjeevi, Allu Arjun, Pawan Kalyan, Telugu Film News]    
ఒక సినిమాకు భారీ హైప్ తీసుకురావాలంటే పెద్ద స్టార్స్ పేర్లు చాలు. కానీ ఆ హైప్‌ను బాక్సాఫీస్ సక్సెస్‌గా మార్చాలంటే మాత్రం సినిమాలో విషయం ఉండాలి. ఇప్పుడు ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ విషయంలో ఇదే చర్చగా మారింది. ఈ సినిమాకు ప్రమోషన్స్ విషయంలో మామూలు సపోర్ట్ దక్కలేదు. రాజమౌళి ప్రజెంటర్‌గా ఉండటం ఒక ఎత్తయితే.. ఎన్టీఆర్, మహేష్ బాబు, సుకుమార్, అనిల్ రావిపూడి వంటి ప్రముఖులు సినిమాపై పాజిటివ్‌గా మాట్లాడటం మరో ఎత్తు. ముఖ్యంగా ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరై టీమ్‌కు బూస్ట్ ఇచ్చారు. మహేష్ బాబు కూడా సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. మహేష్‌తో పాటు సితార కూడా చిన్నారి సారాతో కలిసి ప్రమోషనల్ వీడియోలో కనిపించింది. సుకుమార్, అనిల్ రావిపూడి వంటి వాళ్లు కూడా సినిమాపై పాజిటివ్‌గా స్పందించారు. ఇక ప్రమోషన్స్ మొదలైనప్పటి నుంచే మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంది. బాలకృష్ణకు సంబంధించిన పాపులర్ డైలాగ్ ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’నే టైటిల్‌గా పెట్టుకోవడంతో.. ఆయన వాయిస్ ఓవర్‌తో ట్రైలర్‌ను ప్రమోట్ చేశారు. అంటే.. సినిమాకు కావాల్సినంత అటెన్షన్ అయితే వచ్చింది. కానీ అసలు పరీక్ష థియేటర్లలో మొదలైంది. అక్టోబర్ 2న విడుదలైన ఈ సినిమాకు రివ్యూలు, ప్రేక్షకుల స్పందన మాత్రం మిక్స్‌డ్‌గా వచ్చింది. కథలో కొత్త పాయింట్ ఉన్నప్పటికీ.. దాన్ని ఆసక్తికరంగా నడిపించలేకపోయారనే కామెంట్స్ వినిపించాయి. సెలబ్రిటీ ప్రమోషన్స్‌ అనేవి సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడంలో ఖచ్చితంగా ఉపయోగపడతాయి. కానీ థియేటర్‌కు ప్రేక్షకుడిని తీసుకొచ్చిన తర్వాత అతడిని కూర్చోబెట్టేది మాత్రం సినిమా కంటెంట్. అందుకే ఇప్పుడు ఇండస్ట్రీలో మరోసారి “స్టార్ పవర్ కంటే కంటెంట్ పవర్ ముఖ్యం” అనే మాట వినిపిస్తోంది. ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ విషయంలో అయితే పరిస్థితి మరింత ఆసక్తికరంగా ఉంది. రాజమౌళి ప్రజెంటర్.. ఆయన కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ నిర్మాత.. ఫహాద్ ఫాజిల్ లీడ్ యాక్టర్.. ఎన్టీఆర్, మహేష్ బాబు, బాలకృష్ణ వంటి స్టార్స్ ప్రమోషన్స్‌లో భాగమయ్యారు. చివరికి మరోసారి రుజువవుతున్న విషయం ఒక్కటే.. ఎన్ని పెద్ద పేర్లు ఉన్నా, థియేటర్‌లో ప్రేక్షకుడిని గెలిపించేది మాత్రం సినిమా కంటెంటే. ఇది కూడా చదవండి: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ.. రంగంలోకి బాలయ్య హీరోయిన్లు.!       [Dont Trouble The Trouble Movie, Don't Trouble The Trouble, Fahadh Faasil, SS Rajamouli, Jr NTR, Mahesh Babu, Nandamuri Balakrishna, Telugu Film News]
నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై రోజుకో కొత్త వార్త బయటకు వస్తోంది. బాలకృష్ణ తనయుడి తొలి సినిమా కావడంతో.. కథ నుంచి క్యాస్టింగ్ వరకు ప్రతి అంశంపైనా ఆసక్తి నెలకొంది. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి క్యాస్టింగ్ విషయంలో ఆసక్తికరమైన పేర్లు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా రవీనా టాండన్, శోభన, శ్రీలీల పేర్లు వినిపిస్తున్నాయి. మోక్షజ్ఞను వశిష్ట సాధారణ మాస్ సినిమాతో పరిచయం చేయకుండా.. సోషియో ఫాంటసీ, టైమ్ ట్రావెల్, పునర్జన్మ వంటి అంశాలతో కథను సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. భారీ కాన్వాస్ ఉన్న ఈ కథలో పలువురు ప్రముఖ నటీనటులు భాగం కాబోతున్నారట.  ముఖ్యంగా బాలకృష్ణ హీరోయిన్లు రవీనా టాండన్, శోభన పేర్లు ఆసక్తిని పెంచుతున్నాయి. బాలకృష్ణతో గతంలో రవీనా టాండన్ ‘బంగారు బుల్లోడు’లో నటించారు. మరోవైపు శోభన కూడా బాలకృష్ణతో ‘నారీ నారీ నడుమ మురారి’లో కలిసి నటించారు. ఇప్పుడు వీరు మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో కీలక పాత్రల్లో కనిపిస్తారట. రవీనా టాండన్ ది నెగెటివ్ రోల్ కాగా, శోభనది మోక్షజ్ఞ తల్లి పాత్ర అంటున్నారు. ఇక హీరోయిన్‌గా శ్రీలీల పేరు వినిపిస్తోంది. మోక్షజ్ఞకు జోడీగా శ్రీలీలను తీసుకోవాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు పలు కథనాలు వచ్చాయి. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. బాలకృష్ణతో ‘భగవంత్ కేసరి’లో కలిసి నటించిన శ్రీలీల.. ఇప్పుడు ఆయన తనయుడు మోక్షజ్ఞతో జోడీ కడితే ఈ కాంబినేషన్‌పై సహజంగానే మంచి క్రేజ్ ఏర్పడుతుంది. నందమూరి అభిమానుల్లో కూడా ఈ కాంబినేషన్‌పై ఆసక్తి కనిపిస్తోంది. మరోవైపు ఈ సినిమాలో బాలకృష్ణ కూడా కీలక పాత్రలో కనిపిస్తారనే వార్తలు ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఆయన ఎంట్రీ ఉంటుందని, మోక్షజ్ఞ తండ్రి పాత్రలో కనిపిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది.  ఇది కూడా చదవండి: బాబోయ్ శ్రీకాంత్ ఓదెల.. సుకుమార్ కోసం ఇండియా టాప్ డైరెక్టర్‌కి నో చెప్పాడు.!       [Mokshagna Debut Movie, Nandamuri Balakrishna, Nandamuri Mokshagna, Raveena Tandon, Shobana, Sreeleela, Telugu Film News]
సినిమా ఇండస్ట్రీలో ఒక్క అవకాశం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసేవాళ్లు చాలామంది ఉంటారు. అలాంటిది కెరీర్ ఆరంభంలోనే దేశంలోనే టాప్ డైరెక్టర్లలో ఒకరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసే అవకాశం వస్తే.. ఎవరైనా వెంటనే ఓకే చెప్పేస్తారు. పైగా నెలకు రూ.50 వేల జీతం అంటే ఆ రోజుల్లో అది చాలా పెద్ద ఆఫర్. కానీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాత్రం ఆ ఆఫర్‌ను సింపుల్‌గా రిజెక్ట్ చేశారు. కారణం ఒక్కటే.. సుకుమార్ దగ్గరే పనిచేయాలి. తాజాగా ప్రముఖ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్‌తో జరిగిన చిట్‌చాట్‌లో శ్రీకాంత్ ఓదెల తన కెరీర్ ప్రారంభ రోజుల గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. తనకు ఒక ప్రముఖ దర్శకుడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసే అవకాశం వచ్చిందని, ఆయన పేరు మాత్రం వెల్లడించనని చెప్పారు. అప్పట్లో అనుకోకుండా ఆ దర్శకుడి నుంచి శ్రీకాంత్‌కు పిలుపు వచ్చిందట. ‘‘రేపటి నుంచే షూటింగ్‌కు వచ్చేయ్.. నెలకు రూ.50 వేలు ఇస్తాం’’ అని చెప్పారట. ఆ రోజుల్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌కు రూ.50 వేల జీతం అంటే మామూలు విషయం కాదు. అయినా శ్రీకాంత్ మాత్రం ఆ ఆఫర్‌కు ఓకే చెప్పలేదు. తనకు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి సినిమా నేర్చుకోవడమే లక్ష్యమని, ముందుగా ఆయన దగ్గరే పనిచేస్తానని స్పష్టంగా చెప్పారట. అసలు సుకుమార్ దగ్గర ఛాన్స్ కోసం శ్రీకాంత్ పడిన కష్టం కూడా మామూలుగా లేదు. తాజా ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. దాదాపు నాలుగేళ్ల పాటు సుకుమార్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. రోజూ ఉదయం ఆయన ఇంటి గేటు దగ్గరకు వెళ్లడం, అవకాశం కోసం ఎదురుచూడటం చేసేవారట. చివరికి శ్రీకాంత్ పట్టుదలను గమనించిన సుకుమార్.. ఒక షార్ట్ ఫిల్మ్ చేసి తీసుకురమ్మని చెప్పారట. శ్రీకాంత్ ఆ షార్ట్ ఫిల్మ్ తీసుకెళ్లిన తర్వాత సుకుమార్ టీమ్‌లోకి అవకాశం దక్కింది. అలా ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాతో సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ‘రంగస్థలం’ కోసం సుకుమార్ టీమ్‌లో పూర్తిస్థాయిలో పనిచేశారు. ఇది కూడా చదవండి: ప్రభాస్ సినిమా ఎఫెక్ట్.. ఆ హీరోయిన్ కెరీర్ రిస్క్ లో పడిందా.?       [Srikanth Odela Interview, Director Sukumar, The Paradise Movie, Srikanth Odela, Nani Paradise, Telugu Film News, Telugu News]    
Kamal Haasan’s association with Singeetham Srinivasa Rao was far more than that of an actor and director. On Sunday, following the legendary filmmaker’s demise, Kamal visited Singeetham’s residence in Chennai and paid his last respects to the man he has long regarded as a guru, mentor and one of his closest creative collaborator.  Their extraordinary journey began with Sommokadidhi Sokokadidhi in 1979 and continued through Raja Paarvai, Pushpaka Vimana, Apoorva Sagodharargal, Michael Madana Kama Rajan, Kaathala Kaathala and Mumbai Xpress. Across these films, the duo moved effortlessly between romance, comedy, fantasy, visual experimentation, emotional drama and outright cinematic madness. Their collaboration is consequently regarded as one of the most distinctive actor-director partnerships in Indian cinema.  Kamal’s admiration for Singeetham was also evident in Apoorva Singeetham, a special retrospective series created by Raaj Kamal Films International. Through the YouTube show, Kamal revisited their films and celebrated the filmmaker’s extraordinary imagination, including dedicated episodes on Raja Paarvai and Pushpak.  Kamal has repeatedly spoken of Singeetham as someone who remained creatively young regardless of age. In his latest tribute, he wrote that he was among the friends and disciples who had walked alongside Singeetham, adding, “Dying young need not be a tragedy. It can be glorious. Singeetham Srinivasa Rao is a great example. I have admired him since I knew him. Now I aspire to live like he did.”  Their body of work stands as a rare example of an actor and filmmaker constantly challenging each other—and producing classics across remarkably different genres.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
Sharwanand takes on a strikingly different avatar in Bhogi, the upcoming action drama directed by Sampath Nandi. The teaser, released today, introduces a raw and intense world set against the Telangana-Maharashtra border, where a village finds itself under the control of an oppressive Patel. The story appears to revolve around the villagers’ struggle against the landlord’s dominance and a man who rises against the system. Sharwanand plays this central character with a noticeably different look, body language and dialogue delivery. His command over the dialect and intense screen presence give the character a rugged quality that is unlike his previous outings. Sampath Nandi sets up Bhogi as a story of oppression, resistance and survival, with the teaser placing considerable emphasis on its emotional core alongside the action. The sequences have a raw, rustic texture, while the visuals suggest that the film has been mounted on a sizeable scale. Bheems Ceciroleo’s background score adds to the intensity of the teaser. Anupama Parameswaran also makes an impression in the glimpse, while Sharwanand’s dialogues add to the film’s confrontational mood. Produced by KK Radhamohan, Bhogi is gearing up for a multilingual release on November 12. The teaser positions the film as a high-octane action drama built around a village’s fight against oppression.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
ప్రభాస్‌ లాంటి పాన్‌ ఇండియా స్టార్‌ సరసన డెబ్యూ చేసే ఛాన్స్ అంటే.. ఏ కొత్త హీరోయిన్‌కైనా అది గోల్డెన్‌ ఆఫరే. అలాంటి భారీ అవకాశమే సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఇమాన్వికి దక్కింది. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘ఫౌజీ’తో ఆమె హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది. అయితే ఇప్పుడు ఇదే సినిమా ఆమె కెరీర్‌ ప్లానింగ్‌పై చర్చకు కారణమవుతోంది. ‘ఫౌజీ’ అనౌన్స్‌ చేసినప్పటి నుంచి ఇమాన్వి ఈ ప్రాజెక్ట్‌కే చాలా సమయం కేటాయించింది. ఇదే సమయంలో ఆమెకు టాలీవుడ్‌, కోలీవుడ్‌ నుంచి కొన్ని అవకాశాలు వచ్చినా.. కొత్త సినిమాలకు సైన్ చేయకుండా వెయిట్ చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ప్రభాస్‌తో డెబ్యూ చేస్తున్న సినిమాపై ఆమె పెట్టుకున్న నమ్మకమేనని అంటున్నారు. సాధారణంగా ఒక పెద్ద స్టార్‌తో తొలి సినిమా చేస్తే.. ఆ సినిమా విడుదలైన తర్వాత వచ్చే గుర్తింపు, మార్కెట్‌ క్రేజ్‌ను బట్టి భారీ అవకాశాలు రావొచ్చని భావిస్తారు. ఇమాన్వి కూడా అదే ఆలోచనతో ‘ఫౌజీ’ రిలీజ్‌ వరకు వెయిట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ‘ఫౌజీ’ని ముందుగా 2026 డిసెంబర్‌ 3న విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించారు. అయితే సినిమా పనులు పూర్తికాకపోవడంతో ఆ రిలీజ్‌ను 2027కి వాయిదా వేశారు. దీంతో ఇమాన్వి డెబ్యూ కూడా మరింత ఆలస్యం అవుతోంది. ఒక కొత్త నటికి తొలి సినిమా రిలీజ్‌ చాలా కీలకం. ఆ సినిమా రిజల్ట్‌, పాత్రకు వచ్చిన స్పందన.. తర్వాతి అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే ‘ఫౌజీ’ కోసం ఓపికగా వెయిట్ చేయడం ఇమాన్వికి ఎంతవరకు కలిసొస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే మరో కోణంలో చూస్తే.. ఇమాన్వికి ఇది రిస్క్‌తో కూడుకున్నా, భారీ రివార్డ్‌ ఇచ్చే నిర్ణయమే కావచ్చు. ‘ఫౌజీ’ ప్రభాస్‌ కెరీర్‌లో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న పీరియాడిక్ వార్ డ్రామా. ఈ సినిమా సక్సెస్‌ అయితే ఇమాన్వి కెరీర్‌కు భారీ ప్లస్‌ కావచ్చు. ఇది కూడా చదవండి: ‘వారణాసి’లో హాలీవుడ్ నటి.. మహేష్‌తో రొమాన్స్ చేస్తున్న ఆ బ్యూటీ ఎవరు.?       [Fauzi Heroine Imanvi, Prabhas Fauzi Movie, Rebel Star Prbhas, Fauzi Movie, Hanu Raghavapudi, Actress Imanvi, Telugu Film News]
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పండుగ షాపింగ్.. ఆన్లైల్ లో బట్టలు,  వస్తువులు కొనడం మంచిదేనా.! పండుగ అంటే సందడే సందడి.. ముఖ్యంగా సంక్రాంతి,  దసరా, దీపావళి వంటి పండుగల సమయంలో ఇళ్లలోనే కాదు.. మార్కెట్లో కూడా చాలా సందడిగా ఉంటుంది.  ఇదివరకు రోజుల్లో పండుగ వస్తుందంటే.. ఇంటికి కొత్త వస్తువులు,  ఇంటిల్లిపాదికి కొత్త బట్టలు కొనడానికి బట్టల షాపుల దగ్గర జనం ఎక్కువగా ఉండేవారు. కానీ నేటి డిజిటల్ యుగంలో  మాత్రం  సీన్ పూర్తీగా మారిపోయింది. పండుగలు వస్తున్నాయంటే చాలు.. పండుగ సేల్ పేరుతో డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో దుస్తుల నుండి అన్ని రకాల వస్తువులు చాలా ఆపర్ తో అందుబాటులో ఉన్నాయని ప్రమోషన్ చేస్తుంటారు.  అయితే పండుగ సమయాల్లో ఆన్లైట్ ప్లాట్ఫామ్ లలో షాపింగ్ చేయడం మంచిదేనా? ఆన్లైల్ షాపింగ్ గురించి చాలామందికి తెలియని షాకింగ్ నిజాలు వివరంగా తెలుసుకుంటే.. పండుగ వస్తే చాలు, ఇళ్లకు కావలసిన కొత్త దుస్తులు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులతో మార్కెట్లు కిక్కిరిసిపోతాయి. అయితే, ఇటీవలి కాలంలో రద్దీలో తిరిగే ఓపిక లేక, సమయం కలిసి వస్తుందని చాలామంది ఆన్‌లైన్ షాపింగ్‌ వైపే మొగ్గు చూపుతున్నారు. ఆకర్షణీయమైన ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు చూసి మురిసిపోతూ ఇష్టమైన వస్తువులను కార్ట్‌లో వేసి ఆర్డర్ చేసేస్తున్నారు. అయితే, ఆన్‌లైన్ లో కనిపించే ప్రతి ఆఫర్ మనకు లాభం చేకూరుస్తుందా అంటే కచ్చితంగా చెప్పలేం. పండుగ సరదాలో మనం చేసే కొన్ని ఆన్‌లైన్ కొనుగోళ్లు ఒక్కోసారి ఊహించని షాక్‌లు ఇస్తుంటాయి. ఈ పండుగ సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేసే ముందు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కొన్ని చేదు నిజాలు ఉన్నాయి. దుస్తులు.. ఆన్‌లైన్ లో దుస్తులు కొనేటప్పుడు ఫోటోల్లో కనిపించే రంగు, మెరుపు, క్వాలిటీ నేరుగా ఇంటికి వచ్చేసరికి సరిపోలకపోవడం చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య. ఫోటోషూట్‌ల కోసం వాడే లైటింగ్, ఎడిటింగ్ వల్ల వస్త్రాలు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. తీరా ప్యాకెట్ విప్పి చూస్తే క్వాలిటీ తక్కువగా ఉండటం లేదా రంగు మారడం వంటివి జరుగుతుంటాయి. పైగా పండుగ సమయానికి వేసుకోవడానికి సరైన సైజు రాకపోతే, దాన్ని రిటర్న్ చేసి మళ్లీ కొత్తది తెప్పించుకోవడానికి పండుగ రోజులు దాటిపోతాయి. దీని కారణంగా పండుగకు కొత్త దుస్తులు వేసుకోలేరు. డిస్కౌంట్ మాయాజాలం.. పండుగ సేల్స్ అనగానే యాభై శాతం, డెబ్బై శాతం డిస్కౌంట్ అని పెద్ద అక్షరాలతో ప్రకటనలు కనిపిస్తాయి. కానీ చాలా కంపెనీలు సేల్ ప్రారంభానికి కొద్దిరోజుల ముందే వస్తువుల అసలు ధరలను పెంచేసి, ఆ తర్వాత భారీగా డిస్కౌంట్ ఇస్తున్నట్లు చూపిస్తాయి. దీనివల్ల వినియోగదారులకు నిజమైన ఆదా ఏమీ ఉండదు. నిజానికి సాధారణ రోజుల్లో ఉండే ధరలకే లేదా అంతకంటే కాస్త ఎక్కువ ధరకే పండుగ సేల్‌లో కూడా వస్తువులు అమ్ముడవుతుంటాయి. ఫేక్ వెబ్సైట్లు.. పండుగ సమయాల్లో ఆన్‌లైన్ లో రద్దీ ఎక్కువగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ వెబ్‌సైట్లు, సైబర్ నేరగాళ్లు విజృంభిస్తారు. సోషల్ మీడియాలో వచ్చే కొన్ని ప్రకటనల్లో తక్కువ ధరకే బ్రాండెడ్ దుస్తులు లేదా వస్తువులు ఇస్తామని లింకులు పెడతారు. ఆ ఆఫర్ నిజమేనని నమ్మి డబ్బులు చెల్లిస్తే, వస్తువు రాకపోగా మన బ్యాంక్ ఖాతా వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కే ప్రమాదం ఉంది. బ్రౌజింగ్ హిస్టరీ చేదు నిజం.. షాపింగ్ యాప్‌లు మన బ్రౌజింగ్ హిస్టరీని పరిశీలించి, మనకు నచ్చిన వస్తువుల ప్రకటనలను పదే పదే చూపిస్తాయి. దీనివల్ల అవసరం లేకపోయినా, కేవలం ఆఫర్ ఉంది కదా అని అనవసర వస్తువులు కొని డబ్బులు వృథా చేసుకుంటాం. క్రెడిట్ కార్డులు, నో కాస్ట్ ఈఎమ్‌ఐ సౌకర్యాలు ఉన్నాయి కదా అని శక్తికి మించి కొనుగోళ్లు చేసి పండుగ తర్వాత అప్పుల పాలయ్యే అవకాశాలు ఉంటాయి. సమయానికి రాకపోతే నిరాశే.. పండుగ సీజన్‌లో మిలియన్ల కొద్దీ ఆర్డర్లు రావడం వల్ల డెలివరీ సర్వీసులపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. పండుగ రోజు వేసుకోవడానికి ఆర్డర్ చేసిన డ్రెస్ లేదా పూజ కోసం తెప్పించిన వస్తువు సమయానికి చేరకపోతే పండుగ ఉత్సాహమే పాడవుతుంది. చాలా సందర్భాల్లో డెలివరీలు ఆలస్యం కావడం లేదా ఆర్డర్లు క్యాన్సిల్ కావడం జరుగుతుంటుంది. జాగ్రత్తలు ముఖ్యం.. ఆన్‌లైన్ షాపింగ్ పూర్తిగా చెడ్డదని చెప్పలేం. అయితే కొనే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. ఏ వస్తువైనా ఆర్డర్ చేసే ముందు వేరే ఇతర వెబ్‌సైట్లలో దాని ధరను సరిపోల్చి చూడాలి. గతంలో ఆ వస్తువు కొన్న ఇతర వినియోగదారులు ఇచ్చిన రివ్యూలు, రేటింగ్‌లు తప్పకుండా చదవాలి. అలాగే వస్తువు నచ్చకపోతే తిరిగి పంపడానికి రిటర్న్ పాలసీ ఉందో లేదో సరిచూసుకోవాలి. తెలిసిన, నమ్మకమైన అధికారిక యాప్‌లు లేదా వెబ్‌సైట్ల ద్వారా మాత్రమే కొనుగోళ్లు చేయడం వల్ల మోసపోకుండా పండుగను సంతోషంగా జరుపుకోవచ్చు.                                                                                                                                                 *రూపశ్రీ.
ఆడపిల్ల జీవితంలో గెలవాలి అంటే ఇలా పెంచండి..! నేటి సమాజంలో ఆడపిల్లలకు కేవలం రక్షణ కల్పించడమే కాకుండా, వారు సొంత కాళ్లపై నిలబడేలా, జీవితంలో ప్రతి సవాలును జయించి విజేతలుగా నిలిచేలా పెంచడం ఎంతో అవసరం. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ఆడపిల్లల విషయంలో చాలా సున్నితంగా ఉంటారు. ఆడపిల్లలు సుకుమారంగా, ఎలాంటి బాధ్యత, కష్టం తెలియకుండా, ఇంటి పనులన్నీ నేర్చుకుంటే చాలని అనుకుంటారు. కానీ  తీసుకునే కొన్ని చిన్న జాగ్రత్తలు ఆడపిల్లల  భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తాయి. ఆడపిల్లలను కేవలం సున్నితంగా కాకుండా, ఆత్మవిశ్వాసం కలిగిన ధైర్యవంతమైన వనితలుగా  తీర్చిదిద్దడానికి పాటించాల్సిన విషయాల గురించి వివరంగా తెలుసుకుంటే.. ధైర్యవంతురాలుగా పెంచాలి.. అ​మ్మాయిలను మహారాణులుగానో లేదా ఎవరిపైనో ఆధారపడేవారిగానో కాకుండా ధైర్యంగా ఉండేలా పెంచాలి. ఆమెకు కాపలాగా ఉండటానికి మరొక రక్షకుడు అవసరం లేదని, తనకు తానే ఏకైక రక్షకురాలని చిన్నతనం నుంచే వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి.  వారికది ఒక పెద్ద మానసిక బలాన్ని ఇస్తుంది. అన్ని పనులు నేర్పాలి.. ​కొన్ని పనుల విషయంలో ఇది ఆడపిల్లలు చేసే పని కాదు అని ఎప్పుడూ అనకూడదు. ఇటువంటి మాటలు వారిలో భయాన్ని, న్యూనతాభావాన్ని పెంచుతాయి. సమాజంలో లేదా ఇంట్లో ఏ పనైనా తాము చేయగలమనే ధైర్యాన్ని వారికి అందించడం తల్లిదండ్రుల బాధ్యత. ఆత్మరక్షణ.. ​ఆడపిల్లలకు చిన్నతనం నుంచే ఆత్మరక్షణ అంటే.. సెల్ఫ్ డిఫెన్స్  విద్యలను నేర్పించాలి. శారీరక బలం , ఆత్మరక్షణ నైపుణ్యాలు అమ్మాయిలలో కాన్ఫిడెన్స్ ను విశేషంగా పెంచుతాయి. ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు అధైర్యపడకుండా ఎదుర్కొనే ధైర్యం దీని ద్వారా లభిస్తుంది. నో చెప్పడం నేర్పాలి.. ​తమకు నచ్చని లేదా ఇబ్బంది కలిగించే విషయాలకు కుదరదు లేదా నో అని చెప్పడం నేర్పించాలి. కాదనడం అనేది ఒక బలహీనత కాదని, కష్టంగా ఎవరి కోసమో దేన్నీ యాక్సెప్ట్ చెయ్యాల్సిన అవసరం లేదని, నో చెప్పడం అంటే..  తమ పరిమితులను , హద్దులను కాపాడుకోవడానికి గీసుకున్న లక్ష్మణ రేఖ అని వారికి వివరించాలి. ఇది వారి స్వతంత్ర ఆలోచనకు దోహదపడుతుంది. బాధ్యతలు.. ఇంట్లో ఉండే బాధ్యతలను మగపిల్లలతో సమానంగా అమ్మాయిలకు కూడా అప్పగించాలి. కుటుంబ నిర్ణయాల్లో వారిని భాగస్వాములను చేయడం, బాధ్యతలను సమానంగా పంచుకోవడం వల్ల వారిలో క్రమంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భయాన్ని జయించడం.. భయాన్ని జయించిన ఏ అమ్మాయైనా ఈ ప్రపంచాన్ని సులువుగా గెలవగలదు. సరైన మార్గదర్శకత్వం, మద్దతు అందిస్తే ఆడపిల్లలు ప్రతి రంగంలోనూ అద్భుతాలు సృష్టించగలరు. ఆడపిల్లను సున్నితంగా, అపురూపంగా పెంచడం  తప్పు కాదు.. కానీ.. ఆడపిల్లను భస్తురాలిగా, తండ్రిచాటు పిల్లగానో, తల్లిచాటు పిల్లగానో.. ఎవరో ఒకరు తన ముందు ఉంటే తప్ప.. తాను ఏమి సాధించలేను అనే మెంటాలిటీ కలిగిన పిల్లగానో మాత్రం పెంచకూడదు. అమ్మ నాన్న, తోబుట్టువులు.. పెళ్ళయ్యాక భర్త, అత్తమామ.. ఇలా ఎవ్వరు లేకపోయినా సరే.. ఆత్మవిశ్వాసంతో  జీవితాన్ని గడిపే ధైర్యాన్ని అమ్మాయిలకు ఇవ్వాలి. ఇలాంటి అమ్మాయిలు అద్భుతాలు చేస్తారు. తన చుట్టూ ఉన్నవారికి కీర్తి తెచ్చిపెడతారు.                            *రూపశ్రీ.
భార్యాభర్తలు ఒకరికి ఒకరు టైం కేటాయించుకోవడం ఎందుకు ముఖ్యం.! ​భార్యాభర్తలు ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఒకరి కోసం ఒకరు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించుకోవడం దాంపత్య జీవితంలో అత్యంత కీలకమైన అంశం. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఉద్యోగం, వ్యాపారం, పిల్లల చదువులు, ఇంటి పనులు, ఆర్థిక బాధ్యతలతో రోజంతా గడిచిపోతుంటుంది. ఈ హడావుడిలో దంపతులు ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి, మనసులో విషయాలను పంచుకోవడానికి సమయం దొరకడం కష్టం. అయితే, కేవలం ఒకే ఇంట్లో  జీవించడం మాత్రమే కాకుండా, ఒకరికొకరు క్వాలిటీ టైమ్ కేటాయించుకోవడం చాలా అవసరం . భార్యాభర్తలు ఒకరికొకరు టైమ్ కేటాయించుకోవడం వల్ల వైవాహిక బంధంలో జరిగే అద్భుతాలు తెలుసుకుంటే..  కష్టాలలో నిలబెడుతుంది. ఎంతటి కష్టసమయంలోనైనా దంపతులను కలిపి ఉంచేది వారి మధ్య ఉన్న అనుబంధమే. రోజూ కొంత సమయం ఒకరి కోసం ఒకరు కేటాయించుకోవడం వల్ల ఇద్దరి మధ్య బంధం మరింత గట్టిపడుతుంది. ఒకరి ఆలోచనలు, ఆశయాలు, భయాలు మరొకరు అర్థం చేసుకోవడానికి ఈ సమయం సహాయపడుతుంది. దీనివల్ల భాగస్వామి పట్ల ప్రేమ, గౌరవం పెరుగుతాయి. గొడవలు తగ్గుతాయి.. చాలా కాపురాల్లో వచ్చే చిన్న చిన్న గొడవలకు లేదా విభేదాలకు ప్రధాన కారణం సరిగ్గా మాట్లాడుకోకపోవడమే. రోజూ కాసేపు ఎలాంటి ఫోన్లు, టీవీలు లేకుండా ఒకరితో ఒకరు మాట్లాడటం వల్ల మనసులోని భ్రమలు, అపోహలు తొలగిపోతాయి. భాగస్వామి చెప్పేది శ్రద్ధగా వినడం వల్ల మన సమస్యలను వారు అర్థం చేసుకుంటున్నారనే నమ్మకం కలుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.. ఆఫీసు పని, కుటుంబ బాధ్యతల వల్ల కలిగే శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించడంలో భాగస్వామితో గడిపే సమయం అద్భుతంగా పనిచేస్తుంది. రోజంతా పడిన కష్టాన్ని మరిచిపోయి, భాగస్వామితో కాసేపు నవ్వుతూ మాట్లాడినా లేదా చిన్న నడకకు వెళ్లినా మనసుకు ఎంతో ఉపశమనం లభిస్తుంది. భాగస్వామి ఇచ్చే ధైర్యం ఎలాంటి ఒత్తిడినైనా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. జీవితం ఎప్పుడూ కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది.. వివాహమై కొన్ని సంవత్సరాలు గడిచాక చాలామందిలో జీవితం రొటీన్‌గా మారిపోయిందనే భావన వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం చాలా అవసరం. కలిసి కాఫీ తాగడం, కొత్త ప్రదేశాలకు వెళ్లడం లేదా పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం వంటివి వైవాహిక జీవితంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. పిల్లలకు మార్గదర్శనం.. పిల్లలు ఎప్పుడూ తల్లిదండ్రులను చూసే విషయాలు నేర్చుకుంటారు. ఇంట్లో భార్యాభర్తలు ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ, ప్రేమగా సమయం గడుపుతుంటే పిల్లలు కూడా ప్రేమ, అనురాగాలు ఉన్న వాతావరణంలో పెరుగుతారు. ఇది వారిలో మానసిక స్థిరత్వాన్ని పెంచుతుంది. భవిష్యత్తులో వారు కూడా మంచి సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకోవడానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది. మార్పులను గ్రహించవచ్చు.. కాలంతో పాటు మనుషుల ఆలోచనలు, అలవాట్లు మారుతుంటాయి. పెళ్లి సమయానికి ఉన్న భాగస్వామి, కొన్నేళ్ల తర్వాత శారీరకంగా, మానసికంగా మారవచ్చు. తరచూ మాట్లాడుకోవడం వల్ల భాగస్వామిలో వస్తున్న మార్పులను, వారి కొత్త అవసరాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల జీవితంలో ఏ దశలోనైనా ఒకరికొకరు అండగా నిలబడటం తేలికవుతుంది. భార్యాభర్తలు ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం అనేది ఒక బాధ్యత మాత్రమే కాదు, అది దాంపత్య జీవితానికి పునాది వంటిది. రోజూ కనీసం ఒక అర గంట పాటు ఫోన్లకు దూరంగా ఉండి,  మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటే, ఎలాంటి సమస్యలనైనా సులభంగా దాటవచ్చు. ఎంత బిజీగా ఉన్నా భాగస్వామికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మాత్రమే వైవాహిక బంధం సుదీర్ఘకాలం సంతోషంగా, ఆరోగ్యకరంగా సాగుతుంది.                      *రూపశ్రీ.  
తలనొప్పి వచ్చిందంటే చాలు.. చాలామంది వెంటనే మెడికల్ షాప్‌‌కి వెళ్లి పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ తెచ్చుకుని  మింగేస్తుంటారు. కానీ, తరచూ మాత్రలు వాడటం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎటువంటి టాబ్లెట్ వాడకుండానే ఇంట్లోనే చాలా తేలిగ్గా, సహజ పద్ధతుల ద్వారా తలనొప్పిని తగ్గించుకోవచ్చు. ​మనం చేసే చిన్న చిన్న పనులు,  ఆక్యుప్రెషర్ పద్ధతులు తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనాన్ని ఇస్తాయి. టాబ్లెట్ అక్కర్లేకుండానే తలనొప్పి తగ్గించుకోవడానికి ఏం చేయాలో తెలుసుకుంటే.. LI4 పాయింట్.. ​మన బొటనవేలు, చూపుడు వేలు కలిసే మధ్య భాగంను LI4 పాయింట్ అంటారు. ఈ భాగంలో  మరొక చేతి వేళ్లతో మెల్లగా నొక్కి పట్టి, వృత్తాకారంలో మసాజ్ చేయడం వల్ల తలనొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఈ పాయింట్‌ను కొన్ని నిమిషాల పాటు నొక్కడం వల్ల శరీరంలో ఒత్తిడి తగ్గి ఉపశమనం కలుగుతుంది. యాంగ్ టాంగ్ పాయింట్.. ​నుదురు, కనుబొమ్మల మధ్య భాగం, రెంటి మధ్య పాయింట్  ను యాంగ్ టాంగ్ పాయింట్అంటారు. ఈ పాయింట్ వద్ద చూపుడు వేలితో కాసేపు సున్నితంగా మసాజ్ చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా, తలనొప్పి క్రమంగా తగ్గుతుంది. నీరు.. ​శరీరంలో నీటి శాతం తగ్గడం (డీహైడ్రేషన్) వల్ల కూడా చాలామందికి తలనొప్పి వస్తుంటుంది. కాబట్టి తలనొప్పిగా అనిపించిన వెంటనే ఒక పెద్ద గ్లాసు నీళ్లు లేదా నిమ్మకాయ నీళ్లు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కాంప్రెస్.. ​తలనొప్పిగా ఉన్నప్పుడు చల్లని లేదా వేడి కాంప్రెస్ ఉపయోగించడం చాలా మంచిది. ఐస్ క్యూబ్స్‌ను ఒక గుడ్డలో చుట్టి నుదుటిపై లేదా మెడ వెనుక భాగంలో ఉంచడం వల్ల, లేదా వేడి నీటిలో ముంచిన తువ్వాలును ఉంచడం వల్ల రక్తనాళాలు విశ్రాంతి పొంది నొప్పులు తగ్గుతాయి. ఆయిల్స్.. పుదీనా నూనె లేదా ల్యావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ కొద్దిగా తీసుకుని నుదుటిపై రాసి సున్నితంగా మసాజ్ చేయడం వల్ల లేదా వాటి సువాసన పీల్చడం వల్ల తలనొప్పి, ఒత్తిడి త్వరగా దూరం అవుతాయి. అధిక వెలుతురు, స్క్రీన్ల వెలుతురు వల్ల వచ్చే తలనొప్పిని తగ్గించుకోవడానికి కాసేపు లైట్లు ఆర్పివేసి ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణంలో కళ్లు మూసుకుని పడుకోవడం మంచిది. ఈ చిన్న చిన్న సహజ చిట్కాలను పాటించడం ద్వారా రూపాయి ఖర్చు లేకుండా, టాబ్లెట్ మింగే అవసరం లేకుండా తలనొప్పికి సులభంగా చెక్ పెట్టవచ్చు.                      *రూపశ్రీ.
ఉలవచారు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. కానీ ఉలవలు కేవలం రుచికరమైన ఆహారం మాత్రమే కాదు.. మన సంప్రదాయ ఆహార విధానంలో వీటికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా నల్ల ఉలవలను ఆహారంగా ఎలా ఉపయోగించాలి? వాటి వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటి? అనే విషయాలు చాలామందికి తెలియకపోవచ్చు. ఈ వీడియోలో 35 సంవత్సరాల ఆయుర్వేద అనుభవం ఉన్న Dr. Chittibhotla Madhusudhana Sharma గారు ఉలవల గురించి సులభమైన తెలుగులో వివరించారు. నల్ల, తెల్ల, ఎర్ర ఉలవల్లో ఉన్న తేడాలు, నల్ల ఉలవలను ఎందుకు ప్రత్యేకంగా భావిస్తారు, ఉలవల్లో ఉండే పోషకాలు, ఫైబర్ జీర్ణక్రియకు ఎలా ఉపయోగపడుతుంది వంటి విషయాలను ఇందులో తెలుసుకోవచ్చు. అలాగే ఉలవలు బరువు నియంత్రణకు ఉపయోగపడతాయా? రోజువారీ ఆహారంలో ఉలవలను ఎలా చేర్చుకోవాలి? ఉలవచారు లేదా ఇతర రూపాల్లో తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవచ్చు? ఉలవలు తింటే కిడ్నీలో రాళ్లు కరుగుతాయనే ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉంది? వంటి ముఖ్యమైన సందేహాలకు కూడా ఈ వీడియోలో వివరణ లభిస్తుంది. మన వంటింట్లో సులభంగా లభించే ఉలవలను సరైన విధంగా ఆహారంలో చేర్చుకోవడం ద్వారా వాటి పోషక విలువలను ఎలా పొందవచ్చో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. గమనిక: కిడ్నీలో రాళ్లు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఆహారంలో మార్పులు చేసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి. ఉలవలను ఏదైనా వ్యాధికి చికిత్సగా భావించి వైద్య చికిత్సను నిలిపివేయకండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)