LATEST NEWS
ప్రకృతిని ఎదిరించి జీవించడం ఎవరికీ సాధ్యం కాదని, దానితో ఘర్షణకు దిగితే మానవాళి తీవ్ర విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హితవు పలికారు. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అంగరంగ వైభవంగా జరిగిన సాంస్కృతిక సమ్మేళనం ఈ హెచ్చరికకు వేదికైంది. దసరా పండుగ అనంతర వేడుకల సంప్రదాయంగా ప్రతి సంవత్సరం నిర్వహించే 'అలయ్ బలయ్' కార్యక్రమం ఈసారి కూడా అత్యంత ఉత్సాహంగా సాగింది. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సారథ్యంలో జరిగిన ఈ వేడుకలో వివిధ రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ప్రముఖ రాజకీయ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఉత్సవంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు ఒకే వేదికపైకి రావడం విశేషం. పక్షపాతాలకు తావులేకుండా ప్రజల మధ్య ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందించేందుకు ఇటువంటి సాంస్కృతిక వేదికలు ఎంతగానో దోహదపడతాయని ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది 'నషా ముక్త్ భారత్ - వికసిత్ భారత్' (మత్తుపదార్థాల రహిత, అభివృద్ధి చెందిన భారతదేశం) అనే ప్రధాన నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశ యువతను చెడు వ్యసనాల నుంచి రక్షించి, దేశ పురోగతికి భాగస్వామ్యులను చేయడమే ఈ సంకల్పం యొక్క ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. మన దేశ వైవిధ్యభరితమైన సంస్కృతిని, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తుచేశారు. ఏ మతాన్ని, పండుగను తక్కువ చేసి చూడకుండా దేశంలోని ప్రతి ఒక్కరూ పరస్పర గౌరవంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే అద్భుతమైన జానపద కళారూపాలు, డప్పు చప్పుళ్లు ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంప్రదాయ వంటకాలు, కళా ప్రదర్శనలు ఆహూతులను ఎంతగానో అలరించడంతో ప్రాంగణమంతా పండుగ వాతావరణం సంతరించుకుంది. భవిష్యత్తులోనూ ఇలాంటి సమ్మేళనాలు సమాజంలో శాంతిభద్రతలను, సమైక్యతా భావాలను మరింత బలపరుస్తాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా పర్యావరణ పరిరక్షణకు, దేశాభివృద్ధికి పాటుపడాల్సిన సమయం ఆసన్నమైందని ఈ వేదిక మరోసారి చాటిచెప్పింది. ఈ వేడుకలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం సహా పలు రాజకీయ పార్టీల నేతలు పాల్గొని సమైక్యతను చాటారు. తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.       [ Venkaiah Naidu, Alai Balai, Bandaru Dattatreya, Nampally Exhibition Grounds, Viksit Bharat, TeluguOne News, Kishan Reddy, Telangana Culture, Viksit Bharat, Telugu One, Telugu News ]  
DRDO ఉద్యోగి ఎదురింట్లో ఉన్న ఓ యువతిపై మనసు పడ్డాడు.. అవకా శం కోసం ఎదురుచూశాడు యువతి ఒంటరిగా ఉన్నట్లు గుర్తించి ఇంట్లోకి చొరబడ్డాడు. యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో స్థానికులు రంగప్రవేశం చేసి అతడిపై దాడికి పాల్పడటంతో DRDO ఉద్యోగి మృతి చెందాడు. ఈ ఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న రామ్మోహన్ (40) DRDO ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.  తన నివాసానికి ఎదురుగా ఉన్న ఫ్లాట్‌లో ఉంటున్న ఓ యువతిపై మనసు పడ్డాడు. ఈ క్రమంలో యువతి ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె ఇంట్లోకి వెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో సదరు యువతి గట్టిగా కేకలు వేయడంతో పక్క ఫ్లాట్‌లో ఉన్న వ్యక్తులు వెంటనే స్పందించి ఘటనాస్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అర్థం చేసుకున్న వారు రామ్మోహన్‌పై విచక్షణా రహితంగా దాడి చేశారు.  ఈ దాడిలో రామ్మోహన్ తలకు తీవ్ర గాయాల య్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం వీధిలో  రామ్మోహన్  అనే వ్యక్తి తన భార్య కాత్యా యినితో కలిసి గత రెండు సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాడు. ఇతను  డిఆర్డిఓ లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతను గత కొంతకాలంగా ఇంటి పక్కనే ఉన్న ఓ యువతిపై మనసు పడ్డాడు. దీంతో ప్రతిసారి ఆ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి కూడా రామ్మోహన్ యువతిని వేధించసా గాడు. దీంతో సదరు యువతి ఇంటి పక్కనే నివాసం ఉంటున్న అభిజిత్ అనే యువకుడికి విషయం మొత్తం చెప్పింది. దీంతో ఆగ్రహం చెందినే అభిజిత్ వచ్చి రామ్మోన్ను గత కొంతకాలంగా యువతిని ఎందుకు వేధిస్తున్నావని ప్రశ్నిం చాడు. దీంతో ఇరువురి మధ్య మాట మాట పెరిగి పెద్ద ఎత్తున గొడవ జరగడంతో అభిజిత్ ఒక్కసారిగా రామ్మోహన్ను గట్టిగా తోసేసాడు. దీంతో రామ్మోహన్ తలకు గాయమైంది. అది గమనించిన అతని భార్య వెంటనే  రామ్మోహన్ ను  కాచిగూడ లోని సీసీ షరాఫ్ ఆస్పత్రిలో చికిత్స కోసం తరలించగా చికిత్స పొందుతూ చెందాడు. రామ్మోహన్ భార్య కాత్యాయిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.         [ DRDO employee Rammohan, Attempted rape of a young woman, Chikkadapalli Police Station, Crime news, Hyderabad Police, CP Sajjanar, DGP C.V. Anand, Telugu One, Telugu News ]  
ఆకలి వేస్తే అన్నం పెట్టే విశాల హృదయం మనది.. దాహమేస్తే గుక్కెడు మంచినీళ్లు ఇవ్వడం మన సంస్కృతి. కానీ నేటి సమాజంలో మనుషుల ప్రాణాల కంటే విలువైన వస్తువులే ఎక్కువైపోతున్నాయా? క్షణికావేశం, అంతులేని క్రూరత్వం కలిసి ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న అమానవీయ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో తీవ్ర కలకలం రేపింది. కేవలం ఇరవై రూపాయల విలువైన ఒక వాటర్‌ బాటిల్‌ దొంగిలించాడనే అనుమానంతో ముప్పై మూడేళ్ల యువకుడిని విద్యుత్‌ స్తంభానికి కట్టేసి, రెండు గంటల పాటు విచక్షణారహితంగా కొట్టి చంపిన ఉదంతం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.  తెలంగాణలోని నల్గొండకు చెందిన మాస సాయికుమార్‌ (33) కొంతకాలంగా తన భార్య, ఇద్దరు కుమార్తెలు మరియు ఒక కుమారుడితో కలిసి విజయవాడలో నివాసముంటున్నాడు. ఉపాధి కోసం కుటుంబానికి దూరంగా ఉంటున్న సాయికుమార్ జీవితంలో ఆ అమావాస్య నాటి తెల్లవారుజామున ఊహించని విషాదం ముంచుకొచ్చింది.ఈ నెల 19వ తేదీ తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో సాయికుమార్ విజయవాడలోని పటమట డొంకరోడ్డు ప్రాంతంలో ఉన్న ఒక పాన్‌షాపు వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో తీవ్ర దాహంతో తాళం వేసి ఉన్న ఫ్రిజ్‌ నుంచి వాటర్ బాటిల్ తీసేందుకు ప్రయత్నించాడు.  అటుగా వచ్చిన ఒక పాల వ్యాన్ డ్రైవర్ దీనిని గమనించి వెంటనే పాన్‌షాప్‌లో పనిచేసే రవిశంకర్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. ఆ తర్వాత ఆ డ్రైవర్ సాయికుమార్‌ను రవిశంకర్‌కు అప్పగించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అక్కడికి చేరుకున్న రవిశంకర్ ఎలాంటి విచారణ లేకుండా సాయికుమార్‌పై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో అతడిని ఈడ్చుకుంటూ వెళ్లి సమీపంలోని మద్యం దుకాణం వెనుక ఉన్న సందులోకి తీసుకెళ్లాడు. అక్కడ  బార్‌లో పనిచేసే అయ్యప్ప శంకర్ కూడా వారితో చేరడంతో ఇద్దరూ కలిసి సాయికుమార్ చేతులను వెనక్కి విరిచి విద్యుత్‌ స్తంభానికి గట్టిగా కట్టేశారు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న పోతంశెట్టి నవీన్, సాయి ప్రణీత్ అనే ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కూడా ఆ నలుగురితో జతకలిశారు. నలుగురు నిందితులు కలిసి కర్రలతో సాయికుమార్‌పై తీవ్రమైన దాడికి పాల్పడ్డారు. దెబ్బల వల్ల కలిగే నరకయాతనతో విలవిలలాడిపోయిన సాయికుమార్, "దయచేసి నన్ను కొట్టకండి.. నాకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు, నన్ను వదిలేయండి" అంటూ కన్నీళ్లతో ప్రాధేయపడ్డాడు. అయినప్పటికీ ఆ రాక్షసుల మనసులు కరగలేదు. ఏమాత్రం కనికరం లేకుండా సుమారు రెండు గంటల పాటు అతడిని కర్రలతో పదే పదే కొడుతూ చిత్రహింసలకు గురిచేశారు.  ఈ విపరీతమైన దాడి కారణంగా సాయికుమార్ తీవ్ర గాలాలతో స్పృహ కోల్పోయి నేలకొరిగారు. అతడు చలనం లేకుండా పడిపోవడాన్ని గమనించిన ఆ నలుగురు నిందితులు భయపడి అక్కడి నుంచి పరారయ్యారు.ఉదయం 6 గంటల సమయంలో అటుగా వెళ్లిన స్థానికులు, సచివాలయంలో వీఆర్వోగా పనిచేస్తున్న నాగేశ్వరరావుకు సమాచారం అందించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. రక్తపు గాయాలతో ప్రాణం కోల్పోయి పడి ఉన్న మృతదేహాన్ని చూసి స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు.  సమాచారం అందుకున్న పటమట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI) పవన్ కిషోర్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీసీటీవీ (CCTV) పుటేజీలను పరిశీలించి జరిగిన ఘోరాన్ని నిర్ధారించారు. మృతుడు సాయికుమార్‌గా గుర్తించి అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. కేవలం ఒక నీళ్ల బాటిల్ కోసం నలుగురు కలిసి ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న ఈ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.       [ Vijayawada murder, water bottle theft case, Patamata crime news, Sai Kumar death, AP crime updates, Vijayawada news today, CM Chandrababu, Home minister Anitha, Naralokesh ,AP Police ]  
ALSO ON TELUGUONE N E W S
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌.. తన తదుపరి సినిమా గురించి ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌తో ఆయన తెరకెక్కించనున్న భారీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ‘గాడ్ ఆఫ్ వార్’ అనే పేరుతో ప్రచారంలో ఉన్న ఈ సినిమా కథ పూర్తయిందని గతంలోనే త్రివిక్రమ్ వెల్లడించారు. ఇప్పుడు జగపతిబాబు హోస్ట్ చేస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సీజన్‌ 2 ప్రోమోలో ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. వెంకటేశ్‌ నటిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ ప్రమోషన్స్‌లో భాగంగా త్రివిక్రమ్‌, సంగీత దర్శకుడు తమన్‌, నటుడు సునీల్‌ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగపతిబాబు.. ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్‌ చేయబోయే సినిమాను ప్రస్తావించారు. దీనికి త్రివిక్రమ్‌ స్పందిస్తూ.. తన మనసులో ఆరు ముఖాలు కలిగిన ఒక బొమ్మ రాగానే మాటలు వాటంతట అవే వచ్చాయని, బహుశా అది దైవ సంకల్పమేనని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ చేస్తున్నప్పుడు త్రివిక్రమ్‌ పైకి చూస్తూ ఓ లుక్ ఇచ్చారు. ఆ కళ్ళలో కాన్ఫిడెన్స్ చూస్తే ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ. ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్‌ తెరకెక్కించనున్న ఈ పౌరాణిక చిత్రం కార్తికేయ స్వామి నేపథ్యంలో రూపొందనుంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్‌ పూర్తయిందని త్రివిక్రమ్‌ స్పష్టం చేశారు. అయితే ‘గాడ్ ఆఫ్ వార్’ అనేది అధికారిక టైటిల్‌ కాదు. ఇటీవల నిర్మాత నాగవంశీ కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. సినిమా టైటిల్‌ను ఇంకా ఖరారు చేయలేదని తెలిపారు. ‘అరవింద సమేత వీర రాఘవ’ తర్వాత ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కలయికలో రానున్న సినిమా కావడంతో అభిమానుల్లో సహజంగానే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్‌.. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్‌’తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పనులు పూర్తయ్యాక త్రివిక్రమ్‌ ప్రాజెక్ట్‌పై దృష్టి సారించే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: ప్రభాస్ కెరీర్‌లో టాప్ 10 సినిమాలు: నంబర్ 1 ఏదో తెలుసా.?       [Trivikram About God Of War, God Of War Movie, NTR Trivikram Movie, Jagapathi Babu, Jayammu Nischayammu Raa Season 2, Jr NTR, NTR Dragon Movie, Trivikram Srinivas, Aadarsha Kutumbam, Telugu Film News]  
Cast: Aegan, Sri Devi, Femina George, Adhirchi Arun, Subramanian Sethu, Adhiyaman Crew:  Written by Yuvaraj Chinnasamy, Hariharan Ram Cinematography by Priyesh Gurusamy Editing by Sakthi Pranesh P Music by Siddhu Kumar Directed by Yuvaraj Chinnasamy Produced by Dr. D. Arulanandhu, Mathewo Arulanandhu Production House: Vision Cinema House Sri Devi has become one of the most promising young actresses of Telugu Cinema with Court. Now, he made her Tamil debut with Haiku starring Aegan. The young actor became popular featuring in web series of Black Sheep and Kana Kaaanum Kaalangal, Kozhipannai Chelladurai, Joe. Now, his father produced Haiku with Yuvaraj Chinnasamy directing it. Yuvaraj previously made Black Sheep shorts, Aaha Kalyanam, Padikathavan. Let's discuss about the film, in detail.  Plot:  Manohar (Aegan) is forced to join Arul Bodhi Girls College that became co-ed as first male student, in Coimbatore. He meets Kodi (Sri Devi) and they fall in love. He completes his Mechanical Engineering and finds a job a Designer. They fall apart and post three years, he is seen as a lead in an IT company. An intern, Nivetha (Femina George) joins the team where he is instructor. She goes through an abusive relationship but Manohar helps her earn independence over it. She falls for him but can Manohar fall in love again? Will it be different from his relationship with Kodi? Watch the movie to know more.  Analysis:  Aegan needed to be more mature to handle the differences in the complex character written for him. Also, he needed to ooze a charm of his own to make the story progression believable but the actor doesn't have the screen presence at the same level. Script needed him to rise above the written material with his performance but he is found wanting at most of the places.  Sri Devi is good in her character but in older scenes she could have been better. At places, she is still the person she played in Court. Femina George is expressive, good in romantic scenes but at many places she came across as more desperate to show a certain emotion rather than be natural. There have been places where she felt like pushing hard and being unnatural on screen.  Priyesh Gurusamy cinematography is cool and doesn't have many standout frames. But he tried his best to keep it in sync with the movie tone. Production values - mainly college and office buildings- add beauty to the visuals. Siddhu Kumar music is good but not memorable. Sakthi Pranesh's editing could have been better in the second hour as several shots seem random at places without good set-up.  Writing wise Yuvaraj, who is able to give several memorable moments in his Aaha Kalyanam doesn't really bring the same level of authenticity to his content. However actors be good or bad, writing can have the spark of carrying the emotion or delivering a punchline with ease. Here, the writing grows lethargic and draggy with resolution for issues being predictable.  Even in telling his point about how past can be seen in different ways by different people, he could not create the impact. Each scene keeps going in circle to talk about the same emotion and hence, the screenplay looks like it is stuck and there is no growth or momentum. Overall, Haiku makers created a lot of buzz prior to the release but unfortunately, movie doesn't live up to it.  Positives: Siddhu Kumar music  Production design Few comical scenes with Adhirchi Arun  Negatives: Performances Draggy Narration Not Relatable Screenplay Feels artificial Bottomline: Haiku has a good point but fails to narrate it effectively.  Rating: 2/5  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలోనే ఓజి 2 లో పాల్గొంటాడనే న్యూస్ చాలా రోజుల నుంచి కాన్ఫిడెన్స్ గానే సోషల్ మీడియాలో, సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతూ ఉంది.  దీంతో ఆ ఘడియల కోసం ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్న  పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక దుష్ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే, తాజాగా ఒక వాట్సాప్ గ్రూప్‌లో, నకిలీ ఛానళ్లలో పవన్ కల్యాణ్ తన డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేస్తున్నారంటూ వచ్చిన ఒక తప్పుడు వార్త రాజకీయ వర్గాలలో తీవ్ర కలకలం సృష్టించింది. ఏమాత్రం నిజానిజాలు నిర్ధారించుకోకుండా, కేవలం సంచలనం కోసం లేదా తొందరపాటు కారణంగా ఒక వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ చేసిన పోస్ట్ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది.  ఈ పరిణామంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ నడిచింది. ఈ ఘటనపై పవన్ కల్యాణ్ కార్యాలయం  తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ గుర్తింపును, నాయకుల పేర్లను దుర్వినియోగం చేస్తూ ఫేక్ ఛానెళ్లు, ఫేక్ గ్రూపులు సృష్టిస్తున్న వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి బాధ్యుల ఆట కట్టిస్తామని తేల్చిచెప్పడంతో సోషల్ మీడియా నిర్వాహకుల్లో ఒక్కసారిగా వణుకు మొదలైంది.    ఈ అనూహ్య పరిణామాల నేపథ్యంలో తీవ్ర భయాందోళనకు గురైన ఆ సంబంధిత వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ తన తప్పును తెలుసుకుని బహిరంగంగా క్షమాపణలు కోరారు. ఉదయం పూట గ్రూప్‌లో పవన్ కల్యాణ్ రాజీనామా అంటూ వచ్చిన ఒక పోస్ట్‌ను తాను సోషల్ మీడియాలో చూసి, కనీసం గ్రౌండ్ రియాల్టీ ఏంటో తెలుసుకోకుండా, ఏమాత్రం బాధ్యత లేకుండా ఫార్వర్డ్ చేసినట్లు అడ్మిన్ తన వివరణలో పేర్కొన్నారు. ఆ వార్త పూర్తిగా అవాస్తవమని, కేవలం ఫేక్ న్యూస్ అని ఆ తర్వాతే తనకు అర్థమైందని ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం కార్యాలయం దీనిపై తీవ్రంగా స్పందించి చట్టపరమైన చర్యలకు ఉపక్రమించడంతో తన తప్పు ఏ స్థాయి ఉందో గ్రహించినట్లు తెలిపారు. పవన్ కల్యాణ్, జనసేన పార్టీ నాయకులు, శ్రేణులు, అటు గ్రూప్ సభ్యులందరికీ తన హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నట్లు స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఎటువంటి వార్తను ఫార్వార్డ్ చేసినా, పోస్ట్ చేసినా అది నిజమైనదా కాదా అని అధికారిక వర్గాల ద్వారా పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే ముందుకు వెళ్తానని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు.   సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు సమాచారాన్ని వేగంగా చేరవేయడంలో ఎంత ముందుంటాయో, అదే వేగంతో తప్పుడు వార్తలను వ్యాప్తి చేసి సమాజంలో అశాంతిని రేకెత్తించడంలో కూడా అంతే ప్రమాదకరంగా మారుతున్నాయి. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ప్రముఖులపై ఇలాంటి నకిలీ వార్తలు సృష్టించడం చట్టరీత్యా తీవ్రమైన నేరం.    ఇది కూడా చదవండి: సావిత్రి, శ్రీదేవి ఆల్రెడీ పెళ్లి అయిన వ్యక్తులని ఎలా పెళ్లి చేసుకున్నారు: మెయిన్ రీజన్ ఇదే!     ఈ ఘటనతో సోషల్ మీడియా అడ్మిన్లు, వాట్సాప్ గ్రూప్ నిర్వాహకులు అందరూ తీవ్రమైన ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కేవలం వ్యూస్ కోసం, లైకుల కోసం లేదా గ్రూప్‌లో యాక్టివ్‌గా ఉండాలనే దురాశతో వచ్చే ప్రతి వార్తకు బలైపోకుండా, ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. పవన్ కల్యాణ్ కార్యాలయం తీసుకున్న ఈ కఠిన నిర్ణయం ఫేక్ న్యూస్ క్రియేటర్లకు మరియు బాధ్యతారహితంగా వ్యవహరించే వాట్సాప్ అడ్మిన్లకు ఒక బలమైన హెచ్చరికగా నిలిచింది. డిజిటల్ యుగంలో స్వేచ్ఛ పేరుతో ఇతరుల పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే చట్టం తన పని తాను కచ్చితంగా చేసుకుపోతుందనేందుకు ఈ ఉదంతం ఒక నిదర్శనంగా నిలిచింది. బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా నిబంధనలను పాటించాలని, ఫేక్ వార్తలను షేర్ చేయకుండా నిరోధించాలని ఈ సంఘటన మరోసారి హెచ్చరిస్తోంది.   [whatsapp Admin Apology To Pawan kalyan, Pawan Kalyan Latest News, Deputy CM Pawan Kalyan, WhatsApp Admin Apology, Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘రణబాలి’ సినిమా దసరా కానుకగా అక్టోబర్‌ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్వాతంత్ర్యానికి ముందు రాయలసీమలో నెలకొన్న కరువు పరిస్థితులు, బ్రిటిష్‌ పాలనలో జరిగిన అరాచకాల నేపథ్యంతో దర్శకుడు రాహుల్‌ సంకృత్యన్‌ ఈ పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాను తెరకెక్కించారు. మొదటి రోజు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.60 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లతో సత్తా చాటింది. విడుదలకు ముందు నుంచే భారీగా ప్రమోషన్స్‌ నిర్వహించిన ‘రణబాలి’ టీమ్‌.. సినిమా విడుదలైన తర్వాత కూడా పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతోంది. ఇప్పుడు సినిమా విజయాన్ని అభిమానులతో కలిసి సెలబ్రేట్‌ చేసుకునేందుకు సిద్ధమైంది. ‘రణబాలి రణభేరి’ పేరుతో ఈ సక్సెస్‌ మీట్‌ను అక్టోబర్‌ 23న అనంతపురంలో నిర్వహించనున్నారు. రాప్తాడు రోడ్డులోని హార్మోని సిటీలో సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుక జరగనుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. విజయ్‌ దేవరకొండకు రాయలసీమతో ప్రత్యేక అనుబంధం ఉంది. విజయ్ పుట్టపర్తిలోనే చదువుకున్నాడు. దీంతో అభిమానుల్లో ఈ వేడుకపై ఆసక్తి పెరిగింది. రాయలసీమ ప్రాంతానికి చెందిన అభిమానులు, ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. మరి ఈ ‘రణభేరి’ వేదికపై విజయ్ దేవరకొండ సినిమా విజయంపై ఏం మాట్లాడతారు? అభిమానులకు ఎలాంటి సర్‌ప్రైజ్‌ ఇస్తారో చూడాలి. ఇది కూడా చదవండి: ప్రభాస్ కెరీర్‌లో టాప్ 10 సినిమాలు.. నంబర్ 1 ఏదో తెలుసా.? https://x.com/MythriOfficial/status/2113151749246603650       [Ranabaali Success Meet, Ranabaali Ranabheri, Ranabaali Anantapur Event, Ranabaali Collections, Vijay Deverakonda, Rashmika Mandanna, Rahul Sankrityan, Ranabaali Box Office, Telugu Film News]  
సూపర్‌స్టార్‌ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌ సినిమాపై ఆసక్తిని పెంచగా.. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అదేంటంటే.. ఈ సినిమాలో మహేశ్ బాబుకు బాడీ డబుల్‌గా పనిచేస్తున్న నటుడి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మహేశ్ బాబుకు డూప్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తి పేరు రోషన్ బొగాటి (బాల్). ముంబైకి చెందిన మోడల్‌, నటుడైన రోషన్‌ మిస్టర్ ఇండియా టైటిల్‌ను కూడా గెలుచుకున్నట్లు సమాచారం. హిందీ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన ఆయన.. తెలుగులో ‘పాడేరు 12వ మైలు’, ‘యమునా నది’, ‘పెన్ డ్రైవ్’ వంటి చిత్రాల్లోనూ కనిపించారు. గతంలో మహేశ్ బాబు నటించిన మౌంటెన్ డ్యూ ప్రకటనలోనూ ఆయనకు డూప్‌గా రోషన్‌ పనిచేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ‘వారణాసి’ షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలను రోషన్‌ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో ఆయన పేరు నెట్టింట వైరల్ అవుతోంది. అతని ప్రొఫైల్ లో మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, ఫైట్ మాస్టర్ తదితరులతో కలిసి దిగిన పిక్స్ ఉన్నాయి. భారీ యాక్షన్ సన్నివేశాలు, రిస్క్‌తో కూడిన స్టంట్స్‌, కొన్ని షోల్డర్ షాట్స్‌ వంటి సందర్భాల్లో బాడీ డబుల్స్‌ను ఉపయోగించడం సినిమా నిర్మాణంలో సాధారణమే. నటీనటుల భద్రతతో పాటు సన్నివేశాలను అనుకున్న విధంగా చిత్రీకరించడంలో వీరు కీలకంగా ఉంటారు. అయితే, ‘వారణాసి’లో రోషన్‌ ఏయే సన్నివేశాల్లో మహేశ్‌కు డూప్‌గా నటించారనే వివరాలు మాత్రం బయటకు రాలేదు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ గ్లోబ్‌ట్రాటింగ్‌ అడ్వెంచర్‌ మూవీలో మహేశ్ బాబు రుద్ర పాత్రలో కనిపించనున్నారు. ప్రియాంక చోప్రా మందాకినిగా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కుంభ పాత్రలో నటిస్తున్నారు. యాక్షన్‌, అడ్వెంచర్‌, పురాణ అంశాలు, టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్‌ 7న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఇది కూడా చదవండి: ప్రభాస్ కెరీర్‌లో టాప్ 10 సినిమాలు: నంబర్ 1 ఏదో తెలుసా.? https://www.instagram.com/p/DVFzMZeAZkb/ https://www.instagram.com/p/DVtiCqHgXlX/ https://www.instagram.com/p/C6GP8S2OU4f/       [Mahesh Babu Body Double in Varanasi, Varanasi Movie, Mahesh Babu Body Double, Roshan Bogati, Mahesh Babu, SS Rajamouli, Priyanka Chopra, Telugu Film News]  
Following the traction garnered by Caution 1 and the audience interest in its irreverent humour and eccentric characters, the makers of Jo Jo have unveiled Caution 2, offering another glimpse into the film’s raw, rustic world. Presented by filmmaker Deva Katta, the latest instalment shifts the spotlight from the pursuit of diamonds to the complications of romance, with a sharp exchange about masculinity, commitment and what it takes to stand by someone. Written and directed by Kiran Jay Kumar and produced by Vijay Krishna Lingamaneni under the Vijayam banner, Jo Jo continues to build its identity around an unfiltered comic voice and distinctly rooted characters. The first glimpse introduced audiences to the drought-hit diamond fields of Jonnagiri, where the promise of sudden fortune brought together an unlikely group of dreamers. Its blend of absurd situations, earthy dialogue and unapologetic humour established the film’s distinctive tonal space. Caution 2 carries that sensibility forward, this time through a relationship dynamic that turns a seemingly straightforward conversation into a test of character. Opening with villagers moving through Jonnagiri and visuals of people working in the fields against a landscape dotted with wind turbines, the glimpse establishes its rural setting before moving into a candid exchange between the lead characters. The woman challenges the protagonist’s understanding of manhood, questioning whether it is defined by physical attributes or by the courage to take responsibility for the woman he claims to love. She draws a clear distinction between pursuing a girl for a few days and being willing to marry her, share her burdens and stand beside her for a lifetime. The protagonist responds with an emphatic assurance that he never goes back on his word, crediting his upbringing for his conviction. The exchange then takes an unexpected comic turn with a reference to Balakrishna, adding a familiar pop-culture touch to the scene. The humour lies not merely in the punchline but in the contrast between the woman’s pointed questioning and the protagonist’s earnest defence of himself. It is this interplay of character, colloquial dialogue and irreverence that gives Caution 2 its appeal, allowing the comedy to emerge from the situation rather than feel imposed upon it. At the heart of Jo Jo are two penniless dreamers and a fearless young woman pursuing the possibility of a life-changing diamond discovery. Their ambitions soon become entangled with romance, greed, betrayal, danger and comic misadventures. With the first glimpse establishing the eccentricities of their treasure hunt, the second expands the film’s canvas by introducing another dimension of the relationships that drive the story. Krishna Kamal plays Seenu, while Maahi Sri portrays Supraja. The ensemble cast includes Phanindra Devarapalli as Venkatesh, Prabhavathi as Vijayamma, Mahaboob Basha as Suri, Satish Devatte Tanjore as Rangasaami, Puduru Sharath Babu as Ramana and Makarand Deshpande as Mukesh Shah. The technical team comprises Rohit Kumar as Director of Photography, Mahesh Shankar as Music Director and Madhav Kumar Gullapalli as Editor, with lyrics by Rehman, Srinivas Mouli and Ramachandra. With Caution 2, Jo Jo continues to build on the distinctive comic sensibility introduced in its first glimpse, pairing a rural backdrop with sharp exchanges and unconventional romantic dynamics. The film is positioned as a raw, rustic romantic comedy, and is coming soon in theatres. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.  
సావిత్రి, శ్రీదేవి.. తరాలు తేడా ఉన్నా తమ అందం, అంతంకంటే అందమైన అభినయంతో తెలుగు సినిమాని మహారాణి హోదాలో ఏలిన లెజండ్రిస్. ఎంత పెద్ద హీరో కట్ అవుట్ పెత్తనం అయినా ఆ ఇద్దరి ముందు మాత్రం చెల్లదు. ఈ మాట సత్యం కాదనే సాహసం ఎవరు చెయ్యరు. అంతలా తెలుగు సెల్యులాయిడ్ పై తమ ఆధిపత్యాన్ని చెలాయించి తెలుగు కళామతల్లి సిగలో మణిహారంగా నిలిచారు. అందుకే అభిమానుల నిత్య నామ స్మరణలో  ఈ ఇద్దరు అంతకు ముందే పెళ్లి అయిన వ్యక్తులని పెళ్లి ఎలా చేసుకున్నారనే చర్చ జరుగుతూనే ఉంటుంది.   కేవలం ఆకర్షణో లేక అనుకోని పరిణామాలో కాకుండా, వారి మనసులని  గాయపరిచిన గాఢమైన ప్రేమలే ఆ వైవాహిక నిర్ణయాలకు ప్రధాన కారణమయ్యాయని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తమిళ చలనచిత్ర పరిశ్రమలో తిరుగులేని నటుడిగా వెలుగొందుతున్న జెమినీ గణేశన్‌తో సావిత్రికి ఏర్పడిన పరిచయం కాలక్రమేణా గాఢమైన ప్రేమగా రూపాంతరం చెందింది. అప్పటికే వివాహితుడైన జెమినీ గణేశన్‌ను సావిత్రి చాలా గాఢంగా ప్రేమించింది. వారిద్దరి కెమిస్ట్రీ తెరపై ఎంతగా అద్భుతాలు సృష్టించిందో, నిజ జీవితంలోనూ వారి బంధం అలాగే కొనసాగింది. సమాజం యొక్క కట్టుబాట్లను, కుటుంబ సభ్యుల వ్యతిరేకతను సైతం లెక్కచేయకుండా జెమిని గణేష్ ని  సావిత్రి జీవిత భాగస్వామిగా స్వీకరించారు. 1952 నాటి కాలంలోనే ఇరువురి మనసులు కలవడంతో ఈ వివాహ బంధం ఏర్పడింది. అయితే, ఈ ప్రేమ ప్రయాణం సావిత్రి కెరీర్‌ను ఓ వెలుగు వెలిగించినప్పటికీ, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆమె తీవ్రమైన మానసిక సంఘర్షణను ఎదుర్కొనేలా చేసింది. జెమినీ గణేశన్‌తో ఉన్న అనుబంధం వల్ల కలిగిన మనస్తాపం, ఆ తర్వాత ఎదురైన ఆర్థిక ఇబ్బందులు ఆమెను మద్యానికి బానిసను చేశాయి. 1981 నాటికి వీరిద్దరూ పూర్తిగా విడిపోయారు. చివరికి 47 ఏళ్ల చిన్న వాయస్సులోనే, అనారోగ్య సమస్యలతో డిసెంబర్ 26, 1981న సావిత్రి తుదిశ్వాస విడిచారు. ప్రేమ కోసం సర్వస్వం త్యాగం చేసిన ఆ మహానటి జీవితం విషాదాంతం కావడం తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ తీరని లోటే. మరోవైపు, బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు తన అద్భుత అభినయంతో 'ది ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియన్ సినిమా'గా కీర్తించబడిన శ్రీదేవి జీవితంలోనూ ప్రేమ ప్రయాణం ఇలాంటిదే ఒక పెద్ద మలుపు తిరిగింది.శ్రీదేవిని  బోనీ కపూర్ మొట్టమొదటిసారిగా 1970ల చివరలో ఒక తమిళ చిత్రంలో చూసి మనసు పారేసుకున్నారు. అప్పటి నుంచి ఆమెపై ఉన్న ఏకపక్ష ప్రేమతో ఎలాగైనా ఆమెను తన చిత్రంలో నటింపజేయాలని ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. 'మిస్టర్ ఇండియా' సినిమా షూటింగ్ సమయంలో బోనీ కపూర్ ఆమెకు ఇచ్చిన భరోసా, చూపిన ప్రత్యేక శ్రద్ధ శ్రీదేవి మనసును గెలుచుకున్నాయి. ముఖ్యంగా శ్రీదేవి తల్లి మరణించిన సమయంలో మరియు ఆమె విదేశాల్లో షూటింగ్స్‌లో ఉన్నప్పుడు బోనీ కపూర్ ఆమెకు అండగా నిలిచి ఒక నిజమైన మిత్రుడిగా, ధైర్యంగా తోడుగా నిలిచారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం గాఢమైన ప్రేమకి దారితీసింది. ఇది కూడా చదవండి: హీరోయిన్ కి మంచి రోజులు వస్తాయా:గతమెంతో వైభవం!       అప్పట్లో బోనీ కపూర్ వివాహితుడైనప్పటికీ, శ్రీదేవితో ఆయనకున్న బంధం మీడియాలో పెద్ద దుమారమే రేపింది. ఎన్నో విమర్శలను, సంచలనాలను ఎదుర్కొంటూనే వీరు జూన్ 2, 1996 న షిర్డీలోని సాయిబాబా ఆలయంలో  రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కాలంలో జాన్వి కపూర్, ఖుషీ కపూర్‌లకు తల్లిగా మారి తన సంసార జీవితాన్ని ఎంతో సంతోషంగా గడిపారు. అయితే ఊహించని విధంగా ఫిబ్రవరి 2018లో దుబాయ్‌లో జరిగిన దురదృష్టకర సంఘటనలో శ్రీదేవి కన్నుమూయడం యావత్ సినీ ప్రపంచాన్ని శోఖసంద్రంలో ముంచెత్తింది. ఇలా సావిత్రి, శ్రీదేవి ఇద్దరూ కూడా ఆల్రెడీ పెళ్లి అయిన వ్యక్తిలనే తమ జీవితంలోకి ఆహ్వానించడానికి కారణం ప్రేమ.. అనురాగం, ఆరాధనా భావం. ఈ విశ్వంలో ఆ మూడింటిని మించిన పవర్ ఫుల్ వెపన్స్ లేవు.   Savithri And sridevi Second Marriage, Savithri second marriage, Sridevi love story, Gemini Ganesan Savithri, Boney Kapoor Sridevi wedding, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]   [Savithri And sridevi Second Marriage, Savithri second marriage, Sridevi love story, Gemini Ganesan Savithri, Boney Kapoor Sridevi wedding, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమాల్లో ‘నరసింహా’కు ఉండే ప్రత్యేకతే వేరు. 1999లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్‌ దగ్గర సంచలనం సృష్టించడమే కాదు.. రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్రను ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేదు. ఇన్నేళ్ల తర్వాత రీ-రిలీజ్‌లోనూ ఈ సినిమాకు మంచి స్పందన రావడంతో సీక్వెల్‌పై మరోసారి ఆసక్తి పెరిగింది. ‘నరసింహా 2’ కథపై గతంలోనే చర్చలు జరిగినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ వెల్లడించారు. మొదటి భాగంలో చనిపోయిన నీలాంబరి పునర్జన్మ ఎత్తి, నరసింహాపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించే కథాంశాన్ని ఆయన సిద్ధం చేశారట. ఈ ఆలోచనతో పాటు మరో కథా లైన్‌ను కూడా రజనీకాంత్‌కు వినిపించారట. అయితే, నరసింహా రీ-రిలీజ్‌ కి వచ్చిన అద్భుతమైన చూసిన తర్వాత సీక్వెల్‌ విషయంలో రజనీ ఆలోచన మారిందట. అప్పటి ప్రేక్షకులతో పాటు నేటి యువతను కూడా ఆకట్టుకునేలా కథ, స్క్రీన్‌ప్లే ఉండాలని సూచించారట. దీంతో స్క్రిప్ట్ పై కేఎస్‌ రవికుమార్‌ మరింత శ్రద్దగా వర్క్ చేస్తున్నారు. నిజానికి సీక్వెల్‌ అంటే పాత సినిమాలోని పాత్రలను మళ్లీ చూపించడమే కాదు.. మొదటి భాగానికి తగ్గ స్థాయిలో భావోద్వేగాలు, కథా బలం ఉండాలి. ‘నరసింహా’లో రజనీకాంత్‌-నీలాంబరి మధ్య పోరాటం ఎంత కీలకంగా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే రెండో భాగంలోనూ ఆ స్థాయి సంఘర్షణను ఎలా చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం 'జైలర్ 2'తో బాక్సాఫీస్ ను చేస్తున్న రజినీకాంత్.. ‘నరసింహా 2’తో ఇంతకుమించిన విధ్వంసం సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అయితే కొందరు ఫ్యాన్స్ మాత్రం క్లాసిక్ మూవీని టచ్ చేయొద్దని, అప్పటి మ్యాజిక్ చేయడం కష్టమని కోరుతున్నారు. మరి స్క్రిప్ట్ విన్నాక ఈ ప్రాజెక్ట్ విషయంలో సూపర్ స్టార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇది కూడా చదవండి: ప్రభాస్ కెరీర్‌లో టాప్ 10 సినిమాలు: నంబర్ 1 ఏదో తెలుసా.?       [Rajinikanth Narasimha 2 Update, Rajinikanth Padayappa 2 Update, Narasimha Neelambari, Rajinikanth New Movie, Rajinikanth, Narasimha 2, Padayappa 2, Neelambari, KS Ravikumar, Telugu Film News]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
 ఎమోషనల్ చీటింగ్.. తామే తప్పు చేసి, భాగస్వామిని మోసం చేసే వ్యక్తుల తెలివైన  మార్గమిది..! ఒక ఆరోగ్యకరమైన సంబంధానికి పునాది పరస్పర నమ్మకం, గౌరవం , నిజాయితీ. రెండు మనస్సులు కలిసి ప్రయాణించేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు, అభిప్రాయ భేదాలు రావడం చాలా సహజం. అయితే, కొన్ని సంబంధాలలో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. తప్పు ఒకరు చేస్తే, ఆ నిందను మరొకరిపైకి నెట్టేసి, ఎదుటివారిని తప్పుగా నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతుంటాయి. దీనినే మానసిక నిపుణులు ఎమోషనల్ మానిప్యులేషన్ లేదా ఎమోషనల్ చీటింగ్  అని పిలుస్తారు. భాగస్వామి తన స్వార్థం కోసం లేదా తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎదుటివారి ఎమోషన్స్ తో  ఆడుకుంటున్నప్పుడు, అది మీ మనశాంతిని, ఆత్మవిశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఇలాంటి ప్రవర్తనను ప్రేమ అనుకుని పొరబడటం వల్ల చాలామంది మానసికంగా నలిగిపోతున్నారు. భాగస్వామి చేసే తప్పులకు మిమ్మల్ని బాధ్యులను చేస్తూ, మిమ్మల్ని మానసిక గందరగోళంలోకి నెట్టే మోసగాళ్ల మార్గాలు , వారు ఉపయోగించే ప్రమాదకరమైన పద్దతులు ఉన్నాయి. వాటి  గురించి వివరంగా తెలుసుకుంటే.. విషయాన్ని పక్కదారి పట్టించడం.. ఎప్పుడైనా భాగస్వామి చేసిన పొరపాటును మీరు ఎత్తిచూపినప్పుడు, వారు ఆ పొరపాటు  గురించి సమాధానం చెప్పడానికి నిరాకరిస్తారు. నిజమైన విషయాన్ని పక్కన పెట్టి, సంభాషణను పూర్తిగా వేరే వైపు తిప్పుతారు. చివరకు అసలు సమస్య ఏంటో మర్చిపోయి, వారు బాధితుల్లా నటించడం మొదలుపెడతారు. మీరు లేవనెత్తిన తప్పును వదిలేసి, మీరు మాట్లాడే తీరును లేదా ఇతర చిన్న విషయాలను పెద్దది చేసి, మీరే వారిని వేధిస్తున్నట్లు క్రియేట్ చేస్తారు. నిందను ఎదుటివారిపైకి నెట్టడం , గిల్ట్ ఫీలింగ్ కలిగించడం.. ఎమోషనల్ మానిప్యులేటర్లు తమ తప్పును ఎప్పటికీ ఒప్పుకోరు. క్షమాపణలు చెప్పడానికి బదులుగా, మీకే మానసిక అసౌకర్యం లేదా తప్పు చేశాం అనే ఫీలింగ్  కలిగేలా ప్రవర్తిస్తారు. ఉదాహరణకు, మీ వల్ల వారు ఎంత బాధపడుతున్నారో, వారి మానసిక ప్రశాంతత ఎలా పాడైందో చెబుతూ మిమ్మల్ని గిల్ట్ త్రిప్‌లోకి నెడతారు. వారు చేసే తప్పులన్నింటికీ మీ ప్రవర్తనే కారణమని నమ్మించడానికి ప్రయత్నిస్తారు. దీంతో మీరు అసలు తప్పును వదిలేసి, వారిని సముదాయించే పనిలో పడిపోతారు. మీ ఆలోచనలనే అనుమానించేలా చేయడం.. దీనినే గ్యాస్‌లైటింగ్ అని అంటారు. వీరు తమ తప్పుల నుంచి తప్పించుకోవడానికి మీ జ్ఞాపకశక్తిని లేదా మీ అర్థం చేసుకునే సామర్థ్యాన్నే ప్రశ్నిస్తారు. అలాంటిదేమీ జరగలేదని, మీరు ఊహించుకుంటున్నారని, లేదా మీకు సరిగ్గా గుర్తులేదని పదే పదే చెబుతారు. దీంతో మీపై మీకే అనుమానం మొదలవుతుంది. నేను ఆలోచిస్తున్నది నిజమేనా లేదా నేను పొరబడుతున్నానా అనే గందరగోళంలోకి మీరు వెళ్ళిపోతారు. ఇది ఎదుటి వ్యక్తి మిమ్మల్ని పూర్తిగా తన అదుపులోకి తీసుకోవడానికి వాడే అత్యంత ప్రమాదకరమైన మార్గం. పాత విషయాలను మధ్యలోకి తీసుకురావడం.. ప్రస్తుతం జరుగుతున్న వివాదంలో తమ తప్పు స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు, వీరు వెంటనే గతాన్ని తవ్వుతారు. మీరు ఎప్పుడో గతంలో చేసిన చిన్న తప్పులను లేదా పొరపాట్లను గుర్తుచేస్తూ, నువ్వు కూడా ఆ రోజు ఇలాగే చేశావు కదా అని ఎదురుదాడి చేస్తారు. పాత విషయాలను మధ్యలోకి తీసుకురావడం వల్ల మీరు డిఫెన్సివ్ మోడ్‌లోకి వెళ్తారు. దీనివల్ల ప్రస్తుత తప్పు గురించి మాట్లాడటం ఆగిపోయి, పాత విషయాలపై చర్చ మొదలవుతుంది.  నకిలీ క్షమాపణలు.. ఒకవేళ వారు క్షమాపణలు చెప్పాల్సి వచ్చినా, అది ఎంతో నాటకీయంగా ఉంటుంది. మనస్ఫూర్తిగా తమ తప్పును అంగీకరించి  క్షమాపణ చెప్పరు.  గొడవను తొందరగా ముగించడానికో లేక మిమ్మల్ని నోరు మూయించడానికో నకిలీ క్షమాపణలు చెబుతారు. సారీ చెప్పేటప్పుడు కూడా, నీకు అంతగా అనిపిస్తే సారీ లేదా నేను చేసిన ప్రతిదీ తప్పేలే అనే వ్యాఖ్యలు జోడిస్తారు. ఇందులో నిజమైన పశ్చాత్తాపం ఉండదు. పైగా దెప్పిపొడుపు ఉంటుంది. మానసిక ఆరోగ్యానికే ప్రమాదం.. ఇలాంటి పరిస్థితులు సంబంధంలో ఎప్పుడూ  కొనసాగుతూ ఉంటే , అది మీ మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. క్రమంగా మీ ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. ప్రతి చిన్న విషయానికి మీరే బాధ్యులమనే భయం  స్థిరపడిపోతుంది. భాగస్వామి ప్రవర్తనలో ఈ ప్రమాదకరమైన సంకేతాలు కనిపిస్తే వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. సరిహద్దులను నిర్ణయించుకోవడం, స్పష్టంగా మాట్లాడటం , అవసరమైతే సంబంధం గురించి బాగా ఆలోచించుకోవడం లేదా నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.                                           *రూపశ్రీ.
 భార్యాభర్తల మధ్య ఎమోషనల్ గ్యాప్ పెరుగుతోందా..ఈ విషయాలు నిర్లక్ష్యం చేయకండి..! భార్యాభర్తల మధ్య బంధం కేవలం ఒకరికొకరు తోడుగా ఉండటం మాత్రమే కాదు, ఇద్దరి మధ్య ఉండే భావోద్వేగాల అనుబంధం కూడా చాలా ముఖ్యం. కొన్నిసార్లు దంపతులు ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ, వారి మధ్య మానసిక దూరం పెరుగుతూ వస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో లేదా మనసులోని భావాలను పంచుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయంలో భాగస్వామి మనల్ని పట్టించుకోవడం లేదనే భావన కలగడం సహజం. బంధంలో ఇలాంటి ఎమోషనల్ గ్యాప్ రావడం వల్ల ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగే అవకాశం ఉంటుంది.  ఈ విషయాన్ని ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుంటే.. వివాహం తర్వాత పెరిగే దూరం.. పెళ్లయిన కొత్తలో ఉన్న ఆప్యాయత, సంభాషణలు కాలక్రమేణా మరుగున పడిపోవడం చాలా జంటల్లో కనిపిస్తుంది. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండటం, మానసిక ఒత్తిడి లేదా ఇతర కారణాల వల్ల ఒకరికొకరు సమయం కేటాయించడం తగ్గిపోతుంది. అయితే, ఈ దూరం చిన్న చిన్న విషయాల నుంచి ప్రారంభమై పెద్ద సమస్యగా మారుతుంది. భాగస్వామి ప్రవర్తనలో వచ్చే మార్పులను సరిగ్గా గమనించకపోతే, అది మానసికంగా ఇద్దరినీ ఒంటరి చేసేస్తుంది. కాబట్టి సంబంధంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందో లేదో తెలుసుకోవడానికి కొన్ని కీలకమైన లక్షణాలను అర్థం చేసుకోవడం ముఖ్యం. రెస్పాండ్ కాకపోవడం.. మీరు చెప్పే విషయాలను లేదా మీ సమస్యలను భాగస్వామి గమనించకపోవడం లేదా వాటికి సరైన స్పందన ఇవ్వకపోవడం చాలా స్పష్టమైన సంకేతం. రోజులో జరిగిన విషయాలు లేదా  మనసులోని ఆందోళనలను పంచుకోవడానికి ప్రయత్నించినప్పుడు, వారు ఫోన్ చూస్తూ ఉండటం లేదా మీ మాటలను మధ్యలోనే ఆపేయడం చేస్తుంటే అక్కడ ఎమోషనల్ బాండింగ్  సన్నగిల్లుతోందని అర్థం చేసుకోవాలి. కేవలం వినడం మాత్రమే కాకుండా, మీ మాటలకు విలువ ఇవ్వకపోవడం వల్ల  అభద్రతాభావం పెరుగుతుంది. నిర్లక్ష్యం.. మీ ఫీలింగ్స్  లేదా మీ ఆవేదనను తేలికగా తీసుకోవడం లేదా చిన్నచూపు చూడటం కూడా ఎమోషనల్ గ్యాప్ పెరుగుతోందని చెప్పడానికి ఒక సంకేతం. మీకు ఏదైనా విషయంలో బాధ కలిగినప్పుడు, భాగస్వామి మిమ్మల్ని ఓదార్చాల్సింది పోయి మీరు అతిగా  ఆలోచిస్తున్నారని అనడం లేదా చిన్న విషయాలకే పెద్దవి చేస్తున్నారని అనడం సరికాదు. మీ ఫీలింగ్స్ కు  గౌరవం ఇవ్వకపోవడం వల్ల మీ మనసులోని మాటలను ఎవరితో పంచుకోవాలో తెలియని అయోమయం ఏర్పడుతుంది. ఇలాంటి ప్రవర్తన ఇద్దరి మధ్య ఎమోషనల్ గ్యాప్ ను  మరింత పెంచుతుంది. షేర్ చేసుకోకపోవడం..   భాగస్వామి తమ వ్యక్తిగత విషయాలు లేదా మనసులోని ఆలోచనలను మీతో పంచుకోవడం మానేయడం కూడా ఇద్దరి మధ్య ఎమోషనల్ గ్యాప్ పెరుగుతోంది అనడానికి సంకేతం. గతంలో ప్రతి చిన్న విషయాన్ని మీతో చెప్పే వారు, ఇప్పుడు తమ ప్లానింగ్స్, ఇబ్బందులు లేదా అనుభవాలను పూర్తిగా దాచడం ఒకవేళ అడిగినా కూడా   ఏదో ఒక సాకు  చెప్పి దాటవేయడం చేస్తుంటే అక్కడ దూరం పెరుగుతోందని గ్రహించాలి. ఎమోషన్స్ ను లేదా మనసులోని విషయాలను ఒకరికొకరు షేర్ చేసుకోలేని చోట బంధం కేవలం పేరుకే మిగులుతుంది. బంధం కోసం ప్రయత్నం.. బంధాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఎప్పుడూ ఒక  వైపు నుంచే జరగడం  అనేది కూడా భార్యాభర్తల మధ్య ఎమోషనల్ దూరం పెరుగుతోంది అనడానికి సంకేతం. మాట్లాడటం మొదలుపెట్టడం, కలిసి సమయం గడపడానికి ప్లాన్ చేయడం లేదా మనస్పర్ధలను సరిదిద్దడానికి ప్రయత్నించడం వంటి బాధ్యతలన్నీ  ఒక్కరి మీదే పడటం గమనించవచ్చు. భాగస్వామి తరపు నుంచి ఎలాంటి చొరవ లేకపోవడం వల్ల ఆ బంధం ఒకే వైపు నుంచి నడుస్తున్న అనుభూతి కలుగుతుంది. ఒంటరితనం.. భాగస్వామి పక్కనే ఉన్నప్పటికీ తీవ్రమైన ఒంటరితనం అనుభవించడం. ఇద్దరూ ఒకే గదిలో ఉన్నా, ఒకరినొకరు పలకరించుకోకుండా ఎవరి ప్రపంచంలో వారు ఉండటం భావోద్వేగ శూన్యతను సూచిస్తుంది. మీ మనసులోని సంతోషాన్ని లేదా బాధను పంచుకునే ముందు అవతల వ్యక్తి వింటారో లేదో అని ఆలోచించాల్సిన పరిస్థితి వస్తే, ఆ బంధంలో మార్పు అవసరమని అర్థం. పరిష్కారం ఎలా? ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం కంటే ప్రశాంతమైన వాతావరణంలో మాట్లాడుకోవడం చాలా ముఖ్యం. వారి ప్రవర్తన వల్ల మీకు కలుగుతున్న భావోద్వేగాలను నిరాశకు గురి కాకుండా, స్పష్టంగా వివరించాలి. అవతలి వ్యక్తి ఏవైనా ఇతర ఒత్తిళ్లలో ఉన్నారేమో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇద్దరూ కలిసి కూర్చుని మనసు విప్పి మాట్లాడితే చాలా వరకు ఈ దూరాన్ని తగ్గించుకోవచ్చు. ఒకవేళ పరిస్థితి అలాగే కొనసాగితే, నిపుణుల సహాయం తీసుకోవడం,  కౌన్సెలింగ్ తీసుకోవడం  ద్వారా సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది.                                                                                                                                                  *రూపశ్రీ.
 భార్యాభర్తల మధ్య ఎమోషనల్ గ్యాప్ పెరుగుతోందా..ఈ విషయాలు నిర్లక్ష్యం చేయకండి..! భార్యాభర్తల మధ్య బంధం కేవలం ఒకరికొకరు తోడుగా ఉండటం మాత్రమే కాదు, ఇద్దరి మధ్య ఉండే భావోద్వేగాల అనుబంధం కూడా చాలా ముఖ్యం. కొన్నిసార్లు దంపతులు ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ, వారి మధ్య మానసిక దూరం పెరుగుతూ వస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో లేదా మనసులోని భావాలను పంచుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయంలో భాగస్వామి మనల్ని పట్టించుకోవడం లేదనే భావన కలగడం సహజం. బంధంలో ఇలాంటి ఎమోషనల్ గ్యాప్ రావడం వల్ల ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగే అవకాశం ఉంటుంది.  ఈ విషయాన్ని ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుంటే.. వివాహం తర్వాత పెరిగే దూరం.. పెళ్లయిన కొత్తలో ఉన్న ఆప్యాయత, సంభాషణలు కాలక్రమేణా మరుగున పడిపోవడం చాలా జంటల్లో కనిపిస్తుంది. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండటం, మానసిక ఒత్తిడి లేదా ఇతర కారణాల వల్ల ఒకరికొకరు సమయం కేటాయించడం తగ్గిపోతుంది. అయితే, ఈ దూరం చిన్న చిన్న విషయాల నుంచి ప్రారంభమై పెద్ద సమస్యగా మారుతుంది. భాగస్వామి ప్రవర్తనలో వచ్చే మార్పులను సరిగ్గా గమనించకపోతే, అది మానసికంగా ఇద్దరినీ ఒంటరి చేసేస్తుంది. కాబట్టి సంబంధంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందో లేదో తెలుసుకోవడానికి కొన్ని కీలకమైన లక్షణాలను అర్థం చేసుకోవడం ముఖ్యం. రెస్పాండ్ కాకపోవడం.. మీరు చెప్పే విషయాలను లేదా మీ సమస్యలను భాగస్వామి గమనించకపోవడం లేదా వాటికి సరైన స్పందన ఇవ్వకపోవడం చాలా స్పష్టమైన సంకేతం. రోజులో జరిగిన విషయాలు లేదా  మనసులోని ఆందోళనలను పంచుకోవడానికి ప్రయత్నించినప్పుడు, వారు ఫోన్ చూస్తూ ఉండటం లేదా మీ మాటలను మధ్యలోనే ఆపేయడం చేస్తుంటే అక్కడ ఎమోషనల్ బాండింగ్  సన్నగిల్లుతోందని అర్థం చేసుకోవాలి. కేవలం వినడం మాత్రమే కాకుండా, మీ మాటలకు విలువ ఇవ్వకపోవడం వల్ల  అభద్రతాభావం పెరుగుతుంది. నిర్లక్ష్యం.. మీ ఫీలింగ్స్  లేదా మీ ఆవేదనను తేలికగా తీసుకోవడం లేదా చిన్నచూపు చూడటం కూడా ఎమోషనల్ గ్యాప్ పెరుగుతోందని చెప్పడానికి ఒక సంకేతం. మీకు ఏదైనా విషయంలో బాధ కలిగినప్పుడు, భాగస్వామి మిమ్మల్ని ఓదార్చాల్సింది పోయి మీరు అతిగా  ఆలోచిస్తున్నారని అనడం లేదా చిన్న విషయాలకే పెద్దవి చేస్తున్నారని అనడం సరికాదు. మీ ఫీలింగ్స్ కు  గౌరవం ఇవ్వకపోవడం వల్ల మీ మనసులోని మాటలను ఎవరితో పంచుకోవాలో తెలియని అయోమయం ఏర్పడుతుంది. ఇలాంటి ప్రవర్తన ఇద్దరి మధ్య ఎమోషనల్ గ్యాప్ ను  మరింత పెంచుతుంది. షేర్ చేసుకోకపోవడం..   భాగస్వామి తమ వ్యక్తిగత విషయాలు లేదా మనసులోని ఆలోచనలను మీతో పంచుకోవడం మానేయడం కూడా ఇద్దరి మధ్య ఎమోషనల్ గ్యాప్ పెరుగుతోంది అనడానికి సంకేతం. గతంలో ప్రతి చిన్న విషయాన్ని మీతో చెప్పే వారు, ఇప్పుడు తమ ప్లానింగ్స్, ఇబ్బందులు లేదా అనుభవాలను పూర్తిగా దాచడం ఒకవేళ అడిగినా కూడా   ఏదో ఒక సాకు  చెప్పి దాటవేయడం చేస్తుంటే అక్కడ దూరం పెరుగుతోందని గ్రహించాలి. ఎమోషన్స్ ను లేదా మనసులోని విషయాలను ఒకరికొకరు షేర్ చేసుకోలేని చోట బంధం కేవలం పేరుకే మిగులుతుంది. బంధం కోసం ప్రయత్నం.. బంధాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఎప్పుడూ ఒక  వైపు నుంచే జరగడం  అనేది కూడా భార్యాభర్తల మధ్య ఎమోషనల్ దూరం పెరుగుతోంది అనడానికి సంకేతం. మాట్లాడటం మొదలుపెట్టడం, కలిసి సమయం గడపడానికి ప్లాన్ చేయడం లేదా మనస్పర్ధలను సరిదిద్దడానికి ప్రయత్నించడం వంటి బాధ్యతలన్నీ  ఒక్కరి మీదే పడటం గమనించవచ్చు. భాగస్వామి తరపు నుంచి ఎలాంటి చొరవ లేకపోవడం వల్ల ఆ బంధం ఒకే వైపు నుంచి నడుస్తున్న అనుభూతి కలుగుతుంది. ఒంటరితనం.. భాగస్వామి పక్కనే ఉన్నప్పటికీ తీవ్రమైన ఒంటరితనం అనుభవించడం. ఇద్దరూ ఒకే గదిలో ఉన్నా, ఒకరినొకరు పలకరించుకోకుండా ఎవరి ప్రపంచంలో వారు ఉండటం భావోద్వేగ శూన్యతను సూచిస్తుంది. మీ మనసులోని సంతోషాన్ని లేదా బాధను పంచుకునే ముందు అవతల వ్యక్తి వింటారో లేదో అని ఆలోచించాల్సిన పరిస్థితి వస్తే, ఆ బంధంలో మార్పు అవసరమని అర్థం. పరిష్కారం ఎలా? ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం కంటే ప్రశాంతమైన వాతావరణంలో మాట్లాడుకోవడం చాలా ముఖ్యం. వారి ప్రవర్తన వల్ల మీకు కలుగుతున్న భావోద్వేగాలను నిరాశకు గురి కాకుండా, స్పష్టంగా వివరించాలి. అవతలి వ్యక్తి ఏవైనా ఇతర ఒత్తిళ్లలో ఉన్నారేమో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇద్దరూ కలిసి కూర్చుని మనసు విప్పి మాట్లాడితే చాలా వరకు ఈ దూరాన్ని తగ్గించుకోవచ్చు. ఒకవేళ పరిస్థితి అలాగే కొనసాగితే, నిపుణుల సహాయం తీసుకోవడం,  కౌన్సెలింగ్ తీసుకోవడం  ద్వారా సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది.                                                                                                                                                  *రూపశ్రీ.
ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో ధనియాల నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? రోజూ నీళ్లు తాగే విషయంలో మనం చేసే పొరపాట్లు ఏమిటి? భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగవచ్చా? నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఆయుర్వేదం నీటిని తాగే విధానం గురించి ఏం చెబుతోంది? ఇలాంటి సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. ఈ TeluguOne Health వీడియోలో సీనియర్ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ శిరీష నీటి ప్రాముఖ్యత, నీళ్లు తాగే సరైన పద్ధతులు, ఉదయం నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు, ధనియాల నీటి వినియోగం గురించి వివరిస్తున్నారు. అలాగే భోజనం చేసే సమయంలో నీళ్లు తాగడం మంచిదా కాదా, జీర్ణక్రియకు సంబంధించి ఉన్న అపోహలు ఎంతవరకు నిజం, ఆయుర్వేదంలో చెప్పే ఫాంట (Phanta) తయారీ విధానం వంటి ఆసక్తికరమైన విషయాలను వివరిస్తారు. మన శరీరానికి నీరు ఎంతో అవసరం. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం, పోషకాలు శరీరంలోని వివిధ భాగాలకు చేరడం, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లడం వంటి అనేక ముఖ్యమైన పనులకు నీరు సహాయపడుతుంది. అయితే నీటిని ఎప్పుడు తాగాలి, ఎంత తాగాలి, భోజనానికి ముందు లేదా తర్వాత తాగాలా అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి. ఈ విషయాలపై సరైన అవగాహన కలిగి ఉండటం ఆరోగ్యకరమైన జీవనశైలికి ఉపయోగపడుతుంది. ధనియాలను నీటిలో నానబెట్టి లేదా తగిన విధంగా తయారుచేసి తీసుకునే పద్ధతుల గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ధనియాల నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది? దానిని ఎలా తయారుచేసుకోవాలి? నీటిని తాగే విషయంలో పాటించాల్సిన పద్ధతులు ఏమిటి? అనే అంశాలపై డాక్టర్ శిరీష వివరణను తెలుసుకోండి. అలాగే ఆయుర్వేదంలో ఫాంట (Phanta) అని పిలిచే మూలికా పానీయాన్ని ఎలా తయారుచేస్తారు, దాని తయారీలో పాటించాల్సిన విధానం ఏమిటి అనే విషయాలను తెలుసుకోవచ్చు. జీర్ణక్రియకు సంబంధించిన అపోహలను తొలగించుకోవడానికి, రోజువారీ నీటి వినియోగంపై అవగాహన పెంచుకోవడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి, వయస్సు, శారీరక శ్రమను బట్టి నీటి అవసరాలు మారవచ్చు. కిడ్నీ లేదా గుండె సంబంధిత సమస్యల కారణంగా నీటి పరిమాణంపై పరిమితులు ఉన్నవారు వైద్యుల సూచనలను పాటించాలి. ధనియాల నీటిని ఏదైనా వ్యాధికి నిర్ధారిత చికిత్సగా భావించకూడదు. ధనియాల నీటిని తాగే పద్ధతి, నీటి ప్రాముఖ్యత, భోజన సమయంలో నీళ్లు తాగడం, జీర్ణక్రియపై అపోహలు, ఆయుర్వేద ఫాంట తయారీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి TeluguOne Health వీడియోను పూర్తిగా చూడండి.  
ఇయర్ బడ్స్ పెట్టుకుని రాత్రిళ్లు నిద్రపోయే అలవాటుందా.. ఈ నిజాలు తెలుసుకోండి..! ఈరోజుల్లో చాలామందికి రాత్రి పడుకునే ముందు ప్రశాంతంగా నిద్ర పట్టడం కోసం ఇయర్ బడ్స్ పెట్టుకుని పాటలు, భజనలు లేదా పాడ్‌కాస్ట్‌లు వినే అలవాటు ఉంటుంది. ఈ చిన్న అలవాటు త్వరగా నిద్రపోవడానికి సహాయపడుతుందని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాత్రి అంతా లేదా ఎక్కువ సమయం పాటు ఇయర్ బడ్స్ ధరించి పడుకోవడం వల్ల  చెవుల ఆరోగ్యానికి ఎంతో హానికరమని వైద్యులు చెబుతున్నారు. ఈ చిన్న అలవాటు వల్ల భవిష్యత్తులో చెవులకు సంబంధించి పెద్ద సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. రాత్రి సమయంలో ఇయర్ బడ్స్ పెట్టుకుని పడుకోవడం వల్ల మన చెవుల్లో రకరకాల ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా నిద్రలో అటు ఇటు తిరుగుతున్నప్పుడు లేదా  బోర్లా పడుకున్నప్పుడు దిండుకు ఇయర్ బడ్స్‌కు మధ్య పడే ఒత్తిడి కారణంగా చెవి భాగంలో తీవ్రమైన నొప్పి, చికాకు లేదా మంట పుట్టే అవకాశం ఉంటుంది. ఈ విధంగా రోజూ జరగడం వల్ల చెవి చుట్టూ ఉన్న సున్నితమైన చర్మం దెబ్బతింటుంది , నొప్పి మరింత పెరుగుతుంది. ఇయర్ బడ్స్ చెవి రంధ్రంలో బిగుతుగా ఉండటం వల్ల చెవి లోపలికి గాలి సరిగ్గా వెళ్లకుండా అడ్డుపడుతుంది. దీనివల్ల చెవిలో తేమ , చెమట పేరుకుపోయి బ్యాక్టీరియా పెరగడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇది చెవిలో ఇన్‌ఫెక్షన్లు రావడానికి ప్రధాన కారణం అవుతుంది. కొందరు ఇయర్ బడ్స్‌ను శుభ్రం చేయకుండా వాడటం లేదా ఇతరులతో షేర్ చేసుకోవడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. చెవుల్లో దురద, వాపు లేదా ఒక రకమైన ద్రవం కారడం వంటి లక్షణాలు కనిపిస్తే అది ఇన్‌ఫెక్షన్‌గా గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదించాలి. రాత్రి మొత్తం ఇయర్ బడ్స్ ద్వారా పెద్ద శబ్దాలతో మ్యూజిక్ వినడం వల్ల మన వినికిడి శక్తి క్రమంగా మందగించే ప్రమాదం ఉంది. ఎక్కువ గంటలు చెవులకు శబ్దం తగలడం వల్ల చెవిలోని నరాలు బలహీనపడతాయి. కొందరు తక్కువ సౌండ్ పెట్టుకుని   వింటున్నాము కదా అనుకుంటారు, కానీ రోజంతా లేదా రాత్రంతా చెవుల్లో ఆ పరికరాలు ఉంచుకోవడం వల్ల చెవి లోపల ఉండే సున్నితమైన భాగాలకు  నష్టం కలుగుతుంది. దీనివల్ల భవిష్యత్తులో వినికిడి సమస్యలు వచ్చే ముప్పు పెరుగుతుంది. మ్యూజిక్ వింటే ప్రశాంతంగా నిద్ర పడుతుందని అనుకుంటాం కానీ, రాత్రి అంతా పాటలు లేదా పాడ్‌కాస్ట్‌లు ప్లే అవుతూ ఉంటే  మెదడు పూర్తిగా విశ్రాంతి తీసుకోలేకపోతుంది. శబ్దాల కారణంగా మధ్యమధ్యలో నిద్రకు డిస్టర్బ్  కలుగుతుంది. దీనివల్ల ఉదయం లేచిన తర్వాత కూడా శరీరం అలసిపోయినట్లుగా , సుస్తీగా అనిపిస్తుంది. నిద్ర నాణ్యత దెబ్బతినడం వల్ల రోజంతా ఉత్సాహం లోపిస్తుంది. ఈ సమస్యలన్నింటి నుంచి సురక్షితంగా ఉండాలంటే కొన్ని చిన్న జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం... మీకు ఒకవేళ మ్యూజిక్ వింటూ నిద్రపోయే అలవాటు ఉంటే, పాటలు ఆటోమేటిక్‌గా ఆగిపోయేలా టైమర్ సెట్ చేసుకోవడం మంచిది. వీలైతే ఇయర్ బడ్స్‌కు బదులుగా తక్కువ సౌండ్‌తో రూమ్‌లో చిన్న స్పీకర్ ఉపయోగించవచ్చు.  ఇయర్ బడ్స్‌ను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి , అంతేకాదు  ఎవరితోనూ వాటిని షేర్ చేసుకోకూడదు. చెవుల్లో ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే వైద్య నిపుణుల సలహా తీసుకోవడం చాలా మంచిది.                                                                                                                                                *రూపశ్రీ.