Publish Date:Nov 10, 2012

ALSO ON TELUGUONE N E W S
  ప్ర‌భాస్ అభిమానుల నిరీక్ష‌ణ‌కు రెండు రోజుల్లో తెర‌ప‌డ‌నుంది. అత‌ను హీరోగా న‌టిస్తోన్న 20వ సినిమా టైటిల్ గురించీ, అందులో ప్ర‌భాస్ లుక్ గురించీ ఎన్నాళ్ల నుంచో ఫ్యాన్స్ క‌ళ్లు ప‌త్తికాయ‌లు చేసుకొని ఎదురు చూస్తున్నారు. "మీరంతా ఎదురుచూస్తున్న అనౌన్స్‌మెంట్‌! జూలై 10న ఉద‌యం 10 గంట‌ల‌కు ప్ర‌భాస్20 సినిమా టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్ వెల్ల‌డ‌వుతాయి" అని నిర్మాణ సంస్థ యువి క్రియేష‌న్స్ అధికారిక ట్విట్ట‌ర్ హ్యాండిల్ ఈ రోజు తెలిపింది. ప్ర‌భాస్ జోడీగా టాప్ హీరోయిన్ పూజా హెగ్డే తొలిసారి న‌టిస్తున్న ఈ మూవీని 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు, ఒక‌ప్ప‌టి దేశంలోని సినీ ప్రియుల ఆరాధ్య‌తార భాగ్య‌శ్రీ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. టి సిరీస్ అధినేత భూష‌ణ్‌కుమార్ స‌మ‌ర్పిస్తోన్న ఈ సినిమాని గోపీకృష్ణా మూవీస్‌, యువి క్రియేష‌న్స్ బ్యాన‌ర్ల‌పై వంశీకృష్ణారెడ్డి, ప్ర‌మోద్‌, ప్ర‌సీద ఉప్ప‌ల‌పాటి నిర్మిస్తున్నారు. స‌చిన్ ఖ‌డేక‌ర్‌, ప్రియ‌ద‌ర్శి, ముర‌ళీశ‌ర్మ‌, రిక్షా రాణి, కునాల్‌రాయ్ క‌పూర్ ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ధారులైన ఈ చిత్రానికి మ‌నోజ్ ప‌ర‌మ‌హంస సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తుండ‌గా, కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు ఎడిటింగ్ బాధ్య‌త‌ల‌నూ, ఆర్‌. ర‌వీంద‌ర్ ప్రొడ‌క్ష‌న్ డిజైనింగ్ బాధ్య‌త‌ల‌నూ నిర్వ‌హిస్తున్నారు. తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో టైటిల్‌ను, ఫ‌స్ట్‌లుక్‌నూ వెల్ల‌డిస్తామ‌ని నిర్మాత‌లు తెలిపారు. అయితే క‌న్న‌డ వెర్ష‌న్ గురించిన ప్ర‌స్తావ‌న లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికైతే 'రాధేశ్యామ్' అనే టైటిల్ ఖాయం చేసిన‌ట్లు కొద్ది రోజులుగా ఆన్‌లైన్‌లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే.  
'సరైనోడు' సక్సెస్ తరవాత మరోసారి అల్లు అర్జున్, ఆది పినిశెట్టి సిల్వర్ స్క్రీన్ మీద కనిపించనున్నారు. అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'పుష్ప'. ఇందులో పంచాయతీ సర్పంచ్ పాత్రలో ఆది పినిశెట్టి కనిపిస్తాడనీ, అతడు అల్లు అర్జున్ అన్న పాత్రలో నటిస్తున్నాడని సమాచారం. ఈ సినిమాలో హీరోకి ఇద్దరు సోదరులు ఉంటారు. అందులో ఆది పినిశెట్టి ఒకరు అన్నమాట. 'సరైనోడు'లో అల్లు అర్జున్‌కి విలన్‌గా ఆది పినిశెట్టి నటించాడు. నెగెటివ్ రోల్‌లో యాక్టింగ్ బాగా చేశాడు. అయితే, 'పుష్ప'లో అతడికి పాజిటివ్ రోల్ అని సమాచారం. ఇటు హీరో అల్లు అర్జున్, అటు దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో ఆది పినిశెట్టికి రెండో సినిమా ఇది. సుకుమార్ లాస్ట్ సినిమా 'రంగస్థలం'లో రామ్ చరణ్ అన్నయ్య పాత్రలో అతడు నటించిన విషయం గుర్తుండే ఉంటుంది.  మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న 'పుష్ప' షూటింగ్ కొన్ని నెలల క్రితం మొదలైంది. కాకపోతే కరోనా బ్రేక్ ఇచ్చింది. త్వరలో మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్.
రవితేజ డ్యూయల్ రోల్, డ్యూయల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ గతంలో చేశాడు. అయితే, డ్యూయల్ షేడ్స్‌ ఉన్న ఒక కొత్త క్యారెక్టరైజేషన్‌తో మాస్ మహారాజ్‌ను దర్శకుడు త్రినాథరావు నక్కిన, రచయిత ప్రసన్నకుమార్ బెజవాడ ఇంప్రెస్ చేశారని ఇన్‌సైడ్ వర్గాల టాక్.  రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. లవ్, ఫ్రెండ్ షిప్, రొమాన్స్, రివేంజ్, కామెడీ మేళవింపుతో 1980 నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ ఉంటుందని సమాచారం. ఇందులో రవితేజ డ్యూయల్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నాడట. అందులో ఓ షేడ్ బిజినెస్‌మేన్‌గా ఉంటుందని తెలిసింది. స్క్రీన్ మీద రవితేజ బిజినెస్‌మేన్‌గా కనిపించినంత సేపూ ఫుల్ ఫన్ ఉంటుందట. కామెడీతో పాటు కిర్రాక్ ఎమోషన్స్ కూడా సినిమాలో ఉన్నాయట.  గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న 'క్రాక్' కంప్లీట్ అయిన తరవాత ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందట. దీని తరవాత మలయాళ రీమేక్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' స్టార్ట్ అవుతుందని టాక్.
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె, 'సైరా నరసింహారెడ్డి', 'రంగస్థలం' సహా పలు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన సుష్మితా కొణిదెల ప్రొడక్షన్‌లోకి అడుగు పెడుతున్నారని తెలుగువన్ గతంలో చెప్పింది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. రీసెంట్‌గా ఒక వెబ్ సిరీస్‌కి క్లాప్ కొట్టారు.   జస్ట్, వెబ్ సిరీస్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసినట్టు సుష్మితా కొణిదెల తెలిపారు. నటీనటులు, దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించలేదు. క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో డిఫరెంట్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో ఈ సిరీస్ ఉండబోతోందని తెలుస్తోంది. నిర్మాతగా కొత్త ప్రయాణం ప్రారంభించిన సుష్మితకు మెగా వారసులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. అల్లు అరవింద్ 'ఆహా' ఓటీటీలో కీలక భాగస్వామిగా ఉన్నారు. సో... వెబ్ సిరీస్ మార్కెటింగ్ విషయంలో సుష్మితకు ఇబ్బందులు ఎదురు కాకపోవచ్చు. 'ఆహా'లో ఆ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి.
  సినిమా ఇండ‌స్ట్రీలో హిట్లు అందుకున్న హీరోలు, నిర్మాత‌లు త‌మ ఆనందాన్ని పంచుకోడానికి ఆ సినిమా ఎవ‌రివ‌ల్ల హిట్ట‌య్యిందో వారికి కానుక‌లు అంద‌జేయ‌డం ఎప్పుడూ కాక‌పోయినా అప్పుడ‌ప్పుడూ జ‌రుగుతుంటుంది. కొంత‌మంది ఫ్లాట్స్‌ను కానుక‌గా అందిస్తే, ఇంకొంత‌మంది ఖ‌రీదైన వాచ్‌లు, లైట‌ర్లు, ఆర్న‌మెంట్స్ కానుక‌లుగా ఇస్తుంటారు. ఖ‌రీదైన కార్ల‌ను గిఫ్టులుగా ఇచ్చేవాళ్లూ ఉన్నారు. అలా ఎవ‌రి నుంచి ఎవ‌రు కారును కానుక‌గా అందుకున్నారంటే... 1. 'శ్రీ‌మంతుడు' ఇచ్చిన కానుక‌ మ‌హేశ్ కెరీర్‌లో 'శ్రీ‌మంతుడు' సినిమాకు ప్ర‌త్యేక స్థానం ఉంది. కొర‌టాల శివ డైరెక్ట్ చేసిన ఆ సినిమాతో కెరీర్ ప‌రంగానూ శ్రీ‌మంతుడు అయ్యాడు మ‌హేశ్‌. అప్ప‌టికి అత‌ని సినిమాల్లోకెల్లా హ‌య్యెస్ట్ గ్రాస‌ర్ ఆ సినిమాయే. అందుకే ఆ కృత‌జ్ఞ‌త‌తో త‌న డైరెక్ట‌ర్ కొర‌టాల‌కు ఆడి 6 కారును కానుక‌గా ఇచ్చాడు. 2. నిర్మాత‌ల కొంగు బంగారం భారీ సినిమాల‌ను ప‌క్క‌న‌పెడితే చిన్న‌, మ‌ధ్య‌స్థాయి సినిమాల‌తోటే సూప‌ర్ హిట్లు అందించ‌డం డైరెక్ట‌ర్ మారుతి స్పెషాలిటీ. అదే త‌ర‌హాలో సాయిధ‌ర‌మ్ తేజ్‌, రాశీ ఖ‌న్నా జంట‌గా అత‌ను రూపొందించిన 'ప్ర‌తిరోజూ పండ‌గే' బ్లాక్‌బ‌స్ట‌ర్ అయ్యింది. ఆ ఆనందంలో మారుతికి నిర్మాత‌లు రేంజ్ రోవ‌ర్ వెలార్ కారును గిఫ్ట్‌గా ఇచ్చి మ‌రింత సంతోష‌పెట్టారు. 3. 'గీతాంజ‌లి'కి బిగ్ గిఫ్ట్‌ సినిమా విడుద‌ల కాక‌ముందే, దాని మీద న‌మ్మ‌కంతో హీరోయిన్‌కు కారును గిఫ్ట్‌గా ఇచ్చిన ఘ‌న‌త ఆ సినిమా నిర్మాత కోన వెంక‌ట్‌దే. ఆ సినిమా 'గీతాంజ‌లి' అయితే ఆ హీరోయిన్ అంజ‌లి. ఆ సినిమా విడుద‌ల‌కు ముందే అంజ‌లికి బీఎండ‌బ్బ్యు కారును కానుక‌గా అంద‌జేశాడు కోన వెంక‌ట్‌. 4. స్నేహ‌బంధానికి గుర్తు ప‌వ‌న్ క‌ల్యాణ్‌, త్రివిక్ర‌మ్ మ‌ధ్య బంధం గురించి ఇండ‌స్ట్రీలోని అంద‌రికీ తెలిసిందే. ఆ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన 'అత్తారింటికి దారేది' ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆ సినిమా వ‌చ్చిన కొంత కాలానికి త్రివిక్ర‌మ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అత‌నికి స్కోడా కారును ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రెజెంట్ చేశారు. 5. ద‌టీజ్ స‌ల్లూ భాయ్‌! తోటి న‌టుల‌కు, సాంకేతిక నిపుణుల‌కు త‌ర‌చూ బ‌హుమ‌తులు ఇవ్వ‌డంలో ముందుంటాడు స‌ల్మాన్ ఖాన్‌. ప్ర‌భుదేవా డైరెక్ష‌న్‌లో ఆయ‌న చేసిన 'ద‌బాంగ్ 3' సినిమాలో ఈగ పేమ్ సుదీప్ విల‌న్‌గా న‌టించాడు. సినిమా విడుద‌లైన కొన్ని రోజుల త‌ర్వాత కొత్త బీఎండ‌బ్ల్యూ ఎం5 కారులో బెంగ‌ళూరులోని సుదీప్ ఇంటికి వెళ్లి, ఆ కారును బ‌హుమ‌తిగా ఇచ్చి వ‌చ్చాడు. 6. 'దేవి'తో వ‌చ్చిన సంబంరం ప్ర‌తిభావంతుడైన డైరెక్ట‌ర్‌గా పేరుపొందిన ఎ.ఎల్‌. విజ‌య్ కొంత కాలం క్రితం కెరీర్‌లో బ్యాడ్ ఫేజ్‌ను ఎదుర్కొన్నాడు. ప్ర‌భుదేవాతో చేసిన 'దేవి' పెద్ద హిట్ట‌వ‌డంతో ఆనందంలో ఉన్న అత‌డిని నిర్మాత గ‌ణేశ్‌తో క‌లిసి ఆడి కారును కానుక‌గా ఇచ్చి మ‌రింత ఆనందాన్నిచ్చాడు ప్ర‌భుదేవా. 7. సూర్య అంటే అంతే! న‌య‌న‌తార ప్రియుడు విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ స్టార్ యాక్ట‌ర్ సూర్య ఓ సినిమా చేశాడు. అది తెలుగులో 'గ్యాంగ్' పేరుతో రిలీజ‌య్యింది. తెలుగులో ఆడ‌క‌పోయినా త‌మిళంలో ఆ సినిమా బాగానే ఆడింది. యంగ్ డైరెక్ట‌ర్‌ను ఎంక‌రేజ్ చెయ్యాల‌నే ఉద్దేశంతో ట‌యోటా ఇన్నోవా క్రిస్టా కారును విఘ్నేష్‌కు గిఫ్ట్‌గా ఇచ్చాడు సూర్య‌.
కొంతమందికి ఎప్పుడూ ఏదో ఒక దెబ్బ తగులుతూ ఉంటుంది! ఒంటి మీద ఎప్పుడూ ఏదో ఒక గాయం కనిపిస్తూనే ఉంటుంది. వాళ్లని చూసి పాపం దురదృష్టవంతులు అని మిగతావారు జాలిపడుతూ ఉంటారు. కానీ తరచూ ఏదో ఒక ప్రమాదానికి లోనవ్వడానికీ మన వ్యక్తిత్వానికీ సంబంధం ఉండవచ్చని ఊహిస్తున్నారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. ఇలాంటి మనస్తత్వాన్ని ‘Accident Prone Psychology’ అంటున్నారు. అదేమిటో తెలుసుకుంటే మనకీ కాస్త ఉపయోగపడుతుందేమో...     ఓ ఆలోచన! తరచూ కొంతమందే ఎందుకు దెబ్బలు తగిలించుకుంటారన్న అనుమానం 19వ శతాబ్ది మొదటిలోనే వచ్చింది. దీని మీద మరిన్ని పరిశోధనలు చేసిన గ్రీన్‌వుడ్ వంటి నిపుణులు మన ఆలోచనా విధానానికీ, ప్రమాదాలకి సంబంధం ఉండే అవకాశం ఉందని తేల్చారు. ఆ తరువాత వచ్చిన ఎన్నో పరిశోధనల్లో ఓ 20 శాతం మంది వ్యక్తులే అధికశాతం ప్రమాదాలకి కారణం అవుతూ ఉంటారనీ... మొత్తంగా మన చుట్టూ జరిగే ప్రమాదాలలో దాదాపు 75 శాతం ప్రమాదాలు మానవ తప్పిదం వల్లే ఏర్పడతాయని చెబుతూ వస్తున్నాయి. ఈ పరిశోధనల శాస్త్రీయతని చాలామంది కొట్టిపారేసినా, వీటిలో స్పృశించిన చాలా అంశాలు చాలా తార్కికమైనవే! అందుకనే కొన్ని భీమా కంపెనీలు ప్రమాదభీమాను చెల్లించేటప్పుడు, ఉత్పాదక సంస్థలు తమ ఉద్యోగులను హెచ్చరించేందుకూ ఈ పరిశోధనలు ఉపయోగపడుతున్నాయి.     ప్రమాదాన్ని ఆశించే వ్యక్తిత్వం ఆత్మవిశ్వాసం మరీ ఎక్కువగా ఉన్నారు, దూకుడుగా ఉండేవారు, నిరంతరం కోపంతో రగిలిపోయేవారు... పోయి పోయి ఏదో ఒక ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారని తేలింది. మానసిక ఒత్తిడిలో ఉన్నవారు కూడా ప్రమాదాలకి త్వరగా లోనవుతారని చాలా పరిశోధనలు వెల్లడించాయి. ఏదన్నా కుటుంబంలో ఒకరి తరువాత ఒకరు ప్రమాదానికి లోనవడం మనం గమనిస్తూ ఉంటాము. ఆ కుటుంబానికి ఏదో శాపం తగిలిందనో, వారి గ్రహస్థితి బాగోలేదనో అనుకుంటాము. నిజానికి ఇలా కుటుంబంలో ఎవరన్నా ఒకరు తీవ్ర ప్రమాదానికి లోనైతే, ఆ ప్రభావం ఇతరుల మనసు మీద కూడా పడుతుందనీ... ఆ ఒత్తిడిలో మిగతా సభ్యులు కూడా ప్రమాదానికి లోనయ్యే అవకాశం 20 శాతం ఉంటుందనీ ఓ పరిశోధన తేల్చింది. ఎవరైతే ఇతరుల సలహాలను, సహాయాన్నీ స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటారో... వారు త్వరగా ప్రమాదాలకు లోనుకారని తేలింది. అహంకారం లేకుండా, తొందరపడకుండా ఉండేవారికి ప్రమాదాలు కూడా ఆమడదూరంలో ఉంటాయని 2001లో జరిగిన ఒక పరిశోధన రుజువు చేసింది. అంటే నిదానమే ప్రధానం, నోరు మంచిదైతే ఊరు మంచిది లాంటి సామెతలు యాంత్రిక జీవితానికి కూడా వర్తిస్తాయన్నమాట.     ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా తొందరపాటు, దూకుడు, ద్వేషం, అహంకారం... మనిషి విచక్షణను దెబ్బతీస్తాయి. తన మీద తనకి ఉండాల్సిన నియంత్రణను ప్రభావితం చేస్తాయి. దాంతో ఒక అనర్థం జరగడం సహజమే! కానీ ఇలాంటివారు కేవలం తమకి మాత్రమే ప్రమాదాన్ని తెచ్చుకుంటే ఫర్వాలేదు. అలా కాకుండా ఈ ‘Accident Prone Psychology’ ఉన్నవారు ఏ విమానాన్నో నడుపుతుంటే! అందుకే ఈ తరహా వ్యక్తిత్వం గురించి నానాటికీ ప్రచారం పెరుగుతోంది. మీది ప్రమాదాన్ని కొని తెచ్చుకునే వ్యక్తిత్వమేమో గమనించుకోండి అంటూ కొన్ని వెబ్‌సైట్లు పరీక్షలు పెడుతున్నాయి. మున్ముందు ఉద్యోగులకు కూడా ఇలాంటి పరీక్షలను నిర్వహించి విధుల్లోకి తీసుకునే పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు!   - నిర్జర.
ఒక కుర్రవాడికి కేన్సర్‌ చివరి దశలో ఉందని తేలింది. ఆ విషయం తెలిసినప్పటి నుంచీ అతనికి ఈ ప్రపంచం ఒక దుఃఖసాగరంగా మారిపోయింది. ఎటు చూసినా, ఏది పట్టుకున్నా, ఎవరితో మాట్లాడినా తన వ్యాధే గుర్తుకు వచ్చేది. అందుకనే నిశ్శబ్దంగా తనలో తాను కుమిలిపోతూ తన గదిలో ఒంటరిగా చివరి రోజులను వెళ్లదీస్తూ ఉండేవాడు. ఒకసారి ఎందుకనో కుర్రవాడికి అలా వీధి చివరిదాకా వెళ్లి రావాలని అనిపించింది. చాలాకాలం తరువాత కుర్రవాడు వీధిలోకి అడుగుపెట్టడం చూసి అతని తల్లికి కూడా సంతోషం వేసింది. ఊరికనే అలా నాలుగడుగులు వేసి తిరిగి ఇంటికి వెళ్లిపోవాలనుకున్నాడు కుర్రవాడు. కానీ ఇంతలో వీధి చివర కొత్తగా పెట్టిన సీడీల షాప్ చూసేసరికి అందులోకి అడుగుపెట్టాలనిపించింది. కుర్రవాడు సీడీల షాప్‌లోకి అడుగుపెట్టాడో లేదో అక్కడ కౌంటర్‌ దగ్గర ఉన్న అందమైన అమ్మాయిని చూసి మనసు చెదిరిపోయింది. ఆ అమ్మాయిని చూడటం కోసం అవసరం లేకపోయినా ప్రతిరోజూ ఆ షాపులోకి వెళ్లి ఏదో ఒక సీడీని కొనుక్కునేవాడు కుర్రవాడు. ఆ సీడీని భద్రంగా ఓ కవర్లో పెట్టి, చిరునవ్వుతో అతనికి అందించేది అమ్మాయి. ఆ అమ్మాయితో ఓసారి సరదాగా అలా షికారుకి వెళ్తే ఎంత బాగుండో అనుకునేవాడు కుర్రవాడు. కానీ తీరా కాదంటే ఆ బాధని తట్టుకునే స్థితిలో అతని మనసు లేదు. అందుకనే కనీసం ఒక్క పది నిమిషాలైనా ఆమెని చూస్తూ గడపడం కోసం రోజూ షాపుకి వెళ్లేవాడు. కానీ అలా ఎన్నాళ్లని వెళ్తాడు. నెల తిరక్కుండానే ఆ కుర్రవాడిని క్యాన్సర్‌ కబళించివేసింది.    కుర్రవాడి చావుకి తల్లి గుండెలు పగిలేలా ఏడ్చింది. ఎలాగొలా బంధువుల సాయంతో అతని అంత్యక్రియలు పూర్తిచేసింది. అంత్యక్రియలు పూర్తయ్యాక కూడా అతని జ్ఞాపకాలని వదలలేకపోయింది తల్లి. కాసేపు అతని గదిలో కూర్చునైనా సేదతీరుదామనుకుంటూ, అతని గదిలోకి అడుగుపెట్టింది. తల్లి గదిలోకి అడుగుపెట్టేసరికి ఒక మూల గుట్టగా పేర్చి ఉన్న సీడీలు కనిపించాయి. కొన్నవి కొన్నట్లు ఆ సీడీలు అలాగే ఉన్నాయి. కనీసం వాటిని కవర్లోంచి కూడా తీయలేదు కుర్రవాడు. అతని అవసరం సీడీలు కాదు కదా! అందులో ఒక కవర్‌ని తెరిచి చూసింది తల్లి. అంతే! కవర్లో ఉన్నదాన్ని చూసి ఆమె గుండె చెదిరిపోయింది. ‘మీ నవ్వు చాలా బాగుంటుంది. ఒకసారి మీతో కాఫీ తాగాలనుంది’ అన్న చీటీ సీడీతో పాటే ఆ కవర్లో ఉంచింది ఆ అమ్మాయి. రెండో కవరు, మూడో కవరు, మరో కవరు, ఇంకో కవరు.... అన్నింటిలోనూ ఇలాంటి చీటీలే ఉన్నాయి. ఆ కవర్లని కుర్రవాడు ఒక్కసారన్నా తెరిచి చూస్తే అతని చివరి రోజులు ఎంత అందంగా గడిచేవో కదా! పోనీ తన మనసులో ఉన్న మాటనన్నా అతను చెప్పగలిగితే ఎంత బాగుండేదో! మనలో చాలామంది ఆ కుర్రవాడిలాగే ప్రవర్తిస్తుంటాం. మనకి అర్హత లేదనో, సాధ్యం కాదనో... మన లక్ష్యాలని మనసులోనే దాచేసుకుంటాం. దక్కదేమో అన్న భయంతో ఉన్న కొద్ది రోజులనీ భారంగా గడిపేస్తుంటాం. వెనక్కి తిరిగి చూసుకునే సరికి కాలం కాస్తా కరిగిపోతుంది.
  ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలసి వుండటానికి ప్రేమ ఎంతో ముఖ్యమని అందరికీ తెలిసిందే. ఏరికోరి పెళ్ళిని ప్రేమతో ముడివేసుకున్న వాళ్ళు కూడా ఒకోసారి పెళ్ళి తర్వాత ఆ ప్రేమ కోసం వెతుకులాడటం చూస్తుంటాం... ఎందుకని? ఇద్దరు వ్యక్తులు కలసి బతకడంలో ఎక్కడో ఆ ప్రేమని జారవిడుచుకుంటారు. అందుకు కారణం నువ్వంటే నువ్వని వాదించుకుంటారు. మార్పు ఎదుటి వ్యక్తిలో రావాలని ప్రగాఢంగా నమ్ముతారు. ఖాళీ మనసులతో, నిర్జీవంగా మారిన బంధంతో, సర్దుకోలేక అసంతృప్తితో నలిగిపోతారు. మరి దీనికి పరిష్కరం లేదా అంటే... సమాధానం ‘ఉందనే’ చెప్పాలి. భార్యాభర్తల మధ్య ‘ప్రేమ’ ఎప్పటికీ తాజాగా నిలవాలంటే అందుకు నిపుణులు చేస్తున్న కొన్ని సూచనలు వినండి..  https://www.youtube.com/watch?v=d9D5pVYSowk&t=2s  
అచ్చెన్నాయుడు కేసులో ఏసీబీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనకు ప్రయివేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని అచ్చెన్న దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు వెంటనే ఆయనను ప్రయివేట్ హాస్పిటల్ లో చేర్చి చికిత్స అందించాలని ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలపై ఏసీబీ తరపు లాయర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాదించారు. అచ్చెన్నాయుడును ఏ ఆస్పత్రికి తరలించాలన్నది గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌ నిర్ణయించాలని లాయర్ వాదించారు. అయితే ప్రభుత్వం తరుఫు న్యాయవాది వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అచ్చెన్నాయుడును గుంటూరు లోని రమేష్‌ ఆస్పత్రికి తరలించనున్నట్లుగా తెలుస్తోంది. ఏసీబీ అరెస్ట్ కు ఒక రోజు ముందు అచ్చెన్నాయుడు కు పైల్స్ ఆపరేషన్ జరగడంతో జడ్జ్ ముందు హాజరు పరిచి ఆయనను గుంటూరు జీజీహెచ్ లో చేర్చి చికిత్స అందించారు. అయితే జూలై 1న గుంటూరు ప్రభుత్వాస్పత్రి నుంచి పూర్తిగా కోలుకోకుండానే డిశ్చార్జి చేసారు. దీంతో ఆయనను ఏసీబీ అధికారులు నేరుగా విజయవాడ సబ్‌జైలుకు తరలించారు. అయితే ప్రభుత్వం ఒత్తిడి మేరకే ఆయన్ను బలవంతంగా డిశ్చార్జి చేశారని అపుడే టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే అచ్చెన్నాయుడు హైకోర్టును ఆశ్రయించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కరోనా కేసులు మొదలైనప్పటినుండి వైరస్ కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తల పై తరచుగా మీడియా సమావేశాలు నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేసిన సంగతి తెలిసిందే. ఐతే కొద్ది రోజుల క్రితం అయన కార్యాలయం ఐన ప్రగతి భవన్ లో 30 కరోనా పాజిటివ్ కేసులు తేలాయి. ఇందులో కేసీఆర్ సెక్యూరిటీ సిబ్బందికి కూడా కరోనా సోకినట్లు వార్తలు వచ్చాయి. ఆ తరువాత అయన అటు మీడియా సమావేశాల్లో కానీ లేదా అధికారుల తో సమీక్షలు కానీ నిర్వహించినట్లుగా పెద్దగా సమాచారం లేదు. దీనికి తోడు ముఖ్యమంత్రి ఫామ్‌హౌస్‌కి షిఫ్ట్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలను ఫామ్‌హౌస్‌కి రావద్దన్నారని ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా అక్కడి నుంచే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాలన సాగించేందుకు కావలసిన ఏర్పాట్లు కూడా జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. ఐతే ఇపుడు కేసీఆర్ ఆరోగ్యం పై స్పష్టత కోరుతూ హైకోర్టు లో ఒక పిటిషన్ దాఖలైంది. నవీన్ అలియాస్ తీన్ మార్ మల్లన్న ఈ పిటిషన్ దాఖలు చేసారు. ఆ పిటిషన్ లో ముఖ్యమంత్రి ఫామ్‌హౌస్‌కి వెళ్లినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని.. సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై రాష్ట్ర ప్రజలకు వివరాలు తెలియాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో లేదా అందుబాటులో లేరన్న సాకు తో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు సక్రమంగా పనిచేయట్లేదని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్యం ఎలా ఉందో అని రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారని పిటిషనర్ తెలిపారు. గత నెల 28న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి రోజు కేసీఆర్ చివరిసారిగా మీడియా ముందుకు వచ్చారని ఆ పిటిషన్‌లో తెలిపారు. ఐతే ఈ పిటిషన్ పై హైకోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
27 ఎకరాల్లో 20శాతం స్థలంలోనే కొత్త సచివాలయం.. ఆరు అంతస్తుత్లో దీర్ఘ చతురస్రారాకంలో నిర్మాణం.. రెండు హెలిప్యాడ్స్, విశాలమైన పార్కింగ్ సదుపాయాలు.. రాష్ట్ర అధికార పుష్పం తంగేడు ఆకారంలో ఫౌంటెన్లు.. ఫ్రాన్స్ లోని  ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ నమూనాలో.. డిజైన్ చేసిన ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్‌.. ఈ నెలాఖరులోగా పనులు ప్రారంభం.. తెలంగాణ కొత్త సచివాలయం అత్యాధునిక హంగులతో నిర్మించడానికి ప్రభుత్వం సిద్దమైంది.  పాత సచివాలయం ఉన్న 27ఎకరాల స్థలంలో కేవలం 20శాతం మాత్రమే భవననిర్మాణానికి వినియోగించనుంది. మిగతా స్థలంలో రెండు హెలిప్యాడ్స్, విశాలమైన పార్కింగ్ సదుపాయలు, పార్క్ లు, ఫౌంటెన్లు ఏర్పాటు చేసేలా డిజైన్ చేశారు.  ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీర్ఘ చతురస్రాకారంలో ఆరు అంతస్తులతో కొత్త భవనాన్ని 500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాస్తు దోషం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ల్యాండ్ స్కేప్‌లు, రాష్ట్ర అధికార పుష్పమైన తంగేడు పువ్వు ఆకారంలో ఫౌంటెన్లు, ఒకేసారి 800 కార్లు పార్కు చేసేలా విశాలమైన పార్కింగ్ సదుపాయాలు కల్పిస్తారు. ఒకేసారి రెండు హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఫ్రాన్స్‌లోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ భవనం స్ఫూర్తితో డిజైన్ నమూనాను ముంబైకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్‌ రూపొందించారు. కొత్త భవనం నమూనాను ఖరారు చేశారు. అయితే దక్కన్ వాస్తురీతుల సమ్మిళితం ఈ భవనం డిజైన్ లో అగుపిస్తుంది. ప్రధానంగా భవనస్థంభాలు కాకతీయ వాస్తురీతులకు దగ్గరగా ఉండటంతో పాటు గవాక్షాల్లో దక్కన్ రీతులు గోచరిస్తున్నాయి. ఈ నెలాఖరులో పనులు ప్రారంభించి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
శరీరానికి శక్తిని ఇచ్చే ఆహారం.. రోజువారి ఆహారంలో ఇవి ఉన్నాయా.. ప్రతి రోజూ మన ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన పదార్థాలు కొన్ని ఉంటాయి. వాటిలో ముఖ్యంగా క్యారెట్, బచ్చలి, తులసి, పాలకూర, నిమ్మకాయ, కోడిగుడ్లు మొదలైనవి. - ప్రతి ఇంట్లో తులసి తప్పనిసరిగా ఉండాలని మన పెద్దలు అంటారు పూజించడానికి కాదు ఆరోగ్యానికి తులసి ఆకులు ఎంతో మంచివి. రోజూ నాలుగు తులసి ఆకులు నమలడం వలన శరీరంలోని సూక్ష్మక్రిములు చనిపోతాయి ఎన్నో వ్యాధి కారకాలను తులసి నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ రోజు ఉదయాన్నే తులసి టీ తాగడం వల్ల కూడా శరీరానికి కావలసిన శక్తి వస్తుంది. - మీరు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే రోజు ఉదయాన్నే మీ రోజుని గ్రీన్ టీతో ప్రారంభించండి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లెవనాయిడ్స్  మీలో రోగ నిరోధక శక్తి పెంచడానికి ఎంతో సహాయపడుతుంది గ్రీన్ టీ తాగడం వలన శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వు కరగడం కాకుండా శరీరానికి కొత్త శక్తిని ఇస్తుంది.  - మీరు తీసుకునే ఆహారంలో ఆకుకూరలు తప్పనిసరిగా ఉండేలా చూడాలి. వీటిలో ముఖ్యంగా బచ్చలి, పాలకూర. రోజూ ఆహారంలో ఆకుకూరలు తీసుకోవడం వలన శరీరానికి కావలసిన పోషకాలూ అందుతాయి. ఆకుకూరల్లో బచ్చలి కూరది విశిష్ట స్థానం. ఇందులో విటమిన్ సి తోపాటు బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెంచడానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది. - పాలకూర విటమిన్ సి ,బి 6 తో పాటు విటమిన్ కె ఇందులో అధికంగా ఉంటుంది క్యారెట్ ప్రతిరోజు అరకప్పు తాజా క్యారెట్ జ్యూస్ తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇందులో ఉండే బీటా కెరోటిన్ విటమిన్ బి 6 యాంటీఆక్సిడెంట్లు ఉత్తేజపరుస్తాయి క్యారెట్ టమాటతో కలిపి తాగితే క్యాన్సర్ ను నివారించవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. - ప్రతిరోజూ ఒక కప్పు పెరుగు తీసుకోవడం పెరుగులో అనేక పోషక విలువలు ఉన్నాయి. జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేసే పెరుగును రాత్రి సమయాల్లో కాకుండా పగటి పూట అన్నంలో తీసుకోవడం మంచిది. వ్యాధినిరోధక శక్తిని పెంచే పెరుగు తీసుకోవడం ద్వారా ఎముకలు, దంతాలు పటిష్టమవుతాయి. క్యాల్షియం ఎక్కువగా ఉండే ఈ పెరుగు రక్తపోటును నియంత్రిస్తుంది. -  ప్రతిరోజూ గుడ్డు తీసుకోవడం మరిచిపోవద్దు.గుడ్డు లోని ప్రోటీన్, విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి రోజూ ఒక కోడి గుడ్డు తినడం ద్వారా శరీరానికి కావలసిన ప్రొటీన్లు, పోషకాలు అందుతాయి. - శరీరం కోల్పోయిన యాంటీ ఆక్సిడెంట్లు తిరిగి ఏర్పడ్డానికి జింక్ బాగా తోడ్పడుతుంది శరీరానికి కావాల్సిన జింక్ ఎక్కువగా కోడిగుడ్డు మాంసంతో పాటు సీఫుడ్ లో లభిస్తుంది వారానికి రెండుసార్లు తీసుకోవడం వలన శరీరానికి అవసరమైన జింక్ విటమిన్-డి లభిస్తాయి వీటివలన శరీరం యొక్క రోగనిరోధక శక్తి తిరిగి ఏర్పడుతుంది. - ఎర్ర బియ్యం లోనూ అధిక యాంటీఆక్సిడెంట్స్ కంటెంట్ ఉంది రోగనిరోధకశక్తిని పెంచడానికి పళ్ళు కూరగాయలు మసాలా దినుసులతో పాటు ఎర్ర బియ్యం కూడా ఎంతో ఉపయోగపడతాయి.‌ వీటన్నింటితో పాటు ప్రతిరోజు మంచినీళ్లు ఎక్కువగా తాగడం ఎంతో అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.
మనం నిత్యం తీసుకునే ఆహారంలో సుగంధద్రవ్యాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా మహామ్మారి విజృంభిస్తున్న నేపథ్యంతో మరోసారి మన సుగంధద్రవ్యాలలోని ఔషధ విలువల గురించి చర్చ జరుగుతుంది. తక్కువ మోతాదులో వాడే వీటి వల్ల మనం తీసుకునే ఆహారానికి కమ్మని రుచి వస్తుంది. వీటిని రుచికోసమే వాడతామా అంటే కాదనే చెప్పాలి. అంతకుమించిన  వీటిలో ఉన్నది ఎంటో తెలుసుకుందాం.. శరీరంలో రక్తకణాలు ఆక్సిజన్ ను గ్రహిస్తాయి. ఆరోగ్యంగా ఉండాలన్నా.. వ్యాధులకు ఎదుర్కోవాలన్నా ఆక్సిజన్ తగినంతగా శరీరకణాలను అందాలి. అప్పుడే మనలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మనం తీసుకునే సుగంధ ద్రవ్యాలకు రక్తకణాలు ఎక్కువ ఆక్సిజన్ ను గ్రహించేలా చేయగలిగే శక్తి ఉంది. దీన్నే ఓఆర్ఎసి( ఆక్సిజెన్ రాడికల్ అబ్సోర్బెన్స్ కెపాసిటీ) అని పిలుస్తారు. మనం రోజూ వాడే పసుపు, తులసి, అల్లం మొదలైన వాటిలో పదిరెట్లు ఓఆర్ఎసి ఉంటుంది. అంతేకాదు ప్రకృతి సిద్దంగా లభించే పండ్లు, కూరగాయలు, గింజలు, మూలికలు ఆక్సిజెన్ గ్రహించే శక్తిని పెంచుతాయి. కొన్ని సుగంధ ద్రవ్యాలలోని ORAC .... లవంగం: 314,446 ORAC దాల్చినచెక్క: 267,537 ORAC పసుపు: 102,700 ORAC జీలకర్ర: 76,800 ORAC తులసి: 67,553 ORAC అల్లం: 28,811 ORAC జాజికాయ : 69,640 ORAC నల్ల మిరియాలు : 34, 053 ORAC కోవిడ్ 19 వైరస్  నుంచి రక్షణ పొందాలంటే మన శరీరంలోని రోగనిరోధక శక్తినిపెంచుకోవడమే ఏకైకమార్గం. ఓఆర్ఎసి ఎక్కువగా ఉంటే ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరా రక్షణ యంత్రాంగానికి కావల్సిన సూక్ష్మపోషకాలైన ఐరన్, జింక్, మెగ్నిషియం, విటమిన్ సి, విటమిన్ డి, ఒమేగా3 వంటి వాటిని శరీరం గ్రహించగలుగుతుంది. మన ఆయుర్వేదంలోనూ వీటికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆధునిక యుగంలోనూ మందులు లేని ఎన్నో వ్యాధులను ఇవి నయం చేస్తున్నాయి. ప్రపంచాన్ని వణికించిన ఎన్నో వ్యాధులను అరికట్టడంతోనూ మన భారతీయ ఆయుర్వేద వైద్యం అద్భుతంగా పనిచేస్తుంది అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మన సాంప్రదాయ ఆహారంలోనే ఔషధ విలువలు ఉన్నాయి. వాటిని మనం గ్రహించాలి. భవిష్యత్ లో వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాలంటే కంప్యూటర్ లో ఇంటెల్ ప్రాసెసర్  పనిచేసినట్టే మన శరీరంలోనూ రోగనిరోధక శక్తి పనిచేయాల్సిందే.
  ఆరోగ్యం..ఆరోగ్యం సరిగ్గా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. మన శరీరానికి తగిన పోషకాలు, విటమిన్లు అందితేనే ఆరోగ్యం కూడా సరిగ్గా ఉంటుంది. లేకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాకాకుండా ఉండాలంటే కొన్నిపాతకాలపు ఆహారపు అలవాట్లు పాటించాలి. అవేంటో ఈ వీడియో ద్వారా చూసి వాటిని పాటించండి. ఆరోగ్యంగా ఉండండి.. https://www.youtube.com/watch?v=ZH5yCJttcWQ      
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.