జగన్ పార్టీ దురాగతం.. పులివర్తి నానిపై దాడి

చంద్రగిరి వైసిపి నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెంచి పోషిస్తున్న రౌడీలు చంద్రగిరి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై బీర్ బాటిళ్ళు, సమ్మెటలు, రాళ్లతో దాడి చేశారు.  సమ్మెట దెబ్బతో గాయపడ్డ పులివర్తి నాని చికిత్స నిమిత్తం స్విమ్స్ లో అడ్మిట్  అయ్యారు. తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలో వున్న ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్ళి తిరిగి వస్తున్న పులివర్తి నాని మీద చెవిరెడ్డి రౌడీలు దాడి చేశారు. ఈ దాడిలో పులివర్తి నానికి, ఆయన భద్రతా సిబ్బందికి గాయాలు అయ్యాయి. దాంతో తెలుగుదేశం నాయకులు యూనివర్సిటీ ప్రధాన రహదారి మీద బైఠాయించి నిరసన తెలిపారు. పులివర్తి నాని మీద 150 మందికి పైగా రౌడీలు రాడ్లు, కత్తులు, ఇతర మారణాయుధాలతో వచ్చి దాడి చేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పులివర్తి నాని మీద దాడి సమాచారం తెలుసుకున్న అనంతరం భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు యూనివర్సిటీకి వచ్చారు. అక్కడ ఒక కారులో వున్న చెవిరెడ్డి భాస్కరరెడ్డికి సంబంధించిన కారులో వున్న వైసీపీ  జెండాలు, మద్యం బాటిళ్ళను ధ్వంసం చేశారు. కారులో వున్న మారణాయుధాలను పోలీసులకు చూపించారు. పద్మావతి యూనివర్సిటీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
Publish Date: May 14, 2024 7:18PM

జగన్ కొంప ముంచిన కొమ్మినేని!

రాష్ట్రవ్యాప్తంగా వున్న వైసీపీ అభిమాన వర్గాలు ‘‘ఓరి నాయనో.. ఈ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు మా జగనన్న కొంప ముంచాడు నాయనో’’ అని లబోదిబో అంటున్నారు. జగన్ మీడియాలో కీలక స్థానంలో, జగన్ ప్రభుత్వంలో ఒక సలహాదారుడు పదవి కూడా వెలగబెడుతున్న సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు చాలామందికి తెలిసిన వ్యక్తే. ఈయన జగన్ గురించి సాక్షి మీడియాలో ఇచ్చే బిల్డప్పులు వింటే చెవుల వెంట రక్తం కూడా కారే అవకాశాలు వుంటాయి. జగన్ విషయంలో పదిపైసలంత మేటర్ వుంటే, అది కొమ్మినేని నోట్లోంచి పది వేల రూపాయలంత రేంజ్‌లో బయటకి వస్తుంది. కొమ్మినేని పేరుకే జర్నలిస్టుగానీ, ‘జగన్ భజంత్రీల సంఘం’ వ్యవస్థాపక అధ్యక్షుడు అని గిట్టనివారు అంటూ వుంటారు.  సరే, ఈయన మంగళవారం నాడు సాక్షి టీవీ కెమెరా ముందుకు వచ్చారు. సాధారణంగా అయితే జగన్ నినాదం అయిన ‘వైనాట్ 175’ అనే నినాదానికి అనుకూలంగా వైసీపీ అదరహో, కూటమి బెదరహో, అధికారం జగన్‌దేనహో అని నానా హడావిడి చేయాలి. కానీ ఆయన ఎలాంటి హడావిడి లేకుండా, చూద్దామన్నా నెత్తుటి చుక్క కూడా కనిపించని ముఖంతో ‘ఈసారి కూడా జగన్ విజయం సాధిస్తారు.. అని సర్వేలు కూడా చెబుతున్నాయి. నేను కూడా కొందరు సర్వేవాళ్ళతో మాట్లాడాను. వాళ్ళలో చాలామంది జగనే గెలుస్తారని చెప్పారు’ అని చాలా చప్పచప్పగా ఎక్స్.ప్రెషన్ ఇస్తూ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకంటే పెద్ద అబద్ధం ఆడలేను అన్నట్టుగా తేల్చేశారు.  తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఓటర్లకి అన్నీ అబద్ధాలు చెప్పారట, అలాగే పోలింగ్ సందర్భంగా భారీగా హింసకు దిగారట... అని కొమ్మినేని శ్రీనివాసరావు దిగాలుగా ముఖం పెట్టి చెబుతుంటే, పాయే.. వైసీపీ పని అయిపాయే అని ఎవరికైనా అనిపించడం ఖాయం.. పోనీ, కొమ్మినేని గారు అక్కడితో ఆగలేదు.. జగన్ బ్రెయిన్ ఛైల్డ్ అయిన ‘వైనాట్ 175’ సిద్ధాంతానికే గండి కొట్టేశారు. రాయలసీమలో గత ఎన్నికలలో 49 సీట్లు వచ్చాయి.. ఈసారి 35 నుంచి 40 సీట్లు వస్తాయి అని డిక్లేర్ చేశారు.. అద్గదిగో.. ఇక్కడ వైసీపీ వర్గాల గుండెల్లో పెద్ద బండరాయి పడింది.. ఎవరైనా గతంలో 49 సీట్లు వచ్చాయి.. ఈసారి ఇంకా నాలుగైదు సీట్లు పెరుగుతాయి అని చెబుతారుగానీ, ఈయనేంటయ్యా బాబు.. దాదాపు పద్నాలుగు సీట్లు నిర్దాక్షిణ్యంగా కోసేశారు అని లబోదిబో అంటున్నారు. మన మీడియాలోనే మనం ఈరకంగా కోసేసుకుంటే, రియల్‌గా ఓటర్లు ఇంకెంత కోసేశారో అని కెవ్వుమంటున్నారు. కొమ్మినేని వైసీపీ వర్గాల మీద బాంబులు వేస్తూ మరికొంత విశ్లేషణ చేశారు. ఉత్తరాంధ్రలో వున్న 34 సీట్లలో 20 సీట్లు వైసీపీకి వస్తాయని చెప్పారు. అదేంటన్నా.. మన జగనన్న వైజాగ్ రాజధాని అని పోరాటం చేస్తుంటే, ఉత్తరాంధ్రలో సీట్లన్నీ మనకి వస్తున్నాయని చెప్పాలిగానీ, 14 సీట్లు కట్ చేశారేంటన్నా.. ఇదెక్కడి న్యాయం కొమ్మినేని సారూ అని వైసీపీ వర్గాలు మొత్తుకుంటున్నాయి.  జగన్ మొదటి నుంచి వైనాట్ 175 అంటే, కొమ్మినేని వారు మాత్రం 100 నుంచి 110 సీట్లు వస్తాయని ఫైనల్ చేశారు. ఈయన తీర్పు విని వైసీపీ వర్గాలు గొల్లుమంటున్నాయి. 175 వస్తాయి అని బిల్డప్పు ఇవ్వాలిగానీ, ఈరకంగా 110 బోర్డర్ పెట్టేశావేంటి దేవుడా అని బావురుమంటున్నాయి. సాక్షి మీడియా కాంపౌండ్లోనే పరిస్థితి ఇంత నీరసంగా వుందంటే, వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
Publish Date: May 14, 2024 7:01PM

ఆ పాల‌న మాకొద్ద‌న్న ఏపీ ఓట‌ర్‌! అధికారం టీడీపీ కూట‌మిదే!

ఏపీలో జ‌రిగిన‌ పోలింగ్ పై రాజ‌కీయ పార్టీల్లో ఉత్కంఠ‌త పెరిగిపోతోంది.  2019లో  79.64 శాతం పోలింగ్ నమోదైంది. 2014వ సంవత్సరంతో పోల్చితే, 2019లో ఓటింగ్ 1.23 శాతం పెరిగింది. ఫ‌లితం ప్ర‌తిప‌క్ష పార్టీకి 151 సీట్లు వ‌చ్చాయి. అధికార పార్టీ 23 సీట్ల‌తో స‌ర్దు కోవాల్సి వ‌చ్చింది. ఇక 2019తో 2024 పోలింగ్ ను పోల్చితే 2 శాతం తేడా క‌నిపిస్తోంది. 2014 లో జరిగిన మొదటి ఎన్నికల్లో 78.41, రెండోసారి 2019లో 79.64 శాతం న‌మోదయితే ఈసారి 2024 లో పోలింగ్  81 శాతాన్ని దాటిపోయేలా వుంది. దీన్ని బ‌ట్టి ఫ‌లితం ఎలా ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. తెలుగుదేశం కూటమికి 155 నుండి 160 సీట్లు, వైఎస్సార్సీకి 15 నుండి 21 అసెంబ్లీ సీట్లు, 2 లేదా 3 పార్లమెంటు సీట్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వైఎస్సార్సీపికి కనీసం ప్రతిపక్షహోదా కూడా రాకుండా ఓట్లతో అమోఘమైన ప్రజాస్వామిక తీర్పు ఇచ్చారనే టాక్ అయితే న‌డుస్తోంది. పోలింగ్ జ‌రిగిన తీరు చూస్తే.... ఉప్పెనలా పోలింగ్ బూతులకు జనాలు తరలి వచ్చారు. ముఖ్యంగా  మహిళ ఓటర్లు, వాళ్ళు ఎవరి వైపు మొగ్గు చూపితే వారిదే అధికారం. ఆంధ్రప్రదేశ్ లో మహిళ ఓటర్లు ఎక్కువ. 154 నియోజకవర్గాల్లో మహిళ ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. వీరే గెలుపోటములను నిర్ణయిస్తారు. ఇక్క‌డ ఓ విష‌యం మాట్లాడుకోవాలి. 2019 ఎన్నిక‌ల్లో మహిళలు పెద్దయెత్తున తరలి రావడంతో తమకు అనువుగా మారుతుందని అప్పటి అధికార తెలుగుదేశం పార్టీ అంచనా వేసింది. అందుకు కార‌ణం ఏమిటంటే, పసుపు కుంకుమ పేరిట పది వేల రూపాయలు నగదును వారి ఖాతాల్లోకి బదిలీ చేయడంతో ఆ ఓట్లన్నీ తమకేనని అప్పట్లో టీడీపీ ఆశలు పెట్టుకుంది. ఫ‌లితం మ‌నం చూశాం. టీడీపీ 23 స్థానాల‌తో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. సీన్ క‌ట్ చేస్తే 2024 ఎన్నిక‌ల్లోనూ భారీ స్థాయిలో మ‌హిళా ఓట‌ర్లు ఓటు వేశారు. అంటే... ప్రభుత్వంపై వ్యతిరేకత మహిళల్లో ఉంది.  1. అభివృద్ధి లేకపోవడంతో పాటు  2. మద్యనిషేధం చేయకపోవడం 3. శాంతిభద్రతల సమస్య‌లు 4. కూట‌మి  మ్యానిఫేస్టోలో పెట్టిన అంశాలు  5. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం,  6. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం,  7. తల్లికి వందనం పేరిట ఎంత మంది కుటుంబంలో ఉన్నా వారందరికీ ఇస్తామని ప్రకటించడం  8. 19 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు 1,500 ఇస్తామని చెప్పడం టీడీపీ కూట‌మికి క‌ల‌సి వ‌చ్చే అంశాలు. అందుకే మ‌హిళ‌లు భారీ ఎత్తున ఓటు వేశారు. ఏపీలో కుల రాజకీయాలకు ఎన్నికలు పరాకాష్ఠ. వారి కులం వారికే ఓటర్లు తమ ఓటును వేస్తారనేది కాదనలేని వాస్తవం. ఆ కులానికి చెందిన వ్య‌క్తి మంచి చేస్తున్నాడా చేయ‌డం లేదా అనేది ఎవ్వ‌రికీ అవ‌స‌రం లేదు. ఆ నేత తమ కులం వాడు,  అత‌నికే తమ ఓటు అనే ఆలోచనా ధోర‌ణి ఏపీలో చాలా మంది ఓటర్ల‌కు ఉంది. ఉద్యోగులు, కార్మికులు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, కాపు, కమ్మ కులాల ఓటర్లు సాలిడ్ గా టీడీపీ కూటమికి ఓటేసినట్లు ఆయా పార్టీలు చెప్పుకుంటున్నాయి.  బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, రెడ్డి ఓటర్లు, సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్లు తమకే మద్దతిచ్చారని వైసీపీ చెబుతోంది.   59 నెలలుగా దాదాపు 2 ల‌క్ష‌ల 75 వేల కోట్ల రూపాయలు 65 లక్షల కుటుంబాలకు అనేక పధకాల ద్వారా చేరాయని జగన్ పదే పదే చెప్పడం, ' మీ కుటుంబానికి మంచి జరిగితే మీరు వోట్ వేయండి.. మీరే ఇతరులకు చెప్పండి !' అని  అన్ని చోట్లా జగనే  చెబుతూ ప్ర‌చారం చేసుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక  ఓటు చీలకూడదు అన్న లక్ష్యంతో చంద్ర‌బాబునాయుడు కూటమి ఏర్పాటు చేసుకొని ఈ ఎన్నిక‌ల్లో త‌ల‌ప‌డ్డారు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు, రాష్ట్రానికి రాజధాని లేదని,  ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ప్రజా వ్యతిరేక చట్టం గా ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లారు.  వైఎస్ షర్మిల జగన్ చెల్లెలు గా జగన్ ని బాగా ఇరకాటంలో పడేసింది అని చెప్పాలి. వివేకానంద రెడ్డి హత్య కేసు ను పట్టుకొని ఆయన కుమార్తె Dr సునీత కూడా వైఎస్ అవినాష్ రెడ్డి మీద వ్యతిరేక ప్రచారం చేయటం, చివరి రోజు వైఎస్ విజయమ్మ కూడా 'షర్మిల ను గెలిపించండి ' అని మేసేజ్ వదలటం వైఎస్సార్ పార్టీ కి నష్టం కలిగించే అంశాలు.  ETV, TV5, ABN AndhraJyothi TV ఛానళ్ళు కూటమి వైపు, TV9, NTV, Sakshi TV ఛానళ్ళు వైయస్సార్ పార్టీ కి అనుకూలంగా కధనాలు ప్రసారం చేశాయి. - ఎం.కె.ఫ‌జ‌ల్‌
Publish Date: May 14, 2024 6:38PM

విశాఖ ఓటర్లు.. జగన్‌కి మొట్టికాయలు!

మూడు రాజధానుల పేరుతో జగన్ ఆడిన జగన్నాటకం అట్టర్ ఫ్లాపైంది. నా వైజాగో.. నా వైజాగో అని జగన్ లబలబ నెత్తీనోరూ కొట్టుకున్నాడు. ఆరు నూరైనా వైజాగే శాసన రాజధాని అన్నాడు. ఈసారి ప్రమాణ స్వీకారం వైజాగ్‌లోనే చే్స్తాన్నాడు.. డామ్ అన్నాడు.. డుష్ అన్నాడు.. చివరికి తుస్ అన్నాడు. పోలింగ్ సరళిని బట్టి చూస్తే జగన్ పిల్ల చేష్టలకి, మూడు రాజధానుల కుప్పిగంతులను వైజాగ్ ఓటర్లు మొట్టికాయలతో చక్కదిద్దారు. విశాఖపట్నం జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు వున్నాయి. వీటిలో ఎనిమిది స్థానాలు వైజాగ్ పరిసరాల్లోనే వున్నాయి. ఈసారి జరిగిన ఓటింగ్‌ని బట్టి చూస్తే, విశాఖ జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాల్లో 12 స్థానాల్లో కూటమి గెలవబోతోందని, మిగతా మూడు స్థానాలతో వైసీపీ సరిపెట్టుకోవాల్సి వస్తుందని తెలుస్తోంది.  భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్, గాజువాక, చోడవరం, అనకాపల్లె, పెందుర్తి, యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం స్థానాల్లో కూటమి గెలుస్తున్నట్టు సమాచారం. మాడుగుల, అరకు లోయ, పాడేరు స్థానాలు మాత్రం వైసీపీ అకౌంట్లో పడనున్నాయని తెలుస్తోంది. మొత్తమ్మీద విశాఖలోగాని, విశాఖ పరిసరాల్లోగానీ వైసీపీకి ఒక్క సీటు కూడా రావడం లేదు. జగన్ మూడు రాజధానుల విధానాన్ని వైజాగ్ ప్రజలు ఎంత వ్యతిరేకిస్తున్నారనేదానికి ఈ ఒక్క ఉదహరణ చాలు. ఈ ఐదేళ్ళలో జగన్ వైజాగ్‌ని విధ్వంసం చేసేశారు. జగన్‌కి సంబంధించిన పులివెందుల బ్యాచ్‌లు వైజాగ్‌ని భయాందోళనలకి గురిచేశాయి. రాజధాని వద్దు.. ఏమీ వద్దు.. ఈ జగన్ పీడ వదిలిపోతే చాలురా నాయనా అని వైజాగ్ ఓటర్లు భావించారని పోలింగ్ సరళిని బట్టి చూస్తే అర్థమైపోతోంది. టేక్ రెస్ట్ ఇన్ పులివెందుల జగన్.
Publish Date: May 14, 2024 5:35PM

పాయె.. అయిపాయె.. ఐప్యాక్ కూడా జగన్ కు జెల్ల కొట్టేసింది!

జగన్ పని అయిపోయింది. ఎన్నికలలో ఓటమి ఖరారైపోయింది. పోలింగ్ శాతం భారీగా ఉండటంతో జగన్ పార్టీ మూటాముల్లె సర్దుకోవడమే మిగిలింది. ఆ మిగిలిన కాస్తా జూన్ 4న పూర్తైపోతుంది అన్నది ఇప్పటి వరకూ పరిశీలకులు, విపక్ష కూటమి నేతలూ చెబుతున్న మాట. సామాన్యుల అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. అయితే అధికారికంగా ఫలితం వెలువడటానికి ఇంకా దాదాపు 20 రోజుల సమయం ఉన్నా.. జగన్ పని అయిపోయిందని చెప్పడానికి తిరుగులేని రుజువుగా ఐప్యాక్ నిలిచింది. ఇన్నేళ్లుగా జగన్ వ్యూహాలు, ఎత్తుగడలన్నిటి వెనుకా నిలిచిన ఐ ప్యాక్ పోలింగ్ పూర్తి కాగానే జగన్ కు జెల్ల కొట్టేసిందని అర్ధమౌతోంది. పోలింగ్ సోమవారం (మే13) పూర్తయ్యింది. మే 15( బుధవారం ఐప్యాక్ రుషిరాజ్ సింగ్ ఆయన టీమ్ జగన్ తో కలిసి విజయోత్సవ సంబరాలు చేసుకునేందుకు ఎప్పుడో నిర్ణయించేసుకున్నాయి. ఆ సందర్భంగా ఐ ప్యాక్ జగన్ ను సన్మానించాలని కూడా భావించింది. అయితే ఇప్పుడు ఆ విజయోత్సవ సంబరం, జగన్ సన్మాన కార్యక్రమం రెండింటినీ కూడా ఐప్యాక్ రద్దు చేసుకుంది.   అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే బుధవారం ఐప్యాక్ బృందంతో కలిసి జగన్ పెద్ద ఎత్తున సంబరాల్లో మునిగి తేలేవారు. కానీ పోలింగ్ రోజు ఉదయం నుంచే ప్రజలలో కనిపించిన ప్రభుత్వ వ్యతిరేకత పోలింగ్ సరళితో ప్రస్ఫుటంగా కనిపించడంతో తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదిలిపోయాయి. సాయంత్రం అయ్యేసరికి ప్రజా వ్యతిరేకత సునామీలా ఈవీఎమ్ లలో నిక్షిప్తమైపోయిందని స్పష్టమైపోవడంతో  వైపీపీ బెంబేలెత్తిపోయింది. అలాగే ఐప్యాక్ కూడా మూటాముల్లె సర్దుకుని వెళ్లిపోవడానికి రెడీ అయిపోయింది. దీంతో బుధవారం ( మే 15) విజయవాడ బెంజ్ సర్కిల్ లోని ఐప్యాక్ కార్యాలయంలో జరగాల్సిన వేడుకలకు ఫుల్ స్టాప్ పడింది. జగన్ ను ఐ ప్యాక్ ఆఫీసుకు ఆహ్వానించి సన్మానించాలన్న రుషిరాజ్ సింగ్ ప్రణాళికకు గండిపడింది. జగన్ ఐప్యాక్ కార్యాలయానికి రావడం లేదనీ, ఆయన సన్మాన కార్యక్రమం రద్దైందనీ ఐప్యాక్ వర్గాల ద్వారానే విశ్వసనీయంగా తెలిసింది.  ఈ మేరకు వైసీపీ నుంచి ఐప్యాక్ కు స్పష్టమైన సమాచారం అందింది.  దీంతో భారీ ఎత్తున సంబరాలు జరుపుకోవాలన్న ఐప్యాక్, వైసీపీల ప్రణాళిక కార్యరూపం దాల్చకుండానే ఎండ్ కార్డ్ పడిపోయింది. ఇది ఎన్నికలలో జగన్ కు విజయావకాశాలు ఇసుమంతైనా లేవన్న విషయాన్ని నిర్ద్వంద్వంగా చాటుతోందని పరిశీలకులు చెబుతున్నారు.  అంతే కాదు ఐప్యాక్ సభ్యులకు కంపెనీ ఇచ్చిన  మెబైల్ ఫెన్ లు, ల్యాప్ టాప్ ల  బుధవారం (మే 15) ఉదయానికల్లా తిరిగి ఇచ్చేయాలని విస్పష్ట ఆదేశాలు అందాయి. అంతే కాదు వారికి ఇవ్వవలసిన ఈ నెల వేతనాలు, ఇతర అలవెన్సులు అందజేస్తామని తెలిపింది. అంతే కాకుండా ఎవరైన లాప్ టాప్, మెబైల్స్ రిటర్న్ చేయకుంటే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్న హెచ్చరిక కూడా జారీ అయ్యింది. ఇంత అర్జంట్ గా ఐ ప్యాక్ సభ్యుల నుంచి పోన్లు, ల్యాప్ టాప్ లను వెనక్కు తీసుకోవడానికి కారణం ప్రభుత్వం మారితే తమ ఫేక్ ప్రోపగాండా బయటకు పొక్కి చిక్కుల్లో పడతామన్న భయమే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు జగన్ ఐప్యాక్  రిషిరాజ్ సింగ్ ఆయన టీమ్ పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారనీ, అంతే కాకుండా వారికి ఇస్తామన్న 50 కోట్ల రూపాయల ప్యాకెజీని హోల్డ్ లో పెట్టారనీ తెలుస్తోంది.   ఆ కారణంగానే ఐ ప్యాక్ జగన్ సన్మాన కార్యక్రమాన్ని రద్దు చేసుకుందని అంటున్నారు. 
Publish Date: May 14, 2024 5:22PM

హింసను నిలువరించింది.. పోలింగ్ కు సహకరించింది.. శభాష్ తెలుగుదేశం క్యాడర్!

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసింది.  ఓటర్ల తీర్పు ఈవీఎంలలో  నిక్షిప్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా వందల పోలింగ్ స్టేషన్లలో మంగళవారం (మే14) తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ జరిగింది. తమ వంతు వచ్చే వరకూ ఓటర్లు ఓపికతో ఎదురు చూస్తే రాత్రంతా జాగారం చేయడం ఓటరు చైతన్యానికి నిలువెత్తు నిదర్శనంగా చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడతాయి. అంత వరకూ గెలుపు మాదంటే మాదంటూ అధికార విపక్షాలు తమ వాదనలకు సాధ్యమైనంత పదును పెట్టుకుంటాయి. పార్టీలు చెప్పుకోవడంతో సంబంధం లేకుండానే ఫలితం ఏమిటన్నది ఇప్పటికే అందరూ ఓ అంచనాకు వచ్చేశారు. ఫలితాలు వెలువడే జూన్ నాలుగో తారిఖునే అధికారికంగా ఏ పార్టీ విజయం సాధించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది అన్నది తేలుతుంది.  కానీ ఈ సారి ఏపీలో ఎన్నికల సరళి, ఓటరు చైతన్యం, ఓటు వేయాలన్న పట్టుదలతో జనం కదిలిన తీరు అన్నీ ప్రత్యేకంగా ఉన్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత  జనంలో ప్రస్ఫుటంగా కనిపించింది. ఇవన్నీ పక్కన పెడితే ప్రత్యేకంగా, ఒక విశేషంగా చెప్పుకోవలసిందేమిటంటే.. గత ఐదేళ్లుగా అన్ని విధాలుగా వేధింపులకు గురై, కేసుల్లో ఇరుక్కుని నానా అగచాట్లూ పడిన తెలుగుదేశం పార్టీ క్యాడర్ ప్రదర్శించిన ఉత్సాహం. చేసిన త్యాగాలు.   ఈ ఎన్నికల్లో కూటమి విజయం లక్ష్యంగా తెలుగుదేశం శ్రేణులు అహర్నిశలూ కష్టపడ్డాయి. ముఖ్యంగా పొత్తుల కారణంగా త్యాగాలు చేయాల్సి వచ్చినా, అనుకున్న నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి పోటీలో లేకపోయినా.. తెలుగుదేశం క్యాడర్ నిరుత్సాహ పడలేదు. అదు ఉత్సాహంతో, అదే స్ఫూర్తితో పని చేసింది. మరీ ముఖ్యంగా తెలుగుదేశం మేనిఫెస్టో ను బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లం, అలాగే  ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైనే చంద్రబాబు సంతకం అన్న సంగతిని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లడంలో తెలుగుదేశం క్యాడర్ కంప్లీట్ గా సక్సెస్ అయ్యింది.   అక్కడి వరకూ ఒకెత్తు అయితే పోలింగ్ రోజున పార్టీ క్యాడర్ ప్రదర్శించిన ధైర్య సాహసాలు, సంయమనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసి ఉంటుంది. వైసీపీ మూకలు ఎంత రెచ్చగొట్టినా, పోలింగ్ కు విఘాతం కలిగించే లక్ష్యంతో ఎంతగా హింసాత్మక చర్యలకు పాల్పడినా తెలుగుదేశం శ్రేణులు, నేతలూ ఎక్కడా సంయమనం కోల్పోలేదు. పోలింగ్ సజావుగా సాగేలా చూశారు.  తెలుగుదేశం నాయకులు, క్యాడర్ సర్వశక్తులూ ఒడ్డి పనిచేశారు. ఇక్కడ పోటీలో ఉన్నది తెలుగుదేశం అభ్యర్థా, బీజేపీ అభ్యర్థా అని చూడలేదు. కూటమి అభ్యర్థి అంటే తెలుగుదేశం అభ్యర్థే అన్నట్లుగా పని చేశారు. దీంతో కూటమి పార్టీల మధ్య ఓట్ల బదిలీకి ఎలాంటి అవరోధాలూ లేకుండా సజావుగా సాగింది.   తెలుగుదేశం, జనసేన పొత్తులోకి బీజేపీ వచ్చి కలిసిన తరువాత తొలి రోజులలో   ఓట్ల బదిలీ పై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ఉన్న బలంతో సంబంధం లేకుండా పేచీపెట్టి మరీ బీజేపీ పొత్తులో భాగంగా ఎక్కువ స్థానాలు  దక్కించుకోవడం, అక్కడితో ఆగకుండా చివరి క్షణం వరకూ సీట్ల మార్పు కోసం మడత పేచీలు పెట్టడంతో  ఒక దశలో బీజేపీ పొత్తు పేరుతో తెలుగుదేశం పార్టీకి నష్టం చేయాలన్న వ్యూహంతో పని చేస్తోందా అన్న అనుమానాలు కూడా తెలుగుదేశం క్యాడర్ లోనే వ్యక్తం అయ్యాయి. పార్టీల మధ్య ఓట్ల బదలాయింపుపై అనేక సందేహాలు వ్యక్తం అయ్యాయి. కానీ ఎన్నికల రోజుల మాత్రం అన్నీ పక్కన పెట్టి తెలుగుదేశం శ్రేణులు కూటమి అభ్యర్థుల కోసం పని చేశాయి. అలాగే జనసేన బీజేపీ శ్రేణులు కూడా కదలడంతో మూడు పార్టీలూ ఒక్కటే అన్న భావన సర్వత్రా వ్యక్తం అయ్యింది. ఓటు బదలీ సజావుగా సాగింది. పల్నాడు, పుంగనూరు వంటి సున్నిత ప్రాంతాలలో  అధికార పార్టీ పెద్ద ఎత్తున హింసకు పాల్పడినా ఎన్నికల సంఘం, పోలీసు శాఖ చోద్యం చూస్తూ నిలిచిపోయాయి. అయితే అవి చేయాల్సిన పని కూడా తెలుగుదేశం క్యాడరే చేసింది. వైసీపీ గూండాయిజాన్ని ఎదురొడ్డి ఎదుర్కొని నిలువరించింది. ప్రాణాలను ఫణంగా పెట్టి కూటమి విజయం కోసం నిలబడింది. తెలుగుదేశం క్యాడర్ స్థైర్యం, ధైర్యం ముందు వైసీపీ వ్యూహాలు పారలేదు. హింసతో భయభ్రాంతులకు గురి చేసి ఓటింగ్ జరగకుండా చేయాలన్న వైసీపీ ఎత్తుగడ భగ్నమైంది.  దీంతో అనీల్ కుమార్ యాదవ్, గోపిరెడ్డి వంటి వైసీపీ నేతలు ఎన్నికల సంఘం, అధికారులు, పోలీసులు తమ చేతులు కట్టేసి తెలుగుదేశం శ్రేణులకు అనుకూలంగా వ్యవహరించారంటూ మీడియా ముందు బేలగా చెప్పుకునే పరిస్థితికి వచ్చారు.  టీడీపీ క్యాడర్ ప్రతిఘటనతో   పల్నాడుకు చెందిన అనిల్ కుమార్ యాదవ్, కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అంబటి రాంబాబు, పినెల్లి రామకృష్ణారెడ్డి వంటి వైఎస్సార్‌సీపీ నేతలందర్నీ డిఫెన్స్ లో పడేసింది. గత ఐదేళ్ల దాడులు, బెదరింపులు, వేధింపులకు దీటుగా సమాధానం చెప్పింది. ఇంకానా ఇకపై సాగవు అంటూ విస్పష్ట సందేశం ఇచ్చింది.  ప్రజలలోనూ ధైర్యంగా ముందుకు వచ్చి ఓటు వేసే ధైర్యాన్నిచ్చింది. ఇక్కడే అధికారికంగా ఫలితం వెలువడటానికి ముందే తెలుగుదేశం పార్టీకి నైతిక విజయం దక్కేటట్లు చేసింది.  
Publish Date: May 14, 2024 4:27PM

ఫోన్ ట్యాపింగ్ కేసుకి జాతీయ హోదా!

ఏపీకి జాతీయ హోదా దక్కుతుందో, లేదో గానీ, కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా వుండగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసుకి మాత్రం జాతీయ హోదా దక్కేట్టుంది.. అదెలాగయ్యా అంటే... ఢిల్లీ లిక్కర్ కేసును కేసీఆర్ ఫ్యామిలీ, బీఆర్ఎస్ వర్గాలు చాలా లైట్‌గా తీసుకున్నాయి. మోడీకి, ఈడీకి భయపడేదే లేదని కేసీఆర్ ఫ్యామిలీ అంతా యతిప్రాసలు ఉపయోగించి మాట్లాడారు. ఆ కేసుతో కవితకి ఎలాంటి సంబంధం లేదని సుద్దపూసలకి చుట్టాల మాదిరిగా మాట్లాడారు.  చివరికి ఏమైంది.. డూప్లికేట్ బతుకమ్మ తీహార్ జైల్లో చిప్పకూడు తింటోంది. ఇప్పుడప్పుడే జైల్లోంచి బయటకి వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదు. మంగళవారం నాడు ఢిల్లీ కోర్టు కవిత బెయిల్‌ని ఈనెల 20 వరకు పొడిగించింది. పరిస్థితి చూస్తుంటే కవిత జైలు జీవితం ఆంజనేయస్వామి తోకలాగా ఎప్పటికప్పుడు పెరుగుతూ వెళ్తోంది. కేసీఆర్ ఫ్యామిలీ ఇచ్చే బిల్డప్పలు, మేకపోతు గాంభీర్యాలు అన్నీ ఉత్తుత్తివే అని లిక్కర్ స్కామ్ కేసు విషయంలో మరోసారి ప్రూవ్ అయింది. ప్రస్తుతం ఈ ఫ్యామిలీ ఇదే తరహా బిల్డప్పు ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో కూడా ఇస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి సోమవారం నాడు జర్నలిస్టులు కేసీఆర్ని ప్రశ్నించినప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి సీట్లో వున్నప్పుడు ఎంత పొగరుగా సమాధానం చెప్పారో, ఇప్పుడు కూడా అంతకు మించిన పొగరుగా సమాధానం చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదట. పోలీసులదే మొత్తం పాపమట. ముఖ్యమంత్రి హోదాలో పోలీసులని మేం సమాచారం అడుగుతాం.. వాళ్ళు ఏమార్గంలో వెళ్ళి ఆ సమాచారం తెస్తారో మాకు సంబంధం లేదు. టెలీగ్రాఫ్ చట్టం ప్రకారం ఫోన్లని ట్యాప్ చేసే అధికారం వుంది. అవసరమైతే ట్యాప్ చేసిన సమాచారాన్ని ధ్వంసం చేసే అధికారం కూడా పోలీసులకు వుంది అని చెప్పుకొచ్చారు. అంటే, ఈ ధ్వంసం చేసే వ్యవహారం కేసీఆర్‌కి తెలిసే జరిగిందన్నమాట. చట్టంలో ధ్వంసం చేయొచ్చు అని కూడా వుంది కదా.... అందుకని ట్యాపింగ్ చేసినంతకాలం చేసి, బయటపడే రోజు రాగానే ధ్వంసం చేశారన్నమాట. ‘ధ్వంసం చేయొచ్చని  కూడా చట్టంలో’ వుంది అని కాళ్ళు ఊపుకుంటూ నిర్లక్ష్యంగా అంటే సరిపోదు... ఆ ధ్వంసం చేయడమే ఇప్పుడు కేసీఆర్ని జాతీయ స్థాయిలో నేరస్తుడిలా నిలబెట్టబోతోంది. ఫోన్ ట్యాపింగ్ చేసినంతకాలం చేసిన పోలీసులు, కేసీఆర్ కుర్చీలోంచి దిగిపోగానే హార్డ్ డిస్కులు ధ్వంసం చేసి మూసీ నదిలో పారేశారు. వాళ్ళు ధ్వంసం చేసింది వాళ్ళు ట్యాపింగ్ చేసిన హార్డ్ డిస్కుల వరకు అయితే సర్లే అనుకోవచ్చు. దేశ రక్షణ, మావోయిస్టులు, ఉగ్రవాదుల సమాచారం కూడా వున్న హార్డ్ డిస్కులు కూడా ధ్వంసం చేశారట. ఉగ్రవాదుల సమాచారాన్ని కూడా ధ్వంసం చేశారంటే, అది కచ్చితంగా జాతీయ స్థాయి వ్యవహారమే. ఈ విషయాన్ని ఈమధ్యే  రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ ఎన్నికల అయిపోయిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి సమీక్ష నిర్వహించి, తదుపరి చర్యలకు వెళ్తామని ఆయన చెప్పారు. అంటే, త్వరలో కేసీఆర్, కేటీఆర్ జాతీయ స్థాయి నేరస్థులుగా ప్రమోషన్ పొందబోతున్నారన్నమాట.
Publish Date: May 14, 2024 3:59PM

ఓటెత్తిన ప్రభుత్వ వ్యతిరేకత.. ఏపీలో 85శాతం పైనే పోలింగ్!

ఆంధ్రప్రదేశ్‌లో ఓటు వెల్లువెత్తింది.  కొత్త ఓటర్లు,  యువత తమ భవిష్యత్ ఓటుతోనే ముడిపడి ఉందని భావించారు. అందుకే పెద్ద సంఖ్యలో ఓటు వేయడానికి తరలివచ్చారు. ఇక మధ్యతరగతి, దిగువ మధ్య తరగలి వారు తమ ఆస్తులకు రక్షణ ఉండాలంటే ఓటేసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్చడమే మార్గమని నిర్ణయించుకున్నారు. ఇక పేద, బడుగు వర్గాల వారు తాము ఆరోగ్యంగా ఉండాలంటే అరకొర సంక్షేమం కాదనీ, ఆరోగ్యం ముఖ్యమని భావించారు. లేదంటే ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యంతో  తమ ప్రాణాలు గాలిలో కలిసిపోవడం ఖాయమన్న భయంతో ఓటు వేయడానికి తరలి వచ్చారు.  దీంతో గత ఎన్నికల్లో 79 శాతం ఈవీఎం ఓటింగ్  నమోదైతే  ఈ సారి 82 శాతానికి పైగా పోలింగ్ జరిగిందన్నది అంచనా.  దీనికి రికార్డు స్థాయిలో జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అదనం.  స్వయంగా రాష్ట్ర ఎన్నికల అధికారిముఖేష్ కుమార్ మీనా గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి రాష్ట్రంలో ఓటింగ్ భారీగా పెరిగిందని ప్రకటించారు.  ఈవీఎంలు,పోస్టల్ బ్యాలెట్లు కలుపుకుంటే.. 85 శాతానికి మింతే పోలింగ్ జరిగిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయితే వైసీపీ మాత్రం ఇదంతా ప్రభుత్వ సానుకూల ఓటని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నది. కానీ ప్రభుత్వ పాజిటివ్ ఓటింగ్ ఎప్పుడూ వెల్లువలా సాగదని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఒక ప్రభుత్వాన్ని మార్చి తీరాలన్న కసి, పట్టుదల ప్రజలలో ఉన్నప్పుడే ఓటు వేసి తీరాలన్న పట్టుదల జనం ప్రదర్శిస్తారనీ, అడ్డంకులు, అవరోధాలు ఎదురైనా లెక్క చేయకుండా పోలింగ్ బూత్ కు చేరుకుని తమ ఓటు హక్కు వినియోగించుకుంటారనీ వారు సోదాహరణంగా చెబుతున్నారు. 2014తో పోలిస్తే 2019లో పోలింగ్ శాతం పెరగడంతో తెలుగుదేశం భారీగా నష్టపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు 2019తో పోలిస్తే 2014లో పోలింగ్ శాతం మరింత పెరిగిందంటే.. వైసీపీ భారీగా నష్టపోవడం ఖాయమని చెబుతున్నారు.  2019 ఎన్నికలలో పోలింగ్ శాతం పెరినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అదే చెప్పారు. ఎక్కువ ఓటింగ్ జరిగితే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటేననీ అప్పడు బల్లగుద్ది చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన ఇంత భారీగా పోలింగ్ నమోదయ్యిందంటూ అది కచ్చితంగా ప్రభుత్వ పాజిటివ్ ఓటు మాత్రమేనని అంటున్నారు. ఈ వాదంతో జనాలను ఎటూ నమ్మించలేరు, కనీసం పార్టీ క్యాడర్ అయినా నమ్మక పోతుందా అని తెగతాపత్రేయపడుతున్నారు.  అయితే  పార్టీ నేతలూ, క్యాడర్ కూడా ఆయన మాటలు నమ్మడం లేదని పోలింగ్ సందర్భంగా, పోలింగ్ తరువాత వారు మాట్లాడిన మాటలే రుజువు చేస్తున్నాయి. పార్టీ అధికార ప్రతినిథి అనిల్ కుమార్ యాదవ్ అయితే పోలీసులు అధికారులు  వైసీపీ నేతలు, కార్యకర్తలను నియంత్రించి, తెలుగుదేశం నాయకులు, శ్రేణులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారని చెప్పడం ద్వారా ఎన్నికల ఫలితం ఏమిటో ఫలితాల వరకూ ఆగనవసరం లేకుండా ఆయనే చెప్పేశారు. ఇక నగరి తెలుగుదేశం అభ్యర్థి రోజా అయితే పోలింగ్ పూర్తి కాకుండానే తన ఓటమిని అంగీకరించేశారు. తనను నగరిలో  ఓడించడానికి సొంత పార్టీ నేతనే పని చేశారని చెప్పారు. ఇక చివరాఖరుగా చెప్పేదేమిటంటే.. ఒక ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయడానికి ఓటర్లు ఉప్పెనలా తరలి వచ్చి ఓటేసిన సందర్భం చరిత్రలో లేదు. అయితే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంటే మాత్రం జనం వెల్లువలా తరలివచ్చి ఓటు వేస్తారనడానికి చరిత్రలో ఎన్నో దాఖలాలు ఉన్నాయి. అందుకే  ఇప్పుడు రాష్ట్రంలో ఓటరు చైతన్యం ప్రభుత్వ అనుకూల ఓటా, వ్యతిరేక ఓటా అన్న విషయంపై కొత్తగా చర్చ చేయాల్సిన అవసరం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో జనం చైతన్యంతో  ఓటెత్తారంటే వైసీపీకి ఘోర పరాజయం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. 
Publish Date: May 14, 2024 3:29PM

మూగబోయిన వైసీపీ ఫైర్ బ్రాండ్ గొంతులు

అవసరం ఉన్నా లేకున్నా మైకుల ముందుకు వచ్చి తెలుగుదేశం నాయకులపై ఇష్టానుసారం నోరు పారేసుకునే వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతల గొంతులు పోలింగ్ పూర్తయిన క్షణం నుంచీ మూగబోయాయి. ఎక్కడా వారి మాట వినిపించడం లేదు. వారికి మాత్రమే అలవాటైన భాషలో ప్రసంగాలు చేయడం లేదు.  ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలలో భాగంగా నాలుగో విడతలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది. వైసీపీ నేతల అరాచకాలు, హింసాకాండ మధ్య రాష్ట్రంలో ఓటర్లు బెదరకుండా, అదరకుండా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారీగా పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిసే వరకూ విజయం మాదే అంటూ  ధీమా వ్యక్తం చేసిన వైసీపీలో ఇప్పుడు ఆ ధీమా కనిపించడం లేదు. అస్తమానూ నోరెట్టుకు పడిపోయే వైసీపీ అధికార ప్రతినిథులు అనీల్ కుమార్ యాదవ్,  రోజా, కొడాలి నాని వంటి అనుచిత భాషా ప్రవీణులు మూగనోము పట్టారు. డిఫెన్స్ లో పడ్డారు. నిన్న మొన్నటి వరకూ గెలుపు ధీమా వ్యక్తం చేసిన ఆ నేతలు ఇప్పుడు పోలంగ్ సందర్భంగా విపక్ష కూటమి దౌర్జన్యాలకు పాల్పడిందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. పోలీసులూ, అధికార యంత్రాంగం వారికి మద్దతుగా నిలిచిందని ఆక్రోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంత కాలం దాడులు తాము చేసి, కేసులు ప్రత్యర్థుల మీద నమోదయ్యేలా చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు తమకు అన్యాయం జరిగిపోయిందంటూ గుండెలు బాదుకుంటున్నారు.  వైసీపీ అధికార ప్రతినిథి అనీల్ కుమార్ యాదవ్ అయితే మంగళవారం ఉదయం మీడియా ముందుకు వచ్చి రాష్ట్రంలో వైసీపీ శ్రేణులను నియంత్రించిన పోలీసులు, తెలుగుదేశం నేతలు, శ్రేణులకు మాత్రం ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి చెలరేగిపోయేలా చేశారని ఆరోపించారు. ఈ ఆరోపణ ద్వారా తమ ఓటమిని పరోక్షంగా అంగీకరించేశారు. ఇక ఫైర్ బ్రాండ్ నాయకురాలు, నగరి సిట్టింగ్ ఎమ్మెల్యే రోజా అయితే.. తన నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలే తన ఓటమి కోసం పని చేశారంటూ మీడియా ముందు ఆవేదన వెళ్లగక్కి ఫలితంతో పని లేకుండానే ఓటమిని అంగీకరించేశారు. బూతుల స్పెషలిస్ట్ కొడాలి నాని అయితే పోలింగ్ జరుగుతున్న సమయంలో కానీ, పోలింగ్ ముగిసిన తరువాత కానీ ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. కుటుంబంతో సహా సాయంత్రం ఎప్పుడో వచ్చి ఓటేసి వెళ్లిపోయారు.  సాధారణంగా వీరు తెలుగుదేశంపై ఇష్టారీతిన పెద్ద నోరేసుకుని పడిపోవడంలో సిద్ధహస్తులు. అటువంటి వీరి నోరు మూతపడటమే.. గెలుపుపై వైసీపీలో సన్నగిల్లిన నమ్మకానికి నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   
Publish Date: May 14, 2024 1:43PM

చచ్చు పుచ్చు ప్లాన్స్ వేయాలంటే రోజా తరవాతే ఎవరైనా!

కిందపడ్డా నాదే పైచేయి అంటారు చూశారా.. అలా వుంది నగరిలో మటాష్ అవబోతున్న రోజా వ్యవహారం. మొదటగా నగరి ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. గత పదేళ్ళుగా మీ నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసిన రోజాని మీ ఓటు ద్వారా సాగనంపారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని, మిమ్మల్ని మీరు కాపాడుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. పదేళ్ళుగా నగరిలో రోజా, ఆమె బ్రదర్స్ చేసిన విధ్వంసం మామూలు విధ్వంసం కాదు. నగరి విధ్వంసం అలా వుంటే, రోజా తన కార్పొరేషన్ నోటితో ఇష్టమొచ్చినట్టు మాట్లాడి రాష్ట్ర రాజకీయాలలో విలువలు అనేవి వున్నాయా లేవా అనే డౌట్ వచ్చేలా చేశారు. అటు నగరి నాశనం, ఇటు నైతిక విలువలు నాశనం. మొత్తమ్మీద రోజాని సాగనంపడం అనేది ఏపీ రాజకీయాలలో ఒక అదృష్టకర పరిణామం.  అసలు దేశ చరిత్రలోనే కాదు.. ప్రపంచ చరిత్రలో కూడా రోజా లాంటి ఓటమి ఒప్పుకున్న తీరు ఎప్పుడూ జరిగి వుండదు. ఒకవైపు పోలింగ్ జరుగుతూ వుండగానే, నేను ఓడిపోబోతున్నానను. నా ఓటమికి కారణం నా పార్టీలోవాళ్ళే అని చెప్పడం ఇంతవరకు ఎక్కడా జరిగిన దాఖలాలు లేవు. ఈ అరుదైన ఘనతను సాధించిన రోజాకి అభినందనలు. ఓడిపోతున్నప్పటికీ, ఆ ఓటమిని కవర్ చేసుకోవడానికి అద్భుతమైన ప్లాన్ వేసిన రోజాకి అశుభాకాంక్షలు. ఇంతకీ రోజా ప్లాన్ ఏంటంటే, నగరిలో రోజా ఓడిపోతే జనం ఏమనుకుంటారు? భారీస్థాయిలో అవినీతి చేయడం, చంద్రబాబు నాయుడి మీద నోరేసుకుని పడిపోయి, ఇష్టమొచ్చినట్టు తిట్టడం వల్లే జనం ఓడించారని అనుకుంటారు. అదే వాస్తవం. కానీ ఆ వాస్తవాన్ని ఎలా కవర్ చేయాలి? నేను ఓడిపోయింది నా బిహేవియర్ వల్ల కాదు.. నా పార్టీలో వున్న వాళ్ళు మోసం చేయడం వల్లే అని చెప్పుకుని తిరగాలి. ఎలాగూ ఓడిపోయిన తర్వాత చెప్పుకునేది అదే. పోలింగ్ సమయంలోనే ఓడిపోతున్నట్టు తెలిసిపోయింది కాబట్టి, ఇప్పటి నుంచే తన ఓటమి కారణాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఓపని అయిపోతుంది కదా అని రోజా పోలింగ్ రోజే తన ప్లాన్‌ని అమల్లో పెట్టేశారు. జూన్ 4న అధికారికంగా ఓడిపోయిన తర్వాత, ‘‘నేను ఓడిపోయింది నా అవినీతి, నా నోటి వల్ల కాదు.. నా పార్టీలో వాళ్ళు వెన్నుపోటు పొడవటం వల్లే’’ అని చెప్పుకుని తిరగొచ్చు. మొత్తానికి రోజా చచ్చుపుచ్చు ప్లాన్ సూపరే సూపర్!!
Publish Date: May 14, 2024 12:58PM

కేసీఆర్, కేటీఆర్ ముఖాల్లో పైశాచిక ఆనందం!

ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని పోలింగ్‌కి ముందే  అందరూ ఫిక్సయిపోయారు. వేరే పార్టీవాళ్ళ సంగతి అలా వుంచితే, సాక్షాత్తూ బీఆర్ఎస్ ప్రధాన నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులకు కూడా ఒక్క పార్లమెంట్ సీటు అయినా వస్తుందన్న నమ్మకం లేదు. అయినప్పటికీ, మరీ చేతులు ఎత్తేస్తే బాగోదు కాబట్టి, బిల్డప్పులు ఇస్తూ, మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తూ 12 నుంచి 15 సీట్లు వస్తాయంటూ షో పుటప్ చేస్తూ కాలం గడుపుకుంటూ వచ్చారు. సోమవారం నాడు జరిగిన పోలింగ్ సరళిని చూశాక బీఆర్ఎస్‌కి ఒక్క సీటు కూడా వచ్చే ఛాన్స్ లేదన్న విషయం కన్ఫమ్ అయిపోయింది. అడ్డంగా ఆరిపోయిన తన పార్టీ గురించి ఏడవకుండా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి నిన్న కేటీఆర్ ఏడిచాడు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ గెలవటం ఖాయమని ఈయన ఆనందపడిపోతూ చెప్పాడు. ఎందుకంటే చంద్రబాబు గెలిస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడిపోతుంది కదా. అదే జగన్ గెలిస్తే, మా పాలనలో తెలంగాణ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయిందని చెప్పుకుని తిరగొచ్చు కదా. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ గెలుస్తాడు అని చెబుతున్నప్పుడు కేసీఆర్ ముఖంలోగానీ, కేటీఆర్ ముఖంలోగానీ కనిపించే పైశాచిక ఆనందాన్ని చూడ్డానికి రెండు కళ్ళూ చాలవు. నాకు ఒక్క కన్ను పోయినా పర్లేదు,  ఎదుటి వాళ్ళకి రెండు కళ్ళూ పోవాలని కోరుకునే టైప్ ఈ కేసీఆర్ ఫ్యామిలీ. ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోవాలని కోరుకునేవాళ్ళలో ముందుండేవాళ్ళు కేసీఆర్ ఫ్యామిలీ. వీళ్ళు అంతిమ క్షణాల్లో వున్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోవాలని, చంద్రబాబు ముఖ్యమంత్రి కాకూడదని కోరుకుంటారు. ఇలాంటివాళ్ళ జీవితాంతం ఏడ్చి చావడానికే చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు.
Publish Date: May 14, 2024 12:22PM

వైసీపీ మ‌రింత డీలా! కుటుంబం, అధికారం అంతా పాయే!

ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ శాతం నమోదు అవ్వడం అంటే అధికారపార్టీకి వ్యతిరేకత తీవ్రంగా ఉందని సంకేతం. ఇది సహజ న్యాయసూత్రం. పోలింగ్ స‌ర‌ళి చూస్తే ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్సీపి మీద ఈ తీవ్ర వ్య‌తిరేక‌త‌ స్ప‌ష్టంగా క‌నిపించింది.  గత అయిదేళ్లుగా ఏపీలో పసి పిల్లల నుండి వయో వృద్ధుల వరకూ అన్ని వర్గాలు,  అన్నికులాలూ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ఆవేశాన్ని ఆవేదనను ఉగ్గబట్టుకుని నిన్న జ‌రిగిన జ‌రిగిన పోలింగ్ లో క‌సి తీర్చుకున్నారు.  భారీ స్థాయిలో జ‌నం ఇళ్ళ నుంచి బ‌య‌టికి వ‌చ్చి త‌మ ఓటు వేశారు.  పోలింగ్ ప్రారంభమయిన వెంటేనే ఓటర్లు బారులు తీరారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు కూడా క్యూ లైన్ లో కనిపించారు. దీంతో పెద్దయెత్తున పోలింగ్ జరిగింది. ప్రభుత్వంపై వ్యతిరేకత వల్లనే ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ క‌ట్టారు.   పోలింగ్ శాతం ఎక్కువ జరిగితే ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అన్న చర్చ అయితే ఏపీలో జోరుగానే జ‌రుగుతోంది. 2019 ఎన్నికల్లోనే 79 శాతం వరకూ పోలింగ్ నమోదయింది. అయితే ఈసారి మరింత పెరిగింది. వాతావరణం కూడా అనుకూలించడంతో పోలింగ్  ఈసారి భారీగా పోలింగ్ న‌మోదు అయింది.  అధికార పార్టీ మార్పు త‌ప్ప‌ద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.  ఓటింగ్ స‌ర‌ళి, పోలింగ్ శాతం పెర‌గ‌డంపై, అధికార ప‌క్షం వైసీపీలో మౌనం ఆవ‌హించింది. ఒక‌రిద్ద‌రు నాయకులు మాట్లాడుతున్నా.. వారిలో సంతోషం సన్న‌గిల్లింది. అంతేకాదు.. ముఖంలోనూ క‌ళ లేన‌ట్టే ఉంది. స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి, విజ‌య‌సాయిరెడ్డి, పేర్ని నాని వంటివారు మీడియాతో మాట్లాడినా… పెద్ద‌గా ఉత్సాహం అయితే క‌నిపించ‌లేదు.  పోలింగ్ శాతం పెర‌గ‌డంతో వైసీపీ మ‌రింత డీలా ప‌డింది.  ఎందుకంటే 70 శాతానికి మించి పోలింగ్ న‌మోదైతే.. అది ప్ర‌తిప‌క్షానికి క‌లిసి వ‌స్తుంది. మ‌రోవైపు.. యువ‌త పోటెత్తారు. కొత్త‌గా ఓటు హ‌క్కు ద‌క్కించుకున్న‌వారు కూడా ఈ సారి ఓటేశారు.  ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో వైసీపీలో జోష్ క‌నిపించ‌డం లేదు. ఇదిలా వుంటే.. మ‌రోవైపు.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష కూట‌మి పార్టీ టీడీపీలో మాత్రం జోష్ క‌నిపిస్తోంది. చంద్ర‌బాబు, నారా లోకేష్‌లు.. విజ‌యంపై ధీమా వ్య‌క్తం చేస్తూ.. ఓట‌ర్ల‌కు అప్పుడే శుభాకాంక్ష‌లు, అభినంద‌న‌లు కూడా తెలిపారు.  మొత్తంలో ఏపీలో అధికార పార్టీ డీలా ప‌డ‌డం, విప‌క్షంలో జోష్ క‌నిపించ‌డం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.   సర్వేలన్నీ కూటమిదే అధికారమని తేల్చడం, పోలింగ్ శాతం పెరగడంతో వైసీపీ నేతలు అప్పుడే ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారు.  జగన్మోహన్ రెడ్డి, తనను ప్రజలు నెత్తిన పెట్టుకున్నారని.. తాను ఏం చేసినా ప్రజలు తనను దించరన్న ఓ నమ్మకంతో ఉన్నారు.  తాను పడేసే ఎంగిలి మెతుకులు తిని బతికేస్తారని ప్ర‌జ‌ల‌ను చుల‌క‌న‌గా చూశారు.  అయితే ఏపీ ప్ర‌జ‌లు అమాయ‌కులేమీ కాదు. బాగా చైత‌న్య‌వంతులైన ఏపీ ఓట‌ర్ కీలు చూసి వాత పెట్టారు.  తాము ఇచ్చిన అధికారాన్ని లాక్కోవ‌డం కూడా ప్ర‌జ‌ల‌కు బాగానే తెలుసు. పోలింగ్‌లో అదే జ‌రిగింది.   నిజానికి జగన్ రెడ్డి  చేసిన తప్పేంటేంటే, అధికారం వచ్చిన త‌రువాత అందర్నీ దూరం చేసుకున్నారు. తల్లి, చెల్లి మాత్రమే కాదు హితులు, స్నేహితులు, బంధువులు అందరూ దూరమయైపోయారు. ఇప్పుడు అధికారం కూడా పోతోంది.   అది జూన్ నాలుగో తేదీన బోధ‌ప‌డుతుంది. . మొత్తంగా అధికారం రావడం గెలుపు కాదని.. ఒక్కో సారి డిజాస్టర్ అని జగన్ మోహన్ రెడ్డి నిరూపించబోతున్నారు. - ఎం.కె. ఫ‌జ‌ల్ 
Publish Date: May 14, 2024 12:10PM

అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి పరాయివాడేనా?

ఐకాన్ స్టార్, మెగా స్టార్ చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్ సరిగ్గా ప్రచారం ముగిసే ముందు రోజు నంద్యాల వైసీపీ అభ్యర్థి రవిచంద్రారెడ్డి నివాసానికి వెళ్లి మరీ ఆయనకు మద్దతు ప్రకటించడం రాజకీయవర్గాలతో సహా మెగా అభిమానుల్లోనూ పెద్ద చర్చకు తెరలేపింది. ఎంత మిత్రుడైనా నంద్యాల వెళ్లి మరీ మద్దతు తెలపడానికి ఇదా సమయం అంటూ విస్తృత చర్చ జరిగింది. సరే దానికి అల్లు అర్జున్ పార్టీలతో సంబంధం లేదు.. ఫ్రెండ్ అయితే చాలు ఎంత దూరం వెళ్లైనా మద్దతు తెలుపుతా అని చెప్పాడనుకోండి అది వేరే సంగతి. అంతకు ముందు పవన్ కల్యాణ్ కు మద్దతుగా కూడా అల్లు అర్జున్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా అల్లు అర్జున్ తీరు మెగా ఫ్యామిలీలో ఆయనకు పెద్దగా పొసగడం లేదా అన్న అనుమానాలకు అయితే తావిచ్చింది. తాజాగా జనసేన నేత, స్వయంగా పవన్ కల్యాణ్ కు అన్నయ్య అయిన నాగబాబు ఆ అనుమానాలకు బలం చేకూర్చే విధంగా చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. మాతో ఉంటూ ప్రత్యర్థుల కోసం పని చేసేవాడు మావాడైనా పరాయివాడేనంటూ నాగబాబు చేసిన ట్వీట్ సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది.   దీనిపై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. ఇటీవల ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ నంద్యాలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రవిచంద్రారెడ్డి ఇంటికెళ్లి మద్దతిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆయనపై ఈసీ కేసు కూడా నమోదు చేసింది. ఈ నేపథ్యంలో నాగబాబు చేసిన ట్వీట్ అల్లు అర్జున్ ని ఉద్దేశించి చేసినదేనని అంతా భావిస్తున్నారు.   పిఠాపురంలో పోటీచేస్తున్న జనసేనాధిపతి, తన స్వంత మేనమామకు స్వయానా సోదరుడైన  పవన్ కల్యాణ్‌కు మద్దతునివ్వని అల్లు అర్జున్ వైసీపీలోని తన మిత్రుడి విజయం కోసం ప్రచారం చేయడంపై మెగా ఫ్యాన్స్ ఫైరయ్యారు.  ఈ నేపథ్యంలోనే నాగబాబు మెగా అభిమానులకు మద్దతుగా అల్లు అర్జున్ ను ఉద్దేశించే ఆ ట్వీట్ చేసి ఉంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
Publish Date: May 14, 2024 11:53AM

ఫ్యాన్ రెక్కలు విరిగిపోయినట్లేనా?.. వైసీపీ శ్రేణుల్లో ఆందోళన!

వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయా.. ఆ పార్టీ నమ్ముకున్న గూండాయిజం వైసీపీకి గులుపు ఉన్న స్థానాలలో కూడా ఓటమిని శాశించిందా?  అంటే జనం ఔననే అంటున్నారు. పరిశీలకులు కంసుడి పతనానికి ముందు కనిపించిన శకునాలను నిన్నటి పోలింగ్ లో జరిగిన సంఘటనలతో పోలుస్తున్నారు.  అధికారం తలకెక్కిన జగన్  తల్లి, చెల్లిని దూరం చేసుకున్నారు. వైసీపీ విజయానికి కారణమైన వైఎస్ బ్రాండ్ నూ వదిలించేసుకున్నారు. అన్నీ నేనే.. అంతా నేనే అన్న తీరులో విర్రవీగారు. అమలు చేస్తున్నానని చెప్పుకుంటున్న సంక్షేమ పథకాలు, బెదరించో, బతిమాలో, బెల్లించే తనకు అనుకూలంగా మార్చుకుని కీలక స్థానాలలో పోస్టింగులు ఇచ్చుకున్న కొందరు  ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల అండతో ఎన్నికల గండం గట్టెక్కేయొచ్చని భావించారు. అయితే ప్రజలు ఒక నిర్ణయం తీసుకుంటే.. అదే ఫైనల్.  అరాచకాలు, దాష్టీకాలు ఏవీ పని చేయవు. ఏపీ ఎన్నికల వేళ అదే కనిపించింది.  వైసీపీ మూకలు ఎంతగా హింసాకాండకు తెగబడితో జనం అంతకు రెట్టింపు పట్టుదలతో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ బూత్ ల వద్ద గలాటా చేసి పోలింగ్ ప్రక్రియ తీవ్ర జాప్యం అయ్యేలా చేస్తే ఓటర్లు విసిగి వెనుదిరుగుతారని వైసీపీ భావించింది. అయితే వైసీపీ వ్యూహాలు, ఎత్తుగడలు ఓటేసి తీరాలి. రాష్ట్ర భవిష్యత్ బాగుండాలి అన్న ప్రజా సంకల్పం ముందు దిగదుడుపైపోయాయి. పైపెచ్చు వైసీపీ మూకలు ఎంతగా హింసాకాండతో చెలరేగిపోతే అంతగా జనంలో ఆ పార్టీ పట్ల ఏహ్యత పెచ్చరిల్లుతూ పోయింది. అందుకే రాత్రి పొద్దుపోయిన తరువాత కూడా వేల పోలింగ్ బూత్ లలో జనం వందల సంఖ్యలో క్యూలలో నిలుచుని తమ ఓటుహక్కు వినియోగించుకోవడం కనిపించింది.  ఎన్నడూ లేని విధంగా వైసీపీ అభ్యర్థులే పోలింగ్ బూత్ లలో దౌర్జన్యాలకు తెగబడటం ఆ పార్టీపై, ఆ పార్టీ అభ్యర్థులపై జనాగ్రహాన్ని పెంచింది. తెనాలిలో ఓ పోలంగ్ బూత్‌లో స్వయంగా వైసీపీ ఎమ్మెల్యే ఓటరు చెంప మీద కొట్టిన సంఘటన అందుకు ప్రతిగా ఆ ఓటరు ఎమ్మెల్యే చెంప ఛెళ్లుమనిపించడం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశ వ్యాప్తంగా వైసీపీ పరువును గంగలో కలిపింది. ఆ దెబ్బ ఆ ఎమ్మెల్యేకు కాదు వైసీపీకే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   పోలింగ్ సమయంలో సంయమనంతో ఉండి, ఓటర్లను అభ్యర్ధించడం బదులు.. స్వయంగా ఓటర్లపైనే దాడులకు తెగబడుతున్న వైసీపీ నేతల అరాచకంపై ఓటర్లు తిరగబడ్డారు. మహిళలని కూడా చూడకుండా వారి తలలు పగలకొడుతున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో చూసిన ప్రజలు పోలింగ్ బూత్‌లలో వైసీపీపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.  అప్పటి వరకూ తటస్థంగా ఉన్న వారు కూడా వైసీపీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసేసుకున్నారు.   గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్య ఎస్సీ ఓటర్లపై దురుసుగా ప్రవర్తించడంతో, అక్కడి మహిళలు తిరగబడ్డారు.  కాగా పోలింగ్ రోజున జరిగిన ఈ సంఘటనలు  వైసీపీ అనుకూలురు కూడా ఓటేసే ముందు ఆలోచించుకునే పరిస్థితికి తీసుకువచ్చాయి.  దీంతో వైసీపీ ఓట్లు కూడా పక్కదారి పట్టాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రశాంతతను కోరుకునే ఓటర్లను భయపెట్టి ఓటింగ్ కు దూరం చేయాలనుకున్న వైసీపీ వ్యూహం దెబ్బతింది. ప్రజాగ్రహంగా మారి వైసీపీకి గెలుపు ఆశలను ఆవిరి చేసేసింది.  
Publish Date: May 14, 2024 11:44AM

ఏపీలో పోలింగ్ రోజే ఫలితం వచ్చేసింది!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితం పోలింగ్ రోజే వెల్లడైపోయింది. ఓటరు ఉత్సాహంలో  ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను విస్పష్టంగా కనిపించింది. దేశ, విదేశాల నుంచి అనేక వ్యయ ప్రయాసలకోర్చి మరీ వచ్చి తమ ఓటు హక్కను వినియోగించుకున్న ప్రజలు. ప్రలోభాలు కాదు, తమకు రాష్ట్ర ప్రగతి, పురోభివృద్ధి ముఖ్యమని విస్పష్టంగా చాటారు. నిజమే సోమవారం ఆంధ్రప్ర ఎన్నడూ లేని విధంగా విదేశాల నుంచి, దేశంలోని వివిధ రాష్ట్రాలలో స్థిరపడిన ఆంధ్రులు లక్షల సంఖ్యలో సోమవారం ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా ఇరుగు పొరుగు రాష్ట్రాలలో స్థిరపడిన ఆంధ్రులు లక్షల సంఖ్యలో రాష్ట్రానికి వచ్చి తమ స్వస్థలాలలో క్యూలో నిలుచుని మరీ ఓటు వేశారు. సోమవారం మధ్యాహ్నం కూడా రైళ్లలో బస్సుల్లో పొరుగు రాష్ట్రాల నుంచి ఓటు హక్కు వినియోగించుకు తీరాలన్న పట్టుదలతో వస్తున్న జనంలో ఓటింగ్ సమయానికి చేరుకుంటామా లేదా అన్న ఆత్రుత, ఆందోళన కనిపించిందంటే రాష్ట్రంలో మార్పు కోసం, రాష్ట్రం ప్రగతి కోసం వారెంతగా తహతహలాడుతున్నారో అర్ధమౌతున్నది.  గత ఐదేళ్లుగా   వైసీపి పాలనలో నరకం చూసిన జనం ఈ ఎన్నికల కోసమే చకోర పక్షుల్లా ఎదురు చూశారు.  ‘ఎన్నికల కోసం ఓటరు ఎదురు చూపు’ అనే శీర్షికన తెలుగువన్ గత ఏడాది సెప్టెంబర్ లోనే చెప్పింది. చివరకు అదే జరిగింది. ఎన్నికల రోజు జనం ఓటెత్తారు.   సోమవారం (మే13) తెల్లవారుజాము నుంచే పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి క్యూలలో నిలుచున్నారు. రాత్రి పొద్దు పోయిన తరువాత కూడా వేల మంది పోలింగ్ బూత్ ల వద్ద తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూలలో నిలుచుని ఉండటం కనిపించింది. రాత్రి 11 గంటల వరకూ కూడా దాదాపు 3500 పోలింగ్ బూత్ ల వద్ద ప్రజలు క్యూలైన్ లో ఉండటం కనిపించింది.  ఈవీఎంలు మొరాయించినా జనం విసిగి వెళ్లిపోలేదు. గంటల తరబడి పోలింగ్ బూత్ ల వద్దే క్యూలైన్ లో నిలబడి ఓటు వేశారు.  ఎన్నికల సంఘం ఈ సారి 80శాతానికి మించి పోలింగ్ నమోదయ్యే అవకాశాలున్నాయని అంచనా వేసింది.   ఇక అనంతపురం, అన్నమయ్య, పల్నాడు జిల్లాలలో వైసీపీ అరాచకత్వం పరాకాష్టకు చేరినా జనం మాత్రం అదరలేదు, బెదరలేదు.   కసితో ఓట్లు వేయడానికి వచ్చిన్నట్లు వచ్చి ఓట్లు వేస్తూనే ఉన్నారు.  అల్లర్లు, దాడులకు టిడిపి, వైసీపిలు పరస్పరం ఆరోపించుకున్నాయి.   ఈ అల్లర్లు, విధ్వంసం వైసీపి ఓటమిని సూచిస్తుంటే, పెరిగిన పోలింగ్‌ శాతం టిడిపి, జనసేన, బీజేపీల విజయాన్ని సూచిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   
Publish Date: May 14, 2024 10:48AM