వైఎస్ విజయమ్మ ఇంటర్వ్యూకి సవరణలున్నాయి

 

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ మొన్న తానూ ఎకనామిక్స్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యు పై ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడంతో ఈ రోజు ఆమె కొన్ని సవరణలు ఇచ్చారు.

 

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా తన పార్టీ కార్యకర్తలను, నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ “నా ఇంటర్వ్యు వివరాలను ఆ పత్రిక లోపలి పేజీలలో సరిగ్గానే ప్రచురించినప్పటికీ, మొదటిపేజీలో మాత్రం వేరే అర్ధం వచ్చేలా హెడ్డింగ్ పెట్టి ప్రచురించింది. ప్రతిపక్షాలు అది పట్టుకొని రాద్ధాంతం మొదలుపెట్టారు. వారిలో ఎవరూ కూడా నా ఇంటర్వ్యు వివరాలను కనీశం పూర్తిగా చదివి ఉండరు. అందుకే, మన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మన పార్టీ 2014సం. ఎన్నికల తరువాత అప్పటి పరిస్థితులను బట్టి, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కేంద్రంలో ఏర్పడే మూడో ఫ్రంటుకో లేదా బీజేపీయేతర మరో పార్టీకో మద్దతు ఇస్తామని చెప్పాను. కానీ, ఆపత్రిక ఆ విషయాన్ని మరో విధంగా ప్రచురించింది. దానిని పట్టుకొని ప్రతిపక్షాలు నానా యాగీ చేస్తున్నాయి,” అని అన్నారు ఆమె.

 

అయితే, ఇప్పుడు చెపుతున్నదానికి, మొన్న ఆ పత్రికకు చెప్పినదానికి మధ్య ఉన్న తేడా ఏమిలేదు. కాకపొతే ఆమె ఈసారి ‘కాంగ్రెస్ నేతృత్వం పనిచేస్తున్న యు.పీ.యే.ప్రభుత్వానికి మా మద్దతు’ అనే వాఖ్యానికి బదులు ‘మరో పార్టీకి మద్దతు ఇస్తామని’ చెప్పారు. కేంద్రంలో బీజేపీకి తాము మద్దతు ఈయమని ఆమె స్పష్టం చేసిన తరువాత, ఇక మిగిలింది కేవలం కాంగ్రెస్ నేతృత్వంలో పనిచేస్తున్న యు.పీ.యే.ప్రభుత్వo మాత్రమే. ఇక, 3వ ఫ్రంటు ఉనికే లేనప్పుడు, ఆమె ఎంత డొంకతిరుగుడుగా చెప్పినా దానర్ధం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుందని చెప్పడమే.

 

అయితే, ఆమె ఆ పని చేసేందుకు ఒక సంవత్సరం వృధా చేయడం వలన, ఆమె కుమారుడు జగన్ మోహన్ రెడ్డి అంతకాలం జైల్లోనే కాలం వెళ్ళదీయక తప్పదు. అందువల్ల, 2014సం.లో చేయాలనుకొన్న ఆ పనేదో ఇప్పుడే చేసినట్లయితే, కనీసం ఆమె కుమారుడు జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి విడుదల అయ్యే అవకాశం అయినా ఉంటుంది. 2014సం.లో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపినా, ఇప్పుడు కలిపినా ఛ్చీ కొట్టేవారు ఎప్పుడు ఛ్చీ కొట్టకమానరు. అందువల్ల ఏడాది కాలం వృధా చేసుకొని, అంతవరకు జగన్ మోహన్ రెడ్డిని జైలులో కుమిలిపోయేలా చేసే బదులు ఆ పనేదో ఇప్పుడే చేసేసి వీలయినంత ఎక్కువ ప్రయోజనం పొందడం వివేకం కదా? కేంద్రంలో ఏ పార్టీ వస్తుందో తెలియదని, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రెండువేల పద్నాలుగు ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకుంటామని తాను చెబితే ఎకనామిక్ టైమ్స్ పత్రిక మొదటి పేజీలో ఒకరకంగా రాశారని, లోపల పేజీలో మాత్రం కరెక్టుగానే రాశారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ అన్నారు.పార్టీ రెండో వార్షికోత్సవం సందర్భంగా ఆమె ప్రసంగింఆచరు.ఆయా పక్షాల నేతలు తన ఇంటర్వ్యూను పూర్తిగా చదవకుండా మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు.అయితే ఈ వివరణలో ఎక్కడా కాంగ్రెస్ ప్రస్తావన తేకుండా విజయమ్మ జాగ్రత్తపడ్డారు.కేంద్రంలో వస్తుందో లేక, మరే పార్టీ వస్తుందో తెలియదని, అందువల్ల అప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని మద్దతు ఇస్తామని ఆమె అన్నారు.లోక్ సభకు ముప్పై నుంచి ముప్పై మూడు స్థానాలు, శాసనసభకు రెండువందల స్థానాలు తమ పార్టీకి వస్తాయని చెప్పినట్లు కూడా ఆమె పేర్కొనడం విశేషం.