వైసీపీకి కొత్త నిర్వచనం చెప్పిన టీడీపీ నేతలు...

 

వైకాపా అంటే... వై.ఎస్‌.జగన్‌ జేబు సంస్థ అంట. ఇది చెబుతున్నది ఎవరో కాదు... టీడీపీ నేతలు. వైకాపా అంటే కొత్త నిర్వచనం చెబుతున్నారు టీడీపీ నేతలు.  టిడిపి అంటే...గతంలో వ్యంగ్యంగా విమర్శించారు...తెలుగుదేశం పార్టీ అంటే దొంగల పార్టీ అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు..కానీ అప్పట్లో తాము మౌనం వహించామని...ఇంకా ఆ విమర్శలను తిప్పి కొట్టడానికి...తాము కూడా కొత్త నిర్వచనం చెపుతున్నామని అన్నారు. వై...అంటే ఎక్కడైనా, ఎస్‌... అంటే స్కాములు, ఆర్‌..అంటే రౌడీయిజం, సి..అంటే చేసి చూపించే, పి..అంటే పార్టీ అని కొత్త నిర్వచనం తెలిపారు.  ఇన్ని సంవత్సరాలు మన పార్టీని ఈ విధంగా విమర్శించారు...ఇన్నాళ్లూ టిటిపీ అంటే రకరకాల పేర్లతో విమర్శించారు..ఇప్పుడు వైసీపీకి కొత్త పేరు పెట్టాం...మరి కొద్ది రోజుల్లో ఆ పేరు వాడుకలోకి వస్తుందని అన్నారు.