పాక్ కలలు కంటోంది...

 

ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టీమిండియా మాజీ క్రికెట‌ర్‌  వీరేంద్ర సెహ్వాగ్.. అందరిపై సరదాగా చమత్కారంగా కామెంట్లు విసురుతూ తమ మార్క్ ను చూపిస్తాడు. ఇప్పుడు పాక్ పై కామెంట్లు విసిరాడు. కుల్ భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ కోర్టులో పాక్ ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన సెహ్వాగ్..స‌త్య‌మేవ జ‌య‌తే అని రాశాడు. అయితే, సెహ్వాగ్ చేసిన పోస్ట్ పై ఓ పాకిస్థానీ స్పందిస్తూ... తుది తీర్పు త‌మ‌కే అనుకూలంగా వ‌స్తుందని, ఒక వేళ రాక‌పోయినా తాము చేసేదే చేస్తామ‌ని అన్నాడు. ఈ కామెంట్‌పై వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ మ‌రో ట్వీట్ చేశాడు. భార‌త్‌ను క్రికెట్ వ‌ర‌ల్డ్ కప్‌లో పాకిస్థాన్ ఓడిస్తుందంటూ పాక్ అభిమానులు క‌ల‌లు ఎలా కంటారో, కుల్‌భూష‌ణ్ జాద‌వ్ విష‌యంలోనూ అలాగే క‌లలు కంటూ ఉన్నార‌ని సెటైర్ వేశాడు.