మోదీ టంగ్ స్లిప్.. వెంకయ్య తొలగింపు.!!

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్, విపక్షాల అభ్యర్థి బీకే హరిప్రసాద్ పై గెలుపొందిన సంగతి తెలిసిందే.. ఎన్నికల ఫలితం వెలువడిన తరువాత రాజ్యసభకు వచ్చిన మోదీ, డిప్యూటీ ఛైర్మన్ గా ఎన్నికైన హరి వంశ్ నారాయణ్ ను అభినందించారు.. అభినందన వరకు ఓకే, కానీ ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలే అభ్యంతరకరంగా ఉన్నాయి.

 

 

'ఇరువైపులా హరి అన్న పేరున్న వ్యక్తులే ఉన్నారు.. కాంగ్రెస్ అభ్యర్థి బీకే హరి అమ్ముడు పోయారు కానీ గెలవలేదు.. తమ పార్టీ అభ్యర్థి హరి మాత్రం అమ్ముడుపోలేదు కానీ గెలిచాడు' అని మోదీ వ్యాఖ్యలు చేసారు.. ఈ వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.. అసలే ఓటమి బాధలో ఉన్న హరిప్రసాద్ మోదీ మాటలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.. ప్రధాని హోదాను, సభ గౌరవాన్ని ఆయన దిగజార్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. దీనిపై చేసిన ఫిర్యాదును పరిశీలించిన రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు రికార్డుల నుంచి మోదీ చేసిన వ్యాఖ్యను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. దేశ చరిత్రలో ప్రధాని చేసిన వ్యాఖ్యల్ని పార్లమెంటు రికార్డుల నుంచి తొలగించటం ఇదే తొలిసారి అని తెలుస్తోంది.