జగన్ కి షాక్.. సీఆర్డీయే రద్దు అంశంపై హైకోర్టులో పిటిషన్లు

సీఆర్డీయే రద్దు బిల్లు పై మండలిలో ఓ వైపు రగడ నడుస్తోంటే మరోవైపు దానిపై హై కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ బిల్లు ఆపేయాలంటూ రెండు పిటిషన్ దాఖలు చేశారు. దీని పై మధ్యంతర ఉత్తర్వులివ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు. రాజధానికి సంబంధించిన 37 మంది రైతులు అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ కూడా పిటిషనర్ లు దాఖలు చేశారు. ఈ దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయస్థానం ఈ రోజు కానీ రేపు కాని విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నీ దృష్టిలో ఉంచుకొని తాము హైకోర్ట్ ని ఆశ్రయించామని రైతులుతెలియజేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్న దాని పట్ల హై కోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు. గత ప్రభుత్వంలో రాజధాని అమరావతిలోనే నిర్మిస్తారన్న మేరకు తాము భూములన్నీ ఇచ్చామని వాళ్ళు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపధ్యంలో మరో రెండు రాజధానుల ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సవాల్ చేస్తూ హైకోర్టులో  మొత్తం 37 మంది రైతులు పిటిషన్ లు దాఖలు చేశారు. నిన్న సీఆర్డీఏను కూడా రద్దు చేసినట్లు బిల్లుని పాస్ చేయటంతో సీఆర్డీఏ రద్దు చట్ట విరుద్ధమంటూ కూడా రైతులు హైకోర్టును ఆశ్రయించారు. మొత్తం మీద ఈ పిటిషన్ అనేది ఈ రోజు కానీ రేపు కానీ హై కోర్టులో విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. హైకోర్ట్ లో సీఆర్డీఏ బిల్లు పై ఏ విచారణ జరగనుందో వేచి చూడాలి.