టీఆర్ఎస్ లో అలకలు షురూ

 

 

 

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నుంచి పోటీ చేసే 69 అభ్యర్థుల లిస్టును ప్రకటించారు. కేసీఆర్ ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలో వలస నేతలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడంతో ఆ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీలోకి వలస వచ్చిన ప్రజాప్రతినిధులు తమ స్థానాలను కైవసం చేసుకున్నారనే ఆవేదనతో రగులుతున్నారు.

 

ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్ఎస్ కు పొత్తులు లేకపోవడంతో పార్టీలోని నేతలంతా తమకు టికెట్ దక్కుంతుందని ఆశలు పెంచుకున్నారు.  నియోజకవర్గాల్లో నేతలు తమ గెలుపే లక్ష్యంగా పార్టీని అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. అయితే అఖరి నిమిషంలో ఇతర పార్టీల ను౦చి వలస వచ్చిన వారికి టిక్కెట్లు కేటాయించడంతో వారు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దీంతో తెరాసలో ఆందోళనలు మొదలైయ్యాయి.    నేతలు వారిని బుజ్జగించే పనిలో పడ్డారు.

అలక వహిస్తున్న నేతలను బుజ్జగించేందుకు ముఖ్య నాయకులు కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం. ఆయా నేతలు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. బరిలో దిగేందుకు అవకాశం లేని వారికి ప్రత్యామ్నాయాలు కల్సిస్తామని ఏకంగా అధినేతనే వారికి హామిలనిస్తున్నారు. అయినా అలకల పర్వం మాత్రం కొనసాగుతుంది. దీంతో తెరాస దీనిపై ప్రత్యేకమైన దృష్టిని సారించినట్లు తెలుస్తోంది.