టిఆర్‌ఎస్‌లో మరో వికెట్‌ పడింది

 

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ దిశగా వేగంగా అడుగులు వేస్తుండటంతో టీఆర్‌ఎస్‌ పార్టీకి దిక్కుతోచడం లేదు.  ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు కూడా ఒకరొకరుగా పార్టీని వీడి కాంగ్రెస్‌ పార్టీ వైపు వెళుతున్నారు.

తాజాగా టిఆర్‌ఎస్‌ పార్టీ కి చెందిన మాజీ మంత్రి వరంగల్‌ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే విజయరామారావు ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. మంగళవారం రాత్రి పార్టీ పెద్దలతో ఆయన జరిపిన చర్చలు విఫలం అవ్వడంతో వెంటనే ఆయన రాజీనామా చేశారు.

గత ఆరునెలలుగా పార్టీలో తనకు సముచిత స్థానం దక్కడం లేదన్న విజయరామారావు, తన నియెజిక వర్గంలో ఉధ్యమానికి ఉపయోగపడని వారికి ప్రాదాన్యత ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా రోజులుగా తనకు అసంతృప్తి ఉన్నా ఉద్యమానికి నష్టం కలుగ కూడదనే ఇన్నాళ్లు వేచి చూశానన్నారు.