"ట్రిపుల్ తలాక్" ఒక్కటే కాదు..ఇంకా నాలుగున్నాయి..?


 

ముస్లిం మహిళల పాలిట శాపంగా మారిన ట్రిపుల్ తలాక్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పునివ్వడంతో ఇప్పుడు భారతదేశం మొత్తం ట్రిపుల్ తలాక్ గురించి మాట్లాడుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ముస్లిం సాంప్రదాయలు, పద్ధతుల గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఈ క్రమంలో అసలు ముస్లింలు ఎన్ని రకాలుగా విడాకులు తీసుకోవచ్చన్న చర్చ కూడా నడుస్తోంది. పవిత్ర ఖురాన్ ప్రకారం ముస్లింలు నాలుగు రకాలుగా విడాకులు తీసుకోవచ్చట. అవి ట్రిపుల్ తలాక్, ఖులా, ఫస్ట్ ఈ నిఖా, తఫ్వీద్ అల్ తలాక్..అయితే ఎక్కువ మంది పురుషులు తమకు అత్యంత అనుకూలంగా ఉన్న ట్రిపుల్ తలాక్ పద్ధతి వైపే మొగ్గుచూపుతున్నారు.