ఎన్టీఆర్ లో ఉన్న క్రమశిక్షణ పవన్ లో లేదు

 

సినిమాల నుండి ఎవరు రాజకీయాలకి వచ్చినా వారిని, ఎన్టీఆర్ తో పోల్చటం తెలుగువారికి అలవాటు.. కానీ ఎన్టీఆర్ స్థాయికి చేరుకోటం అంత సులువు కాదని అందరికీ తెల్సిన నిజం.. ఇప్పటికే అది రుజువైంది కూడా.. సినిమాల్లో మెగాస్టార్ గా ఒక వెలుగు వెలిగిన చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వచ్చారు.. కానీ ఆ పార్టీ అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో కాంగ్రెస్ లో విలీనం చేసి, కేంద్రమంత్రిగా పనిచేసారు.. కొంతకాలం తరువాత మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు.. అన్నయ్య చిరంజీవి బాటలోనే తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.. పవన్ జనసేన పార్టీ స్థాపించి.. 2014 లో టీడీపీ మద్దతిచ్చారు.

తరువాత టీడీపీ కి, సినిమాలకి దూరమైన పవన్, 2019 ఎన్నికల వైపు అడుగులు వేస్తున్నారు.. దానిలో భాగంగానే ప్రజా యాత్ర చేస్తూ టీడీపీ మీద ఘాటు విమర్శలు చేస్తున్నారు.. అయితే టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు, పవన్ మీద ఆసక్తికరమైన కామెంట్స్ చేసారు.. తెర వెనక ఎవరో రాసిచ్చింది చదివితే ఉన్న గౌరవం పోతుందని.. పవన్ రాజకీయాల మీద మరింత అవగాహన పెంచుకోవాలని సూచించారు.

అలానే ఎన్టీఆర్ ప్రస్తావన కూడా తీస్కోచ్చారు.. నాడు ఎన్టీఆర్ రాష్ట్రంలో పర్యటిస్తున్న టైములో కొడుకు పెళ్లి జరుగుతున్నా వెళ్లకుండా ప్రజలతో ఉన్నారని.. ఎన్టీఆర్ కి ప్రజలు, ప్రజాసేవే ముఖ్యమని.. అలాంటి క్రమశిక్షణ పవన్ లో కనిపించడం లేదని అశోక్ గజపతి రాజు అన్నారు.. మరి ఈయన కామెంట్స్ కి పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.