ఏపీలో టీడీపీదే అధికారం.. ఫేక్ సర్వే

 

ఏపీలో టీడీపీ అధికారం నిలబెట్టుకుంటుందని 'లోక్‌నీతి- సీఎస్ డీఎస్' సర్వే వెల్లడించింది అంటూ ఈరోజు వార్తలొచ్చాయి. అయితే ఈ సర్వేతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆ సంస్థ ప్రకటించి ఈ వార్తలకు చెక్ పెట్టింది.

ఏబీపీ ఛానల్ కోసం 'లోక్‌నీతి- సీఎస్ డీఎస్' చేపట్టిన సర్వే అంటూ అటు మీడియా, ఇటు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. ఏపీలో టీడీపీ 46.2 శాతం ఓట్లతో 126 నుంచి 135 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందని, వైసీపీ 37.2 శాతం ఓట్లతో 45 నుంచి 50 స్థానాలకు పరిమితమవుతుందని ఆ సర్వేలో ఉంది. ఇక.. 25 ఎంపీ సీట్లలో టీడీపీ 18 నుంచి 22 వరకు గెలుచుకుంటుందని, వైసీపీ 3 నుంచి 5 వరకు గెలుచుకుంటుందని ఉంది. దీంతో ఈ సర్వే నిజమనుకొని సోషల్ మీడియాలో టీడీపీ శ్రేణులు తెగ షేర్లు చేసారు. అయితే ఇదంతా ఫేక్ అంటూ సీఎస్ డీఎస్ సంస్థ షాకిచ్చింది. తాము ఏపీలో ఎలాంటి సర్వే చేపట్టలేదని, సోషల్ మీడియాలో వస్తున్న వారల్లో నిజం లేదని స్పష్టం చేసింది. తమ సర్వే పేరుతో ప్రచారమవుతన్నదంతా ఫేక్ అంటూ ఆ సంస్థ ట్వీట్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సర్వే ఫేక్ సర్వే అని తేలిపోయింది.