న్యాయశాఖకు చేరిన తెలంగాణా నోట్

 

సమైక్యాంధ్ర ఉద్యమాలతో సీమాంధ్ర ప్రాంతం ఉడికిపోతున్నా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పదవి నుండి తప్పుకొంటానని హెచ్చరిస్తున్నా, మంత్రులు, యంపీలు రాజీనామాలు చేసినా, హైదరాబాదులో ఆంధ్ర-తెలంగాణా ఉద్యోగులు కత్తులు దూసుకొంటున్నాకాంగ్రెస్ అధిష్టానం ఎంత మాత్రం చలించకుండా తెలంగాణా ఏర్పాటుకి ప్రయత్నాలు ముమ్మరం చేయడం విశేషం. బహుశః కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నడూ ఇంత దృఢసంకల్పం చూపించిన దాఖలాలు లేవేమో!

 

ఈ రోజు హోంశాఖ తను తయారు చేసిన ‘తెలంగాణా నోట్’ ని కేంద్ర న్యాయశాఖకు పంపింది. న్యాయశాఖ ఆ నోట్ ను పరిశీలన చేసి, న్యాయపరంగా తగిన అంశాలను జోడించి మళ్ళీ హోంశాఖకు పంపుతుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు పదిరోజులు పట్టవచ్చును. ఆ తరువాత ఆనోట్ ను హోంశాఖ కేంద్రమంత్రి మండలికి సమర్పిస్తుంది.