గ‌ల్ఫ్ నుంచి వ‌చ్చిన‌వారు క్వారంటైన్ కి 30,000/- చెల్లించాలి!

దుబాయ్‌లో పనిచేసే తెలంగాణ వాసులు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. ఉపాధి కోసం దుబాయ్‌కు వెళ్లి ఆస్పత్రిలో పనిచేస్తున్నామని.. కరోనా విజృంభణ నేపథ్యంలో తమలో 10 మందికి వైరస్‌ సోకిందని తెలిపారు. వారితో పాటే తమను ఒకే క్యాంపులో ఉంచుతున్నారని.. కనీసం తమకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ‌ల్ఫ్ కార్మికులు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ నుండి గల్ఫ్ దేశాలకి ఉపాధి కోసం వలస వెళ్లిన సంఖ్య ఇలా వుంది.

దుబాయ్ లో 4,76,000. సౌదీ అరేబియా లో 5,53,163. కువైట్ లో 1,56,054. ఒమాన్ లో 1,33,116. కతర్ లో 1,18,490. బహ్రయిన్ లో 53,196. మొత్తం జనాభా : 14,90,019.

గల్ఫ్ నుండి ఇండియన్ బ్యాంకు తెలంగాణ కి వచ్చిన పైసల లెక్క ఇలా వుంది.

గల్ఫ్ లో ఉపాధి చేస్తూ ప్రతి నెల ఒకరు కనీసం ఇండియా కి 20,000రూ. ఇరవై వేలు పంపిన కూడా
14,90,019 X 20000 = 29,800,380,000 ఒక నెలకి తెలంగాణ కి పంపినవి.
29,800,380,000 X 12 = 357,604,560,000 ఒక సంవస్సర్రానికి తెలంగాణాకి వచ్చినవి
357,604,560,000 X 6 = 2,145,627,360,000 తెలంగాణ వచ్చిన 6 సంవస్సరాలకి ఇప్పడివరకు వచ్చినవి.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ఇంటికి వెళ్ళడానికి బస్సు టికెట్స్ కొంటె వచ్చే ఆదాయం ఇలా వుంది.

నిజామాబాదు, కరీంనగర్, వరంగల్ ఎక్కడి నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఇంటికి వెళ్ళినప్పుడు బస్సు టికెట్ కొనుకుంటే వచ్చిన పైసలు. తెలంగాణ వచ్చిన 6 సంవ‌త్స‌రాల్లో రెండేళ్ళ‌కు ఒక సరి ఇండియా కి వచ్చిన 3 మూడు సార్లు అవుతాది వచ్చి వెళ్ళేటప్పుడు బస్సు టిక్కెట్లు కొంటె తెలంగాణ కి వచ్చే పైసలు

వెళ్లిన జనాభా: 14,90,019 మూడు 3 సార్లు వచ్చివెళ్లిన
14,90,019 X 3 = 4,470,057 ఒక సరి 500 రావడానికి 500 పోవడానికి 3,000రూ.
4,470,057 X 3000 = 13,410,171,000

ఇది తెలంగాణ RTC బస్సు లో మనం ప్రయాణం చేస్తే వచ్చిన డ‌బ్బు.

13,410,171,000/- ఇవి బస్సు టికెట్స్ కొంటె వచ్చిన డ‌బ్బు ఇది.

2,145,627,360,000/- ఇవి గల్ఫ్ నుండి ఇండియన్ బ్యాంకు లో కి తెలంగాణ కి వచ్చిన డ‌బ్బులు. విదేశీ మార‌క ద్ర‌వ్యం.

ఇన్ని పైసలు మన గల్ఫ్ బిడ్డలు తెలంగాణాకి ఇచ్చిన కూడా కనీసం ఫ్రీ క్వారంటైన్ కూడా పెట్టలేని దుస్థితి తెలంగాణా ప్ర‌భుత్వానిది. 15,000/- మరియు 30,000/- ఒకరికి తీసుకుంటున్నారు. గ‌ల్ఫ్ నుంచి వ‌స్తున్న వారు త‌మ‌ను హోమ్ క్వారంటైన్ కి పంపుతారా? లేక ఫ్రీ క్వారంటైన్ ఇస్తారా? అంటూ తెలంగాణా ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

ఓటు హ‌క్కు వుండి ఉంటే... అదే గ‌ల్ఫ్ నుంచైనా ఓటు వేసే అవ‌కాశం వుంటే రాజ‌కీయ‌పార్టీలు ధృక్ప‌థంలో మార్పు ఉండేదేమో!