రైల్లో పేలుళ్ళ కేసు మేమే పరిశోధిస్తాం.. కేంద్రం సాయం వద్దు: జయ

 

 

 

చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ వద్ద గౌహతి ఎక్స్ ప్రెస్ రైల్లో జరిగిన బాంబు పేలుళ్లలో మన రాష్ట్రానికి చెందిన స్వాతి మరణించిన విషయం తెలిసిందే. ఈ పేలుళ్ళలో దాదాపు 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఈ కేసు విచారణకు సంబంధించి తమకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అక్కర్లేదని, తమ రాష్ట్ర పోలీసు అధికారులే ఈ కేసును పరిశోధిస్తారని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. కేంద్రం అందిస్తానన్న సాయాన్ని ఆమె నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఈ కేసును విచారించే బాధ్యతను తమిళనాడుకు చెందిన స్పెషల్ వింగ్ పోలీసు అధికారులకు జయలలిత అప్పగించారు. ఈ కేసును పరిశోధించే విషయంలో కేంద్రం తనంతట తానే చొరవ చూపించినా జయలలిత తిరస్కరించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.