రాహుల్‌ గాంధీకి సుప్రీంకోర్టు నోటీసులు

 

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సోమవారం రాహుల్‌ గాంధీ దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఎక్కడా ఆయన క్షమాపణలు కోరలేదని, కేవలం చౌకీదార్‌ చోర్‌ అనే వ్యాఖ్యలను సుప్రీం తీర్పునకు ఆపాదించానని మాత్రమే ఒప్పుకున్నారని బీజేపీ నేత మీనాక్షి లేఖి తరపు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ ధర్మాసనానికి వివరించారు. రాహుల్‌ తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్న పదాన్ని బ్రాకెట్‌లో పెట్టారని వివరించారు. దీంతో సుప్రీం రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది. దీనిపై లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 30వ తేదీలోగా వివరణ ఇవ్వాలని సూచించిన కోర్టు.. తదుపరి విచారణకు వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.