టీడీపీ ఎంపీలపై స్పీకర్ ఫైర్... చిన్న పిల్లలా.. ఇళ్లలో ఎలా ఉంటున్నారు..

 

స్పీకర్ సుమిత్రా మహాజన్ టీడీపీ ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ విషయంలో ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ గత రెండు రోజులుగా టీడీపీ ఎంపీలు పార్లమెంట్ లో నినాదులు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈరోజు కూడా లోక్ సభలో ఎంపీలు పోడియం ముందు నిలబడి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక టీడీపీ ఎంపీల నిరసనలకు గాను స్పీకర్ నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. అయితే ఎంత నచ్చజెపుతున్నా టీడీపీ ఎంపీలు వినకపోవడంతో... సుమిత్రా మహాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీలు చిన్న పిల్లల మాదిరిగా ప్రవర్తిస్తున్నారని, ఇక్కడే ఇలా ఉన్నారంటే, ఇంట్లో ఇంకెలా ఉంటారోనని, తమ పిల్లలను కూడా వీరు క్రమశిక్షణలో పెట్టలేనట్టుగా అనిపిస్తోందని.. మీరు మీ ఇళ్లలో పిల్లలను ఎలా కంట్రోల్ చేస్తారో అర్థం కావడం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. సభ సజావుగా సాగేందుకు ఏపీ ఎంపీలు సహకరించాలని...ఇలా ప్లకార్డులు పట్టుకుని మాట్లాడుతున్న సభ్యుల ముఖం ముందు పెట్టడం మంచి పద్దతి కాదు. దయచేసి అర్థం చేసుకోండి" అని అన్నారు.